అ ముద్రిత ఛందస్సు కవితలు





నేటి నా కీర్తన    
ప్రాంజలి ప్రభ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  
సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI
12 జగతి 2341

ఏముంది నీలోన - నీసుందరమ్మే న 
వాభ్యుదయామృత - నీ మానసాహిత్య 
సంగీత సౌలభ్య -  సౌందర్య ఉల్లాస 
ఉత్తేజ భావమ్ము - నన్నావ హించేను ..... 1  

ఏనాటి భంధమ్మో - ఈనాడు నీముందు 
నేతాడ లేకున్న - నీవెంత భేదమ్ము   
చూపించినా మాట  - నామమ్ము నీమీద 
యీనాటి కీ మార దంటే మనస్సొప్పు  ...... 2 

ప్రాణమ్ము నీవిందు  - గానమ్ము నీవిందు   
ధ్యానమ్ము నీవిందు - కాలమ్ము నీవిందు 
గాలమ్ము  నీవిందు - నాపంట పండించె  
చాలించు మాయాట -  ఇంకెందుకీ పూట .... 3  
    
మాటల్ వినోదమ్ము - పాటల్ వినోదమ్ము
చేతల్ వినోదమ్ము -  లీలల్ వినోదమ్ము 
నీ రూపు నీలాలు   - నీకళ్ళు వెన్నెల్లు
నాయందు యీపూట - సంతృప్తి కల్పించు .... 4          
         
గోపాల గోపాల - గోవింద గోవింద 
గోపాల గోపాల - గోవింద గోవింద
గోపాల గోపాల - గోవింద గోవింద
--((*))--



నేటి ఛందస్సు - ప్రాంజలి ప్రభ 
రచయత:మల్లప్రగడ రామకృష్ణ  

ఇది చిత్రం కాదు పరిణత చెందిన తరుణి
నీలి కన్నులు గల నీలాలు ఉన్న నీలవేణి
కడలిని కలియుటకు ఉరికే తరంగణి
చిరు నగవులు చిందించు చున్నట్టిఅలివేణి

సౌందర్యానికి వన్నెతెచ్చినట్టి మధురవాణి
వెన్నెల చీరతో పొందికగా ఉండేటి వాహిణి
మనసును ఉల్లాస పరిచే మందార మోహిణి
హావ భావ విణ్యాసాలతో మెరిసే కృష్ణవేణి

పసిడి మేనితో ఉర్రూత లూగించే రత్న గణి
సకల విద్యల్ని భోధన చేసేటి విద్యా వాణి 
సంగీత స్వరాల సాహిత్య సౌందర్య మహారాణి
చిరునవ్వులందిచి మైమరిపించే సుహాసిణి



నేటి నా కవిత - ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

"కామనిభా" వృత్తము
గణములు - మ,స,త,ల
యతి - 6

కార్యాలంకృత భావా దాయిని 
సామాన్యా సమ వాత్సల్యాన్విత
సాంఘికా సుమ తత్వా నందిని 
ప్రారబ్ధా భవ బాంధవ్యాయిని

ఆరోగ్యామృత విద్యాదాయిని
సంతోషాల నవాభ్యుద్దాయిని   
నీప్రేమా మము సమ్మానింతును 
వీణాధారిణి నిత్యం కొల్తును

ఓంశ్రీరామ్ అనుటే నానిత్యము
శ్రీరామా రమ మామాతా పిత
దీనోద్ధారిణి సేవాలాంకృత
దివ్యానంద మయామాలక్ష్యము
           
--((*))--


సంస్తోత్రంబులు..
-------------------------

"కామనిభా" వృత్తము

గణములు - మ,స,త,ల
యతి - 6

వీణాధారిణి విద్యాదాయిని
వాణీ రూపిణి వాత్సల్యాన్విత
యేణీలోచన హృత్పద్మాసని
జ్ఞానాకారను సమ్మానింతును

తానే నేనను దాక్షిణ్యాకృతి
గానానందిని కావ్యాలంకృత
దీనోద్ధారిణి దివ్యాకారిణి
శ్రీ నాదాత్మను జెల్వన్‌ గొల్తును

వాగీశానిగఁ బ్రఖ్యాతంబయి
రాగోల్లాసిగ రంజింపన్‌ మది
వేగంబొప్పగ వృత్తాలందిడు
నా గీర్వాణికి నా కైమోడ్పులు

కారుణ్యాంబుధి కైవల్యప్రద
శ్రీరామా మణి శ్రీ మాహేశ్వరి
వీరారాధిత విశ్వేశప్రియ
శ్రీ రాజేశికిఁ జేతున్‌ జోతలు

సర్వశ్రేష్ఠయు సర్వంబైనది
సర్వాభీష్టద సర్వజ్ఞప్రియ
సర్వాకారిణి సర్వాధారకు
సర్వేశానికి సంస్తోత్రంబులు



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తరుణం 

సమస్త జీవకోటిని ఉత్తేజ పరచే 
అనంత సౌఖ్యమిచ్చుట కాలాల మనసే
అనూష్య ప్రేమ తాపసి ఉత్తేజ పరిచే 
విశేష లోకమాయని తప్పించు మనసే 

విశాల ప్రాణ కోటికి ఉత్తేజ పరిచే 
సుఖాల విశ్వమయంచె ఆరాట మనసే 
వికాస తేజమిచ్చుట ఉత్తేజ పరిచే 
శుభాల కోప తాపము తప్పించు మనసే                                  
అకాల మృత్య దారికి ఉత్తేజ పరిచే 
మనో వికాస ఆశకు ఊహించు తరుణం 
సకాల ఊహ కోరిక ఉత్తేజ పరిచే
వినోద భావ వేడుక ఊరించు తరుణం   

--(*)--


ప్రాంజలి ప్రభ - నేటి కవిత
ఛందస్సు
(ప్రియుడు ప్రేయసితో పలికిన పల్కులు)

వేరొక భావము లేదియును
ఉన్నది చెప్పెద నీకియును
లేనిది చెప్పుట వద్దనకు
చెప్పుడు మాటలు నమ్మకము

వేచెద నిచ్చట నీకొరకు
చూపెద అంతయు కానుకను
వాదన వేదన ఎందుకులె   
కాలము గాళము నీకొరకు

చూచెద వంతయు వేడుకలొ  
తొందర చేయుము ఇక్కడకు
వద్దని రానని చెప్పకము
ఉన్నది పుచ్చుకొ అందరిలొ

ఊహకు అందని మార్పులను
చూచెద ఇప్పుడు చేష్టలను
కాచెద నిన్నియు ఇప్పుడును 
తప్పక చూపెద ఎప్పుడును
 
పుట్టిన రోజున అంతయును
పండుగ చేయుట సంతసము
ఆకలి తీర్చుట నేర్పెదను
దాహము తాపము తీర్చెదను

--((*))--


నేటి కవిత -1 
 (ఛందస్సు)  
కొత్త వృత్తము (telugu నేర్చుకోనేవారికి )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఘధ్వనిపూర - త/య/మ/గగ UUII UU - UUU UU 

సౌందర్యము సాహిత్యా నందా రామం 
బాంధవ్యము ప్రేమాదిత్యా తాత్పర్యం 
ప్రేమత్వము నిత్యాన్వేష్యా లాలిత్వం 
కారుణ్యము సద్భావా సంతోషాదిత్వం    


నేటి కవిత (చందస్సు 
ప్రాంజలి ప్రభ (తప్పేమిటి) -3

నచ్చినప్పుడే -  దేనినైనా ప్రశంసిస్తే తప్పేమిటి 
నచ్చనప్పుడే  - దేనినైనా విమర్శిస్తే తప్పేమిటి 
నమ్మినప్పుడే  - దేనినైనా ప్రభోధిస్తే  తప్పేమిటి 
నమ్మనప్పుడే  - దేనినైనా విభేదిస్తే  తప్పేమిటి 

శుభాకాంక్షలు  - ఎప్పుడైనా  చెప్పితే తప్పేమిటి 
సొలభ్యమ్ములు - ఎప్పుడైనా  ఒప్పితే తప్పేమిటి
సాహిత్యమ్ములు - ఎప్పుడైనా పల్కితే తప్పేమిటి 
అన్నాదమ్ములు - ఎప్పుడైన  కల్సితే తప్పేమిటి 

ఆలోచనలు - ఎప్పుడైనా  తప్పుగా వర్ణిస్తే తప్పేమిటి 
వినోదములు - ఎప్పుడైనా  ఒప్పుగా వప్పిస్తే తప్పేమిటి 
వివాదములు - ఎప్పుడైనా  గొప్పగా  తప్పిస్తే తప్పేమిటి 
ప్రమాదములు - ఎప్పుడైనా తెల్యకా  కల్గితే  తప్పేమిటి       

--((*))--

ప్రాంజలి ప్రభ - నేటి కవిత-5
 ఓం శ్రీ రామ్ (ఛందస్సు )
ఆంతర్గత అర్ధం చెప్పగలరా

Flowers

కళ్ళలో నీరు - కూడికలో తంటా
నీళ్ళల్లో వేడి - చీకటిలో వెల్గు
ముళ్ళల్లో ముప్పు - వాకిటిలో ముగ్గు
గళ్ళలో ఆట - పటికలో నాచు

పల్లంలో నీరు - చిటికలో పని
గొల్లంలో గాడి - ఘడియల్లో గాలి
అల్లంలో ఘాటు - మడిగలో ధూలి
పళ్లెంలో మచ్చ - తడికలో ఖాళి

వయసులో మార్పు - కలువలో కైపు
సొగసులో సోంపు - ప్రమిదలో నూనె
మనసులో మాయ - చేరుకులో తీపి
వలపులో తడి - నడకలో దూరం

మమతలో కుళ్ళు - కలలలో రూపు
నవతలో తుళ్లు  - మడుగులో మంచు
పడతిలో వళ్ళు - గొడుగులో నీడ  
జపములో జల్లు - కధలలో కత    

నడకలో మార్పు - యువతలో ఓర్పు 
మనిషికో తీర్పు  -  మమతలో నేర్పు  
యువతిలో కైపు  -  చిరుతలో పర్గు 
చెలిమిలో  తీపి  -  బలిమిలో వాపు 

--((*))--

6. ఇంద్రవజ్ర - UUI UU - IIUI UU
నేటి కవిత (ఛందస్సు }

సంక్రాంతి (ఛందస్సు )

ఓర్పు నేర్పు కూర్పు తీర్పు పంచు సంక్రాంతి  
శాంతి కాంతి పంచె బ్రాంతి తుంచే సంక్రాంతి 
పంట వచ్చే మంచి పంచే శోభ  సంక్రాంతి      
అక్క బావ అన్న  చెల్లి బిడ్డ సంక్రాంతి 

సూర్య చంద్ర నింగి నేల వెల్గు సంక్రాంతి  
పెంచు కున్న ప్రేమ పంచు తున్న సంక్రాంతి 
పెంచు తున్న డబ్బు మబ్బు మాయ సంక్రాంతి        
మంచి మార్పు కోసం ప్రేమ పంచు సంక్రాంతి 

బంధు మిత్ర స్నేహ భావ పంచే సంక్రాంతి 
తల్లి తండ్రి కూర్చో బెట్టి చేయు సంక్రాంతి 
పిండి  వంట  చేసి  కల్సి  తినే  సంక్రాంతి
పెద్ద చిన్న ఆట పాట శోభ సంక్రాంతి     

నువ్వు నేను కల్సే భావం ఉండె సంక్రాంతి 
ఇచ్చి పుచ్చు కొనే ప్రేమ పంచే  సంక్రాంతి
పూల ముగ్గు గొబ్బి పెట్టే  శోభ  సంక్రాంతి 
కొత్త బియ్యం తీపి బెల్లం పంచే సంక్రాంతి  


--((*))--








Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు