ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రేనమ:

సర్వేజనా సుఖినోభవంతు 

చిత్తశుద్ధితో  చేసిన పుణ్యము 
- ఆత్మశుద్ధితో చేసిన దానము 
భాండశుద్ధితో చేసిన పాకము
 - కర్మశుద్ధితో చేసిన పని శుభము 

గాడిదపాలుకన్నా, ఆవుపాలకన్నా,
 తల్లి పాలు మిన్నా 
తిట్టి కొట్టి పెట్టె అన్నం కన్నా, 
ప్రేమతో పెట్టె చద్ది మిన్నా 

  కులములో ఒక్కడు గుణవంతుడున్నా 
కులములో ఉన్నవారు సూర్య చంద్రులన్నా 
వనములో గంధపు చెట్లు ఉన్నా 

వనమంతా గంధపు వాసనతో మిన్నా 

మిరప గింజ నల్లగా ఉండు 
- నోటితో నమిలిన మండు చుండు 
మంచిమాటలు తిక్కగా ఉండు
 - ఆచరణలో సుఖము ఉండు 

మేడిపండు చూడు బంగారమై ఉండు 
- పొట్టవిప్పిచూడు పురుగులుండు 
చెడ్డవాడు చూచుటకు అందంగాఉండు 
- గుణము మాత్రము కుశ్చితంగా ఉండు 

నల్లగనుండు మృగమదంబు 
- గొప్పదిగావుండు పరిమళంబు
గురువు గుణము అందరిపై సబబు 
- ఆశతో నేర్చిన విద్య నాశనంబు

అన్నీతెలుసన్నవాడి మాట నమ్మ వద్దు
 - అహంకార పలుకు ఆచరించవద్దు 
తెలివితో చెప్పిన మంచిమాట వినుముందు 
- మౌనంగా ఆచరించుట పసందు
   
పూజాకంటే బుద్ధి  గొప్పది
కులము కంటే గుణం గొప్పది 
మనసు కంటే మాట గొప్పది 
ధనము కంటే ప్రేమ గొప్పది 

నీచుడు గొప్పలు చెప్పును 
సజ్జనుడు మెల్లగా పల్కును 
కంచు గలగలా శబ్దము చేయును 
పుత్తడి పృథ్విపై పడ్డా శబ్దము లేకుండెను 

  మంచినీరు గదలని గతితోడ 
మురికినీరు మ్రోతతోడ 
మంచిమాటకు కట్టుబడి ఉండ
చెడ్డమాటను ఆచరించకుండా 

  చెరకులో పుచ్చు చేరి తీపి చెరచు 
చెడ్డవాడు మంచి వాడ్ని చెరచు 
చెడ్డవానివల్ల వంశం చెరచు 
మంచివాడు చెడ్డవాణ్ణి బాగు పరుచు 

 కోపముచేత కీర్తి నశించు 
శాంతము చేత కీర్తి గ్రహించు 
ఓర్పు చేత చెడును నిగ్రహించు 

కరుణ చేత ప్రేమను కురిపించు 

నిండిన నది నెమ్మదిగా కదులు 
చిన్నసెలయేరు పొర్లి పొర్లి కదులు 
చెడ్డవానివద్ద వచ్చు నీతి పలుకులు 
మంచివానివద్ద వచ్చు శాంతపు మాటలు 

గాడిద ఎక్కువ బరువు మోసిన ఏనుగు కాదు 
దుర్మర్గుడు శాస్త్రములు చదివిన చెప్పటం రాదు 
 విద్యలేనివాడు పండితుడితో తిరిగిన పాడిత్యము రాదు 
కొంగలు హంసలు ఒకేకొలనులోఉన్నా హంసగుణం కొంగకు  రాదు
   
అల్పునకు అధికారాము వస్తే మంచి వారిని వెడలకొట్టు 
మూర్కునికి మంచి చెప్పలేము ఎద్దును ఏడాదికి అదుపులో పెట్టు 
దుర్మార్గుని ఒప్పించలేము, విషపాముని ఆడించగల మన్నట్టు   
నీచుని గుణము మార్చలేము, వేపచెట్టు చేదునైన తినగల మన్నట్టు

మొసలి నీటిలో ఏనుగును పట్టు 
ఆమొసలి బయట కుక్కను చూస్తే దడ పుట్టు
చేప నీళ్ళల్లో వేగంగా పోయినట్టు 
నేలపై పోలేదు, అందుకేస్తానబలము గొప్పదైనట్టు  

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు