Art image of Radha Krishna

స   స     ర    స   య 
II U II U UiU II U I UU 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 
ప్రాంజలి ప్రభ  - నేటి కవిత్వం - కలహంస 
కొత్తగా పెళ్లయిన వారిలో ఉండే భావాలు 

  
కల హంసల సయ్యాటలో కను విందు చేసే 
గల మాటల  శబ్ధాలలో  కళ  మంచి చూపే 
కళ చూపియు సౌందర్యమే సహా వాస మయ్యే 
జల పర్గులు  సంద్రమ్ములో  జత గాను చేరే 

మలి వాడిన ముద్దాటలే  మది పొందు కోరే 
గిలి  చూపియు వయ్యారమే సిరి పొంద కోరే  
చలి కల్గియు విందాటలో చను వంత చూపే 
 కలి మాయలొ వింతాటలో  చిరు హాస మాయే 

అల హాసపు ఉయ్యాలలో  చను విచ్చి  చేరే
చల చల్లగ  చిందాటలో  చిరు నవ్వు చూపే   
తొలి  మల్లెపు సయ్యాటలో కధ  లల్లి విప్పే 
మలి మాటకు ముచ్చట్లతో  విడ మర్చి చెప్పే 

లల  లాలల లల్లేలలో లక కాక కోరే 
కల  కా తల ఒళ్లేలలో   పక కేక పెట్టే 
వల చిక్కులొ జల్లే జలే  జప కోక కోరే 
కల కాలము  ఇల్లాలు కే  కథ లన్ని చెప్పే  

--(())--

radha krishna | raadheraadhe | Flickr

భ స జ ర జ గ మదనదర్ప - .9.    
UII  IIU  IUI  UIU IUI  U 

నేటి కవిత్వం - మదనదర్ప - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మారని మమతాను రాగ మదీయ వేద మే 
తీరని  కరుణా కటాక్ష విక్షణా సహాయమే 
కోరిన మనువాడు శక్తి పుంజమే విశాల భా        
వామృత సహజాను సేవ తత్పరాను రాగమే

ఆరని అనురాగ శాంతి సొమ్ముయే సుధా మదీ
యా రమ సమ పోషణా లయాన్వితా సుహాసినీ 
ఆరదము కళాన్వి తాను రాగమే సుఖాన్వితా 
ప్రేరణ వినయాన్వితా సమర్ధ సేవ సంతసం 

సా రిగమను పల్కుటే ఉషోదయాన్ని పిల్చుటే 
భీరు తనుము తొల్చుటే మనో జయాన్ని పోల్చుటే 
నీరు తనము  చూచుటే  నిజాన్ని తెల్పి బత్కుటే 
మారు పలుకు  పల్కకే  మదీయ  భావ మిచ్చుటె 

మారుతము  మనల్ని జీవ సేవ చేయు నిచ్చునే 
ప్రేరితము మనల్ని  బత్కి  బత్కు నేర్ప టానికే  
పారునదులు చేరు భూమితత్వమున్ను కోరిటే 
దారుణ మను నన్నదీ ఏదియూ లేదు కృష్ణుడా  

--(())--  
   
Snowcandy's Gallery — Fanart of Satyavati,Mahabharat,by Snowcandy....

జ  ర  జ  ర  జ  గ - పంచ చామర - 9 
IUI  UIU IUI  UIU  IUI  U 

నేటి కవిత్వం - పంచచామర 
రచాయిట:  మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సమాన మైన మానసా  సహాయ సేవ తృప్తిగా 
సకాల మాయ మొహమే సుతారవేద తృప్తిగా    
సహాయ మోక్షమే మనస్సు  సాహసమ్ముఁ  తృప్తిగా
సరాగ  రాగ మాలికే  సంసయమ్ము తృప్తిగా 

అనాది నాదమే సమాన భక్తి తత్వ  తృప్తిగా 
అకాల వర్షమే సయోధ్య శక్తి తత్వ  తృప్తిగా 
అనంత సౌఖ్యమే అపూర్వ  యుక్తి తత్వ తృప్తిగా 
అలంకారమ్ముయే  విజేత రక్తి తత్వ  తృప్తిగా  
  
కరాళ నుట్యమే  అనేక  రక్తిగాను తృప్తిగా 
మకార బుద్ధియే  మనో మధుత్వమేను  తృప్తిగా 
వినాశి భావమే విరోధి యుక్తిగాను తృప్తిగా   
వివాద రక్తియే విషాద వైనమేను తృప్తిగా 

విశాల విశ్వమే సుధా వినోద నవ్వు తృప్తిగా   
వినోద లక్ష్యమే శరీర మార్పులే ను తృప్తిగా 
విహార వైనమే వివాద  కూర్పులే ను తృప్తిగా 
వివాహ వేడుకే అనంత ఓర్పులే ను తృప్తిగా 

--(())--



ప్రాంజలి ప్రభ. మత్తకోకిల యతి 10

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

దానశీల యశోవిశాలుని ధర్మపాలు సుధీమణిన్
దీనపోషుని సత్యభాషుని దివ్యవేషుని ధీరునిన్
మాననీయుడు ప్రేమ పాత్రుడు భవ్వ ధీరుడు వీరునన్
శ్రీ నికేతన రామకృష్ణ ను నృసింహ నిన్నెపు డంచెదన్

వణ్యజంతువు లక్షణం మరుపేకదా మరి గోవిందా
అణ్యభావము లేకయే మదిగోప్యమే నిజ ప్రేమయే
సూణ్యమవ్వక గోపికామయ గోపబాలుర ప్రేమయే
జణ్యుమారక ధర్మరక్షణ సేవభావము ప్రేమయే

భాగ్యపోషక భాగ్యలక్ష్మి కి ప్రేమపాత్రుడు మానస
త్యాగలక్ష్యక బోధతాత్విక ధర్మరక్షక. విజ్ణుడే
లగ్నమైనది జీవలక్ష్యమనే  మనస్సును రక్షకా
భగ్నమైనది. బాగుచేసియు. నిత్యసత్యపు సత్క్రపన్

పేరుతెచ్చిన దూరు దెచ్చిన బృధ్వి భర్తవు నాయకా
ఆరునూరుగ వేడుకొంటిని గీతబోధక నాయకా
వీరపోషక చారుహాసక చిద్విలాసక నాయకా
శ్రీ రమాధిప రుక్మిణీపతి భూరిధర్మపు నాయకా

అల్పచర్యలు  చూపు రూపములన్ని యొక్కని వౌటచే 
కల్పితంబులు కావులే మది బాగుచేసియు లక్ష్యమే 
తల్లితండ్రుల ప్రేమలే మది లీలలే వినయంబుగా 
కల్లొలత్వము కామ్యతత్వము కృష్ణతత్వము మార్చునే 

15-02-2020 

వెన్నెలంతయు కమ్ముకున్నను కాల మాయకు చిక్కెనే
వన్నె చిన్నెల చిందు చూపులు చిన్నబోయిన దక్కునే
కన్నె మోనము ఖంగు తిన్నను వట్టి చూపులు కక్కెనే
చిన్న పెద్దయు అడ్డువచ్చిన ఆశ పాశము ఏడ్చెనే

దాహమే ఇక తీరదా అని పేరుపేరున కోరగా
అహమే ఇక అడ్డువచ్చిన ఆకలాకలి కోరగా
మోహమే ఇక వెంబడించిన కింద మీదను కోరగా
ఊహయే ఇక నన్ను చేరగ ఏది ఏమని కోరగా

జీవ హానియు వద్దురా మరి మూగ ప్రేమను పొందుదాం
దివ్వ మైనది జీవితమ్ములె శాంతి దూతగ. మారురా
కావ్యమై  కదిలేవులే నిను నన్నునూ కరుణా దయా
సవ్యమై మది లోక రక్షక మమ్ము చూసేటి దైవమే

డబ్బు జబ్బుయు వద్దువద్దును అన్నముంటెను చాలుగా
డబ్బు మాటలు గబ్బులేపును రుబ్బినా అవి మారునా
జబ్బు జబ్బని నోట అన్నను మందు పట్టక తగ్గునా
నిబ్బరమ్ముగ ఉండ గల్గిన ముందు అంతయు కార్యమే

ప్రాభవం మరి హృద్యమే వనికే కదా నిను నన్నునూ
వైభవం మరి కావ్యమే కధగాకదా కళ కానుకా
జబ్బుయే మది మార్చుటే విధి ఆటగా నిను నన్నునూ
డబ్బుయే నిను నన్నునూ మది మార్చకే తిధి దైవమా

మత్తకోకిల..కొమ్మ

కొమ్మ కొమ్మ యు రాచుకున్నాను వేడిపుట్టును తెల్సుకో
బొమ్మ బొమ్మయు పెళ్లి ఆటలు నిజ మవ్వును తెల్సుకో
అమ్మ అత్తయు నవ్వులాటలు కాపురం అని తెల్సుకో
బామ్మ తాతయు సత్య వాక్కులు జీవితం అని తెల్సుకో

మత్తకోకిల ..ఆశ

ఆశ పాశము అట్ట హాసము వద్దుఅన్నను చేరుటే
విశ్వ మోహము సత్ప్రవర్తన సంఘ మార్పలు వచ్చుటే
ఈశ్వరుడు  యె లోక రక్షక ధర్మ పాలక ధీరుడే
విశ్వ మోహిని వింత ఆటకు రామ తత్వము గెల్చుటే
🔥👀💥

మత్తకోకిల శాంతిగా

భక్తి యే మన శాంతిగా సుమయం సుసద్విని యోగమే
రక్తి యే సుఖ శాంతికి వినయం వినమ్రత యోగమే
శక్తి యే విధి శాంతి కి సఫలం సమగ్రత యోగమే
యుక్తి యే సతి శాంతి కి పతి ధర్మమే గతి యోగమే

🥀🌷🍁🌺🏵

మత్తకోకిల జవాన్

స్వార్ధ మన్నది జాతి సంపద కానె కాదియు మమ ని
స్వార్ధమే మది శాంతి సౌఖ్యము ప్రేమ పాశము దేశమే
అర్ధమే గతి పోరుసల్పుట దేశ రక్షణ కొరకే
వ్యర్థ మన్నది చేయకుండగ సైని కుండుగా రక్షణే

మత్తకోకిల సాహిత్యం

సాహితీ సుమ మాలికా సమ గౌరవం ఇక ఇచ్చుటే
వాహిణీ వర వేదికా కధ కావ్వ పాలనా నుంచుంటే
సాహిత్యం జప హోమ ద్రవ్యము ధర్మరక్షణ మార్గమే
దాహమే కవి సార్వభౌముల శాంతికోరుట లక్ష్యం గా
 

పైట చెంగులొ గాలి దూరియు గోలచేయుట ఎందుకో
ఆట కాదిది యవ్వనమ్మున ఉర్కు పర్గులు ఎందుకో
మాట చిందక గాలి సవ్వడి భరించే ఎద ఎందుకో
కాట లాగున ఉండ లేకయు నీతి ఒప్పుట ఎందుకో

అమ్మ ఎప్పుడు శాంతి నిచ్చియు ఓర్పు పంచియు జీవితా
శమ్మునే సుమ గంధమై మమరక్షణే నిజ శక్తియై
కామితార్ధము బిడ్డకోర్కలు తీర్చుటే సతి  ధర్మమై
అమ్మకష్టము తీర్చలేనిది ఆదరించుట ఉత్తమం


U II  UUU II IU - U II  UUU II IU 



దీపము వెల్గించా మనసుగా - కోపము పోయిందీ నడకగా  
రోగము వచ్చిందీ పరుగుగా  - లోపము తెల్సాక  తరుమగా  

ఉన్నత పాండిత్యం కధలుగా - మన్నన సౌలభ్యం  కలిమిగా 
మన్నెము  సేవాభ్యాం బలిమిగా  - దన్నము పెడ్తున్నా చెలిమిగా   
   
ఆకలి పోరాటం దినముగా - ఆశల చెల్గాటం వెతలుగా 
కాలము ఆరాటం ప్రకృతిగా - జీవము  శోధించే దిశలుగా      

శోధన యే జీవం మనసుగా - భాధలు యే జీవం గురుతుగా 
దర్పము యే జీవం షరతుగా - ధైర్యము యే జీవం బతుకుగా 

ప్రేమలు ఆరోగ్యం మొదలుగా - ద్వేషము ఆరోగ్యం చివరగా 
దాహము ఆరోగ్యం మొదలుగా  - దానము ఆరోగ్యం చివరగా 

--(())--





ప్రాంజలి ప్రభ 
నేటి కవిత్వం - సృష్టిలో  " స్త్రీ " 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంసారంలో దించే ఆకర్షణ 
 సుఖాలు పంచే శరీర పోషణ
సెగలు చల్ల బరిచే వ్యామోహం 
చూవుల్లో మైమరిపించే సౌందర్యం
 
సంతోషంతో పంచే ఆకర్షణ 
వినోద భావం సకాల పోషణ 
కధలు చెప్పి పలుకే వ్యామోహం
మొహంతో మాయనుపెంచే సౌందర్యం 
 
 ఆరోగ్యంతో చూసే  ఆకర్షణ
మనస్సు మార్చే విశేష పోషణ 
నగలు పిచ్చి  కులుకే వ్యామోహం 
 దాహంతో దప్పిక తీర్చే సౌందర్యం

ఆనందంతో ముంచే ఆకర్షణ 
వయస్సు పెంచే మదీయ పోషణ 
 వగల మారి పిలుపే వ్యామోహం 
 కాలంతో సర్దుకుపోయే సౌందర్యం 

మనసుతో వ్యక్త  పరిచే ప్రేమ మాధుర్యం 
వయసుతో స్వేశ్చ తెలిపే ప్రేమ మాధుర్యం 
సొగసుతో  గాయ పరిచే ప్రేమ మాధుర్యం  
కళలతో యుక్తి  తెలిపే ప్రేమ మాధుర్యం
   
ఒకరికి ఒకరు కలుసుకొనే స్నేహాపర్వం 
మనసుకి మనసు మలచుకొనే స్నేహపర్వం 
వయసుకి వయసు కలుపుకొనే  స్నేహపర్వం 
మగనికి మగువ తలచుకొనే స్నేహపర్వం 

చల్లని వాతావరణంలో కల్పించే సంతోషం  
వెచ్చని ఆనందరణంలో పోషించే సంతోషం 
నవ్వుల సేవాతరుణంలో కల్పించే సంతోషం 
మంచిని పెంచేటి రణంలో పోషించే సంతోషం  

ప్రేమను పంచే కళ నైపుణ్యం  
వాత్సల్యమనే తీపి దనం 
సరాగాలతో వలపుల మయం
చీకటిలో వేడిసెగలు చల్లార్చే వయనం

తపస్సును భగ్నం చేసే సాంగత్యం 
శుఘంధ పుష్పాల సుమధుర పరిమళం 
తనువును అందించే సుఖ సౌఖ్యం     
మనసులో ఉన్న మాయను తొలగించే మర్మం 

విద్యా విషయంలో సహాయం 
విశ్రాంతి విషయంలో కల్పుకోలుతనం 
శ్రమకు చేదోడుగా నిలబడటం 
ఆలోచనపరంగా మనస్సుకు నిర్మలం 

కళ్ళ చూపుల్లో  కరుణ తత్త్వం 
శ్రేయస్సు కొరకు పలుకు సత్యం  
సిరులను పెంచే సున్నిత తత్త్వం 
పలకరింపులో మధురాతి మాధుర్యం  
బిడ్డలను ఉన్నతులుగా మార్చే వ్యక్తిత్వం 

ఇక చెప్పాలంటే 
స్త్రీ యే సత్యం - స్త్రీ యే నేస్తం - స్త్రీ యే నిత్యం 
స్త్రీ యే శక్తి - స్త్రీ యే ముక్తి - స్త్రీ యే యుక్తి  
స్త్రీయే  మైనం - స్త్రీ యే మౌనం - స్త్రీ యే మైకం 
స్త్రీ యే  వైరం - స్త్రీ యే వేదం - స్త్రీ యే కాలం 

స్త్రీలు వర్ణించాలంటే  నా శక్తి కవిత్వం చాలదు 
మిరే చెప్పండి ఇంకా స్త్రీల విషయాలు 
స్త్రీ  లేందే  మనం లేము - మనం లేందే స్త్రీ ఉండ లేదు 
ఇదే లోకం - ఇదే గమ్యం - ఇదే మర్మం 
  
--(())--
  

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు