కవితలు

ప్రేమికుల రోజు సందర్భముగా ప్రాంజలి ప్రభ అందిస్తుంది శుభాకాంక్షలు



ప్రేమ అంటే మధురం 
మధురం అంటే అమ్రృతం
అంమ్రృతం అంటే జీవం
జీవం అంటే హ్రుదయానందం

హ్రుదయానందం అంటే తన్మయభావం
తన్మయభావం అంటే ఆకర్షణ తత్వం
ఆకర్షణ అంటే హ్రుదయస్పందన
హ్రుదయ స్పందన అంటే ఆలాపన

ఆలాపన అంటే తెలియని మైకం
మైకం అంటే వయసు ఆరాటం
ఆరాటం అంటే ఇంద్రియతాపం
ఇంద్రియ తాపం అంటే జహ్వజపం

జిహ్వజపం అంటే ప్రేమ జ్వరం
జ్వరం తగ్గా లంటే స్త్రీ తో స్వరం 
స్వరం కలపాలంటే పోందాలి భంధం
బంధం కలవాలంటే ఉండాలి ధైర్యం

ధైర్యంతో సుఖించాలంటే స్త్రీ ఔదార్యం
ఔదార్యం నిలవాలంటే పంచాలి ప్రేమ
ప్రేమ నుండి పుట్టు స్రృష్టికార్యం
కార్యం లోనే ఏర్పడు మాత్రృత్వం 

మత్రృత్వం లోనే ఆడజన్మ సార్ధకం
స్త్రీ ని ఆచరించుట లోనే ఉంది మగవాడి పౌరుషం
పౌరుషాల కలయకే ప్రేమ మాధుర్యం
మాధుర్యమే పిల్లలతో ప్రేమమయం
--(*)--

Comments

Popular posts from this blog

శార్దూల పద్యాలు

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు