నేటికవిత-2
నేటి కవిత: ప్రాంజలి ప్రభ
ఔషధం
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నవ్వి నరక యాతన చూపిన బాధకు
తవ్వి ఆలోచించగా తప్పు నాదే అనకు
కొవ్వుతో అవివేకం కూడా తోడైంది నాకు
అందుకే మార్పుకు ఇవ్వవా ఏదైనా ఔషధం
మనో సంకల్పానికి ప్రశ్నగా అడ్డు
మది ఇంద్రియాల ప్రోస్చాహానికి అడ్డు
మరులుగోల్పే ఊహల ఫలానికి అడ్డు
అడ్డు తొలగించుటకు ఏదైనా కావాలి ఔషధం
ఎన్ని సార్లు తల కొట్టుకున్ననో
ఎన్నో సార్లు బాధ తెల్పలేకున్నానో
ఏ నొప్పిని చెప్పలేక దిగ మింగానో
అంగి కారానికి ఇవ్వాలి ఏదైనా ఔషధం
ఉపదృవ భావనల అనియంత్రణకు
ఉవ్విలూరే రక్త నాళాల కంపనలకు
ఉత్తిత్తి నిష్ప్రయోజనాల అలోచనలకు
దోషవిముక్తుడ్ని చేసేటి ఏదైనా ఔషధం
దేశ అరాచకాన్ని అదుపుచేయలేక
చేయగల శక్తి ఉన్న నేను చేయలేక
తోడు ద్వేషించిణ ఒంటరిగా ఉండలేక
వేడుకుంటా ఉపశమనం కోసం ఔషధం
--((**))--
నేటికవిత
అందమనే ఉచ్చుకు చిక్కి
పున్నమి తళుకులు చిక్కి
వెన్నెల జిలుగులు చిక్కి
మలయ మారుతానికి చిక్కి
చల్లని మనసుకు చిక్కి
ఈ దివిలో పకృతికి చిక్కి
భువికి చేరాలని ఆశకు చిక్కి
నింగిన వున్న జాబిలమ్మకు చిక్కి
నేలపై ఉన్న స్త్రీ మనసుకు చిక్కి
తెలుసుకున్న స్వర్గ సుఖాలకు చిక్కి
ముచ్చటైన ముళ్ళ మనసుకి చిక్కి
ఇష్టమైన వళ్ళు ముళ్ళకు చిక్కి
తుచ్చమైన వాళ్ళు ముళ్ళకు చిక్కి
అల్పుడు ప్రేమ అయ్యోమయానికి చిక్కి
అధముడి ప్రేమ, గందర గోలానికి చిక్కి
సామాన్యుడి ప్రేమ, తేజోమయానికి చిక్కి
తెలివి ఒకరి సొత్తు కాదు కలిమికి చిక్కి
చెలిమి ప్రేమిస్తూ మనస్సు వలకు చిక్కి
బలిమి అహంకార మడానికి చిక్కి
అజేయుడి ప్రేమ, అజరామరంగా చిక్కే
--((**))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఒంటరితనం కడు భయంకరం
జంటగా మారితేనే సుఖ జీవనం
సంగీతం ఒక ఔపోసనం
సప్తస్వరాలు కలిస్తేనే సంగీతం
వేగంగా నింగి నుండే జారుతుంది వర్షం
నదిగా మారి సముద్రంలో కలిస్తేనే ప్రపంచం
పత్రహరితంగా పూలు పండ్లతో ఉండేదే వృక్షం
పక్షులు ఆలీ, గూల్లుపెట్టుకొని, నీడ నిచ్చేదే వృక్షం
ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఉంటేనే లోకం
ఏదీలేక పోయినా అట్టి వారికి లోకమే స్మశానం
చేతులు కలిపి చేసుకునేసంబరమే ఆనందం
మనసు మనసు కలసే ముచ్చట్లే పరమానందం
నవ్వు, ఏడుపు, సుఖం, దు:ఖముంటేనే జీవితం
ధనం, మనం మనం ఒకటే అనుకుంటేనే స్థిరం
సూర్యునిలా వెలుగును పంచుతూ ఉండేదే సంసారం
చంద్రునిలా చల్లని వెన్నెలను పంచుటే స్త్రీ జీవితం
ప్రతి నిముషము వ్యర్ధము చేయక చేయు ఉద్యోగం
ప్రతి ఒక్కరు బ్రతికి బ్రతికించుటలోనే ఉంది సోపానం
--((*))--
అందాల తరుణీ నా ఆశలు తీర్చే రమణి
సంతోష ధరణీ నా కోరిక తీర్చే రవళి
సంతృప్తి కరణీ నా ఆకలి తీర్చే చతురి
సౌందర్య భరణీ నా పాలన తీర్చే మధురి
అల్లన సాగే వెన్నెలలో నా మక్కువ తీర్చివా మనోహరి
మెళ్లగ సాగే జల్లులలో నా చక్కటి కోర్కవే మనోలస
చల్లగ సాగే మబ్బులలో నా చిక్కటి మేఘమే మనోరమ
ఉల్లము సాగే సంఘములో నా అక్కర లక్ష్యమే ఉమాసిరి
నీ అందము ఎవరికి సొంతమో కానీ - నా కళ్ళు నీ చుట్టూ ఉన్నాయి
నీ భావము తెలుపిక బంధమో కానీ - నా వళ్ళు నీ స్వేశ్చ అన్నాది
నీ భాగ్యము వరుసకు ప్రేమయో కానీ - నా మళ్ళి నీ భవ్య మన్నాది
నీ శాంతపు తరుణము వేదమో కానీ - నా వళ్ళి నీ దివ్య వెల్గన్ది
నీ నవ్వుళ్ళో రత్నాలు - నా మనసులో వెన్నెళ్లు
నీ కళ్ళల్లో దీపాలు - నా వయసులో పర్వళ్లు
నీ చూపుల్లో వజ్రాలు - నా తనువులో చన్నీళ్లు
నీ ఊహల్లో స్వప్నాలు - నా కళలలో పన్నీళ్లు
ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రతిఒక్కరికి ముందుగా శుభాకాంక్షలు
నేటి కవిత (పుట్టిన రోజు )
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నీ నవ్వే నాకు పుట్టిన రోజు బాబు
నీ చూపే నాకు పుట్టిన రోజు బాబు
నిన్ను 9 నెలలు మోసినప్పుడు తెలియలేదు
నీలో ఇన్ని కళలున్నాయని
దేశానికి మాకు సహకరిస్థావని అనుకోలేదు బాబు
అమ్మగా కోరుకుంటున్నా నాన్నగా దీవిస్తున్నా
పుట్టినరోజున మేము పంచిన మంచిని గ్రహించాలని
మనకు మనదేశానికి మేలుకొలుపు
నూరేళ్లు జరుపుకోవాలని నీ పుట్టిన రోజున అందరు
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
పున్నమి చంద్రుడిలా వెలుగుతు ఉండి
ప్రకృతి వడిలో ప్రజలకు సహకరిస్తూ ఉండి
నీలో ఉన్న కళల వైభవాన్ని తెలుపుతు ఉండి
ప్రజలే అక్షతలై, తల్లి తండ్రులు హారతులై
నీవు చూపిన దయార్ధ హృదయమే నీకు రక్షనై
నూరేళ్లు జరుపుకోవాలని నీ పుట్టిన రోజున అందరు
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
ఆశల జగతిలో నిన్ను ఉంచామురా
ఆశయాల విద్యను నేర్పించామురా
ఆదర్శ్యం , ఆత్మీయత ఆయుధమని చెప్పమురా
ఆణువణువూ సహాయ గుణమే నీకు రక్షఅని తెలిపామురా
అందరిలో ఒక్కడికన్నా, అందరికీ ఒక్కడుగా తీర్చి దిద్దామురా
నీకు మేము ఏమివ్వగలము ఆసించటం తప్పా
ఆశీర్వాదాలు తప్పా, నీ కోసం ప్రాణాలే ఆర్పించటం తప్పా
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
అందుకే
నీవు చూపిన దయార్ధహృదయమే నీకు రక్షనై
నూరేళ్లు జరుపుకోవాలని నీ పుట్టిన రోజున అందరు
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To You
--((*))--
నేటి కవిత- 1 0 0 0 1
ప్రాంజలి పభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
కళ్ళు కళ్ళు కలిపి,
కలసి మెలసి తిరిగి,
కాన రాతివి ఓ సఖియా
వలచి పిలిచితి
నీ జాడ కనబడక,
వగచి వగచి క్రుంగితిని ఓ మావా
వల్లంతా కళ్ళు చేసి
వెతికి వెతికి వేసారి
విసిగి పోతిని ఓ సఖియా
మొహమన్నావు,
దాహమన్నావు
పిలవగా కానరాతివి ఓ మావా
కోరి కోరి వెంట తిప్పుకొని,
మోహమును కనులలో
చూపితివి ఓ సఖియా
కళ్ళల్లో నీ రూపును దాచాను,
కన్ను తెరిస్తే,
నీరూపు చెరుగునెమో ఓ మావా
మరల మరల చూసి,
కొంటె నవ్వు నవ్వి
హృదయాన్ని దోచితివి ఓ సఖియా
ఆశలు చూపి,
ఆశయాల గొప్పచేప్పి,
ప్రేమను చూపక మారితివి ఓ మావా
తొలగి తొలగి తెరమాటునచేరి,
వలపులో ఉన్నా
వేడితగ్గించవా ఓ సఖియా
మనసు పొరలు
మరగి పోతున్నాయి,
తపణలు చల్లార్చి పోవా ఓ మావా
మరమనిషి అనక,
మనసున్న మనిషిని,
మమతలు అందిస్తా ఓ సఖియా
పెద్దల ఆసీర్వాదంతో
ఇద్దరం ఏకమై అనంత సౌఖ్యాలు
పొందుదామా మావా
నీ మాటే నామాట,
నీ ప్రేమ సఫలం ఈనాడని
ఆ బ్రహ్మ వ్రాసాడు సఖియా
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మన్ను తిన్న మనిషయ్యావు
కన్ను గీటి కలత పెంచావు
వెన్ను చూపి వెళుతున్నావు
తన్నుకొని తపించమన్నావు
కన్నె వయసులో ఉన్నావు
వన్నెలెన్నో చూపించావు
ఎన్ని మాటలన్నా పలకవు
తన్ను కొచ్చిన ప్రేమమింగావు
పన్ను భాదలో ఉన్నావు
టన్ను బరువులో మారావు
జున్ను తిని బలిసి నావు
బన్నులాగా తయారయ్యావు
నన్ను మరిచా నన్నావు
నిన్ను నీవు మార్చుకోలేవు
నన్ను వదలి ఉండలేవు
నిన్ను మరిచానని అరవవు
ప్రేమించటం ఎంతకష్టమో
అది నిలబెట్టుకోవటం మరి కష్టం
--((**))--
|
| ||||
నేటి కవిత ""రోజు ""
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
మళ్ళీ మళ్ళీ రాని రోజు
మరచి పోయిన రోజు
మళ్ళీ మళ్ళీ వచ్చే రోజు
మనసున కదిలించిన రోజు
మళ్ళీ మళ్ళీ నచ్చే రోజు
దాహాన్ని తీర్చే రోజు
మల్లె మళ్ళీ మెచ్చేరోజు
ఆకలి తగ్గించిణ రోజు
మళ్ళీ మళ్ళీ తపించే రోజు
ఎడబాటు గుర్తించిన రోజు
మళ్ళీ మళ్ళీ యాచించే రోజు
కోరిక స్మరణ తీర్చే రోజు
మళ్ళీ మళ్ళీ ప్రేమించే రోజు
బిడ్డలా ప్రేమను పొందే రోజు
మళ్ళీ మళ్ళీ ద్వేషించే రోజు
ఆశకు చిక్కి అల్లాడిన రోజు
మళ్ళీ మళ్ళీ మండి పడ్డ రోజు
కోపాన్ని రెచ్చ కొట్టిన రోజు
మళ్ళీ మళ్ళీ చదివిన రోజు
సుందరాకాండ పరాయణ రోజు
మళ్ళీ మళ్ళీ పూజించిన రోజు
కల్ముషములేని మనసున్న రోజు
మళ్ళీ మళ్ళీ ప్రార్ధించిన రోజు
తల్లితండ్రుల పాదసేవచేసిన రోజు
--((*))--
నేటికవిత - స్త్రీ
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
పువ్వు వైనానీవె, సాహస స్పూర్తివైనా నీవే
సహనానికి పేరు నీదే, ఘనకీర్తికి మరోపేరు నీదే
ఓర్పు వహించి, నిగ్రహాన్ని పెంచే స్త్రీవి నీవే
రాతలలో ఘనత నీదే, మాటలలో నేర్ప నీదే
అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
స్త్రీ అణకువ తనాన్ని చులకచేయుట ఎందుకు
స్త్రీని చూసి నిర్మల హ్రదయంతో సాగు ముందుకు
స్త్రీ సీలాన్ని పరీక్ష చేసి వేదించుట ఎందుకు
స్త్రీని ఎప్పుడు అవమానించి సాగలేవు ముందుకు
స్త్రీ గౌరవాన్ని నలుగురిలో చులకన ఎందుకు
స్త్రీని అందరిముందు ఆదరంచుట మరువకు
స్త్రీ శ్రమలో శ్రవంతి అంటూ హింసించుట ఎందుకు
స్త్రీకి శ్రమలో సహాయపడి ఆనందించుట మరువకు
అందుకే స్త్రీ హృదయం చిరు దివ్యల వలయం
సుఖాన్ని పంచి చింతల తీర్చే అది ఒక దేవాలయం
--((**))--
Comments
Post a Comment