భావ రస మంజరి
--((**))--
--((**))--
నేటి కవిత -9-ప్రాంజలి ప్రభ
భావ రసమంజరి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
అతిస్వేచ్ఛ ఇవ్వటం
అది ఒక క్షణికానందం
పర్యవసానం మొండి ధైర్యం
ఎదురు తిరిగిన వైనం
పెద్దలకు మాటరాని మౌనం
ధర్మమే ఆరో ప్రాణం
స్నేహమే మరో ప్రాణం
ప్రకృతే నిత్య పాణం
పోరాటమే యవ్వనం
కాలమే గమన మౌనం
అతి ప్రేమ చూపటం
ములగ చెట్టు ఎక్కించటం
విశ్వాసం పెంచటం
వినోదంగా మారటం
నోరు విప్పలేక మౌనం
తెలివిగా పసిగట్టి ప్రవర్తించటం
భాషా చాతుర్యంతో మెప్పించటం
అతిప్రేమ చూపక జాగర్త పడటం
తృప్తి సంతృప్తి మధ్య సాగాలి జీవం
--((**))--
నేటి కవిత- 8-ప్రాంజలి ప్రభ
భావ రసమంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ పోనీ, పోనీ,
దేహం ఎటుపోతే నాకేం
పొతే, పోనీ,
నన్ను వదిలి పొతే నాకేం
రానీ, రానీ,
కష్టాల్, నష్టాల్ నాకేం
వస్తే రానీ
భూకంపాల్, పెనుతుఫాన్ నాకేం
కష్టాల్, నష్టాల్,
నా మనసును తాక లేవ్
కోపాల్, తాపాల్, శాపాల్
నన్నేమి చేయ లేవ్
తిట్లు, పోట్లు, ఇక్కట్లు,
నా తనువుని మార్చ లేవ్
కానీ, రానీ, రానీ, పోనీ,
నా హృదయాన్ని కదిలించ లేవ్
కళా కవితా రాగం, రోగం
నన్ను వెంబడించ నీ
దీపం, ధ్యానం, యఁగాభ్యాసం
నాకు అలవాటు కానీ
హాసం, లాసం,
నా ప్రవర్తనను చూసి ఎక్కిరించ నీ
ప్రకృతి వికృతిగా మారినా
ప్రేమను పంచుతా ననీ
విద్యాబుద్ధులు నేర్పిన
గురువులకు విన్నవించుకుంటున్నాను
మనసు వక్రమార్గం పోకుండా
ఉండే విద్య నేర్చు కుంటున్నాను
నన్ను కన్న తల్లి తండ్రులకు
వాగ్దానం చేసి చెపుతున్నాను
ప్రాణం ఉన్నంతవరకు
ధర్మాన్ని వదలకుండా ఉంటాను
ఉంటాను, ఉండమని చెపుతాను,
కృషితో నాస్తి దృర్భిక్షం
- ప్రేమ సత్ప్రవర్తనతో సర్వం సుఖహ్మయం
--((**))--
నేటి కవిత -7
భావ రస మంజరి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మన కన్నులు నిత్యం
వెతకటం సత్యం
సత్యాన్ని తెలుస్కోవటం
మాత్రం అనిత్యం
కల్పుతాం స్నేహ హస్తం
చెప్పలేము ఎంత సాస్వితం
కల్పుతాం చిరుత హాసం
ఎంతవరకు మార్చునో కల్ముషం
చేస్తాం మధుర సంభాషణం
ఎంతవరకు తీర్చునో పరిష్కరం
పంచు కుంటాం ఆరోగ్యం
ఎందుకు పంచుకోలేము ఆనారోగ్యం
పొందుతాం హృదయానందం
ఇతరుల్లో చూడలేము ఆనందం
సంపాదన కోసం పోరాడుతాం
తృప్తి లేక జీవనం సాగిస్తాం
--((**))--
నేటి కవిత -6
భావ రస మంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
మేనిలో గంధాలు పూసావు
మెరుపు తీగలా మెరిసిపోతున్నావు
చిగురాకు ఆధారాలు చూపుతున్నావు
సింధూర వర్ణాల వలువలు ధరించావు
తరుణీ సుమ పరిమళాలతో భ్రమింపచేస్తున్నావు
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
నీలి కన్నులతో, నిండైన రూపముతో,
చిరునవ్వు మంద హాసముతో,
కస్తూరి పరిమళాలతో,
కరిగించు రస ధారతో,
కనువిందు చేస్తూ, మత్తెక్కిస్తున్నావు
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
నల్ల శిరోజాలతో మైమరిపిస్తూ
సింధూరపు ఆధరాలతో పిలుస్తూ
మేని ముసుగులో చూపక చూపిస్తూ
ముక్కెర అందంతో మురిపిస్తూ
వక్షోజాలను వయ్యారంగా వలకబోస్తూ
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
--((**))--
నేటి కవిత -5
భావ రస మంజరి
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ఇది నా యదలో రణం
నిరంతరం ఉండే భ్రమరం
ఇది మనస్సుతో చేసే మధనం
ఇది మకుటం కాని మకుటం
నాలో దాగి ఉన్న హాసనం
ఇది చెప్పు కోలేని భ్రమణం
ఇది ధనం కాని కధనం
నిరంతరం ఉండే ఇంధనం
ఇది ప్రేమ కథా కధనం
భ్రమా భ్రమర సంచరణం
నిస్సహాయ ప్రణవం
నిరంతరం చలించే కిరణం
--((**))--
నేటి కవిత -4
భావ రస రంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కన్నంబు తవ్వి తస్కరుడు
ఇంట దూరే
మగవాడు లేడు మొత్తం
దోచుకోరా తస్కరా
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు
తస్కరుడు తెరచాటు చేరి
కదిలించగా
వెలువలూడ్చి దాహం తీర్చరా
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు
తస్కరుడు వలలో చిక్కానే
అనే భయముతో
విడువరా నన్ను విడువరా
తస్కరా, తన్ను తినకరా
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు
కలవరింతలు కాపు కాసి
భ్రమలు తొలగింప చేసి
కలలో తన్మయత్వం చూపి
హాయిగా నిద్రలో జారే
--((**))--
నేటి కవిత -3
భావ రస మంజరి
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ఆకాశ వీధి: లో హాయిగా తిరిగేవు
చల్లగా జారీ వర్షము కురిపించావా మబ్బు మామా
తెల్లని వెన్నెలతొ తిమిరాలు తొలగించ
చల్లని గాలితో తడిలో ముంచవా మామా
నీలాల గగనంలొ నిండుగా వెలి గేవు!
కనుసైగ చేస్తున్నా కరిగి పావుటకు రావా మామా
చల్లని వెన్నెలలొ సాగర తీరములొ
ఉడుకు రక్తం తో ఉవ్విళ్లూరుతో ఉన్నాను మామా
చలి గాలి కెగిరేను సరస మాడగ పైరు
ఆకలి తీర్చి అలసట తీర్చుకో మబ్బు మామా
ఊహలలొ విహరించె నామనసు నీకె
త్వరత్వరగా వచ్చి తమకం తగ్గించు మామా
వీణ మూగ బోయింది నీ వేడి కదలిక కోసం
మదిలో తలిచా కనురెప్ప కదిలించు మామా
పున్నమి రేయిది పూల పానుపులా పిలిచా
నీ తుషార బిందువులను రాల్చి చల్లఁపర్చు మామ
తెల్లచీరెలొఅందమే తళుకు మని ఉన్నా
ఉరుములు మెరుపులు తగ్గించి చల్లపరచి పోమామా
--((**))--
నేటి కవిత -2
భావ రస రంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వాకిట్లొ ముగ్గూలె, లోగిల్లొ చిందూలె,
సరదా సరదాకి ముచ్చట్లే
చీకట్లొ ఆట్లాటె, అంగట్లొ అప్పుల్లె,
ముద్దు మురిపాల ముచ్చట్లే
తాకట్లొ ఆస్తుల్లు, సందట్లొ ఆర్భాటు
విద్య ఆర్భాట ముచ్చట్లే
ఎండల్లొ చన్నీళ్ళు, వాణల్లొ వేడ్నిళ్లు,
మూడు నాళ్ళ ముచ్చట్లే
నిద్రాకి దుప్పట్లు, కుంపట్లొ మంటళ్లు,
ఒకరి కొకరు ముచ్చట్లే
అత్తింట్లొ ముచ్చట్లు, పుట్టింట్లొ చప్పట్లు
నీకు నాకు మధ్య ముచ్చట్లే
ఈ పూట కేమేమి,ఈ రాత్రి వెన్నెల్లొ
నవ్వుల పువ్వుల ముచ్చట్లే
నవ్వు ల్లె పువ్వుల్లొ, నావెల్గు నీవేగ
నలిగి కరిగే ముచ్చట్లే
నాతృప్తి నీ వేగ, ఈ వేష మెచ్చేన
చీకటి వెల్తురు ముచ్చట్లే
ఈ మాట ఏ తీర్పు, ఈ ఆశ ఏ మాయ
సరుబాటు ముచ్చట్లే
ఈ బొమ్మ నీదేను, పొందాలి చీకట్లొ
ఏకపరాకాష్ట ముచ్చట్లే
ఇకచాలు నిద్రవస్తుంది
వలువలు కట్టుకొని నిద్రపో
--((**))--
నేటి కవిత -1
భావ రస మంజరి
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
1 . కలల్లో దాహం గమనించి
- కల్లోలాన్నీ తొలగించు
కనువిందు చూపు అందించి
- కొనలనాగు కోరిక తృప్తి పరచు
నవ్వులతో నయనాల కదలిక
-హృదయ స్పందనవు మేలి కలయక
నధరాల అమృతం మరువలేక
-విశ్రాంతి కల్పించి విందు చేయుచు
ప్రేమకు సమానమైన విద్య లేదు
-విద్యకు సమానమైన నేత్రము లేదు
పతిదేవునికి వాక్కు మించినది లేదు
-సత్యవాక్కుకు సమానమైన తపస్సు లేదు
సుఖానికి మించిన తపస్సు లేదు
-తపస్సే సుఖానికి నాంది అనక తప్పదు
అలుకలేని కాపురం అందమైనది కాదు
-స్వీయ తపనలు పతి కౌగిలింతకు నాంది
మనసు, మాట, పని, ఒకే మాదిరి
సర్వ కార్య సిద్ధికి ఇరువురిదీ ఒకేదారి
త్రికరణ శుద్ధిగా ఏకమై బ్రతుకే దారి
అభ్యుదయమే హృదయానందానికి దారి
--((*))--
Comments
Post a Comment