అయోధ్య దేవాలయానికి రామనామ

ప్రాంజలి ప్రభ
అయోధ్య దేవాలయానికి రామనామ
భజన కీర్తనా పుష్పాలు (1)  

రామ దాసు మాట రామ
రామ దండు మాట రామ రామ
రామ దూత మాట రామ
రామసేవకుల మాట రామ రామ
      
అను భవమే తెలుపు గుణపాఠాలు రామ
గుణ ధనమే తెలుపు మనభావాలు  రామ

అను కరణే తెలుపు నిజపాఠాలు రామ
నిజ గుణమే తెలుపు మనజీతాలు రామ

మన పదమే తెలుపు నిధివాటాలు రామ
విధి మనసే తెలుపు  ధన కాటాలు  రామ

కధ మలుపే తెలుపు జత గీతాలు రామ
ఒక పలుకే తెలుపు తిధి వేదాలు రామ

మది సుఖమే తెలుపు కసి వేషాలు  రామ
మది కళయే   తెలుపు బతికే పాలు రామ

మది వలపే తెలుపు సుఖ భావాలు  రామ
మది మలుపే తెలుపు పతి వేషాలు  రామ

రమ తలపే తెలుపు  పతి రాగాలు రామ
ఉమ తలపే తెలుపు గతి ధర్మాలు రామ

రామ దాసు మాట రామ
రామ దండు మాట రామ రామ
రామ దూత మాట రామ
రామసేవకుల మాట రామ రామ

--(())--


ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (2)    రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

రామ రామ అనుట మా విధి రామ
రామ బంటు మాకు పెన్నిధి రామ
రామ రామ అనుట రాజకీయమా రామ
రమ రామ అనుట తప్పుకాదు కదా రామ

పాలల్లో నీటిని వేరుచేయ లేము రామ
పాల పొంగును చల్లార్చుట నీ చలవే కదా రామ
నాలుక నిజాలు గమ నించలేము రామ
పెదాల పల్కుకేపొంగే మనసు నీ చలవే కదా రామ

నలుపులోని తెలుపును తెల్ప లేము రామ
చీకటి వెల్గులు కలయక నీ చలవే కదా రామ
మచ్చలేని మనిషిని కనుక్కోలేము రామ
మనస్సుకు మచ్చలేదని కల్పన నీ చలవే కదా రామ

హృదయానికి చిక్కే కళ్ళను చూడ లేము రామ
కళ్లు కళ్లు కలీపే హృదయం నీ చలవే కదా రామ
చూపుల్లోని స్వార్ధాన్ని గమనించ లేము రామ
చూపులకే చిక్కి కప్పల్లా ఉంటం నీ చలవే కదా రామ

కామ క్రోధాలను జయించ లేకున్నాము రామ
కామక్రోధాన్ని తృప్తి పరిచేది నీ చలవే కదా రామ
ఆశా పాశాన్ని వదిలించుకో లేకున్నాము రామ
మా జప తపాల నిగ్రహం నీ చలవే కదా రామ

రామ రామ అనుట మా విధి రామ
రామ బంటు మాకు పెన్నిధి రామ
రామ రామ అనుట రాజకీయమా రామ
రమ రామ అనుట తప్పుకాదు కదా రామ

--(())--


ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (3)     రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


నీ దాసుల్ని కనరా రామ
నీ ప్రేమను అందించవా రామ
నీవే మాకు దిక్కు రామ
నీ రక్షణలో ఉంటాము రామ ......

.
నీ రూపమే మా యదలో ఉంది రామ
కూరిమే మా పాలి వరము రామ
దాన సేవ చేయుటే మా విధి రామ
నిత్యం నీ నామమే మా నిధి రామ .....

.
కీర్తనమే మా భావకవిత్వము రామ
భజనలే మా మనోల్లాసము రామ
దయయే మా యీ జన్మే రామ
ప్రసాదమే మాతనువుకి శక్తి రామ .....


భక్తియే మా పుణ్యసంపద రామ
వైరాగ్యదీక్ష మా వ్రతమే రామ
ముక్తియే మాకు వైకుంఠము రామ
నీ ప్రార్ధనే మాకు జీవం రామా ......


మా బుద్ధులు నీవు చూపిన దారే రామ
మా మంచితనం, అంతా నీ చలవే రామ
మా జీవిత పరమావధిగా వున్నావు రామ
మా బిడ్డలకు నీవు అండగా ఉంటావు రామ.......


నీ దాసుల్ని కనరా రామ
నీ ప్రేమను అందించవా రామ
నీవే మాకు దిక్కు రామ
నీ రక్షణలో ఉంటాము రామ ......


--(())--


ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (4)     రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

నీతికి విలువ లేదు రామ
జాతికి గుర్తింపు లేదు రామ
మతికి మన్నన లేదు రామ
యతికి కరుణ లేదు రామ

మెల్లగ సాగుట నీతియు 
చెల్లని మనసు అనునదియు లేఁదున్ 
ఉల్లము జల్లులె రాణిది 

తల్లిమాట ఆచరణ మనసు ఉప్పొంగున్     

పల్లము నీరుయు సాగును 

కళ్లెపు మనసు అనునదియు నీదియున్
కుళ్ళుయు మూర్ఖుల మాటయు 
తల్లి మేలు చేయుటయు వినయ సత్యంబు
న్
 

మల్లెల వాసన సాగును 
ఎల్లలు కలసి మనుటయు ని సేవయున్ 
బల్లెపు మూర్ఖుని మార్చుము రామ
తల్లి బోధ మా మనసు కరుణ నిత్యంబు
న్ 

తెల్లనిపూవులగుత్తియు  
తెల్లనిమనముఁదెలియనగుతేఁటనగుట్లున్.. 

తెల్లనివన్నెయెవాణిది రామ
తెల్లనియై నుండవలెగ తెలుఁగుంగరణిన్!!!" 




నీతికి విలువ లేదు రామ
జాతికి గుర్తింపు లేదు రామ
మతికి మన్నన లేదు రామ
యతికి కరుణ లేదు రామ
--(())--
 


ప్రాంజలి ప్రభ - అయోధ్య దేవాలయానికి రామనామ - భజన కీర్తనా పుష్పాలు (5)     రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కలియుగమంతయు మాయ రామ
కనికరము దయ లేదియు రామ 
విధివైపరీత్యము అనుటయురామ
కళ సాకారము లేదు కదా రామా

కలియుగమంతయు మాయ రామ
కనికరము దయ లేదియు రామ 
విధివైపరీత్యము అనుటయురామ
కళ సాకారము లేదు కదా రామా
--((***))--

 

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు