ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన పత్రిక ..... 26/1
మన ప్రాచీన సంపదదీనికి వారసులం అవుదాం!
ప్రాచీనులు అందించిన అద్భుత విజ్ఞాన భాండాగారం. ఖగోళ విషయాలు సూర్య మండలము లోనున్న ఎన్నో ఎన్నో అద్భుతాల సమాహారమే మయూరుని సూర్యశతకము. ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకుంటూ వారు అందించిన జ్ఞాన సంపదను అందుకునే దిశగా పయనిద్దాం.

॥ప్రభావర్ణనమ్॥
జంభారాతీభకుంభోద్భవమివ దధతః సాంద్రసిందూరరేణుం
రక్తాః సిక్తా ఇవౌఘైరుదయగిరితటీధాతుధారాద్రవస్య
ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచేవారుణా వో విభూత్యై
భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః ॥ 1

భక్తిప్రహ్వాయ దాతుం ముకులపుటకుటీకోటరక్రోడలీనాం
లక్ష్మీ మాక్రష్టుకామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే
కాలాకారాంధకారానన పతితజగత్సాధ్వసధ్వంసకల్యాః
కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయస్తే కరా భాస్కరస్య ॥ 2

గర్భేష్వంభోరుహాణాం శిఖరిషు చ శితాగ్రేషు తుల్యం పతంతః
ప్రారంభే వాసరస్య వ్యుపరతిసమయే చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తాస్త్రిభువనభవనప్రాంగణే పాంతు యుష్మా-
నూష్మాణం సంతతాధ్వశ్రమజమివ భృశం బిభ్రతో బ్రధ్నపాదాః ॥ 3

ప్రభ్రశ్యత్యుత్తరీయత్విషి తమసి సముద్వీక్ష్య వీతావృతీన్ప్రాగ్ -
జంతూస్తంతూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీస్
తే సాంద్రీభూయ సద్యః క్రమవిశద దశాశా దశాళీవిశాలం
శశ్వత్సంపాదయంతోఽంబరమమలమలం మంగళం వో దిశంతు ॥ 4

న్యక్కుర్వన్నోషధీశే ముషితరుచి శుచేవౌషధీః ప్రోషితాభా
భాస్వద్గ్రావోద్గతేన ప్రథమమివ కృతాభ్యుద్గతిః పావకేన
పక్షచ్ఛేదవ్రణాసృక్స్రుత ఇవ దృషదో దర్శయన్ప్రాతరద్రే-
రాతామ్రస్తీవ్రభానోరనభిమతనుదే స్తాద్గభస్త్యుద్గమో వః ॥ 5

మయూరుని సూర్య శతకంజంభారాతీభ కుంభోద్భవమివ దధతస్సాంద్ర సింధూర రేణుం
రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య
ఆయాంత్యా తుల్య కాలం కమలవన రుచేవారుణా వో విభూత్యై
భూయాసు ర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః || “

జంభ + అరాతి + ఇభ + కుంభ + ఉద్భవం = ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలం నుండి పుట్టిన
సాంద్ర సింధూర రేణుం = దట్టమైన సింధూరపు ధూళిని
దధతః ఇవ = ధరించినట్లు
ఉదయ గిరి తటీ = తూర్పు కొండ చరియలందు
ధాతు ధారా ద్రవస్య = ధాతువుల యొక్క రసధారలయొక్క
ఓఘైః + సిక్తాః + రక్తాః ఇవ = ప్రవాహం చేత తడుపబడి ఎర్రని రంగును కలిగినట్లు
తుల్యకాలం = అదే సమయంలో (సూర్యోదయంతో బాటుగా)
ఆయాంత్యా = వచ్చుచున్నటువంటి
కమల వన రుచా = పద్మవనం యొక్క కాంతిచే
అరుణాః ఇవ = ఎర్రనైనవిగా ఉన్నటువంటి
భువనం + భాసయంతః = ముల్లోకాలను ప్రకాశింప చేయుచున్నవై
భానవీయాః = సూర్యుని యొక్క
భానవః = కిరణాలు
వః = మీ యొక్క
విభూత్యై = ఐశ్వర్యము కొరకు
భూయాసుః = అగును గాక

తాత్పర్యం: సూర్యకిరణాలు ఐరావతం కుంభస్థలంనుండి పుట్టిన సింధూరపు ధూళికమ్ముకున్నట్లు ఉన్నాయి. ఉదయం స్వర్గంనుండి బయలుదేరినప్పుడు స్వర్గలోకపు వస్తువులతో పోలిక అన్నమాట. తరువాత తూర్పు కొండ చరియల లోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్నాయి. తరువాత సూర్యుని రాకతో బాటే వికసించిన పద్మ వనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి. భూమిని చేరిన కిరణాలు అలా కనిపిస్తున్నాయన్న మాట. ఈ విధంగా ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్న భానుని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!
మయూరుని సూర్య శతకం
*మాఘమాస స్నాన సంకల్పము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్లో. శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||
మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |
ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||
ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |
సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |
నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||
మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |
ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||
ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |
సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే
ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య
ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే,
ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా
ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి
సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే,
ఉత్తరాయనే, శశిరఋతౌ, మాఘమాసే, ...పక్షే , ....తిధౌ ......వాసర యుక్తాయాం,
శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్
.....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య,
ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం,
శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య
ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ
సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః
పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య
యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో
జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద
నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం,
కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం,
ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మకరంగతేరవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం
కరిష్యే.
*☘సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము☘*

గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశ తైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||
పిప్పలాదాత్సముత్సన్నే కృతే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||
అంబత్వద్దర్శనామ్మక్తిరజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||
విశ్వేశం మాధవందుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||
అతితీక్షమహాకాయ కల్సాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||
త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచి తోదేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||
యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||
నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||
సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||

స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప రవాహానికి యెదురుగా, వాలుగా
తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల
నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత
మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి
సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / దేవాలయాన దైవమును అర్చించాలి.
*☘దానమంత్రం☘*
ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్సయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.

*☘దాన పరిగ్రహణ మంత్రం☘*
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.

*☘పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*
శ్లో. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||
యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా విందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్షణౌ ||
సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||
శ్లో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ ||
శ్లో. ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం
శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||
*☘పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు☘*

శ్లో. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||
వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం
ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

శ్లో. కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

శ్లో. సర్వేద సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

శ్లో. అపుత్రాః పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||
అధనస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||
*☘పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు☘*
శ్లో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||
శ్లో. వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం ||
వందే సూర్యశశంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||

శ్లో. తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా
నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||
దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ
నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయానాపూర్ణేశ్వరీ ||

శ్లో. భవానీ శంకరానందే శ్రద్దా విశ్వాసరూపిణి
యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||
ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం
ఋగ్వేదాది చతుష్ట్యంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||
నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం
అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||
*☘పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు☘*

శ్లో. సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం
సాంబం స్తామిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||
సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంబస్యామ చరోస్మ్యహం మమరతిహ్ సాంబే పరబ్రహ్మణి ||

శ్లో. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యావకేళి కలకంఠీం
ఆగమవిపిన మయారీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||
సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంభస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||

శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||
వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం
ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం
సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||

శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నితంలోకా స్స్మస్తాస్సుఖినోభవంతు ||
🌸🌸🌸🌸
పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ క…
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం - 15 వ అధ్యాయము
జ్ఞానశర్మకథ - మాఘపూర్ణిమ
గృత్నృమదుడు జహ్నువుతో, నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు, శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు, శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి, "ఓయీ! నీవు మరల నారాకను గోరి తపమచరించితివి యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమ"ని యడిగెను. అప్పుడా విప్రుడు, '"స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి, యీ బాలుడు, పండ్రెండు సంవత్సరముల తరువాత, మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి, తపమాచరించితినని, శ్రీహరికి విన్నవించెను.
అప్పుడు శ్రీహరి, 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు, పండ్రెండవ సంవత్సరమున, గండము కలుగుటకు, కారణమును వినుము. నీ భార్య, పూర్వ జన్మమున చేసిన దోషమే, యిప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ, మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును, నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ, ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి, పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన, నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో, మాఘ వ్రతము నాచరించినందున, యీ జన్మయందును, విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను, గత జన్మలో, నీ భార్య, మాఘపూర్ణిమనాడు చేయవలసిన, పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను, రెండు దోషముల వలన, పండ్రెండు సంవత్సరముల తరువాత, గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి, గంగోదక బిందువులతో, నీ పుత్రుని తడుపుము. ఇందువలన, గండదోషముపోయి, నీ పుత్రుడు చిరంజీవియగును.
ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివారికి, వారి సంతానమునకు, ఆపదలు కల్గును, అధిక పుణ్యములని, గత జన్మలలో చేసిన వారికి, మాఘమాస వ్రతము నాచరింపవలయునని, సంకల్పము కలుగును. మాఘస్నానము, సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు, దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి, ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము, కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రతము, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు, వీరు మాత్రమే, బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను, పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ, కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ, అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే, మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే, మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున, గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి, శ్రీహరి అంతర్హితుడయ్యెనుl.
బ్రాహ్మణుడును, శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా, మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును, శ్రీహరి దయ వలన, గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము, తొలగె
ను. బ్రాహ్మణుడును, ఆ బాలునకు, మూడవ సంవత్సరమున, చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు, చేయదగిన సంస్కారములను చేసి, విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున, మృత్యుదోషము, శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్యా, పుత్రుడు, అందరును, సుఖ సంతోషములతో, కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు, పుత్రుని గృహస్థుని చేసి, యోగ మహిమచే ,శరీరమును విడిచి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది, మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి, పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును, అన్ని వర్గముల వారును ఆచరించి, యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది, సంసార సముద్రమును తరించి, పరలోకసౌఖ్యమును గూడ, పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని, గృత్నృమద మహర్షి, జహ్నుమునికి వివరించెను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం - 16 వ అధ్యాయము
విద్యాధరపుత్రిక కథ
రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై, సద్గుణాన్వితయై, కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును, ఆనందమును కలిగించు,
ఈమెను, యెవరికోయిచ్చి, అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను, అల్లుని కూడ, నా యింటనే యుంచుకొందునని, నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రాక్షసుడు, దేవీ భక్తుడు. ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచినంతనే, ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు, మిక్కిలి శక్తిమంతుడు, శివుని తపముచే మెప్పించి, శివుని శూలమును, కోరి పొందెను. శివుడును, వానికి, శూలము నిచ్చుచు, "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో, నీవు మరణింతువని" చెప్పి, యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు," నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము, శత్రువునెట్లు చేరును? "అని తలచి, వర గర్వితుడై, యెవరిని లెక్కచేయక, ప్రవర్తించుచుండెను.
అట్టి రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచి, "సుందరీ! నన్ను వరించుమని యడిగెను. ఆమెయు, నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును, విద్యాధరుని వద్దకు పోయి, వాని కుమార్తె నిచ్చి, వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు, వానికి, తన కుమార్తె నిచ్చి, వివాహము చేయుటకు, తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక, మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి, సురక్షితముగ, సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున, ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని, విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి, తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా, బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత, మంచి ముహూర్తమున్నది. అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు, అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, ఎనిమిది మాసముల తరువాత, శుభముహూర్తమున, నిన్ను వివాహమాడుదును, ఈ లోపున, నిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా, ఆమె, యేమియు, మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా, ''నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము, సాయంకాలమున, శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు, శివలింగమెచటనున్నదో, చూపుమని అడిగెను. ఆ రాక్షసుడు, పాతాళములో వున్న, హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు, రాక్షసుని అనుమతితో, శివ సందర్శనమునకై, ప్రతి సోమవారము, పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె, పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు, త్రిలోకసంచారియగు, నారద మహర్షియు, హటకేశ్వరుని దర్శింప వచ్చి, యామెను జూచెను. ఆశ్చర్యపడి, 'అమ్మాయి! నీవిచటనున్నావేమని' అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు, తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.
నారదుడామె చెప్పినదంతయును వినెను. "అమ్మాయీ! భయపడకుము. విష్ణుభక్తుడై, నీకు భర్తయగు వానిని, నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ, మానస సరోవరము కలదు. మాఘమాసమున, నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో, శ్రీమన్నారాయణుని పూజించి, ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు, కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.
విద్యాధర పుత్రికయు, నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి, స్నానము చేసి, పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును, వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు, సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న, శ్రీమహావిష్ణు భక్తుడగు, హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు, సర్వకాల సర్వా వస్థలయందును, శ్రీమహావిష్ణువును, స్మరించుచుండును. అందరియందును, శ్రీమన్నారాయణునే, దర్శించును. వారిని, హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు, వస్తువును, స్వీకరించును. దామోదరాయనుచు, భుజించును, కేశవాయనుచు, నిద్రించును. నరసింహాయని, స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు, తిరుగును, ఏపని చేయుచున్నను, యెవరితో మాటలాడుచున్నను, యేదో ఒక విధముగ, శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు, నారదమహర్షి వెళ్లెను.
హరిద్రధుడును, నారదమహర్షిని జూచి యెదురువచ్చి, గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి, అనేక ఉపచారములతో, పూజించెను. నారదుడును, "రాజా! విద్యాధర కన్యనొక దానిని ,వరగర్వితుడైన రాక్షసుడొకడు, బలాత్కారముగ నపహరించి, సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక, త్రిలోకసుందరి, సద్గుణశీల, నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని, వాని శూలముతోనే, సంహరింపవలయును. అని, వానికి తగినరీతిలో వివరించి, నారదుడచట నుండి, లోక సంచారార్థము పోయెను. హరిద్రధుడును, సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ, సముద్రము6 వానికి, తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును6 ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున, రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై, బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు, శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును, గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి, తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి, యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి, హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు, హరిద్రధుడు, చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు, శివుని శూలమును ప్రయోగించి, రాక్షసుని సంహరించెను. ఆ రాజు, రాక్షసుని సంహరించి, విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు, నారదుని మాటను, స్మృతికి తెచ్చుకొనెను, వానిని, భర్తగా వరించెను. హరిద్రధుడును, ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును, విష్ణుభక్తులై, విష్ణుపూజను, మాఘమాస స్నానమును, మానక, చేయుచుండిరి. చిరకాలము, సుఖశాంతులతో, శుభలాభములతో, జీవితమును గడిపి, శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి," అని వశిష్టుడు, మాఘస్నాన మహిమను, దిలీపునకు వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*

☘☘☘☘☘☘☘☘☘ 👉సమర్పణ :- 🚩 *-శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానము అభివృధ్ది సేవాసమితి-* ( కొండపైన శివాలయం - వినుకొండ ) 🥀 అధ్యక్షులు :-
*-పరమేశ్వర జానపాటి-*
( శివగురుస్వామి ) 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 👉 వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, "తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెడను" అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, "అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను, పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత *మాఘపురాణము* పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను" అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని *'భిక్షాందేహీ'* అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పడుకో", అని కోపంగా కసిరాడు.
ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.
కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.
"ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కనీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను?" అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టి పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.

Comments
Post a Comment