ప్రవహించే నీటి లోన కాలుష్యము నిలవదులే
ప్రేమించే మనసులోన ఏ ద్వేషము నిలవదులే!
అందమైన లోకంలో అద్భుతాలు ఎన్నె న్నో
హృదయానికి కనులుంటే ఏ లోపము నిలవదు లే
నీలి మబ్బు విడిదియింట నిండు కుండ ఆకాశము
ఇంద్రధనసు రంగులతో అదృశ్యము నిలవదులే!
కష్ట పడిన దారులలో పరిమళాలు వేరుకదా
మోసాలతొ సాధించిన ఏ విజయము నిలవదులే!
అరిగిపోయి తానున్నా నిండు దీవెన చాలదా
అమ్మ చేతి ముద్ద ముందు ఏ భాగ్యము నిలవదులే "!
ఆటుపోట్లు ఎన్నైనా అలిసిపోని ఈత గాడు
సహనానికి నాన్న ముందు ఏ శిఖరము నిలవదులే!
ధనముందని బలముందని ఆప్తులపై మిడిసి పడకు
తనవెలుగులు పంచలేని ఏ దీపం నిలవదులే "
ఏ గమ్యం చేర కుండ పయనమాగి పోతున్నది
కాల మనే ఉప్పెన లో ఏ బంధము నిలవదులే!
జీవిత మే నవరసాల నాటక మై పోయె నేడు
పాత్ర ముగిసి పోతుంటే ఈ వేషము నిలవదులే "!
31. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మాల్లాప్రగడ రామకృష్ణ
మస్తకంలో ఉన్న మహత్తును
మహిమాన్వితమైన జగత్ విషయాలను
వ్రాసి మందమతులను, ఉత్తెజులుగాను
ఉద్దండ పండితులుగా మార్చాలి ఎలా ?
అలా ఇలా అనుకోవటం అనవసరము
కంటితో చూసినది బుద్ధికి పదును పెట్టడము
బుద్ధిహీనులకు బుద్ధి చెప్పడమే కవిత్వము
కవిత్వం వ్రాతపూర్వకంగా ఉంటె అర్ధం కానివరికి ఎలా ?
కళ్ళతో అమాయకుల ఆక్రందనలు చూడాలి
ఆదుకొనే శక్తి పరుల ప్రోస్చాహంతో బ్రతికించాలి
ఆశయ సాధన లేని రాజకీయాలను వదలాలి
పకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి మంచిని పంచాలి ఎలా?
హృదయంతరము లోని భావాలను ఉప్పెనలా
సందర్భోచిత పరిష్కారాలను పెను తుఫానులా
దుష్టచతుష్టయాలను ఎదుర్కోవాలి ప్రభంజనంలా
అస్తవ్యస్త సమాజానికి కవిగా చేయూత నివ్వాలి ఎలా ?
--((*))--
32. నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
నా అన్వేషణ సాగిస్తున్నా
నా లోకాన్ని శాసిస్తున్నా
నా లోకం తీరు వేరనుకున్నా
నా తీరును నేను మార్చలేకున్నా
నా శత్రువుకి బుద్ధి చెపుతున్నా
నా మాట విలువ కాపాడుతున్నా
నా మంచిని నలుగురికి పంచుతున్నా
నా బుద్ధికి తగ్గ మైత్రిని కోరుతున్నా
నాలో శక్తిని ధార పోస్తున్నా
నా వ్యక్తిత్వం నాకు తొడన్నా
నా స్వేచ్చ నాకు బాటన్నా
నా ఆలోచన నాకు గమ్యమన్నా
ఏ ఆశ లేకుండా జీవిస్తున్నా
ఆశ్వీరదించమని అడుగు తున్నా
పల్లకి ఎక్కిన వారిని మోస్తున్నా
అభిప్రాయ భేదము లేదన్నా
నాలో మార్పుకు తప్పు నాదని చెప్పుతున్నా
నా లక్ష్యం తల్లి తండ్రులను పూజించాలన్నా
నా గమ్యం అనాధులను ఆదుకోవటమన్నా
నా ధ్యేయం తెలుగు భాషను బ్రతికించాలన్నా
స్త్రీ శక్తే నాకు తోడన్నా
దేశ సేవే నా భవితవ్యమన్నా
వాదాలు వ్యాధులు అసలు రావన్నా
మృత్యువంటే భయము లేదన్నా
సూర్యోదయం, చంద్రోదయం చూసున్నా
నవ్వి నవ్విస్తూ, ప్రేమను పంచి పొందు తున్నా
నన్ను నన్నుగా గుర్తించే వారిని ప్రేమిస్తున్నా
నా త్యాగం, నా ధైర్యం బ్రతికి బతికించటమన్నా
--((*))--
33. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
ముందు చూపు ఉండాలోయ్
వెలుగు రేఖ నీకన్నా ముందే వుండునోయ్
పూలు, ముళ్ళు నీకు అడ్డు రావోయ్
లక్ష్య సాధనకు ముందుకు సాగాలోయ్
కలలు కళ్ళలని తెలుసు కోవాలోయ్
కర్తవ్యం ఊపిరిగా మార్చు కోవాలోయ్
గుంట నక్కలను తరిమి కొట్టాలోయ్
గుండెను నిబ్బరంగా ఉంచ గలగాలోయ్
హితోక్తులు నమ్మి మనసు మార్చుకోకోయ్
నీ నమ్మక బలము నీకు తోడుంటుందోయ్
ఎప్పటికప్పుడు నీవు లెక్కలేసు కోవద్దోయ్
ఏరోజుకారోజు హాయి అని తృప్తిగా సాగాలోయ్
గుర్తింపు కోసం పాకులాడుడట ఎందుకోయ్
గుప్పెడు ఆకలి కోసం అబద్దాలాడుటెందుకోయ్
దారితప్పని బ్రతుకు ఆయుర్దాయము పెంచునోయ్
నిర్ణయం, తీర్పు నీదే వెన్ను చూపక వేగపడవోయ్
ఆశకు చిక్కక ఆశయ సాధనకు సాగాలోయ్
పాశానికి చిక్కక కరుణ చూపుతూ సాగాలోయ్
దిశా నిర్దేశం కాలాన్ని బట్టి అనుకరించాలోయ్
త్యాగం, ధర్మమ్, దానం, ప్రేమ నీఆయుధాలోయ్
--((*))--
34. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
మనం మనం ఒక్కటే
మన భావాలు ఒక్కటే
మన ఆశయాలు ఒక్కటే
గుణాన్ని బట్టి నడుచుకుందాం
ఆధునికంలో మారాలి మనం
అంతర భాష నేర్చాలి మనం
సులాభ మార్గమ్ చూడాలి మనం
శ్రమే మన ఆయుధం అని బ్రతుకుదాం
మారుతున్న కాలంతో మారుదాం
మనసు మనసు కలిపి తిరుగుదాం
మనమంతా ఒక్కటేనని చెప్పుదాం
ఎవరు ఎమన్నా స్నేహం మార్చం
వచ్చేది రోబో ల యుగం
తెబోతుంది మెమరీ కి గాయం
కళ్ళే కమ్పూటర్ అయ్యే వయనం
కాలం బట్టి చేసేది మన ప్రయాణం
--((*))--
35. నేటి కవిత (ద్విపద )
ప్రాంజలి ప్రభ
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ
ఉలిచేత ఆకృతి - ఊహ ఫలితం
నగిషీ నైపుణ్యం - బ్రతుకు జీవనం
చరిత్ర పదిలం - జీవన మాధుర్యం
నిత్య నిర్ణయం - మనో తరుణం
శిల్పం సజీవం - రాయి నిర్జీవం
చెక్కు పదిలం - మనసు వికలం
కళ కమనీయం - ఆచరణం దుర్లభం
మోసం సులభం - అధికారం కష్టం
సైన్య బలం - దేశ రక్షణ
వృత్తి బలం - జీవిత రక్షణ
మొండి బలం - బానిస రక్షణ
పురుష బలం - స్త్రీ రక్షణ
బానిస యుద్ధం - తిరుగుబాటు మకుటం
స్త్రీ యుద్ధం - గెలుపు మకుటం
పురుష యుద్ధం - కుటుంబ మకుటం
ఏలిక యుద్ధం - నమ్మక మకుటం
--((*))--
36. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
గగన సీమలో పగటి నక్షత్రం
మనసు తోటలో పరుగు ప్రభావం
ఒకరి మాయలో కలత ముభావం
పడచు వేటలో షరతు పతంగం
గడప దాటుటే పరువు ప్రయాణం
మోగలి రేకులే కుదిపె మృదంగం
తడిక మాటునే వయసు కళాపం
పలక భావమే పదును ప్రలాపం
చిటిక వేటులో చినికు చామరం
తెలుపు సున్నమే మమత ప్రభోధం
కడలి పొంగులే పిలుపు ప్రమోదం
--((*))--
37. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నీకోసం లొంగాననుకోకు,
నీకోసం తగ్గాననుకోకు
మౌఖికంగా ఉన్నాననుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
నీ తరుణంకు అడ్డనుకోకు
నీ నవ్వులకు చేదనుకోకు
నీ భాషలకు బంధం అనుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
నీ స్నేహముకు అడ్డుఅనుకోకు
నీ సేవకు సమయ మనుకోకు
నీ విద్యకు నేను అడ్డుఅనుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
నీ వయసుకు సరిపోననుకోకు
నీ మనసుకు పనికిరాననుకోకు
నీ సొగసుకు సరిగాననుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
--((*))--
38. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
కష్టం, నష్టం, ఇష్టం, గా అనుభవించు
భాధ, ప్రేమ, సుఖం, గా అనుభవించు
మంచి, చెడు, విధి, గా అనుభవించు
వాన వేడి చలి త్రృప్తి గా అనుభవించు
చీకటి రాత్రి వెన్నెల గా అనుభవించు
వెచ్చని మంచు దుప్పటి గా అనుభవించు
చల్లని వేడిని తనువు గా అనుభవించు
వర్షపు నీటిని ఒడుపు గా అనుభవించు
నిన్ను, నన్ను, మన్ను కలగా అనుభవించు
కన్ను, పన్ను, మిన్ను, కలగా అనుభవించు
ఒప్పు, తప్పు, ముప్పు, కలగా అనుభవించు
శక్తి, యుక్తి, ముక్తి, కలగా అనుభవించు
కాంతి, శాంతి, బ్రాంతి, కలగా అనుభవించు
మతి, గతి, సతి, ప్రాణం గా అనుభవించు
ఇఛ్ఛ, స్వేఛ్ఛ, కచ్చ, కలగా అనుభవించు
నవ్వు, కొవ్వు, లవ్వు ప్రాణం గా అనుభవించు
--((*))--
39. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నీకోసం లొంగాననుకోకు,
నీకోసం తగ్గాననుకోకు
మౌఖికంగా ఉన్నాననుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
నీ తరుణంకు అడ్డునుకోకు
నీ నవ్వులకు చేదనుకోకు
నీ భాషలకు బంధం అనుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
నీ స్నేహముకు అడ్డుఅనుకోకు
నీ సేవకు సమయ మనుకోకు
నీ విద్యకే నన్ను అడ్డుఅనుకోకు
ఇది నీ అభ్యుదయం కొరకే
--((*))--
40. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తేనె లొలుకు భాష - తేట తెల్లగా నుండు
లేత చిగురు ఆకు - తినగ తీపిగా ఉండు
లేత పెదవి రుచి - మధురాతి మధురంగావుండు
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు
మంచి మాట తలకెక్కదు - అది చేదుగ ఉండు
కొందరి మాట వినబుద్ది కాదు - అది కోపం తెస్తూ ఉండు
విలువైన మాట విడువరాదు - అది నిన్నే బ్రతికేస్తూ ఉండు
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు
వయసు ఉడుకు తప్పదు - మనసును త్రిప్పు చుండు
చదువు చదవక తప్పదు - అది నీకు దారి చూపు చుండు
పెళ్లి చేసుకోక తప్పదు - అది బుద్ధిని మారుస్తూ ఉండు
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు
పగటి వెలుగు మారదు - శ్రమించమను చుండు
రాత్రి వెన్నెల మారదు - విశ్రాంతికి దోహద పడుచుండు
తరువుల గాలి మారదు - ప్రాణులను బ్రతికిస్తూ ఉండు
మరవ బోకు, మారబోకు - ఆశకు చిక్కక ఉండు
--((*))--
41. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
చల్లగాలిలో, పిల్ల తెంపేర్ల మధ్య
జింకపిల్ల లాగా గెంతులేస్తూ
సెలయేటి నీటిలా నెమ్మదిగా కదుల్తు
వాలు జడలో మల్లెపూలు ఉంచి
ఉల్లి పొరలాంటి తెల్ల చీరకట్టి
చిరుజల్లుకు తడిచి నడుస్తూఉంటే
వంపు సొంపులతో వయ్యారాలు చూపి
హంస సోయగాలు చూపే నడకతో
ఉరకలు వేసే వాగులా యదపొంగులతో
ఎదురైతే
పెదాల కదలికతో, కళ్ళ చూపులతో
చిరుజల్లులో తన సౌందర్యమంతా
హావ బావ విన్యాసముతో నాట్యమాడుతూ
ఉన్న స్థితిని చూపి
నన్ను చూస్తే ఏకవికైనా తిమ్మిరెక్కదా
పేరుకు తగ్గ నెరజానను ఇలా తడుస్తూ ఉంటె
విశ్వవిజ్ఞానము తెలిసినా ఎదో పొందాలని లేదా
అన్న చూపుతో
కష్టాలకు నెలవను అనుకుంటున్నావా
సుఖాలకు నన్ను మించిన వారు లేరని తెలియదా
అంతులేని సంపదకు కారణము నేనే
తుఫాన్ వచ్చినా, బడబాగ్ని రగిలిన
నాలో కరుణ పొంగి కాపాడేది నేనే
జీవులకు పంట జీవనాధారమైతే
మన:శాంతికి జీవనాధారము నేనే
కూడు, గుడ్డ, గూడు ఆధారాన్ని నేనే
అభంశుభం తెలియని అమాయకురాలును నేనే
నన్ను నేను మరచిపోతా
నిత్యమూ సంగమానికి ఉరకలు వేస్తా
ఇంతకీ నేనెవరో తెలిసి పోయుంటుంది కదా
--((*))--
42. నేటి కవిత
రచయిత: మాలాప్రగడ రామకృష్ణ
మేము ఒక యంత్రము
విధ్యుత్ లేక నడిచే యంత్రము
అది మా మేధస్సు మంత్రము
మాకు తెలియదు తంత్రము
జీవితాన్ని కొదువ పెట్టిన బానిసలం
సమయాన్ని పాటించే వాళ్ళం
ప్రజా సంపదే మాకు నిలయం
వారికోసమే శ్రమిస్తాం ప్రతినిముషం
అర్ధం లోనే ఉంది జీవితం
అర్ధాన్ని అందించటంలోనే యుక్తం
రాజకీయానికి నలిగే పావులం
వత్తిడికి చిక్కే మూగ జీవులం
విత్తంలోనే ఉంది చిత్తం
చిత్తంగా పనిచేసే జీవం
శ్రమకు తగ్గ ప్రతిఫలం
అదియే జీవనాధారం
ఎప్పుడు చూపవద్దు జాలి
తక్కువచేసి చేయవద్దు ఎగతాళి
ఆడవద్దు మాతో వైకుంఠ పాళి
అందుకే ఉద్యోగానికి కడతాం తాళి
__((*))--
43. నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
సర్వజనులకు శాంతి
స్వస్తి సంపదలకు శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఇక ఉండదు బ్రాంతి
అందరిలో యుక్తి
అది పెంచును శక్తి
మన: శాంతికి భక్తి
ఇక వచ్చును ముక్తి
ఇరువురిలో మార్పు
మారుస్తుంది తీర్పు
తెప్పిస్తుంది ఓర్పు
అదేవారికి నేర్పు
ఉండాలి తృప్తి
ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఉండాలి సౌధమ్ము
సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రథమ్ము
సగము కమ్యూనిస్ట్
సగము కాపిటలిస్ట్
ఎందుకొచ్చిన రొస్టు
మాట్లాడుట వేష్టు
అరుణబింబము రీతి
అమర నేత నీతి
ఆరిపోవని జ్యోతి
తెచ్చును ఖ్యాతి
మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
సమయపాలన నచ్చు
ఉత్తేజిత యువత
తెచ్చును నవత
కవి తెల్పు కవిత
ఇరుకున మమత
--((*))--
44. నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నన్ను వదలి చెప్పాలి నీ గమ్యం యేదో
నీ ఆలోచనా నిజాన్ని తెలిపే తత్వం యేదో
తలపోసినవి యేమి సాగక వేదన యేదో
నిన్ను నీవు తెలుసుకో లేక పోతున్నావు నేస్తమా
సుఖము, ధుఖము, ఉన్నా ఇంకా యేదో
బంధము భారము, కాకపొయిన ఇంకా యేదో
అటు ఇటు యెటు, చూసిన దృష్టి దోషమేదో
చిరునవ్వు చూపక యేదో, చెప్తావు నేస్తమా
మురికితనం, గరుకుతనం, యెప్పట్నించి ఉందో
సుకుమారపు హ్రృదయానికి, గాయము యేదో
యెటు చూసిన ఆదరణకు నౌచుకోక యేదో
నిరాశ నిస్ప్రుహ నిన్ను వదలి వెళ్ళలేదు నేస్తమా
వ్యామోహానికి చిక్కినాను అను కుంటూ యేదో
దగాకోరుల లోకంలో ఉండలేక విశ్రాంతి యేదో
తలవంచి పోయిన, నిరుశ్చాహ పరచి యేదో
తెలుసుకో లేని మూర్ఖుడవుగా మారావు నేస్తమా
నీ నుండి సాధించాలని, ఏడ్పించాలని, యేదో
ఆశించాలని, నిద్రకూడా పోనీయ కుండా, యేదో
అడుగడుగు పొడచూపే కర్కశ లోకం యేదో
ఆశించినది చెప్పక, పొందక ఉన్నావు నేస్తమా
చేయకచేయక చేసి, యేమీరానివాడివై యేదో
యెవరి పనుల్లో వాళ్ళు, నిన్ను చూడక యేదో
సలహా ఇచ్చి సర్దుకు పోవటం నేర్చుకో యేదో
చేయాలని యేదోచేసి ఇబ్బందిపెట్టకు నేస్తమా
--((*))--
45. నేటి కవిత ప్రాంజలి ప్రభ
తొలి వలపు- తీపి కబురు
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
తరుణ తపణ తనువంతా ఆవహించి
తలచి తడిసి మనసంతా మరిపించి
తెరలు తొలగి వయసంతా వలపించి
తరచు తలుపు నళినంతా నటియించే
కలలు తలపు కలలంతా కనుపించి
కళల మెరుపు గెలుపంతా మెరిపించి
కణత కతలు కనులంతా కనిపెంచి
కులుకు వనకు కురులంతా కసిపెంచే
తెలుపు నలుపు కలుపంతా కుదిపించి
సొగసు వగరు వలపంతా మురిపించి
బిగువు సెగలు పొగలంతా విలపించి
మరులు గొలుపు మమతంతా ఆవలించే
సతత సమత సమభావం సమీపించి
సరళ సకల సుమభావం గుబాళించి
మరుల రుచులు సుఖభావం రుచియించి
సతియు పతియు తనుభావం తపియించే
--((*))--
46. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ
మన్షి దృష్టి కన్నీళ్ళు - నిల్పగల్గు
పృధ్వి భార నొప్పుళ్ళు - మాన్చగల్గు
నవ్వు వెల్గు దీపాళ్ళు - పెంచగల్గు
వచ్చి పోయె వేవిళ్ళు - నొప్పగల్గు
వెన్నె లిచ్చె రాత్రుళ్ళు - ఉంచగల్గు
మోన మాట చప్పుళ్ళు - పంచగల్గు
మంచి చెడు చూపుళ్ళు - పట్టగల్గు
విశ్వ మైత్రి మితృళ్ళు - పెంచగల్గు
ప్రేమ పంచె దోసిళ్ళు - ఒప్పగల్గు
సంద్ర హోరు పొంగుళ్ళు - ఆపగల్గు
చిన్న పెద్ద పుణ్యాళ్ళు - చెప్పగల్గు
అమ్మ లాలి పాలిళ్ళు - తూగగల్గు
నాన్న ప్రేమ ఉయాళ్ళు - మాపగల్గు
సూర్య కాంతి వెల్గుళ్ళు - చూడగల్గు
లోక బ్రాంతి తిర్గుళ్ళు - చెప్పగల్గు
ధనం, ధర్మం, ఓర్పు- ఏది మార్చగల్గు
--((*))--
47. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
Ramakrishna Mallapragada
సమస్య లనిన ఇష్టముందిరే వింత కలుగ
వయస్సు వలన కష్టముందిరే శాంతి కలుగ
సొగస్సు మనకు ప్రేమపెంచురే బ్రాంతి కలుగ
నమస్సు అనుట లోకమంతటే కాంతి కలుగ
పుణ్యముల్ చాలా చేసితి సత్సంతానము కలుగ
బాధ్యతల్ మాయా మోహము సత్యాన్వేషము కలుగ
సామాన్యుల్ ప్రేమా భావము నిత్యాన్వేషము కలుగ
సమస్యల్ తీర్పే ఇష్టము సంతృప్తి పర కలుగ
దైవమ్ము నన్నూ ఆడించిన మది శాంతి కలుగ
ప్రేమమ్ము నన్నూ శోధించిన మది బ్రాంతి తొలగ
కాలమ్ము నన్నూ వేధించిన మది క్రాంతి కలుగ
సామ రస్యమే ఇష్టముగ మనో వింత కలుగ
ప్రారబ్ధ భావం మదించిన ఏనుగు వలే కలుగ
సోకాబ్ధ భావం మదించిన సింగము వలే కలుగ
పెమాబ్ద భావం మదించిన ప్రేయసి వలే కలుగ
సమస్యే జపించి తీర్పు చెప్పుట వింత కలుగ
--((*))--
48. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
మది పులకించును నీ నామము విన్నా
మది తపియించును నీ గానము విన్నా
మది చలియించును నీ భాష్యము విన్నా
మది ఉడికించును నీ కావ్యము విన్నా
ఇది యని చెప్పను నీ మాటను విన్నా
బ్రమ అని ఒప్పను నీ సూక్తులు విన్నా
చిరు నగు మౌముయె నీ పల్కులు విన్నా
నవ విధ భావము నీ మాయను విన్నా
శుభకల కల్గును నీ ధైర్యము విన్నా
పరిణత చెందును నీ జ్ఞానము విన్నా
తరుణము మోక్షము నీ విజ్ఞత విన్నా
సిరియును పెంచును నీ ప్రేమయు ఉన్నా
కరుణయు కల్గును నీ శ్లోకము విన్నా
నయనము వన్కును నీ సేవలు విన్నా
తలవగ ఉండను నీ దానము విన్నా
జయజయ శ్రీరమ నీ వల్లభ సేవా
--((*))--
49. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
Ramakrishna Mallapragada
అందాలసుందరి చెరువుగట్టు మీద వాలుచూపుతో
ఉండగా పకృతి ఆనందాన్ని కల్పించగా నామనసుకు
తట్టిన కవిత
మల్లెల మాలను కురులలో ఉంచి ఉన్నా
పర్కిని పావడ మెరుపుతో వేచి ఉన్నా
చిక్కని చూపును తలచుతూ కాగి ఉన్నా
కణ్యను మౌనపు తలపుతో చల్ల గున్నా
చిరు నగవుల చిందులకు దగ్గర కున్నా
లత తరువుల తాపముకు అక్కర గున్నా
నవ తలపుకు కాలముకు కట్టడి ఉన్నా
మగ బిగువుకు ఆశయయు కల్గియు ఉన్నా
పాదాల పారాణి పడతికి వన్నె తెచ్చే
వాల్చూపు మాగాణి మగనికి వన్నె తెచ్చే
కూర్చున్న తీరేను తనువుకు వన్నె తెచ్చే
ఓర్పుతొ ఉన్నాను పుడమికి వన్నె తెచ్చే
మనసును దోచి మనువాడే మగాడేడి
మగవను చూసి మనసిచ్చే మగాడేడి
మధువును త్రాగి వయసిచ్చే మగాడేడి
తరుణము చూచి వలపిచ్చే మగాడేడి
--((*))--
50. నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
లోపల గడియ లేదు
- మనసు విప్పి చెప్పలేదు
మమత పంచుటకు వీలు లేదు
- వయసు పొంగును ఆపలేదు
తలుపు తెరచి తెలప లేదు
కూని రాగాలతో పవళించి లేదు
పెదవి విప్పి అందించ లేదు
తనువు తపన తీర్చుకోలేదు
నీ చిత్రాన్ని చుస్తే అక్షరం
కదులట లేదంటే అతిశయోక్తి కాదు
అంత గడుసుతనం తో నన్ను
ఉడికించటం ఏమాత్రం న్యాయం కాదు
అల్ల కల్లోలమవుతుది నామనసు
చల్లగా కల్వకుండా ఉండుట న్యాయం కాదు
ఆమె మనసు మారి గదితలపు
తెరవకుండా ప్రశ్నించుట న్యాయం కాదు
--((*))--
51. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
తెల్సునా అంటూ సాగుతున్న కవిత్వము చదవండి
కను గొను సౌఖ్యము - కమలుజు కైన తెల్పునా
విన దగు భాష్యము - విమలుజు కైన తెల్పునా
కన బడు సోధ్యము - మనుజుల కైన తెల్పునా
కల గను చిత్రము - నిలకడ కైన తెల్పునా
తెలిసిన ధర్మము - తనయుడు కైన తెల్పునా
తెలపని మర్మము - తనసతి కైన తెల్పునా
రచయత కావ్యము - ధనపతి కైన తెల్సునా
కలియుగ శ్రావ్యము - మధుపతి కైన తెల్సునా
తినదగు భోజ్యము - తరుణము కైన తెల్సునా
తెలిసిన తత్వము - అనుపమ కైన తెల్సునా
ముగిసిన క్రోధము - తలచుట కైన తెల్సునా
ఎగసిన మౌడ్యము - మనసున కైన తెల్సునా
తనువున తాప్యము - మగసిరి కైన తెల్సునా
పెరిగిన సౌఠ్యము - అలకలు కైన తెల్సునా
కలిగిన శైత్యము - సమయము కైన తెల్సున
అవసర శృంగము - మమతకు కైన తెల్సునా
నిలకడ ధ్యానము - తరువుకు కైన తెల్సునా
మగువకు డెందము - నిజమున కైన తెల్సునా
మదనుని కామ్యము - మధుమతి కైన తెల్సునా
మగనికి జాత్యము - అణుకువ కైన తెల్సునా
--((*))--
నేటి కవిత - కృష్ణ తత్త్వం
ప్రాంజలి ప్రభ
రచయత: మాలాప్రగడ రామకృష్ణ
ఏలరా నన్నేల రా ని మీదే మనసు లే కృష్ణా
అక్కడా నీవు నెనిక్కడా నీ కరుణ లే కృఫ్ణా
నిప్పులా నేను ని చల్లనీ దీవెనలు లే క్రృఫ్ణా
తప్పులే నేను చెసాను లే నీతపము లే క్రృష్ణా
గానమే చేసి మనస్సుతో నీనిలయ మే క్రృష్ణా
కల్లొలా లే కలలల్లొ సేవా తరుణ మే కృష్ణా
పూజలే నీ చరణాల కే పుష్పము లే కృష్ణా
కాలమే నీదయ చూపు కే ఉన్నదియు లే కృష్ణా
మానవత్వం మమతాను రాగాల మనసే కృష్ణా
భావతత్వం సమతాను వాదాల వయసే కృష్ణా
సేవతత్త్వం సమయాను పాఠాల తలపే కృష్ణా
ప్రేమతత్వం నినునన్ను కల్పేటి తనువే కృష్ణా
వెన్న దొంగే అనియన్న వారి జపములే కృష్ణా
కన్న ప్రేమే తపమన్న వారి తపములే కృష్ణా
అన్న ప్రేమే కలిసున్న వారి కళయులే కృష్ణా
అమ్మమాటే నిజమన్న వారి మనసులో కృష్ణా
--((*))--
52. నేటి కవిత నేటి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పరువం పదిలంగ గాలికి కదలి
చూపులన్నీ తరుణం తో కదలి
కురులు దొన్నె దొన్నెలు గా కదలి
సౌకుమార్యం తో మనసు కదలి
కుచ కుంభముల పట్టు కదలి
అధరంబులు అదిరి కదిలి
విధిశివాదులొచ్చి కదిలి
కిరీటకోటి కాంతులు కదలి
ఇంద్రుని వేయి కళ్ళు కదలి
తరువుల శాఖలు కదలి
వజ్రవైడూర్య వెలుగు కదలి
కర్పూరం భగ్గుమని కదలి
నింగి మేఘాలు అన్నీ కదలి
చకోర పక్షుల గుంపు కదలి
పృథ్వి పులక రింపు కదలి
పుప్పెడి రేణువులు కదలి
కదలి కదలి సౌందర్యానికి కదలి
రెప్ప వాల్చక నా మనసు కదలి
తుషార బిందువులు చుట్టూ కదలి
చెక్రకేళీలు ఒక్కొక్కటి కదలి
తన్మయత్వ ఆకర్ష చుట్టూ కదలే
చర్మ చక్షువులు గల ఇంద్రుడే చలించే
క్రృఫ్ణపరమాత్మ స్త్రీ సౌందర్యానికి చలించే
దుర్యోధనుడు ఒక స్త్రీ నవ్వుకే చలించే
మానవుడు స్త్రీ చిత్రానికే మది బ్రమించే
కదలలేను మెదలలేను నీ కనుచూపుకు
నామనసు చెదిరే నీ హృదయస్పందనకు
గాలికదలక చాసె నీ పయ్యద రెపరెపలకు
వజ్ర పగడాల మెరుపులు తాకె పెదవులకు
నుదుటపై గంగ శింధూరపు చినుకు థలుకు థలుకు
వలువలపై నక్షత్రాల మెరుపుల మినకు మినుకు
మేనుపై హరివిల్లు వర్ణాల కలగలిపి యేక జిలుకు
కురుల సవ్వడితో చెవి కమ్ములు కులుకే కలుకు
--((*))--
53. నేటి గీతం
ప్రాంజలి ప్రభ
లక్ లుక్ లవ్ లో ఉంది
కిక్ చెక్ లవ్ లో ఉంది
గమ్ గేమ్ లవ్ లో ఉంది
జిల్ త్రిల్ లవ్ లో ఉంది
అన్నీ ఉండాలి
ఆదుకునే మనసూ ఉండాలి
అలకా ఉండాలి
ఆదరించే గుణము ఉండాలి
అవునా
సరదా ఉండాలి
సర్దుకు పోయే మనసూ ఉండాలి
ఆకలి ఉండాలి
ఆకలి తీర్చే గుణము ఉండాలి
అవునూ
ఆరాటం ఉండాలి
ఆరాటాన్ని తీర్చే మనసూ ఉండాలి
పోరాటం ఉండాలి
పోరాటాన్ని మార్చే గుణము ఉండాలి
అవునా
నవ్వులు ఉండాలి
నవ్వి నవ్వించే మనసూ ఉండాలి
ప్రేమయు ఉండాలి
ప్రేమించి ప్రేమను పంచే గుణము ఉండాలి
అవునూ
సేవలు ఉండాలి
సహనంతో సేవించే మనసు ఉండాలి
పెద్దలు ఉండాలి
పెద్దలను ప్రేమించే గుణము ఉండాలి
--((*))--
54. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
చల్లనమ్మ పలుకులెపుడు సంతసమ్ము గొలుపు
తల్లులమ్మ తలపు లెపుడు మానసమ్ము గొలుపు
కళ్లలమ్మ కళలు లెపుడు సమయమ్ము గొలుపు
కల్లులమ్మ మెరుపు లెపుడు ఆశయమ్ము గొలుపు
మల్లెపూలమ్మ నవ్వు గూడ మదికి హాయి గొలుపు
పున్నమీరెమ్మ పువ్వు గూడ జగతి హాయి గొలుపు
కన్నెమౌనమ్ము నవ్వు గూడ మనసు హాయి గొలుపు
కోర్కసౌధమ్ము పువ్వు గుడా మమత హాయి గొలుపు
పల్లెటూరమ్మ పడతి కైన పలుకు తీపి గొలుపు
కళ్ళులేనమ్మ మగువ కైన నడక తీపి గొలుపు
వళ్ళులేనమ్మ గడకు ఐన మడత తీపి గొలుపు
కుళ్ళులేనమ్మ గుడికి కైన మమత తీపి గొలుపు
--((*))--
ఇదీ ఒక సాహిత్యములే
pranjali prabha
Mallapragada Ramakrishana
55. ఆలింగనముతో కలియును కరములు కరములు
అధరంబులు కలవగా జిహ్వ జిహ్వ
నగ్న తనువులు జూచు చూడ్కులు చూడ్కులు
పాల గ్లాస అందించి మొక్కు శిరము శిరము
పుష్పమాలికలు నాకర్షించు వీనులు వీనులు
తనువుల తాపముతో మనము మనము
ఒకరికొకరు నవ్వుల పదములు పదములు
ప్రణయసాంబ్రాజ్మంలో ఒకరిపై ఒకరి బుద్ది బుద్ది
ప్రేమ లొలకములో మునిగి దినము దినము
చదవక శృగార సాహత్యము చదువు చదువు
ఒకరిని మించిన వారుగా ఎవరికి వారే గురువు గురువు
శృంగార సాహిత్యములో తృప్తి పొందే తల్లి తల్లి
తల్లి తండ్రులు బ్రోచు తనయుండు తనయుండు
నిత్య తరుణి బాధలు భరించే ధరణి ధరణి
పర కాంత కోరని పురుషుండు పురుషుండు
అణువణువమున సహకరించే విద్య విద్య
ప్రేమ పదిలం కొరకు జరుపు వ్రతము వ్రతము
ప్రజలకు నచ్చ జెప్పెడి పాటి పాటి
పగయే లేకుండా బ్రతికిన బ్రతుకు బ్రతుకు
కోప తాపముల్ వచ్చిన చితుకు చితుకు
పోయిన చోటే వెతుకు దొరుకు దొరుకు
నవ్విన చోటే ఓర్పువుంటే మెచ్చు మెచ్చు
ఆశ ఉన్న చోటే తగ్గును ఆకలి ఆకలి
ఆకలి ఉన్న మంచి తిండి దొరకదు దొరకదు
సంపాదనలో సంతృప్తి పరిచే తండ్రి తండ్రి
వయసు పెరిగేకొద్ది పెరుగు వాత్సల్యము వాత్సల్యము
వృద్దాప్యములో వచ్చు చత్వారము చత్వారము
ఒకరిపై ఒక్కరికి ప్రేమతో సద్భావం సద్భావం
--((*))--
56. నేటి కవిత
ప్రాంజలి ప్రభ - జాబిల్లి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అళ్ళి బిళ్ళి మబ్బుల మధ్య జాబిళ్ళి
అధరామ్రుతాన్ని అందించుటకు ఉంది మళ్ళి
అనురాగ ప్రేమను పొందాలి మళ్ళి మల్లీ
ఈ కలువ అందాలు చూస్తూ వెళ్ళి
ఊరక ఎలా ఉండ గలవు జాబిళ్ళి
పున్నాగ పువ్వుతో సన్నాయి పాడాలి మళ్ళి మల్లీ
సంప్పెంగ నవ్వులకే దూరం నుండి తుళ్ళి
కలవర పడకు స్వాగతం పలుకుతుంది ఈ మళ్ళి
రేయి అంతా నాతొ గడపాలి మళ్ళి మల్లీ
రగిలిన నా మనసులో చేరి చేయకు లొళ్ళి
రసమైన రాస లీలలు జరిపి తిను పళ్ళి
కళలెన్నో చూపాలి నాకు మళ్ళి మల్లీ
కనుగొంటి నయనంధకార జళ్ళి
ప్రేమ రస ఘంధముతో తుళ్ళి
వయసు ఉరకలు వేసె మళ్ళి మల్లీ
కళ్ళు తెరిచి ఇది కలని గుర్తించే మళ్ళి
తొంగి చూడగా వుంది కనుచూపు మేరలో జాబిళ్ళి
--((*))--
57. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
చెంత లేనీ కలువంతా కలిమీ - నిను కలప జాల
సొంత ఆలీ తపనంతా కడలీ - నిను తడప జాల
వింత సోదీ విధినంతా వదలీ - నిను వదల జాల
వంత మాటే కలలంతా కలిగీ - నిను కలల జాల
పంత మేమీ లెనిదంతా మునిగీ - నిను మునగ జాల
అంత మేమీ లెనిదంతా అడిగీ - నిను అడుగ జాల
జెంత చేరీ లెనిదంతా కడిగీ - నిను కడుగ జాల
యెంత ఏదీ యదనంతా ఎదిగీ - నిను యాదగా జాల
ఎంత రానీ మనసంతా చెడనీ - నిను విడువ జాల
కొంత పోనీ వయసంతా మురలీ - నిను మరువ జాల
కాంత హానీ కలుకొంతా తరలీ - నిను కలువ జాల
శాంత పోనీ తనువంతా చెలిమీ - నిను తలప జాల
--((*))--
58
నేటి కవిత (మరల్చలేరు)
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామక్రష్ణ
బిడ్డల మనస్ తత్వం
పెద్దల ఆశయ్ తత్వం
గుర్వుల బోధన్ తత్వం
ఎవ్వరు మరల్చ లేరు
నాయకత్వ దాత్రృత్వం
మానసోన్న తాతత్వం
సాంప్రదాయ భావత్వం
సంస్కృతిని మరల్చలేరు
తల్లి తండ్రుల బాధ్యత
కఫ్ట నష్టము ఆశయ
విద్య బోధ భవాలయ
వాస్తవాన్ని మరల్చ లేరు
ఓర్పు సహాయం సహకారం
నేర్పు సహనం సమభావం
ప్రేమ అనుబంధ సరాగం
స్త్రీ ల ప్రభవం మరల్చలేరు
--((*))--
59. నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ
సూర్యుడు లేకుండా
లోకాన్ని చూడ గలను
చంద్రుడు లేకుండా
గగనాన్ని చూడగలను
సముద్రుడు లేకుండా
లవణాన్ని చేయ గలను
భూమి, అమ్మే, లేకుండా
బ్రతక లేనని చెప్పగలను
తల్లి తండ్రులే లేకుండా
జీవితమనేది లేదని చెప్పగలను
పిల్లల ప్రేమ పొందకుండా
తల్లి తండ్రులే లేరని చెప్పగలను
కాలానికి ఎదురీద కుండా
ఎవ్వరు బ్రతకలేరని చెప్పగలను
నవ్వించి ఏడ్పించ కుండా
సంసారమనేది లేదని చెప్పగలను
కూడు, గూడు, గుడ్డ, లేకుండా
భూలోకంలో బ్రతకలేరని చెప్పగలను
ఎండ, వాన, చలి, లేకుండా
మానవులు జీవించ లేరని చెప్పలను
ప్రేమ, ఓర్పు, ధైరం లేకుండా
సంసారము నిలబడదని చెప్పగలను
గాలి, వెలుగు,చీకటి, లేకుండా
లోకమనేది ఎక్కడాలేదని చెప్పగలను
విద్యాభ్యాసము పొందకుండా
ఎవ్వరూ మేధావి కాలేరని చెప్పగలను
ప్రతి పనిలో తృప్తి పడకుండా
ప్రాణి అనేది ఏది లేదని చెప్పగలను
మార్పు, ఓర్పు, నేర్పు లేకుండా
ఉద్యోగము ఏదీ లేదని చెప్పఁ గలను
మంచి, చెడు, మమత లేకుండా
ఆశ పాశము అస్థిరమని చెప్పగలను
--((*))--
Comments
Post a Comment