ప్రాంజలి ప్రభ
తెలుగు తల్లి కన్నీరు పెట్టుకోకు (2)

మాతృభాష బోధన ఆపుట యెందుకు
నీవు పుట్టింది తెలుగు తల్లి పరిధిలో కాదా
నీ తల్లి నీకు తెలుగు బాష నేర్ప లేదా
నీ తండ్రి తెలుగు రాష్ట్రాన్కి రాజు కాదా

ఎందుకయ్యా తెలుగు భాష పై చిన్నచూపు

నిన్నేమన్నా బాధపెట్టిందా ఆ తెలుగుతల్లీ
తెలుగుతల్లికి కన్నీరు తెప్పించుట మంచిదా
తనబిడ్డలను అమ్మా అనిపిలుచుకొనే
దారిలేకుండా చేస్తున్నారు మీకెవరిచ్చారు హక్కు

ప్రజా బలం ఎప్పుడూ నీవెంట ఉండదు
కానీ తెలుగుతల్లి నిన్ను నన్ను వదలి ఎక్కడకూ
వెల్లదు కాని ఆ తల్లికి ఆత్మఘోష తెప్పించుటెందుకు
ఇప్పటికైన కల్లుతెరవండి,
తెల్గు అక్షరం దిద్దించకా ఆంగ్ల అక్షరం దిద్దించుట
ఎందుకు

అమ్మా అని పిలిపిచుకోక, మమ్మీ అని అనిపించుట ఎందుకు
తెలుగు బాషను
బతికించండి,
చదివిన వారికి ఉద్యోగం ఇవ్వండి
ఇక పరబాషతో పని మనకేమిటి

అమ్మ పాలు అందుబాటులో ఉండగా
దాదిపాలుకు కక్కుర్తి పడేవారిని ఆ తల్లే
బాగుచెయ్యాలి, జై తెలుగు తల్లి
జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి.
--(())--

కవిత - ప్రేమ లో పడు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మోదటి చూపుతో మెలిక పడు
చూపులకే యద పొంగు ఆశ పడు
ఆతృతగా తెలియని ఆరాట పడు
ఏదో ఆనందంతో ఉత్సాహ పడు


ఎదురుగా ఉన్నప్పుడు తేలిక పడు
దూరంగా ఉన్నపుడు తపన పడు
ఉండీ లేనప్పుడు వ్యధన పడు
దొంగాట ఆడేటప్పుడు తృప్తి పడు

అదే ప్రేమ ప్రేమతో ముడి పడు
మనసు సంగమంతో జత పడు
వయసు వలపుతో ఓర్చి పడు
సొగసు ఊరడించి ఉలిక్కి పడు

మంచు వేడికి కరిగి జారిపడు
మెరుపుకే మేఘం కరిగి పడు
కాంతి మనిషిపై పడి నీడపడు
స్త్రీ పురుషుని కామానికి లొంగిపడు

గొంతు మూగపోతే బాధపడు
గోంతు ఖటోరమైతే ఏడ్చి పడు
గొంతు మాధుర్యంకే ముద్దుపడు
గొంతు గొంతు కలసి మత్తు వీడు

ఆలాపనకు దారిలో పడు
ఆలోచనకు ఆకలి పడు
ఆతృతకు ఆవేశ పడు
ఆకర్షనకు లొంగి జతకూడు

--(())--

కవిత - ఏది అవసరము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

గతించిన బాల్యం
స్వచ్ఛమైన ఆగని ప్రవాహం
ఊరుతున్న ఊట సత్యం
మారుతున్న మోఖం
 

తెల్సుకోవటం అవసరమా
పుట్టుకొచ్చే రోగము
తెలియని మైకము
తప్పని తాపము

మర్చిన నమ్మకము
తెల్సుకోవటం అవసరమా
అనుకోనిది జరగటం
జరగాల్సినది ఆగటం

చెప్పకవచ్చే గుండెపోటు
ప్రయాణంలో మరణం
తెల్సుకోవటం అవసరమా
విత్తనాలను పురుగులు తిను

మెక్కలు జంతువులు తిను
పూలు మెగ్గలు పక్షులు తిని
తరువు ఉపయోగాలు మన్షి తిను
తెల్సుకోవటం అవసరమా

తిట్టే నోరు గురించి
మూర్ఖుని మాట గురించి
ఓడిన నాయకుని గురించి
త్రాగుబోతు మాట గురించి
 తెలుసుకోవటం అవసరమా

--(())--

 

ప్రాంజలి ప్రభ - నేటి కవిత
*శబ్ద ,స్పర్శ,రూప,రస, ప్రభావము
రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

వేణుగానమునకు ఆవులు ఆడినట్లు 
వేణుగానమునకు జింకలు చిక్కినట్లు 
మనుష్యులు శబ్దతన్మాత్రకే భయపడినట్లే 

కర స్పర్సలతో సంతోషాన్ని చెప్పినట్లు
మగ,ఆడయేనుగు స్పర్శకోసం తపించినట్లు
ౙుట్టుపట్ల తోఁ గూడిన యాలుమగల వేడుకతగువైనట్లే

మిడత అగ్నిజ్వాలకు బ్రమచెంది మరణించినట్లు   
స్త్రీ నేత్రాల ఆకర్షణకు చిక్కి జీవితం పతనమైనట్లు
అద్ధములఁబోలు చెక్కిళులయందుఁ చెమట ౘుక్కలున్నట్లే

చేప ఎరకు చిక్కి మానవునకు ఆహారమైనట్లు
ఆశతో రస నేంద్రియాలు మోసపోయినట్టు
ప్రేమరసానికి చిక్కి క్రీడించి జీవితం పతనమైనట్లే   

తుమ్మెద చెంపక పుష్పంలో చిక్కి ప్రాణం విడిచినట్లు
మొగలిపరిమళాలకు సర్పాలు చెట్టుచుట్టూ చేరినట్లు
స్త్రీ సంపెంగ పరిమళాలకు పురుష మనస్సే మత్తుగా మారినట్లే  

--((*))--



--(())--
కవిత - ప్రభావం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


పువ్వుకు పరిమళం ప్రకృతి వసంతం
చేపకు ఈదటం జలకణ్య స్వభావం
పక్షికి ఎగరటం నింగిలో శబ్ద ప్రయాణం
కోయిల కూయటం ప్రేమతో ప్రణయభావం


కవి వ్రాయటం అనుభవాల సారాంశం
మనుష్యులలో ఆరాటం విధి వైపరీత్యం
నిత్యం అతి వినయం ధూర్తుల లక్షణం
అధికారం ఎప్పుడూ ఆశల ఉదృతం


విద్యాతో వినయం ఉన్నచోట మనఃశాంతి
ప్రేమతో ప్రేమపొందటంలో ఉంది శాంతి
అతి విద్యా నిద్ర రానియ్యని అహంభవం
అతి ధన వ్యామోహం వలన బుధ్ధి నాశనం


ఓటమి తాత్కాలికం గెలుపు భాద్యత
అర్ధాంగి కోసం ఆరాటమే మోనపోరాటం
మనస్సుకు బలం నిగ్రహ అనుబంధం
నిత్య పూజ విధానమే మనోనిగ్రహం


--(())--



ప్రాంజలి ప్రభ -నేటి కవిత - ప్రకృతి మాత
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రకృతి మాత పులకరింత
మానవాభ్యుదయానికి సలపరింత
అదే జ్ఞాపకాలతో చలించు తనువంతా


బిగి కౌగిల్లో ఒదిగి పోయే యంత
ఆనందడోలికల్లో ఉంచినంత
 తనువు పరిపక్వముతో సంబరమంతా

ఆకర్షణ అనే మైకము కమ్మినంత
అనుభందాలదుప్పట్లొ చేరి అంత
ఆనందానుభూతుల ప్రేమలో వింతా

ప్రకృతి కన్నప్రేమలా పంచే అంత
ప్రేమ సుఘంధ ఆవిరిని పంచు అంత
గుండె గుండె చెప్పుల్లో ఏకమవుతారు అంతా

ఉషోదయంతో ప్రకృతి చూపె వింత
 ప్రేమ సుమ లతలను వికసింపచేసె అంత
విషాదపు అనుభూతులు మరచి పొందు శాంతి కొంతా

పక్షుల కిలకిల రావములు వినబడినంత
మనస్సు ఉల్లాసమై ఊహాలోకాల్లోకి చేరే అంత
 సందర్భోచితమైన సంతోషం పొందే ఆంతా

ప్రదేశ మేదైనా తరువుల కదలికలు అంత
సకల ప్రాణకోటికి ఊపిరితో మేధస్సు పెంచె అంత
దృశ్యమేదైనా ప్రాణాల్ని నిలిపే ప్రకృతి విధి అంతా

--((***))--

ప్రాంజలి ప్రభ - కవిత మలుపు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

బాల్యం పూర్తయిన దేహ ప్రాయంగా
మారి మనిషి జీవితం రహస్య మలుపు
వయస్సులో నేర్చిన విద్య వలన వక్తి గా
మారి వ్యక్తిత్వం ప్రబలి మనసే మలుపు


గుండె తలపులను తట్టుతూ తెరవంగా
పరిస్థితులను అనుకవగా మార్చే మలుపు
అమ్మ, నాన్న గురువులు చెప్పిన మాటగా
సంస్కారవంతమైన సమాజంలో మలుపు

వయసుకు వివేకానికి ఘర్షణగా
ప్రేమ, పెళ్లి, సంపాదనతో మలుపు
ఆకు, వక్క, సున్నం, కలిస్తే తాంబూలంగా
దేశ జనుల డెందము ప్రీతిగా మలుపు

బాధ పెట్టి పైకెదగడం దండగా
పది మందికి తోడ్పడుటే మలుపు
ప్రియ భావనలు తోడు ఉండగా
కళ్ళు అలసి పోకుండా మలుపు

బతుకు తలిపే అర్ధాంగి తోడుండగా
భవిష్యత్తు ప్రణాళికకు ఒక మలుపు
కాలచక్రంలా మన్నించే గుణముండగా
చింతలులేని సంసారమే ఒక మలుపు

==(())--

UIU IIIII - IIUI UIUIU

నేటి కవిత 
ప్రాంజలిప్రభ (ఛందస్సు )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

జల్లులే కుసుమముల   
-నవతేజ శోభసాగరం 
నవ్వులే నవ లతల 
-నవభావ తేజ శ్రీకరం 

వెల్గులే మురిపెముల 
- రవళించు మోహినీ సదా
పువ్వులే సరిగమల 
- పవళించు కామినీ సదా
         
ముందు మానసముననె
 - నవదీప వెల్గుకాంతులే  
  విందులే స్వరములను 
-విననాకు తేనియల్ గదా 

నింగిలో నుడుపములు 
-మదిలో సుమంగళాభవం 
నేలలో ఖనిజములు 
-అనురాగ భావభంజమే 

సుందరీ నిను గనగా
-సొబగెల్ల నిండె నామదిల్  
మంజరీ మది తలపే  
పులకించి  రాగమే గదా 

చిందవా యమృతమును 
నదివోలె సాగనాహృదిన్  
పొందవా సుమమధుర
మధుపంచ సంతసం గదా 
--((*))--






Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు