నేటి కవిత్వం - బతుకు బండి ..
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
బతుకు జీవుడా అంటూ మురికి కుప్పళ్ళ వద్ద ఉంటే
మహమ్మారి పురుగు కాటేసి గుక్కతిప్పనీయక చేసే
చీకట్ల భయాన్ని లెక్క చేయక జీవితము సాగుతుంటే
వేకువ అభయాలు ఇచ్చే వారు కొంత ఊరట చూపే
స్వచ్ఛత కోసం వెంపర్లాడే కర్మ విరులుగా మేము ఉంటే
నిత్యం సమాజ శ్వాసలు అదిగో ఇదుగో అని ఆశ చూపే
స్వచ్ఛంద కిరణాలు మమ్ము చేరి హాయిని గొల్పు తుంటే
మీవిధిని మారుస్తా మంటూ మమ్మే ఖాళీ చేయింప చూసే
చదివే విజ్ఞానులు మారాతలను చూసి, నవ్వుతు ఉంటే
నగర పౌరులు సుందర మంటూ బతుకు మార్చాలని చూసే
మేము సైతం సంస్కరణ బాసట యందే బతుకు తుంటే
శోభలంటూ భ్రమలు కల్పించి జీవనానికి ఎసరు పెట్టే
పరిశ్రమ కాంతి పుంజ కవచాలుగా అర్ధం పర్ధం లేకుండా ఉంటే
ఏవగింపులేని పారిశుద్ధ పథికులు నమ్మకంతో మాయలు చేసే
ఇంటింటా చెత్తను మోసి, కొండల్ని పిండే చేసి గంజి కోసం ఉంటే
తడి పొడి వేరుచేసి మిషను అంటూ మా బతుకు కడుపులు కొట్టే
శ్రమ భారత పురులం బాధ్యత తెలిసిన మనుషులుగా ఉంటే
సహన సేవల కరుణామూర్తులు ఇచ్చే పారితోషకముతో ఉంటే
ప్రకృతి ప్రభలై కాలుష్యం కమ్ముకొని కట్టడి కర్తవ్య తేజాల
కోసం సుందర స్వప్నాలు కంటూ చిత్తశుద్ధితో బతికేస్తామండీ
--(())--
Comments
Post a Comment