పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ

చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా...ల లల లలా లలా
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
ల లల లలా లలా
చరణం 1 :

ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరు నవ్వుల దీపం ఉంటె చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకు పోవాలి చుక్కలున్న మజిలి చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి
కరక్ట్...సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం
డెఫెనేట్లీ...దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం
ల లల లలా లాల లా...దు దుదు తర తరా రా

చరణం 2 :

కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి
కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి
ఆ.... ఆహా...ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే... తగలక తప్పదు గాయం
ల లల లలా లలా...ల లల లలా లలా




Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు