162 chandassu




బాలకౌముది వృత్తములో చివరి గురువును తొలగిస్తే అది ఒక ద్విపద అవుతుంది. చివరి పద్యము ఆ విషయమును దృష్టిలో నుంచుకొని వ్రాసినది. ఆ పద్యము రెండు ద్విపదలుగా - 







బాలకౌముది - స/జ/భ/భ/స IIUI UIU - IIUI IIIU 

15 అతిశక్వరి 15788 



కలలోన నిన్ను నేఁ - గనులార గనఁగ నా 
కనులయ్యె నార్ద్రమై - కల మాసిపోవఁగా 
మనమెల్ల నీవెగా - మధురంపు రాత్రిలోఁ 
గనుమూయు టెట్టులో - కలఁగంగఁ బ్రేమలో 



సుమబాల కౌముదిన్ - సుఖమీయఁ బిలిచెరా 

కమనీయ గీతులన్ - గలహంస నుడువురా 
రమణీయ రాత్రిలో - రసగంగ పరగురా 
విమలమ్ము ప్రేమ క్రొ-వ్విరివోలెఁ బొసఁగురా 



రణరంగ వీరునిన్ - రఘువంశ తిలకునిన్ 

ప్రణయేందు కౌముదిన్ - వరపుత్రి రమణునిన్ 
వనజాక్షు రామునిన్ - వరపుత్రు గుణనిధిన్ 
ఘననీల దేహునిన్ - గరమోడ్చి గొల్తు నేన్ 



నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్మురా 

కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవు నా 
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాట నే 
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతిలో 



బాలకౌముదిలో చివరి ర-గణములో మధ్య లఘువును తొలగిస్తే అది వనమయూర వర్గమునకు చెందుతుంది (పం/పం - పం/చ). 


రజనీకాంత - స/భ/ర/న/ర/ర IIU UII UI UI - IIU IU UIU
18 ధృతి 77492

మనసా నవ్వకు నవ్వి నవ్వి  - నువు నాట్య మాడించకే
విను నీ ప్రేమయు వ్యర్ధమౌనె - పరువమ్మునన్ జాతరే  
కలలే పండెను సేవ వేళ - మదిలో నవ్వు విచ్చెనే
తపమే చేయుట ప్రేమ పొందు కొరకే కధా సామ్యమే          

మనసా యెందుకు నీకు నిట్లు - మదిలో నయెన్ జింతలున్
విను నీ స్నేహము వ్యర్థమౌనె - విరహమ్మునన్ దొయ్యలీ
ఘనుఁడౌ ప్రేమికుఁ డేల రాఁడు - కనఁగా నినున్ గోముతో
తనువం దొప్పును పుల్కరింపు - దనరన్ సదా తుష్టితో

కలలో గంటిని నిన్ను నాఁడు - కలిఁగెన్ గదా మోదముల్
కలయో నీరయెఁగాదె నేఁడు - కలిఁగెన్ గదా ఖేదముల్
వలయా ప్రేమయు భూమిపైన - వలలో నయో చేపనా
యిల నే బెస్తయు బట్టి చేప - హృదయ మ్మసిన్ గోయునో

రజనీకాంతుఁడు నింగిలోన - రమణన్ ఛవిన్ భాసిలెన్
రజనిన్ గాంతుఁడు కాంతతోడ - రమణీయమౌ గీతమున్
సృజనన్ జేయుచు పాడె నప్డు - చిఱునవ్వులే చిందఁగా
గజమై నిండెను సంతసమ్ము - గదిలో హృదుల్ వెల్గఁగా

ప్రాసయతితో -

వదనమ్మందున నిండెఁగాదె - మృదువై మిసల్ మెండుగా
హృదయమ్మందున నిండెఁగాదె - సుధలన్ నదుల్ నిండుగా
నిధిగా నెంతును నేను నిన్నె - వ్యధ నాకిఁకన్ లేదుగా
ముదమే వర్షమువోలెఁ జిందు - బ్రదుకే యగున్ గావ్యమై

విధేయుడు - జెజ్జ్జాల కృష్ణ మోహన రావు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
(ఇందులో ఎనిమిది వృత్తముల పేరులు ఉన్నాయి) 

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు