ప్రాంజలి ప్రభ - శ్రీ క్రిష్ణ లీలlu
నేటినా కీర్తన
పంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
గోపాలా గోపాలా రామ గోపాలా
గోపాలా గోపాలా కృష్ణ గోపాలా
కాల నిర్ణయం తెలియుట లేదు
సేవ తత్పరం కలుగుట లేదు
నీపై సమ్మోహం వదులుట లేదు
కృష్ణ అమృతం మరచుట లేదు
గోపాలా గోపాలా రామ గోపాలా
గోపాలా గోపాలా కృష్ణ గోపాలా
రాగ కల్పతం చేయుట లేదు
భావ అర్పితం కల్గుట లేదు
నాద సంకల్పం నచ్చుట లేదు
కృష్ణ అమృతం మరచుట లేదు
గోపాలా గోపాలా రామ గోపాలా
గోపాలా గోపాలా కృష్ణ గోపాలా
పాల ప్రీతియే మారుట లేదు
జాలి భావమే చేరుట లేదు
తాప తీపియే తప్పుట లేదు
కృష్ణ అమృతం మరచుట లేదు
గోపాలా గోపాలా రామ గోపాలా
గోపాలా గోపాలా కృష్ణ గోపాలా
ఆధరం మధురం - వదనం మధురం
నయనం మధురం - హసితం మధురం
హృదయం మధురం- గమనం మధురం
మధురాధిపతే అఖిలం మధురం
గోపాలా గోపాలా రామ గోపాలా
గోపాలా గోపాలా కృష్ణ గోపాలా
--((*))--
నేటి నా కీర్తన -4
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
రాధా కృష్ణలు మైమరచి తన్మయత్వంతో
దాగుడు మూతలాట
దాగుడు మూతలు ఆడనులే కృష్ణ
ఈ రాధిక చిలిపి చేష్టలకు మన్నించు కృష్ణ
దాగుడు మూతలు చాలునులే
బాసలు తీరుట తప్పదులే
దర్శన మీయక ఒప్పదులే
పున్నమి వెన్నల వేళయులే
మంజుల రూపము నీదియులే
యవ్వన రూపము నీదియులే
ముద్దుల మోమియు నీదియులే
వెల్గుల దీపము నీదియులే
కన్నులు మూయట తప్పునులే
పంతము వీడియు వచ్చెనులే
అందము సొంతము నీదియులే
లీలలు చూపుట మాయయులే
పువ్వులలో వర్ణాలు లేవులే
సకలం చీకటి ఆయినదిలే
కాంతిహీణంగా మాఱిరిందిలే
లీలలు చూపుట మాయయులే
దాగుడు మూతలు ఆడనులే కృష్ణ
రాధికా చిలిపి చేష్టలకు మన్నించు కృష్ణ
రాధికా చిలిపి చేష్టలకు మన్నించు కృష్ణ
నేటి కవిత
ప్రాంజలి ప్రభ(రాధాకృష్ణ తన్మయ భావం)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నీలో నేనై, నాలో నీవై
ఒకరికి ఒకరుగ తోడై
నలుగురిలో ఒకరమై
నవనీతంలా కరిగిపోదాం
ఊహలలో ఉషస్సై
ఊయలలో విహారై
మెరుపుల్లో మెరుపై
మంచుగడ్డలా కరిగిపోదాం
తరుణమంత తమకమై
వికసించిన లతలమై
చకోర పక్షుల జతయై
మల్లెతీగల పెనవేసుకుందాం
పారిజాత సుమదలాలై
పవళిద్దాం పవళింపుపై
విహరిద్దాం ఐరావతంపై
మేఘంలా కరిగిపోదాం.
అణువణువు తనువై
పరిమళాల దళాలై
మమేకంగా ఏకమై
పాలల్లో నీరులా కలసిపోదాం
ప్రణయా నందమై
ప్రగతికి మార్గమై
ప్రపంచానికి సేవయై
ప్రత్యూష వెలుగై కలసిపోదాం
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ గోపాలకృష్ణయ్యా
ఈ రాధను మరచి ఎలా ఉంటున్నావయ్యా
నీవు ఎలా ఉన్నా నా హృదయానికి చిక్కావయ్యా
నా హృదయం నుండి ఎక్కడికి పోలేవయ్యా
ఓ గోపాల నన్ను ఏడిపించకయ్యా
నీ మోహనరూపం చూడందే ఉండలేనయ్యా
నీ స్నిగ్ద దరహాసం మరువ లేకున్నానయ్యా
నీ నటన నన్ను ముగ్దుని చేస్తున్నదయ్యా
నవ మన్మధ రాజాధి నేతవు నీవయ్యా
వసంతాలలో మురిపించే వాడవయ్యా
చిత్తరవు చూస్తేనే మతి పోతుందయ్యా
ప్రతిక్షణం నీతలపె, శాంతి నిస్తుందయ్యా
నీ స్నిగ్ద దరహాసం దాచు కోకయ్యా
నిత్యం నా హృదయంలో ఉండవయ్యా
నీ ఆశలు తీర్చుటకు ఈ రాధ ఉందయ్యా
ఓ గోపాలయ్యా నీకోసం వేచి ఉన్నానయ్యా
ఉదయాన్నే నిన్ను తలుస్తూనే లేస్తానయ్యా
నీ తలపులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవయ్యా
నీ చిన్నపిల్లల చేష్టలు ఇంకా ఉడికిస్తున్నాయయ్యా
నీ పెదవి ఆధరం నాకు మధువుగా కనిపిస్తున్నదయ్యా
ఒక్కసారి నీ అధరాలను ఆస్వాదించాలని ఉందయ్యా
నీ కన్నుల చూపును నేను మరువ లేకున్నానయ్యా
నీ విన్యాసాన్ని తలచుకుంటే తనువు తపిస్తుందయ్యా
ప్రతి రేయి నాకు నిద్దుర లేకుండా చేస్తున్నావయ్యా
ఓ గోపాలకృష్ణయ్యా
ఈ రాధను మరచి ఎలా ఉంటున్నావయ్యా
నీవు ఎలా ఉన్నా నా హృదయానికి చిక్కావయ్యా
నా హృదయం నుండి ఎక్కడికి పోలేవయ్యా
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
శ్రీకృష్ణ లీలామృతం
బాలల్లారా భామల్లారా
బంతు లాడుకుందాము రారా
వావి వరసలు మరచీ రారా
వాస్తవము తెలుసుకుందాము రారా
బాలల్లారా భామల్లారా
బంతు లాడుకుందాము రారా
ప్రేమే సత్యం ప్రేమే నిత్యం
ప్రేమే దైవం ప్రేమే మౌనం
ప్రేమే సృష్టి ప్రేమే దృష్టి
ప్రేమే నిజం ప్రేమే భజం
పచ్చ పచ్చ చేనుల్లో
వెచ్చ వెచ్చ మాటల్తో
నచ్చి నచ్చి పాట ల్తో
మురళీ వేణు గణాల్తో
మదిలో ఆనందా ల్తో
అద్భుత నృత్యా ల్తో
ప్రేమే కల ప్రేమే వల
ప్రేమే జత ప్రేమే కథ
ప్రేమే మతి ప్రేమే గతి
ప్రేమే నీతి ప్రేమే జాతి
హృదయ లయల్తో
పరువాల రంగుల్తో
సంతోష సంబరాల్తో
తందాన ఆటల్తో
రాగ తాన పల్లవి ల్తో
ప్రేమే ధృతి ప్రేమే శృతి
ప్రేమే ఇఛ్ఛ ప్రేమే స్వఛ్ఛ
పాడు కుందాం రారా
మోహంబు తో రారా
కొలువై ఇటువైపు రారా
శ్రీ కృష్ణ పిలిచేను రారా
కృష్ణం భజే రామకృష్ణం భజే
తల్లి తండ్రులు బందిఖానాలో ఉండగా
ద్వాపరంబున అష్టమ చంద్రునిగా
లోకులందరు మెళకువ లేకుండగా
తల్లి దేవకీ దేవి గర్భమునందునా
సజీవంగా జన్మించావు శ్రీ భగవంతునిగా
మాయలో సమస్త జనులు ఉండగా
వసుదేవుడే నిను బుట్టలో ఉంచి బయల దేరగా
సర్పరాజు గొడుగు పట్టగా, సముద్రము దారి ఇవ్వగా
రేపల్లెకు చేరి యశోదాదేవి ఒడిలోనికి చేరితివయ్యా
సృష్టిలో మొదటగా కృష్ణ యనినా
నల్ల నయ్య అని ఎవ్వరు పిలిచినా
తేట తెలుగులో కాలమే అయినా
ముద్దుల మోహన రూపుడవు నీవయ్యా
దైవజ్ఞాన ధనము నిచ్చే నిధిగా
శ్రేష్ఠమైన గుప్తజ్ఞాన బోధకుడుగా
త్రికాల దేవతల సృష్టి పరంధాముడుగా
అందరి కోరికలుద్తీర్చే పరమాత్ముడవు నీవయ్యా
--((**))--
paanjali prabha
వైభవమ్ము
అర్ధం ఉంటె తిరుగు ఖర్చు తో చేరు రోగం
అడ్డం ఉంటె జిలుగు చర్చ తో తీరు రోగం
అద్దం ఉంటె ఒరుగు మార్పు తో కోరు రోగం
ఆత్రం ఉంటె మెరుగు నేర్పుతో మారు రోగం
ఆశ ఉంటె పెరుగు తీర్పు తో చేరు రోగం
ఆడ ఉంటె తరుగు కూర్పు తో తీరు రోగం
తాపం ఉంటె నలుగు వాటాతో వచ్చే రోగం
వేషం ఉంటె వెలుగు ఓర్పుతో మారు రోగం
శ్వేతాంబరమే కాదు శ్వేత కమలమ్ము
అంగాంగమే కాదు అంగ సౌష్టవమ్ము
ఆధరంభమే కాదు ఆత్మ సౌందర్యమ్ము
నా ఆరాధ్య ప్రాణ సఖియే వైభవమ్ము
(1)
గోపాల కృష్ణుడు
రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు
నిర్మల మైన వాడు, మన మువ్వ గో పాలుడు
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు
ఎప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు
ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు
మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు
మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు
సిరి కల్పించి, సంతోష పంచిన చిన్మయ స్వ రూపుడు
అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు
కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు
--((**))--
Comments
Post a Comment