బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము లోని ౪ వ గీత 
గీ === నా తావతా ధమ్మ ధరో యావతా బహు భాసతి, యోచ అప్పం పిసుత్వాన ధమ్మ కాయేన పస్సతి; సేవ్ ధమ్మ ధరో హో తియోధంమం నప్పమజ్జతి.

భావము === పెక్కు మాటలాడువాడు ధర్మ పోషకుడు కాదు మిత భాషి అయ్యుధర్మ స్వరూపము నెరిగి స్వయముగా దానిని ఆ చరించి తద్వామఖుడు కానివాడు ధర్మ పోషకుడు.

బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము నుండి ౨ వ గీత 
గీ == అసాహసేన దమ్మెన సమేన నయతి సరే,
ధమ్మస్సా గుత్తో మేధావి ధమ్మట్తో తిపవుచ్చతి,

భావము === ధర్మ నిశ్చయము చేయునపుడు త్వరపడక ధర్మముపై ప్రధానముగా దృష్టి యుంచి మేధావి యీ పరులకు ధర్మోపదేశము చేయువాడుత్తముడు.
--((**))--

బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మటవగ్గో ౧౯ వ అధ్యాయము లోని ౧ వ గీత 
గీ === నా తేన హొతి దమ్మటో ఎనత్దిం సహసానయే, 
యోచ అత్ధం అనట్ధం చ ఉభో నిచ్చేయ్య పన్దితో.

భావము === మంచి చెడ్డల నాలోచింపక త్వరపడి తనకు తోచిన రీతిగా కార్యనిశ్చయము జేయువాడు న్యాయ శీలుడు కాజాలడు. మంచి చెడ్డలను తుచినట్లు పరిశీలించి చక్కగా కార్య నిశ్చయము చేయువాడుత్తమ న్యాయ శీలుడు.
--((**))--

బుద్ధ గీత - ధమ్మ పదము - దమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము లోని ౫ వ గీత 
గీ === నా తేన దేరో హొతి యేన స్స ఫలితం సిరో,
పరిపక్కో వయో తస్స్ అమెఘజిన్నో తి పుచ్చతి.

భావము === మనుష్యుడు తళ నెరిసిన మాత్రాన వృద్దుడు కాదు, వయస్సు చెల్లిన వాడయినాను తన జీవితమును వ్యర్ధముగ కదపినవాడు కనుక వృద్దుడు.
--((**))--

బుద్ధ గీత - ధమ్మ పదము - ధమ్మట్టవగ్గో- ౧౯ వ అధ్యాయము నుండి ౬ వ గీత 
గీ === యమ్హి నచ్చం చ దంమోడ అహింసా సజ్జమో దమో
సేవ్ వంత మాలో ధీరో దేరోటి పపుచ్చతి.

భావము === సత్య వంతుడు, శీలవంతుడు, ఆహిమ్సాపరుడు, నియమబద్దుడు, దాంతుడు నాగు నిర్మల జివి మాత్రమె వృద్దు దనడగినవాడు.
--((**))_-

బుద్ధ గీత - ధమ్మ పదము - ధమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము నుండి ౭ వ గీత 
గీ === నా వాక్కరణ మత్తేన వన్న పోక్ఖరతాయ వా,
సాధురూపో నరో హోతీ ఇస్సుకీ మచ్చరీ సటో.

భావము === వాక్చాతుర్యము కలవాడైనాను , సుందరుడైనను, ద్వేశియు, పిసినిగోట్టును, మోసగాడును అగుచో అతడు సాదు వనదగిన వాడు కాదు.
--((**))--
బుద్ధ గీత - ధమ్మ పదము - ధమ్మట్ట వగ్గో - ౧౯ వ అధ్యాయము లోని ౮ వ గీత 
గీ === యస్స్ అచేతం సముచ్చిన్నం ములఘచ్చం సముహతం 
స వంత దోసో మేధావి సాదు రూపో తిపుచ్చతి.

భావము === ఈర్ష్యాది దోషములను కూకటి వేళ్ళతో కుల ద్రోసినవాడు పాపరహితుడు, ధ్యాన శిలుడై సాధుపుంగవు దానిపిమ్చుకోనును.
--((**))--

కమలములు నీటబాసిన 
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ 
తమ తమ నెలవులు తప్పిన 
తమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ!
అర్థము:--సూర్యుని వెలుగుతో కమలాలు వికసిస్తాయి. కానీ అవి నీటినుండి బయటకు వచ్చిన తర్వాత అదే సూర్య రశ్మి సోకి వాడి పోతాయి. తమ స్థానాలను(పదవులు)ఎప్పుడు 
కోల్పోతారో అప్పుడు మిత్రులే వారికి శత్రువు లౌతారు.ఇది తప్పదు అని సుమతి శతక కర్త చెప్తున్నాడు.

లోకులు కాకులు లెమ్మని 
వా కొనుటయె పెద్ద తప్పు వాస్తవమున కా 
కాకుల సంఘీ భావము 
లోకుల కిసుమంత గలదె లోకములోనన్ (మల్లెమాల)
(ఒక్క కాకి దెబ్బ తగిలితే లేక చనిపోతే వంద కాకులు చుట్టూ మూగి అల్లరి చేస్తాయి.)-
ఇప్పటి మనుషులు తమ వాహనంతో ఎదుటివాళ్ళనో,లేక వారి వాహనమునో కొట్టేసి వాళ్ళు పడిపోయినా అలాగేపట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.లోకులను కాకులతో పోల్చ వద్దు.వాటికున్న సంఘీభావం లోకులకు లేవుకదా! అంటున్నారు కవి.

మతము లెన్ని యైన మానవత్వ మొకటే 
జాతులెన్ని యైన జగతి యొకటే 
పథము లెన్ని యైన పరమార్థ మొకటే 
వాస్తవమ్ము నార్లవారి మాట

ధృతి: క్షమా దమోస్తేయం శౌచ మింద్రియ నిగ్రహః
ధీ ర్విద్యా సత్య మాక్రోధో దశకం ధర్మ లక్షణం 
ధైర్యము,ఓర్పు, మనోనిగ్రహము, తనదికాని వస్తువునందు ఆశ లేకుండుట, శుచిత్వము,
ఇంద్రియనిగ్రహము, బుద్ధిమతిత్వము,విద్య, సత్యభాషణము, కోపము లేకుండుట 
ఈ పదిన్నీ ధర్మమునకు లక్షణములు.

దర్మార్థ కామ మోక్షాణాం ప్రాణా స్సంస్థితి హేతవః 
తాన్నిఘ్నతా కిమ్ న హతం రక్షతాం కిమ్ న రక్షితః 
ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థములకును ప్రాణములే సంస్థిత హేతువు లగుచున్నాయి. అట్టి ప్రాణములను పోగొట్టుకొనిన వాడు, సర్వమునూ పోగొట్టుకొన్నవాడవుచున్నాడు. వాటిని రక్షించుకుంటే సర్వమూ రక్షించుకొన్నవాడే 
అవుచున్నాడు....

--((**))-- 
చేటు వచ్చు వేళ జెడనాడు దైవంబు  
మేలు వచ్చెనేని మెచ్చుకొనును 
గరిమ మేలు,కీళ్ళు కావటి కుండలు 
విశ్వదాభిరామ వినుర వేమ 
అర్థము:-- తనకు కీడు కలుగునప్పుడు దైవమును నిందించుట, మంచి జరిగి నప్పుడు దేవుని పొగడుట మానవ సహజములు. కానీ మంచి చెడ్డలు కావడి లోని కుండల వలె సమానమని ఎంచి దైవ నిందకు పాల్పడ కుండుట గొప్పవారి లక్షణము.

లోకేషు నిర్ధనో దుఃఖా రుణగ్రస్త తతోధికం 
తాభ్యాం రోగ యుతో దుఃఖా తేభ్యో దుఃఖా కు భార్య కః 
అర్థము:-- లోకం లో డబ్బులేనివాడు దుఖిస్తాడు,వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు,వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు.
--((**))--

కంచెర్ల గోపన్న (రామదాసు)తానీషా చెర లోనున్నపుడు ఎన్ని విన్నపాలు చేసినా రాముడు వినడము లేదని దాశరథీ శతకం రాశాడు. అందులోదే ఈ పద్యం. 
డాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ 
దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగి నావు నే 
జేసినా పాపమో వినుతి జేసిన గావవు కావుమయ్య నీ 
దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ!
అర్థము:-- శబరి నీకేమైనా దగ్గరి చుట్టమా?తనను దయతో కాచినావు. గుహుడేమైనా నీ దాసుని దాసుడా?అతడికి నీ సేవాభాగ్యము యిచ్చినావు. నేను జేసిన పాప మెమో గాని యెంత ప్రార్థించినానన్ను రక్షించుట లేదు. కరుణా సముద్రుడివైన రామా నేను నీ దాసులలో నొకడను,రక్షించు తండ్రీ నొకడను,రక్షించు తండ్రీ!
--((**))--



జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి 


వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం! 

--((**))--



ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ  ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత

యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి

3. వీణాధర బింబోపమ  
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా
ర్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీ
యవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనో
త్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు ప
ద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పా
వాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వా
నీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తక
పాణిన్ శుకవాణి విపులభాసుర పులిన
శ్రోణి న్బలభిన్మణి జి
ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్

పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం
 దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగా
త్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హా
సము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీ
పాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్
ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీ
ర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశద
క్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమై
పరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్
గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీ
ర్వాణికి నేణాంక శకలరత్నశలాకా
వేణికిఁ బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేం
ద్రాణి మాయమ్మ నలువరాణి వీణా
పాణి ఘనవేణి క
ల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మా

పి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకత
శ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేం
ద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రిత
శ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తి

కాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి

15. శారద విద్యాజాల వి
శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్
శారద నీరద నారద
పారద హారదరహీర పాండుశరీరన్

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణి
పసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మ
యీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలు
వెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధి

మందరాచల కందరామధ్యమాన
దుగ్ధపాదోధి లహరికాధూర్తయైన
లలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగు
వరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్
తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీ
పతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీ
సతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్

ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమర
బ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింప
సంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలర
సంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీన

దేవగజదంతతుల్యమై దేహకాంతి
చంద్రకాంతపీఠంబున సంగమింప
వివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగు
వాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందు
వాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములను
విజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందు
సాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములను

గుట్టుగాఁగాపురము సేసికొనుచు నేను
కోరినప్పుడు నానాల్కకొనను జేరి
నృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్ము
నధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుం
బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ
బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా
కట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్

కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,
నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీన
ఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెంద
దరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీన

నుపనిషత్తులుబోటులై యోలగింప
బుండరీకాసనమునగూర్చుండి మదికి
నించు వేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత.

అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

(ఇంకా ఉంది .........)


చదువు బుద్ధి నిచ్చు సంపద నిచ్చును గౌరవంబు ఘనత నిచ్చు చదువు మనుపమ శ్రద్ధతో 
తెలివి గలిగి మసలు తెలుగు బాల 

చదువొక పున్నమి వెన్నెల 
చదువే సన్మార్గదర్శి సత్యార్జనకున్ 
చదువే హేతువు ధాతువు 
చదువే సకలార్థ ధర్మ సాధన మిలలో

జ్ఞాన సంపద వున్న కాంచనము లేల?
నగలు నాణ్యము లేల మన స్సౌందర్యమున్న 
మనసు ముఖ్యము రూప డంబముల కన్న 
తెలిసికొనవోయి మొనగాడ తెలుగువాడ 

విద్యా ధనం శ్రేష్ట ధనం తన్మూల మితరం ధనం 
దానేన వర్ధతే నిత్యం  న భారాయ న నీయతే 

అర్థము:--సంపద లన్నిటి లోనూ విద్యా సంపదే గొప్పది. ఇతర సంపద లన్నింటినీ 
విద్య వలన పొందవచ్చు. అది ఇచ్చిన కొలదీ పెరుగుతుంది ఎవరికీ బరువుగా తోచదు,దొంగలపాలు కాదు 
(సూక్తిముక్తావళి పుస్తకము నుండి )

సుమతి శతకం లోని పద్యానికి పేరడీ
వినదగు పెళ్ళాం చెప్పిన 
వినినట్లు నటించు వాడె విజ్ఞుండన దగున్ 
విని విసిగి వేసరిల్లిన
మనుజున కేపో విరక్తి మహిలోన సుమీ 

ప్రాంజలి ప్రభకు పంపినవారు  (యలమర్తి మధుసూదన్ కడప ) ధన్యవాదములు తెలియపరుస్తున్నాను 

--((**))--

సత్యహీనా వృథా పూజా సత్యహీనో వృథా జపః
సత్యహీనం తపో వ్యర్థం ఊషరే వాపనం వృథా

భావము:-ఊషర క్షేత్రమందు విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్లు గానే సత్యహీనమైన పూజ,జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.

యువైన ధర్మశీలః స్యాత్ అనిత్యం ఖలు జీవనం
కోహి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవిష్యతి

భావము:- చిరుత ప్రాయములోనే మానవుడు ధర్మశీలుడుగా ఉండవలెను, ఎందుకనగా జీవితము అస్థిరము కదా! యెవనికెప్పుడు మృత్యువు వచ్చునో ఎవరూ ఎరుగరు కనుక
వయసును సాకుగా పెట్టుకోక ధర్మశీలుడవు కమ్ము.

అతగాడెవడో శంకరుడి పేరు పెట్టుకున్నాడట.కానీ ఏనాడూ ఆ పరమేశ్వర నామాన్ని చక్కగా పలికిన పాపాన పోలేదట.కడుపు మండిన కవి కరుణశ్రీ గారు అతడికి ఎలా వాత పెట్టారో చూడండి.
చదువు రాని వేళ 'చంకరు'డన్నాడు,
చదువు కొనెడి వేళ 'సంకరు' డనే
చదువు ముదిరి పోయి షంకరు డనె నయా
స్నిగ్ధ మందహాస శ్రీనివాస

అసారేఖలు సంసారే సారం శ్వశుర మందిరం
హిమాలయే హరః స్సేతే హరి స్సేతే మహా దధౌ:

అర్థము:--- ఈసారము లేని లోకములో సారము మామగారింట్లోనే వుంటుందిట. అందుకనే శివుడే మో తన మామగారిల్లయిన హిమాలయలాల్లో వుంటాడుట, విష్ణువేమో పాలసముద్రములొ వుంటాడట. ఇది కవి యొక్క వ్యంగ్యం. అంటే ఈ కాలము లో కొడుకులు
సెలవులకు తమ ఊరికి వచ్చినప్పుడు, ఊరిలోనే వున్న తల్లిదండ్రులింటికీ పోకుండా మామ గారింట్లో దిగి,తల్లి తండ్రులను మరుదినము వెళ్లి చుట్టపు చూపుగా చూసి వస్తున్నారు. కొంత మంది మూర్ఖులు ఈ శ్లోకము లోని వ్యంగ్యాన్ని అర్థము చేసుకోకుండా దేవుళ్ళే అలా చేస్తే మానవులెంత అని కొట్టి పారేస్తున్నారు . ఆహా! యేమి కొడుకులు?
--((**))--

*

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు