Posts

Showing posts from April, 2018

పాక శాస్త్రం

Image
--((**))-- గృహ స్థలములో వృక్ష నియమాలు ఒక్క వృక్షము పది మంది సుపుత్రులతో సమానము. అటువంటి పుత్ర సమానమైన వృక్షాలను గృహవరణలో ఏవిధంగా, ఏ దిక్కున పెంచవచ్చునో ఆ నియమాలను వాస్తు శాస్త్రంలో పేర్కొనియున్నరు. భూమిపైన వివిధ రకాల వృక్ష సంపద ఉన్నది. ఆవృక్షాలన్నింటిని వాటి, వాటి మూల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల యొక్క సృష్టిగా.... ఈ క్రింది పేర్కొన్న విధంగా విశ్లేషించడం జరిగింది.... సూర్యుడు మహావృక్షాలు చంద్రుడు పాలచెట్టు కుజుడు కరముగల చెట్లు గురువు ఫలమునిచ్చే చెట్లు శుక్రుడు నీరస వృక్షములు రాహుకేతువులు పుట్టలు మొదలైనవి. అయితే ఈ చెట్లన్నింటిలోను కొన్ని మాత్రమే గృహావరణలో పెంచుకొవడం వలన మంచి ఫలితాలను పొందే వీలుంటుంది. తూర్పుదిశలో మఱ్రిచెట్టు, దక్షిణ దిశలో అత్తిచెట్టు, పడమర దిశలో జమ్మి చెట్టు, ఉత్తరదిశలో జువ్విచెట్టు, ఈశాన్యంలో రావి చెట్టు, ఆగ్నేయంలో మేడిచెట్టు, నైరుతిలో దుర్వాదుర్శనచెట్టు, వాయువ్యంలో మోదుగచెట్టు ఉన్నట్లైతే ఆ గృహ యజమానికి మేలు జరుగుతుంది. కొబ్బరిచెట్లు, పనసచెట్లు గృహావరణలో ఏ దిక్కున ఉన్నా శుభఫలితాలను ఇస్తాయని పేర్కొనబడినది. అలాగే...

స్మశాన సాహిత్యం

నేటి కవిత - స్మశాన సాహిత్యం ప్రాంజలి ప్రభ రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ ఇచ్చోటనే జగతి యంతయు చేరు ఇచ్చోటనే బ్రతుకు మార్గము పోరు ఇచ్చోటనే కలము కావ్యము తీరు ఇచ్చోటనే శవము కాష్టము జోరు ఇచ్చోటనే ప్రణయ ప్రబంధము తీరు ఇచ్చోటనే హృదయ ప్రభావము పోరు ఇచ్చోటనే నిస్వార్ధ సమూహము చేరు ఇచ్చోటనే నిత్యము మనుష్యుల జోరు ఇచ్చోటనే ఇల్లాలి నల్లపూసలు తీసిన తీరు ఇచ్చోటనే చిత్రాలు వల్లమానివి తీసిన జోరు ఇచ్చోటనే పిశాచ నివాసాలెలు తీసిన పోరు ఇచ్చోటనే మృగాల కపాలాలెలు తీసిన చేరు ఇచ్చోటనే ముక్కంటి తాండవ మాడిన తీరు ఇచ్చోటనే గంగమ్మ పారిన మోక్షము చేరు ఇచ్చోటనే మంత్రమ్ము ప్రభావ దీక్షయు జోరు ఇచ్చోటనే మనుష్య ప్రార్ధన చేసిన పోరు --((*))-- రావణుని మానసిక అవస్థ సాహితీమిత్రులారా! ప్రవరసేనుని సేతుబంధము పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత ఉద్వేగముతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధములుగా విలపించటము, త్రిజట యనే రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పుట చిత్రింపబ...

ఛందస్సు

 మత్తేభ విక్రీడితము..,,, మత్తేభ - ఆనందం 1.గణాలు,..... స భ ర న మ య వ (లగ) IIU UII UIU I I I UUU IUU IU 1 . సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే తరిం చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా    --((***))--  UI UII UI UII - UI UII UIU ఆధారము - కల్పితము స్ఫూర్తి - ఒక త్యాగరాజ కీర్తన మత్తకోకిల అమరిక - UI UII UI UII - UI UII UIU ఈ ఊహల డోల అమరిక - UII UI UII UI UII UI UII దీనికి చివర ఒక గురువును చేర్చి కోకిల పాట, సుమ షట్పది అనే ఛందములను ఇంతకు ముందు తెలిపి యున్నాను.   త్యాగరాజు ప్రాసయతిని, నాలుగు, మూడు మాత్రలను వాడెను. విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు ఛందశ్శాస్త్రం..36..6/7/2015 పైన చెప్పిన ఉత్పలమాల,,,,చంపకమాల,,ఈ రెండు వృత్తములకు సంబంధించిన ఒక చమాత్కారమైన విషయం చూద్దాము, ఉత్పలమాల పద్యాన్ని చంపక మాల గాను, చంపకమాల పద్యాన్ని ఉత్పలమాల గాను మార్చవచ్చు ఎలా అంటే ఉత్పలమాల ఎల్లవేళలా "భ" గణము తోనే ప...