199-మనోవాంఛ
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ
శ్రీ గోపాల రాధా లోలా
శ్రీ యదుపాల రాజా లోలా
శ్రీ ప్రేమ పాల సేవా లోలా
శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా
శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా
శ్రీ వెన్నులు దాచి వెన్నలు దోచి
శ్రీ మంతులు కాచి కోర్కలు తీర్చి
శ్రీ కన్నెల మనస్సులు వెన్నెలచేసి
శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా
శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా
శ్రీ వెన్నల దొంగ మాతో ఏలా
శ్రీ కన్నెల దొంగ మాతో ఏలా
శ్రీ కన్నుల దొంగ మాయ ఎలా
శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా
శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా
శ్రీ ఆశ పెంచె ఈ మాయ జగతి
శ్రీ ప్రేమ పంచె ఈ లోక ప్రకృతి
శ్రీ శోభ ఇచ్చె ఈ జీవ జాగృతి
శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా
శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా
శ్రీ భాగ్యము మా యందు నీ లీలా
శ్రీ తత్వము మాయందు నీ లీలా
శ్రీ భావము మాయందు నీ లీలా
శ్రీ నమ్మితిరా నిను కొల్చితిరా
శ్రీకర శుభకర శ్రీ రంగ దామోదరా
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లప్రగడ రామకృష్ణ
ఎవరి కెవరు ఈ లోకంలో
ఏడుస్తూ పుడతారు
ఏడిపిస్తూ పెరుగుతారు
ఏదో చేయాలను కుంటారు
ఎదో ఎదో చేస్తూ ఉంటారు
తల్లి తండ్రులను మరుస్తారు
నాకెవరు సహాయం చేశారంటారు
ఎవరి కెవరు ఈ లోకంలో
సాధించాలని అనుకుంటారు
సాధన చేయలేక ఊరుకుంటారు
చదువులతో పోరాడ లేరు
చదివిన దానితో తృప్తి పడరు
చదివిన వాణ్ని చూసి ఈర్ష్యపడతారు
చదువుకు తగ్గ ఉద్యోగం లేదంటారు
ఎవరి కెవరు ఈ లోకంలో
వయసు ఉడుకు తట్టుకో లేరు
ప్రేమ అంటూ తిరుగు తారు
మంచి ఎదో తెలుకో లేరు
చెడుకు బానిస లౌతారు
స్నేహితులతో తిరుగు తారు
కొత్త అలవాట్లు నేర్చు కుంటారు
ఎవరి కెవరు ఈ లోకంలో
సాపాటు కోసం తిరుగుతారు
స్వాతంత్రం అంటూ తిరుగుతారు
మనభూమి మన ఆస్తి అంటారు
సంతాన పంట అంటారు
సంతాన మూలిక లంటారు
దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు
సహాయం చేయలేదని వాదిస్తారు
ఎవరి కెవరు ఈ లోకంలో
--((*))--
నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగ్గడ రామకృష్ణ
మనోవాంఛ
జవ్వని చూపులు చిలకి రంగరిస్తూ
నవ్వుతూ నవరత్నాలు చూపుతూ
కవ్విస్తూ కనకాంబరాలు చల్లుతూ
గువ్వలా గుస గుస లాడి గోల చేస్తూ
సవ్వడి చేసి చిందులు వేస్తూ
రివ్వున సాగే తోకచుక్కలా సాగుతూ
చవ్వన ప్రాస తినాలని వత్తిడిచేస్తూ
యవ్వారం అంతా బయట పెడ్తు
తవ్విన కొద్దీ నీకు నోరూరిస్తూ
దువ్విన కొద్దీ శృంగారాన్ని అందిస్తూ
కొవ్వు ఉన్నదంతా కరిగిస్తూ
కెవ్వు కెవ్వు అనే అరిచేలా చేస్తూ
మువ్వల మురిపం చూపిస్తూ
గవ్వల ఆటను నేర్పిస్తూ
దివ్య వెలుగును చూపిస్తూ
భవ్య మైన భాగ్యాన్ని ఇస్తూ
యవ్వనాన్ని దార పోస్తూ
నువ్వా నేనా అని పోటీ పడ్తు
సువ్వి సువ్వాల అని ఆడిస్తూ
ఉవ్విళ్లూరే హృదయాన్ని ఇస్తా
--((*))--
Comments
Post a Comment