ఛందస్సు

 మత్తేభ విక్రీడితము..,,,
మత్తేభ - ఆనందం
1.గణాలు,.....
స భ ర న మ య వ (లగ)
IIU UII UIU I I I UUU IUU IU

1 . సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే తరిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం       
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా 
 

--((***))--



 UI UII UI UII - UI UII UIU

ఆధారము - కల్పితము
స్ఫూర్తి - ఒక త్యాగరాజ కీర్తన
మత్తకోకిల అమరిక - UI UII UI UII - UI UII UIU
ఈ ఊహల డోల అమరిక - UII UI UII UI UII UI UII
దీనికి చివర ఒక గురువును చేర్చి కోకిల పాట, సుమ షట్పది అనే ఛందములను ఇంతకు ముందు తెలిపి యున్నాను.

 త్యాగరాజు ప్రాసయతిని, నాలుగు, మూడు మాత్రలను వాడెను.

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

ఛందశ్శాస్త్రం..36..6/7/2015
పైన చెప్పిన ఉత్పలమాల,,,,చంపకమాల,,ఈ రెండు వృత్తములకు సంబంధించిన ఒక చమాత్కారమైన విషయం చూద్దాము,
ఉత్పలమాల పద్యాన్ని చంపక మాల గాను, చంపకమాల పద్యాన్ని ఉత్పలమాల గాను మార్చవచ్చు ఎలా అంటే ఉత్పలమాల ఎల్లవేళలా "భ" గణము తోనే ప్రారంభించ బడుతుంది అంటే ప్రతి పాదము మొదటి అక్షరం "గురువు" తో ప్రారంభం చెయ్యాలి ఈ గురువును రెండు లఘువులుగా మార్చి వ్రాయగలిగితే పాదము పూర్తిగా గణవిభజన మారి చంపక మాల పద్యపాదము అవుతుంది,(20 అక్షరాలు 21 అవుతాయి,,10 స్థానంలోని యతి మైత్రి అక్షరం 11 వ స్థానమునకు మారి సరిపోతుఁది కేవలమూ మొదటి గురువును రెండు లఘువులుగా మార్చ గలిగిన చాలు. క్రింద గమనించండి.,
భ ర న భ భ ర వ(లగ)
UII UIU I I I U I I U I I U I U IU
శ్రీ షిరి/ డీనివా/ సమయి/ చేతము /పూర్ణద/ యార్ధ్రవం/తమై
(18+2**మొత్తము 20 అక్షరాలు)
(ఇది ఉత్పలమాల పద్యపాదము)
,శ్రీ కి బదులుగా వికృతి పదమైన"సిరి"వ్రాద్దాము.,,,,
న జ భ జ జ జ ర
I I I / IUI /U I I / I U I / I U I / I U I / UIU
సిరిషి/ రిడీని /వాసమ/ యిచేత /ముపూర్ణ/ దయార్ధ్ర / వంతమై
(ఒక గురువు స్థానములో రెండు లఘువులు వ్రాసినందున న జ భ జ జ జ ర, అనేగణాలు వచ్చి,11 వ అక్షరము యతి మైత్రి చెల్లి 21 అక్షరముల అక్షర నియతి పాటించ బడి,ఇది చంపకమాల పద్యపాదము అయినది)
అలాగే చంపకమాల ఉత్పలమాలగా ఎలామారుతుందో చూద్దాం ,
న జ భ జ జ జ ర
I I I / I U I / U I I / I U I & I U I / IUI / UIU
త్రిభువ/నవంద్య/గోపయు/వతీజ/నసంచి/తభాగ/దేయరుక్

భ ర న భ భ ర వ
U I I / U I U / I I I / U I I / U I I /U I U / IU
త్రీవన / వంద్యగో/ పయువ/ తీజన /సంచిత/ భాగదే /యరుక్
,("త్రిభు" అనే రెండు లఘువుల స్థానములో "త్రీ " అనే గురువు వచ్ఛుట వలన,,,భ ర న భ భ ర వ .,,అనే గణాలు వచ్చి 10 వ అక్షరం యతి స్థానములో యతిమైత్రి చెల్లి,,,20 అక్షరముల అక్షర నియతి సరిపోవటము వలన ఉత్పలమాల అని ఛంధశ్శాస్త్రం చెబుతోంది,,,,,,
ఈ విధముగా కవులు చంపకమాలను ఉత్పలమాలగాను,,,ఉత్పలమాలను.చంపకమాలగాను మార్చి వ్రాసి రాజుల మన్ననలను పొందే వారట
చాలా అద్భుతంగాను చమత్కార యుతము గాను
నున్నది కదా మీరు కూడా సాదన చేయండి,,,,
,,సశేషం.,,రేపుకలుద్దాం ..,
ఛందశ్శాస్త్రం..37..7/7/2015
మత్తేభ విక్రీడితము..,,,
1.గణాలు,.....
స భ ర న మ య వ (లగ)
IIU UII UIU I I I UUU IUU IU
2.యతి,,,,14వ అక్షరం
3.ప్రాస నీయమము కలదు.
4.అక్షర నియతి,,,20........
ఉదాహరణకు ...,,
భవరోగ ప్రవినాశనౌషధ కలా ప్రావీణ్య గణ్యుండు శై
లవిభేధి ప్రముఖాఖిలామర దరోల్లాసుండు గోవిందుఁ డం
చు వివేకుల్స భరంబులు న్నమయవస్తోమంబు గూడన్ సమా
రవిధిం జెప్పుడు రాత్రయోదశ యతిన్మత్తేభ విక్రీడితన్
స భ ర న మ య వ
I I U UII UIU I I I UUU I U U IU
భవరో-గప్రవి-నాశనౌ-షదక-లాప్రావీ-ణ్యగణ్యుం-డుశై
1.. పై పాదమునందు,,,స భ ర న మ య వ (లగం) అనే గణాలు వాడ బడినవి,
2--మొదటి అక్షరమైన "భ" కు 14 వ అక్షరమైన "ప్రా " కు యతి చెల్లినది.,
3--వ అనే అక్షరం ప్రాసాక్షరముగా వాడబడినది,,
4. 20.అక్షరములచే వ్రాయ బడినది.,,,,,,కనుక
ఇది మత్తేభ విక్రీడిత పద్యపాదమైనది,,,,
మిగిలినవి మూడు పాదములు మీరు సాదన చేసి చూసుకోగలరు ,
శార్ధూల విక్రీడితము,,,,,,,,,
1--గణాలు,,
మ స జ స త త గ
UUU IIU IUI IIU UUI UUI U....
2--యతి 13 వ అక్షరం యతిస్థానము
3--ప్రాస నియమము కలదు
4--అక్షర నియతి,,,,19 అక్షరములు,,,,ఈ నియమములను అనుసరించి వ్రాయునది,,,"శార్ధూల విక్రీడితము",,,,.
..ఉదాహరణకు.,,
పాలోనీరొ; సుఖంబొ? కష్టమొ? యికన్బాపంబొ? పుణ్యంబొ? తా
పాలో? శాపములో? వరాలొ? వెతలో, పాపిష్టి కర్మంబులో?
కాలుండర్మిలి పాశముల్విడుచునో కానొప్పు నెవ్వేనియు
న్నేలా? భాధలునాకు, నీదుకరుణల్నిండార సాయీశ్వరా
మ స జ స త త గ
UUU I I U IUI IIU UUI UUI U
పాలోనీ-రొసుఖం-బొకష్ట-మొయిక-న్బావంబొ-పుణ్యంబొ- తా
1--మ స జ స త త గ అనే గణాలు వాడబడినాయి.
2-ల అనే అక్షరం ప్రాసగా వాడబడినది
3-"పా" అనే మొదటి అక్షరానికి 13 వ అక్షరమైనపా కు యతి చెల్లింది
4-19 అక్షరాలతో వ్రాయబడి అక్షర నియతి పాటించ బడినది,,,
కావున ఇది శార్ధూల విక్రీడిత పద్య పాదమైనది,,,
మిగిలిన మూడు పాదములు మీరు సాదన చేయ గలరు,,,,,,
అయితే ఇక్కడ కూడ ఉత్పలమాలను చంపకమాలగాను చంపక మాలను ఉత్పల మాలగా మార్చినట్లు మనం మత్తేభ విక్రీడితము ను శార్ధూల విక్రీడితము గను శార్ధూల విక్రీడితము ను మత్తేభ విక్రీడితము గను మార్చవచ్చు
ఏమనగా ఒక గురువు అక్షరానికి బదులుగా ,,,రెండు లఘులు వ్రాయటం(మార్చటము),,లేదా రెండు లఘువులను ఒక గురువుగా మార్చి వ్రాయటము వలన సాధ్యమౌతున్నది.,,వృత్తములు కేవలము గురు లఘువుల ప్రాముఖ్యం కలవి కావున సాధ్యమైనది,, మీరు కూడ శ్రద్ద వహించి సాధన చేసినచో,,,ఇటువంటి చమత్కారములతో పద్య రచనలు చేయగలరు సాధన చేయండి,,,,
సశేషం.,,రేపుకలుద్దాం ,.,
ఛందశ్శాస్త్రం ..39..వృత్తములు
మత్తకోకిలా వృత్తము,,,,,
1.గణాలు.,,,
ర స జ జ భ ర
UIU IIU IUI IUI UII UIU
2.యతి.,,,,,11 వ అక్షరము
3.ప్రాస నియమము కలదు
4.అక్షర నియతి,,,,,18 క్షరములు.
ఉదాహరణకు ,,,,,,
తీగయుయ్యెల నూఁగు జల్లని తియ్యమామిడి మోకలం
దాగు ఁబువ్వల తేనెసోనల ఁదారుఁగేతకిఁజేరుఁబు
న్నాగ పూగ మహాగ వీధుల నాట్యముల్ పచరించు నా
భోగ నాగలతా గృహంబుల భోగముల్గను వేడుకన్!
ర స జ జ భ ర
U I U I I U I U I I U I U I I U I U
తీగయు-య్యెలనూ-గుజల్ల-నితియ్య-మామిడి-మోకలం
పై పద్య పాదమునందు మనం చూచినచో..,.
ర స జ జ భ ర అనే గణాలు వాడటం జరిగినది
1వ అక్షరం "తీ",,,కు 11వ అక్షరం "తి" కు యతి మైత్రి కుదిరినది
ప్రాసగా,,,"గ" కారము వాడబడినది ,
18 అక్షరములుండి అక్షర నియతి పాటించ బడినది
కావున ఈ పద్య పాదము మత్తకోకిల పద్య పాద మైనది,,,,,,,మిగిలిన మూడు పాదములు మీరు సాదన చేయ గలరు,,,,
ఇంద్రవజ్ర వృత్తము..........
1..గణాలు,,,
త త జ గా
UU| UU| |U| UU
2..యతి ప్రతి పాదము లోను 8 వ అక్షరం
3..ప్రాస నియమాం కలదు.,,
4..అక్షర నియతి,,,,11
తారామణీ పూర్ణు డు దారుడేమో
నీరాకఁ దెల్పంగను నేంచి జ్యోత్స్నల్
పారాడగా జేసెగ భావనల్ యిం
పారంగ నోరాణి శెభాసుగానూ
గణ విభజన పరికించినచో
త త జ గా
U U | U U | | U | U U
తారామ -ణీపూర్ణు-డుదారు-డేమో
త త జ గా
U U | U U | | U | U U
నీరాకఁ-దెల్పంగ -నునేంచి-జ్యోత్స్నల్
త త జ గా
U U | U U | | U | U U
పారాడ -గాజేసె-గభావ-నల్ యిం
త త జ గా
U U | U U | | U | U U
పారంగ -నోరాణి-శెభాసు -గానూ
1.త త జ గగ .,,,అనే గణాలు వాడ బడ్డాయి
2.1వ అక్షరం 8 అక్షరం
తా...... .....దా తో
నీ.............నే తో
పా............బా తో
పా.............భా..తో యతి వేయబడినది
3..ర అనే అక్షరము రేఫ ప్రాసగా వాడబడినది,
4...11 అక్షరాల నియతి పాటించ బడినది,,
కనుక ఇది ఇంద్రవజ్ర వృత్త పద్యమైనది,
సశేషము.....,రేపుకలుద్దాం


ఛందశ్శాస్త్రం-,24,--ప్రాస

......ప్రాస,,,.,,,,.

పద్యానికి సహజంగా 4 పాదాలు ఉంటాయి ప్రతి పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు, పాదంలోని మొదటి అక్షరం యతి అయితే దాని ప్రక్కనే ఉన్న రెండవ అక్షరం ప్రాస అవుతుంది.ఇది ప్రతి పాదంలోను తప్పనిసరిగా కొన్ని పద్యాలలో ఉంటుంది.ఈ ప్రాసాక్షరం ఒకే రూపంలో ఉండాలి అంటే ఒకే అచ్చుతో కలసి ఉండాలి అనే నియమం లేదు.ఒక హల్లు ఏ అచ్చు తోనైనా కలసి వ్రాయబడ వచ్చు.,.,,మొదటి పాదంలో "త" అనే అక్షరం వస్తే 2..3..4..పాదాలలో,,తి,,,,తు ...తె...అనే అక్షారాలు రావచ్చు ,అంటే ఒధక హల్లు ఏ అచ్చుతో అయిన కూడుకొని ఉండవచ్చు,,,,,,,,,,,

ఉదాహరణము,,,,
"అత్తరి విట నాగరికులు
చిత్తమున వసంతకేళి చిగురొత్తంగా
మొత్తములు గట్టి తెచ్చిరి
ముత్తెపు ఝల్లురులతోడి బుఱ్రట కొమ్ముల్"
పై పద్యాన్ని గమంచినచో ప్రతి పాదములోని రెండవ అక్షారాలు "త్త,,,,త్త....త్త,,,,త్తె " అనునవి ప్రాసాక్షరాలుగా మనకు గోచరిస్తాయి.అంటే త అనే హల్లు ఏ అచ్చుతోనైన కలసి ప్రాసాక్షరంగా మిగిలిన మూడు పాదాలలో వ్రాయ వచ్చు అన్న మాట.
ప్రాసమునకు ప్రా అని కూడ మరొక పేరు కలదు,,,దీనికి బహువచన రూపం..,,,ప్రాలు,,,
ప్రాస పూర్వాక్షర రూపాలు,,,,,,,,(సాదారణ నియమాలు)
1.మొదటి పాదం ప్రాస పూర్వాక్షరం గురువైతే మిగిన పాదాలు గురువే ఉండాలి,,,,,లఘువైతే లఘువే ఉండాలి.,,,,
2.ప్రాసాక్షరమునకు ముందు అర్ధ బిందువున్నా(అరసున్నా),,,లేదా పూర్ణబిఁదువున్నా(సున్నా)మిగిలిన అన్ని పాదాలలొను అలాగే ఉండాలి ,,,ఖండాఖండ ప్రాసం దీనికి విశేష నియమం,,,
3.ప్రాసాక్షరమునకు ముందు విసర్గ ఉన్నచో మిగిలిన అన్ని పాదాలలొను అలాగే ఉండాలి ,
4.ప్రాస పూర్వాక్షరం ధీర్ఘమైతే మిగిలినవి ధీర్ఘం ఉండాలనేది నిజమే కాని,,,అక్కడ గురువు అక్షరం తప్పకుండా ఉండాలి అంటే ప్రాసాక్షరం సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం అయి ఉండాలి ,అలాకానిచో ప్రాస పూర్వాక్షరం ధీర్ఘం అయితే ధీర్ఘం హ్రస్వం అయితే హ్రస్వం తప్పనిసరిగా ఉండాలి,,,,
కం//
అక్షిగతుడు విజయుడట ని
రీక్షణ సేయక నతండు రివ్వున నపుడే
రక్షణ నొసంగ సైన్యము
తీక్షణ యుద్దము జరుపగ తేరును దిప్పెన్
పై పద్యము గమనించినచో " క్ష" సంయుక్తాక్షరము ప్రాసాక్షరముగా గైకొనబడినది,,కాని 1---3 పాదములలో ప్రాస పూర్వాక్షరయులైన అ,,ర లు జన్మతః లఘువులు...సంయుక్తాక్షరమునకు ముందున్నందున గురువులైనాయి..2--4 పాదములలోని ప్రాస పూర్వాక్షరయులైన..రీ....తీ లు ధీర్ఘాక్షరములు అయినందున జన్మతః గురువులు....సంయుక్తాక్షరమునకు ముందున్నందున కూడా గురువులైనాయి. వెరసి నాలుగు పాదములందున ప్రాస పూర్వాక్షర నియతి గురువులుగా పాటించ బడినది..ఈ వ్యత్యాసమును గమనించ వలసినదిగా కోరుచున్నాను.
6.ప్రాసాక్షరం హల్లు ప్రధానంగా కలది కాని అచ్చు ప్రధానంగా కలది కాదు,
7.ఋ అనేది అచ్చు ఇది వత్తులలో వ్రాసే సమయంలో దీని రూపం వట్రువ అంటాము.,,ప్రాసలో ఇది కూడిన హల్లు(కృ,,,మృ,,,గృ ,,తృ.,,నృ) ఉన్నపుడు అక్కడ మరొక అచ్చు ఉండ వచ్చు,,
8.హల్లు ప్రధానమైన ప్రాసలో స్వరసంధి వచ్చినప్పటికీ హల్లే ప్రధానంగా ఉండాలి(ఉభయ యతులలాగా,,,,అచ్చు,,హల్లుల ప్రాసములు కూడదు)
కం//
ఆనలు నెట్టిన నిలువక
తానూరకయలిగి యాసుదంతను జేరెన్
దానవ సంహరుడే క్రియ
చేనిక జనుదెంచునాకు జెప్పవెయనంగన్
1.....3..పాదాలలొ.,,సహజ సిద్దమైన నకారము
2......4 పాదాలలో సంధి జరిగిన నకారముతో ప్రాస వేయబడింది
ప్రాస నియమాలిలా ఉన్నప్పటికి అప్పకవిచే ఇంకా 17 ప్రాస బేదాలు చెప్పబడినవి,,అవి రేపటినుండి చూద్దాము
సశేషం...రేపు కలుద్దాం..,,,,
,,,,,,శలవు,,,రేపుకలుద్దాం ..,,,,



ఛందశ్శాస్త్రం-25--ప్రాస బేదాలు,,,,,

ప్రాస బేదాలు,,,,,

1.అర్దబిందుసమప్రాసము,,
2.పూర్ణబిందుసమప్రాసము,,,
3ఖండాఖండప్రాసము,,
4.సంయుతాక్షర ప్రాసము,,
5.సంయుతాసంయుత ప్రాసము,,,
6.రేఫయుత ప్రాసము,,
7.లఘుద్విత్వ ప్రాసము,,
8.వికల్ప ప్రాసము.,,,
9.ఉభయ ప్రాసము,,,
10.అనునాసిక ప్రాసము,,,
11.ప్రాస మైత్రి ప్రాసము,,,
12.ప్రాసవైరము,,,
13.స్వవర్గజ ప్రాసము,,,,
14.ఋ ప్రాసము,,,,
15.లఘుయకార ప్రాసము,,,
16.అభేద ప్రాసము,,,
17.సంధిగత ప్రాసము,,,

ఈ 17.ప్రాసభేదాలు అప్పకవిచే,,అప్పకవీయములో చూచించ బడినవి,,,,వాటి వివరణ పరిశీలిద్దాం ,,,,
1.అర్ధబిందు సమ ప్రాసము.,,,,,
పద్యం మొదటి పాదములో ప్రాసాక్షరమునకు పూర్వము అరసున్నా ఉన్నచో అన్ని పాదాలలో రసున్నా రావాలి..,,,
"వీఁక పంక్తిముఖుని దాఁకి కోసల వల్ల
భుఁడు బలాసురాంత కుఁడు సెలంగ"
ప్రాస...యతిప్రాసాక్షరములకు ముందు అర సున్నా గమనించ గలరు.....
2.పూర్ణ బిందు(సమ)ప్రాసము
పద్య మొదటి పాదములో ప్రాసాక్షరం ముందు బిందువు(నిండు సున్నా) ఉన్నచో మిగిలిన అన్ని పాదాలలో అలాగే ఉండాలి .
పొందిపవలయు నెల్లడ
బృందావనచారి పూర్ణబిందు ప్రాసం
బిందీవరాక్షి భీష్మక
నందనఁ జేకొనియెనంద నందనుడనగన్
అన్ని పాదాలలోను ద కారము ప్రాసాక్షరంగా గైకొని పూర్వాక్షరం బిందుపూర్వకమూ,,,హ్రస్వాక్షరమై,,,బిందువుతో కలిసి గురువు లైనాయి కావున సమబిందు ప్రాసమైనది,
3.ఖండాఖండప్రాసము,,,,,
పద్యపాదములోని మొదటి అక్షరం ధీర్ఘమైంయుడి అరసున్నాతో కూడి ఉన్నప్పుడు ,,,క చ ట త ప అనే ఫరుషాక్షారాలలో దేనినైనా ప్రాసాక్షరముగా ఎంచుకున్నచో అరసున్నా లేని క చ ట త ప లనుకూడా ప్రాసాక్షరముగా వేయ వచ్చు,,,,(అర్ధ బిందు సమ ప్రాసకు ఇది వ్యతిరేకము)
వీఁకఁబఱతెంచి నల్లడ
దాఁకిన గడునలిగి ఘోర తర శరశరహతి న
మ్మూకలువిరియగ నర్జనుఁ
డాకరమున నేసె నుగ్రుడైరణ భూమిన్
3.వ పాదములో అరసున్నా లేని ప్రాస పూర్వాక్షరాలు దీర్ఘాలై ఉన్నవి (క కారము ప్రాసాక్షరముగా వాడ బడినది )మిగిలినవి మూడు పాదాలలొను అరసున్నాతో కూడిన ధీర్ఘాక్షరాలు కలవు,.,,గమనించ గలరు.,,
4.సంయుక్తాక్షర ప్రాసము,,,,,,
ప్రాస స్థానములోని హల్లులు ఏ క్రమంగా ఉన్నాయో అన్ని పాదాలలోను అలానే ఉంటే అది సంయుక్తాక్షర ప్రాస అవుతుంది,,,,,
పాళ్ళు మనుజులెక్క నూళ్ళుగాదొడగెన
య్యూళ్ళు మిగుల బలిసె ఁబ్రోళ్ళు గాగ
మొదటి పాదములో,,,పాళ్ళు.,,ఊళ్ళ
రెండవ పాదములో ఊళ్ళు.,,ప్రోళ్ళు అని ళ కార ద్విత్వము,ప్రాసగా(ప్రాస యతిగా)వాడబడినది.,,
5..సంయుతా సంయుత ప్రాసము,,,,,
ర.,ల ,,అనే అక్షరాలు వత్తులు కూడిన అక్షరాలు,,,అలాగే వత్తులు కూడని అక్షరాలు ప్రాసగా వాడినచో అది సంయుతాసంయుత ప్రాసము అవుతుంది,,,ర.,,,ల,,,,అన్నే అక్షారాలు"కర్ర,,,,కర.,,,చర్ల చర" అనే రీతిగా సంయుక్తాక్షరాలు గా చేరితే అవి సంయుతాలు అలా చేరకున్నచో అసంయుతాలు.,,,
ఉదా.,
శ్రీ కర చక్రాంకితులగు
లోకులు శుద్దులును బుణ్యులును నగుదురునా
రీక్రియలు లేక యుండిన
ప్రాకృతులనఁబతితులనగ బడుదురు జగతిన్
3 వ పాదం రేఫ సంయుతం 1,2,4 రేఫ సంయుతాలుకావు
పాండిఁద్రచ్చగ నిమ్ము నా తండ్రి కృష్ణ
వేడుకొనియద నందాక ఁబండ్లు దినుము
దుండగపు చేష్టలులును నోటి గాండ్ర తనము
మెండుగా జొచ్చె నీకు నైదేండ్ల కనఁగ
1..పాఁడి,,,,తండ్రి 2,వేడు,,,బండ్లు,,3.దుండు,,,గాండ్రు,,,4.మెండు,,దేండ్లు
ఈ విధముగా సంయుతాసంయుత ప్రాసము(ప్రాస యతి) గా వాడబడినది,,,,

,,,,సశేషం,,,,, రేపుకలుద్దాం
--((**))--

ఛందస్సు నేర్చుకుందాంరండి
ఛందశ్శాస్త్రం ,,,9.. ,,,,,,9/6/2015 ఉప గణాలు
చతురక్షర గణాలు16 గా గుర్తించినప్పటికి వాడుకలో ఉన్నవి మాత్రము మూడే అవి "నల" "నగ" "సల" అనే గణాలు మాత్రమే మిగిలినవి ఊహాత్మకాలు,,
I I I I
1.నలము నగణం+లఘువు నరహరి
I I I U
2.నగము నగణం+గురువు నరహరీ
I I U I
3.సలము సగణం+లఘువు సురరాజు

పైన ఉదహరించిన మూడు గణాలు మాత్రమే చతురక్షర గణాలలో ముక్యమైనవి పద్య రచన చందస్సు లో పై మూడు చతురక్షర గణాలు వాడుకలో ఉన్నవి.
స్వభావాన్ని బట్టి గణ విభజన,,,,....,,ఉప గణాలు ..
స్వభావం అనగా ద్వయక్షర త్రయక్షర, చతురక్షర గణాలను విడదీసి వాటి స్వభావం తెలియచేసే గణాలు అని భావం,కాని ఛందశ్శాస్త్ర పండితులు వీటిని ఉప గణాలుగా గుర్తించారు,
ఉప గణాలు అనగా
"నల" "నగ" "సల" "భ" "ర" "త"అనే
ఈ ఆరు గణాలు ఇంద్ర గణాలు అని,
"గల" "నగణం" ఈ రెండు సూర్య గణాలు.,అనీ ఛందస్సు శాస్త్ర పండితులు నిర్ణయించారు.
సూర్య గణాలు ,,
"గల",,,"నగణం"(2)...ఈ రెండు గణాలు సూర్యగణాలు
గల శౌరి U I
నగణం యమున I I I
ఇంద్ర గణాలు
"నల" "నగ" "సల" "భ" "ర" "త"(6)..ఈ ఆరు గణాలు ఇంద్ర గణాలు
a,నల -IIII-- విజయడు 
b,నగ- IIIU- - నరహరీ
c.సల-IIUI-- సురరాజు 
d,భ- UII -- రాముడు
e,ర- UIU -- తోటలో
f.త- UUI -- రారాజు

ఉప గణాలు .ఇవి మూడు రకాలు,,,
1,సూర్య గణాలు 2.ఇంద్ర గణాలు 3.చంద్ర గణాలు.
"సులక్షణ సారం" అనే ఛందశ్శాస్త్రం లో ఈమూడు ఉప గణాలు గా గుర్తించారు.
ఇవి మూడు రకాలు,,,
1,సూర్య గణాలు 2.ఇంద్ర గణాలు 3.చంద్ర గణాలు.
"సులక్షణ సారం" అనే ఛందశ్శాస్త్రం లో ఇంద్ర గణాలు సూర్య గణాలను సులభంగా గుర్తుంచుకోవటానికి ఒక పద్యం చెప్ప బడింది 
కం.
"నల నగ సల భ ర త లు నా
నెలమిని నీయారు గణము లింద్రగణంబుల్
గల నగణములీ రెండును 
జలజాప్త గణంబులయ్యె జగదాథారా!"
జలజాప్తుడనగా సూర్యుడు ,,,
సశేషం.,,,,,,,రేపుకలుద్దాం .......
--((**))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు