200-మనసు తారట్లాట

ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

కొత్తగా పెళ్ళైనవారు 
మనసు తారట్లాట 

ఉత్సాహ మనసే ఎగసి ఎగసి పడే  
- ఉల్లాస సెగలే వెంట వెంట పడే 
వాత్సల్య తలపే తొందర చేసే 
- సంతోష కథలే మనసును తట్టే 

బంగారు తనువే వెలుగు చెందే 
 - రాగాల మదిలో సవ్వడి చేసే 
సాకార నిలయే సమ్మోహం చేసే  
- ప్రేమర్ద హృదిలో మొహం పంచే  

పొంగారు దయతో ప్రేమను పంచే   
- సేమమ్ము గనవే తలుపును తీరుస్తా 
లాభమ్ము మనకే ఆనందం పొందుదాం  
- ఆమోద మనవే అమృతం అందిస్తా 

సాహిశ్చ రతిలో సంతోషాన్ని అందిస్తా  
- అందాలు పరిచెన్ ఆనందం పొందెన్  
పల్కిమ్చు నగువే పసందైనదని తెలుసుకో  
- సందేహ మడుగున్ సంతృప్తి తీరున్  

చర్చించ మనకే సమయం ఇది కాదే  
- తాపంబు గనవే   శాంతమ్ము పొందవే 
నీహాయి కొరకే నేనున్నాడని గమనించవే  
- స్నేహంబు తెలిపే సౌఖ్యంబు అందిస్తా 

తన్మాత్ర తలపే సౌభాగ్య వెలుగు 
 - భావాత్మ వెలుగే సంతోష మలుపు  
సద్భుద్ది తపనే ఆరోగ్యహేతువే  
- చామంతి చలువే పవళింపు హాయి 

అందాల లలనా అనురాగం పంచవే 
- ఆధార కలువా జలకాలాడుదామా 
దేవీ మధుమతీ   నాకీ అనుమతీ
ప్రేమార్ధ తరుణం మించకుండా చూడవా 

 చింతేల మదనా ఈ అనువంతా నీదే  
శ్రీకార పలుకూ అంగీకారమంటున్నాగా 
 - జిఘ్రంగ కులుకూ అవకాశమిస్తున్నా  
హృదయాన్ని కారములతో హత్తుకో  

తాత్పర్య మనసూ - ప్రోత్సాహ మియగా
మోహమ్ము విడదా - దాహమ్ము తరిగే 
చల్లాగ పిలిచే - వెచ్చాగ కదిలే 
సోకంత నలిపే - ప్రేమంత కరిగే

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు