Posts

Showing posts from June, 2018

భావ రస మంజరి

Image
--((**))-- --((**))-- నేటి కవిత -9-ప్రాంజలి ప్రభ  భావ రసమంజరి రచయత : మల్లాప్రగడ రామకృష్ణ   అతిస్వేచ్ఛ ఇవ్వటం  అది ఒక క్షణికానందం  పర్యవసానం మొండి ధైర్యం ఎదురు తిరిగిన వైనం   పెద్దలకు మాటరాని మౌనం  ధర్మమే ఆరో ప్రాణం          స్నేహమే మరో ప్రాణం  ప్రకృతే నిత్య పాణం  పోరాటమే యవ్వనం  కాలమే గమన మౌనం  అతి ప్రేమ చూపటం ములగ చెట్టు ఎక్కించటం  విశ్వాసం పెంచటం    వినోదంగా మారటం   నోరు విప్పలేక మౌనం తెలివిగా పసిగట్టి ప్రవర్తించటం  భాషా చాతుర్యంతో మెప్పించటం  అతిప్రేమ చూపక జాగర్త పడటం తృప్తి సంతృప్తి మధ్య సాగాలి జీవం  --((**))--  నేటి కవిత- 8-ప్రాంజలి ప్రభ   భావ రసమంజరి  రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  పోనీ, పోనీ,  దేహం ఎటుపోతే నాకేం  పొతే, పోనీ,  నన్ను వదిలి పొతే నాకేం  రానీ, రానీ,  కష్టాల్, నష్టాల్  నాకేం  వస్తే రానీ  భూకంపాల్, పెనుతుఫాన్ నాకేం  కష్టాల్, న...

నేటికవిత-2

Image
నేటి కవిత: ప్రాంజలి ప్రభ    ఔషధం రచయత:మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ  నవ్వి నరక యాతన చూపిన బాధకు    తవ్వి ఆలోచించగా తప్పు నాదే అనకు  కొవ్వుతో అవివేకం కూడా తోడైంది నాకు అందుకే మార్పుకు ఇవ్వవా ఏదైనా ఔషధం  మనో సంకల్పానికి ప్రశ్నగా అడ్డు  మది ఇంద్రియాల ప్రోస్చాహానికి అడ్డు  మరులుగోల్పే ఊహల ఫలానికి అడ్డు  అడ్డు తొలగించుటకు ఏదైనా కావాలి ఔషధం  ఎన్ని సార్లు తల కొట్టుకున్ననో  ఎన్నో సార్లు బాధ తెల్పలేకున్నానో  ఏ నొప్పిని చెప్పలేక దిగ మింగానో     అంగి కారానికి ఇవ్వాలి ఏదైనా ఔషధం  ఉపదృవ భావనల అనియంత్రణకు   ఉవ్విలూరే రక్త నాళాల కంపనలకు    ఉత్తిత్తి నిష్ప్రయోజనాల అలోచనలకు  దోషవిముక్తుడ్ని చేసేటి ఏదైనా ఔషధం   దేశ అరాచకాన్ని అదుపుచేయలేక   చేయగల శక్తి ఉన్న నేను చేయలేక తోడు ద్వేషించిణ ఒంటరిగా ఉండలేక  వేడుకుంటా ఉపశమనం కోసం ఔషధం     --((**))-- నేటికవిత అందమనే ఉచ్చుకు చిక్కి పున్నమి తళుకులు చిక్కి వెన్నెల జిలుగులు చిక్...

భజగోవిందం*PNT

భజ గోవిందం వివరణ (1-15 శ్లోకాలు)  1. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే |  సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఙ్కరణే ||  "గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా"  2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం |  యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం ||  "ఓ మూఢుడా ! ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు."  3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం|  ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం ||  వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్...

**** చరవాణి స్తోత్రమ్ ****

శ్లో === యస్మిన్ దేశే నా సంమానో నా ప్రితిర్ణ చ బాన్ధవాః | నా విద్యా నాస్తి ధనికోన తత్ర దివసం వసేట్ || భావము === గౌరవము, ప్రేమ, బంధువులు, విద్య ధనవంతులు లేనిచోట ఒక్కదినమై నను ఉండరాదు. --((**))-- శ్లో === పుస్తకేషు చ యా విద్యా పరహస్తే చ యుద్దనం | సమఎన పరిప్రాప్తే నషావిద్యా న తద్దనం || భావము === పుస్తకమందలి విద్యయు, ఒకరివద్ద దాచిన ధనము, సమయము నాకు పనికిరావు. కాబట్టి చదువు కంటస్తము చేయాలి. ధనుము ఎల్లప్పుడూ దగ్గర ఉండాలి . --((**))-- శ్లో === కోకిలానాం స్వరోరూపం పాతివ్రత్యం తు యోషితాం  విధ్యారూ పం విరూపాణం క్షమా రూపం తపస్వినాం || భావము === కోకిలకు దాని స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము. రూపము లేని అందవిహినులకు విద్యయే రూపము, తపస్సు చేసే వారికి ఆర్పే రూపము. --((**))-- శ్లో === రూప యౌవన సంపన్నా విశుద్ధ కుల సంభావాః | విద్యా హినా నా శోభన్తే నిర్గందా ఇవ కిం శుకాః \\ భావము === రూప లావణ్య యవ్వనము లెంత యున్ననూ,,ఎంత మంచి వంశములో పుట్టినను. విద్యలేనివారు, వాసన లేని మోదుగ పూవు వలె ప్రకాశింప రు. --((**))-- శ్లో === స్త్రినాం ద్విగుణ ఆహారో బుద్ధి శ్చాపి చతుర్గుణా ...