స్మశాన సాహిత్యం
నేటి కవిత - స్మశాన సాహిత్యం
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ఇచ్చోటనే జగతి యంతయు చేరు
ఇచ్చోటనే బ్రతుకు మార్గము పోరు
ఇచ్చోటనే కలము కావ్యము తీరు
ఇచ్చోటనే శవము కాష్టము జోరు
ఇచ్చోటనే ప్రణయ ప్రబంధము తీరు
ఇచ్చోటనే హృదయ ప్రభావము పోరు
ఇచ్చోటనే నిస్వార్ధ సమూహము చేరు
ఇచ్చోటనే నిత్యము మనుష్యుల జోరు
ఇచ్చోటనే ఇల్లాలి నల్లపూసలు తీసిన తీరు
ఇచ్చోటనే చిత్రాలు వల్లమానివి తీసిన జోరు
ఇచ్చోటనే పిశాచ నివాసాలెలు తీసిన పోరు
ఇచ్చోటనే మృగాల కపాలాలెలు తీసిన చేరు
ఇచ్చోటనే ముక్కంటి తాండవ మాడిన తీరు
ఇచ్చోటనే గంగమ్మ పారిన మోక్షము చేరు
ఇచ్చోటనే మంత్రమ్ము ప్రభావ దీక్షయు జోరు
ఇచ్చోటనే మనుష్య ప్రార్ధన చేసిన పోరు
--((*))--
Comments
Post a Comment