193

నేటి కవిత 
పంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

ఆశలు తీరలేదని దిగులు  
కల నిజము కాలేదని దిగులు  
ఆత్మీయులు ఆదుకోలేదని దిగులు 
స్నేహం ద్రోహంగా మారిందని దిగులు 

డబ్బు ఉన్నా అనుభవించలేని దిగులు 
అన్ని ఉన్న తినలేని స్థితికి దిగులు  
బ్రతుకుకు సహకరించలేదని దిగులు  
దేవుడు ఏమీ ఇవ్వ లేదని దిగులు      

పరీక్షల్లో విద్యార్థులకు గుబులు 
ఎన్నికల్లో నాయకులకు గుబులు 
పండగల్లో పూజారులకు గుబులు 
పెళ్ళిళ్ళల్లో వచ్చిపోయేవారి గుబులు 

కష్టపడ్డ వారికీ కాసులతో గుబులు 
కష్టపడని వారికి మనుష్యులతో గుబులు
వ్యాపారులకు లాభనష్టాలతో గుబులు
ఆటలకు జయాపజయాలతో గుబులు

ఎలక్షన్ వచ్చాక సారా ప్యాకెట్లగుబులు 
ఎన్నికైనతర్వాత మంత్రులకు గుబులు 
కొటేషన్ పెట్టాక కమిషన్ కోసం గుబులు
చడగోపురం పెట్టాక దక్షణకోసం గుబులు
      
దొంగల  కోసం రక్షక భటుల గుబులు 
కేసుల కోసం న్యాధిపతుల గుబులు 
రోగుల కోసం వైద్యులకు గుబులు 
పదవి కోసం పార్టీ మార్పు గుబులు 

ఆడవారు పుత్తడి కాసులతో దిగులు  
మొగవారు మాటపట్టింపుతో దిగులు  
యుక్తవయస్సులు పెళ్లి కోసం దిగులు  
వృద్ధులు మాట నెగ్గలేదని దిగులు      

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు