పాక శాస్త్రం


--((**))--

గృహ స్థలములో వృక్ష నియమాలు

ఒక్క వృక్షము పది మంది సుపుత్రులతో సమానము. అటువంటి పుత్ర సమానమైన వృక్షాలను గృహవరణలో ఏవిధంగా, ఏ దిక్కున పెంచవచ్చునో ఆ నియమాలను వాస్తు శాస్త్రంలో పేర్కొనియున్నరు.

భూమిపైన వివిధ రకాల వృక్ష సంపద ఉన్నది. ఆవృక్షాలన్నింటిని వాటి, వాటి మూల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల స్వభావాలను అనుసరించి కొన్ని గ్రహాల యొక్క సృష్టిగా.... ఈ క్రింది పేర్కొన్న విధంగా విశ్లేషించడం జరిగింది....

సూర్యుడు మహావృక్షాలు
చంద్రుడు పాలచెట్టు
కుజుడు కరముగల చెట్లు
గురువు ఫలమునిచ్చే చెట్లు
శుక్రుడు నీరస వృక్షములు
రాహుకేతువులు పుట్టలు మొదలైనవి.

అయితే ఈ చెట్లన్నింటిలోను కొన్ని మాత్రమే గృహావరణలో పెంచుకొవడం వలన మంచి ఫలితాలను పొందే వీలుంటుంది. తూర్పుదిశలో మఱ్రిచెట్టు, దక్షిణ దిశలో అత్తిచెట్టు, పడమర దిశలో జమ్మి చెట్టు, ఉత్తరదిశలో జువ్విచెట్టు, ఈశాన్యంలో రావి చెట్టు, ఆగ్నేయంలో మేడిచెట్టు, నైరుతిలో దుర్వాదుర్శనచెట్టు, వాయువ్యంలో మోదుగచెట్టు ఉన్నట్లైతే ఆ గృహ యజమానికి మేలు జరుగుతుంది. కొబ్బరిచెట్లు, పనసచెట్లు గృహావరణలో ఏ దిక్కున ఉన్నా శుభఫలితాలను ఇస్తాయని పేర్కొనబడినది. అలాగే తూర్పున రావి చెట్టు, దక్షిణా దిశలో దువ్వి చెట్టు, పడమరలో మఱ్రిచెట్టు, ఉత్తరములో అత్తిచెట్టూన్నట్లైతే గృహ యజమానికి కీడు కలుగుతుందని పేర్కొనబడినది. గృహావరణలో ఏ విధమయిన వృక్షాలు ఉండవచ్చునో లేదా ఏ విధమయిన వృక్షాలు వుండకూడదో తెలిపే విషయంలో వివిధ వాస్తు గ్రంథాలలోమతభేదాలున్నాయి.
చింతచెట్టు, మారేడు చెట్టు, తాటి చెట్టు, రేగు చెట్టు, కుంకుడు చెట్టు, కానుగ చెట్టు, మోదుగ చెట్టు, సంపెంగ చెట్టు, గౄహావరణలో ఎక్కడ వున్నా గౄహ యజమానికి కష్టాలు తప్పవంటారు. చెట్ల విషయం లో సాధారణ నియమాలు ఎన్ని ఉన్నప్పటికి మినహాయింపులుకూడా వర్తిస్తాయి.
గృహావరణలో పాలు కారు వృక్షములు (దుగ్ద వృక్షములు) ఉన్న యెడల ద్రవ్యనాశనము కలుగుతుంది.

గృహావరణలో ముళ్ళ చెట్లు ఉన్న యెడల శత్రువృద్ది, శత్రువులచే సంతాపము కలుగుతూ ఉంటుంది.
గృహావరణలో ఫిలే(పండ్ల వృక్షములు) వృక్షములున్న యెడల సంతానమునకు హాని కలుగుతూ ఉంటుంది.
గృహావరణలో గృహానికి దక్షిణ భగములో గానీ, గృహానికి సమీపములో దక్ష్ణ దిక్కునందు గానీ చెంపక వృక్షము, పాటల వృక్షము, కదళి వృక్షము, జాజి, కేతకి వృక్షములున్నట్లైతే ధనధాన్యములకు హాని కలుగుతూ ఉంటుంది. గృహావరణలో కానీ, గృహ సమీపంలో కానీ భూతన మశ్రితములగు వృక్షములున్నట్లైతే వాటిని ఛేదించివేయాలి.
గృహావరణలో ఆగ్నేయమున గాని, గృహ సమీపములో ఆగ్నేయమున గాని, క్షీర వృక్షములు, అశ్వ్త్థ వృక్షములు, రక్త పుష్ప, ద్రుమ, ఖంటక, క్షీర వృక్షములు, షాల్మలి వృక్షము, వుదంబర వృక్షము, జువ్వి చెట్టు.... వీటిలో ఏ వృక్షమున్నను మౄత్యు భయములు, పీడలూ కలుగుతూ ఉంటాయి.
--((**))--


పాక శాస్త్రం
" పుటకొక్కులు , పుట్ట గొడుగులు " 

కుళ్ళి పోతున్న పదార్ధాలున్న చోట పెరుగుతుంటాయి కాబట్టి మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఏహ్యభావం ఉండటం సహజం . అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణం లో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారము తో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి , డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలము లో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి . పుట్టగొడుగులలో " ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి . శరీరములో యధేచ్చగా సంచరిస్తూ డి.ఎన్‌.ఎ. ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు , కార్సర్లకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను ఇవి ఎదుర్కొంటాయి పోర్టొబెల్లో , క్రెమిని ... రకాల పుట్టగొడుగుల్లో ఇర్గోథియోనైన్‌ , బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్‌ 'D' ఉత్పత్తికి సహకరించేవి గా పనిచేస్తాయి . పుట్టగొడుగుల్లో 90 శాతము నీరే ఉంటుంది . సోడియం ఉండదు . పొటాసియం లభిస్తుంది, కొవ్వుపదార్ధము తక్కువ .. ఫలితం గా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు . రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్‌ ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. 

తిన దగిన పుట్ట గొడుగులు 

పుట్ట గొడుగులను మామూలు కూరలాగానే వండుకుని తినే అలవాటు చాలాకాలం నుంచే జరుగుతున్నది. 

ఈ కూర రుచికి శాఖాహారానికి, మాంసాహారానికి మధ్యస్తంగా ఉంటుంది. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. 

వీటిలో బటన్ మాష్రూం, ట్రఫుల్, జపాను,చైనాలోని షీతాకే కొన్ని. 

కృత్రిమంగా పండించే పుట్ట గొడుగులు 
పుట్ట గొడుగులు పెరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. 
ఉపయోగాలు 
యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది ." ఇర్గోథియోనైన్‌ , సెలీనియం " అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్‌ 'D' పుస్కలము గా లభిస్తుంచి నందువల్ల ... ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది . మామూలుగా ఆహారములో వి్టమిన్‌'D' లభించదు . పు్ట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ 'D' అందుతుంది ..అయితే దీనివలన సన్‌ట్యాన్‌ కి గురి అయ్యె ప్రమాధముంది . వీటిలో మొక్కలు , జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి . జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు . భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి . మాంస్కృత్తులు లభిస్తాయి . శరీర సౌష్టవం , కండర పుష్టికి దోహదపడతాయి . పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి , కండరాలకు , ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది . గుండె , ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి . డయబిటీస్ ను తగ్గిస్తుంది. పుట్టగొడుగు ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉండి రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. 
పుట్టలపై చాలా అరుదుగా పూస్తుంది. పుట్టలపై చాలా చిన్నవిగా అనేకం పూస్తాయి, ఇవి నేలపై చల్లిన మల్లెపూవు పూరేకుల వలె తెలుపు రంగులో ఉంటాయి. పుట్ట పూతను కూర వండుకొని తింటారు, చాలా రుచిగా ఉంటుంది. 
ఈటి లో కొన్ని విషపూరితమైన వి కుడా వున్నాయి . మార్కెట్ లో దొరికే పుట్టగోడులు తాజా గా వున్నవి అయినా , ఎందబెట్టినవి అయినా కొన్నుక్కొని వాడమని నా సలహా . 
మీ " వాగ్దేవి విజయం "

--((**))--



No automatic alt text available.


కర్పూరం గురించి..
కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.
సేకరణ.post నాదికాదు



" కుంకుమ పువ్వు గురించి పూర్తి వివరణ "


కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇది శీతల ప్రదేశంలో పండుతుంది. కుంకుమ పువ్వులో ఉపయోగ పడే భాగం ఎర్ర కేశరాలు మాత్రమే. ఒక కిలో కేశరాలు కావాలంటే కనీసం రెండు లక్షల పువ్వులు అవసరం అవుతాయి. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ కేశరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా ఉంటాయి.ఈ భూభాగంలో అత్యంత ఖరీదైనది, అద్భుత ఔషథ గుణాలు కలదీ ఈ కుంకుమ పువ్వు మాత్రమే. నాటి రాచరిక దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. క్రీ.పూ. 500 ఏళ్లకు ముందే దీని ప్రస్తావన ఉంది. మన వేద కాలం సంస్కృతిలోనూ సౌందర్య పోషణకు విరివిగా వాడకం ఉంది.

మనదేశంలో ఈ కుంకుమ పువ్వును కాశ్మీర్‌లో విరివిగా పండిస్తారు. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు కోతకు వస్తుంది. కుంకుమ పువ్వు మొక్క చూడడానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుండి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు పూస్తాయి. కాశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబర్- నవంబర్‌లలో విరబూసిన కుంకుమ పువ్వులతో నిండిపోతుంది. ముందుగా మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమ పువ్వు అనుకుంటే పొరబాటు. అందులోముచ్చటగా మూడు అండకోశాలు, రెండు ఎర్రరంగులో కేశరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపు రంగులో ఉండే ఈ అంకోశాలనే కుంకుమ పువ్వు అని పిలుస్తారు. ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను వేరుచేసి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి సువాసనతో ఉంటాయి. ఒక్కరోజు పూలు కొయ్యడంలో ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే ఉదయమే పువ్వులను కోసేస్తారు. అన్ని పూలనుంచీ చేతులతోనే అండకోశాలను వేరుచేయాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. మన కాశ్మీర్‌లో గ్రాము కుంకుమ పువ్వు ధర రూ.60నుండి రూ.600 వరకూ వుంటుంది. నాణ్యతను బట్టి ధర మారుతుంది. అయితే మనిషి వాడిన మొట్టమొదటి సుగంధ ద్రవ్యం ఇదేనంటారు.

కుంకుమ పువ్వును రంగు పదార్ధంగానూ, సువాసన కోసం తినుబండారాల్లోనూ, తాంబూలంలోనూ వాడతారు. నేత్రవ్యాధులలోనూ, ముక్కు సంబంధ వ్యాధులలోనూ మందుగా కుంకుమ పువ్వును వాడతారు. కుంకుమ పువ్వును గంధంలా తయారు చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా, ఆకర్షణీయంగా తయారౌతుంది. అదనపు రంగు, సువాసన కోసం దీన్ని అన్ని వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వు కంటికి చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యం మీదపడుతున్న కొద్దీ చాలామందికి కంటి చూపు మందగిస్తుంది. అందుకే తరచూ ఆహారంలో కుంకుమ పువ్వును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచి రక్తపోటును తగ్గిస్తుంది. మెనోపాజ్ సమస్యలకు కూడా కుంకుమ పువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశోధనల్లో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాల ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో ఉంది కాబట్టి కుంకుమ పువ్వును ఎక్కువ వాడవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. గర్భవతులే కాదు, ఎవరైనా కుంకుమపువ్వును తీసుకోవచ్చు. అయితే కొన్ని నకిలీ పువ్వులు కూడా మార్కెట్లో కనిపిస్తాయి. దానిమ్మ పూరేకులను, బీట్‌రూట్ తురిమిన తురుమును కుంకుమ పువ్వు శాప్రాన్‌గా అమ్ముతారు. కొనేది మంచిదా కాదా అనేది తెలుసకొనేందుకు కొన్ని రేకులను నీటిలో వేస్తే వెంటనే రంగు వస్తే అది నకిలీదని తెలుసుకోండి. కుంకుమ పువ్వు నీటిలో రంగు రావడానికి నానిన 15 నిమిషాల తర్వాత గానీ రంగురాదు. కాబట్టి కుంకుమ పువ్వును కొనేప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి.

మీ .. " వాగ్దేవి విజయం "



LikeShow More Reactions



" కుంకుమ తయారు చేసుకోండి సొంతం గా "


కుంకుమ. … కుంకుమపువ్వు ఒకటికావు . కుంకు మపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ… బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.


మీకు ఎంత కావలి ? ముందుగా నిర్ణయం అయిన తర్వాత క్రింద నిష్పత్తి ప్రకారం తయారు చేసుకొని వాడండి . 

* కావలిసిన సామానులు *
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .
ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .
ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .
పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .
మీ ..... " వాగ్దేవి విజయం "



ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక ...
పాక శాస్త్ర ప్రభ  



" ఆరోగ్యకర ఉపయోగాలు "


1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .


2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్‌ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది .


3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్‌ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .


4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్‌ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును .


5. జ్యరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది .

6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్‌ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును .

7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .

8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .

9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .
ఇక్కడ ఉన్న బొబ్బర్లు లేదా అలసందలు చూశారు కదా! ఏం గమనించారు.రెండు రంగు ల్లో ఉంది.గుగ్గిళ్ళు చేద్దామని నానబెడితే ముదురు రంగులో ఉన్నవి గిన్నె పైన ఉంటే కొన్ని కింద ఉన్నాయి. వీటిలో రంగు కలపడం వలన ఇన్ని తేడాలు. మిత్రులారా మనం ఎంత తింటున్నామనేది ఎంత అవసరమో ఏం తింటున్నామో కూడా అవగాహన కలిగి ఉండాలి.అందరికీ నమస్కారాలు.






Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు