సోమవారం భక్తి భావం లో శ్లోకాలు
సోమవారం భక్తి భావం లో శ్లోకాలు
(1) అపరాధ క్షమాపణ స్తోత్రం (2) ‘శ్రీలక్ష్మీ హృదయం’ (3) పాట: సాగర కన్నెకా! శ్రీమహాలక్ష్మీ! (4) శ్రీ సూక్తము (5) నారాయణ స్తోత్రం.-
|
పాట: సాగర కన్నెకా! శ్రీమహాలక్ష్మీ!
రాగం: కానడ రాగం.
ప్రార్ధన:
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
పల్లవి.
సాగర కన్నెకా! శ్రీమహాలక్ష్మీ!
నిగమాగమ నుత, నలినీదళాక్షీ! ॥సాగర॥
అనుపల్లవి.
గంగ, మదన, బ్రహ్మ గారాల తల్లీ!
మంగమ్మ మాయమ్మా మము కన్న తల్లీ! ॥సాగర॥
సొగసుగా వెలిసావు శ్రీరంగ పురములో,
ఖగ వాహను రాణి, కోల్హాపుర దేవి,
ధగ ధగ మెరిసేవు విల్లి పుత్తూరులో,
జగమేలు మాయమ్మ జయలక్ష్మి తల్లీ! ॥సాగర॥
అష్ట లక్ష్మీగ నీవు చెన్నపురి నున్నావు,
కష్టములు కడతేర్చ ముంబయి కొచ్చావు,
దుష్ట భయంకరివై బండోరలో వెల్గు,
ఇష్ట వరదాయని, ఇందిరా రమణీ! ॥సాగర॥
పరమ భక్త గణ పాదాబ్జ సేవిత,
సరసిజ నయన, సోమ సహోదరి,
తిరు వేంకటాద్రి తత్వ హృద్వాసిని,
కరుణా స్వరూపిణి కనక మహలక్ష్మీ! ॥సాగర॥
భార్గవీ, మాత, నిత్యానపాయిని,
సిరి శ్రీనివాసు హృదయ సామ్రాగ్ఞి,
శ్రీరమాదేవి పద్మ పత్రాక్షి,
శ్రీరమణి, శ్రీదేవి, శ్రీవేంకటేశ్వరి! ॥సాగర॥
లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
శుభ శుక్రవారం శుభ శుభోదయపు వందనాలు ఫ్రెండ్స్...
==))))++
Comments
Post a Comment