పాటలు


 
 భగవద్గీత - 8 వ అధ్యాయము 
అక్షర పరబ్రహ్మ యోగం 
అంతర్గత సూక్తులు (కవితా రూపకమ్) 


ఓ మనిషి తెలుసుకో 
జన్మసాహిత్యాన్ని తెలుసుకొని మసలుకో

నిన్ను నీవు తెలుసుకో 
పుట్టేటప్పుడు నీవు అజ్ఞానివి 
పెరిగాక జ్ఞాన సంపాదనతో నవ్వాలి 
జ్ఞానాన్ని పంచి అందరిని ప్రేమించాలి 

నేను ఆత్మను అనుకోవాలి 
దేవుడు పంపిన ధర్మవాసిని 
మరణాన్ని మంగళ ప్రదంగా పొందేవాడిని
  
మనం పుట్టేటప్పుడు ఏడుస్తాం
ఏడిపించి పుడతాం 
మిగతా ప్రాణులకు ఏడుపంటే 
తెలియదు, అవి కర్మ ఫలాలను 
పొందటానికి, వాసనలను ఖర్చు 
చేసుకోవటానికి జన్మిస్తాయి.  
మనం ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్ష 
జ్ఞాన్నాన్ని పొందాలని పుడతాం 

కో హ౦ కో హం అంటూ పుడతాం 
అంటే నే నెవరు, నే నెవరు, అంటూ 
భూమాతకు భారం కాకుండా
గురువులకు, తల్లి తండ్రులకు భారం కాకుండా 
జన్మ  సార్ధకంతో జ్ఞాన్నాన్నిపెంచుకొని 
సోహం, సోహం, అంటూ మరణించాలి 
పరమాత్మ నేనే, నేనే 
భగవంతుని ధ్యానించాలి 

ఆచరణకు, బుద్ధి వికాసానికి 
భగవద్గీతలో 8 వ అధ్యాయం     
శ్లోకాలలో ఉన్నపరమార్ధాన్ని 
తెలుసుకోవాలి, ఆచరించాలి
జ్ఞాన్నాన్ని సంపాదించి 
గురువుగా జ్ఞాన భోద చేయాలి   

అందుకే ఒక మహనీయుడన్నాడు 
పుట్టెనా -- మరి చావు నెరుగని 
గుట్టు నేర్పాలి 
ఆ పట్టు దొరక్కపోతే 
పుట్టుకలేని విద్యనన్నా పట్టుకోవాలి
       
ఓ మనిషి తెలుసుకో 
జన్మసాహిత్యాన్ని తెలుసుకొని మసలుకో
అందుకే 
పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య - (జీవన్ముక్తి) 
చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య - (క్రమముక్తి )
    
అందుకే 
ఓ మనిషి తెలుసుకో 
జన్మసాహిత్యాన్ని తెలుసుకొని మసలుకో

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు