భావ రస మంజరి స్వేదం







డిసెంబర్  ఇరువది ఐదు
పశువుల పాకలో జన్మించాడు బాలుడు
కుసుమ పువ్వుల వికసిస్తూ
పసిబాలుడు కెవ్వు మని ఏడవక నవ్వినాడు

కన్య మరియ గర్భమున
జన్మించాడు జగతిని ఏలే లోక రక్షకుడు
మన్య వెలుగు దివిటీలాగా
మాన్యుడు శ్రీ ఏసు రాజు మహిలో పుట్టెన్

ఎన్ని యుగాల పున్యఫలమో
కలియుగంలో అవతరించిన మూర్తి ఏసు
దయామయుడుగా మానవులు
మొయుపాప భారము సిలువలొ మోసే

నాకోసం దుఖిమ్చవద్దు
మీకుటుంబాల గురించి ఆలోచించండి
ఓర్పు, దయ, కరుణ రసంతో
మానవులందరికీ ప్రేమను పంచండి

తానే మార్గము, తానే సత్యము
తానే జీవంబుననుచూ తరగని ప్రేమతో
మానవరక్షణ కొరకై , లోకాలను
రక్షించు తున్న పూజ్యుడు క్రీస్తు ఏసు

ఎనలేని ప్రేమను పంచి
కనలేని లోకాల్లో ఉండి  దీవిస్తున్నాడు
నా నీ భేదము లేకుండా అందరియందు
ప్రేమను పంచమని చెప్పే  క్రీస్తు ఏసు

సమస్త లోక జీవులందరూ
సద్గునముతో, సత్పవర్తనతో,
సౌసీల్య వికాసముతో క్రిస్మస్
పండుగ పుట్టిన రోజు ఘనంగా చేస్తారు 

దాన ధర్మాలు, ప్రార్ధనలు  చేస్తారు
ఇది ప్రపంచ పండుగగా గుర్తించారు

భాస్కర్ కె. ( కవి)

కవిసంగమం నుండినాకునచ్చి సంగ్రహించినది..
// లలిత గీతం // రచన .దాశరధి

ఆ చంద మామలో.. ఆకాశ వీధిలో
వొదిగిపోతున్నాను.కదిలిపోతున్నాను
ఈ మలయ పవనులో ఈ మల్లె సొగసులో
మాయమై పోయాను..మైమరచిపోయాను
అర మోడ్పు కనులలో ఆ వీణ శృతులలో
కరగిపోతున్నాను.. తరగి పోతున్నాను// ఆ చంద మామ//
అతి తేలికై మనసు ఆకాశ మంటి తే..
తేలి నీడ నై పోయి..తిరుగాడుతాను
చల్లగా నీలోన జాబిల్లి రేఖా
కరగిపోయీ ఎడద గల గలా నీరైతే
నీ చిన్ని వాగు నై నడయాడతాను
మెల్లగా నీలోన మిన్నేటి దాకా// ఆ చందమామ// 
--((***))--
మానవుల మనస్సు కలుషితం
పంచ భూతాలు అవుతున్నాయి కలుషితం
భారతమాతా,  పుడమి తల్లి కలుషితం
కలుషితం లేని ప్రాంతం కోసం వెతుకుతున్నాం ఉంటె చెప్పండి

మానవులు కుల మతాలతో మద్య నలుగుతున్నారు
వర్ణ సంకరము జరిగినా ఏమి చేయలేక నలిగిపోతున్నారు 
కలుషిత వాతావరణంలో బతకలేక రోగుల్లా మరుతున్నారు      
మానవుడు చల్లని మనస్సుతో తలెత్తుకొని ఎప్పుడు మనగలడో ?

మాతృభూమి పరి రక్షణకు కంకణం కట్టుకున్న వారెవరు
సంఘాలు మారుస్తూ, పతాకాలు మారుస్తూనే ఉన్నారు
64 కళల ప్రోక్షాహము ఇవ్వక పరవిద్యకు పాకులాడుతున్నారు    
ఎక్కడ వీచికలు స్వేచ్చ్చా గీతికలై నలుదేశ లా వ్యాపించగలవో?

మనుష్యులో మానవత్వం మటుమాయమవుతుంది

*ఇష్టం-కష్టం-నష్టం

ప్రశ్నల బ్రతుకంటే ఇష్టం
మలుపుల జీవితమంటే మరీఇష్టం
స్నేహం పెంచుకోవాలని మరి మరీ ఇష్టం
వర్ధమానున్ని తెలుగుని బ్రతికించాలని మరీ ఇష్టం

మార్పు తేవాలంటే ఎంతో కష్టం
ఒకరిని తృప్తి పరచాలంటే మరీ కష్టం
ధర్మంగా బ్రతకాలంటే మారి మరీ కష్టం
ఇష్టం గా మార్చుకొని చేసిన మెప్పించటం కష్టం

జీవితమ్ మహోన్నతమైనది చేయకు నష్టం
కాలాన్ని వ్యర్ధం చేసి బ్రతుకుట మరీ నష్టం
ఆత్మా విశ్వాసం వదలి ప్రవర్తించుట మరి మరీ నష్టం
అరుణోదయ కాంతి ధర్మాన్ని గ్రహించలేకపవటం మరీనష్టం

 --((*))--

*శ్వేత హృదయం
పువ్వుల పరిమళం - గంధం సువాసన - తాకు హృదయం  
అసుద్ధ దుర్ఘందం  - మురుగు వాసన -చెడగొట్టు హృదయం 
ఆశగల మనిషికి  - ఎంతే పొందిన - నిలువదు హృదయం 
గెలుపు ఆశించు -  వలచి ప్రేమించు - ప్రశాంత  హృదయం   

నీది అనేది ఏదీ లేదు - లేని దానికి ఆశ వలదు 
శ్రద్ద వహిస్తే ఫలితం -  జ్ఞానిగా  మారక తప్పదు 
మాతృ భూమిని మరువద్దు - తెలుగు భాష వదలొద్దు 
కాలాన్ని బట్టి చేలించు - అదే శ్వేత హృదయం  
--((*))--

* (ఆశ – నిరాశ)
కాలం ఎదో గాయం చేసింది
నా కళ్ళను మాయ కమ్మింది
ఆశా దీపన్ని వెలిగించాను కాని
చీకట్లుకమ్మి నిరాశే ఎదురైనది

న్యాయం కాగడా చేత పట్టాను
నిజాయితి తో తలుపు తట్టి లేపాను
నిరాశా జీవులను చూసాను  
ఆశ నన్ను ఏమి చేయలేమన్నది

ఆశ సమాజాన్ని బ్రతికిస్తున్నది   
నిరాశే కొందరి ప్రాణాలు తీస్తున్నది  
ఆశ పరులకు మార్గం ఉంటున్నది
నిరాశ పరులకు చీకటే మార్గమవుతుంది  
--((*))--
*(మార్గదర్శి)

తండ్రి వైతివి వింక తడబాటు ఎందుకు
తరుణిని ఎలుకొని సాగుము ముందుకు
దర్మమార్గంలోని భాద్యతలను మరువకు
గురు ధర్మాలను, స్త్రీని ఎప్పటికి వదలకు

సఖిని కష్ట పెట్టక ఇష్ట సఖిగా మార్చుకో
తల్లి వలే ఆదరించి సుఖపెట్టుట నేర్చుకో
మనసు ఇచ్చి అను భంధాన్ని పెంచుకో
వయసు  ఉడుకు తపనలు  తగ్గించుకో

పడతి నోప్పింపక ప్రేమ పాఠములు నేర్పి
శృతిమధుర సంభాషణలతో మనసుమార్చి
ఓర్పు, నేర్పు చూపి మార్పుకు సహకరించి
ప్రగతి బాట నెంచి పారవశ్యం తో సుఖించు

ఆలి కెంత ఆదాయ మున్న సంసార మందించు
అలి కెంత తెలివి యున్న భర్తను బట్టి ప్రవర్తించు
ఆలి ప్రేమతో, ఓర్పుతో భర్త ఉద్రేకమును అణచు
ఆలి భవిషత్ మార్గదర్శిగా ప్రేమను  కురిపించు
* (పిడికిలి )

బిగి యించిన పిడికిలిలో దాగిన దేమున్నదో
అధ్రుష్టపు రేఖలే,  బాటలనుకో వచ్చునా 
లేదా దురదృష్టపు రేఖలే, అనుకో వచ్చునా  
వాణీ పతి వాచస్పతి వ్రాతలను కోవచ్చునా    

సమాధర్మంతో నడుస్తానని అనవచ్చునా  
సమ దృష్టి తో జీవిన్చాగలనని అనవచ్చునా 
సమేక్యతతో ముందుకు సాగాలని అనవచ్చునా  
దుష్ట శక్తులను పిడికలి బిగించి హింసించ వచ్చును       

--((*))--

*నీతులు చెప్పే వారు
రసజ్ఞుల ఆలోచనలే వేరు
అభిరుచులుపై, ఆభరణాలపై పోరు
సంస్కా ర ఔనత్యం అడ్డులేని జోరు
గుండెలోని తపన తీరు వేరు 

సూక్తులు ఆచరిన్చేవారెవరు
కుయుక్తుల వారే ఉన్నారు
మాయలో ఉంచి దోచేవారు
సిరితో తపనలు తగ్గించు కొనేవారు

వైద్యులున్నారని తిరిగేవారు
దుర్మార్గానికి అడ్డు లేదనే వారు
అడ్డు చెప్పేవారు లేదనే వారు
మొండి పట్టుతో బ్రతికేవారున్నారు

పక్కన ఉన్నవారిని పట్టించు కోరు
మంచి మనుషులతో స్నేహం చేయరు
విషం కక్కే వారిని చెరదీస్తారు
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరిస్తారు 

పాపమని తెలిసినా చేస్తారు
జిహ్వ చాపల్యాన్ని వదలకోలేరు
అద్దంలో మోఖమే చూడరు
నీతులే పెద్దగా చెపుతారు వారు  
--((*))--
 *వేంకటేశా

* ( భగవానుడు) 
పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి కట్ల పిల్లoగ్రోవి ధరియించువాడు ..
కాటుక తో అందగించుకనులవాడు
శిఖిని పింఛమమరిన. చిన్నవాడు.

వెలుగు విరజిమ్ము మోమువాడు
నీలి జలదంపు మేని వన్నె వాడు
సాధు జనులను రక్షించు వాడు 
ప్రేమతో పిలిస్తే ప్రత్యక్షమయ్యె వాడు 

ఆకాశం లో శాంతి నెలకొను వాడు
భూమండలం లో శాంతి నెలకొనువాడు 
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణులలో శాంతి నెలకొనువాడు 

పాడ మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగము లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తిని బోధించ అవతారమొందినాడు
భక్త కో టిని బ్రోచిన భాగవతుడు.. వాడు.
ఇహమునకు .పరమునకు ఈప్సితమునకు
ముక్తి.. మార్గమ్ము జూపెడి.గీతాచార్యుడతడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు 
పరిమితులను దాటి ధర్మాని కాపాడేవాడు 
ఏదో దేహంలో మనుష్యు ల్లో దేవుడై ఉంటాడు
లీలలను ప్రదర్శిస్తూ ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు  
--((*))__

1. ప్రమితి (లొంగి పోయే ప్రేమ) 

కన్న తల్లి ఉగ్గు పాలతో
రంగరించి పంచుతుంది ప్రేమ
ఎన్నెన్నో మాటలతో పాటలతో
జోలపాడి నిద్రపుచ్చేది ప్రేమ

ఉన్నత స్వేస్చా భావాలతో
ధర్మ మార్గాన నడిపించేది ప్రేమ
చన్ను పాలు లేక ఆవు పాలతో
బిడ్డ ఆకలి తీర్చేది ప్రేమ

కన్నులో కారం పడిన భాదతో

ఉన్నా బిడ్డ రోదన తగ్గించేది ప్రేమ
తన్నులు కనిపించక మూలుగుతో
తనయుని తపనను తగ్గించేదే ప్రేమ
పన్ను పోటు తెప్పించే మాటలతో

సతాయించే వారున్న బిడ్డపై ఉండు ప్రేమ
అన్నల, అత్తల,  అక్కలు పలుకలతో
కన్న బిడ్డపై తరుణికి పెరిగేది ప్రేమ
అందుకే బంధం  తెగనిది      

సుఖమున్నా భాద్యతలు తరగనివి
పెగుభంధం కష్టాలు ఒర్చుకోమంటుంది
కాల చక్రానికి లొంగిపోతున్నది ప్రేమ 
--((*))--

2. ప్రమితి  (మూగజీవి ఆలాపన )
నామీద  ప్రేమ ఎంతో చూపినావు -
నేనొక మూగ జంతువునై ఉన్నాను కదా
నన్ను మృదువుగా నిమిరావు
నీలో నా తల్లిని ఈరోజు చూసాను కదా

పుట్టిన నాటినుండి పెంచినావు
ఏంతో విశ్వాసము ఉంచినావు కదా
పురిటి మకిలినంతా పూర్తిగా తుడిచావు
నా తల్లి కంటే ఎక్కువ శ్రమపడ్డావు కదా

నన్ను దగ్గర తీసుకొని ముద్దాడినావు

తడబడే అడుగులను సరిచేసి పరుగెత్తావుకదా
పౌష్టి కరమైన ఆహారమును పెట్టావు
అజీర్తి రోగం వచ్చిన మందు ఇచ్చావు కదా
కన్న బిడ్డలా ప్రేమ చూపి పెంచావు

నమ్మకం కల్పించి బ్రతుకును మార్చావుకదా 
మానవుడిగా ఉండి నన్ను పెంచావు
ఈ రోజు నేను నీలో దానవుడ్ని చూసాను కదా
నా విశ్వాసాన్ని నీవు కొల్లగొట్టావు

దయాదాక్షిణ్యం లేకుండా కత్తితో నరికవు కదా
పెంచిన ప్రేమ లేక క్రూరుడిగా మారావు
ఒక్క రోజు తిండికోసం నన్ను బలిచేసావుకదా

ఇన్నాల్లు చూపిన ప్రేమ నాటకంగా మార్చావు
నాపై కూర్మిచూపి ఒక్కరోజుకూరగా మార్చావుకదా
దేవుడా బ్రతికే హక్కు మాకు ఎందుకు లేదందువు
మౌనం వహించావా దేవా మా బాధ గమనించావా

--((*))--

3. ప్రమితి (పకృతి విలయతాండవం)
పకృతి అందం వికృతి రూపం దాల్చింది
భగ భగ మండే సెగలు కమ్ముకుంటున్నాయి 
తరువులు తపన చెంది ఎండుట జరిగింది
సకల ప్రాణులకు భయాలు కమ్ముకుంటున్నాయి

పుడమి తల్లి పురిటిలో భగ్గు మంటున్నది
నీరు ఆవిరిగా మారి సెగలు కమ్ముకుంటున్నాయి     
ప్రజా గుండె ఘోష చెప్పలేక బాధ పడింది
ధరణి భారం పెరిగి తుఫాన్లు కమ్ముకుంటున్నాయి

మమకారం కనుమరుగై వికటాట్ట హసమైనది 
అందరికి భరించరాని కష్టాలు కమ్ముకుంటున్నాయి
వనాలు నీరులేక వడలి పోవటం జరుగుతున్నది
అనురాగం అసలులేక చీకట్లు కమ్ముకుంటున్నాయి

ప్రపంచమంతా కలుషితముతో నిండి పోయింది
పచ్చదనం లేక వెచ్చదనం కమ్ముకుంటున్నాయి
భోగాలకోసం, చల్లదనం కోసం, పోవటమవుతుంది
విద్యుత్ పరికరాలు ఎన్ని ఉన్న వేడి కమ్ముకుంటుంది

--((*))--
4. ప్రమితి (భార్య అలాపన) 

తెరలు చాటు వెలుతురు నాది
కనురెప్పల కదలిక సంబాషణ నాది
వలలో చిక్కిన పావురం మనసునాది
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

హద్దులు దాటవద్దని నిఖా పెట్టె
ముఖ కవలికలు చూపవద్దని షరతు పెట్టె   
మౌన సంభాషణలే అని నోటికి తాళం పెట్టె
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

ప్రక్కన చేరి పలకరింపు చూపు చూసిన తప్పే
అనేకత్వంలో పోక ఎకత్వములో  ఉన్నా తప్పే
ఓం శ్రీ రామ్, ఓం శ్రీ రామ్ అనుట కూడా తప్పే
ఎవరిని పిలుస్తున్నావని చీదరించె భర్త భార్తేనా    

పత్రిక చదివితే పరుష వాక్యాలు నేర్చు ఉంటావ్ 
టి .వి.అందని వన్నె తెచ్చేవి కావలిని కోరుకుంటావ్
సినమా చూస్తె నామేదే తిరగబడి యుద్ధం చేస్తావ్
నిబంధణలు పెట్టె భర్తకు భార్యగా ఉండుత సమంజసమా

ఆణువణువూ అనుమానంతో వేదిస్తావ్
మంచిగా మాట్లాడిన తప్పు  పడతావ్     
సాంప్రదాయానికి బద్ధులై ఉండాలంటావ్
గౌరవించలేని భర్తతో ఉండుట నిజమేనా
 
మంగళ సూత్రమ్ విలువ తెలియని వాడిటో
మృగానికి మనిషికి తేడా తెలియని వాడితో  
నడమంత్రపు సిరికోసం భార్యనే పొమ్మనేవాడితో
అది కాపురమా, దిక్కులేనివాడికి దేముడే దిక్కి
వస్తా వెళ్ళొస్తా ఇకరాను, నీవు కుక్కల చింపిన
బతుకుతావ్ , నీఖర్మా ఇక వస్తా, వెళ్లి రాను     
--((*))-- 
 
5. ఫోటో బట్టి వానరుల ముద్దుల పై నా కవిత

సభ్యత లేని సమాజంలో ఒక అసభ్యమా
కళ్ళువళ్ళు కంపించి నాట్యమాడడటం కన్నానా
సమయ సందర్బాలలో ఒక అసౌఖ్యమా
వళ్ళు వనికిన్చేవిదంగాఉండే శృంగారం కన్నానా

దిగజారి పోతున్నా ఒక సాంప్రదాయమా
బహిరంగ ప్రదేశాల్లో సిగ్గులేని ముద్దులు కన్నానా
మనుష్యులలో జంతువుల ప్రయత్నమా
సిరి కోసం సీఘ్రంగా శరీరం పంచె  అద్దేకన్నానా

అడవులు నరకటం వళ్ళ దాహానికి వస్తున్నామా
మానవుల బహిరంగ బుద్దులు కమ్ముకుంటున్నాయా
ఏది ఏమైనా మనుష్యుల వ్యసనాలు మనకోస్తున్నాయా
మనజాతి వీరుని ఆరాధించి విధముగా ఉండాలి కదా
 --((*))--

6. పస్థానం (మాట్లాడు )

వేదాలు ఉపయోగాన్ని బట్టి
గ్రంధాలు చదవ టాన్ని బట్టి
పదాలు వ్రాయ టాన్ని  బట్టి
మాటలు పొందికగా మాట్లాడు

కళల సౌరభాన్ని బట్టి
కలల సారాంశాన్ని బట్టి
తలల తారతమ్యాన్ని బట్టి
తరతమ బేధం చూసి మాట్లాడు  

వ్యాధులు వివరాన్ని బట్టి
స్వామీల విశేషాన్ని బట్టి
హమీల తలపుల్ని బట్టి
మనసు నొప్పించక మాట్లాడు

కార్యాల అవసరాన్ని బట్టి
చర్యల చేష్టల ను బట్టి
సిరుల వినయాన్ని బట్టి
సరిగమ అర్ధంతో మాట్లాడు

స్త్రీ పురుషుల వాక్కు బట్టి
పురుష, స్రీల వాక్కు బట్టి         
సమయాసమయాలను బట్టి
సమస్యలు రాని మాటమాట్లాడు

ప్రక్రుతి వికృతి గమనాన్ని బట్టి
అకృతి అణాకృతి ఆహ్లాదాన్ని బట్టి
స్వీకృతి పరాకృతి భావాల్ని బట్టి
మనస్సు అమస్సు కాకుండా మాట్లాడు
--((*))--

7. ప్రమితి  (ఆంక్షలు )

మలుపు లుంటే తలపు లుండవు
తలపు లుంటే అలక లుండవు
అలక లుంటే  తగువు లుండవు
తగువు లుంటే కత మలుపే ఉండు

కోర్కలు ఉంటే ఆశయాలు ఉండవు
ఆశయాలు ఉంటే పశ్నలు ఉండవు
ప్రశ్నలు ఉంటే జవాబులే ఉండవు
జవాబులే ఉంటే కత ఆశలే ఉండు

నడక లుంటే నవ్వు లుండవు
నవ్వులు ఉంటే కారణా లుండవు
కారణాలు ఉంటే ఇష్టా  లుండవు
ఇష్టాలు ఉంటే  కత నడకే ఉండు

ఎల్లలు ఉంటే  ద్వారాలు ఉండవు            
ద్వారాలు ఉంటే భయాలు ఉండవు
భయాలు ఉంటే భావాలు ఉండవు
భావాలు ఉంటే కధకు ఆంక్ష ఉండు

--((*))--

8. కంద  గుళిక


ఒక్క  నిముషం ఆలస్యం
ఎక్కాలనుకున్న విమానం ఉండదు
ముక్క సుబ్రత నిర్లక్షం
ఎక్కసం వచ్చి కక్కు రాక మానదు

వక్క పలుకు లక్ష్యం
తోక్కు తిన్నది అరుగుటే ముఖ్యం
అక్క పలుకు ధ్యేయం
చక్కని సంసారం ఇంటికి మణిదీపం

ఎక్కాలను కున్న ఎక్క లేవు
అక్కరకు రాని చట్టం అడ్డు పడితే
కక్కాలను కున్నా కక్కవు
చక్కని మాటకు మనసు చల్ల బడితే

చెక్కిన శిల్పాలు ఎన్ని ఉన్నా     
చక్కని రూపంతో ఆకర్షించుట మిన్నా
నొక్కులు పుత్తడికి ఎన్ని ఉన్నా
చుక్కలాంటి అందాన్ని పెంచుటే మిన్నా    

వక్కాణించి చెపుతున్నా
నక్క బుద్ధులు కట్టి బెట్టి మాట్లాడు
ఒక్క మాట చెపుతున్నా
చుక్క మాని సుఖపెట్టి సుఖపడు
 --((*))--

     9. ప్రమితి (ఎన్నాళ్ళు) 
కన్నిటికి వీడ్కోలు లేదా
విరహంతో ఉండాలి ఎన్నాళ్ళు
కోర్క తీరే దారి లేదా
కలలో స్వరాలు ఇంకా ఎన్నాళ్ళు

కాగడా వెలుగు సరిపోలేదా
పరువాల వాసనలు ఇంకా ఎన్నాళ్ళు  
హరివిల్లు రంగులు చూడలేదా
ముద్దుల మురిపాలు ఇంకా ఎన్నాళ్ళు

కంటి పాప అలుక చూడలేదా
నవ్వుల ముచ్చట్లు ఇంకా ఎన్నాళ్ళు
తాపానికి తగు ఒదార్పు లేదా   
ఓర్పుతో ప్రార్ధనలు ఇంకా ఎన్నాళ్ళు
మాధవా రాధ ప్రార్ధణ వినలేదా
ఉడికించి వేడుక చూచుట ఇంకా ఎన్నాళ్ళు
రాధగానామృతానికి విందు లేదా
ఉంది ఓర్పుతో మాధవునిపే ప్రేమ ఉన్ననాళ్ళు

--((*))--

*10. ప్రమితి  (పువ్వులు )
పువ్వుకు మాలి అవసరం

పువ్వులు దేవుని పాదాలు చేరుట వరం
పువ్వులు సిగలో చేరి నలుగుట మరోవరం
పువ్వులు మకరందాన్ని పంచుటే దేవుని వరం

పువ్వుల సుఘందాన్ని గ్రోలే మాలి
పువ్వులను డేగ కళ్ళతో చేసే మాలి
పువ్వును పరీక్షకు పంపే మరో మాలి
పువ్వును నలిపి అగ్నికి ఆహుతి చేసే మాలి

పువ్వులు మృగ తృష్ణ కు బలి
పువ్వులు శీల పరీక్షకు నలిగి 
పువ్వులు సుఖభరితాలకు నాంది 
పువ్వులు తుమ్మెదలకు సిరి

పువ్వులకు స్వతంత్రం చాలు
పువ్వులు గాలికి  బానిసలు
పువ్వులు అన్ని దశలు సుఘందాలు 
పువ్వులకు ఉంటాయి మౌన రోదనలు

పువ్వులను రక్షించే తోటమాలి కోసం
పువ్వులు ఆశలకు నలగ కుండుట కోసం 
పువ్వులు నిత్యం నవ్వినవ్వించటం  కోసం
పువ్వులు సుఖపడి సుఖపెట్టడం కోసమే కదా 
  
--((*))--

11. ప్రమితి (ఎలా చెపుతాం) 

చిరునవ్వు అందం ఇంతని ఎలా చెపుతాం
నవ్వు అందుకే అది మనస్సు ఉల్లాసపరిచే ఆయుధం
నవ్వితే నవరత్నాలు రాలునని ఎలచెపుతాం
నవ్వుల్లో అందుకే  కనిపించు నవ్య భావాల వసంతం

నవ్వలేనిది జంతువు మాత్రమని ఎలా చెపుతాం
నవ్వు కళ్ళతో గుండె హత్తు కొనే జంతు ముఖారవిందం
నవ్వులు మనస్సుకే వెలుగులని ఎలా చెపుతాం
హితకరమైన గుండెకు పెదవుల నవ్వే హాస్య భరితం

లేత చిరునవ్వు జీవకళ అని ఎలా ఎలా చెపుతాం
ముగ్దమొహనరూప మోనాలిసా నవ్వుచూపె చిత్రసౌరాభం
ప్రేమాతో ద:ఖాన్ని పోగొట్టేవినవ్వులే అని ఎలాచెపుతాం
పువ్వులవలె ప్రేమ రసమాధుర్యం చూపెది స్త్రీ హృదయం

నవ్వు కళ్ళ కదలికల్లో కనిపిస్తుందని ఎలా చెపుతాం
ఆరోగ్యకరమైన చూపు ఆహ్లాదాన్ని పంచుతుందని ఆంతర్యం
నవ్వితే మానసిక రుగ్మతులు పోతాయని ఎలా చెపుతాం
మనస్సంతా దర హాసంతో ఉండి మందు ఇస్తే అదే అమృతం

చిరునవ్వు చిద్విలాసం మంత్రం అని ఎలా చెపుతాం
నిస్సహాయతలో ఆనదాన్నిపంచే నవ్వే దేవుడిచ్చిన వరం
మనిషికి నవ్వు నాలువిదాల చేటు అని ఎలా చెపుతాం      
మాటకన్నా మందహాసంతో నవ్విస్తే తొలగు హృదయతాపం

--((*))--

శుభోదయం 

బ్రహ్మ  స్వరూపులైన  స్వామిజీగరికి పాదాభివందనములు చేస్తూ నేను హనుమంతుని అసీర్వాద బలముతో రామాయణము, సుందరకాండ, మరియు భగవత్ గీత అంతర్జాలంలో పొందు పరుస్తున్నాను, గూగుల్ వారు నాకు ప్రత్యేక వెబ్ సైడ్  క్రియేట్ చేసినారు, నేను చదువుటకు, మరియు వినుటకు వీలుగా ఆద్యాత్మిక కధలను, భగవత్ గీత నాస్వరముతో రికార్డు చేసి ప్రపంచ ప్రజలకు తెలుగులో అందచేయాలని ముందుకు వచ్చాను."  ఓం శ్రీ రామ్ " ఆజ్ఞ మేర మీకు తెలియ పరుస్తున్నాను, మీ శిష్యులు ఒక్కసారి నేను చేస్తున్న ఆద్యాత్మిక భోదను (అంతర్జాలంలో మాత్రమే ఇవి నా సొంతవి కాదు , ఎందఱో  మహానుభావులు వ్రాసినవి సేకరించి ఒక క్రమ పద్దతిలో రికార్డు చేస్తున్నాను)
నేను ముఖ్యముగా మిమ్ము అర్ధించేది మీరు ఒక్కసారి నేను నిర్వహిస్తున్న వెబ్ సై డ్  చూడగలరు  మీ ఆశిస్సులు, మరియు మీ శిష్యుల  పొందాలని మీకు తెలియపరుస్తున్నాను,
ఇపుడు విష్ణు సహస్త్రనామ స్తోత్రం భాష్యం ఇంటర్ నెట్ లో పొందు పరుస్తున్నాను
మరొక్కసారి మీకుమీ సభ్యు లకు వందనములు తెలియపరుస్తున్నాను, ఇట్లు వ్రాసినందుకు అన్యదా భావించ వద్దు " 2012 నుండి  వ్రాస్తున్నాను (అంతర్జాలంలో) ఆ వెంకటేశ్వర స్వామీ సాక్షిగమీకు తెలుపుతున్నాను.
నా వేబ్సిడ్
Pranjali Prabha.com
Mallapragada rAmakrfishna.com
and
1.Pranjali Prabha Mallapragada's listen bhagavad gita
.                     
2Pranjali Prabha Mallapragada's listen stories
                         
3.Pranjali Prabha Mallapragada'stelugu songs

4. Pranjali Prabha Mallapragada'ssundarakanda

 5. Pranjali Prabha Mallapragada's listen bhagavt gita

6. Pranjali Prabha Mallapragada's Mathamatics

6.pranjali prabha (Telugu Patrika ) 

ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


ఆంద్రప్రదేశ్ తెలుగులో బోధన తీసివేసిన తీరులో
నా ఆవేదనతో వచ్చిన కన్నీరు (1)


తెలుగు బాష రక్షించు కొనేందుకు నాప్రయత్నం
కళ్ళు తెరవండి తెలుగులో విద్యాబోధన చేయండి
పరదేశానికి పోయి మన శక్తి, తెలివి ధారపోయకండి
మనరాష్ట అభివృద్ధి కి తోడ్పడే తెలుగును బోధించండి


ఎందుకమ్మా ఆ కన్నీరు
విధిరాతను మార్చలేరు
వివరంగా చెపితేమారు
ఎలా ఊరేదో నీరు
ఊటబావి తీరు
నిండుగా నవ్వించి చేరు
ఒకనాటి తెలుగు భాష తీరు


స్తన్యపు ధారలతో నింపి
అమ్మా అంటూ అక్షరం నేర్పి
మంచి చెడు వస పోసి
బిడ్డలతో అమ్మా అని పిలిపించు కోలేనితీరు


ఉదయిస్తున్న తెలుగు వేరు
పలగుతో తవ్వి తీస్తున్నతీరు
తల్లి బాషనే తరమే రాజకీయ పోరు
డబ్బు కోసం కాక ఎవరికోసం ఈ తీరు


జాతి సంపద తెలుగుకు తెప్పించకండి కన్నీరు
ఉప్పెనలా వచ్చి పరబాషను ముంచే నీరు
తల్లి తండ్రులారా తెలుగును మరచిపోతున్నారు
వంశపారంపరంగా వస్తున్నా తెలుగును మరవద్దు


ఇప్పటికీ కళ తప్పలేదు తెలుగు వారిలో
సంగీత సాహిత్య పద్య గద్య వన్నెతెచ్చిన
ప్రపంచంలో కంప్యూటర్ ద్వారా తెలుగు
అభివృద్ధి చేసే సమయంలో ఆంగ్లాన్ని
ప్రోత్సాహం చూపే ప్రభుత్వాన్ని సమర్ధిస్తారా


--(())--

నేటి చైతన్యగీతం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


దేవీ పుత్రుడా
ప్రియ సఖుడా
మనో నేత్రడా
ప్రేమ వీరుడా


నా ఆలాపన ఆలకించవా
ని విన్నపాలు మన్నించవా

నీవేలు పట్టి ఏడడుగులు నడిచి
ఏడుజన్మలదాక ఉంటాని బాసచేసి
 

తనువే నీ సొంతం చేసానుగా
నాదన్నది లేదు సర్వస్వం నీవేగా

నీ నీండు మనస్సులో వెన్నెలనై
నీ చేతి స్పర్శకే సిగ్గు మోగ్గనై
 

నీ చదువుకు ఆధారము నేనై
నీ పలుకుల పల్లవి పట్టపురాణినేగా

నీ ఒడి అమృత తల్పమునై
నీ కోర్కలు తీర్చే తనువునై
 

నీ వెచ్చని ఊపిరిలో గలినై
నీ ఆలింగనమునకు తీగనేగా


దేవీ పుత్రుడా
ప్రియ సఖుడా
మనో నేత్రుడా
ప్రేమ వీరుడా


నా ఆలాపన ఆలకించవా
నా విన్నపాలు మన్నించవా
 

--(())--

ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కొంచమైన మనసు పెట్టరా
కోరుకున్నది నీ వెంట ఉండురా
కొమ్మ కొమ్మ గాలి వీచురా
కొంతవరకు ఉపశమనం ఇచ్చురా


కొరివితో తల ఎందుకు గోకుతావురా
కొత్త బిచతచగాడికి పొద్దే తెలియదురా
కోటివిద్యలు కూటికొరకే కదరా
కొత్త అప్పుకు పోతే పాత అప్పువెంటపడునురా


కొబ్బరికాయ నీళ్ళలా ఉండాలిరా
కొబ్బరిచెట్టులా ఉపయోగఫడాలిరా
కొత్తకవింత పాతొక రోత అనకురా
కోరుకున్నందుకు ముందుకు రారా


కోపము ఎప్పటికీ తెచ్చుకోకురా
కొంత త్యాగ గుణం పెంచుకోరా
కోల్పోయానని అనుకోకురా
కొల్వును తక్కవ చేసి ఉండకురా


కొల్చి చిన్నా పెద్ద అనుకోకురా
కోళ్ళ వ్యాపారం తప్పు కాదురా
కొర్రుపెట్టి ఆనందం పొందకురా
కో అన్న కోకోఅన్నా ఆట అనుకోరా


--(())--

▪ రూపాయి బియ్యం తినలేం..
       50 రూపాయలకి బియ్యం కొనలేం
▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం..
       మినరల్ వాటర్ కొనలేం
▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..
      కలల ఇల్లు కట్టుకోలేం
▪ ప్రభుత్వ బడికి పంపలేం..
      కార్పొరేట్ ఫీజులు కట్టలేం
▪ సర్కారు దవాఖానా కు పోలేం..
       కార్పొరేట్ బిల్లులు కట్టలేం
▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..
      బండికి పెట్రోలు కొనలేం



నేటి కవిత- కోసం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

కలలు కధలు కోసం
కధలు చెదలు కోసం
చెదలు రాతలు కోసం
రాతలు సుధలు కోసం

కళలు బతుకు కోసం
బతుకు మెతుకు కోసం
మెతుకు మమత కోసం
మమత బలము కోసం

కులాలు గుంపులు కోసం
మతాలు మంటలు కోసం
భెదాలు బందులు కోసం
తెడాలు తంపులు కోసం

వాదాలు కెంపులు కోసం
ద్వేషాలు కంపుల కోసం
కాలాలు మెప్పులు కోసం
దానాలు తప్పుల కోసం టూ

స్వార్ధం లేని ప్రేమ కోసం
ద్వేషం లేని నీతి కోసం
ఆశే లేని ఆత్మ కోసం
బాధే లేని బంధం కోసం

సతి వేచే పతి కోసం
పతి వేచే సతి కోసం
సతిపతి కలిసే సంబరం కోసం
సంబరమే పిల్లల బతుకు కోసం
--((***))+-
ప్రాంజలి ప్రభ- నమఃశివాయ
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


కైలాస వాస కరుణా సముద్రా
కైపులో ఉన్న మమ్ము మార్చ లేవా
కైలాసము నుండి కాలు కదపవా
కైవల్యం కోసం ఉన్నాము పరంధామా


అణువణువు నీవు ఉండినా
ఆత్మ చక్షువు మాకు విచ్చుట లేదే
ఆద్యంతము నీవే ఉండినా
ఆధ్యాత్మికం మాకు కలుగించు శివ


చిద్విలాస చిన్మయ రూప ం చూపవా
చింతలతో భక్తి తత్వం అబ్బుట లేదే
చిరస్మరణీయుడు గా మాతో ఉండవా
చిరునవ్వుతో ప్రార్ధించుతున్నా శివ


ఆదిదేవుడు వై ఆదుకోవా
రుద్రుడు వై అన్యాయాన్ని అరికట్టవా
పరమశివుడు వై ప్రత్యక్షముగా రావా
గంగాధరుడు వై గంగను అందించవా


గౌరీపతి వై సంసారాన్ని ఆదుకోవా
నటరాజు వై మా కళను వృద్ధిపరిచవా
కైలాసాధిపతి వై కారుణ్యం చూపావా
పశుపతి వై యమపాశం నుండి రక్షించవా


గరళకంఠుడు వై మాలో విషాన్ని తొలగించావా
హరుడు వై పాపాల్ని హరించవా
చంద్రమౌళి వై చల్లని మనస్సు నివ్వవా
ముక్కంటి వై మూడు లోకాలు కాపాడువా


పాలాక్షుడు వై అధికారం నిల్పవా
చంద్రశేఖరుడు వై మా గుణాన్ని మార్చవా
నీలకంఠుడు వై మా రంగుల కలనెరవేర్చవా
దక్షిణామూర్తి వై మా బుద్ధిబలం పెంచవా


వందే శంభుముమాపతిం
సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగ భూషణం
శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని
నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ
వరదం వందే శివం శంకరమ్

 --(())--
ప్రాంజలి ప్రభ
రచయిత :మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
సమాజంలో సాహిత్యం

రసజ్ఞుల ఆలోచనలు
అభిరుచులుపై, ఆభరణాలపై
సంస్కారం, ఔనత్యం, అడ్డులేకుండా
గుండెలోని తపన తీర్చుకొ

సూక్తులు ఆచరించక
కుయుక్తి గా మారి ఏడిపించు
మాయలో ఉంచి అందరిని దోచు
సిరితో తపనలు తగ్గించు

వైద్యులున్నారు త్రాగి తిరిగు
దుర్మార్గానికి అడ్డు ఉండదు
అడ్డు చెప్పేవారు అసలుండరు 
మొండి పట్టుతో బ్రతుకు

ఉన్నవారిని పట్టించుకో
మంచి మనుషులతో స్నేహం చేయకు
విషం కక్కే వారిని చెరదీసి
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరించు

పాపమని తెలిసినా అదే చేయి
జిహ్వ చాపల్యాన్ని వదలుకో
అద్దంలో మోఖమే చూడకు
నీతులే పెద్దగా చెప్పు

అవునంటే కాదను - కాదంటే అవునను
ఇదే సమాజంలో సాహిత్యం 
--((*))--



ప్రాంజలి ప్రభ
తెలుగు తల్లి కన్నీరు పెట్టుకోకు (2)

మాతృభాష బోధన ఆపుట యెందుకు
నీవు పుట్టింది తెలుగు తల్లి పరిధిలో కాదా
నీ తల్లి నీకు తెలుగు బాష నేర్ప లేదా
నీ తండ్రి తెలుగు రాష్ట్రాన్కి రాజు కాదా

ఎందుకయ్యా తెలుగు భాష పై చిన్నచూపు

నిన్నేమన్నా బాధపెట్టిందా ఆ తెలుగుతల్లీ
తెలుగుతల్లికి కన్నీరు తెప్పించుట మంచిదా
తనబిడ్డలను అమ్మా అనిపిలుచుకొనే
దారిలేకుండా చేస్తున్నారు మీకెవరిచ్చారు హక్కు

ప్రజా బలం ఎప్పుడూ నీవెంట ఉండదు
కానీ తెలుగుతల్లి నిన్ను నన్ను వదలి ఎక్కడకూ
వెల్లదు కాని ఆ తల్లికి ఆత్మఘోష తెప్పించుటెందుకు
ఇప్పటికైన కల్లుతెరవండి,
తెల్గు అక్షరం దిద్దించకా ఆంగ్ల అక్షరం దిద్దించుట
ఎందుకు

అమ్మా అని పిలిపిచుకోక, మమ్మీ అని అనిపించుట ఎందుకు
తెలుగు బాషను
బతికించండి,
చదివిన వారికి ఉద్యోగం ఇవ్వండి
ఇక పరబాషతో పని మనకేమిటి

అమ్మ పాలు అందుబాటులో ఉండగా
దాదిపాలుకు కక్కుర్తి పడేవారిని ఆ తల్లే
బాగుచెయ్యాలి, జై తెలుగు తల్లి
జై తెలుగుతల్లి, జై తెలుగుతల్లి.
--(())--

కవిత - ప్రేమ లో పడు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

మోదటి చూపుతో మెలిక పడు
చూపులకే యద పొంగు ఆశ పడు
ఆతృతగా తెలియని ఆరాట పడు
ఏదో ఆనందంతో ఉత్సాహ పడు


ఎదురుగా ఉన్నప్పుడు తేలిక పడు
దూరంగా ఉన్నపుడు తపన పడు
ఉండీ లేనప్పుడు వ్యధన పడు
దొంగాట ఆడేటప్పుడు తృప్తి పడు

అదే ప్రేమ ప్రేమతో ముడి పడు
మనసు సంగమంతో జత పడు
వయసు వలపుతో ఓర్చి పడు
సొగసు ఊరడించి ఉలిక్కి పడు

మంచు వేడికి కరిగి జారిపడు
మెరుపుకే మేఘం కరిగి పడు
కాంతి మనిషిపై పడి నీడపడు
స్త్రీ పురుషుని కామానికి లొంగిపడు

గొంతు మూగపోతే బాధపడు
గోంతు ఖటోరమైతే ఏడ్చి పడు
గొంతు మాధుర్యంకే ముద్దుపడు
గొంతు గొంతు కలసి మత్తు వీడు

ఆలాపనకు దారిలో పడు
ఆలోచనకు ఆకలి పడు
ఆతృతకు ఆవేశ పడు
ఆకర్షనకు లొంగి జతకూడు

--(())--

కవిత - ఏది అవసరము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

గతించిన బాల్యం
స్వచ్ఛమైన ఆగని ప్రవాహం
ఊరుతున్న ఊట సత్యం
మారుతున్న మోఖం
 

తెల్సుకోవటం అవసరమా
పుట్టుకొచ్చే రోగము
తెలియని మైకము
తప్పని తాపము

మర్చిన నమ్మకము
తెల్సుకోవటం అవసరమా
అనుకోనిది జరగటం
జరగాల్సినది ఆగటం

చెప్పకవచ్చే గుండెపోటు
ప్రయాణంలో మరణం
తెల్సుకోవటం అవసరమా
విత్తనాలను పురుగులు తిను

మెక్కలు జంతువులు తిను
పూలు మెగ్గలు పక్షులు తిని
తరువు ఉపయోగాలు మన్షి తిను
తెల్సుకోవటం అవసరమా

తిట్టే నోరు గురించి
మూర్ఖుని మాట గురించి
ఓడిన నాయకుని గురించి
త్రాగుబోతు మాట గురించి
 తెలుసుకోవటం అవసరమా

--(())--

భావ రస మంజరి స్వేదం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఫెళ్ళు ఫెళ్ళని విరిచె ఒళ్ళే చిందింది
మేఘ మాలిక నుదుటి మీదే  భగ్గంది
జల్లు జల్లుగ పుడమి తల్లే తడ్సి0ది
గుండె గుండెను మనిషి తాకే చిమ్మింది 

గుండె లెండిణ విత్తనంబు విచ్చింది
మంట పెట్టిన మానసంబు  భగ్గంది
జంట కట్టిన ఆసనంబు వద్దంది 
కంట నీటిని  హాసనంబు నమ్మేను   

పసిడి ఛాయలతో మేను కదిలింది
మగువ కోర్కలతో ఆశ చిదిపింది 
తెగువ భావముతో కొంత నమ్మింది 
వరుడు హాసముతో కొంత చిగురించె

పరుగు తీసెడి వయసు మొదలైనది
కరుడు కట్టిన మనసు మొదలైనది
వినయ వాదన జయము మొదలైనది
మనిషి వేదము సమము మొదలయ్యెను

పరువాల ఆ సొగసు విప్పారింది
వినయాల ఆ మనసు విప్పారింది
గమకాల ఆ కవిత విప్పారింది
సుమసీల ఆ మహిళ విప్పారేను

కొమ్మ,రెమ్మ, ఆకు, కంకులుగా మారింది
అమ్మ కమ్మ నైన మాటలుగా మారింది
నమ్మ కమ్ము తోనె వేదముగా మారింది
చెమ్మ గిల్లె కళ్ళు సాధనగా మారేను 

గుట్టు చెప్పి, విప్పి, గుభాలించింది
మట్టు పెట్టి , చెప్పి, గుభాళించింది
ఒట్టు, గట్టు, పెట్టి, గుభాళించింది
అమ్మ,నాన్న. ముద్దు గుభాళించేను   

మెరుపు తీగలా, మిల మిలా మెరిసింది
కరువు డేగలా, గల గలా, మెరిసింది
తరువు, మేనులా , జల జలా మెరిసింది
ఒడుపు, ఊయలా, ధగ దగా మెరిసేను
   
ముసి ముసి నవ్వుల, ముచ్చట్లు చెప్పింది
థళ థళ పువ్వులు ఆకర్ష చెప్పింది
జల జల జల్లులు సంతృప్తి చెప్పింది
కవి కధ కావ్యము విజ్ఞప్తి చెప్పేను 

కోకిల గొంతుతో చేను కదిలింది
ఆకలి ఆశతో మేను కదిలింది
దాహపు నీడలో మాను కదిలింది
దేహపు మాటతో యోగి కదిలేను

రైతన్న ఆకలి తీర్చి ముచ్చట పడింది
ప్రాయమ్ము ఆకలి తీర్చి సంబర పడింది
స్నేహమ్ము ఆకలి తీర్చి దేహము పండింది
కాలమ్ము ఆకలి తీర్చి మౌనము పండేను 


అందానికి చిలుక చేరి ముద్దాడి కొరికింది
పందానికి మగువ కోరి ముద్దాడి కొరికింది 
తింటానికి జిలెబి కోరి ముద్దాడి కొరికింది 
వాదానికి జిగురు చేరి ముద్దాడి కొరికింది  

కంకుల గుంపులతో ముచ్చటించింది 
ఆకుల మోపులతో ముచ్చటించింది  
కాకుల అర్పులతో ముచ్చటించింది 
వేకువ మెప్పులతో ముచ్చటించేను 

నెమలి చుట్టూ చేరి పురివిప్పి ఆడింది 
తరణి పట్టూ పట్టి  బిగువిప్పి ఆడింది 
మగువ చుట్టా విప్పి కళ తోన ఆడింది 
మనసు వద్దే అన్న కధ చెప్పి ఆడేను 
--((**))--
21-11-2018 photos


నేటి హాస్యం (2)

"డాక్టరు గారూ....గుండె ఆపరేషన్ ని........

"బై పాస్" అని ఎందుకంటారు??" అడిగాడు "సందేహం"

"హహహ...చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా....

ఆపరేషన్ విజయవంతం ఐతే...నువ్వు "పాస్" ఐనట్టు ...

లేక పొతే "బై"...అంటె గుడ్ బై అన్నట్టు!! అన్నాడు డాక్టర్ గారు!!

--((**))--

నేటి హాస్యం  (3)

"ఇదిగో అరుంధతి ....నా అనుమానం నిజమయ్యిన్దేవ్ " అంది "చంద్ర కళ"

"ఏం ? ఏమయ్యింది?" అడిగింది "అరుంధతి"

"మా ఆయన ...వాళ్ల ఆఫీసు లో అమ్మాయి కలిసి ........

నిన్న సినెమా కి వెళుతుంటే చూసాను!!" అంది "చంద్ర కళ"

"వాస్నీ..మరి నువ్వు కూడా వాళ్ల వెనకే వెళ్ల లేక పోయావా?" అంది "అరుంధతి"

"అనుకున్నానే...కానీ....
అది...
నేను చూసేసిన సినిమానే !!" అంది "చంద్ర కళ"

__((**))--


ప్రాసయతితో మంగళమహాశ్రీ -

మంగళమహాశ్రీ ఎలా పుట్టినది, ఎప్పుడు పుట్టినది అనే ప్రశ్న నాకు చాల కాలమునుండి ఉన్నది. ఇది కవిజనాశ్రయములో పేర్కొనబడినది. నన్నెచోడుని కుమారసంభవములో చివరి పద్యము ఒక మంగళమహాశ్రీ వృత్తమే. కుమారసంభవము శ్రీకారముతో ప్రారంభమై శ్రీకారముతో అంతమవడము ఒక విశేషము. నా ఉద్దేశములో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు. ఛందః పరముగా నాదగ్గర దీనికి ఋజువులు ఉన్నాయి.

ఈ వృత్తము బహుశా లయగ్రాహినుండి పుట్టినదని నా భావన. లయగ్రాహిని కన్నడములో లలిత వృత్తమని వ్యవహరిస్తారు. లలితకు, లయగ్రాహికి ఉండే తేడా లలితలో చివరి ప్రాసయతి లేదు. ఈ లలిత వృత్తములో శాసనాలు కూడ ఉన్నాయి. లయగ్రాహి లేక లలితలో 7 భలములు, రెండు గురువులు, అనగా 30 అక్షరాలు. ఇందులో ఒక పంచమాత్రా గణమును, అనగా ఒక భ-లమును తొలగిస్తే మనకు మహాశ్రీ లభిస్తుంది. అప్పుడు దానికి 26 అక్షరాలు. వృత్తము కావున ప్రాసయతికి బదులు సామాన్య యతిని ఉంచినారు. అనగా లయగ్రాహిలో ఎనిమిది పంచమాత్రలు ఉంటే, మహాశ్రీలో ఏడు పంచ మాత్రలు ఉన్నాయి. పాదాంతములో ఉండే గగము పంచమాత్రాతుల్యము. సామాన్యముగా లయగ్రాహివంటి లయ వృత్తాలకు పాదాంత విరామమును పాటిస్తారు. లయగ్రాహి రెండు వనమయూర వృత్తపు (UIII UIII UIII UU) పాదములను జత చేయగా జన్మించినదని నా ఊహ. మొదటి సగములోని చివరి గగమును భ-లముగా చేయాలి ఇలా సాధ్యము కావడానికి. క్రింద మొల్లరామాయణమునుండి ఒక లయగ్రాహిని మంగళమహాశ్రీగా మార్చిన వైనమును గమనించ గలరు.

క్రింద మొల్ల రామాయణమునుండి ఒక లయగ్రాహి -

తోయజదళాక్షి వల-రాయడిటు లేచి పటు - సాయకము లేర్చి యిపు-డేయగ దొడంగెన్
తోయద పథంబున న-మేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ - గాయగ గడంగెన్
కోయిలలు కీరములు - కూయగ నళివ్రజము - లే యెడల జూచినను - మ్రోయుచు జెలంగెన్
నాయెడ కృపారసము - సేయ కవివేకమున - నీ యెడల నుండు టిది - న్యాయమె లతాంగీ

దీనినే మంగళమహాశ్రీగా మార్చుదామా?

తోయజదళాక్షి వల-రాయడిటు లేచి పటు - సాయకము లేర్చి యిపుడేసెన్
తోయద పథంబున న-మేయ రుచి తోడ నుడు-రాయడును మంచి వడ గాచెన్
కోయిలలు కీరములు - కూయగ నళివ్రజము - లే యెడల జూచినను మ్రోఁగెన్
నాయెడ కృపారసము - సేయ కవివేకమున - నీ యెడల నుండుట సరేనా

మాత్రాగణముల అమరికనుబట్టి మంగళమహాశ్రీ వృత్తమునకు అక్షరసామ్య యతికి బదులు ప్రాసయతియే ఉచితము.

క్రింద ప్రాసయతితో మంగళమహాశ్రీ వృత్తమునకు నా ఉదాహరణములు -

స్పారమతి గీతముల - చారుమతి కావ్యముల - సారమతి యామె జగమందున్
శారదను విద్యల వి-శారదను గొల్తు నిలఁ - గోరికలఁ దీర్చుమని యెప్డున్
నారదుని తల్లినిఁ, దు-షార ధవళాంగి మన-సారఁ గరుణించ జపియింతున్
భారతికి మంగళము - భారతికిఁ బ్రార్థనము - భారతికి వందనము సేతున్

ఈ లలన డెంద మొక - యాలయము నిక్కముగ - నీలమణి నీవె గలవందున్
మాలతియు బూయఁ జిఱు - గాలి యది వీచగను - తేలెఁగద తావి వనియందున్
నీలగగనానఁ బలు - వేల మణు లుజ్జ్వలము - మేలముల నాడునటు లుండెన్
బాల సుకుమారి తను - దాళకను వేచె నిటఁ - బూలసర ముంచి యిరుగేలన్

చల్లఁగను రాత్రి యిది - తెల్లగను వెన్నెలయు - చల్లెనుగ మల్లియలు మత్తున్
మల్లియలు నా ప్రియుని - యుల్లమును దాకుఁగద - కల్ల యిది కాదు నిజమేగా
మెల్లఁగను వచ్చు నతఁ - డల్లుఁ బలు గాథలను - నల్లరిగ మూర్కొనును బూలన్
ఫుల్లమగు డెందములు - నిల్లగును నాకముగ - నుల్లములు నేకమగు నింకన్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

Painting collection photos

UUI IUI IUI UU 
neti  kaitvam        

భావాన్ని సుధామధురాన్ని దేహా 
న్నీసొంతము  చేయక ఉంటె ఎంతో
 వేదించియు ఉండెటి  వాడ్వి  నేనే 
అర్ధం తొ సహాయము చూపి ఉన్నా 

దేహమ్ము సదా వినియోగ  మమ్మే            
కాలమ్ము కళా  విజయోగ  మమ్మే      
సాకార మనే పనియోగ మమ్మే 
విశ్వాస సహాయ సయోగ మమ్మే       

నిన్నేమి అనేది యివేద భూమీ
యందును  సమాన  తరించు మార్గం 
శో దించు  సమత్వ సకాల హృద్యం 
సంతోష సహాయ మనేది లోకం       
       
తప్పే౦టి అనేను మనో ఫలాన్నీ 
తీ ర్చే విష యాన్ని వినోద పర్చా  
ఆలోచనలే  మనమే క మవ్వా  
లీ ఇంత మనో మయ మేను కాదా  

--(())--
మత్తకోకిల అమరిక - UI UII UI UII - UI UII UIU

కాలమే మన శక్తి ప్రేరణ - ప్రేమ భావము పొందులే 
జ్ఞానమే మన యుక్తి ప్రేరణ - విద్య భావము పొందులే 
మార్గమే మన నేర్పు ప్రేరణ - యోగ భావము పొందులే 
ధ్యేయమే మన లక్ష్య ప్రేరణ - ధైర్య భావము పొందులే  

--((**))--



శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ: 
ఇందిరాలయ 
ఛందస్సు  
ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ
UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475

శ్రీధరా గుణమివ్వు - శ్రీధరా మనసివ్వు 
శ్రీధరా వరమివ్వు - శ్రీధరా రారా 

శ్రీమతీ గుణమందు - శ్రీమతీ రణమందు 
శ్రీమతీ  తెలివంత - శ్రీమతీ మేలే  

ఆశలే జగమంత - ఆశలే అణువంత 
ఆశలే వెలుగంత - ఆశలే కాదా 

ఙివితం వయసంత - జీవితం భ్రమలంత
జీవితం మనసంత -  జీవితం అంతం  

రాముఁడే మనమందు - రాముఁడే హృదియందు -
రాముఁడే తలఁపందు - రాముఁడా ఱేఁడే

కాముఁడే పొడయందు - కాముఁడే నడయందు -
కాముఁడే వలఁపందు - కాముఁడా ఱేఁడే

భీముఁడై నను జేరు - రాముఁడై నను బిల్చు -
కాముఁడై నను గూడు - స్వామి నా ఱేఁడే

కొరికే వలదందు - కొరికే తనువంత
కొరికే మనసంత  - కొరికే స్నేహం 

మెచ్చునో, కలలందు - వచ్చునో, విరిదండఁ -
దెచ్చునో, యనురాగ - మిచ్చునో లేదో

మెచ్చునో, నను జూడ - వచ్చునో, చెలువమ్ముఁ -
దెచ్చునో, యొక ముద్దు - నిచ్చునో లేదో

మెచ్చునో, దరి జేర - వచ్చునో, చిఱునవ్వుఁ -
దెచ్చునో, పరిరంభ - మిచ్చునో లేదో

మెచ్చునో, వనమాలి - వచ్చునో, యొక కాన్కఁ -
దెచ్చునో, పులకింత - లిచ్చునో లేదో

మెచ్చునో యువకంత  - వచ్చునో వెలుగంత 
దెచ్చునో చణువంత - లిచ్చునో లేదో 

మెచ్చునో బ్రతుకంత - వచ్చునో కలయంత
దెచ్చునో మనువంత - లిచ్చునో లేదో              




నేటి తెలుగు ఛందస్సు 

కుసుమమాలికా - న/భ/జ/స/ర IIIU IIIU - IIIU UIU 
15 అతిశక్వరి 10104 

కనులతోఁ దెలిపెదన్ - గవిత నేఁ గమ్మఁగా 
మనసుతోఁ దెలిపెదన్ - మమత నేఁ బ్రీతిగాఁ 
దనువుతోఁ దెలిపెదన్ - దపన నే గాఢమై 
దినములో రజనిలోఁ - దెరువు నేఁ గాంచితిన్ 

వలపులో నలిగితిన్ - వ్యధలతో నేనిటన్ 
దలఁపులో మునిగితిన్ - దరియు నేఁ గానకన్ 
మలుపులో నిలిచితిన్ - మనసులోఁ గోరుచున్ 
పిలుపుకై కలఁగితిన్ - బ్రియుఁడు రాఁడేలకో 

ముదము పానకమవన్ - బుడక యా కోపమా 
వదలఁగా నగునె యీ - వలపు మాయాకృతిన్ 
కదలఁగా నగునె యీ - కలల లోకమ్ములన్ 
సుధలు ధూలకములా - సుమము ముల్లయ్యెనా 

హరిని నేఁ దలువఁగా - హరుసమే గల్గుఁగా 
హరిని నేఁ బిలువఁగా - హరుసమున్ వచ్చుఁగా 
హరియు నా సరస నీ - యవనిపై నుండఁగా 
నురములోఁ జిరముగా - నుఱుకు క్షీరాబ్ధియే 

విరులతో సరములన్ - బ్రియముగా నల్లితిన్ 
సరములన్ గళములో - సవురుతో నుంచితిన్ 
మఱల నా సరములన్ - మమతతో వేసితిన్ 
హరికి నే గళములో - హరియుఁ దా నవ్వఁగా 

దెసలలో నసమమై - తెలివెలుంగెల్లెడన్ 
నిసియు నీరవమవన్ - నెనరు నిండెన్ గదా 
కుసుమమాలికలతోఁ - గొమరునిన్ గొల్చెదన్ 
రసము రాజిలఁగ నా - రమణునిన్ బిల్చెదన్ 


--(())--
*క్షణం క్షణం వీక్షనం
 

వీక్షనం లో దొరుకుతుంది నిర్మలం
నిర్మలత్వంలో తెలియదు కాలం
కాలంలో కరిగిపోయిన వయసుతిరిగి రాదు

నిమ్మిత్తం లేకుండా వస్తుంది ఉన్మత్తం
ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిర్జీవం
నిర్జీవం లో అవుతారు నిస్తేజం
నిస్తేజం లో ఉన్నవారు పొందలేరు శాంతి 
 
శాంతి పొందుటకు వదలాలి ఆక్రోశం
ఆక్రోశం వదిలితే ఉంటుంది ప్రశాంతం
దేహంలో చేరే వికృతుల ప్రభావం
పనిచేయకుండా అడ్డుపడేదే మనోధైర్యం

గమ్య అగమ్యాల తెలిపుతున్న గోళం
గోళం బ్రమణాలు చూపు మన శరీరం
శరీరం లో రక్త ప్రసరణ మారుతూ  
నిత్యమూ శ్వాసతో ఉత్తేజం పొందే 
జీవనమే మనస్సుకు శాంతమయం

 
మనస్సులోని బాధ దేని కోసమో 
కల్లలోని నీరు ఎవరి కోసమో   
గుండెలోని మంటకు కారకు లెవరో  
అది ఒంటరితనం లో ఉన్న మౌనం    

మనోధైర్యం ఉంటె అంతా సుఖమయం 
సుఖమయం లో అంతా శుభప్రదం

--((*))--
భావ రస మంజరి స్వేదం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మేఘ మాలిక నుదుటి మీద మెరిసె 

ఫెళ్ళు ఫెళ్ళని ఒళ్లంత విరిచి చూపె
జల్లు జల్లుగ తడిసెను పుడమి తల్లి 
మనిషి గుండె గుండెనుతాకె హాయి నొందె  .... 1

పృద్వి గుండెలొ విత్తనం పైకి విచ్చె 

మంట పెట్టిన మానసం భగ్గు మన్నె 
జంట కట్టిన ఆసనం చిందు లేసె  
కంట నీటిని  హాసనం హాయి నింపు    .. 2

పసిడి ఛాయలతో మేను మెరుపు గాను  

మగువ కోర్కలతో ఆశ పరుగు గాను  
తెగువ భావముతో కొంత ధైర్య మొచ్చె  
వరుడు హాసముతో కొంత తెలివి వచ్చె  ... 3

పరుగు తీసెడి వయసుకు భాద కల్గు  

కరుడు కట్టిన మనసుకు తెలియ కుండు
వినయ వాదన జయముకు తోడు నీడ 
మనిషి వేదపఠనము శాంతి నిచ్చు   ... 4

నిత్య పరువాల సొగసుణ కురులు విప్పె 

సత్య వినయాలమనసుణ కవిత లల్లె   
స్వేశ్చ గమకాల గణమున కధలు చెప్పె  
న్యాయ సుమశీల నడకలు తగ్గు చుండె ... 5

కొమ్మ,రెమ్మ, ఆకు,  కంకులుగా మారి

అమ్మ కమ్మ నైన మాట మార్చి 
నమ్మ కమ్ము తోనె అమ్మి బతుకు చుండు 
చెమ్మ గిల్లె కళ్ళు కష్ట మంత          .... 6

గుట్టు చెప్పి మనసు గుభాలింపగ చేసి 

ఒట్టు, గట్టు, పెట్టె పుత్ర బలిమి  
అమ్మ,నాన్న.ముద్దు ఆశలు అడియాస 
చేసి భార్య వెంట పుత్రు డెల్లె         ... 7

మెరుపు తీగలా మిలమిలా మెరిసె వనిత 

కరువు డేగలా గలగలా కమ్ము కుంది 
పరువు పోయినా సుఖమిచ్చు తరుణ మంది
ఒడుపు ఊయలా ధగదగా మరుపు నిచ్చె ... 8   
   
కులుకు నవ్వుల ముచ్చట్లు మనసు దోచె 
కలువ ఆకర్ష చెప్పఁట్లు చరిచి పిలిచె
కన్య కామ్యపు చూపులు జలధి రించె    
సుఖపు జల్లులు సంతృప్తి కలగ చేసి .... .. 9   
--(())--


భావ రస మంజరి స్వేదం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

చిలుక అందాన్ని ముద్దాడి కొరికి పలికె  
మగువ పందాన్ని గెలిసియు ముద్దు నిచ్చె  
జిలెబి చుట్టల్ని చూపియు నోరు తడిపె   
జిగురు వాదాన్ని ముద్దాడి ఘనత కూర్చె .... 10  

గుంపు కంకులు మధ్యన ముచ్చటించి 
ఆర్చు కాకుల మధ్యన మనసు పంచి 
నెమలి ఆటలా పురివిప్పి మెచ్చి కయ్యె
మోపు ఆకుల పాన్పుపై హాయి గొలిపె  ...... ... 11 

రాత్రి కడురమ్య మయ్యెను పృథ్వి తడిసె  
నేత్రములు నిన్ను గననెంతొ సద్దు చేసె  
యాత్రముగ వీచె తరుణము సుఖము గాలి 
శత్రు వైనను సుఖమిచ్చు మదన వీణ ....... 12  

చేను కోకిల గొంతుతో  కదిలి ఊగె  
మేను ఆకలి ఆశతో  కదిలి వచ్చె 
మాను దాహపు నీడలో తడిసి మురిసె 
దేహ మంత స్వేదములు కరిగి వచ్చె  .... .... 13   

తీర్చె రైతన్న ఆకలి  ముచ్చ టించె 
తీర్చె ప్రాయమ్ము ఆకలి సంబ రమ్ము  
తీర్చె స్నేహమ్ము ఆకలి  తృప్తి పరచె 
తీర్చె కాలమ్ము ఆకలి మాయ నంత    .... .... 14 

అలుపు ఎరగని సంద్రపు వనిత నీవు        
కెరట ములువలెను మగని మనసు  
చేరి శాంతిని కల్పించు గురువు నీవు  
రచయతవు కలతీర్చు శుభము రోజు   ... ..  15  

పేగు బంధాన్ని జటిలము చేసి నావు 
రాగ బంధాన్ని ఆవిరి చేసి నావు  
ఆర్దిక పునాది గట్టిగ మార్చి నావు 
పృద్విని ప్రమాదమునుండి మాపి నావు ... 16 

గాలి తిత్తుల బతుకును మార్చి నావు 
దృశ్య సంఘట ణ విశద పరిచి నావు 
తేరు కొనేటి ధైర్యము చూపి నావు 
ధాత్రి జీవన్మరణసమస్యలకు హృదయి  ... 17

నేను దూది పింజాన్నిగ ఎగిరి ఎగిరి  
తడిసి బరువెక్కి బాధలు కొత్త కాదు  
అడుగడుక్కిఆపదలున్న రాసె రాత 
నడిచె నడకలు ప్రీతితో సంబరమ్ము ....  

ఏది నన్ను వెంటాడిన మనసు రాత
అనియు కలల చరితయు యండ మావి       
బతక నేర్చిన భవితను తీర్చి దిద్ది 

భావ కవులనుద్దరించు శక్తి చాలు    


     


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు