kavitalau



చిరునవ్వు దొంతరలు చెదిరి పోయాయి ||
చీకటులె చిత్రంగ మురిసి పోయాయి ||
.
నిశలెన్నొ కమ్మాయి తొలగించి పోవా
వెనుకనే వెన్నెలలు అలిసి పోయాయి ||
.
దూరంగ మిణుకుల్ని చూస్తూనె వున్నా
బాటంత కన్నీళ్ళు ఒలికి పోయాయి ||
.
హాసాల అందాలు హత్తు కోనీయవా
అనుభూతి కాలాలు చెరిగి పోయాయి ||
.
రెప్పలే దాచాయి కలత తడులెన్నో
స్నప్నాలు మెలుకువగ మిగిలి పోయాయి ||
.
ఎలుగెత్తి నావాణి వినిపించ లేను
మౌనంలో మాటలే కలిసి పోయాయి ||

పరిగెట్టే హాసాలకు
గాలమెవరు వేస్తారట ॥
సలుపుతున్న వేదనలకు
సంకెలెవరు వేస్తారట ॥
ఇంకిపోయి కునుకంతా
తిమిరంలో తచ్చాడెను
పీడించే రాత్రములకు
పానుపెవరు వేస్తారట॥
కరుగుతున్న క్షణాలన్ని
కలవరాలు ప్రకటిస్తే
జ్ఞాపకాల ప్రతిమలకు
ముసుగులెవరు వేస్తారట ॥
గతమైనా కాలమంత
గుండె నొదలి పోలేదు
ఆగిపోని అశ్రువులకు
తాళమెవరు వేస్తారట॥
తపనపడ్డ ఆశలెన్నొ
దు:ఖాలను మింగాయి
నలుగుతున్న స్వప్నాలకు
రంగులెవరు వేస్తారట॥
తడిమనసుతొ తల్లడిల్లి
నా వాణీ మూగబోయె
గండిపడ్డ కన్నులకు
వంతెనెవరు వేస్తారట॥
........వాణి , 28 march 16

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

గంగాధరా కరుణ మాపై కురిపించు
తడిసి ధన్యులమై పోతామంతా
భోళాశంకరా మా చిత్తమును సవరించు
గుండెలో గుడిని నిర్మించు తామంతా

నిటలాక్ష నీచూపు మాపై ఉంచు
జ్ఞాన మార్గం లో బతుకు తామంతా
గరళ కంఠుడా మా కష్టాల్ని తొలగించు
అరిషడ్వర్గాలను జయిస్తా మంతా
గౌరీశంకరా మా బతుకును పండించు
నైవేద్యాలతో మిమ్ము ఆరాధిస్తా మంతా

కరిచర్మధారివై ఘణమైన కీర్తి నందించు
మేము నిత్యాభిషేకాలు చేస్తామంతా
శూలపాణిగా మాపై శీతకన్నే చూపించు
నిత్యపూజల్తో అన్నదానం చేస్తామంతా

నాగభూషణా మా బంధాలు తొలగించు
మేముబిర బిరా నీ కడకు చేరుతామంతా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మేలు 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మన ఆలోచన మనదే 
అది నిస్వార్ధ పూరితమైనదే 
అవమానాలు చేరితే 
అవరోధాలు ఏర్పడితే 
సహనం మాత్రమ్ వీడదే

నచ్చక పోవట మనేదే
నీ చూపులోనే కదిలితే 
చేయటం చేతులైతే 
చేయకపోటం నిజమయితే 
ఆవేశం మాత్రమ్ తనదే 

తనకుండే స్వేశ్చ తనదే 
అనుగ్రహము ఏర్పడితే 
ఆగ్రహము తోడైతే 
శక్తి యుక్తులు నష్టమైతే 
సంకల్పం మాత్రం తనదే

తిరస్కరించటం బుద్ధి తనదే
దయ, కరుణ, క్షమ, లేకపోతె    
కాలంలో మార్పు తోడుగాకపోతే  
జీవితంలో ఓదార్పు  కరువైతే 
శ్రీకారామ్ తిరస్కారం తనదే 

సుధీర్ఘ ప్రయాణం తనదే
పద బంధమ్ ఏర్పడితే 
ప్రతి బంధం తనదైతే 
ప్రమాదం వెంటాడితే 
ప్రేరణ మాత్రం తనదే

జీవం పోరాటం తనదే 
అధైర్యాన్ని తరిమితే
ధైర్యాన్ని ఆశించితే 
సత్కార్యం చేయగలిగితే 
సమున్నత ప్రమాణం తనదే 

--((***))--

ప్రాంజలి ప్రభ

Exceptional Vintage Russian Amethyst Diamond Necklace, Moscow, 1930s. The necklace is handcrafted in gilded silver and set with sparkling light lavender purple Siberian amethysts and diamonds.


ఉన్నది  లేదని అనకు, లేనిది ఉందని అనకు 
ఉన్నది ఉన్నది అని వాదనకు  ఎప్పుడు దిగకు 

లేని దాని కోసం ఆశించి ఉన్నది పోగొట్టుకోకు 
ఉన్నదానితో  ఆసంపూర్తిగా ఎప్పుడూ బతకకు 

సూర్య కిరణంలా వెలుగులను పంచుటకు       
తరువులా విస్తరించి అందరిని ఆదుకొనుటకు

నదీమ  తల్లిగా నిత్యం దాహాన్ని తీర్చుటకు 
వెన్నెలలో చల్లని గాలిని పంచుకొనుటకు 

అవ్యక్తముగా ఉన్నదాన్ని వ్యక్త పరుచుటకు 
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచుటకు

దు:క్ఖాన్ని తొలగించి సుఖాన్ని అందించుటకు 
వికృతి నుండి ప్రకృతిని పరి రక్షించుటకు 

సమయాన్ని వ్యర్ధపరచక సద్వినియోగ పరుచుటకు    
హృదయంలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుటకు 

సుడి గుండంలో చిక్కక జీవితనౌకను సాగించుటకు   
కాలగమనాన్ని గమనించి కర్తవ్యమ్ నిర్వహించుటకు 

ఉన్నది  లేదని అనకు, లేనిది ఉందని అనకు 
ఉన్నది ఉన్నది అని వాదనకు  ఎప్పుడు దిగకు 

లేని దాని కోసం ఆశించి ఉన్నది పోగొట్టుకోకు 
ఉన్నదానితో  ఆసంపూర్తిగా ఎప్పుడూ బతకకు 

--((**))--





కల్పనే కవితకు వచ్చు వన్నే
స్వల్పమే నేయి వడ్డన మన్నే
శిల్పమే ప్రాణంతో ఉన్న కన్నే
వేల్పులే సంసారానికి మార్గమ్మే    

తల్పమే మనుగడకు నిర్ధారమ్మే 
అల్పమే అనుకరణ జీవితమ్మూ  
బల్పమే అక్షరాల దిద్దు సంకేతమ్మూ 
పప్పన్నం మనిషికి ఆరోగ్యమ్మూ 

చప్పటి కూడు చెక్కర వ్యాధికి శుభమ్మూ 
చిప్ప కూడు బిచ్చగాళ్లకు తప్పఁదున్నూ
తప్పు చేసిన వారికి బాధ తప్పుదున్నూ
ఒప్పును వాదించటం నిత్య సత్యమ్మూ 
    
--((***))--

ఓ మగడా నాపై అతిప్రేమ చూపమాకు

ఆశతీరలేదని అదేపనిగా బాధ పడకు
వడ్డున పడ్డ చేప లాగ కొట్టుకోకు
గోరుచుట్టు పై దెబ్బలాగ గెంతమాకు

కుడితిలో పడ్డ ఎలుకలాగ తిరగమాకు 

తోక తెగిన బల్లి లాగ మారమాకు
పిల్లి లా కొంప కొంప తిప్పమాకు
నల్లి లా మంచంలో చేరి కుట్టమాకు

కుక్కలా తోక ఆడిస్తూ తోరగమాకు

నక్కలా భేదనీతి బుధ్ధి చూపమాకు
పాములా బుసలు కట్టమాకు
తేలులా కొండెంతో కాటువేయమాకు

ఊసరవెళ్ళిలా రంగులు మార్చమాకు

కప్పలా గెంతుతూ ఉండమాకు
తుమ్మెదలా మకరందాన్ని జంర్రమాకు
బ్రమరంలా శబ్ధం చేస్తూ తిరగమాకు

గ్రద్దలా నాపై దూరద్రృష్టి చూపమాకు

కోడిలా తెల్లారిందని నన్ను లేపమాకు
గులాబీ రేకులు విప్పినట్లు విప్పమాకు
మల్లేపువ్వను వాసనచూసి నలపమాకు

మందారాన్ని ముద్దుచేసి నిద్ర పోకు

బూరగ పూవులా గాలిలో ఎగరమాకు
యేందుకే అంత నిష్టూరపు పలుకు
ఎవరిమీద కపం నామీద చూపమాకు

మనది ఏక మవ్వాల్సిన బ్రతుకు

అర్ధం చేసుకని కలవాల్సిన బ్రతుకు
నిన్ను ఆట ఆడుకోవాలన్న మాటలకు
తప్పుపట్టి నన్ను వదలి ఎటూ పోకు

నీమీద ఎనలేని పిచ్చిప్రేమ నాకు

నా ప్రేమను పొందకుండా యెక్కడికీపోకు
అవునా అవునా .... అవును అవును
ఐతే సరే.... ఐతేసరే...

--((***))--


వదలను

అవునన్నా కాదన్నా
నేను నిన్ను వదలను
భూమిపై నా పుట్టక
లక్షాన్ని యెప్పటికీ వదలను

జలంలా ప్రాణుల దాహన్ని తీరుస్తూ

మలపుల జీవిత మైన, నిన్ను వదలను
వేడిని పుట్టించే అగ్ని లా ఉన్నా 
ఆహారాన్ని అందించినా నిన్ను వదలను

నాలో ప్రాణ వాయువునై ఆవహించి

బ్రతుకు సార్ధకం చూపినా నిన్ను వదలను
అనేక కళలను చూపుచూ ప్రేమనూ
పంచి నిరంతరం మోస్తున్నా నిన్ను వదలను

ఆత్మలో ఆత్మనై అనురాగాన్ని పంచే

మనస్సునైన సరే నేను నిన్నువదలను
నీబుధ్ధి వక్రీకరించి నన్ను దూరం 
చేయాలనుకున్నా నిన్ను వదలలేను

రాతి బొమ్మ లా కదలక వున్నా

నా ధర్మాన్ని మరచి నిన్ను వదలను
రక్తబంధం నీవు మరచి వెళ్ళినా
నీ బంధం విడిచి నిన్ను వదలలేను

కప్పి వుంచితే కవిత్వమన్నా

విప్పిచెబితే విమర్శ అన్నా వదలలేను
అనారోగ్యుడుగా తిరస్కరించినా
ఆరోగ్యవంతుడుగా మార్చేదాక వదలను

--((***))--






తెలుసుకో మాటల విశిష్టత 

మాటలో ఉన్నది మర్మం  
మర్మంలో ఉన్నది ధర్మం
ధర్మంలో  ఉన్నది న్యాయం 

న్యాయంలో ఉన్నది సత్యం 

అమ్మ మాటలో  ఉన్నది  శాంతి 
శాంతిలో ఉన్నది ఆనంద ద్యుతి 
ద్యుతిలో ఉన్నది అనంత జ్యోతి  

జ్యోతిలో ఉన్నది అమోఘ స్మృతి

తండ్రి మాటలో ఉన్నది ధైర్యం 
ధైర్యంలో ఉన్నది నిర్భయం 
నిర్భయంలో ఉన్నది సుఖం 

సుఖంలో ఉన్నది సమాంతరం 

సమాంతరంలో ఉన్నది నీతి
నీతిలో ఉన్నది జాగృతి 
జాగృతిలో ఉన్నది విశ్రాంతి 

విశ్రాంతిలో ఉన్నది తృప్తి 

తృప్తిలో ఉన్నది సంతృప్తి 
సంతృప్తియే మనిషికి ఖ్యాతి
ఖ్యాతియే జీవితమునకు జ్యోతి       

--((*))--




మాటి మాటికి మాట

మార్చువాడు మోసగాడు 
మాటకి కట్టుబడి ఉండు
 వాడు మహనీయుడు 

మాయతో మభ్యపెట్టువాడు

 మహామాంత్రికుడు
మాటలను పెడచెవిన
 పెట్టువాడు పెడసరివాడు   

మాటాలలో మర్మాన్ని 

తెలుసుకోలేనివాడు బాలుడు 
ఉన్నదానితో తృప్తి పడక
 ఉండేవాడు ఆశపరుడు  

పట్టిన కుందేలుకు మూడేకాళ్ళనే

వాడు తలబిరుసుడు
ఉన్నదిలేనట్లుగా కల్పించి 
చెప్పువాడు పోకిరోడు   

మాటను దక్కించుకోలేని

 వాడు మానవుడు 
మాటను నిలబెట్టుకొనే
వాడు పరమాత్ముడు 

 --((*))--




బాహువులు చిక్కి చిక్కక

కురుల సవ్వడి కదలి కదలక
తనువు మెరిసే మెరుపును చూపక
తన్మయత్వం తో తపించే

హావభావాలను వ్యక్తపరచక

అధరాల మాధుర్యాన్ని అందించక
మత్తును వదిలించే గమ్మత్తు చేయక 
తన్మయత్వం తో తపించే

నవ్వి నవ్వులను పంచుకోక

మగవాని మనస్సు అర్హం చేసుకోక
అనిర్వచనములు ఎవ్వరికి తెలపక 
తన్మయత్వం తో తపించే

ఉత్సాహమును తెలపలేక

ఉల్లాసమును చూపలేక
ఊయల ఊపులు పొందలేక
తన్మయత్వం తో తపించే

ఆధరాల రుచి అందించక

పుత్తడి బొమ్మల్లా తయారవ్వక
కవ్విస్తూ సుఖాన్నిపొందక
తన్మయత్వం తో తపించే

తడిసిన తనువును చూపక

స్థనాల బిగువును తొలగించక
ఆత్రపు చూపులు చూపక
తన్మయత్వం తో తపించే

కోపాన్ని వ్యక్త పరచక

తాపాన్ని తెలియ పరచక
సృష్టి కార్యానికి సహకరించక
తన్మయత్వం తో తపించే   స్త్రీ 
--9\((***))--

JESUS CRISTO A LUZ DO MUNDO:     DEUS TEM A ÚLTIMAPALAVRAEM SUA VIDA.  “E Deus ...
ప్రాంజలి ప్రభ -
సృష్టిలో " స్త్రీ "
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
సంసారంలో దించే ఆకర్షణ
సుఖాలు పంచే శరీరం
సెగలు చల్లబరిచే సమ్మోహం
చూవుల్లో మైమరిపించే సౌందర్యమ్
మనసుతో వ్యక్త పరిచే ప్రేమ మాధుర్యం
ఒకరికి ఒకరు కలుసుకొనే స్నేహాపర్వం
చల్లని వాతావరణంలో కల్పించే సంతోషం
అది ఒక్క స్త్రీకి మాత్రమే చెల్లు
వాత్సల్యమనే తీపి దనం
సరాగాలతో వలపుల మయం
చీకటిలో వేడిసెగలు చల్లార్చే వయనం
తపస్సును భగ్నం చేసే సాంగత్యం
శుఘంధ పుష్పాల సుమధుర అధరం
తనువును అందించే సుఖ సౌఖ్యం
మనసులో ఉన్న మాయను తొలగించే మర్మం
అది ఒక్క స్త్రీకి మాత్రమే చెల్లు
విద్యా విషయంలో సహాయం
విశ్రాంతి విషయంలో కల్పుకోలుతనం
శ్రమకు చేదోడుగా నిలబడటం
సుఖదు:ఖాలలో పంచుకోవటం
ఆలోచనపరంగా మనస్సుకు నిర్మలం
శ్రేయస్సు కొరకు పలుకు సత్యం
సిరులను పెంచే సున్నిత తత్త్వం
పలకరింపులో మధురాతి మాధుర్యం
కళ్ళ చూపుల్లో కరుణ తత్త్వం
బిడ్డలను ఉన్నతులుగా మార్చే వ్యక్తిత్వం
ప్రేమను పంచే కళ నైపుణ్యం
అది ఒక్క స్త్రీకి మాత్రమే చెల్లు
--((*))--




ఎందుకో 
మరీ ఏమిటో
నాకు అర్ధం కావటంలేదు 
నీ ఊహల తలపులు 
నాలో చెలరేగి 
నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి 
తను వంతా ఉడికించి 
పగలు రాత్రి నిద్ర లేకుండా చేసే   

అసలే చలికాలం 

మత్తుగా వత్తుగా నిద్ర పోదామంటే 
దుప్పటి కరువై 
ఉక్కపోతకు లోనై 
నీ ఆలోచనలతో నేను ఉండగా 
వెచ్చని కౌగిలి ఎప్పుడా అని 
ఎదురు చూపులతో కాలం 
గడసి పోతుండే  

ఎందుకో 

మరీ ఏమిటో
ఈ తనువు తపనలు  
ఎవరికి అందించాలో 
ఏ మాయలో పడాలో 
ఎంత సేపు ఆలోచించిన 
నాకు నిద్ర రావటంలేదు 
నా ఊహలకు 
సమాధానము దొరకకుండే  





ప్రాంజలి ప్రభ - 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ      

భామా నీ నయనాలను చూస్తే 

నాలో  కొత్త వెలుగు తోంగి చూసే 
ఓ కన్యకా నీ కనుసైగ చూస్తే   
మనసు జల్లు మని, సెగగా మారే 

ఆనతిస్తావని ఎదురు చూస్తే  

మాటల్తో మభ్యపెట్టి మార్చేసావే   
మనసు నచ్చేట్లు మురిపిస్తే 
కళ్ళతో వీక్షించి మై మరి పించేసావే  

మధుర ప్రేమ రసం కురిపిస్తే 

తన్మయత్వంతో మాయ చేసావే  
పున్నమిలో చల్లని గాలివీస్తే 
ముద్దుతోనే మనసు మార్చేసావే  

ప్రేమతో శుభాకాంక్షలు అందచేస్తే 

కరములు తాకి కల్లోలం కల్పించావే 
మధురముగా వేణుగానం వినిపిస్తే 
ఆలకించి మోసంచేశావని ఏడిచావే  

నవ్వి నవ్వులతో ఆనంద పరిస్తే

తన్మయంతో గుర్రం యెక్కేసావే 
ఊపిరితో ఉన్నదంతా పంచేస్తే
ఇంకా కావాలి అని మారంచేసావే 

--((*))--



మనసన్నది మనకున్నది
మారకుంటే బాగుండును
మెదడన్నది మనకున్నది
సరిగా ఉంటే బాగుండును

ఈశ్వరు డెక్కడో తెలియకున్నది
ప్రత్యక్ష మైతే బాగుండును
తెలుగుకు కష్టకాలము వచ్చినది
స్వామినే అడుగుదామనుకున్నాను

గ్రంధాలకు చెదలు పడుతున్నది
పఠించు వారు కాన రాకుండెను
మనుష్యుల లో శక్తి తగ్గుచున్నది
నాస్తిక భావము పెరుగు చుండెను

సృష్టికి ఏమర్ధమో తెలియకున్నది
బుధ్ధి లేకుండా చేయుచుండెను
సంపదతో ఆరోగ్యం చెడు తున్నది
ఘోషించే ప్రాణులు పెరుగుచుండెను

సందేహాలకు సమాధాన మున్నది
ప్రశ్నల జీవితముగా ఉండెను
సంతాపాలకు సమయ మున్నది
మరణాలు రాకుండా ఆగకుండెను

--((***))--


Krsna attracts everyone, but devotional service attracts Krsna. The symbol of devotional service in the highest degree is Radharani. NECTAR OF DEVOTION, p. 15

నేటికవిత - మనకు ***
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనసన్నది ఉంది మనకు
మారకుండా ఉంటే బాగుండు 
మెదడన్నది ఉంది మనకు
నిలకడగా  ఉంటే బాగుండు

ఈశ్వరు డెక్కడో మనకు 
ప్రత్యక్ష మైతే బాగుండు
తెలుగు బాషే ప్రాణం మనుకు 
గుర్తించేవారు ఉంటె బాగుండు 

గ్రంధాలే మూలం మనచరిత్రకు 
చెదలు పట్టే స్థితికి రాకుండు 
దేవునిపై ప్రేమ ఎక్కువ మనకు 
నాస్తిక భావం లేకుండా ఉండు  

సృష్టికి ఏమర్ధమో అడుగుకు 
బుధ్ధి సక్రమముగా ఉంటే మెండు 
సంపద కోసం ఆశ పడకు  
ఆరోగ్యంతో సుఖం ఉంటే మెండు  

సమాధానం కోసం సందేహపడకు  
ఓర్పు, ఉంటె సమాధానం ఉండు 
సంతోషాలకు సమయమే మనకు 
స్వార్ధం మరచి విశ్వాసంగా ఉండు 



--((***))--



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


నేటి నడక (కవిత)
రచన : మల్లాప్రగడ రామకృష్ణ

మనిషి గా నేను నడిచి  - నిజం తెలిసి కదులుతూ
గమ్యం మేదో తెలుసుకోని - కాలాన్ని బట్టి సాగిపోతా

మార కుండా మరవ కుండా -  చెడ కుండా చెరప కుండా
తాక కుండా తడవ కుండా - ఆగ కుండా కదలి పోతా

మంచి చెడ్డ చూసు కుంటూ - పాత కొత్త నాకు అంటూ
చేత  కాదే నాకు అంటూ - అడ్డు లన్నీ దాటు కుంటా

సెగలు చేష్టలు కలిసితే - పొగరు పోతులు కలిపితే
ఎదురు దెబ్బలు తగిలితే - కుదురు మాటలు పలుకుతా

పది ఒంపులు తిరిగితే - ఎది రింపులు కలిగితే
బెది రింపులు కలిగితే - మది సొంపులు చిలుకుతా

కలంతో ఆగక -నయనాన్ని చూపక
భయంతో ఆగక  - పయనాన్ని ఆపనూ

పన్ను పోటు ఉంది చూసి - కన్ను కొట్టి మారి పోక
వెన్ను చూపి పారి బోక - నన్ను నేను మర్చి బోకా

పరు వాన్ని ఆప బోక - మరణాన్ని చూడబోక
పయ నాన్ని ఆప బోక - సమయాన్ని నష్ట బోకా

ఎదురు నిలుచి సాగుతా  - మరులు గొలిపి సాగుతా
తెలివి తెలిపి సాగుతా  - కళలు చూపియు సాగుతా

--((*))--  


Radhe Shyam

అట్లా నన్ను చూడమాకు
అట్లా చూసి నాలో ఆశలు పెంచమాకు
కను రెప్పలు ఆలా తిప్పమాకు
అట్లా చూసి కలవరం పెంచమాకు

జడ అలా తిప్పమాకు
అట్లాతిప్పి నాలో జ్వరం తెప్పించమాకు
వలువలను అట్లా కదల్చమాకు
వల్లమాలిన తాపం పెంచమాకు

కరములతో అలా చుట్టమాకు
కల సార్థక మవుతుంది నాకు
పూల ఊయల అలా తిప్పమాకు
పరిమళంతో మనసును ఉడికించకు

ప్రకృతి సహకారం ఉంది మనకు
చల్లని గాలులు తాకును మనకు
హృదయానందం కావాలి నాకు
ప్రేమానందాన్ని పంచుతా నీకు     


నడి రేయి చక్కని పున్నమి
పాల వెన్నెలతో నిండిన పుడమి
జడివాన కమ్ముకున్నలీలా కొలిమి
హృదయేశునితో కలిపే చెలిమి

పసి గట్టలేదు నళిని
ఎప్పుడు చూపకు బలిమి

చెలి మేలి ముసుగులో
సోయగపు మిసమిసలు దాచి
కాలియందల కడియాలు ఊపి
చేతికి ఉన్న గాజులతో సవ్వడి చేసి
 

--((***))--



ప్రాంజలి ప్రభ - కాఫీ

తల నెప్పి వచ్చిన 

ఎక్కువ శ్రమ పడిన 
ఉల్లాసం  కావాలనుకొనిన 
ఉత్సాహం పెంచేది కాఫీ 

మనసులో చల్లని 

ముక్కుకు ఘుమ్మని వాసన
మదిలో ఆలోచన తెలిసిన  
నవ్వుతూ పలకరించే సంఘటన      

చిక్కటి డికాషనను తీసిన 

వీడి వేడి పాలు కలిపిన
తయారయ్యే కాఫీ పోగలతోన 
పెదాలతో ఒక్క సారీ జుర్రిన     

వెచ్చటి స్పర్స తగిలిన 

మంచి ఆలోచన వచ్చిన 
భారము తేలికగా మారిన 
నవ్వు వచ్చే ఆసమయాన  

హృదయము నుండి  తొలిగే  ఆవేదన   

చల్లని గాలికోసం చేరే ప్రేమ పంచన
అనుభూతులను ఒకరికొకరు పంచుకొనిన 
కాఫీ రాగంతో సంతస  పరిచే మనసున
    
--((*))--


నేటి కవిత త గుణితం 
ప్రాంజలి ప్రభ - ప్రేమతో 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తల్లి లా ఆదుకొని 

తాతలా కధలు చెప్పి 
తినే ఆహారం అందించి
తీయదనం గా మాటలుపల్కి 

తురక వేగములా పరుగేత్తించి  

తూర్పువెలుగులా తయారు చేసి    
తృప్తి పడే విధముగా ప్రవర్తించి 
తెలుగు భాషను చక్కగా నేర్పించి 

తేజోవంతునిగా తాయారు చేసి  

తైలాన్ని తలకు మర్దన చేసి 
తొంబది తొమ్మది సూక్తులు తెలిపి  
తోబుట్టువలతో స్నేహాన్ని కలిపి 

తండ్రి తల్లి దగ్గరుండి విద్యవంతుడుగా చేసి   

త:హ త:హ లాడుతున్నప్పుడు వదలివెళ్ళే 

బిడ్డలపై ప్రేమ 

పెంచుకోకండి 
మౌనంగా ఉండి 
జ్ఞానం గ్రహించి 
బోధించి తరించండి 

--((**))--


Vishnu and Lakshmi is one of most well-known and enduring love stories in Hinduism- because every time Vishnu incarnated, she incarnated…

నేటి కవిత: గవాక్షం

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నా మందిర గవాక్షంలో 

తొలి పిలుపు అమ్మే నంటుంది 
అరుణ స్వర్ణ కాంతి లా 
నాన్న ప్రోత్సాహం శక్తిఆవుతుంది  
  
ఆకర్షణ శక్తి చేరే నాకళ్ళలో    
స్వాగత పిలుపే మలుపంటుంది  
కమ్మే వేకువగాలి వ్రేళ్ళతో 
మనసు పిలుపే తలపంటుంది 

నాలో రగిలే  హృదయపు సవ్వడిలో 

పారిజాత సువాసన చల్లపర్చి నట్టుంది 
పలక రింపు ఎప్పుడు చిరునవ్వుతో 
ఎదుటి వారి మనస్సు కమ్మి వేస్తుంది   

నా మందిర గవాక్షంలో 

శ్రీమతి చిరుహాసం తాండవిస్తుంది 
పిల్లల ప్రేమ పలకరింపులతో 
హృదయానందం పరిమళిస్తుంది  

--((***))--






* ఇట్లు  పిడుగు 




నే నెవరో నాకే తెలియదు  

ఎట్లా పుడతానో, అంతకన్నా తెలియదు   

నా  పానుపు ఆకాశ మనక తప్పదు
మేఘమే నా నేస్తం, మేఘమే నా ఉనికి 

చక్కని చుక్కల మధ్య  ఉండాలని     
కంబళిలా కప్పుకున్న పానుపులో ఉండాలని 
కలలు కంటూ యామినిలో శయినించాలని 
అనుకున్నా, కాని రాక తప్పలేదు పృధ్విపైకి 

వత్తుగా, మత్తుగా, వెచ్చగా, ఆకాశంలో
తారలు మద్య , మేఘాల ముసుగులో 
ఉరుములు, మెరుపులు, తోకచుక్కలలో
తప్పించుకొని,  పృధ్విపైకి రాక తప్పలేదు 
    
మేఘాల్లో ఉన్న రాక్షసుసుడు లేచాడు 
అదిరి పడే మెరుపు దాడితో గర్జించాడు 
మేఘాల రాపిడి, మెరుపులు ఉరవడి  నుండి 
జల బిందువులతో జారి కన్నీరు కారుస్తూ
బ్రహ్మాండాన్ని బ్రద్దలుకొట్టే శబ్దాన్ని చేస్తూ
భూమిని చేరిన "పిడుగును " నేను   

నావల్ల లాభమేవరికో, నష్ట మెవరికో 
తుఫానులా వస్తాను, ఎందరి ప్రాణాలను
బలిగొంటానో, నాకు తెలియదు, మరి నేను 
దోషినా నిర్దోషినా మీరే చెప్పండి    
                     ఇట్లు  పిడుగు 



ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు   
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ - ప్రాంజలి  ప్రభ
  
వేదం ఆరాధించి
వేషం కట్టిపెట్టి 
వేగం ప్రక్కన బెట్టి 
నీతి, ధర్మం, న్యాయం, 
బోధించేది ఉపాధ్యాయుడు  

సూర్య మామ పగటి వెలుగులా 
చంద మామ రాత్రి  వెలుగులా 
పిల్ల పాపకు తల్లి తండ్రి వెలుగులా 
విద్యా బోధకు ఉపాధ్యాయుడు వెలుగు 

పూల వెల్గు కన్నులోని వెలుగులా  
చేను గాలి కను రెప్ప వెలుగులా 
వాన జల్లు సీతలము వెలుగులా 
విద్యా బోధకు ఉపాధ్యాయుడు వెలుగు

సంబరంబు నందు అందమంతా వెలుగులా 
పిండి వంట వింత శోభ పండుగాన వెలుగులా   
మేఘ పూల జల్లు రైతు, చేను, కళ్లలో వెలుగులా 
విద్యా బోధకు ఉపాధ్యాయుడు వెలుగు

విశ్వ ధాత  సేవ గాధ దేశ మంత వెలుగులా 
నిత్యం స్వశ్చ భాష  ప్రేమ భంధ వెలుగులా 
స్నేహ శాంతి పల్కులు  పండ గంత వెలుగులా 
విద్యా బోధకు ఉపాధ్యాయుడు వెలుగు

--((***))--


నేటి కవిత  
ప్రాంజలి ప్రభ 


తారల తళుకు బెళుకులు 
కురులలో మల్లియ విరులు  
చూపులతో మంద హాసములు 
నడకలో హంస సోయగములు

అధరములు ఎర్ర దొండ పండ్లు 
చెక్కిళ్ళు లే లేత పనస తొనలు
తొడలు తెల్లటి అరటి ఊచలు  
చేతులు  ముల్లంగి దుంపలు  

తనువంతా పున్నమి వెన్నెలలు 
మొగము నంది వర్ధన పువ్వు 
వస్త్రాలు తెల్ల ఉల్లి పొరలు  
వక్షోజాలు దానిమ్మ పండ్లు

జడలు మొగలి రేకులు 
కళ్ళు కలువ పువ్వులు 
నాభి గులాబి పువ్వు 
పిరుదులు కొబ్బరిబోండాలు 

ఆకులు కదిలే చిరుగాలికి 
హృదయం పై ఉన్న పొరలు 
మదిని దోచే ఒంపు సొంపులు 
వేషాన్ని చూసి పరవసించే హృదయాలు

--((*))--
ఎన్నో ఎన్నెనో 

గమ్యం చేరని గమనాలు ఎన్నో. 
మాట్లాడలేని మౌనాలు ఎన్నో. 
మరువలేని జ్ఞాపకాలు ఎన్నో. 
నిలకడలేని మనస్తత్వాలు ఎన్నో. 

బరించలేని బాధలు ఎన్నో. 

అనుభవించ లేని ఆనందాలు ఎన్నో. 
అభిమానించే ఆప్యాయతలు ఎన్నో. 
ఆఖరి కోరిక తీరని ప్రాణాలు ఎన్నో. 

ఆవేశంతో రగిలే కోపతాపాలు ఎన్నో. 

పంచలేని మమకారాలు ఎన్నో. 
పెంచి పోషించలేని బంధాలు ఎన్నో.
మమతా, తమకంతో బాధలెన్నో 

పిల్లల కోరికలు తీర్చలేని కష్టాలెన్నో 

విధిని ఎదిరించి నటనలు ఎన్నో 
పోషణ కోసం పెడుతున్న తాకట్టు లెన్నో 
కొందరి మాటలు తట్టుకోలేక బాధలెన్నో 

ఎన్నో మరెన్నో మమతల్ని విడతీస్తున్నాయి 

ఎన్నో మరెన్నో కాపురాలని కూలుస్తున్నాయి 
ఎన్నో మరెన్నో బతుకుల్ని వీధిని పడేస్తున్నాయి 
ఎన్నో అమరెన్నో చెప్పుకోలేని మాటలున్నాయి 

--((*))--



నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
dreamies.de (i83laay4slv.gif)
కుక్కలు రాత్రుల్లో కాపలా కాసి 
మనల్ని హాయిగా  ఇంద్ర పోనిస్తుంది 
కాకులు ఆహారం చూసి 
సానుభూతిగా అందరిని పిలుస్తాయి 

వలలో చిక్క చేప గిలాగి లాడి -
మనకు ఆహారమవుతుంది
కోయిల గొంతు వచ్చేదాకా కూస్తుంది -
అది మనకు సంగీతం నేర్పుతుంది

పువ్వులు కమిలి పోతాయనే
తెలిసి పరిమళాలందిస్తాయి
తేనెటీగ కష్టంతో తేనగూడు
పెడుతుంది అది ఇతరులకోసమే

మనిషికి చేదు అనుభవాలే
ఉత్తేజానికి మార్గాలవుతాయి
స్త్రీల ఆసయ సాధనలే
మరొక్కరికి సుఖ శాంతులౌతాయి

--((***))--


Studio Background 8x12 Psd Files Free Download
ఈ అర్ధం లోని - అర్ధం నిజమేనా 

మగవారి మధ్యలో ధైర్యముగా ఆడపిల్ల కూర్చున్నాదంటే

గురువులు, తండ్రి వయసున్న  పెద్దల మధ్య అని అర్ధం
చీదరించు కొనే అమ్మాయి నిన్ను చూసి నవ్విందంటే
డ్రస్సు వేసుకున్నా శరీరంలో ఎదో కనబడుతున్నది అర్ధం

అప్పు తీర్చనివాడు క్రమముగా తీర్చుతున్నాడంటే

పెద్ద మొత్తం తీసుకోని ఎగ కొడతాడని అర్ధం
ఎప్పుడూ వినని భార్య,  భర్త మాటలు విన్నదంటే
ఎదో నెక్ల్స్ కోసమో, పుట్టింటి వారికోసమొయని అర్ధం

భర్త అందంగా తయారయి ఆఫీసుకు వెళ్తున్నాడంటే

అందమైన ఆడపిల్ల పక్క సీట్లో ఉందని అర్ధం
పనివాడు అమ్మ గారు, అమ్మగారు అని అడిగా డంటే 
ఏదన్నా మామూలు,లేదా అడ్వాంసు కావాలని అర్ధం

ఎప్పుడూ ఉద్యోగి నెలాఖరున అప్పుచేసేవాడు చేయకుంటే

పదవి విరమణ చేసి ఉండవచ్చు నని అర్ధం
బాసును క్లర్కు పది రోజులు సెలవు అడిగితే, ఒప్పు కుంటే
క్లర్కు  వళ్ళ ఎదో పొందాలని ఆశతో ఉన్నాడని అర్ధం

కొన్ని వస్తువులు అతి తక్కువకు అమ్ము తున్నారంటే

కొద్దిగా చెడిపోయినా ఎవ్వరికీ పనికి రావని  అర్ధం
అమ్మాయి నచ్చింది వెంటనే పెళ్లి చేసుకొని వెళతానంటే
పిల్ల తల్లి తండ్రులు ఆలోచించుకొని పెళ్లి చేయాలని అర్ధం  

ధైర్య  సాహసాలతో గోల్డ్ మెడల్ సాదించాడంటే

ప్రాణాలు ఫణంగా పెట్టి, దేశంకోసం శ్రమపడ్డాడని అర్ధం
పది మంది ఆకలి తీర్చి, బ్రతుకు తున్నాడంటే
అన్నదాన సత్రం పై అధికారం చెలాయిస్తున్నాడని అర్ధం

రాజకీయ నాయకులు, మీరడిగేమ్గానే చేస్తున్నారంటే

మీ కులపు ఓట్లు ఆశించి చేస్తున్నారని అర్ధం
అర్ధంలో పరమార్ధం ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంటే
పుణ్యం, జ్ఞానం, సాధన తప్పక అవసరమని అర్ధం        



    --((*))--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Un peu de tout, un peu de moi...
నేటి కవిత - ప్రాంజలి ప్రభ


కార్యా చరణం వళ్ల

కొండంత ధైర్యం
పర్యావసనం వళ్ళ
గుండెంతా భయం

చెడు ఆచారణం వళ్ళ  

మంచికి గాయం
పుస్తక పఠణం వళ్ళ
దొరికే బంగారం

విద్యార్థి విజ్ఞాణం వళ్ళ

దేశాభివృద్ధి ఖాయం
వివేక పరిజ్ఞాణం వళ్ళ
తగ్గించు ధన దాహం

నిగ్రహ జ్ఞాణం వళ్ళ

పొందు ఉన్నత శిఖరం
ఆత్మ జ్ఞాణం వళ్ళ    
సంతృప్తి జీవితం

అతి భక్షణం వళ్ళ

తప్పదు అనారోగ్యం
ప్రపంచ లక్షణం వళ్ళ
సహృదయుల ఏకీకరణం  

జీవిత భ్రమణం వళ్ళ

తృప్తి చెందే అనుభవం
మనసు నిరీక్షణం వళ్ళ
ఎదురు చూసే ఆహ్వానం  

వయసులో బలం వళ్ళ 
కొండను పిండి చేయగలం 
అనుభవంతో వచ్చే కీర్తివళ్ళ 
ఆశలు పోకుండా జోగించగలం 

ఆపద పెరుగుట వళ్ళ 

స్నేహితులు పెరుగుట ఖాయం 
జ్ఞానం పెరుగుట వళ్ళ 
బోధ చేయుట ధర్మం 

నిలకడ లేని అందం వళ్ళ

ఆవేశ పడటం ఆరాటం ఖాయం 
జీవితంలో కలిగే వైరాగ్యం వళ్ళ
భగవంతుని ఆరాధించుట ఖాయం 
   
--((*))--
   


 ప్రాంజలి ప్రభ - కవిత - ఉమ్మడి
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఉమ్మడి కుటుంబంకు గౌరవమర్యాదలు
ఉమ్మడి లక్ష్యాలకు ఏకం సగుణములు
ఉమ్మడి వ్యాఖ్యలకు తక్షణం గుర్తింపులు
ఉమ్మడి సమ్మెలకు జీవితంలో పాఠాలు

ఉమ్మడి కృషితో అభివృధ్ధి పధకాలు
ఉమ్మడి తీర్పుతో మేలుకొలుపులు
ఉమ్మడి ప్రజల పిలుపే సమ్మెలు
ఉమ్మడి రాజధాని అతుకులబొంతలు

ఉమ్మడిగా పోటీకి ఎన్నికల ప్రణాలికలు
ఉమ్మడిగా ఇస్తామంటున్న కోటిఉద్యోగాలు
ఉమ్మడిగా ప్రధాన సమస్యలకు పరిష్కారాలు
ఉమ్మడిగా నిర్మాతలు కలసి తీసే పలుచిత్రాలు

ఉమ్మడి ఓమగామి మహిళల ఫలితాలు
ఉమ్మడి ఆటగాళ్ళ కృషితో విజయపరంపరలు
ఉమ్మడి వేషాలు కవ్వించే వింత ఆకృతులు
ఉమ్మడి కుటుంబం లో సఖసంతోషాలు

--(())--
కుళ్ళిపోవడానికిఎంత
 సమయం పడుతుంది?

పేపర్ టవల్ - 2-4 వారాలు
అరటి తొక్క - 3-4 వారాలు
పేపర్ బాగ్ - 1 నెల
వార్తాపత్రిక - 1.5 నెలలు
ఆపిల్ కోర్ - 2 నెలలు
కార్డ్బోర్డ్ - 2 నెలలు
కాటన్ గ్లోవ్ - 3 నెలలు
ఆరెంజ్ పీల్స్ - 6 నెలలు
ప్లైవుడ్ - 1-3 సంవత్సరాలు
ఉన్ని సాక్ - 1-5 సంవత్సరాలు
మిల్క్ కార్టన్లు - 5 సంవత్సరాలు
సిగరెట్ బుట్టలు - 10-12 సంవత్సరాలు
తోలు బూట్లు - 25-40 సంవత్సరాలు
టిన్డ్ స్టీల్ క్యాన్ - 50 సంవత్సరాలు
ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు - 50 సంవత్సరాలు
రబ్బరు-బూట్ ఏకైక - 50-80 సంవత్సరాలు
ప్లాస్టిక్ కంటైనర్లు - 50-80 సంవత్సరాలు
అల్యూమినియం కెన్ - 200-500 సంవత్సరాలు
ప్లాస్టిక్ సీసాలు - 450 సంవత్సరాలు
పునర్వినియోగపరచలేని డైపర్స్ - 550 సంవత్సరాలు
మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన్ - 600 సంవత్సరాలు
ప్లాస్టిక్ సంచులు - 200-1000 సంవత్సరాలు

మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, దయచేసి ఈ సమాచారాన్ని మీ నెట్‌వర్క్‌లో మీకు వీలైనంతగా పంచుకోండి.
గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పడుతుంది.
- దయచేసి హరిత పర్యావరణానికి మద్దతు ఇవ్వండి

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు