**** చరవాణి స్తోత్రమ్ ****
శ్లో === యస్మిన్ దేశే నా సంమానో నా ప్రితిర్ణ చ బాన్ధవాః |
నా విద్యా నాస్తి ధనికోన తత్ర దివసం వసేట్ ||
భావము === గౌరవము, ప్రేమ, బంధువులు, విద్య ధనవంతులు లేనిచోట ఒక్కదినమై నను ఉండరాదు.
--((**))--
శ్లో === పుస్తకేషు చ యా విద్యా పరహస్తే చ యుద్దనం |
సమఎన పరిప్రాప్తే నషావిద్యా న తద్దనం ||
భావము === పుస్తకమందలి విద్యయు, ఒకరివద్ద దాచిన ధనము, సమయము నాకు పనికిరావు. కాబట్టి చదువు కంటస్తము చేయాలి. ధనుము ఎల్లప్పుడూ దగ్గర ఉండాలి .
--((**))--
శ్లో === కోకిలానాం స్వరోరూపం పాతివ్రత్యం తు యోషితాం
విధ్యారూ పం విరూపాణం క్షమా రూపం తపస్వినాం ||
భావము === కోకిలకు దాని స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము. రూపము లేని అందవిహినులకు విద్యయే రూపము, తపస్సు చేసే వారికి ఆర్పే రూపము.
--((**))--
శ్లో === రూప యౌవన సంపన్నా విశుద్ధ కుల సంభావాః |
విద్యా హినా నా శోభన్తే నిర్గందా ఇవ కిం శుకాః \\
భావము === రూప లావణ్య యవ్వనము లెంత యున్ననూ,,ఎంత మంచి వంశములో పుట్టినను. విద్యలేనివారు, వాసన లేని మోదుగ పూవు వలె ప్రకాశింప రు.
--((**))--
శ్లో === స్త్రినాం ద్విగుణ ఆహారో బుద్ధి శ్చాపి చతుర్గుణా |
సాహసం షడ్గుణం చైవ కామో ష్టగుణ ఉచ్యతే ||
భావము === మగవారికంటే స్త్రీలకు ఆహారము రెండు రెట్లు, బుడ్డి నాలుగు రెట్లు, సాహనము ఆరురెట్లు, కోరికలు ఎనిమిది రెట్లు ఉండును.
--((**))--
శ్లో === వివాద శీలం స్వయమర్ధ చోరిణిమ్ |
పరాను కూలాం పరిహాస భాషిణి మ్ ||
అగ్రాశినీ మాన్య గ్రుహప్రవెశినీమ్ |
త్యజస్తూ భార్యాం దశ పుత్ర మాతరం ||
భావము === కలహించు స్వభావము గలదియు, తన ఇంటి సొమ్మునే అపహరించు నదియు, పేర్లకు అనుకులమైనదియు, పరిహాసముగా మాట్లాడునదియు, మగని కలతే ముందుగా భోజనం చేయునదియు. తరచుగా మాటిమాటికి ఇరుగు పొరుగు ఇండ్లకు పోవునదియు. ఇట్టి స్వాభావము గల భార్య పరిమంది పిల్లల తల్లీ అయిననూ విడిచి పెట్టవలెను.
--((**))--
హతం జ్ఞానం క్రియాహీనం హతా స్త్వజ్ఞానతః క్రియా
అపశ్య న్నంధకోదగ్ధ: పస్యన్నపి చ పంగుకః
ఆచరణలేని జ్ఞానమున్నూ, జ్ఞానములేని క్రియలున్నూ,కూడా నిరుపయోగములై నశించును.
నడవలేని కుంటివాడును, చూడలేని గ్రుడ్డి వాడున్ను, వున్నా యిల్లు తగలబడినచో
చూచుకునే కుంటివాడునూ, నడవగలిగియు గ్రుడ్డివాడునూ నశింతురుగదా.
--((**))--
తథా సత్సన్నిధానేన మూర్ఖో యాతి ప్రవీణతా౦
గాజురాయి బంగారుతో పొదగబడి మరకతకాంతులు వెదజల్లుతుంది. అట్లే మూర్ఖుడు కూడా పండితుని సహవాసము వలన తేజోవంతుడవుచున్నాడు.
--((**))--
--((**))--
వేదమూలమిదం జ్ఞానం
భార్యామూల మిదం గృహం
కృషిమూలమిదం ధాన్యం
ధనమూలమిదంజగత్
భార్యామూల మిదం గృహం
కృషిమూలమిదం ధాన్యం
ధనమూలమిదంజగత్
మణిర్లుఠంతి పాదాగ్రే
కాచ: శిరిశి ధార్యతే !
క్రయ విక్రయ వేలాయాం
కాచ: కాచో మణిర్మణి !!
మణిని పాదాగ్రమందు, గాజు వస్తువు శిరస్సు నందు ధరించినా అమ్మకాలు, కొనుగోళ్ళ సమయాల్లో వాటి విలువలు బయట పడతాయి. గాజు గాజే, మణి మణియే.
కాచ: శిరిశి ధార్యతే !
క్రయ విక్రయ వేలాయాం
కాచ: కాచో మణిర్మణి !!
మణిని పాదాగ్రమందు, గాజు వస్తువు శిరస్సు నందు ధరించినా అమ్మకాలు, కొనుగోళ్ళ సమయాల్లో వాటి విలువలు బయట పడతాయి. గాజు గాజే, మణి మణియే.
--((**))--
శ్రీరామా యని వేడ నీయవుగదా! చింతన్ మది౦ జొన్పి, యే
తీరైనన్ బహుమార్గవర్తి వగుచున్ ధీరత్వమున్ ద్రోచియున్,
దారిద్ర్యాధిక రూపమై నిలుచు నీ దాక్షిణ్య మేమో గదే
యేరీ నీ సరి వేల్పు లీ జగమున౦దేమందు ప్రారబ్దమా!
.చింతను మదిలో నింపి శ్రీరామా యని వేడనీయవు, నీవు బహుమార్గాలలో తిరుగుతుంటావు, ధీరత్వమును అపహరించి దారిద్ర రూపముగా నిలుస్తావు నీ దాక్షి ణ్యమేమో గదా! లోకములో నీ సరి దేవతలే లేరు నేనేమి చేయుదునే ప్రారబ్దమా! (ప్రారబ్దం అనేది ఎలా మనిషిని ఆడిస్తుందో చెప్తున్నాడీ కవి
--((**))--
ఏదేశంబున కేగుదెంచిన వడిన్నేతెంతు వెన్వెంటనే
యే దైవంబును గొల్వ బోయిన నీవే యందు గాన్పింతు స
ర్వాదాయంబులు చెందనీయవు భళీ!వాంఛించి వేధించేదౌ
నీ దాక్షిణ్య విహీనతం దలఁప నెంతే వింత ప్రారబ్దమా!
ర్వాదాయంబులు చెందనీయవు భళీ!వాంఛించి వేధించేదౌ
నీ దాక్షిణ్య విహీనతం దలఁప నెంతే వింత ప్రారబ్దమా!
ఏదేశానికి వెళ్లినా నా వెంటే వేగంగా వస్తావు, యేదైవంబును కొలుస్తామనినా అక్కడా నీవే యుండి దైవమును కొలువనీవు. ఆదాయము రానీయకుండా అడ్డు పడుతుంటావు.నీ దయలేని తనాన్ని తలిచిన వింతనిపించును.(ప్రారబ్దం అనేది ఎలా మనిషిని ఆడిస్తుందో చెప్తున్నాడీ కవి )
(దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటుపద్య రత్నాకరం నుండి సేకరణ)
--((**))--
Comments
Post a Comment