189
కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : రామకృష్ణ
మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు
మగువ ఉపకార భాష
మమత సహకార భాష
మనసు ప్రేమకర భాష
తెలుగు నుడికార భాష
సంగీత పాటల భాష
యతి ప్రాస పద్య భాష
చమక్కులు హాస్య భాష
చాతుర్యం చూపే భాష
తొలి మబ్బు వెల్గుల భాష
మలి మబ్బు వెన్నెల భాష
పలు విధ్యా కోర్కెల భాష
నవ తెల్గు ఆకలి భాష
ఏ ఓర్పు శృతి కల్పు భాష
ఏ నేర్పు మది తెల్పు భాష
ఏ తీర్పు వ్యధ తీర్చు భాష
ఏ మార్పు మంచి నేర్పు భాష
మది తలపు తెలుపు భాష
యద కలుపు కులుకు భాష
మధు గెలుపు మలుపు భాష
సుధ చిలుకు చినుకు భాష
గంగ తేనె లొలుకు భాష
కన్నతల్లి మధుర భాష
కన్న తండ్రి ఓదార్పు భాష
గురువు పల్కు వేద భాష
మాతృభాషకు వందనం
వందనాలు మాకు శ్రీకారం
శ్రీకారమే మాకు విధ్యాభ్యాసం
అభ్యాసమే మాకు తెలుగు భాష
తెలుగు బాష భావాలే లక్ష్యం
లక్ష్యంతో సహకరిస్తే వినయం
వినయమే గురు నేర్పిన పాఠం
నిత్యా పాఠాలే అమ్మ భాష
అమ్మ బాష ఉగ్గు పాలతో నేర్పే
నేర్చుకున్నది కొండంత ధైర్యం
ధైర్యంతో పెరుగు కొంత బలం
బలమే తెలుగు విద్యా భాష
--((*))__
--((*))__
Comments
Post a Comment