""అన్నమాచార్య సంకీర్తనామృతం"

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :సర్వస్వము భగవంతునిది అయినప్పుడు తిరిగి ఆయనకు ఆయన సంపద సమర్పించడం ఏమిటి
_____________________________________________
తాళం :గుండక్రియ

నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే
యీవల నీ సొమ్ము నీకే - యియ్య సిగ్గయ్యీ నయ్యా

ఆలుబిడ్డలఁగని - యటు దనమగనికి
సీలాన సమర్పణ - నేయవలె నటయ్యా
తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు
యే లీల సమర్పించి - నిందుకే నవ్వు వచ్చీనయ్యా!
||నీవే||
అంకెలు గన్నకొడు - కటు దమ తండ్రికిని
తెంకి నీ వాఁడనని - తెలుపఁగవలె నటనయ్యా
నా లోపల నున్న - లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా!
||నీవే||
తన నీడ యద్దములోఁ - దానే యటు చూసి
పనివడి వూరకే - భ్రమయవలె నటయ్యా
అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలనయ్యా!
||నీవే||
_____________________________________________

దేవా! నీ ప్రేరణచే నేను చేసే పనులకు ఫలితం ధనం, సంపద, వస్తు రూపం లో నీవే నాకిస్తున్నావు. తిరిగి నీవిచ్చిందే నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను.

భార్య భర్తతో కాపురం చేసి పిల్లలు కంటుంది. ఆమె ఆ బిడ్డలను తిరిగి అతనికి సమర్పించవలసిన అవసరం లేదు కదా. అలాగే నీ ప్రేరణచే నేను పుణ్యకార్యాలు చేసాను. అవి నీవే కదా. ఆ పుణ్యములను నీకే తిరిగి సమర్పిస్తున్నాను. నే చేసే ఈ వింతపనికి నవ్వు వస్తోందయ్యా!

తండ్రి దగ్గర వున్న కొడుకు ఆయనతో "నేనే నీ కుమారుడను" అని చెప్పుకోవలసిన అవసరం లేదు కదా. అలాగే నా హృదయం లో రాజై వుండి నన్ను ఏలుతున్న లక్ష్మినారాయణా! నీకు నేను సేవకుడిని మాటిమాటికి చెప్పుకోవలసిన అవసరం లేదు కదా!

అద్దం లో తన ప్రతిబింబాన్ని తానే చూసుకుని వేరే మరోకరున్నారని భ్రమపడటం తగదు కదా. ఓ ప్రియమైన శ్రీ వేంకటేశ్వరా! నా ఆత్మ లో నీవున్నావు. నిన్ను చూసి ఆనందించి నీకు శరణాగతుడ నైనాను. మరల నీవెక్కడో వున్నావని తలచి అక్కడ నీకు పూజలు చేయవలసిన అవసరం లేదు కదా!

భగవంతునికి ఆత్మార్పణం చేసిన తర్వాత ఇంక చేయవలసినది ఏమి లేదు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :అన్నమయ్య ఈ కీర్తనలో కలియుగపు దోషములనుంచి కాపాడమని శ్రీహరిని వేడుకొనుచున్నాడు
_____________________________________________
తాళం :లలిత

కడు నజ్ఞానపు - కరవుకాల మిదే
వెడలదొబ్బి మా - వెరపు దీర్చవే

పాపపు ససురము - బందెలుమమేయఁగ
పోపుల పుణ్యము - పొలివోయ
శ్రీపతి నీకే - చేయి చాఁచెదము
యేపున మమ్మిఁక - నీడేర్చవే
||కడు||
ఇలఁగలి యుగమను - యెండలు గాయఁగ
చెలగి ధర్మమను - చెరువింకె
పొలసి మీ కృపాం - బుధి చేరితి మిదె
తెలిసి నా దాహము - తీర్చవే
||కడు||
వడిగొని మనసిజ - వాయువు విసరఁగ
పొడవగు నెఱుకలు - పుటమెగసె
బడి శ్రీ వేంకట - పతి నీ శరణము
విడువక చొచ్చితి - వెసఁగావఁగదే
||కడు||
____________________________________________

దేవా! ఈ కలియుగం లో అజ్ఞానం అనే కరవుకాలం మమ్మల్ని చుట్టుముట్టింది. దీనిని వెడలగొట్టి మమ్మల్ని కాపాడి మా భయాన్ని తొలగించు స్వామి!

పాపాలు అనే పశువులు మా శరీరమనే పొలాలపై పడినాయి. దానితో మేము కష్టపడి పెంచిన పుణ్యమనే పంట నాశనమై పోయింది. శ్రీపతీ! దీనులమై నీ దయ కోసం చేయి చాచి అర్ధిస్తున్నాము. ఇక నీవే మమ్మల్ని కాపాడాలి.

కలియుగమనే మండే ఎండల వలన భూమి మీద ధర్మము అనే చెరువు ఎండి పోయింది. దాహం తో తిరిగి తిరిగి చివరకు మేము నీ దయ అనే సరస్సు వద్దకు వచ్చాం. మా దుస్థితి గ్రహించి దప్పిక తీర్చు దేవా!

మన్మధుడి కామ, మోహాలు అనే వడగాలులకు మేము సంపాదించిన జ్ఞాన, విజ్ఞానాలన్నీ క్షణం లో ఎగిరిపోయాయి. శ్రీ వేంకటేశ్వరా! దిక్కుతోచని మేము చివరకు నీ పాదాలు వదలక శరణు కోరాము. శ్రీనివాసా! త్వరగా వచ్చి మమ్ము కాపాడ వయ్యా!

కలియుగం లో కామ క్రోధ మద మాత్సర్యాలు మానవులను పాపాలు చేయడానికి పురికొల్పుతూ వుంటాయి. శ్రీనివాసుని పై భక్తి మాత్రమే వీటి నుంచి మనలని కాపాడగలదు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :భగవంతుని ఇచ్ఛ అతిక్రమించి నడుచుట తప్పు అది ముక్తి కోసమైనా సరే
____________________________________________
తాళం :గుజరి
భావించనేర నైతి - పశుబుద్ది నైతిని
యీవల నా యపచార - మిది గావవయ్యా
హరి నీవు ప్రపంచ - మందుఁ బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది - బలు ద్రోహమవుఁగాదో
సిరుల నేలేటిఁవాడు - చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు - వేరే సేయఁదఁగునా?
||భావిం||
పంచేంద్రియములు నాపైఁ - బంపు నెట్టితివి నీవు
ఎంచి వాని దండించే - దిది నేరమౌఁగాదో
పెంచేటి తల్లిదండ్రులు - ప్రియమై వడ్డించఁగాను
కంచము కాలఁదన్న సం - గతియా బిడ్డలకు?
||భావిం||
మిక్కిలి సంసారము - మెడఁగట్టితివి నాకు
అక్కర నే వేసారేది - అపరాధ మవుఁగాదో
దిక్కుల శ్రీ వేంకట్రాది - దేవుఁడ నీవియ్యఁగాను
ఎక్కడో జీవుఁడ నేను - యెదురాడఁదగునా?
||భావిం||
_____________________________________________
దేవా! నీ లీలలు, మహిమలు నేను ఊహించలేకపోయాను. అజ్ఞానం వలన పశుసమానుడైనాను. నా నేరము మన్నించి కాపాడవయ్యా!
శ్రీహరీ! మమ్మల్ని నీవు ఈ భూమి పై ఉద్దేశపూర్వకంగా పుట్టించావు. అది మరిచి, మోక్షం కొరకై ప్రయత్నం చేయడం నీకు ద్రోహము చేసినట్లే కదా! సకల సంపదలు ఇచ్చి పరిపాలించే ప్రభువైన నీవు చెప్పినట్లు సేవకులైన మేము చేయాలి గాని అందుకు విరుద్ధంగా చేయటం తప్పు కాదా! .
మాకు భూమి పై ప్రవర్తించుటకు పంచేంద్రియములు ఇచ్చావు. అవి చెప్పినట్లు చేయాలి గాని వాటిని నేను దండించుట నేరము కాదా! ప్రేమతో తల్లిదండ్రులు వడ్డించిన దానిని పిల్లలు తినాలి గాని కంచమును కాలదన్నుట తప్పు కాదా!
నీవే ఈ భారపు సంసారాన్ని ప్రేమతో నా మెడకు కట్టావు. దీనిని నేను భరించి జీవించాలి గాని కష్టమని విసుగు చెందటం నేరము కదా! సర్వం వ్యాపించి వున్న శ్రీ వేంకటేశ్వరా! నీవు ఇచ్చిన దేదో పుచ్చుకొని అనుభవించాలి గాని అణువై ఎక్కడో ఒక మూలాన జీవుడైన వున్న నేను నీకెదురాడుట తగదు.
భగవంతుడు ప్రతి జీవిని ఒక ఉద్దేశం కొరకు సృష్టిస్తాడు. అందుకనుగుణంగా జీవిస్తూ భగవంతుని శరణు కోరాలి. విరుద్ధంగా ప్రవర్తించి ఏమి సాధించలేము.
--((**))--
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :సర్వస్వము భగవంతునిది అయినప్పుడు తిరిగి ఆయనకు ఆయన సంపద సమర్పించడం ఏమిటి
_____________________________________________
తాళం :గుండక్రియ

నీవే సేసిన చేత - నీవే చేకొనుటింతే
యీవల నీ సొమ్ము నీకే - యియ్య సిగ్గయ్యీ నయ్యా

ఆలుబిడ్డలఁగని - యటు దనమగనికి
సీలాన సమర్పణ - నేయవలె నటయ్యా
తాలిమి బుణ్యాలు సేసి - దైవమా నే నీకు
యే లీల సమర్పించి - నిందుకే నవ్వు వచ్చీనయ్యా!
||నీవే||
అంకెలు గన్నకొడు - కటు దమ తండ్రికిని
తెంకి నీ వాఁడనని - తెలుపఁగవలె నటనయ్యా
నా లోపల నున్న - లక్ష్మీశ నే నీకు
పొంకపు నీ బంటనన్న - బునరు క్తయ్యీ నయ్యా!
||నీవే||
తన నీడ యద్దములోఁ - దానే యటు చూసి
పనివడి వూరకే - భ్రమయవలె నటయ్యా
అనుగు శ్రీ వేంకటేశ! - ఆతుమలోనున్న నిన్ను
గని మని శరణంటిఁ - గడఁ బూజించనేలనయ్యా!
||నీవే||
_____________________________________________

దేవా! నీ ప్రేరణచే నేను చేసే పనులకు ఫలితం ధనం, సంపద, వస్తు రూపం లో నీవే నాకిస్తున్నావు. తిరిగి నీవిచ్చిందే నీకు సమర్పించవలసి వచ్చినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను.

భార్య భర్తతో కాపురం చేసి పిల్లలు కంటుంది. ఆమె ఆ బిడ్డలను తిరిగి అతనికి సమర్పించవలసిన అవసరం లేదు కదా. అలాగే నీ ప్రేరణచే నేను పుణ్యకార్యాలు చేసాను. అవి నీవే కదా. ఆ పుణ్యములను నీకే తిరిగి సమర్పిస్తున్నాను. నే చేసే ఈ వింతపనికి నవ్వు వస్తోందయ్యా!

తండ్రి దగ్గర వున్న కొడుకు ఆయనతో "నేనే నీ కుమారుడను" అని చెప్పుకోవలసిన అవసరం లేదు కదా. అలాగే నా హృదయం లో రాజై వుండి నన్ను ఏలుతున్న లక్ష్మినారాయణా! నీకు నేను సేవకుడిని మాటిమాటికి చెప్పుకోవలసిన అవసరం లేదు కదా!

అద్దం లో తన ప్రతిబింబాన్ని తానే చూసుకుని వేరే మరోకరున్నారని భ్రమపడటం తగదు కదా. ఓ ప్రియమైన శ్రీ వేంకటేశ్వరా! నా ఆత్మ లో నీవున్నావు. నిన్ను చూసి ఆనందించి నీకు శరణాగతుడ నైనాను. మరల నీవెక్కడో వున్నావని తలచి అక్కడ నీకు పూజలు చేయవలసిన అవసరం లేదు కదా!

భగవంతునికి ఆత్మార్పణం చేసిన తర్వాత ఇంక చేయవలసినది ఏమి లేదు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :హరిని నమ్మి ఆయనరక్షణ వున్నపుడు ఏ జన్మ అయినా సుఖదాయకమే.
____________________________________________
ఏదాయె నేమి హరి - యిచ్చిన జన్మయే చాలు
ఆదినారాయణుడీ - యఖిల రక్షకుడు

శునకము బతుకును - సుఖమయ్యే తోచుగాని
తనకది హీనమని - తలచుకోదు
మన పొడబడతేని - మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ - దైవమౌట తప్పదు
||ఏదా|¦
పురువు కుండే నెలవు - భువనేశ్వరమై తోచు
పెరచోటి గుంతయైన - ప్రియమై యుండు
ఇరవై పుండితే జాలుఁ - ఎగువేమి దిగువేమి
వరుస లోకములు స్వ - రం విష్ణుమయము
||ఏదా||
అచ్ఛమైన జ్ఞానికి - నంతా వైకుంఠమె
చెచ్చర దన తిమ్మటే - జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీ వేం - కటపతి దాసుఁడైతే
హెచ్చు కుందేమి లేదు - ఏలినవా డితడే!
||ఏదా||
____________________________________________
ఏమైతే నేమి? శ్రీహరి ఇచ్చిన జన్మ చాలు మనకు. ఈ ఆదినారాయణుడే మనను సదా కాచి రక్షించేవాడు.
శునకము (కుక్క) తన జన్మ మంచిది, సుఖమయం అనుకుంటుందే గాని హీనమని, నీచమని, పనికిరాదని అనుకోదు. మనస్సు విరక్తి చెంది ధ్యాన వైరాగ్యము కలిగినపుడు మంచి ఏమి కానిదేమి అనిపించదు. శరీరంలోని అంతరాత్మ దేవునిగా మారటం తప్పదు.
పురుగుకు తను వుండే ప్రదేశమే స్వర్గంగా వుంటుంది. అది పెరటి లోని బురద మురికి గుంత అయినా. మనసు విరక్తి పొందినపుడు శరీరం వుండే ప్రదేశం కొండైతే నేమి కోనైతే నేమి, రాయిరప్పైనా ఎడారైనా అంతా విష్ణువు వుండే లోకములు గానే వుంటాయి.
నిజమైన జ్ఞానం కలిగిన వానికి అంతా వైకుంఠమే. ఈ దేహ విశ్రాంతి జీవన ముక్తి అవుతుంది. మనసు పెట్టి శ్రీ వేంకటేశ్వరుని దాసుడైన వానికి హెచ్చుతగ్గులు ఏమి వుండవు. కాచి రక్షించవాడు ఆయనే కాబట్టి.
జన్మమేదైనా, పరిస్థితి ఏదైనా, కలిమిలేములు, సుఖదుఃఖాలు ఏవైనా, శ్రీహరిని కొలిచేవారికి అంతా ముక్తి నిచ్చేవే.
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :ధనము, భయము, పాపము, సంసారం మొదటి గురువులై భగవత్రాప్తికి దారి చూపుతాయని ఈ సంకీర్తన లో అన్నమయ్య చెప్పారు
____________________________________________
తాళం :గుండక్రియ

అవియు నాకు బ్రథా - మాచార్యులు
దవిలి యీ నెపము మిముఁ - దలపించుగాన
ధనవాంఛ మతిలోనఁ - దగిలినప్పటివేళ
దమజారి మీమీద - దలపు గలుగు
పొనిగి భయదుఖముల - బొరలినప్పటివేళ
పనివూని మీఁమీద - భక్తి గలుగు
||అవి||
చెలగి పాపముల మిం - చినవేళ హరి మీ
నలవు నీ నామోచ్చార - ణంబు గలుగు
బలిమి భవరోగముల - బడలినప్పటివేళ
పలుమారు మీ సం - ప్రార్ధనలు గలుగు
||అవి||
ఇన్నిటాఁ దొలఁగి మిము - నెరగి కొలిచినవేళ
మన్ననల పరిణా - మంబు గలుగు
ఉన్నతపు శ్రీ వేంక - టోత్తముడ మిము నెదుట
గన్న యీవేళ సౌ - ఖ్యంబులే కలుగు
||అవి||
____________________________________________
దేవా! ధనం, భయం, పాపం, దుఃఖాల రోగాల సంసారం - ఇవి నిన్ను తలచుకోవడానికి కారణ హేతువులు అవుతున్నాయి. కాబట్టి అవి నాకు మొదటి గురువులు.
దానవాంతకా! ధనము పై కోరిక కలిగినపుడు, నాకు నీపై చింత కలుగుతుంది. భయదుఖములతో మునిగి జీవితం వెలుగు తగ్గినపుడు నీపై ఎక్కువగా భక్తి పెరుగుతుంది.
శ్రీహరి! పాపములు ఎక్కువై బాధించినపుడు నీ నామోచ్చారణ చేయాలనే బుద్ది పుడుతుంది. భయంకరమైన రోగాలు పట్టి పీడిస్తున్నపుడు నిన్ను అనేకమార్లు ప్రార్ధించాలి అనిపిస్తుంది .
ఇవన్నీ తొలగి నీవెవరో తెలుసుకుని కొలిచిన వేళ నీ మన్ననలకు ప్రాప్తమవుతాను. ఉన్నతమైన శ్రీవేంకటేశ్వరా! అప్పుడు నాకు నిన్ను ఎదుట కనులారా చూసే పరమ సుఖం లభిస్తుంది.
కష్టాలు, బాధలు, దుఖాలు, పాపాలు, రోగాలు ఆఖరికి ధనేచ్ఛ ఇవన్నీ దేవుని నిత్యం తలచుకోవడానికి కారణాలవుతున్నాయి. వీటిని దాటగలిగితే పరమాత్ముని దర్శనం లభిస్తుంది.
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :ఆత్మ శాశ్వతము శరీరము అశాశ్వతము
____________________________________________
తాళం :బౌళి

దేహి నిత్యుఁడు - దేహము లనిత్యాలు
ఈహల నామనసా - యిది మరవకుమీ
గుదిఁ బాఁతచీర మాని - కొత్తచీర గట్టినట్టు
ముదిమేను మాని దేహి - మొగిఁ గొత్తమేను మోచు
అదన జంపగలేవు - ఆయుధము లితని
గదిసి యగ్నియు నీరు - గాలియు జంపఁ గలేవు
||దేహి||
ఈతఁడు నరకువడఁ - డీతఁ డగ్నిఁగాలడు
ఈతఁడు నీట మునుఁగఁ - డీతడు గాలిఁబోడు
చేతనుడై సర్వగతుండౌ - చెలియించ డేమిటను
ఈతల ననాది యీతఁ - డిరవు గదలఁడు
||దేహి||
చేరి కానరానివాఁడు - చింతించరానివాఁడు
భారపు వికారాలఁ - బాసినవాఁ డీయాత్మ
అరయ శ్రీ వేంకటేశు - నాధీన మీతడని
సారము దెలియుటే - సత్యం జ్ఞానము
||దేహి||
____________________________________________
జీవాత్మ శాశ్వతము కాని జీవుడు ధరించే శరీరాలు అశాశ్వతం. పలుకోరికలు గల ఓ నా మనసా! ఈ సత్యాన్ని మరచిపోకుము
మానవుడు పాత బట్టలు వదలి కొత్త బట్టలు ధరించిన ట్టు ఈ ఆత్మ ముసలైన శరీరము వదలి కొత్త శరీరము ధరిస్తుంది. ఆయుధాలు ఈ ఆత్మను చంపలేవు. గాలి నిప్పు నీరు ఏమి చేసినా కూడా ఈ ఆత్మను చంపజాలవు.
ఏ కత్తి మరియు ఇతర ఆయుధాలు ఈ ఆత్మను నరకలేవు. నిప్పు కాల్చలేదు. నీట ఈ ఆత్మ మునగదు మరియు గాలికి ఆరిపోదు. ఇది చైతన్యం కలది. అంతటా వ్యాపించి వుంటుంది. దేనికి చలించదు. ఇది ఆనాది నుంచి వున్నది. ఉన్నచోటు విడవదు.
మన బాహ్యేంద్రియాలు అనగా కన్ను మొదలైనవాటికి ఈ ఆత్మ కనిపించదు, వినిపించు. మనస్సుకు అందినది. ఎటువంటి వికారములకు లోనవదు. ఆలోచించి చూడగా ఈ ఆత్మ శ్రీ వేంకటేశ్వరునికి మాత్రమే ఆధీనమై వుంటుంది. ఈ సత్యం గ్రహించడమే నిజమైన జ్ఞానము.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది అన్నమయ్య ఈ సంకీర్తన లో వివరించాడు.
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : పాపాలు, కోపాలు మొదలైన కలియుగ దోషాలు భగవద్భజన పరులకు లేవు
____________________________________________
తాళం :మాళవి గౌళ

కలియుగ మెటులైనాఁ - గలదుగా నీ కరుణ
జలజాక్ష! హరి హరీ! - సర్వేశ్వరా!
పాప మెంత గలగినఁ - బరిహరించే యందుకు
నా పాలఁగలదుగా నీ - నామము
కోపమెంత గలిగిన - కొచ్చి శాంత మిచ్చుటకు
చేపట్టి కలవుగా నా - చిత్తములో నీవు
||కలి||
ధర నింద్రియా లెంత - తరముకాడిన నన్ను
సరిఁగావఁ గద్దుగా నీ - శరణాగతి
గరిమ గర్మబంధాలు - గట్టిన తాళ్లు వూడించ
నిరతిఁ గలదుగా - నీ భక్తి నాకు
||కలి||
హితమైన యిహపరా - లిష్టమైన వెల్లా నియ్య
సతమై కలదుగా నీ - సంకీర్తన
తతి శ్రీవేంకటేశ నా - తపము ఫలియింపించ
గతి కలదుగా నీ - కమలాదేవి
||కలి||
____________________________________________
ఓ జలజాక్షా! హరిహరీ! సర్వేశ్వరా! దోషపూరితమైన కలియుగం ఎలా వున్నా నన్ను కాపాడటానికి నీ కృప వుంది కదా! మరి నాకెందుకు ఇక భయం?
నన్ను ఎన్ని పాపాలు ప్రేరిపించినా, వాటిని సమూలంగా నాశనం చేయటానికి నీ నామము వుంది కదా! నాకు ఎంత తీవ్రమైన కోపం వచ్చినా, శాంతింప చేయటానికి మనస్సులో నీవున్నావు కదా!
ఇంద్రియాలు ఎంత తరుముతూ ఇబ్బంది పెట్టినా, వాటి బారినుండి తప్పించడానికి నీ శరణాగతి వుంది కదా! ఘనమైన కర్మబంధాలు అనే తాళ్ల తో నన్ను కట్టివేసినా, విడిపించేందుకు నీపై గల భక్తి వుంది కదా!
నా కిష్టమై, మంచి అయి ఇహపరాలకు సంబంధించినటువంటి వన్నీ ఇచ్చేందుకు శాశ్వతమైన నీ సంకీర్తన వుంది కదా! శ్రీవేంకటేశ్వరా! తగిన సమయం లో నా తపస్సు ఫలించేటట్టు చేయడానికి నీ లక్ష్మీదేవి నాకు అమ్మగా గతియై వుంది గదా!
భగవంతుని కృప కలిగిన భక్తులను కలి ఏమి చేయలేడు. కలియుగ దోషాలు ఏమి అంటవు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మానవుడు దేవుని సేవ చేయగలడు అంతే. మరి రక్షించగలిగేవాడు నారాయణుడే
_____________________________________________
తాళం :గుండక్రియ

నేనేమిఁ జేయగలను - నీవు పరిపూర్ణుఁడవు
హీనుఁడ నే నధికుడ వ - న్నిటా నీవు
దండము నెట్టుట నాది - తప్పు లోఁ గొనుట నీది
నిండి నీ వెప్పుడు దయా - నిధిని గాన
అండఁ జేరుకొంట నాది - అందుకు మాఁ కొంట నీది
దండియైన దేవదేవో - త్తముఁడవు గాన
||నేనే||
శరణుచొచ్చుట నాది - పరుగఁ గాచుట నీది
పరమపురుష శ్రీ - పతివి నీవు
విరులు చల్లుట నాది - వేవే లిచ్చుట నీది
పొరి నీవు భక్తసుల - భుఁడ నటుగాన
||నేనే||
దాసుఁడ ననుట నాది - తప్పక యేలుట నీది
ఆసదీర్చే వరదుఁడ - వటుగాన
నీ సేవ యొక్కటి నాది - నిచ్చలు గైకొంట నీది
యీసులేని శ్రీ వేంక - టేశుఁడవుగాన
||నేనే||
____________________________________________
దేవా! అల్పజీవుడైన నేను ఏమి చేయగలను. నీవు పరిపూర్ణ స్వరూపుడవు. నేను ఎటువంటి శక్తి లేని హీనుడను. నీవు శక్తిగల పరమాత్ముడవు.
నీకు నమస్కరించడం నా పని. నీవు దయామయుడు కాబట్టి నా తప్పులు క్షమించి రక్షించడం నీ పని. నీ అండ కోసం నీ నామ జపం నా పని. దేవాధిదేవుడవు కాబట్టి విని నన్ను కాపాడటం నీ పని.
నిన్ను శరణు వేడటం నా వంతు. లక్ష్మీదేవి పతి అయిన పరమపురుషా! పరుగున వచ్చి కాపాడటం నీవంతు. పూలతో నిన్ను పూజించడం నా వంతు. నా కోరికలు తీర్చి సకల సంపదలు ఇవ్వడం నీ వంతు. ఎందుకంటే నీవు భక్తజనులకు సులభుడవు కదా.
నీ దాసుని అవుట నా కర్తవ్యం. మరి దయచూపి కాపాడటం నీ కర్తవ్యం. నీవు దాసుల ఆశలు దీర్చే వరదాయకమూర్తివి కదా. ఈవిధంగా నిన్ను సేవించడం ఒక్కటే నా పని. మరి నే చేసే సేవలన్ని అంగీకరించి స్వీకరించడం నీ పని. ఎందుకంటే నీవు ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి కదా.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : పరబ్రహ్మం ఒకటే అని చెప్పే ఈ సంకీర్తన బాగా ప్రాచుర్యం పొందినది. అందరి లో వుండే బ్రహ్మ ఒకడే.
____________________________________________
తందనాన ఆహి - తందనాన పురే
తందనాన భళా - తందనాన

బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే పర
బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే
కందువగు హీనాధికము - లిందులేవు
అందరికి శ్రీహరే - అంతరాత్మ.
||తంద||
నిండార రాజు నిద్రించు - నిద్రయు నొకటే
అండనే బంటునిద్ర - అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుఁడు - మెట్టుభూమి యొకటే
ఛండాలుఁడేటి - పరిభూమి యొకటే
||తంద||
కడగి యేనుగు మీదు - గాయు యెండొకటే
పుడమి శునకము మీఁద - బొలయు నెండోకటే
కడుఁ బుణ్యులను పాప - కర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటే - శ్వరు నామ మొకటే
||తంద||
____________________________________________

ఈ విశ్వంలో భిన్న భిన్న స్వరూపాలతో కన్పించే జీవులలోన వున్న పరబ్రహ్మ ఒకటే ఒకటే. ఈ బ్రహ్మమయ సృష్టి లో వీడదీసి చూపుటకు హెచ్చు తగ్గులు ఏమియు లేవు. అందరికిని అంతరాత్మ శ్రీహరి ఒకటే.

రాజు హంసతూలికాతల్పం పై నిదురిస్తాడు. ఆ పక్కనే కాపలా కాచే భటుడు నేల పై నిద్రిస్తాడు. పడుకునే రీతిలో తేడా వున్నా వారిద్దరికి వచ్చే నిద్ర ఒకటే. ఎటువంటి తేడా వుండదు.

వేదాలు వల్లించే పండిత బ్రాహ్మణుడు, చెప్పులు కుట్టి జీవించే వృత్తివాడు నిలుచుండే భూమి ఒక్కటే. వృత్తులు వేరైనా ఆధారమైన నేల ఒక్కటే కదా.

జంతుకోటి లో పెద్దదైన ఏనుగు మీద, చిన్నదైన కుక్క మీద పడే సూర్యుని ఎండ ఒకటే. ఎలాంటి తేడా వుండదు. అలాగే అటు పుణ్యాత్ములను, ఇటు పాపాత్ములను సమానముగా సంరక్షించ గలిగే సమర్ధవంతమైన శ్రీ వేంకటేశ్వరుని నామము ఒకటే.
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : శ్రీకాంతుని తప్ప తక్కిన దేవతలను కొలుచుట వలన ప్రయోజనం లేదు. నిష్ఫలం
____________________________________________
తాళం : గుండక్రియ

అతఁడు లక్ష్మీకాంతుఁ - డన్నియు నొసఁగుగాక
యితరుల వేఁడుకొంటే - నేమి గలదు?

మోదముతో నొకమాని - మొదలఁ బోసిన నీరు
పాదుకొని కొనకెక్కి - ఫలించుఁగాక
ఆదిమూలమగు హరి - నాతును సేవించక
యే దైవమచలఁగన్నా - నేమి సెలవు?
||అత||
తల్లి భుజించిన నెల్లా - తగు గర్భము శిశువు
కెల్లగాఁగఁ బరిణామ - మిచ్చుఁగాక
ఉల్లములోపలి హరి - కొసఁగని పూజలెల్లా
వెల్లిఁ జింతపంటివలె - వృథా వృథా!
||అత||
ఓలినెంత జారిపడ్డా - నూరకే యెవ్వరికైనా
నేలే యాధారమై - నిలుచుఁగాక
తాలిమి శ్రీవేంకటేశు - దలఁచక తలఁచినా
పాలించే నాతఁడేకాక - పరులకు వశమా
||అత||
____________________________________________

సంపదలకు అధిదేవతయైన లక్ష్మిదేవి భర్త శ్రీమహావిష్ణువు. కావున కోరిన కోరికలన్నీ తీర్చేవాడు ఆయనే కదా. మరి వేరే దేవతలను వేడుకోవటం వలన ప్రయోజనం లేదు.

ఆనందంగా ఒక చెట్టు మొదలులో బోసిన నీళ్లు వ్రేళ్ళకు దిగి అక్కడ నుండి కొమ్మలకు, రెమ్మలకు వ్యాపించి ఫలిస్తాయి. అంతేకాని కొనకొమ్మల పై నీరు చెల్లితే ప్రయోజనం ఏమి వుండదు. అలాగే దేవతలందరిని ఆదిమూలమైన శ్రీహరిని ఆత్మలో సేవించి తరించాలి. అలా కాకుండా మిగతా ఏ దేవతలను ఆశ్రయించినా ఉపయోగం లేదు.

తల్లి తినే పదార్థములన్నీ ఆమె గర్భం లో వున్న శిశువుకి అంది పోషణ లభించి క్షేమంగా వుంచుతుంది. అలాగే హృదయం లో నివాసమున్న శ్రీహరికీ చేసే పూజలన్ని సఫలం అవుతాయి. అలా చేయని పూజలు వరదలో కలిసిన చింతపండు వలె వ్యర్థములే అవుతాయి.
ఎవ్వరు ఎక్కడ నుంచి ఎంతగా జారిపడినా చివరకు ఆధారముగా నిలిచేది నేల ఒక్కటే. అట్లే శ్రీవేంకటేశ్వరుని స్మరించకుండా, ఆయన మూర్తిభేదములైన ఇతర దేవతలను స్మరించినా, చివరకు మనలని పాలించవలసినవాడు శ్రీనివాసుడు ఒక్కడే. ఇతరులు పాలించే కర్తలు అవ్వలేరు.
అందరిని పాలించు ఆదిమూలం శ్రీవేంకటేశ్వరుడే. ఆయననే మనమందరం కొలుద్దాం. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మానవుడు దేవుని సేవ చేయగలడు అంతే. మరి రక్షించగలిగేవాడు నారాయణుడే
_____________________________________________
తాళం :గుండక్రియ
నేనేమిఁ జేయగలను - నీవు పరిపూర్ణుఁడవు
హీనుఁడ నే నధికుడ వ - న్నిటా నీవు
దండము నెట్టుట నాది - తప్పు లోఁ గొనుట నీది
నిండి నీ వెప్పుడు దయా - నిధిని గాన
అండఁ జేరుకొంట నాది - అందుకు మాఁ కొంట నీది
దండియైన దేవదేవో - త్తముఁడవు గాన
||నేనే||
శరణుచొచ్చుట నాది - పరుగఁ గాచుట నీది
పరమపురుష శ్రీ - పతివి నీవు
విరులు చల్లుట నాది - వేవే లిచ్చుట నీది
పొరి నీవు భక్తసుల - భుఁడ నటుగాన
||నేనే||
దాసుఁడ ననుట నాది - తప్పక యేలుట నీది
ఆసదీర్చే వరదుఁడ - వటుగాన
నీ సేవ యొక్కటి నాది - నిచ్చలు గైకొంట నీది
యీసులేని శ్రీ వేంక - టేశుఁడవుగాన
||నేనే||
____________________________________________
దేవా! అల్పజీవుడైన నేను ఏమి చేయగలను. నీవు పరిపూర్ణ స్వరూపుడవు. నేను ఎటువంటి శక్తి లేని హీనుడను. నీవు శక్తిగల పరమాత్ముడవు.
నీకు నమస్కరించడం నా పని. నీవు దయామయుడు కాబట్టి నా తప్పులు క్షమించి రక్షించడం నీ పని. నీ అండ కోసం నీ నామ జపం నా పని. దేవాధిదేవుడవు కాబట్టి విని నన్ను కాపాడటం నీ పని.
నిన్ను శరణు వేడటం నా వంతు. లక్ష్మీదేవి పతి అయిన పరమపురుషా! పరుగున వచ్చి కాపాడటం నీవంతు. పూలతో నిన్ను పూజించడం నా వంతు. నా కోరికలు తీర్చి సకల సంపదలు ఇవ్వడం నీ వంతు. ఎందుకంటే నీవు భక్తజనులకు సులభుడవు కదా.
నీ దాసుని అవుట నా కర్తవ్యం. మరి దయచూపి కాపాడటం నీ కర్తవ్యం. నీవు దాసుల ఆశలు దీర్చే వరదాయకమూర్తివి కదా. ఈవిధంగా నిన్ను సేవించడం ఒక్కటే నా పని. మరి నే చేసే సేవలన్ని అంగీకరించి స్వీకరించడం నీ పని. ఎందుకంటే నీవు ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి కదా.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :దేవునికి మానవునకు గల బేధము
____________________________________________
తాళం : మాళవిగౌళ
నీవు సర్వగుణ సంపన్నుడవు - నేను దుర్గుణిని
మావున నన్నొక యెదురుచేసుకుని - మనసు చూడనేలా అయ్యా
ఏలినవాడవు నీవు - యిటు నేఁ గొలిచినవాడ
పోలింపఁగ నీవే దేవుడవు - భువి నేనొక జీవుడను
పాలించేవాఁడవు నీవు - బ్రతికేవాఁడను నేను
తాలిమి నన్నొక సరిచేసుక నను - దప్పులెంచ నేలా యయ్యా!
||నీవు||
అంతర్యామివి నీవు - అంగమాత్రమే నేను
చింతింపగ నీవే స్వతంత్రుడవు - జిగినే బరతంత్రుఁడను
ఇంత నీవే దయగలవాఁడవు - యెప్పుడు నే నిర్దయుఁడను
చెంతల నన్నొకమొన చేసుక నా - చేఁత లెంచనేలా యయ్యా!
||నీవు||
శ్రీ వేంకటేశ్వరుఁడవు నీవు - సేవకుఁడను యిటు నేను
ఆవల నీవల దాతవు నీవు - యాచకుఁడను నేను
నీవే కావఁగ గర్తవు - నేనే శరణాగతుఁడను
కైవసమగు నను ప్రతినెట్టుక నా - కధలు యెంచనేలా యయ్యా!
||నీవు||
____________________________________________
దేవా! నీవు సర్వగుణ సంపన్నుడవు. మరి నేనో దుర్గుణాల వాడిని. ఎదురుగా వున్న నన్ను కాయక, నా మనసు లోని దుర్గుణాలు ఎంచడం దేనికి స్వామి!
నీవేమో భువనాలన్ని ఏలేవాడవు. మరి నేను నిన్ను కొలిచేవాడిని. పూజింపగ దేవుడివి నీవు మరి ఈ భూమిపై నేను ఒక జీవిని అంతే. జగాన్ని పాలించేవాడవు నీవు, మరి నీ పాలనలో బతికేవాడిని నేను. నన్ను సరిదిద్ది కాపాడక, నా తప్పులు ఎంచటం దేనికి అయ్యా |
జగమంతా నిండిన అంతర్యామివి నీవు, మరి నేను ఆవగింజంత చిన్నవాడిని. ఆలోచించితే నీవు ఏమైనా చేయగల స్వతంత్రుడవు కాని నేను బానిసను. నీవు దయగల మూర్తివి మరి నేను ఎప్పుడూ నిర్దయుడినే.
నన్ను మన్నించి దరి చేర్చుకోకుండా నేను చేసిన చేతలు ఎంచడం దేనికి అయ్యా!
శ్రీ వేంకటేశ్వరుడవు నీవు మరి నేను నీ సేవకుడను. ఏదైనా ఇవ్వగల దాతవు నీవు మరి నేను అర్ధించే బిచ్చగాడను. నీవు అందరిని కాచి రక్షించేవాడివి. నేను నీ శరణు కోరినవాడిని. నాకు కైవల్యాన్ని ప్రసాదించక నా కధలు ఎంచడం దేనికి అయ్యా!
నేను చేసిన తప్పులన్ని మన్నించి కాపాడు శ్రీనివాసా!

అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :కృష్ణుడు అర్జునునికి చెప్పినది అన్నమయ్య ఈ సంకీర్తన చెప్పారు. ప్రాచుర్యము పొందిన కీర్తన
____________________________________________
తాళం : లలిత
అని యానతిచ్చెఁ గృహ్ణుఁ - డర్జునునితో
విని యాతని భజించు - వివేకమా!
భూమిలోను చొచ్చిన సర్వ - భూతప్రాణుల నెల్లా
దీమసాననే మోచేటి - దేవుఁడ నేను
కామించి సస్యమును - గలిగించి చంద్రుఁడనై
తేమల బండిచేటి - దేవుఁడ నేను
||అని||
దీపనాగ్నినై జీవ - దేహముల యన్నములు
తీపుల నరింగిచేటి - దేవుఁడ నేను
ఏపున నిందరిలోని - హృదయములోన నుందు
దీపింతుఁ దలఁపు మరపై - దేవుఁడ నేను
||అని||
వేదము లన్నిటిచేత - వేదాంతవేత్తల చేతా
ఆది నే నెరఁగఁదగిన - యాదేవుఁడను
శ్రీదేవితోగూడి - శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుఁడను - భావించ నేను
||అని||
____________________________________________
శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ కింది విధముగా ఆనతి ఇచ్చాడు. ఓ నా వివేకమా! అర్థం చేసుకుని ఆ దేవుని భజింపుము.
"నేనే భూమిలో ప్రవేశించి చేతనాచేతములైన సమస్త ప్రాణులలో జీవశక్తి తో ఉండే దైవాన్ని. నేనే చంద్రుడినై రసముల నింపి ఓషధులను వృద్ది చేసి పండించే దేవుడిని.
నేనే జఠరాగ్నినై జీవుల దేహములందలి అన్నమును ఆరగించే దేవుడిని. జీవులందరి హృదయములలో స్మ్రతి (తలచుకోవడం), విస్మ్రతి (మర్చిపోవటం) కలిగించే దేవుడను నేనే.
నేనే సమస్తవేదములలో మరియు వేదాంతవేత్తలచే చెప్పిన మొదటి దేవుడను. నేనే లక్ష్మిదేవితో కలిసి శ్రీ వేంకటాచలం పై వెలసి స్థిరపడిన దేవుడను. శ్రీనివాసుడను.
భగవద్గీత శ్లోకములు ఆధారంగా రచించిన కీర్తన ఇది. ఒక శ్లోకం చెబుతాను ఇక్కడ :
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత|
ప్రాణాపానసమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్||

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : రక్తి తో ఇతరులకు సేవ చేసే కన్నా విరక్తి తో హరి సేవ మేలు
____________________________________________
తాళం :శ్రీరాగం
చాలునిదే నా విరతి - సకల సామ్రాజ్యము
నాలోని పని యెంతై - నా నాకుఁగలదు
వడఁబడి పరులిండ్ల - వాకిలి గాచే నేను
వడి నాలో హరియున్న - వాకిలి గాచేను
బడి నొకరిఁగొలిచి - బహురాజ్యమేలే నేను
యెడ నా మనోరాజ్య - మింతా నేలేను
||చాలు||
చేరి యొరులకుఁబని - సేసి యలసే నేను
సారె నా యోగాభ్యా - సాన నలసేను
ఆరసి నే నడుగఁగ - నన్యు లిచ్చే యీవులు
తారి పూర్వకర్మాది - దైవమే యిచ్చీని
||చాలు||
అందు సంతోషమే ఫల - మిందు సంతోషమే ఫల
మందును మాయకల్పిత - మిందును మాయే
అందు నిందను శ్రీ వేంక - టాధీశుడే కర్త
అందైతేఁ బరతంత్రు - డిందునే స్వతంత్రుఁడ
||చాలు||
____________________________________________
నా వైరాగ్యమే సకల సంపదల తో కూడిన సామ్రాజ్యము. విరాగై చేసుకోవడానికి నాకు తగినంత పని వుంది.
ఇన్నాళ్లు భ్రమ తో ఇతర మానవుల ఇళ్లకు కాపలా కాస్తూ వున్నాను. ఇప్పుడు భ్రమలు తొలిగి నా హృదయం లో వున్న హరిని గుర్తించి ఆయనకు కావలిగా వుండదలిచాను. అలాగే ఇతరులను సేవించి వారి రాజ్యములు ఏలుచున్న నేను ఇప్పుడు నాలోని మనోరాజ్యాన్ని పాలించసాగాను.
ఇన్నాళ్లు ఇతరులకు ఆనేక రకాలుగా సేవలు చేసి అలసిపోతున్న నేను ఇప్పుడు నా మనస్సుని నియంత్రణ లో వుంచడానికి యోగాభ్యాసం చేస్తూ అలసిపోతున్నాను. నేను అడుగగా ఇంతవరకు ఇతరులు నా కిచ్చుచున్న సంపదలు ఇప్పుడు నా పూర్వకర్మ ఫలంగా దైవమే నాకు ఇస్తున్నది.
ఇంతవరకు నేను చేసే పనికి ఫలము సంతోషమే. ఇప్పుడు నేను చేసే పనికి ఫలం సంతోషమే. అదీ మాయా కల్పితమే, ఇదీ మాయా విలాసామే. దానికి, దీనికి కర్త శ్రీ వెంకటేశ్వరుడే. కాని ఆ మార్గంలో వున్నంత కాలం నేను పరతంత్రుడను(ఇంకొకరి సేవకుడను). ఇప్పుడు ఈ మార్గంలో నేను స్వతంత్రుడను.
సంసారి సేవాధర్మము అనుసరించి సేవకుడవుతున్నాడు. ఇతరుల నాశ్రయించి బతుకుట దుఖభూయిష్టమైనది.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :భగవంతుని పై భక్తి ఒక్కటే ఉత్తమ జాతి లక్షణం
____________________________________________
తాళం :లలిత

విజాతు లన్నియు - వృథా వృథా
అజామిళాదుల - కది యేజాతి
జాతిభేదములు - శరీరగుణములు
జాతి శరీరము - సరితోడనె చెడు
ఆతుమ పరిశుద్ధం బెప్పుడును - అది నిర్దోషం బనాది
యీతల హరివిజ్ఞానపు దాస్యం - బిది యెక్కటె పో సుజాతి
||విజా||
హరి యిందరిలో - నంతరాత్ముఁడిదె
ధరణి జాతి భే - దము లెంచిన
పరమయోగు లీభావ మష్టమదము - భవనికారమని మానిరి
ధరణిలోనఁ బరతత్త్వజ్ఞానము - ధర్మమూలమే సుజాతి
||విజా||
లౌకిక వైదిక - లంపటులకు నివి
కైకొను నవశ్య - కర్తవ్యంబులు
శ్రీకాంతుఁడు శ్రీ వేంకటపతి సే - సినీ సంపాదన మిందరికి
మేకొని యిన్నియు మీరినవారికిఊ-మీ నామమే సుజాతి
||విజా||
____________________________________________
విభిన్నములైన జాతుల వలన ఉపయోగం లేదు. ఇవి వ్యర్థములు. అజామిళుడు మొదలైన కులభ్రష్టులైన వారి దేమి జాతి?
జాతులలో గల తేడాలన్ని అశాశ్వతమైన శరీరమునకు సంబంధించిన స్వభావాలే. శరీరముతో పాటు అవి కూడా నశించి పోతాయి. ఆత్మ ఒకటే దోషము లేనిది మరియు ఆది అంతం లేనిది. కాబట్టి ఆత్మ లోని హరిని తెలుసుకుని అతని దాస్యం చేయుటే ఉత్తమ జాతి లక్షణం.
శ్రీహరి అందరి లోను అంతరాత్ముడై వున్నాడు. అందుకే పరమ యోగులు అష్ట మదములతో నిండి తిరస్కారభావం తో గల జాతిభేదమును విడనాడారు. పరతత్త్వం తెలుసుకుని అందుకు అవసరమైన ధర్మాలను పాటించుటే ఉత్తమ జాతి లక్షణం.
లౌకిక కార్యాలలోను, వైదిక ఆచారాలలోను నిమగ్నులైనవారు మాత్రమే జాతిభేదాలు పాటిస్తారు. ఇవి లక్ష్మికాంతుడైన శ్రీవేంకటేశ్వరుడు తన మాయ చే జీవులకిచ్చిన సంపదలు. దేవా! ఈ మాయను ప్రయత్నం తో అతిక్రమించి సదా మిమ్ము ధ్యానించువారికి మీ నామ సంకీర్తనం ఒక్కటే ఉత్తమ జాతి లక్షణం.
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :విష్ణువన్నా శివుడన్నా ఎలా పలికినా భగవంతుడొకడే
____________________________________________
తాళం :బౌళి

ఎంత మాత్రమన నెవ్వరు దలచిన - అంతమాత్రమే నీవు

అంతరాంతరము లెంచిచూడఁ బిం - డంతే నిప్పటి యన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు - కూరిమితో విష్ణుడని

పలుకుదురు మిము వేదాంతులు - పరబ్రహ్మంబనుచు

తలఁతురు మిము శైవులు - తగిన భక్తులను శివుఁడనుచు

అలరి పొగడుదురు కాపాలికులు - ఆది భైరవుఁడనుచు

||ఎంత||

సరి నెన్నుదురు శాక్తేయులు - శక్తిరూపు నీవనుచు

దరిశనముల మిము నానావిధులను - తలపులు కొలదుల భజింతురు

సిరుల మిమ్మునే యల్పబుద్దిఁదలఁ - చినవారికి నల్పంబవుదువు

గరిమల మిమునే ఘనమని తలచిన - ఘనబుద్దులకు ఘనుఁడవు.

||ఎంత||

నీవలనఁ గొరతే లేదు మరి - నీరు కొలది తామెరపు

ఆవల భాగీరథి దరిబావుల - ఆ జలమే పూరినయట్లు

శ్రీ వేంకటపతి నీవైతే మముఁ - జేకొని దైవమని

యీవల నేనీ శరణనియెదను - యిదియే పరతత్త్వము నాకు

||ఎంత||

____________________________________________

దేవా! ఎవ్వరెవ్వరు ఎలా తలిస్తే అలా వారికి కన్పిస్తావు. నిను పూజించే విధములు వేరైనా, లోన పరిశీలించి చూస్తే పిండి కొద్ది రొట్టె లా ఫలితం వుంటుంది.
వైష్ణవులు నిను విష్ణువని పూజిస్తారు. వేదాంతులు "పరబ్రహ్మం" అని అంటారు. శైవులు తమ భక్తి పద్దతులలో శివుడని భావిస్తారు. అదే కాపాలికులు నిన్ను ఆదిభైరవుడని పొగడుతారు.
ఇక శాక్తేయులు నిన్ను శక్తి స్వరూపుడిగా భావిస్తారు. ఇలా వారి వారి పద్దతుల బట్టి నిన్ను పూజిస్తే అలా దర్శనమిస్తూ వుంటావు. అల్పబుద్ది తో తక్కువగా చూచేవారికి అల్పునిగానే కన్పిస్తావు. మహిమగల గొప్ప దేవునిగా చూచేవారికి నీవు గొప్ప దేవుని గానే కన్పిస్తావు.
నీలో ఎలాంటి లోపము, తేడా లేదు. నీవు నీరు కొలది తామర పువ్వు అన్నట్లు భక్తి కొలది ఫలము ఇచ్చేవాడవు. గంగానది ఒడ్డున గల బావులలో గంగాజలమే వూరినట్లు, పలురీతులలో కొలిచేవారికి తగినట్లే నీవు వారికి కన్పిస్తావు. శ్రీవేంకటేశ్వరా! నీవే మమ్మల్ని రక్షించే దేవుడని నమ్మి నిన్ను శరణు కోరాను. ఇదే నాకు పరతత్త్వము. ఇదే నాకు ముక్తిప్రదం.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : శాంతి, వైరాగ్యము, సత్యం, గురుసేవ మొదలైన భాగవత ధర్మాలు కలిగినవారికి ఎటువంటి ఇబ్బందులు, ఆపదలు కలుగవు
____________________________________________
తాళం :ముఖారి

దేవా నీవు గల్పించిన - తెరువు లివి
నీవారైన వారి - నేరుపు లివి

పరమశాంతునఁకు - బాపము రాదు
విరతి గలవానికి - వెరపుఉలేదు
గురుసేవారతునకుఁ - గోపము రాదు
ధర సత్యవిదునకుఁ - దప్పు లేదు
||దేవా||
పుట్టు బ్రహ్మచారికి - బుద్ధి చెడదు
అట్టె ఆసలేనివారికి - అలపు లేదు
తొట్టిన సుజ్ఞానికి - దుఖము లేదు
గట్టియైన మౌనికి - కలహమే లేదు
||దేవా||
సమచిత్తునకు - చంచలము గాదు
విమలాచారునకు - వెలితి లేదు
నెమకి శ్రీవేంకటేశ - నీదాసులై కొల్చి
భ్రమయని వారికి - భారము లేదు
||దేవా||
_____________________________________________

దేవా! నీవు మానవులకు ఏర్పాటు చేసిన ధర్మాలివి. నీ దాసులైన పరమ భాగవతులు ఆచరించే సద్గుణాలు.

మిక్కిలి శాంతము గలిగిన వానికి పాపము రాదు. విషయ (దైహిక) సుఖాల యందు విరక్తి గలవానికి భయమనేది వుండదు. గురుసేవ యందు నిమగ్నుడైనవానికి కోపము రాదు. సత్యం తెలిసినవానికి ఎటువంటి దోషములుండవు.

పుట్టిన క్షణం నుంచి బ్రహ్మచర్యం పాటించేవాని బుద్ధి చెడుత్రోవ పట్టదు. ఆశలు ఎక్కువ లేనివానికి అలపు వుండదు. పరిపూర్ణమైన జ్ఞానం తెలిసినవానికి దుఖమనేది కలుగదు. ధృడంగా మౌనం పాటించేవాని ఏ సందర్భమునైనా కలహము (గొడవలు) రాదు.

సుఖదుఃఖాలు, మానావమానములు, జయాపజయములు, శీతోష్ణములు యందు సమచిత్తం (సమదృష్టి) కలిగినవానికి మనస్సు చలించడం వుండదు. నిర్మలమైన ఆచారాలు పాటిస్తూ శుచిగా వున్న వానికి ఎట్టి లోపము వుండదు. శ్రీవేంకటేశ్వరా! నిన్ను దాసులై సేవించువాడు సంసార మాయలకు లోను కాడు. జీవితం భారము గాక సుఖముగా వుంటుంది.

చిన్న చిన్న మాటలు. పెద్ద పెద్ద భావాలు. అన్నమయ్య ఈ సంకీర్తన ప్రత్యేకత.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :అన్నమయ్య తన సంకీర్తనలన్ని పుష్పాలుగా అర్పించి తీసుకుని దాచుకోవయ్యా.
ఈ కీర్తన ప్రాచుర్యం పొందింది.
____________________________________________
తాళం :గుండక్రియ

దాఁచుకో నీ పాదాలకుఁ - దగనేఁ జేసిన పూజ లివి
పూఁచి నీ కీరితి రూప - పుష్పము లివి మయ్యా!

ఒక్క సంకీర్తనే చాలు - వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భాండారాన - దాచివుండనీ
వెక్కసమగు నీ నామము - వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విఁక నవి - తీరని నాధనమయ్యా!
||దాఁచు||
నానాలికపైనుండి - నానా సంకీర్తనలు
పూనిక నాచే నిన్ను - బొగడించితివి
వేనామాల వెన్నుఁడా - వినుతించ నెంతవాఁడ
కానీమ్మనీ నాకీపుణ్యము - గట్టితి వింతేయయ్యా!
||దాఁచు||
ఈ మాట గర్వము కాదు - నీ మహిఁమే కొనియాడితిఁగాని
చేముంచి నా స్వాతంత్య్రము - చెప్పిన వాఁడఁగాను
నేమానఁ బాడేవాఁడను - నేరము లెంచకుమీ
శ్రీమాధవ! నేనీ దాసుఁడ - శ్రీవేంకటేశుఁడవయ్యా!
||దాఁచు||
_____________________________________________
దేవా! నేను రచించిన సంకీర్తనలన్ని నీ పాదములపై పూజకు వుంచిన పుష్పాలు. ఈ పుష్పాలన్ని నీ కీర్తిని నలుదిశలా చాటే ప్రత్యేకమైన లక్షణం కలవి. స్వామి! వీటన్నింటిని భద్రంగా దాచుకో మరి.

మమ్మల్నందరిని కాపాడటానికి, నీవు ఒక్క సంకీర్తన వింటే చాలు. మిగిలినవన్ని భాండగారం లో దాచి వుంచుకో. నీ నామము చాల దుర్లభం గా దొరుకుతుంది. కాని నామపు వెల తక్కువ, లభించే ఫలితం అధికం. నన్ను రక్షించడానికి నీ నామ సంకీర్తన ప్రభావమే దిక్కైంది. ఈ నీ నామ సంకీర్తనలే నా తరిగిపోని సంపదలయ్యా!

నీవే నా నాలుక పై పూని, ఈ సంకీర్తనలన్ని నాచే వ్రాయించి, పాడించి పొగడింప చేసుకున్నావు. వేయి నామాలు గల విష్ణుమూర్తివి! నిన్ను స్తుతించడానికి నేనెంత వాడిని. నీవే నాపై దయ చూపి కానిమ్మని నాకీ పుణ్యం అంటగట్టావు. అంతే

ఈ మాట నేను గర్వం గా చెప్పటం లేదు. నీ మహిమలని కొనియాడాను, అంతే. కావాలని నా కిచ్చిన స్వేచ్ఛ నేను చెప్పడం లేదు. ఈ కీర్తనలన్ని నియమం తప్పకుండా రోజూ నేను గానం చేస్తున్నాను. నాలోని తప్పులు వెతకవద్దు. ఓ మాధవ! నాకు తెలుసు నీవే శ్రీవేంకటేశ్వరుడవని. నేను నీ దాసుడిని స్వామి!

ఎస్పి బాల సుబ్రమణ్యం గారు పాడిన ఈ సంకీర్తన వినండి. హృదయం అలా కరిగిపోతుంది.

మీ

అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మనం చేసే పనులకు కర్త, కర్మ, క్రియ మనమేనని అహంకారం తో విర్రవీగుతుంటాం. కాని మన ప్రవృత్తులంన్నిటికి పరమాత్ముడే మూలకారణము.
____________________________________________
తాళం :ముఖారి

ఇట్టి నా వెఱ్ఱితనము - ఏమని చెప్పుకొందును

నెట్టన నిందుకు నగి - నీవే దయఁజూడవే

పాటించి నాలో నుండి - పలికింతువు నీవు

మాటలాడ నేరుతు నంటా - మరి నే నహంకరింతును

నీటున లోకము లెల్లా - నీవే ఏలుచుండఁగాను

గాటాన దొరనంటా - గర్వించు నేను

||ఇట్టి||

నెమ్మది బ్రజల నెల్లా - నీవే పుట్టించఁగాను

కమ్మి నేనే బిడ్డలఁ - గంటినంటా సంతసింతును

సమ్మతి నీవే సర్వ - సంపదలు నొసఁగగాను

యిమ్ముల గడించుకొంటి - నివి నే నంటా నెంతు

||ఇట్టి ||

మన్నించి యహపరాలు - నీవే యియ్యఁగాను

ఎన్నుకుని నా తపో మ - హిమ యిది యనుచును

ఉన్నతి శ్రీవేంకటేశ - నన్ను నేమి చూచేవు

అన్నిటా నా యాచార్యు - విన్నపమే వినవే

||ఇట్టి ||

____________________________________________

ఇది నా పిచ్చితనము కాకపోతే ఏమిటి. అంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నావల్లే జరుగుతోంది అనుకుంటున్నాను. నా వెఱ్ఱితనము పై నవ్వుకుని నన్ను మాత్రం దయ చూపి కాపాడు దేవా!

నీవు నాలో నా అంతర్మాతయై మాటలు పలికిస్తుంటావు, కాని ఇది నా మాటల చమత్కారమని అహంకరిస్తు వుంటాను. లోకాన్ని ఏలే జగన్నాథుడువి నీవైతే, నేనేమో నేనే పాలించే దొరని అని గర్వం చెందుంతుంటాను.

లోకం లో ప్రజలందరిని నీవే పుట్టించుతుంటావు, కాని నా పిల్లల కన్నతండ్రి నేనేగా అని ఆనందిస్తూ వుంటాను. అందరికి సకల సంపదలు నీవే ప్రసాదిస్తుంటావు. కాని ఈ ధన సంపదలు కష్టపడి సంపాదించినది నేనే అని విర్రవీగుతుంటాను.

ఈ లోకం లో భోగభోగ్యాలు, పరలోక మోక్షం ఇచ్చేది నీవైతే, ఇది అంతా నేను చేసిన తపస్సు మహిమ అని నేను అనుకుంటాను. ఉన్నతుడైన శ్రీ వేంకటేశ్వరా! నా వెఱ్ఱితనము ఇంకా ఏం చూస్తావు. నన్ను మన్నించి కరుణించమని మా గురువు చేసిన విన్నపము ఆలకించి కాపాడు దేవా!
--((**))--
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : శాంతి, వైరాగ్యము, సత్యం, గురుసేవ మొదలైన భాగవత ధర్మాలు కలిగినవారికి ఎటువంటి ఇబ్బందులు, ఆపదలు కలుగవు
____________________________________________
తాళం :ముఖారి

దేవా నీవు గల్పించిన - తెరువు లివి

నీవారైన వారి - నేరుపు లివి

పరమశాంతునఁకు - బాపము రాదు

విరతి గలవానికి - వెరపుఉలేదు

గురుసేవారతునకుఁ - గోపము రాదు

ధర సత్యవిదునకుఁ - దప్పు లేదు

||దేవా||

పుట్టు బ్రహ్మచారికి - బుద్ధి చెడదు

అట్టె ఆసలేనివారికి - అలపు లేదు

తొట్టిన సుజ్ఞానికి - దుఖము లేదు

గట్టియైన మౌనికి - కలహమే లేదు

||దేవా||

సమచిత్తునకు - చంచలము గాదు

విమలాచారునకు - వెలితి లేదు

నెమకి శ్రీవేంకటేశ - నీదాసులై కొల్చి

భ్రమయని వారికి - భారము లేదు

||దేవా||

_____________________________________________

దేవా! నీవు మానవులకు ఏర్పాటు చేసిన ధర్మాలివి. నీ దాసులైన పరమ భాగవతులు ఆచరించే సద్గుణాలు.

మిక్కిలి శాంతము గలిగిన వానికి పాపము రాదు. విషయ (దైహిక) సుఖాల యందు విరక్తి గలవానికి భయమనేది వుండదు. గురుసేవ యందు నిమగ్నుడైనవానికి కోపము రాదు. సత్యం తెలిసినవానికి ఎటువంటి దోషములుండవు.

పుట్టిన క్షణం నుంచి బ్రహ్మచర్యం పాటించేవాని బుద్ధి చెడుత్రోవ పట్టదు. ఆశలు ఎక్కువ లేనివానికి అలపు వుండదు. పరిపూర్ణమైన జ్ఞానం తెలిసినవానికి దుఖమనేది కలుగదు. ధృడంగా మౌనం పాటించేవాని ఏ సందర్భమునైనా కలహము (గొడవలు) రాదు.

సుఖదుఃఖాలు, మానావమానములు, జయాపజయములు, శీతోష్ణములు యందు సమచిత్తం (సమదృష్టి) కలిగినవానికి మనస్సు చలించడం వుండదు. నిర్మలమైన ఆచారాలు పాటిస్తూ శుచిగా వున్న వానికి ఎట్టి లోపము వుండదు. శ్రీవేంకటేశ్వరా! నిన్ను దాసులై సేవించువాడు సంసార మాయలకు లోను కాడు. జీవితం భారము గాక సుఖముగా వుంటుంది.

చిన్న చిన్న మాటలు. పెద్ద పెద్ద భావాలు. అన్నమయ్య ఈ సంకీర్తన ప్రత్యేకత.
--((**))--
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : శ్రీవేంకటేశ్వరా! నారదాదులను తరింపచేసినట్టు మమ్మల్ని కాచి తరింపచేయవయ్యా.
____________________________________________

అందుకే పో నీ పై - నాసపుట్టి కొలిచేది

మందలించితి నిఁక - మరి నీ చిత్తము

ఇందరుఁ జెప్పఁగా వింటి - యెవ్వరికైనా విష్ణుఁడే
కందువ మోక్ష మియ్యఁ - గర్త యనఁగా
ముందె వింటి నారదుడు - ముంచి నిన్ను బాడఁగా
పొందుగ లోకములోఁన - బూజ్యుఁడాయ ననుచు
||అందు||
అప్పటి వింటి లోకము - లన్నిటికి హరియే
కప్పి రక్షకత్వానకుఁ - గర్త యనఁగా
ఇప్పడె వింటి ధ్రువుడు - యిటు నిన్ను నుతించే
ఉప్పతిల్లి పట్టమేలు - చున్నాఁ డనుచును
||అందు||
ఇదె వింటి శ్రీ వేంక - టేశ బ్రహ్మకుఁ దండ్రివై
కదిసి పుట్టించఁ బెంచ - గర్త వనుచు
వదలక వింటి నీకు - వాల్మీకి కావ్యము చెప్పి
చెదర కాద్యులలోఁ - బ్రసిద్దుఁడాయ ననుచు
||అందు||
____________________________________________

దేవా! నిన్న పూజించి భజించి వారందరికి మంచి చేశావు అని చెప్పగా విన్నాను. అందుకే నాకు మంచి చేస్తావు అని ఆశ పుట్టి కొలుస్తున్నాను. నీకు వినయంగా విన్నవించుకుంటున్నాను. ఇక మరి నీ ఇష్టం.

పెద్దలందరు "ఎవ్వరికైనా మోక్షం ఇచ్చే ముఖ్యకర్త విష్ణువు" అని చెప్పగా విన్నాను. నారదుడు భక్తి తో నీ నామం కీర్తించి లోకం లో పూజ్యుడైనాడు అన్న మాట ముందే విన్నాను.

"లోకాలన్నింటిని రక్షించి కాపాడే వాడు శ్రీహరి మాత్రమే వేరేవ్వరు కాదు" అన్న మాట కూడా అప్పుడే విన్నాను. మరి ఇప్పుడు విన్నాను" ధ్రువుడు నిన్ను స్తుతించడం వలనే గొప్ఫవాడై ఆకాశం లో ధ్రువతారై ఉదయించుచున్నాడు" అని

శ్రీ వేంకటేశ్వరా! నీవు సృష్టికర్తయైన బ్రహ్మకు తండ్రివై
లోకాలను పుట్టించుటకు, పోషించుటకు ముఖ్యకర్తగా వున్నావని ఇదిగో ఇప్పుడే విన్నాను. అంతేకాదు, వాల్మీకి మహర్షి నీ మీద కావ్యము వ్రాసి ఆదికవులలో అగ్రగణ్యుడైనాడని కూడా విన్నాను.

ఇందరిని దయచూసిన శ్రీనివాసా! నా పై దయ చూపి ముక్తి ప్రసాదించు స్వామి
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : కామక్రోధలోభమద మాత్సర్యాది దుర్గుణాలని సైతం హరికి అంకితం చేయవచ్చును. అది సుగతికి మార్గమవుతుంది. ఏలా ఇది సాధ్యమా ఈ సంకీర్తన లో అన్నమయ్య చెప్పారు.
____________________________________________
తాళం :రామక్రియ

ఇటువంటి వెల్లా నీకే - యిట్టే సెలవు సేసితి
తటుకున నీవనే ని - ధానము చేకొంటిని

కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు
వేమరుఁ గ్రోధించితి - నీ విరోధులపై
నేమమున లోభించితి - నీ మంత్ర మన్యుల కియ్య
ఆముకుని మోహించితి - హరి నీరూపునకు
||ఇటు||
ఎఱుకతో మదించితి - యిట్టే నీదాస్యమున
మఱి నిన్నొల్లని చదువు - మచ్చరించితి
తఱిఁ జలపట్టితి నీ - తప్పని భక్తియందు
వెఱవక నిన్నొల్లని - విధుల నిందించితి
||ఇటు||
కలకర్మము లెల్లా నీ - కైంకర్యములందు వెట్టితి
బలు మమకారము నీ - పైఁ జేర్చితి
ఎలమి శ్రీవెంకటేశ - యిన్నిటా నన్నేలితివి
నిలిచిన కాలమెల్లా - నీ సేవ చేసితి
||ఇటు||
____________________________________________
దేవా! నావి మంచి గుణాలో లేక చెడ్డ గుణాలో, అన్ని నీ కోసమే ఉపయోగించాను. అందుకే తటుక్కున నీవు నాకు లభించావు.

నా మనస్సున నిన్నే ప్రేమించి నీతోనే నా సంసార సుఖమనుకుంటిని. నీ శత్రువు నా శత్రువని వారిపై కోపము చెందితిని. నీ నామమంత్రం ఇంకొకరికి ఇవ్వరాదని పిసినారి నయ్యితిని. శ్రీహరి! నీ మనోహర సుందర రూపాన్ని మోహించితిని.

నీ సేవ చేసే దాసుని నేనే కదా అని గర్వించితిని. నిన్ను ప్రసాదించిన చదువులను తిరస్కరించితిని. తప్పిపోతుందేమో అని నీ భక్తిని పట్టుదలతో కలిగివుంటిని. నీకు సమర్పించని పనులన్ని నిర్భయంగా తిరస్కరించితిని.

నేను సంపాదించిన కర్మఫలమంతా నీ కైంకర్యమునకే వినియోగించితిని. అంతులేని మమకారం నీపై నుంచితిని. శ్రీ వేంకటేశ్వరా! ప్రేమతో నన్ను ఇన్ని విధాలుగా కాపాడితివి. అందుకే నే బతికినంతకాలం నీ సేవ చేసి ధన్యుడనైతిని
--((**))--*
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :విశిష్టాద్వైత వేదాంత రహస్యమంతా తొమ్మిది మాటలలో చెప్పారు
____________________________________________
తాళం :హిందోళవసంతం

మూఁడే మాటలు - మూఁడు మూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో - వేదాంత రహస్యము

జీవస్వరూపము - చింతించి యంతటాను
దేవుని వైభవము - తెలిసి
భావించి ప్రకృతి సం - పద యిది యెఱుఁగుటే
వేవేలు విధముల - వేదాంత రహస్యము
||మూఁడే||
తనలోని జ్ఞానము - తప్పకుండాఁ దలపోసి
పనితోడ నందువల్ల - భక్తి నిలిపి
మనికిగా వైరాగ్యము - మరవకుండుటే
వినవలసినయట్టి - వేదాంత రహస్యము
||మూఁడే||
వేడుకతో నాచార్య - విశ్వాసము కలిగి
జాడల శరణాగతి - సాధనము తో
కూడి శ్రీవేంకటేశ్వరుఁ - గొలిచి దాసుఁడౌటే
వీడని బ్రహ్మానంద - వేదాంత రహస్యము
||మూఁడే||
____________________________________________
వేదాంతము లో చెప్పినదంతా మూడు మూళ్లు తొమ్మిది మాటలలో తెలుసుకునవచ్చును. గురువులను ప్రార్ధించి ఈ వేదాంత రహస్యములు నేర్చుకునవచ్చును.

జీవ స్వరూపము అనగా మన పుట్టుక గురించి తెలుసుకోవాలి . సర్వకాల సర్వావస్థలయందు దేవుని వైభవము ఎలా వుంటుందో తెలుసుకోవాలి. మన చుట్టూ వున్న ప్రకృతి సంపద గురించి వివయంగా అర్థం చేసుకోవాలి. ఈ మూడు తెలుసుకుంటే వివిధ వేదాంత రహస్యాలు తెలిసినట్టే.

తనలో దాగిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞాన సహాయంతో ధృఢమైన భక్తి పెంపొందించుకోవాలి. ఆ తర్వాత వైరాగ్యము జీవిత సారంగా గ్రహించి మరవకుండా వుండాలి. ఇంతకు మించిన వేదాంత రహస్యము వేరొకటి లేదు.

సంతోషంగా ఆచార్యుని పై నమ్మకం వుంచాలి. గురువు నిర్దేశించిన మార్గం అనుసరించి శరణాగతి ముఖ్యసాధనం గా భావించాలి. దానితో శ్రీవెంకటేశ్వరుని దాసునిగా సేవ చేయాలి. ఇదే తెలుసుకోవలసిన బ్రహ్మానందమైన వేదాంత రహస్యము.

అన్నమయ్య తొమ్మిది మాటలన్నారు ఈ కీర్తన లో.
1)జీవుడు 2)దేవుడు 3)ప్రకృతి 4)జ్ఞానం 5)భక్తి 6)వైరాగ్యము 7)గురువు 8)శరణాగతి 9)భగవత్ దాస్యం. ఇవి అలవాటైతే వేదాంత సారము మొత్తం తెలిసినట్లే.
--((**))--
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :శ్రీహరికి సమర్పించని కొలువులు, కధలు, తపములు, పూజలు వ్యర్ధం.
____________________________________________
తాళం :దేసాక్షి

ఎంచి చూడరో ఘనులారా - యిందీవరాక్షుఁడు రక్షకుఁడు
సంచితముగ నీతని శరణంబే - సర్వఫలప్రద మిందరికి

హరిఁ గొలువని కొలువులు మఱి - యడవిఁగాసిన వెన్నెలలు
గరిమల నచ్యుతు వినని - కధలు భువి గజస్నానములు
పరమాత్మునికిఁ గాని తపంబులు - పాతాళముల నిధానములు
మరుగురునికిఁగాని పూవులపూజలు - మగఁడులేని సింగారములు
||ఎంచి||
వైకుంఠుని నుతియించని వినుతులు - వననిధిఁ గురిసిన వానలు
ఆ కమలోదరుఁగోరని కోరిక - లందని మానిఫలంబులు
శ్రీకాంతునిపైఁజేయని భక్తులు - చెంబుమీఁది కనకపుఁబూఁత
దాకొని విష్ణుని తెలియని తెలుపులు - తగనేటినడిమి పైరులు
||ఎంచి||
వావిరిఁగేశపు నొల్లని బదుకులు - వరతఁగలపు చింతపండు
గోవిందుని కటు మొక్కని మొక్కులు - గోడలేని పెనుచిత్రములు
భావించి మాధవునిపై లేని తలపులు - పలు మేఘముల వికారములు
శ్రీవేంకటపతి కరుణ గలిగితే - జీవుల కివియే వినోదములు
||ఎంచి||
____________________________________________
పెద్దలారా! తెలుసుకోండి. శ్రీహరి యే అందరిని రక్షించే వాడు. ఈ విషయం గ్రహించి ఆయనను శరణు వేడితే అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి.

శ్రీహరికి అంకితం చేయని సేవలు, కొలువులో అడవిలో కాచిన వెన్నెల వలె నిష్ప్రయోజనాలు. ఘనుడైన అచ్యుతుని గురించి కాక వేరేవారి గురించి వినే కధలు ఏనుగు చేసే స్నానములాగా ఉపయోగం లేనివి. పరమాత్ముడైన హరి గురించి కాక వేరేవారి కోసం చేసే తపస్సులు భూమిలో వున్న పాతరల వలె పనికిరానివి. మన్మధుని తండ్రి మాధవుని కోసం కాక వేరేవారికోసం చేసే పువ్వుల పూజలు, అలంకరణలు, మగడు లేని మగువ చేసే సింగారముల వలె నిష్ఫలములు.

వైకుంఠుని కొలవని స్తోత్రాలు సముద్రంలో పడే వాన వలె నిరుపయోగములు. పద్మనాభుని కాక వేరే దేవుని కోరే కోరికలు అందని చెట్ల ఫలములు వలె అసాధ్యాలు. శ్రీకాంతుని పైన గాక ఇతరుల పై చూపించే భక్తి చెంబు పై బంగారుపూత వలె విలువలేనిది. విష్ణువు గురించి తెలియచెప్పని చదువులు నీటినడుమ పెంచిన పంటల వలె ఉపయోగం లేనివి.

కేశవుని తత్పరత తో నంగీకరించక వేరేవారి పై మోహం పెంచుకున్న బతుకులు నీటిలో గలిసిన చింతపండులా వ్యర్థం. గోవిందుని కాక వేరేవారిని మొక్కే మొక్కులు గోడ లేని చిత్రాలులాగ చూడలేనివి. మాధవుని కాక వేరేవారిని తలిచే తలపులు మేఘాలు చేసే వికారములాంటివి. శ్రీ వేంకటేశ్వరునికే అన్ని అర్పించి ఆయన కరుణ పొందగలిగతే జీవుని కంతా ఆనందములే.
--((**))--
అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :శ్రీహరిని ఆరాధించని బతుకు నిష్పలము
____________________________________________
తాళం :భైరవి

హరి హరి జగమెఱుంగ నీ - వాతుమలోనే వున్నాఁడవు
సురల గాచుటయు నసురల నడచుట - చొప్పడియున్నది నీ గురుతు

వేదార్ధము దప్పఁదెలిసిన - విద్వాంసుని వంటిది
పొదుగు జదువక తర్కించఁబోవు - పాండిత్యము వంటిది
మేదిని నడలవులఁదెరువు దప్పి మరి - మెలఁగేటి తెరువరి వంటిది
ఆదిమూర్తి నీ శరణు చొచ్చి నిను - నారాధించని వాని బదుకు
||హరి||
వట్టి జోలితో నూరక దే - వర లేని పూజవంటిది
వొట్టుక ఫలములు లేని పంటకు - వొడిగట్టే యటువంటిది
నెట్టనఁ గర్ణధారుడు లేని జల - నిధి నడిమియోడవంటిది
బట్ట బయటనే పరమేశ్వర నీపై - భక్తిలేనివాని బదుకు
||హరి||
పొందుగ ధర్మము బోధించెడి స - త్పరుషులు లేని సభవంటిది
చెంది శ్రీవేంకటేశ్వర నీ మహిమలు - చెప్పని కథవంటిది
సందడి నన్నియుఁజేసి దక్షిణలు - చాలని యజ్ఞము వంటిది
యిందిరారమణ నీవెక్కుడనుచు - నిన్నిటఁ దెలియని వాని బదుకు
||హరి||
____________________________________________

హరి హరి! నీవు జగమంతటా వున్నావు. దేవతలను రక్షించడం, అసురులు శిక్షించడం లోనే నీవున్నావన్న నిదర్శనం కనపడుతోంది. మరి నిన్ను శరణని ఆరాధించని బతుకు వ్యర్థం. నిష్ప్రయోజనం.

ఓ ఆదినారాయణా! నిన్ను ఆరాధించని వాడి బతుకు ఎలాటిందంటే :
వేదార్ధము తప్పుగా అర్థం చేసుకున్న పండితుడి వంటిది. సర్రిగా చదవక తర్కానికి దిగే పాండిత్యం వంటిది. అంతా తెలుసు అనుకుని అడవిలో దారితప్పి తిరిగే వాని తెలివి వంటిది.

దేవుడు లేకుండా ఖాళి జోలె తో చేసే పూజ వంటిది, ఫలమివ్వని పంటకు ఒడిగట్టు కట్టేటు వంటిది, నడిసముద్రం లో నడిపే నావికుడు లేని పడవ వంటిది పరమేశ్వరా! నీపై భక్తి లేని వాని బ్రతుకు.

ధర్మం చక్కగా బోధించే మంచి మనుషులు లేని సభ వంటిది, శ్రీ వేంకటేశ్వరుని మహిమలు లేని కధ వంటిది, బ్రహ్మాండమైన సందడి చేసి దక్షిణలు ఇవ్వలేని యాగం లాంటిది, ఓ ఇందిరారమణా! నీ వెక్కడ అని వెతుకుతూ నిన్ను తెలుసుకేలేని వాని బ్రతుకు.

భగవంతుడు మన ముందరే వున్నాడు. మన కలచరణాదీంద్రియములు సాధన చేసి విష్ణుపరములైనపుడే ఆయన శరణు లభిస్తుంది. అలా చేయలేని వాడి జీవితం నిరర్థకం.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మనం చేసే పనులకు కర్త, కర్మ, క్రియ మనమేనని అహంకారం తో విర్రవీగుతుంటాం. కాని మన ప్రవృత్తులంన్నిటికి పరమాత్ముడే మూలకారణము.
____________________________________________
తాళం :ముఖారి

ఇట్టి నా వెఱ్ఱితనము - ఏమని చెప్పుకొందును
నెట్టన నిందుకు నగి - నీవే దయఁజూడవే

పాటించి నాలో నుండి - పలికింతువు నీవు
మాటలాడ నేరుతు నంటా - మరి నే నహంకరింతును
నీటున లోకము లెల్లా - నీవే ఏలుచుండఁగాను
గాటాన దొరనంటా - గర్వించు నేను
||ఇట్టి||
నెమ్మది బ్రజల నెల్లా - నీవే పుట్టించఁగాను
కమ్మి నేనే బిడ్డలఁ - గంటినంటా సంతసింతును
సమ్మతి నీవే సర్వ - సంపదలు నొసఁగగాను
యిమ్ముల గడించుకొంటి - నివి నే నంటా నెంతు
||ఇట్టి ||
మన్నించి యహపరాలు - నీవే యియ్యఁగాను
ఎన్నుకుని నా తపో మ - హిమ యిది యనుచును
ఉన్నతి శ్రీవేంకటేశ - నన్ను నేమి చూచేవు
అన్నిటా నా యాచార్యు - విన్నపమే వినవే
||ఇట్టి ||
____________________________________________
ఇది నా పిచ్చితనము కాకపోతే ఏమిటి. అంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నావల్లే జరుగుతోంది అనుకుంటున్నాను. నా వెఱ్ఱితనము పై నవ్వుకుని నన్ను మాత్రం దయ చూపి కాపాడు దేవా!

నీవు నాలో నా అంతర్మాతయై మాటలు పలికిస్తుంటావు, కాని ఇది నా మాటల చమత్కారమని అహంకరిస్తు వుంటాను. లోకాన్ని ఏలే జగన్నాథుడువి నీవైతే, నేనేమో నేనే పాలించే దొరని అని గర్వం చెందుంతుంటాను.

లోకం లో ప్రజలందరిని నీవే పుట్టించుతుంటావు, కాని నా పిల్లల కన్నతండ్రి నేనేగా అని ఆనందిస్తూ వుంటాను. అందరికి సకల సంపదలు నీవే ప్రసాదిస్తుంటావు. కాని ఈ ధన సంపదలు కష్టపడి సంపాదించినది నేనే అని విర్రవీగుతుంటాను.

ఈ లోకం లో భోగభోగ్యాలు, పరలోక మోక్షం ఇచ్చేది నీవైతే, ఇది అంతా నేను చేసిన తపస్సు మహిమ అని నేను అనుకుంటాను. ఉన్నతుడైన శ్రీ వేంకటేశ్వరా! నా వెఱ్ఱితనము ఇంకా ఏం చూస్తావు. నన్ను మన్నించి కరుణించమని మా గురువు చేసిన విన్నపము ఆలకించి కాపాడు దేవా!

*****
అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : శాంతి, వైరాగ్యము, సత్యం, గురుసేవ మొదలైన భాగవత ధర్మాలు కలిగినవారికి ఎటువంటి ఇబ్బందులు, ఆపదలు కలుగవు
____________________________________________
తాళం :ముఖారి

దేవా నీవు గల్పించిన - తెరువు లివి
నీవారైన వారి - నేరుపు లివి

పరమశాంతునఁకు - బాపము రాదు
విరతి గలవానికి - వెరపుఉలేదు
గురుసేవారతునకుఁ - గోపము రాదు
ధర సత్యవిదునకుఁ - దప్పు లేదు
||దేవా||
పుట్టు బ్రహ్మచారికి - బుద్ధి చెడదు
అట్టె ఆసలేనివారికి - అలపు లేదు
తొట్టిన సుజ్ఞానికి - దుఖము లేదు
గట్టియైన మౌనికి - కలహమే లేదు
||దేవా||
సమచిత్తునకు - చంచలము గాదు
విమలాచారునకు - వెలితి లేదు
నెమకి శ్రీవేంకటేశ - నీదాసులై కొల్చి
భ్రమయని వారికి - భారము లేదు
||దేవా||
_____________________________________________

దేవా! నీవు మానవులకు ఏర్పాటు చేసిన ధర్మాలివి. నీ దాసులైన పరమ భాగవతులు ఆచరించే సద్గుణాలు.

మిక్కిలి శాంతము గలిగిన వానికి పాపము రాదు. విషయ (దైహిక) సుఖాల యందు విరక్తి గలవానికి భయమనేది వుండదు. గురుసేవ యందు నిమగ్నుడైనవానికి కోపము రాదు. సత్యం తెలిసినవానికి ఎటువంటి దోషములుండవు.

పుట్టిన క్షణం నుంచి బ్రహ్మచర్యం పాటించేవాని బుద్ధి చెడుత్రోవ పట్టదు. ఆశలు ఎక్కువ లేనివానికి అలపు వుండదు. పరిపూర్ణమైన జ్ఞానం తెలిసినవానికి దుఖమనేది కలుగదు. ధృడంగా మౌనం పాటించేవాని ఏ సందర్భమునైనా కలహము (గొడవలు) రాదు.

సుఖదుఃఖాలు, మానావమానములు, జయాపజయములు, శీతోష్ణములు యందు సమచిత్తం (సమదృష్టి) కలిగినవానికి మనస్సు చలించడం వుండదు. నిర్మలమైన ఆచారాలు పాటిస్తూ శుచిగా వున్న వానికి ఎట్టి లోపము వుండదు. శ్రీవేంకటేశ్వరా! నిన్ను దాసులై సేవించువాడు సంసార మాయలకు లోను కాడు. జీవితం భారము గాక సుఖముగా వుంటుంది.

చిన్న చిన్న మాటలు. పెద్ద పెద్ద భావాలు. అన్నమయ్య ఈ సంకీర్తన ప్రత్యేకత
#తాళ్ళపాకఅన్నమాచార్యసంకీర్తన

రాగము: ముఖారి

ఒలపక్షము లేనొక్క దేవుఁడవు
నలినాక్ష హరీ నమో నమో
॥పల్లవి॥

నేరిచిన నే నేరకుండిన నీ
కారుణ్య మొక్కటే కలది
పారి ఘంటాకర్ణుభ క్తికి సరిగా
చేరి శుకాదులఁ జేకొంటిగాన
॥ఒల॥

సాదనైన నేఁ జలమతినైనా నీ
పాదమొక్కటేఁ నే బట్టినది
పాదైన వసిష్ఠు భక్తికి సరిగా
మేదిని వాల్మీకి మెచ్చితి గాన
॥ఒల॥

యేమిటా శ్రీ వేంకటేశ యెంతైన నీ
నామమొక్కటే నే నమ్మినది
సామజము భక్తి సరిగా నీవును
ప్రేమతోఁ బ్రహ్లాదుఁ బెంచితిగాన
॥ఒల॥

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము :మానవుడు ప్రయత్నిస్తే దేనినైనా సాధించవచ్చు
_____________________________________________
తాళం :వరాళి

మహి నుద్యోగి గావలె - మనుజుఁడైనవాఁడు

సహజివలె నుండేమీ - సాధింపలేఁడు

వెదకి తలచుకొంటే - విష్ణుఁడు గానవచ్చు

చెదరి మఱచితే - సృష్టి చీఁకటౌ
పొదిలి నడిచితేను - భూమెల్లా మెట్టిరావచ్చు
నిదిరించితేఁ గాలము - నిమిషమై తోఁచు
||మహి||
వేడుకతోఁ జదివితే - వేదశాస్త్ర సంపన్నుఁడౌ
జాడతో నూరకుండితే - జడుఁడౌను
ఓడక తపసి యైతే - ఉన్నతోన్నతుఁడౌ
కూడక సోమరి యైతే - గుణహీనుఁడౌను
||మహి||
మురహరుఁ గొలిచితే - మోక్షము సాధించవచ్చు
వెర వెఱఁగ కుండితే - వీరిడి యౌను
శరణంటే శ్రీవేంకటే - శ్వరుఁడు రక్షించును
పరగ సంశయించితే - పాషండుఁడౌను
||మహి||
_____________________________________________
భూమి మీద పుట్టిన ప్రతివాడు తప్పకుండా ప్రయత్నించి సాధించాలి. పుట్టినప్పుడు వున్నట్టే ఏ పని చేయకుండా కూర్చుంటే మానవుడు ఏమి సాధించలేడు.

వెదకి వెదకి తలచుకుంటే విష్ణువు కూడా ప్రత్యక్షమవుతాడు. చేతకాదులే అని వూరికే కూర్చుని మరచితే ముందున్న ప్రపంచం కూడా కనపడక చీకటవుతుంది. పట్టుదలతో నడవడం మొదలెడితే విశాలమైన భూమిని కూడా చుట్టి రావచ్చు. బద్దకించి నిదరపోతే జీవితకాల మంతా నిమిషంగా వ్యర్థమైపోతుంది.

సంతోషంగా చదివితే మహావేదశాస్త్ర సంపన్నుడు అవ్వవచ్చు. నాకెందుకులే చదువు అని వదిలేస్తే జడమతి(ఏమిరాని మూర్ఖుడు) లా మిగిలిపోతాడు.

నిగ్రహం తో తపస్సు చేస్తే ఉన్నతులలో ఉత్తముడు కావచ్చు. సోమరిగా కూర్చుండిపోతే గుణహీనుడిగా మిగిలిపోతాడు.

శ్రీమహావిష్ణువుని మనసారా భజించితే ముక్తి సులభంగా లభిస్తుంది. ఇది తెలియక పోతే జీవితం వ్యర్ధంగా గడచిపోతుంది. శ్రీవేంకటేశ్వరుని శరణని ప్రార్ధిస్తే తప్పక ఆయన రక్షణ లభిస్తుంది. కాదని సందేహిస్తే జీవనం చెడిపోతుంది. విలువైన మనుష జన్మ వ్యర్థమైపోతుంది.

పుడమి పై పుట్టిన ప్రతి వ్యక్తి కార్య సాధకుడై జీవించాలి. అప్పుడే దేవుడు కావలసినవి అన్ని ప్రసాదిస్తాడు. సోమరి అయినవాడు ఏమి సాధించక జీవితం వ్యర్థం చేసుకుంటాడు.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : భగవంతుని నమ్మినవారికి మిగతా వాటితో పని లేదు
____________________________________________

తాళం :కన్నడగౌళ

నిన్ను నమ్మి విశ్వాసము - నీపై నిలుపుకొని
ఉన్నవాఁడనిఁక వేరే - ఉపాయ మేమిటికి?

గతియై రక్షింతువో - కాక రక్షించవో యని
మతిలోని సంశయము - మరి విడిచి,
యితరులచే ముందర - నిఁక నెట్టౌదునో యని
వెతతోడఁ దలచేటి - వెరపెల్లా విడిచి
||నిన్ను||
తిరమైన నీ మహిమ - తెలిసేవాఁడ ననే
గరువముతోడి వుద్యో - గము విడిచి
వెరవున నీరూపు - వెదకి కానలే ననే
గరిమ నలపు నాస్తి - కత్వమును విడిచి
||నిన్ను||
ధ్రువమైన నాచేఁతకు - తోడు దెచ్చుకొనే ననే
ఆవల నన్యులమీఁది - యాస విడిచి
వివరించలమేల్మంగ - విభుఁడ శ్రీవేంకటేశ
తవిలితి నా పుణ్యమం - తయు నీకు విడిచి
||నిన్ను||
____________________________________________

దేవా! నిన్ను నమ్మి నీ పై విశ్వాసము వుంచి జీవిస్తున్నాను. నాకు వేరే ఉపాయాలు ఎందుకు?

నీవు నన్ను రక్షిస్తావో లేదా రక్షించవో అన్న సందేహాన్ని మనసు నుంచి తుడిచేసాను. నీవు తప్పక కాపాడతావు అనే గట్టి నమ్మకం వుంది. ఇక ఇతరుల నుంచి వచ్చే ఆపదల పై మనసు లో వున్న భయం వీడి నిర్భయంగా వున్నాను.

నీవు, నీ ప్రభావం అంతా నాకు తెలుసునన్న గర్వం తో చేసే ప్రయత్నాలు వదిలేశాను. నీ లీలలు ఊహాతీతం అని గ్రహించి గర్వరహితుడనైనాను. ఏ ఉపాయం తో నైనా నిన్ను కనుక్కోలేనన్న భావం తో వచ్చిన అలసట వలన కలిగన నాస్తికభావాన్ని వదిలేశాను. ఇప్పుడు నేను పరిపూర్ణ విశ్వాసం కలిగి, నిన్ను సేవించి నీ స్వరూపాన్ని తెలుకోగలను అనే ఆస్తికభావం తో వున్నాను.

నిన్ను సేవించడం లో ఇతరుల సహాయం తీసుకోవచ్చు అన్న ఆశను వదిలేశాను. నాకు నేనే నీకు ఆత్మార్పణం చేయ పూనుకున్నాను. అలమేలమంగకు పతైన శ్రీవేంకటేశ్వరా! నేను సంపాదించిన పుణ్యమంతా నీకు సమర్పించి నిన్ను నా హృదయం లో ప్రతిష్ఠించుకున్నాను. మరి ఇక నీవే నన్ను రక్షించక తప్పదు.

మీ
--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మోక్ష ప్రాప్తికి జీవుడు చాలా కష్టపడాలి. గట్టి ప్రయత్నం చేయాలి
____________________________________________

ఊరకే దొరుకునా - ఉన్నతోన్నత సుఖము

సారంబు దెలిసి కా - జయము చేకొనుట

తలపు లోపలిచింత - దాటినప్పుడు గదా!
అలరి దైవంబు ప్ర - త్యక్షమౌట,
కలుషంపు దుర్మదము - గడచినప్పుడు గదా!
తలకొన్న మోక్షంబు - తనకుఁ జే పడుట
||ఊర||
కర్మంబు కసటువోఁ - గడచినప్పుడు గదా!
నిర్మలజ్ఞానంబు - నెరవేరుట,
మర్మంబు శ్రీహరిని - మరఁగు చొచ్చిన గదా!
కూర్మిఁ దన జన్మమె - కర్ణుడు కెక్కుడౌట.
||ఊర||
తనశాంత ఆత్మ లోఁ - దగిలినప్పుడు గదా!
పనిగొన్న తన చదువు - ఫలియించుట,
ఎనలేని శ్రీవేంక - టేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినఁ గదా - దరిచేరి మనుట
||ఊర||
______________________________________________

అతి ఉన్నతమైన సుఖము అంటే మోక్షము ఊరికే లభించదు. మోక్షం గురించి పూర్తిగా తెలిసి వుండాలి. ఎన్నో వదులుకుని ఎంతో కష్టపడితే గాని మోక్ష మనే విజయం లభించదు.

మనస్సు లోపలి చింతల వలయం నుంచి బయటపడినప్పుడే దేవుడు ప్రత్యక్షమవుతాడు. కలుషితం చేసే పాపకర్మములను దాటి తొలగించుకున్నప్పుడే మోక్ష మార్గం దొరికేది.

జన్మ జన్మల నుంచి వెంటాడి వస్తున్న కర్మలు మాలిన్యం పూర్తిగా కడిగినపుడే నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. హృదయ దేవాలయం లో శ్రీహరి స్థిరనివాస మేర్పడిన్నప్పుడే జన్మ ఉత్తమోత్తమం అవుతుంది.

ఆత్మలో శాంతి నెలకొన్నప్పుడే చదివిన చదువులు ఫలప్రదమవుతాయి. సాటిలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యము లభించినపుడే ఈ సంసార సాగర ఒడ్డు చేరి సుఖించగలిగేది.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :అన్నమయ్య ఈ కీర్తనలో జ్ఞానులకు అజ్ఞానులకు కల భేదం వివరించారు.
______________________________________________
తాళం : భూపాళం

అప్పుడు చూచేదివో - అధికుల నధముల
తప్పక యెచ్చరి యిదే - తలఁచవో మనసా !

కొండలవంటి పనులు - కోరి ముంచుకొంటే నూర
కుండి కైకొననివాఁడే - యోగీంద్రుఁడు
నిండిన కోపములకు - నెపములు గలిగితే
దండితోఁగలఁగని యా - తఁడే ధీరుఁడు
||అప్పుడు||
సూదులవంటి మాటలు - సొరిదిఁ జెవి సోఁకితే
వాదులు పెట్పుకొనని - వాడే దేవుఁడు
పొదుకొన్న సంసార - బంధము నోరూరించితే
అదిగొని మత్తుఁడు గా - నట్టివాఁడే పుణ్యుఁడు
||అప్పుడు||
గాలాల వంటి యాసలు - కడుఁదగిలి తీసితే
తాలిమితోఁ గదల నా - తఁడే ఘనుడు
మేలిమి శ్రీవేంకటేశు - మీది భారము వేసుక
వీలక తనలో విర్ర - వీఁగువాఁడే నిత్యుడు
||అప్పుడు ||
__________________________________________---
ఓ మనసా! లోకం లో తెలివిగలవారు, తెలివిలేనివారు ఎవరో సందర్భము వచ్చినపుడే తెలుస్తుంది. ఇది హెచ్చరిక గా తీసుకుని జ్రాగతగా ప్రవర్తించు.

కొండల వలె మితిమీరిన పనులు మీద వచ్చి పడినా చలించక లెక్కపెట్టనివాడే యోగీంద్రుఁడు. అనేక రకాల కారణాలతో కోపం వచ్చే పరిస్థితులు నిత్యం కలిగినా, నిండైన హృదయముతో ప్రశాంతంగా వుండేవాడే ధీరుడు.

సూదుల వంటి సూటిపోటి మాటలు (నిందలు) తన చెవికి గుచ్చుతున్నట్టు వినబడినా, అట్లు తిట్టినవారితో గొడవలు, కొట్లాటకు దిగిన వాడే దేవుడు. సంసార బంధాలు నోరూరిస్తూ తనను బంధించినా, ఆశపడక నిరాశక్తుడై లొంగక నిలచినవాడే పుణ్యాత్ముడు.

గాలాల వంటి ఆశలు మిక్కిలి గా చుట్టుముట్టి లాగుతున్నా, ఓర్పు వహించి కదలక నిలబడిన వాడే ఘనుడు (గొప్పవాడు). ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోక శ్రీవేంకటేశ్వరుని పై భారం వేసి నిలిచివున్న వాడే నిత్యుడు. నిత్యుడైన వాడు భగవత్ భక్తి తో తనలో తను ఆనందపడుతూ వుంటాడు బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా.

--((**))--*

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : భగవంతుడు కావలనుకుంటే శరణు కోరడమే ముఖ్యోపాయము
_____________________________________________
తాళం : ముఖారి

ఏదుపాయము - యే నిన్నుఁ జేరుటకు
ఆది నంత్యము లేని - అచ్యుత మూరితివి

వెలయ నీ గుణములు - వినుతించే నంటే
తెలియ నీవు గుణా - తీతుఁడవు
చెలరేఁగి నిను మతిఁ - జింతించే నంటే
మలసి నీ వచింత్య - మహిముడఁవు
||ఏదు||
పొదిగి చేతుల నిన్నుఁ - బూజించేనంటే
కదిసి నీవు విశ్వ - కాయుడవు
అదన నేమైనా స - మర్పించే నంటే
సదరమై అవస్త - సకల కాముఁడవు
||ఏదు||
కన్నులచేత నిన్ను - గనుఁగొనే నంటే
సన్నిధి దొరక నగో - చరుఁడవు
ఇన్నిటాను శ్రీవేంక - టేశ నీవు గలవని
వన్నెల శరణనే - వాక్యము చాలు
||ఏదు ||
____________________________________________
ఏదయ్యా దేవా! నిన్ను చేరుకునే ఉపాయం. నీవా ఆది అంతము లేని అచ్యుత మూర్తివి.

నీ గుణములు నోరార పొగడి నిన్ను చేరుకుందామంటే నీవు గుణములన్ని దాటినవాడవు. గుణరహితుడవు. పోని నిన్ను ఉత్సాహం గా మనసులో నిలిపి ఏకాగ్రత తో కలుద్దాం అంటే నీవు అంతులేని మహిమల తో విశ్వ వ్యాప్తుడివి.

నిన్ను వశము చేసుకుని చేతులారా పూజిచాలి అనుకుంటే నీవేమో అనంత విశ్వాన్నే శరీరముగా కలిగినవాడవు. నీ కోరిక తీర్చడానికి ఏదైనా సమర్పించుదామంటే నీవేమో అన్ని కోరికలు తీరినవాడవు.

ఆఖరికి కనులారా నిన్ను చూసి తరిద్దామంటే నీవేమో చూపులకే దొరకని ఆగోచర మూర్తివి. నాకర్ధమైంది నిన్ను పై ఉపాయాల ద్వారా చేరటం సాధ్యం కాదు. శ్రీ వేంకటేశ్వరా! నీవు సర్వవ్యాప్తి వని నమ్మి నిన్ను శరణు కోరడమే నీదరికి చేరే ఉపాయం.
అందుకే అన్యధా శరణం నాస్తి. తమ్వేవ శరణం గోవిందా.

--))**((--*

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : మోక్షం, బంధాలకు రెండు దారులున్నాయి. ఓ జీవాత్మా! నీకేది సరైనదో ఎంచుకుని వెళ్లుము.
_____________________________________________
తాళం : బౌళి

ఏది వలసె నీవది సేయు - యిందులోన నో జీవాత్మ
పొదుగు మనలో అంతర్మాతయై - పరగిన శ్రీహరి పనుపునను

మనవంటి జీవులే - మహిలోన నొకకొన్ని
శునకములై కక్కుటములై - సూకరములు నైనవి
దినదినముఁ గర్మపాశములఁ - దిరిగెడి దుర్దశ లటు చూడు
సనకాదులై కొందరు జీవులు - శౌరిదాసులై రటు చూడు
||ఏది||
కన్నులుఁ గాళ్ళు మనవలెఁదనువులు - గైకొని కొందరు నరులు
పన్నిన తొత్తులు బంట్లునై మన - పనులు సేయుచునున్నారు
ఎన్నఁగ శ్రీహరి నెరుఁగక - యిడుమలఁ బొరలెడి దది చూడు
మన్నె హరిదాసులై నారద - ముఖ్యులు గెలిచిన దది చూడు
||ఏది||
ఇంతగాలమును యీ పుట్టుగులనె - యిటవలెఁ బొరలితి మిన్నాళ్ళు
ఇంతట శ్రీవేంకటేశుఁడు దలంచి - యీ జన్మంబున మము నేలె
వింతల బొరలిన నరకకూపముల - వెనకటి దైన్యము లటు చూడు
సంతసమున ముందరి మోక్షము - సర్వానందం బది చూడు
||ఏది||
_______________________________________________
ఓ జీవుడా! ఇక్కడ రెండు దారులు వున్నాయి. ఒకటి ఈ సంసారబంధ చక్రం లో తిరుగుతు అనేక జన్మలు ఎత్తుతూ వుండేది. రెండవది ఈ బంధాల నుంచి బయటపడి మోక్షం సంపాదించే దారి. నీ అంతర్మాతలో వున్న శ్రీహరి ఆదేశం పాటించి నీకేది మంచిదో ఎన్నుకుని ఆ దారిలో వెళ్లు.

నీవు చూస్తూ వున్నావు. మన లాంటి జీవులే వాటి పాపకర్మల బట్టి కొన్ని కుక్కలుగా, కోళ్ల గా, పందులుగా జన్మ ఎత్తి, అందుకనుగుణమైన దుస్థితి నిత్యం అనుభవించుచు తిరుగుతున్నాయి. మరికొందరు మనలాంటి జీవులే శ్రీహరిని భక్తి తో పూజించి, సేవించి సనకసనందనాది మునీంద్రులుగా మారి హరిదాసులై ముక్తిని పొందారు. మరి ఎటు వెళతావో నీ యిష్టం.

మరి ఇటు చూడు. కొంతమంది మనలాగే శరీరము, కాళ్లు, కనులు కలిగివుండి, వారిలాంటి మనుషులకే బానిసలై, సేవకులై పనులు చేస్తున్నారు. వీరికి భగవంతుడెవరో తెలియక ఇన్ని బాధలు పడుతున్నారు. మరి అటు చూడు. మరికొందరు మనలాంటి మానవులే జాగురూకులై మాధవుని నామసంకీర్తనం తో భజించి నారదాది మునులు గా మారి సంసార సమరం లో గెలిచి ముక్తులైనారు.

అనాది కాలము నుంచి ఇలాగ ఎన్నో జన్మలు దాల్చుచు సుఖదుఃఖాలు అనుభవించుచు భూమి పై ఇన్నాళ్లు పొరలుతున్నాము. ఈ జన్మ లో మన పై దయతలచి శ్రీవేంకటేశ్వరుడు అవతరించి, తనను భజించడం ద్వారా ముక్తి పొందండి అని దారి చూపించాడు. ఇన్ని జన్మలు నరకకూపములలో బడి అనుభవించిన బాధలు, కష్టాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆనందదాయకమైన మోక్షము మన ముందరే వుంది. ఇక ఈ దారిని పయనించి జన్మరాహిత్యమైన వైకుంఠ సన్నిధి చేరుకుందాం.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము :అన్నమయ్య ఈ కీర్తనలో భగవంతుని తన తప్పులు, గుణదోషాలు ఎంచక రక్షించుమని వేడుకుంటున్నాడు.
____________________________________________
తాళం :శంకరాభరణం

నీవు సర్వసముఁడవు - నీవు దేవదేవుడవు
ఈవల గుణదోషా - లెంచనిఁక నేలా?

పూవులపైఁ గాసీఁ - బొరి ముండ్లపైఁ గాసీని
ఆవల వెన్నెల కేమి - హాని వచ్చీనా?
పావనుల నటుగాచి - పాపపుంజమైన నన్ను
గావఁగా నీకృపకును - గడ మయ్యీనా?
||నీవు||
గోవుమీఁద విసరీఁ - గుక్క మీద విసరీని
పావనపు గాలికిని - పాప మంటీనా?
దేవతల రక్షించి - దీనుఁడైనైన నాకు
దోవ చూపి రక్షించితే - దోస మయ్యీనా?
||నీవు ||
కులజుని యింట నుండీ - కులహీనుని యింటనుండీ
యిలలో నెండకు నేమి - హీన మయ్యీనా?
వలసి శ్రీవేంకట్రాది - వరములు యిచ్చి నాలో
నిలిచి వరము లిచ్చి - నేఁడు గావవే
||నీవు ||
--------------------------------------------------------------------------
దేవదేవా! నీవు అందిరిని సమంగా చూసేవాడవు. మరి నాలోని గుణ దోషాలను, తప్పులను చూడవలసిన అవసరం లేదు కదా.

వెన్నెల పూల పై, ముళ్ళ పై ఒకే విధంగా పడుతోంది. ముళ్ళ పై పడటం వలన వెన్నెల కేమైనా హాని కలిగిందా? లేదు కదా. అలాగే పరమాత్మా! నీ దయ పుణ్యాత్ములందరి పై వుంది. నాలాంటి పాపాత్ముని కాపాడి నంత మాత్రాన నీ దయకు ఏమైనా లోటు కలుగుతుందా? లేదు కదా.

పవిత్రమైన గాలి ఆవు పైనా, కుక్క పైన ఒకేరకంగా వీస్తుంది. హీనమైన కుక్క పై వీయడం వలన గాలికి ఏమైనా పాపమంటిందా? లేదుగదా. ప్రభూ! దేవతలను ఎల్లప్పుడు రక్షిస్తూ వుంటావు. నాలాంటి దీనుడికి దారి చూపి రక్షిస్తే నీకేమైనా దోషమంటుతుందా? లేదు కదా.

ఎండ ఉత్తమ కులస్థుని ఇంటా, హీనకులస్థుని ఇంటా ఒకే విధంగా కాస్తుంది. అందువలన ఎండ కేమైనా హీనత్వం వచ్చిందా? లేదుగా.
శ్రీవేంకటేశ్వరా! వేంకటాద్రి పై వెలసి నీ వెందరికో వరములు ఇచ్చినావు. నాపై కూడా అనుగ్రహం చూపి వరము లిచ్చి రక్షించు స్వామి.

దేవదేవునకు రాగద్వేషములు వుండవు. అందరిని సమదృష్టి తో చూస్తాడు. ఆయనకి మనలా రాగద్వేషములు వుంటే దేవుడెలా అవుతాడు. భజించే భక్తునికి హరికృప తధ్యం.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి :
భావము :లాభనష్టాలు, చావుపుట్టుకలు ఈశ్వరుని మాయలే. మరి మన కర్తవ్యం మాయలసృష్టి కర్త పరమేశ్వరుని ధ్యానించటం.
____________________________________________
తాళం :మాళవి

ఇందులకు జింతించనేల - యీశ్వరుని మాయ లివి
యిందుకు మూలం హరి - యీతనిఁ జింతించరే

ఇల నారికడపుఁగా - యకు నీరు వచ్చినయట్టు
తలచి రాఁగలమేలు - తన్నుదానే వచ్చురే
లలి నేనుగు దిన్న వె - లఁగ పంటిబేసము
వలెనే పోఁగలవెల్ల - వడి దానే పోవురే
||ఇందు||
నిండిన యద్దములోన - వీడ వొడచూసినట్టు
దండియైన పుట్టుగులు - తన్నుదానే వచ్చురే
పండిన పండ్లు తొడమఁ - బాసి వూడినయట్టు
అండనే మరణములు - అందరికి సరిరే
||ఇందు||
పెనురాతిపైఁ గడవ - పెట్టఁగా గుదురైనట్టు
తనుఁదానే చింతింపఁ - దలఁపు నిలుచురే
ఘనుడు శ్రీవేంకటేశుఁ - గని శరణన్న జాలు
వెనుక పాపాలు మంచు - వచ్చినట్టు విచ్చురే
||ఇందు||
_____________________________________________
మంచిచెడు, లాభనష్టాలు, జననమరణాల గురించి ఆలోచించడం దేనికి. ఇవన్నీ పరమాత్ముని మాయ వలన జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం దీనికి కారణభూతుడైన శ్రీహరిని తలచుకుందాం.

కొబ్బరికాయ లో నీరు ఎవరు పోయకుండానే తనంత తాను వచ్చినట్లు, శుభం అనేది తనంత తాను జరిగి తీరుతుంది. ఏనుగు మింగిన వెలగపండు లోని గుజ్జు తనంత తానే వేరైనట్టు, మన నుంచి విడిపోవలసినది తనంత తానే విడిచిపోతుంది.

నిండైన అద్దం లో నీడ సృష్టంగా (చక్కగా) కనిపించినట్లు, జీవులకు అనేకములైన పుట్టుకలు తమంత తామే వస్తున్నాయి. చెట్టుకి బాగా పండిన పండ్లు తొడిమ తెగి కింద పాడినట్టు, కాలమైనంతనే మనందరికి చావులు సమానంగా సంభవిస్తున్నాయి.

పెద్దరాతిపై కడవ పెట్టగా పెట్టగా కుదురుగా వున్నట్టు,
మన మనసు తనకుతాను చింతింపగా చింతింపగా అభ్యాసంచే తలపులు కదలిక వీడి కుదురుగా ఏకాగ్రత పొందుతుంది. దయశీలుడైన శ్రీవేంకటేశ్వరుని చూసి శరణు అంటే చాలు మరి మనం వెనుక జన్మలలో చేసిన పాపాలు, సూర్యోదయం అయినప్పుడు కరగిపోతున్న మంచు వలె తొలగిపోతాయి.

చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద వేదాంత అర్ధాలు చెప్పారు అన్నమయ్య ఈ సంకీర్తన లో.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : పాపపుణ్యములు రెండు భగవంతుని మాయచేత చేస్తున్నాం. వీటిని దాటాటం ఆయన దయ వలనే సాధ్యం.
_____________________________________________
తాళం :ధన్యాసి

దైవమా నీవే మమ్ము - దయ దలఁచుట గాక
చేవల నీ సేఁత లెల్ల - చెల్లును లోకానను

తీపు నంజేవేళ నట్టే - తేటఁబులు సింపౌను
పైపైఁ బుణ్యమయితేఁ - బాపు మింపౌను
ఓపిక జంతువుల కివి - ఒక టొకటికి లంకె
చేపట్టి పాపము లెట్టు - సేయకుండవచ్చును?
||దైవ||
కడుఁజలువై తేను - గక్కున వేఁడింపౌను
చెడని విరతివేళ - సిరు లింపౌను
ఒడలు మోచిన వారి - కొకటొకటికి లంకె
తొడరు భోగాలు మాని - తోయ నెట్టు వచ్చును?
||దైవ||
ఇవియు నీ మాయే - యిన్నియు నీ యాజ్ఞలే
జవళిఁ బ్రాణుల కల్లా - సమ్మతైనవి
ఇవల శ్రీవేంకటేశ! - యిటు నీకే శరణంటి
తవిలి నీవే గతి - దాఁగ నెట్టు వచ్చును?
||దైవ||
_____________________________________________
దేవా! నీవే దయ చూపి మమ్మల్ని కాపాడాలి. లోకం లో అన్ని పనులు నీవనుకున్నట్టే జరుగుతాయి. మేము ఏది సాధించలేము.

తీపి ఎక్కువగా తిన్నప్పుడు పులుపు రుచిగా అనిపించి దానిపై తినాలనే కోరిక కలుగుతుంది. అలాగే పుణ్యాలు ఎక్కువగా చేసేసరికి పాపాలు చేయాలనే ఆసక్తి పుడుతోంది. ఇలా పాపపుణ్యాలు రెండూ చేతి సంకెళ్లై ప్రాణులమైన మమ్ము బంధించివున్నాయి. ఈ స్థితిలో పాపములు చేయకుండా ఎలా వీలవుతుంది?

చలి ఎక్కువైనపుడు వేడి హాయిగా అనిపిస్తుంది. అలాగే సంసారం పై విరక్తి చెందినవానికి సంపదల పై మోహము కలుగుతోంది. ఈ విధంగా శీతోష్ణములు, భోగవిరాగములు మమ్మల్ని ముడివేసి కట్టేసి తగులుకున్నాయి. ఇక ఏరీతి భోగాలను పైబడకుండా నెట్టివేసేందుకు వీలవుతుంది?

ఈ పుణ్యపాపాలు, భోగవిరాగములు నీ మాయ చేత సృష్టించబడినవే. ఇవి నీ అనుమతి తోనే జీవులమైన మమ్మల్ని ఆవరించి మాకు ఇష్టములుగా వున్నాయి. శ్రీవేంకటేశ్వరా! వీటికి మూలమైన నిన్ను శరణు కోరుతున్నాను. నీవే గతి మాకు, వేరు దారి లేదు. మమ్మలందరిని కాపాడకుండ నీవెట్లు తప్పించుకోగలవు?

*
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము :భౌతిక యాగ యజ్ఞాల కన్నా జ్ఞానయజ్ఞం మోక్ష సాధనమని ఈ సంకీర్తన లో వివరించారు.

____________________________________________

తాళం : ధన్యాసి

జ్ఞానయజ్ఞ మీ - గతి మోక్షసాధనము
నానార్ధములు నిన్నే - నడిపె మా గురుడు

అలరి దేహ మనేటి - యాగశాలలోన
బలువై యజ్ఞానపు - పశువు బంధించి
కలసి వైరాగ్యపు - కత్తుల గోసికోసి
వెలయ జ్ఞానాగ్నిలో - వేలిచే మా గురుఁడు
||జ్ఞాన||
మొక్కుచు వైష్ణవులనే - ముని సభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్ధ - సోమపానము నించి
చక్కగా సంకీర్తన - సామగానము చేసి
యిక్కువతో యజ్ఞము సే - యించెఁబో మా గురుడు
||జ్ఞాన||
తదీయ గురుప్రసాద - దపురోడాశ మిచ్చి
కొదదీర ద్వయ మను - కుండలంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు - నిటు ప్రత్యక్షము చేసి
ఇదివో స్వరూపదక్ష - యిచ్చెను మా గురుఁడు
||జ్ఞాన||
____________________________________________

అన్నమయ్య చేత ఈ కీర్తన వ్రాసే ముందు రోజున (నిన్న) ఈ జ్ఞానయజ్ఞం వారి గురువు గారు చేయించారు "మోక్ష సాధనకు జ్ఞానయజ్ఞమే సులభమార్గం" అని చెప్పి.

మా గురువు గారు మాచే "శరీరము అనే యాగశాలలో బలమైన "అజ్ఞానం" అనే పశువును బంధించి "వైరాగ్యము" అనే కత్తి తో కోయించి "జ్ఞానము" అనే అగ్నిగుండం లో" వేయించారు.

మా గురువుగారు జ్ఞానయజ్ఞం లో వైష్ణవులనెడి మునుల సభ ఏర్పాటు చేయించి ఆనందించడానికి మాకందరికి " శ్రీహరి పాదతీర్ధము" అనే సోమరసం ఇచ్చారు. ఇంకా" విష్ణు సంకీర్తనం" అనే సామగానము ఏర్పాటు చేశారు.

మా గురువు గారు యజ్ఞం సంపూర్తి అవగానే యజ్ఞశేషాన్ని గురుప్రసాదంగా ఇవ్వడమే కాకుండా "ద్వయము" అనే కుండలాలు ఇచ్చారు. ఏమిటవి అంటే మొదటిది హృదయము లో శ్రీవేంకటేశ్వరుని ప్రత్యక్షము గావించడం, రెండవది ఆ స్వరూపం నిలిచి ఉండేటట్టు " స్వరూప దీక్ష " ఇవ్వడం.

అన్నమయ్య అంతర్లీనం గా హింసతో కూడిన భౌతిక యజ్ఞాల కన్నా మనస్సు లో చేసే జ్ఞానదీక్ష ఒక్కటే మోక్షప్రాప్తి తగిన సాధనము అని చెప్పారు. దీనిని చేయడానికి గురువే సమర్ధుడు.

--((**))--*

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : భగవంతుడు ఊరికే మనకు దర్శన మివ్వడు కదా. ఏదైన కారణం వుండాలి.

______________________________________________

తాళం : సామంతం

ఊరకైతే నిన్నుఁగాన - మొక కారణానఁగాని
పూరి జీవులు నీవు - పురుషోత్తముఁడవు

అసురులు భువిఁ బుట్టు - టది వుపకారమే
అసురలు బాధింతు - రమరులను
పొసఁగ వారికి గాను - పూనుక వచ్చి నీవు
వసుధ జనించితేను - వడి నిన్నుఁ గందుము
||ఊర||
అడరి ధర్మము చెడి - యధర్మమైనా మేలు
వెడఁగు మునులు విన్న - వింతురు నీకు
తడవి ధర్మము నిల్ప - ధరణిఁ బుట్టుదు నీవు
బడి నిన్ను సేవించి - బ్రతుకుదు మపుడే
||ఊర||
నీ కంటే మాకుఁజూడ - నీ దాసులే మేలు
పై కొని వారున్నచోటఁ - బాయకుందువు
చేకొని శ్రీవేంకటేశ! - చెప్పఁగానే వారి చేత
నీ కధలు విని విని - నే మీడేరితిమి
||ఊర||
_____________________________________________

దేవా! నీవు మాకు ఊరికే ఎందుకు దర్శన మిస్తావు. ఏదైనా బలమైన కారణం వుండాలి కదా. మేమా అల్ప జీవులం, నీవా పురుషోత్తముడైన పరమాత్ముడవు.

రాక్షసులు భూమి పై పుట్టటం మాకు ఉపకారమే. ఎందుకంటే వారు పుట్టి దేనతలను అనేక రకాలుగా బాధిస్తారు. నీవు దేవతలను రక్షించడానికి తప్పక భూలోకం లో అవతరిస్తావు. అప్పుడు మేము మా కనుల కరువు దీరా నిన్ను దర్శించుకుంటాం.

ధర్మము నశించి అధర్మము పెరుగుట కూడా మేలే. అప్పుడు మునులందరు ధర్మాన్ని రక్షించమని నిన్ను వేడుకుంటారు. వారి విన్నపం మన్నించి నీవు ఈ భూమిపై జన్మిస్తావు. మేమందరం అప్పుడు నీ సేవలు చేసి ధన్యులమై జీవిస్తాం.

శ్రీవేంకటేశ్వరా! నీ కంటే నీ దాసులైన భాగవతులే మేలు. నీవు వారున్న చోట తప్పకుండా కాపాడుతూ వుంటావు. వారందరు నీ మహిమలు అన్ని కధలుగా చెబుతుంటే విని మేమందరము కృతార్థులమైనాము.

స్వామి దర్శనం లభిస్తే ఏదైనా మంచిదే.

--((**))--*

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము :ఈ సంకీర్తనం లో కూడా అన్నమయ్య రావణ, కంస, హిరణ్యకశిపులగురించి చెబుతున్నారు. వారి వలనే కదా భగవంతుడు శ్రీరామ, కృష్ణ, నరసింహులగా మనకు దర్శన భాగ్యం కలిగించారు.

____________________________________________

తాళం :దేసాళం

వారిదే పో జన్మము - వడి నిన్నుఁ దెచ్చిరి
భారత రామాయణాలై - పరగె నీ కధలు

భువిమీద రావణుడు - పుట్టుగాఁగ రాముఁడవై
తవిలి యిందరికిఁ బ్ర - త్యక్షమైతివి
వివరింప నంతవాఁడు - వెలసితేఁగా నీవు
అవతార మందితే ని - న్నందరునుఁ జూతురు
||వారి||
రమణ  గంసాది యసు - రలు లూటి సేయఁగాఁగా
తమి యగృష్ణావతార మిం - దరి కైతివి
గములై యింతటి వారు - గలిగితేఁగా నీవు నేడు
అమర జనించి మాట - లాడుచు నిందరితో
||వారి ||

ఎంత వుపకారియో - హిరణ్య కశిపుఁడు

చెంత నరసింహుఁడని - సేవ యిచ్చెను
ఇంతట శ్రీ వేంకటేశ - యిన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని - బ్రదికితి మిదివో
||వారి!||
____________________________________________

దేవా! రావణ, కంస, హిరణ్యకశిపులదే జన్మమంటే జన్మము. వారే కదా నిన్ను అవతార పురుషుడుగా మాకు ప్రసాదించినది మరియు నీ లీలలు భారత రామాయణాలుగా ప్రసిద్ధి కెక్కించినది.

భూమి పై రావణుడు పుట్టాడు కాబట్టే నీవు రాముడిగా పుట్టి మాకందరికి ప్రత్యక్షమైనావు. నీకు సరైనజోడు వాడు పుడితే గాని నీవు అవతారమెత్తలేదు, మాకు చూసే అవకాశం ఇవ్వలేదు.

కంసాది అసురులు పుట్టి మమ్మల్ని బాధపెట్టి, హింసించి, దోచుకుంటేగాని, నీవు కృష్ణునిగా అవతరించి మా దగ్గరకి రాలేదు. అంటే నీతో సమాన బలపరాక్రమాలు వున్న వారు వుంటేగాని నీవు పుట్టి మాతో వుండవు, మాట్లాడవు.

హిరణ్యకశిపుడు ఎంత ఉపకారం చేశాడో మాకు. నరసింహుడిగా నిన్ను అవతరింప చేసి సేవలు చేసే భాగ్యం మాకు కలిగించారు. శ్రీ వేంకటేశ్వరా! మాకు ఇప్పుడు తెలిసింది ఈ అవతారాలన్ని నీవేనని. ఇక మేము తప్పక నీ శరణు పొంది బతుకుతాము.

చెడులో కూడా మంచి చూడటం అంటే ఇదేనేమో.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : మనకు జరిగే మంచి చెడులకు మన ప్రవర్తన లేక భగవంతుడే కారణం తప్ప వేరేవరు కాదు.

____________________________________________

తాళం : విరాళి

ఇతరులు దూరనేల - యోవ్వరు నేమి సేతురు
మతి వారూఁదమవంటి - మనుజులే కాక!

చేరి మేలు సేయఁ గీడు - సేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు - దైవమే కాక,
సారెఁ దనవెంటవెంటఁ - జనుదెంచే వారెవ్వరు
బోరునఁ జేసిన పాప - పుణ్యాలే కాక!
||ఇత||
తొడఁగి పొగడించను - దూషించ ముఖ్యు లెవ్వరు
గుడిగొన్న తనలోని - గుణాలే కాక,
కడుఁగీర్తి నపకీర్తి - గట్టెడి వారెవ్వరు
నడచేటి తన వర్త - నములే కాక!
||ఇత||
మన బంధ మోక్షాలకుఁ - గారణ మిఁక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞా - నములే కాక,
తనకు శ్రీవేంకటేశుఁ - దలపించే వారెవ్వరు
కొన మొద లెఱిగిన - గురుఁడే కాక!
||ఇత||
_____________________________________________

మన కష్టాలు, చిక్కులకు ఇతరుల నిందించడం వలన ప్రయోజనం లేదు. ఆలోచిస్తే వారు కూడా మనలాంటి సాధారణ మనుషులే కదా.

భూమి పై మనుషులకు మేలు లేదా కీడు చేసేది దైవము ఒకడే. వేరేవ్వరు కాదు. మన వెంట వచ్చేవి మనం చేసిన పాపపుణ్యాలే గాని ఇతరులెవ్వరు కాదు.

మనను పొగడటానికి, తిట్టడానికి ముఖ్య కారణం మనలోని గుణ దోషాలే కాని వేరే ఏమి కాదు. అలాగే మనకు కీర్తి గాని అపకీర్తి గాని రావటానికి కారణం మన ప్రవర్తన, నడత గాని అన్యులు కాదు.

మనకు బంధానైనా, మోక్షమైనా కలిగించేవి మనకున్న జ్ఞానం, అజ్ఞానం తప్ప వేరే ఏమి కాదు. మనచేత స్మరింపచేసుకుని మనకు సద్గతి ఇచ్చే గురువు సర్వం తెలిసిన శ్రీవేంకటేశ్వరుడే గాని వేరేవ్వరు లేరు.

మనకు కష్టాలు వచ్చినపుడు ఇతరులను నిందించడం మానవ స్వభావము. అన్నమయ్య ఇది తగదని ముందు మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి అని ఈ కీర్తనలో చెప్పారు.

--((**))--
 
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : వేదాలలో చెప్పినది, భగవద్గీత లో చెప్పిన పరమార్ధం ఒకటే - శరణాగతి

____________________________________________

తాళం : దేవగాంధారి

ఒక్కఁడే మోక్షకర్త - వొక్కటే శరణాగతి
దిక్కని హరిఁగొల్చి బ - దికిరి తొంటివారు

నానా దేవతలున్నారు - నానాలోకము లున్నవి
నానా వ్రతా లున్నవి - నడచేటివి
జ్ఞానికిఁ గామ్యకర్మాలు - జరిపి పొందేదేమి
ఆనుకొన్న వేదోక్తా - లైనా నాయఁగాక
||ఒక్క ||
ఒక్కఁడు దప్పికిఁ ద్రాపు - నొక్కఁడు కడవ నించు
నొక్క డీఁదులాడు మడు - గొక్కటియందే
చక్క జ్ఞానియైనవాఁడు - సారార్ధము వేదమందు
తక్కక చేకొనుఁగాక - తలకెత్తుకొనునా
||ఒక్క||
ఇది భగవద్గీతార్ధ - మిది యర్జునునితోను
ఎదుటనే వుపదేశ - మిచ్చెఁగృష్ణుఁడు
వెదకి వినరో శ్రీ - వేంకటేశు దాసులాల
బ్రతుకుఁద్రోవ మనకు - పాటించి చేకొనరో!
||ఒక్క||
____________________________________________
మోక్షం ఇచ్చేవాడు ఒక్క శ్రీహరి మాత్రమే. ఆయన శరణు కోరటం ఒక్కటే మోక్షమార్గమని ప్రాచీనులైన ప్రహ్లాది భక్తులు నమ్మి సేవించి ధన్యులైనారు.

ఎందరేందరో దేవతలున్నారు. ఎన్నేన్నో లోకాలు వున్నాయి. ఆయా లోకాలలోని ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అనేక వ్రతాలు కూడా వున్నాయి. స్వర్గాది ఫలాల కోసం వీరిని సేవించమని వేదాలలో చెప్పి వున్నా, వీటి వలన జ్ఞాని అయినవాడికి ఉపయోగం లేదు. లభించేది అనిత్యమైన స్వర్గసుఖమే తప్ప నిత్యమైన మోక్షం కాదు.

సరస్సులో ఒకడు దాహం తీర్చుకునేందుకు నీరు త్రాగితే, ఇంకొకడు కడవ లో నీరు నింపుకు వెళతాడు. మరోకడు అదే నీటిలో ఈతగొట్టి విహరిస్తాడు. ఇలాగే వివిధ జనులు వారి కోరికల కనువుగా ప్రవర్తిస్తారు. వేదాలలో వివిధ విషయాలు చెప్పినా తెలివైన జ్ఞాని సారార్ధము మాత్రమే గ్రహిస్తాడు. ఇతర విషయాల జోలికి వెళ్లడు, తలకెత్తుకోడు.

భగవద్గీత లో శ్రీకృష్ణుడు ఎదురుగా వున్న అర్జునునికి ఇదే భావము ఉపదేశించాడు. శ్రీవేంకటేశ్వరుని దాసులారా! జీవితం ప్రయోజనం చేసుకునే మార్గం ఇదే. సావధానంగా విని పాటించి ధన్యులవండి.

గీతలో సాంఖ్యయోగం లో కృష్ణుడు అర్జునునికి చెప్పినది అన్నమయ్య ఈ సంకీర్తన లో వివరించాడు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : ఆత్మ స్వరూపము తెలిసేది అంతర్ముఖులకే గాని బాహ్య దృష్టి కల వారికి కాదు

____________________________________________

తాళం : ముఖారి

వెలుపల వెదకితే - వెస నాత్మఁగనునా
పలుమారు నిదే య - భ్యాసము గావలెను

ఇన్ని చింతలు మరచి - యింద్రియాలఁగుదియించి
పన్ని యుండిన హృదయ - పద్మమందును
ఎన్న నంగుష్టమాత్రపు - టీశ్వరు పాదాల కింద
తన్ను నణుమాత్రముగఁ - దలఁచఁగ వలెను
||వెలు||
పలుదేహపుఁగాళ్ళఁ - బరువులు వారక
బలుదేహపు టింటిలో - పల చొచ్చి
చలివేఁడి బొరలకే - సర్వేశు పాదాల కింద
తలకొన్న తన్నుఁదానే - తలఁచఁగవలెను
||వెలు||
కైకొన్న భక్తితో ని - క్కపు శరణాగతితో
చేకొన్న విన్నపములు - చేసుకొంటాను
ఏకాంతాన శ్రీ వేంక - టేశ్వరు పాదాల కింద
దాకొని తన్నుఁ దానే - తలఁచఁగవలెను
||వెలు||
____________________________________________

వెలుపల ఎంత వెతికిన ఆత్మ స్వరూపము తెలుసుకోలేం. పలుమార్లు ఈ కీర్తనలో చెప్పిన పద్దతి అభ్యాసం చేస్తే తెలుసుకోగలం.

చీటికి మాటికి మనస్సు లో కలిగి చింతలన్ని మరచిపోవాలి. విచ్చలవిడిగా పరిగెత్తే ఇంద్రియాలని నిగ్రహించాలి. హృదయమనే పద్మం లో అంగుళమంత వుండి ప్రకాశిస్తున్న పరమేశ్వరుని పాదాల కింద వున్న అణువుగా తన్ను తాను భావించాలి.

ఆనేక జన్మలు ఎత్తి దాల్చిన శరీరాలకు చెందిన పాదాలతో పరిగెత్తుతూ బయట ప్రపంచంలో వెతకరాదు. తనలోతాను అంతర్ముఖుడై శరీరము అనే ఇంటిలో ప్రవేశించాలి. శీతల ఉష్ణాలకు భయపడరాదు. హృదయం లోపల వున్న సర్వేశ్వరుని పాదాల కింద వున్న జీవాత్మ స్వరూపము తనదే అని భావించాలి.

భక్తి నే శరాణాగతికి సాధనంగా తీసుకోవాలి. నీవే తప్ప నాకు వేరు దిక్కు లేదు శ్రీ వేంకటేశ్వరా! నీ పాద పద్మముల కింద నా జీవాత్మ మరుగుపడి వుంది. కాచి రక్షించవయ్యా అని తలచుకోవాలి.

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : జీవుని తోడుగా వున్న బలగం (సైన్యం) ఏమున్నాయో శ్రీహరీకి అన్నమయ్య ఈ కీర్తనలో వివరించారు.
తాళం :శ్రీరాగం
అన్నిటికి నొడయఁడ వైన - శ్రీపతివి నీవు
ఎన్నరాదు మాబలఁగ - మెంచుకో మౌపౌఁజు
జ్ఞానేంద్రియము లైదు - శరీరిలోపల
ఆనక కర్మేంద్రి - యములైదు
తానకపు కామక్రో - ధాల వర్గము లారు
ఈ నెలవు పంచభూతా - లెంచు మాపౌఁజు

||అన్ని||

తప్పని గుణాలు మూడు - తను వికారము లారు

అప్పటి మనో బుద్ద్య - హంకారాలు,
ఉప్పతిల్లు విషయము - లుడివోని నొక అయిదు
ఇప్పటి మించే కోపము - యెంచుకో మాపౌఁజు
||అన్ని||

ఆఁకలి దప్పియును మా - నావమానములును

సోఁకిన శీతోష్ణాలు - సుఖదుఃఖాలు.
మూఁక గమికాడ నేను - నెంచుకో శ్రీవేంకటేశ!
యేఁకటారఁ గడపేవా - నెంచుకో మాపౌఁజు
||అన్ని||
-------------------------------------------------------------------------

దేవా! నీవు సమస్త విశ్వానికి అధిపతివైన లక్ష్మినాధుడివి. జీవులమైన మాకు కూడా సైన్యం వుంది. మా బలగాన్ని పరీక్షించి ఎంచుకొవయ్యా!

కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలు ఐదు మాలో వున్నాయి. మరి శరీరానికి వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థము అనే కర్మేంద్రియాలు ఉన్నాయి. శరీరం బయట కాపాలగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలు ఆరు మోహించి వున్నాయి. ఇక వెలుపల భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే పంచభూతాలు ప్రహరా కాస్తున్నాయి. మా సేన ఎట్లున్నదో పరీక్షించుకొనుము.

అట్లే ఇంకా సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు; పుట్టుట, సెరుగుట, పరిణమించుట, ఉండుట, క్షీణించుట, నశించుట అనే శారీరకమైన వికారాలు ఆరు; బుద్ది, మనస్సు, అహంకారము అనే మూడు; తొలగాలన్నా వదలక ఎప్పటి కప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఐదు విషయములు మా సేన లో వున్నాయి. వీటన్నింటికి మించి కోపము వుంది. మా సైన్యాన్ని తక్కువగా అంచనా వేయక పరిగణనకు తీసుకొమ్ము.

ఇది కాకుండా ఇద్దరిద్దరు వున్న ఆకలిదప్పులు, మాన అవమానాలు, శీతోష్ణములు(చలివెచ్చ), సుఖదుఃఖాలు వున్నాయి. కావున నేను సామాన్యమైన వీరుడని కాదు. గొప్ప సైన్యానికి అధిపతిని. శ్రీవేంకటేశ్వరా! ఇంత బలగాన్ని నీకు సమర్పించి నేను మొక్కుచున్నాను.

నా సైన్యాన్ని పరిశీలించి తీసుకుని నన్ను నీవాడిని చేసుకో.

ఆన్నమయ్య మనకున్న బలహీనతలన్ని బలంగా మార్చి దేవునికి ఇచ్చి నన్ను తక్కువగా చూడకుండా నీ వైకుంఠ సైన్యం లో కలుపుకోమని చెప్పారు. వందల పుస్తకాలలో కూడా పట్టని విషయాలన్ని మూడు చరణాలలో చెప్పారు. పదకవిత పితామహులు అన్నమాచార్యుల వారు.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : మోక్ష ప్రాప్తికి జీవుడు చాలా కష్టపడాలి. గట్టి ప్రయత్నం చేయాలి

ఊరకే దొరుకునా - ఉన్నతోన్నత సుఖము

సారంబు దెలిసి కా - జయము చేకొనుట
తలపు లోపలిచింత - దాటినప్పుడు గదా!
అలరి దైవంబు ప్ర - త్యక్షమౌట,
కలుషంపు దుర్మదము - గడచినప్పుడు గదా!
తలకొన్న మోక్షంబు - తనకుఁ జే పడుట
||ఊర||

కర్మంబు కసటువోఁ - గడచినప్పుడు గదా!

నిర్మలజ్ఞానంబు - నెరవేరుట,
మర్మంబు శ్రీహరిని - మరఁగు చొచ్చిన గదా!
కూర్మిఁ దన జన్మమె - కర్ణుడు కెక్కుడౌట.
||ఊర||

తనశాంత ఆత్మ లోఁ - దగిలినప్పుడు గదా!

పనిగొన్న తన చదువు - ఫలియించుట,
ఎనలేని శ్రీవేంక - టేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినఁ గదా - దరిచేరి మనుట
||ఊర||
_____________________________________________

అతి ఉన్నతమైన సుఖము అంటే మోక్షము ఊరికే లభించదు. మోక్షం గురించి పూర్తిగా తెలిసి వుండాలి. ఎన్నో వదులుకుని ఎంతో కష్టపడితే గాని మోక్ష మనే విజయం లభించదు.

మనస్సు లోపలి చింతల వలయం నుంచి బయటపడినప్పుడే దేవుడు ప్రత్యక్షమవుతాడు. కలుషితం చేసే పాపకర్మములను దాటి తొలగించుకున్నప్పుడే మోక్ష మార్గం దొరికేది.

జన్మ జన్మల నుంచి వెంటాడి వస్తున్న కర్మలు మాలిన్యం పూర్తిగా కడిగినపుడే నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. హృదయ దేవాలయం లో శ్రీహరి స్థిరనివాస మేర్పడిన్నప్పుడే జన్మ ఉత్తమోత్తమం అవుతుంది.

ఆత్మలో శాంతి నెలకొన్నప్పుడే చదివిన చదువులు ఫలప్రదమవుతాయి. సాటిలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యము లభించినపుడే ఈ సంసార సాగర ఒడ్డు చేరి సుఖించగలిగేది.

--((**))--

అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము :అన్నమయ్య ఈ కీర్తనలో జ్ఞానులకు అజ్ఞానులకు కల భేదం వివరించారు.

______________________________________________

తాళం : భూపాళం

అప్పుడు చూచేదివో - అధికుల నధముల
తప్పక యెచ్చరి యిదే - తలఁచవో మనసా !
కొండలవంటి పనులు - కోరి ముంచుకొంటే నూర
కుండి కైకొననివాఁడే - యోగీంద్రుఁడు
నిండిన కోపములకు - నెపములు గలిగితే
దండితోఁగలఁగని యా - తఁడే ధీరుఁడు
||అప్పుడు||

సూదులవంటి మాటలు - సొరిదిఁ జెవి సోఁకితే

వాదులు పెట్పుకొనని - వాడే దేవుఁడు
పొదుకొన్న సంసార - బంధము నోరూరించితే
అదిగొని మత్తుఁడు గా - నట్టివాఁడే పుణ్యుఁడు
||అప్పుడు||

గాలాల వంటి యాసలు - కడుఁదగిలి తీసితే

తాలిమితోఁ గదల నా - తఁడే ఘనుడు
మేలిమి శ్రీవేంకటేశు - మీది భారము వేసుక
వీలక తనలో విర్ర - వీఁగువాఁడే నిత్యుడు
||అప్పుడు ||
__________________________________________---

ఓ మనసా! లోకం లో తెలివిగలవారు, తెలివిలేనివారు ఎవరో సందర్భము వచ్చినపుడే తెలుస్తుంది. ఇది హెచ్చరిక గా తీసుకుని జ్రాగతగా ప్రవర్తించు.

కొండల వలె మితిమీరిన పనులు మీద వచ్చి పడినా చలించక లెక్కపెట్టనివాడే యోగీంద్రుఁడు. అనేక రకాల కారణాలతో కోపం వచ్చే పరిస్థితులు నిత్యం కలిగినా, నిండైన హృదయముతో ప్రశాంతంగా వుండేవాడే ధీరుడు.

సూదుల వంటి సూటిపోటి మాటలు (నిందలు) తన చెవికి గుచ్చుతున్నట్టు వినబడినా, అట్లు తిట్టినవారితో గొడవలు, కొట్లాటకు దిగిన వాడే దేవుడు. సంసార బంధాలు నోరూరిస్తూ తనను బంధించినా, ఆశపడక నిరాశక్తుడై లొంగక నిలచినవాడే పుణ్యాత్ముడు.

గాలాల వంటి ఆశలు మిక్కిలి గా చుట్టుముట్టి లాగుతున్నా, ఓర్పు వహించి కదలక నిలబడిన వాడే ఘనుడు (గొప్పవాడు). ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోక శ్రీవేంకటేశ్వరుని పై భారం వేసి నిలిచివున్న వాడే నిత్యుడు. నిత్యుడైన వాడు భగవత్ భక్తి తో తనలో తను ఆనందపడుతూ వుంటాడు బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా.

--((**))--

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : అన్నమయ్య మనకు భగవంతునికి గల తేడా చెప్పి ఆ భగవంతుడే మనకు రక్షకుడు అని చెప్పారు.

____________________________________________
తాళం :శుద్ధ వసంతం

పురుషోత్తముఁడ నీవు - పురుషాధముఁడ నేను

ధరలో నాయందు మంచి - తన మేది?

అనంతాపరాధములు - అటు నేము సేసేవి

అనంతమయిన దయ - అది నీది,
నిను నెరుఁగ కుండేటి - నీచుగుణము నాది
నను నెడయకుండే గు - ణము నీది
||పురు||
సకల యాచకమే - సరుస నాకు బని
సకల రక్షకత్వము - సరి నీపని,
ప్రకటించి నిన్ను దూరే - పలుకే నాకెప్పుడును
వెకలివై ననుఁ గాచే - విధము నీది
||పురు||
నేర మింతయును నాది - నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను - జ్ఞానివి నీవు
ఈ రీతి శ్రీవేంకటేశ! - యిట నన్ను నేలితివి
దారుణిలో నిండెను ప్ర - తాపము నీది
||పురు||
--------------------------------------------------------------------------

దేవా! నీవు పురుషులలో ఉత్తమమయినవాడవు. నేను పురుషులలో అధముడని. నాలో మంచితనం ఎక్కడ వుంది. అంతా స్వార్ధమే.

రోజూ నేను చేసే తప్పులకి, పాపాలకి లెక్క లేదు. ఇంత చేసినా నా పై నీ దయ అనంతం, అపారం. నీవెవరో నాకు తెలియదనే నీచ గుణం నాది. అయినా నను విడవకుండా కాపాడే మంచి గుణం నీది.

అందరిని అన్నింటి కోసం చేయి చాచి యాచించే (అడుక్కునే) ప్రవర్తన నాది. అందరిని రక్షించే మంచి పని నీది. ఎల్లప్పుడు బహిరంగంగా నిన్ను నానా తిట్లు తిట్టటమే నా పని. . అయినా విడువక నను అనుక్షణం కాపాడి రక్షించే మంచి గుణం నీది.

అన్ని తెలుసనుకుని ఏమి తెలియని వాడను నేను. అంతా తెలిసి మౌనంగా మమ్మల్ని కాచేవాడవు నీవు.

అందుకే నేను అజ్ఞానిని మరి నీవు జ్ఞానవంతుడివి.
శ్రీవేంకటేశ్వరా! ఇంత అధముడినైన నన్ను, నీవు దయతో దగ్గరకి తీసుకుని కాపాడి రక్షించావు. అందుకే నీ కీర్తి దశదిశలా ప్రపంచమంతా వ్యాపించింది.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : భగవంతుని కృపకు భక్తి ఒక్కటే మార్గము
_______________________________-__________
తాళం : దేపాక్షి

ఏవీ నుపాయాలు గావు - యోక్కువ భక్తే కాని

దావతిఁ బడక యిది - దక్కితే సులభము

ముంటిపై సుఖమందుట - ముక్కున నూరుపు పట్టి

దంట వాయువు గెలువఁ - దలఁచే దెల్లా
వెంటిక పట్టుక పోయి - వెసఁగొండ వాఁకుట
వెంటఁ గర్మమార్గమున - విష్ణుని సాధించుట
||ఏవీ||
ఏనుగుతోఁ బెనఁగుట - యిల నిరాహారియై
కానని పంచేంద్రియాలఁ - గట్టఁబోవుట
నాని చినుప గుగ్గిళ్లు - నమలుట బలిమిని
ధ్యానించి మనసుఁబట్టి - దైవము సాధించుట
||ఏవీ¦¦
-దప్పికి నెండమావులు - దాగ దగ్గర బోవుట
తప్పు చదువులలో - దత్త్వము నెంచుట
పిప్పి చవి యడగుట - పెక్కుదైవాలఁ గొలిచి
కప్పిన శ్రీవేంకటేశు - కరుణ సాధించుట
||ఏవీ¦¦

-----------------------------------------------------------------------

భగవంతుని చేరుకోవడానికి భక్తి ఒక్కటే సులభమైన ఉపాయము. మిగతావన్నీ లేనిపోని వృధా ప్రయాసలే.

ముక్కు మూసుకుని గాలి బంధించి ప్రాణవాయువు పై గెలవాలి అనుకోవడం ముళ్ళ పై పడుకుని సుఖనిద్ర కోరుకోవడం లాంటిది. యజ్ఞాది కర్మలు చేసి విష్ణువుని ప్రసన్నుని చేసుకోవాలని అనుకోవడం వెంట్రుక సాయం తో కొండ ఎక్కాలనే ప్రయత్నం చేయడం లాంటిది.

ఆహారం మానివేసి, "కన్నులు ముక్కు చెవులు నోరు చర్మం" అనే పంచేంద్రియాలను నిగ్రహించి భగవంతుని పొందాను కోవడం ఏనుగుతో పెనుగులాట వంటిది. బలవంతంగా మనస్సును నిగ్రహించి ధ్యానము ద్వారా దైవము స్వాధీనం చేసుకోవాలని అనుకోవడం ఇనుప గుగ్గిళ్లు నానబెట్టి నమలటం లాటింది.

పనికిరాని చదువుల ద్వారా భగవతత్త్వము తెలుస్తుంది అనుకోవడం, దాహమైనపుడు నీటికోసం ఎండమావులు దగ్గరకి పరిగెత్తడం లాంటిది. అనేక ఇతర దైవములను సేవించడం ద్వారా శ్రీవేంకటేశ్వరుని కరుణ పొందాలనుకోవడం, చెరకు పిప్పి నుంచి రసం కోరుకోవడం వంటిది.

కలియుగాన భగవంతుడు భక్త సులభుడు. ఆయనను పొందే మార్గము ఇది ఒక్కటే. మిగిలిన మార్గములన్నీ వృధా ప్రయాసలే. భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే.

మీ

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము : సకల జీవకోటి జీవన ప్రవృత్తులు మూలం సర్వాంతర్యామియైన ఈశ్వరుడు

____________________________________________

నేననఁగా నెంతవాఁడ - నెయ్యపు జీవులలోన

ఈనెపాన రక్షించీ - నీశ్వరుఁడే కాక

ఎవ్వరు బుద్ధి చెప్పిరి - యిలపైఁ జీవులకెల్లా

నెవ్వగఁ బుట్టలఁగొల్చు - నించుకొమ్మని
అవ్వల సంసార భ్రాంతి - అనాదినుండియు లోలోఁ
దవ్వించి తలకెత్తే యం - తర్యమే కాకా!
||నేన||
చెట్టుల కెవ్వరు బుద్ది - చెప్పారు తతికాలానఁ
బుట్టి కాచిపూచి నిండాఁ - బొదులుమని,
గుట్టుతో చైతన్యమై - గుణము లన్నిటికిని
తిట్ట పెట్టి రచించిన - థేవుఁడింతే కాక
||నేన||
బద్దు లెవ్వరు చెప్పిరి - పుట్టినట్టీ మెకాలకు
తిద్ది చన్నుదాగి పూరి - దినుమని
పొద్దు పొద్దు లోననుండి - భోగములు మరచిన
నిద్దపు శ్రీవేంకటాద్రి - నిలయుఁడే కాక
||నేన||
--------------------------------------------------------------------------
ఈ అఖిలాండ కోటి జీవులలో నేనేంతటివాడిని. నా గొప్ప ఏమిటి? సృష్టికర్త అయిన భగవంతుడు అందరిని కాపాడి రక్షించినట్లే నన్ను కాపాడుచున్నాడు.

ఆహారం సంపాదించి కడుపు నింపుకోమని, ధనధాన్యాలతో పుట్టలు,ఇళ్ళు నింపుకోమని ఇక్కడ వున్న సమస్త జీవకోటి ఎవ్వరు చెప్పారు?

జీవుల అంతరంగం లో వుండి సంసార భ్రాంతిని కలిగించిన ఈశ్వరుడే బుద్ది నేర్పి బతుకు తెరువు
చూపించినాడు.

చెట్లకు మొలకెత్తగానే కాలానుగుణంగా పూచికాచి పూలు, పండ్లు, కూరగాయలు ఇచ్చి వృద్ది చెందమని ఎవ్వరు నేర్పారు?

అన్నిటిలో నిగూఢమైన చైతన్యమై వున్న దేవుడు వాటికి ఆయా లక్షణములు కల్పించి పుట్టించినాడు.

పుట్టిన జంతువుల కల్లా వెంటనే తల్లిపాలు త్రాగి తరువాత గడ్డి మేసి బతకమని నేర్పినది ఎవ్వరూ?

ఆయా ప్రాణుల అంతరంగంలో నుండి ప్రతి నిత్యం ప్రేరకుడై ఆయా పనులు చేయమని చెప్పిన శ్రీ వేంకటేశ్వరుడు ఆ పని చేసినారు.

నారు పోసిన వాడే నీరు పోస్తాడు సకల జీవులను సృష్టించిన భగవంతుడే వాటికి బతకడానికి కావలసిన పోషణ ప్రవృత్తి ఇచ్చాడు. ఇందులో మన గొప్ప ఏమి లేదు. సకల విశ్వం లో మనం ధూళి రేణువు కన్నా చాలా చాలా చాలా చిన్న.

మీ

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం

భావము :పరమేశ్వర కృపకై పాటుపడని జీవితం వ్యర్ధం.

____________________________________________

తాళం : కాంబోది

సంతలే చొచ్చితిఁ గాని - సరకు గాననైతి

యింతటి శ్రీహరి నీవే - యిటు దయఁజూడవే

కాంత చనుగొండలు - కడకు నెక్కితిఁగాని

యెంతైనా మోక్షపు మెట్లు - యెక్టలేనైతి
అంతట జవ్వనమనే - అడవి చొచ్చితిఁగాని
సంతత హరి భక్తనే - సంజీవి గాననైతి
||సంత||
తెగ సంసార జలధిఁ - దిరుగులాడితిఁ గాని
అగడై వైరాగ్యరత్న - మది దేనైతి
పొగరు జన్మాల రణ - భూములు చొచ్చితిఁగానీ
సగటుఁగామాదుల - పగ సాధించనైతి
||సంత||
తనువనియెడి కల్ప - తరువు యెక్కితిఁగాని
కొన విజ్ఞాననఫలము - గోయలేనైతి
ఘనుఁడ శ్రీ వేంకటేశ - కమ్మర నీ కృపచేతఁ
దనిసి యే విధులనుఁ - దట్టువడనైతి
||సంత||
--------------------------------------------------------------------------
నేను సంతకి (మార్కెట్) వెళ్లి అంతా తిరిగాను కాని అవసరమైన వస్తువు తెచ్చుకోలేక పోయాను. అంటే విలువైన మానవ జన్మ ఎత్తి ఈ ప్రపంచంలోకి వచ్చాను కాని మోక్ష హేతువైన పరతత్త్వాన్ని అర్ధం చేసుకోలేక పోయాను. ఓ శ్రీహరి! ఈ పనికిరానివాడ్ని నీవే దయ చూపి రక్షించాలి.

స్త్రీలను చూడటం కోసం ఎత్తెన కొండలైనా ఎక్కుతాను గాని మోక్ష మార్గపు మెట్లు కొంతైన ఎక్కను. యవ్వనము అనే అడవి లోకి వెళ్లి అంతా తిరుగుతాను కాని హరిభక్తి అనే సంజీవిని చూడను. అంటే వయస్సున్నపుడు దేవుని తలచనే తలచం. ముసలితనం రాగానే భక్తి చూపిస్తే ఏం లాభం.

సంసార సాగరం లో ధైర్యంగా దూకి ఈదుతూ అంతా తిరుగుతాను కాని సముద్ర గర్భం లో వున్న "వైరాగ్యం" అనే రత్నాన్ని తీసుకురాలేను. గర్వం, అహం, పొగరు గల నానా జన్మల రణరంగం (యుద్ధం) లో ప్రవేశించి యుద్ధం చేస్తున్నా గాని కామక్రోధలోభమదమాత్సర్యాలు అనే అరిషడ్వర్గముల తోటి వున్న పగ సాధించ లేకపోయాను.

శరీరమనే కల్పవృక్షం ఎక్కాను గాని చివరన వున్న విజ్ఞానం అనే పండుని కోయలేకపోయాను. శ్రీవేంకటేశ్వరా! ఇంతలా అసఫలమైనా మరల ఎలాగనో నీపై భక్తి కలిగి నీ కృపకు నోచుకున్నాను. ఈ కర్మలనే బంధాల నుంచి విముక్తుడనే ధన్యుడనైనాను.

మీ

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : ప్రసన్నుడు కర్మ మార్గము, సన్న్యసించిన వానికి ప్రేమాభిమానాలు, ఒక మతమువానికి పరమతాశ్రయణము తగవు.
____________________________________________
తాళం :గుజ్జరి

కలదిదివో సుఖము కలిగినను - గర్భము నిలువక మానునా?

మలసి కామ్య కర్మములకుఁ జొచ్చిన - మగుడఁ బుట్టువులు మానునా?

పరగ నింద్రజిత్తుఁడు హనుమంతుని - బ్రహ్మాస్త్రంబునఁ గట్టి

అరయ నందు పై మోకులు గట్టిన - నల బ్రహ్మాస్త్రము వదలె,
పరిపరి విధముల నిటువలెనే హరిఁ - బ్రపత్తి నమ్మిన నరుఁడు
తిరుగ గర్మమార్గమునకు జొచ్చిన - దేవుడు తన వాత్సల్యము వదలు.
||కల||
అలరిన సంసారభ్రమ విడిచి - యడవిలోన జడభరతుడు
తలపున నొక యిర్రిఁ బెంచినంతనే - తనకును నా రూపే దగిలే,
ములుగుచు లంపటములు దెగవిడిచి - మోక్షము వెదకెడిఁ నరుడు
వలవని దుస్సంగతులు పెంచినను - వాసన లంటక మానునా?
||కల||
అటు గన తాఁబట్టిన వ్రతములుండఁగ - నన్య మతము చేపట్టినను
నటనల నెందునుఁ బొందక జీవుఁడు - నడుమునె మోరుఁడైనట్లు,
తటుక్కున శ్రీవేంకటపతి నొక్కని - దాస్యము భజియించిన నరుఁడు
ఘటనలో నాతని కైంకర్యములకు - కడుఁ బాత్రుఁడు గాక మానునా?
||కల||
-------------------------------------------------------------------------
సత్యము ఇదే. సంసార సుఖమని అనుకున్న స్త్రీ కి తరువాత గర్భధారణ బాధలు పడక తప్పదు. ఫలితము కోరి కర్మలు చేసేవారికి తిరిగి ఆ కర్మల దుఖం అనుభవించక తప్పదు.

ఇంద్రజిత్తు హానుమంతుని బ్రహ్మాస్త్రము తో బంధించాడు. కాని నమ్మకం లేక తిరిగి గట్టి త్రాళ్ళతో కట్టివేశాడు. ఏమైంది. బ్రహ్మాస్త్రం హానుమంతుని వదిలేసింది. అటులనే శ్రీహరిని భక్తి మార్గమును కొలచినవాడు నమ్మక తిరిగి కర్మమార్గములు ఆచరిస్తే, భగవంతుడు అతనిపై వాత్సల్యము వదలి వేస్తాడు.

సర్వస్వము వదలి అరణ్యం లో సన్న్యాసియైన జడభరతుడు మమకారం తో జింకను పెంచసాగాడు. ఏమైంది! తిరిగి అతను జింకగా జన్మనెత్తవలసి వచ్చింది. అలాగే విరాగై మోక్షం అన్వేషించేవాడు మరల దుస్సాంగత్యము పెంచుకుంటే, జన్మ కారకులైన మలిన వాసనలు అంటకుండా వుంటాయా?

తాను పుట్టి ఆశ్రయించిన మతమోకటి వుండగా, పూర్ణవిశ్వాసము లేక ఇతర మతమును ఆశ్రయిస్తే,

ఏ మతమునందు పరమార్ధము తెలియక రెంటికి చెడిన రేవడవుతాడు. ఒక్క శ్రీ వేంకటేశ్వరుని పరమపధం గా విశ్వసించి దాస్యం చేయు మానవునికి భగవంతుని కైంకర్యములకు (కృపకు) తప్పక పాత్రుడవుతాడు.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు సర్వసంగపరిత్యాగునకు పట్టవు.

_____________________________________________
తాళం : పాడి

తెలిసితే మోక్షము - తెలియకున్న బంధము

కల వంటిది బదుకు - ఘనునికిని

అనయము సుఖమేడ - దవల దుఃఖమేడది

తనువుపై నాసలేని - తత్త్వమతికి,
పొనిఁగితే బాపమేది - పుణ్యమేది కర్మమందు
ఒనర ఫలమొల్లని - యోగికిని
||తెలి||
తగిన యమృతమేది - తలఁపఁగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికిని,
పగవారనగ వేరి - బంధులనగ వేరి
వెగటు ప్రపంచ మెల్ల - విడిచే వివేకికి
||తెలి||
వేవేలు విధులందు - వెరపేది మరపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని,
శ్రీ వేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాఁడు
ఈవలేది యావలేది - యితని దాసునికి
||తెలి||
____________________________________________

అన్ని తెలిసిన వారికి మోక్షం అంటే తెలుస్తుంది. తెలియని వారికి అన్ని బంధాలే అనిపిస్తాయి. నిర్మోహికి ఈ జీవితం కల లాంటిది.

శరీరం పై మమకారం లేనివారికి శరీరావయాల వల్ల కలిగే సుఖమేమిటి? దుఖమేమిటి?

విరాగి అయి ఫలితం ఆశించని యోగి అయిన వానికి చేసే పనులలో పుణ్య మేమిటీ? పాప మేమిటి?

నిరాహారియై దీక్ష చేసేవానికి తినేవస్తువులు అమృతమైతే ఏమిటి? విషమైతే ఏమిటి?

ప్రపంచం పై విరక్తి పొందిన వివేకవంతునికి చుట్టుపక్కల వారు శత్రువులైతే ఏమిటి? బంధువులైతే ఏమిటి?

దైవభక్తి కలిగి దైవార్పణగా వివిధ పనులు చేసినా వెరపు మరుపంటు వుండదు. శ్రీవెంకటేశ్వరుని మనసులో పూజించే దాసునికి ఈ జన్మ మేమిటి? వచ్చే జన్మ ఏమిటి? అతనికి జనన మరణాలతో గాని, ఐహిక, స్వర్గ లోకాలతో గాని సంబంధం లేదు.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : జీవితం అశాశ్వతం, క్షణభంగురమని తెలిసి భోగములకై పాపములు చేయుట ఎంత మూర్ఖత్వం మనిషికి.
_____________________________________________
తాళం : ముఖారి

వెనకేదో ముందరేదో - వెర్రి నేను నా

మనసు మరులుదేర - మందేదొకో!

చేరి మీఁదటి జన్మము - సిరులకు నోమేఁగాని

యేరూపై పుట్టుదునో - యెరుగ నేను,
కోరి నిద్రించఁ బరచు - కొన నుద్యోగింతుఁగాని
సారె లేతునో లేవనో - జాడ దెలియు నేను
||వెన||
తెల్లవారి నప్పుడెల్లా - తెలిసితి ననేఁగాని
కల్లయేదో నిజమేదో - కాన నేను
వల్లచూచి కామినుల - వలపించేఁగాని
మొల్లమై నామేను - ముదిరిన దెరఁగా
||వెన|
పాపాలు చేసి మరచి - బ్రదుకుచున్నాఁడఁగాని
వైపుగఁ జిత్రగుప్తుఁడు - వ్రాయుట నెరగ,
ఏపున శ్రీవేంకటేశు - నెక్కడ వెతకేఁగాని
నాపాలి దైవమని - నన్ను గాచు టెరఁగా
||వెన||
-------------------------------------------------------------------------
వెనుక ఏం జరిగిందో, ముందర ఏం జరుగుతుందో? భూత భవిష్యత్తు తెలియని వెర్రివాడిని. భౌతిక సుఖముల నుంచి నా మనసు మరలించే మందు ఎక్కడ వుందో?

వచ్చే జన్మ లో సుఖ సంపదలు కలగాలని వ్రతాలను నోములు చేస్తున్నాను. అసలు వచ్చే జన్మ లో ఏ రూపం లో పుడతానో తెలుసా నాకు! నా వెర్రితనం కాబోతే. బాగా నింద్రించాలని మెత్తటి పరుపుల కై ప్రయత్నిస్తున్నాను. అసలు నేను ఈ నిద్ర నుంచి తిరిగి లేస్తానో లేవనో నాకు తెలియదు కదా!

ప్రతి రోజు ఉదయం నిద్ర లేచి జరిగినదంతా నాకు తెలుసని అనుకుంటాను. కాని కల ఏదో నిజమేదో? అసలు ఈ లోకమేమై పోయిందో? ఎంత పిచ్చివాడని నేను. వలపు సుఖాలలో మునిగితేలుతున్న నేను, నా శరీరానికి ముసలితనం వచ్చిందన్న సంగతే గుర్తించలేదు కదా.

రోజు అనేక పాపాలు ఎవరికి తెలియదని చేస్తున్నాను. పైన చిత్రగుప్తుడు అన్నింటినీ నదలకుండా లెక్క వ్రాస్తున్నాడు అన్న సంగతి తెలియదా? పిచ్చివాడిని కాబోతే.

శ్రీ వేంకటేశ్వరుడు ఎక్కడో వున్నాడని మూర్ఖుడిలా వెతుకుతున్నాను. ఆయన నావెంట వుండి సదా నన్ను కాపాడుచున్నాడనే సంగతి మరచిపోయాను కదా!

మీ

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :

భావము :మనకి మోక్షం ప్రసాదించేది శ్రీహరి ఒక్కడే. ఇంకేవరి వల్ల కాదు.

____________________________________________
తాళం : ఆహిరి

ఇందులో మొదలికర్త - యెవ్వఁడు లేఁడు గాఁబోలు

ముందు కరివరదుఁడే - ముఖ్యుడు గాఁబోలు

అడితిఁబో బహురూపా - లన్ని జన్మలఁబుట్టి

తోడనే బ్రహ్మాదులనే - దొరలెదుటా,
జాడలు మెచ్చాలేరు - చాలునన్నవారు లేరు
వేడుక నడవిఁగాసే - వెన్నెలాయ బ్రదుకు.
||ఇందు||
అన్ని కర్మములుఁ జేసి - ఆటలో బ్రాహ్మణుడనైతి
నన్న వేదము లనేటి - యంగడి వీధి
నన్ను జూచేవారు లేరు - నవ్వేటివారు లేరు
వన్నెలు సముద్రములో - వానలాయ బ్రదుకు
|¦ఇందు¦¦
సంసార పు నాటక - సాలలో ప్రతిమనైతి
కంసారి శ్రీ వేం - కటపతి మాయలోన
ఇంస లన్నియునుఁ దేరె - నిందరు జుట్టములైరి
హంస చేతి పాలు నీరు - నట్లాయ బ్రదుకు
¦¦ఇందు¦¦
--------------------------------------------------------------------------
ఈ జగన్నాటక రంగానికి మొదట సూత్రధారుడు ఆయనే కాబోలు. గంజేంద్రునికి మోక్షం ప్రసాదించిన శ్రీహరే దీనికంతకు మూల కారకుడు.

క్రిమికీటకాదుల తో మొదలు పెట్టి ఎన్నేన్ని జన్మల వివిధ వేషాలు ఎంతో కాలం నుంచి నేను ఈ జగన్నాటకం లో బ్రహ్మాది దేవతల అనే రాజుల ముందు ఆడుతున్నాను. వీరు నా ఆట చూసి కిమ్మనకుండా కూర్చున్నారే గాని అటూ మెచ్చుకోలేదు ఇటు ఆపమని అడగాలేదు. మోక్షం అనే బహుమతి ఇవ్వాలేదు. నా బతుకు అడవిన గాచిన వెన్నెల వలె వ్యర్థమైనది.

వేదములనే అంగడి వీధులలో బ్రాహ్మణుని వలె అన్ని వేదక్తములైన పనులు చేసాను. ఇంత చేసినా నన్ను చూసినవారు లేరు, నవ్వినవారు లేరు. సముద్రంలో కురిసిన వాన వలె నా బ్రతుకు నిరుపయోగమైన పోయినది.

కంసాంతకుడైన శ్రీ వేంకటేశ్వరుని మాయకు లోబడి జననమరణాలకు నిలయమైన ఈ సంసార నాటకశాలలో నేను ఒక బొమ్మ నైనాను. ఆయన అనుగ్రహం లభించింది. ఇంతవరకు నను బాధించిన జన్మకర్మాదులే ఇప్పుడు నాకు చుట్టములైనారు. నా జీవితం హంస చేతి లో పాలు నీరు వేరైనట్టు మంచి చెడ్డలు, జ్ఞానాజ్ఞానాలు తెలిసి ధన్యమైనది.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : భగవంతుడైన శ్రీహరిని వదిలి ఇతరుల కొలవడం వలన ఉపయోగం లేదు.
_____________________________________________
తాళం :భైరవి

మొదలుండఁ గొనలకు - మోచి నీళ్లు వోయనేల?

యెదలో నీవుండఁగా - వితరము లేలా?

నిగమమార్గమున - నే నడచేనంటే

నిగమము లెల్లను - నీ మహిమే
జగము లోకుల జూచి - జరిగెదనంటే
జగములను నీ మాయ - జనకములు. ||మొద||

మనసెల్ల నడ్డపెట్టి - మట్టు నుండేనంటే

మనసు కోరికలు - నీ మతకాలు
తనువు నింద్రియములు - తగ గెలిచేనంటే
తనువు నింద్రియములు - దైవము నీ మహిమా
||మొద||
ఇంతలోని పనికిఁగ - ఇందు నందు జొరనేల?
చెంత నిండు చెరువుండ - చెలమలేలా?
పంతాన శ్రీవేంకటేశ - పట్టి నీకే శరణంటి
సంతకూటాల ధర్మపు - సంగతి నా కేలా?
||మొద||
--------------------------------------------------------------------------
చెట్టు ఫలము కావాలంటే మొదలు లో నీరు పోయాలి గాని కొసకొమ్మలకి పోయడం దేనికి. అలాగే నా హృదయం లో వున్న నిన్ను మరచి ఇతర విధాలుగా ముక్తికి ప్రయత్నించటం దేనికి.

వేదములు చెప్పిన సనాతన ధర్మ దారి లో వెళితే జరిగేదంతా నీ మహిమలే. అలాకాక లోకం లో ఇతరుల ప్రవర్తన ఆచరించి చేస్తే దొరికేది నీ మాయమోహములే.

చంచలమైన మనసుని నిగ్రహించగలిగితే మనసులో గలిగే కోరికలన్ని నీ అభీష్టాలే. యోగ మార్గాన ఇంద్రియాలను జయించగలిగితే ఈ శరీరమంతా నీ మహిమలే.

ఇలా జగమంతా నీ మాయకు, మహిమకు లోబడి వుంటే ఇతర వ్యర్థ ప్రయత్నాలు ఎందుకు. చెంత నిండు చెరువు వుండగా నీటికి సెలయేరు దగ్గరకి పోవడం దేనికి. సకలఫల ప్రదాత శ్రీ వెంకటేశ్వరా! నిష్టగా నీ శరణు కోరుకున్నాను. ఇంక నాకు సంతలోని జనాలు లాగా గొడవ పడే ఇతర ధర్మాలు నాకెందుకు.

మీ

"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : లక్ష్మీదేవి(ధనం) విలాసము ఎలా వుంటుందో ఈ కీర్తన లో వివరించారు
____________________________________________
తాళం : గుండక్రియ

రూకలై మాడలై - రువ్వలై తిరిగేని

దాకొని ఉన్నచోట - దానుండ దదివో

ఒకరి రాజు జేసు - నొకరి బంటుగఁ జేసు

ఒకరి కన్నెకల వే - రొకరికి నమ్మించు
ఒకచోట నున్న ధాన్య - మొకచోట వేయించు
ప్రకటించి కనకమే - భ్రమయించీ జగము. ||రూక||

కొందరి జాళెలు నిండు - కొందరికి సొమ్ములవు

కొందరి పుణ్యులఁ జేసు - కొందరి పాపులఁజేసు
కొందరి కొందరిలోన - కొట్లాట పెట్టించు
పందె మాడినటు వలెఁ - బచరించు పసిడి. ||రూక||

నిగనిగ మనుచుండు - నిక్షేపమై యుండు

తగిలి శ్రీ వేంకటేశు - తరుణియై తానుండు
తెగని మాయైయుండు - దిక్కు దెసయై యుండు
నగుతా మా పాలనుండి - నటియించుఁ పసిడి.
||రూక||
-------------------------------------------------------------------------
లక్ష్మి (ధనం) ఒకచోట దాగి వుండదు. అది నాణెలు, రూపాయలు, బంగారం, వెండిగా రకరకాలుగా మారి లోకమంతా తిరుగుతూ వుంటుంది.

ఈ ధనం ఒకరిని రాజుని చేస్తే మరోకరిని సేవకుడుగా చేస్తుంది. ఒకరి కన్యకలను వేరోకరికి అమ్మిస్తుంది (కన్యాశుల్కం).. ఒకరి పండించిన ధాన్యాన్ని మరోకచోటికి మారుస్తుంది. ఇలా లోకమంతా ధన, బంగారాలే అని భ్రమింప చేస్తుంది

ఈ కనకం కొందరి సంచుల నింపుతుంది. మరి కొందరికి ఆభరణాలుగా మారుతుంది. కొందరిని పుణ్యాత్ములు మారిస్తే మరెంతోమందిని పాపాత్ములుగా మారుస్తుంది. మనిషికి మనిషికి మధ్య కొట్లాటలు తెస్తుంది.. ఈ ధనం పందెం లో వున్నట్టు ఎప్పుడూ అటు ఇటూ పరుగులు తీస్తూ వుంటుంది.

ఈ బంగారం ఒకచోట బయటుండి నిగనిగా మెరుస్తుంటే మరో చోట భూమిలో పూడ్చిపెట్టబడి దాగి వుంటుంది. కాని ఆమె శ్రీ వేంకటేశ్వరుని పై ప్రేమతో భార్య అయి ఆయన వక్షస్థలం పై స్థిరనివాసం వుంటుంది. మానవులందరిని మాయయై కమ్ముకు తిరుగుతుంటుంది. నమ్మి కొలిచినవారికి రక్షణ కల్పిస్తుంది. కనక రూపంలో మిలమిలా నవ్వుతూ మా చెంత పలువిధాలుగా నటించుచున్నది.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం
"అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈ రోజు సంకీర్తన :
దేవుడవైన నీకే కర్మ ఫలము తప్పక పోతే మా లాంటి వారి గతి ఏమిటి. అన్నమయ్య ఏం వ్రాసారో చదవండి :
____________________________________________
ఎట్టి వారికి నెల్ల నిట్టికర్మములు మా
యిట్టి వారికి నింక నేది త్రోవ

పాము జంపిన మట్టి పాతకమునఁ బెద్ద

పాము మీద నీకు బవళించ వలసె
కోమలిఁ జంపిన కొరతవల్ల నొక్క
కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె. ||ఎట్టి||

బండి విరిచినట్టు పాతకమునఁ బెద్ద

బండి బోయుఁడవై పనిసేయ వలసె
కొండ వెరికినట్టి గుణమునఁ దిరుమల
కొండమీద నీకు గూచుండవలసె. ||ఎట్టి||

---------------------------------------------------------------------

వేంకటేశ్వరా! నీ లాంటి దేవుడికే కర్మ ఫలము తప్పక పోతే మాలాంటి వారి పరిస్థతి ఏమిటి. వేరే తప్పించుకునే మార్గంవుంటుందా?

సర్పాన్ని(కాళీయుడు) చంపిన దోషానికి నీకు పెద్ద పాము (ఇదేశేషుడు) పై ఎల్లప్పుడు పవళించ వలసి వచ్చింది. స్త్రీ (పూతన) చంపిన నేరానికి ఇంకో స్త్రీ (పద్మావతి) ని సదా హృదయం పై వుంచుకోవలసి వచ్చింది.

బండిని (శకటాసురుని) విరచిన కారణానికి ఇంకో పెద్ద బండి (రధం) పనివాడివై (సారధివై) పనిచేయ వలసివచ్చింది. కొండను (గోవర్ధన పర్వతం) పెరికిన దోషానికి ఇంకో కొండ తిరుమల పై నీకు కూర్చుండ వలసి వచ్చింది.

మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

""అన్నమాచార్య సంకీర్తనామృతం" లో ఈనాటి సంకీర్తనం :
భావము : జీవుని తోడుగా వున్న బలగం (సైన్యం) ఏమున్నాయో శ్రీహరీకి అన్నమయ్య ఈ కీర్తనలో వివరించారు.
______________________________________________
తాళం :శ్రీరాగం

అన్నిటికి నొడయఁడ వైన - శ్రీపతివి నీవు
ఎన్నరాదు మాబలఁగ - మెంచుకో మౌపౌఁజు

జ్ఞానేంద్రియము లైదు - శరీరిలోపల
ఆనక కర్మేంద్రి - యములైదు
తానకపు కామక్రో - ధాల వర్గము లారు
ఈ నెలవు పంచభూతా - లెంచు మాపౌఁజు
||అన్ని||
తప్పని గుణాలు మూడు - తను వికారము లారు
అప్పటి మనో బుద్ద్య - హంకారాలు,
ఉప్పతిల్లు విషయము - లుడివోని నొక అయిదు
ఇప్పటి మించే కోపము - యెంచుకో మాపౌఁజు
||అన్ని||
ఆఁకలి దప్పియును మా - నావమానములును
సోఁకిన శీతోష్ణాలు - సుఖదుఃఖాలు.
మూఁక గమికాడ నేను - నెంచుకో శ్రీవేంకటేశ!
యేఁకటారఁ గడపేవా - నెంచుకో మాపౌఁజు
||అన్ని||
-------------------------------------------------------------------------
దేవా! నీవు సమస్త విశ్వానికి అధిపతివైన లక్ష్మినాధుడివి. జీవులమైన మాకు కూడా సైన్యం వుంది. మా బలగాన్ని పరీక్షించి ఎంచుకొవయ్యా!

కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలు ఐదు మాలో వున్నాయి. మరి శరీరానికి వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థము అనే కర్మేంద్రియాలు ఉన్నాయి. శరీరం బయట కాపాలగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలు ఆరు మోహించి వున్నాయి. ఇక వెలుపల భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే పంచభూతాలు ప్రహరా కాస్తున్నాయి. మా సేన ఎట్లున్నదో పరీక్షించుకొనుము.

అట్లే ఇంకా సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు; పుట్టుట, సెరుగుట, పరిణమించుట, ఉండుట, క్షీణించుట, నశించుట అనే శారీరకమైన వికారాలు ఆరు; బుద్ది, మనస్సు, అహంకారము అనే మూడు; తొలగాలన్నా వదలక ఎప్పటి కప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఐదు విషయములు మా సేన లో వున్నాయి. వీటన్నింటికి మించి కోపము వుంది. మా సైన్యాన్ని తక్కువగా అంచనా వేయక పరిగణనకు తీసుకొమ్ము.

ఇది కాకుండా ఇద్దరిద్దరు వున్న ఆకలిదప్పులు, మాన అవమానాలు, శీతోష్ణములు(చలివెచ్చ), సుఖదుఃఖాలు వున్నాయి. కావున నేను సామాన్యమైన వీరుడని కాదు. గొప్ప సైన్యానికి అధిపతిని. శ్రీవేంకటేశ్వరా! ఇంత బలగాన్ని నీకు సమర్పించి నేను మొక్కుచున్నాను.
నా సైన్యాన్ని పరిశీలించి తీసుకుని నన్ను నీవాడిని చేసుకో.

ఆన్నమయ్య మనకున్న బలహీనతలన్ని బలంగా మార్చి దేవునికి ఇచ్చి నన్ను తక్కువగా చూడకుండా నీ వైకుంఠ సైన్యం లో కలుపుకోమని చెప్పారు. వందల పుస్తకాలలో కూడా పట్టని విషయాలన్ని మూడు చరణాలలో చెప్పారు. పదకవిత పితామహులు అన్నమాచార్యుల వారు.

మీ
శ్రీకాంత్ గంజికుంట కరణం

Comments

Post a Comment

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు