🪔మరణంలో స్మరణ 🪔
॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥
1) కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక.
2) భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ ।
సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనము నందు ఆటలాడు శ్రీ జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.
3) మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా ।
సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బలరాముల మధ్య కూర్చుని దేవతలందరిచే పూజింపబడు శ్రీ జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
4) కృపాపారావారాస్సజలజలదశ్రేణిరుచిరో రమావాణీసౌమస్సురదమలపద్మోద్భవముఖైః ।
సురేన్ద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
దయాసముద్రుడు , కారుమబ్బుల వరసవలే సుందరుడు , లక్ష్మి - సరస్వతి - సూర్యుడు - అగ్ని - బ్రహ్మదేవుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు , ఉపనిషత్తులచే కొనియాడబడువాడు అగు శ్రీ జగన్నాథ స్వామి నాకళ్ళకు కనబడుగాక.
5) రథారూఢో గచ్ఛన్ పథి మిలిత భూదేవపటలైః స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః ।
దయాసిన్ధుర్బన్ధుస్సకలజగతాం సిన్ధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
రథమెక్కి ఊరేగుచూ దారిలో కలసిన బ్రాహ్మణులు చేయు స్తోత్రములలోని ప్రతిపదమును విని దయచూపించు కరుణాసముద్రుడు , సకల జగద్బాంధవుడు అగు శ్రీ జగన్నాథస్వామి లక్ష్మితో కలిసి నాకళ్ళకు కనబడుగాక.
6) పరబ్రహ్మాపీడః కువలయదలోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనన్తశిరసి ।
రసానన్దో రాధాసరసవపురాలిఙ్గనసఖో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
పరబ్రహ్మ స్వరూపుడు , కలువరేకులవలే వికసించిన నేత్రములు కలవాడు , నీలాద్రిపై నివసించువాడు , అనంతుడనే సర్పరాజు శిరస్సుపై కాలుపెట్టినవాడు , ఆనందమయుడు , రాధను కౌగిలించుకొని సుఖించువాడు అగు శ్రీ జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
7) న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ ।
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
నాకు రాజ్యము - బంగారము - భోగము - ఐశ్వర్యము వద్దు. జనులందరూ ఇష్టపడే అందమైన స్త్రీని నేను కోరను. ఎల్లప్పుడు పరమేశ్వరునిచే స్తుతించబడు శ్రీ జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
8) హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే ।
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥
ఓ దేవరాజా! నీవు నిస్సారమైన సంసారమును తొందరగా హరించుము. ఓ యాదవపతీ! నా పాపములరాశిని పోగొట్టుము. దీనుడను , అనాథుడను , బండవలే నిశ్చలంగా పడి ఉన్న నన్ను రక్షించుటకై శ్రీ జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకం సమ్పూర్ణమ్ ॥
. సప్తఋషి ధ్యాన శ్లోకములు :
మన హైందవ ధర్మానికి మూల పురుషులు సప్తఋషులు. నిస్సందేహంగా వారి ప్రార్ధన, స్మరణ, వారి ఆశీస్సులు పొందడం మన కర్తవ్యం. అంతే కాకుండా మన జీవనానికి వారి అనుగ్రహం ఎంతో శ్రేయస్సును, సఫలతనూ, సంపూర్ణతనూ కలుగజేస్తుంది.
సద్గురు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తెలియ చేసిన సప్తఋషి ధ్యాన మంత్రములు ఇక్కడ ఇస్తున్నాను.
మనఃపూర్వకముగా వారిని ప్రార్ధించుకుందాం.
*🌻 కశ్యప ఋషి :
కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
*🌻 అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్|

సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||
ఓం అనసూయా సహిత అత్రయేనమః||
*🌻 భరద్వాజ ఋషి :
జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||
ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
*🌻 విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||
ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
*🌻గౌతమ ఋషి :
యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||
ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
*🌻జమదగ్ని ఋషి :
అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
*🌻వసిష్ఠ ఋషి :
శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||
*సప్తఋషి :
కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
సప్తఋషిభ్యో నమః
🌹 🌹 🌹 🌹 🌹

మాఘ పురాణం - 30 వ అధ్యాయము*
మార్కండేయుని వృత్తాంతము
వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని, యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే. రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠిoచి, గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాముl. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండృల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి" మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి?" అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు," ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును" అని చెప్పెను.
అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ, చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున, వారి వాక్కులసత్యములగునని బాధపడి," దీనికి మార్గాంతరము లేదా? "యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి, "మునిసత్తములారా! మనమందరమునూ, ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని, బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల ఆగమునకు బ్రహ్మ్ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాoతమును, బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెళ్ళబుచ్చి కొoతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు. ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి, "వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని" ధైర్యము చెప్పి పంపి వేసెను.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు ఆతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే
యుండసాగెనుl.
క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై, వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి, జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా, యముడాశ్చర్యపడి, తానే స్వయముగా వచ్చి, మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి, యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి, తన భక్తుని ఆక్రందనను విని, మహారౌద్రాకారముతో, శివలింగమును చీల్చుకొని వచ్చి, త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.l
యముడు చనిపోవుటచే, అష్టదిక్పాలురు, బ్రహ్మాదిదేవతలు వచ్చి ,శివుని అనేక విధముల ప్రార్థించిరి, "కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే, యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి," యమా! నీవు నా భక్తుల దరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన, తన కుమారుడు, దీర్ఘాయుష్మంతుడు అయినందులకు, మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి, యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*ప్రయాణము- అనుకూల సమయాలు*
మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు... ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.
సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.
అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.
విదియ, తదియరోజులల్లోకార్యసిద్ధి, పంచమినాడు శుభం. సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి. దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.
ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది. చవితినాడు ఆపదలు వచ్చే అవకాశం. షష్ఠీనాడు అకాల వైరాలు. అష్టమినాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు. బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది. శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.
ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.
అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.
పౌర్ణమి, అమావాస్యనాడు ప్రయాణాలు
మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమి రోజు పనులు ఏవి కావు.
ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు. వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు. మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు. మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.

1. *మతం యొక్క అసలు రహస్యం ఆచరణరూపంలో నిరూపితమవుతుంది కానీ సిధ్ధాంతాల్లో కాదు. సత్ప్రవర్తన, సదాచరణ - అదే మత సారాంశం.*
3. *భగవంతునిపై విశ్వాసం ఉంచి, ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా శ్రమించే వినయశీలురైన వారే ఏదైనా సాధించగలరు.*
4. *పవిత్రుడిగా మెలుగు. నిష్కపటిగా ఉండు. క్షణమైనా భగవద్విశ్వాసాన్ని కోల్పోకు.*
5. *సత్యనిష్ఠను అవలంబించండి. పన్నెండు సంవత్సరాలు త్రికరణ శుధ్ధిగా సత్యవ్రత పాలన చేసినవారు సంకల్ప సిధ్ధులవుతారు.*
***
2. *మతంలోనూ, మిగతా విషయాలలాగా, మిమ్మల్ని బలహీనులుగా చేసే సమస్త విషయాలను పరిత్యజించండి. వాటిజోలికి కూడా వెళ్ళకండి.*
4. *పవిత్రుడిగా మెలుగు. నిష్కపటిగా ఉండు. క్షణమైనా భగవద్విశ్వాసాన్ని కోల్పోకు.*
5. *సత్యనిష్ఠను అవలంబించండి. పన్నెండు సంవత్సరాలు త్రికరణ శుధ్ధిగా సత్యవ్రత పాలన చేసినవారు సంకల్ప సిధ్ధులవుతారు.*
6. *సమస్త విశ్వం మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ ఏనాటికీ మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు. అతడే శాశ్వతుడు. నీవు ఆయనను ఎంతగా సమీపిస్తే, అంతగా నీమీద మాయా ప్రభావం తగ్గిపోతుంది. ఆయనకు మరింత చేరువైనప్పుడు మాయను జయించగలవు. ఈ దృశ్యమాన ప్రకృతి నీ అధీనమవుతుంది. ఇక నీపై దాని ప్రభావం ఉండదు.*
8. *మనిషి ఎన్నడూ అసత్యం నుంచి బయలుదేరి సత్యాన్ని చేరుకోటంలేదు సుమా! సత్యంనుంచి సత్యంవద్దకే పయనం చేస్తున్నాడు - నిమ్నతర సత్యం నుంచి గురుతర సత్యంకేసి కదులుతున్నాడు! అంతేగాని భ్రాంతినుంచి సత్యానికి పయనించటంలేదు.*
***
- దెయ్యపు కధ (రేపట్నుంచి శృగార సాహిత్యం రోజువరీసీరియల్ )
దేవతలూ, దెయ్యాలూ... రాజులూ, రాక్షసులూ... మంత్రాలూ, మాయలూ... నీతులూ, నవ్వులూ... భలేగుండేవి ఆ కథలు. ఆకాశంలో, పాతాళంలో విహరిస్తూ ఇంద్రధనుస్సులను తాకుతూ, రెక్కల గుర్రాలపై గెంతులేస్తూ, ఏడుతలల నాగుబాములతో తలబడుతూ, ఒంటికంటి రాక్షసులను సంహరిస్తూ, మాంత్రికులను బురిడీ కొట్టిస్తూ మంచిని గెలిపిస్తూ... అబ్బ అవి వినాలేగానీ ఇట్లా చెబితే ఆ ఆనందం అర్థం కాదమ్మా.
అమ్మ ఒడిలో పడుకొని వెచ్చగా పాలుతాగినట్లు, ఎండాకాలంలో వేపమాను కింద చేరి చల్లని గాలిలో ఉయ్యాలలూగినట్లు... పండగరోజున తియ్యని పూర్ణం కర్జికాయను నోట్లో పెట్టుకొని తనివితీరా నమిలినట్లు... నేను చెప్పలేనే.. ఆ ఆనందమే వేరు'' అంది.
దాంతో నాకు కూడా ఆ కథలు ఒక్కసారి వినాలనిపించింది. అమ్మమ్మతో అంతసేపు ఎప్పుడూ గడపలేదు. వెంటనే అమ్మమ్మకు మరింత దగ్గరగా జరిగి "అయితే నాకు కూడా ఒక కథ చెప్పు అమ్మమ్మా...వింటా'' అన్నాను.
"సరే, చెప్తాలే... కానీ ఈ రోజు బాగా పొద్దుపోయింది గదా... రేపు సాయంత్రం ఆ చెత్త టీవీ చూడకుండా బడయిపోగానే నా దగ్గరికి రా'' అంది.
తరువాత రోజు శనివారం. హాఫ్‌డే స్కూల్. పొద్దున్నే లేశా. అమ్మమ్మ ఇంకా లేవలేదు. తొందరగా తయారయి ఏడుకంతా బైటపడ్డా. బళ్లో అందరికీ అమ్మమ్మ గురించి, ఆమె చెప్పబోయే కథల గురించి చెప్పా. అందరూ సోమవారం ఆ కథలన్నీ తమకు కూడా చెప్పాలని ప్రామిస్ చేయించుకున్నారు.
మధ్యాహ్నం బడయిపోగానే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందంతా బంధువులు, నాన్న స్నేహితులు. లోపల ఏడుపులు. ఏమీ అర్థం కాలేదు. బెరుకుబెరుకుగా లోపలికి అడుగుపెట్టాను. వరండాలో అమ్మమ్మ కింద పడుకొని వుంది. కళ్లు మూసుకొని ఉన్నాయి. ముక్కల్లో దూది ఉంది. తలవెనుక దీపం వెలుగుతూ ఉంది.
"రాత్రి నిద్దురలోనే పోయింది. పొద్దున్న ఎంతసేపటికీ లేవకపోతే'' నాన్న ఎవరికో చెబుతూ ఉన్నాడు. అలా... ఆ రోజునుంచి కథ వినాలనే కోరిక నెరవేరనే లేదు. అమ్మను, నాన్నను, ఎదురింటోళ్లను, పక్కింటోళ్లను... ఎందరినో... అడిగీ... అడిగీ.. అలసిపోయా.
అన్నం తినబుద్ధి కాలేదు. నీళ్లు తాగబుద్ధి కాలేదు. ఒక్క కథ... ఒక్క కథ... అంటూ నిద్రలో కూడా కలవరించసాగానట ... అమ్మా, నాన్నా... నన్ను చూసి తల్లడిల్లిపోయారు. ఏవేవో బుక్కులు తెచ్చి చదివి వినిపించసాగారు. ఎవరెవరినో పిలిపించి కథలు చెప్పించసాగారు. కానీ ... వాళ్ల మాటల్లో జీవంలేదు. వాళ్ల ముఖాల్లో కథ చెబుతున్న ఆనందం లేదు. దాంతో... మా అమ్మమ్మ వర్ణించినట్టు కమ్మని అమ్మపాల వంటి అద్భుతమైన కథ వెంటనే ఏదీ నాకు దొరకలేదు. చివరికి ఒకరోజు వర్షంలో బాగా తడవడం వల్ల న్యుమోనియా వచ్చి చనిపోయాను. కథ వినాలనే నా కోరిక మాత్రం తీరలేదు'' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ మంజు ఒళ్లో ఒదిగిపోయింది.
"నీ కోరిక తప్పకుండా తీరుతుంది కావ్యా ... నీకోసం తప్పకుండా మంచి కథని ఎలాగైనా విని, దాన్ని నీకు వినిపించి నీకు విమోచన కల్గిస్తాను. నీ కథని అందరికీ చెబుతా. నీ కథ విన్న వాళ్లు వాళ్ల పిల్లలకు చెప్పడానికైనా కథల్ని నేర్చుకుంటారు ... '' కావ్యని తన గుండెలకు మరింతగా పొదువుకుంటూ చెప్పింది మంజు.
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి) సమాప్తం (8)
ధన్యవాదాలు
--(())-
--(())-
శాకాహారం అంటే ఏమిటి? మాంసాహారం అంటే ఏమిటి? అనే విషయం పై పండితులు చెప్పిన వివరణ పరిశీలిద్దాం.
భగవంతుని ప్రేరణ చేత ఈ భూమి పై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి. మనుష్యులు పశువులు.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.
3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజములు :- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు
ఇక ఇందులో రెండురకాలు ’చర సృష్టి’, ’అచర సృష్టి’…. జరాయుజములు, అండజములు, స్వేదజములను ’చర సృష్టి’ అనియు, ఉద్భిజములనుమాత్రం ’అచర’ సృష్టి అనియు చర అంటే కదిలేవి. మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి. ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు; అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు. ఈ నీచము అనేమాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది.
ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు కాబట్టి వేరేవిధంగా అర్ధం చేసుకోగూడదు.
ఇకపోతే ఉద్భిజములు – విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని పిలిచారు. ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు. అందువల్ల వీటిని ’శాకాహారమని’ పిలిచారు.
చరసృష్టిని ఆహారముకొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు. అలాగే తనకు ఒకచోట బృతిదొరకలేదుగదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టికలిగిన జంతువులలో ఉంటుంది.
కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.
ఇకపోతే ఈ శాకాహార మాంసాహారచర్చ అనేది ’జరాయుజములలో’నే సాధ్యం! మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు. ఈ పాలు అనేవి తమ బిడ్డతాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే మీరు పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు! కాబట్టి పాలు ఖచ్చితంగా శాకాహారమే! అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలుమాత్రమే శాకాహారం – అంటే గడ్డితిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం. కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు ’మాంసాహారం – అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే!. మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.
గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.
కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో – దానిని తినడం మాంసాహారం. గుడ్డు ఖచ్చితంగా మాంసమే! కానీ పాలు శాకాహారం.
ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాకాహారం.
చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి.
పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి.
మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి (లేతవెదురు) మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు.
మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి. మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి.
ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం. కానీ పులి, దుమ్ములగొండి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు.
ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం.
అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు, వీటి ప్రేగులపై అంత భారమూ పడదు.
అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు. ఇదీ అసలు విషయం
--(())--
--(())--
57 అతద్వ్యా వృత్తి రూపేణ వేదాంతైః లక్ష్యతే 2 ద్వయం
అఖండానంద మేకం యత్త ద్బ్రహ్మేత్యవధారయేత్ || 57
= వేరు చేసే విధానం చేత, అతత్=ఇదికాదు అని అసత్ వస్తువుల్ని నిషేధం చేసిన తర్వాత, యత్=ఏదైతే, వేదాంతైః = వేదాంత శాస్త్రం చేత, లక్ష్యతే = సూచింపబడిందో, తత్ = అది, అద్వయం = ద్వయంకానిది, అఖండానందం=నిరంతరం ఆనంద స్వరూపమైంది, ఏకం=ఏకమయింది, బ్రహ్మ=బ్రహ్మం, ఇతి=అని, అవధారయేత్=తెలుసుకోవాలి.
తా|| వేరు చేసే విధానం చేత ఇది కాదు అని అసత్ వస్తువుల్ని నిషేధం చేసిన తర్వాత ఏదైతే వేదాంత శాస్త్రం చేత సూచింపబడిందో అది ద్వయం కానిది, నిరంతరం ఆనంద స్వరూపం అయింది, ఏకమయింది అయిన బ్రహ్మం అని తెలుసుకోవాలి.
వివరణ :- ఏది సత్ వస్తువు? ఏది అసద్వస్తువు? అని విచారణ చేయాలి. అట్లా ఆత్మ జ్ఞానంతో విచారణచేసినప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలన్నీ అసద్వస్తువులే; ఇంద్రియాలు మనస్సు అసద్వస్తువులే, ప్రకృతి అయిన అజ్ఞానం కూడా అసద్వస్తువే అని ఆ విధంగా తెలుస్తాయి. అట్లా ఆత్మ తప్ప చుట్టూ మిగిలి ఉన్న సర్వమూ అసద్వస్తువే అని విచారణ వల్ల తెలుస్తుంది. కాన అసద్వస్తువులను అనగా నశించేవాటిని విడిచిపెట్టి, శాశ్వతమైన జ్ఞాననేత్రాన్ని ఆశ్రయించి ఎవరికి వారు బ్రహ్మంగా జీవించాలి. అప్పుడు సాధకుడు సచ్చిదానంద రూపంగా మారి సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తాడు. అప్పుడు సాధకుడు తనలో ప్రకాశిస్తున్నదే అందరిలోనూ ఉందని, అనంతమైందిగా వ్యాపించి ఉందని, విభజించటానికి వీలుకానిదిగా ఉందని, సూక్ష్మాతిసూక్ష్మమై ఉందని, నిత్యమైందని, ఆ పరబ్రహ్మతత్త్వాన్నే వేదాంత శాస్త్రం చెబుతుందని అదే తానని తెలుసుకొని తృప్తితో జీవిస్తాడు.
ఏది అనాత్మ వస్తువు అనే దానిని ఏ విధంగా నిరసించావు అంటే దేనికి ఆది అంతాలు ఉన్నాయో, ఏది నశిస్తుందో అట్లాంటి అసద్వస్తువు అని నిరసించాము. ఏది అన
న్యవస్తువు అనేది ఎట్లా నిరూపించావు అంటే జాగ్రద్య్వప్న సుషుప్త్యవస్థల్లో కూడా ఏదీ చలించకుండా శాశ్వతంగా ఉందో అది అనన్యవస్తువైన ఆత్మ అని సమర్థించుకొంటూ నిరూపించుకొన్నాము. దాని వల్ల ఉపనిషత్తులు శతకోటి పర్యాయాలు ఉటంకించి చెప్పిన ఆత్మ అనే బ్రహ్మాన్ని స్వీకరించి తృప్తిని పొందాము. దాని వల్ల ప్రకృతి ప్రకాశానికి, సర్వవస్తు జీవరాశికి జీవాధారభూతమైంది ఆ బ్రహ్మమే అని, అదే పరబ్రహ్మ స్వరూపమై ఉంది అని సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకొని, సచ్చిదానందంతో జీవించటం జరిగింది. అంతేకాని అది అంతా ఊహాజనితమైంది కాదు. అది అంతా భ్రమ ప్రమాదాలకు లోనయ్యేది కాదు.
సర్వవ్యాపకుడైన బ్రహ్మను ఎవ్వరూ సూటిగా వెళ్లి చేరలేరు. ఎవ్వరూ భగవంతుని చూడలేరు. అట్లా చూశానని చెబుతున్నాడంటే ఆతనికి బ్రహ్మమంటే ఏమిటో తెలియదనిగాని, లేదా చూడకుండానే చూశానని చెబుతున్నాడని కాని అనుకోవలసి వస్తుందని స్వామి చిన్మయానందగారు వివరించారు. కావున సాధకుడు ఆత్మ అనే భగవంతుని ప్రేమ బంధంతో సర్వజీవరాసులతో కూడి-తామరాకుమీద నీటి బొట్టులా-జీవించగలగాలి. బుద్ధిమంతులైనవారు ధ్యాన సాధనలో తమ్ముతాము తెలుసుకోవటం వల్ల ఈ విషయం అంతా తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది.
*వైశాఖ పురాణం*
*1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస*
llనారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |l
llదేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను.
మహర్షులారా!
వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
నారదుడును రాజర్షీ! అంబరీషా!
వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
అంబరీష మహారాజా!
సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
🙏 *వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.*
సౌజన్యం: *TVBC*
***
మన స్ధూల సూక్ష్మ కారణ శరీరాలను 5 కోశాలుగా విభజించారు. అవే 1. అన్నమయ కోశం 2. ప్రాణమయ కోశం 3. మనోమయ కోశం 4. విజ్ఞానమయ కోశం 5. ఆనందమయ కోశం.
ఆత్మ యదార్ధంగా శుద్ధమైనది; అక్రియమైనది, శాశ్వతమైనది, ఆనందమయమైనది. అట్టి ఆత్మనే నేను. మరి శుద్ధమైన నేను కల్మషమైన వానిగా ఎందుకు అనిపిస్తున్నాను? అక్రియమైన నేను ఎందుకు పనులు చేస్తున్నట్లుగా ఉన్నాను? శాశ్వతమైన నేను ఎందుకు అనిత్యమైన వాడినని భావిస్తున్నాను? ఆనంద స్వరూపమైన నేను ఎందుకు దు:ఖపూరితుడుగా భావించబడుతున్నాను? ఎందుకిలా జరుగుతున్నది? ఇదంతా అనాత్మ సంబంధంవల్లనే. కల్మషమైన, క్రియాత్మకమైన, అనిత్యమైన, దు:ఖపూరితమైన అనాత్మ తాదాత్మ్యం వల్లనే; దేహ తాదాత్మ్యం వల్లనే; -పంచకోశ తాదాత్మ్యం వల్లనే - దీనినే ఉపమాన సహితంగా తెలియజేస్తున్నారు.
శుద్ధమైన స్వచ్ఛమైన స్పటికాన్ని నీలంరంగు గల వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం నీలం రంగులో కనిపిస్తుంది. దానిని అక్కడ నుండి తీసి ఎరుపు వస్త్రంపై ఉంచితే ఆ స్పటికం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంతకీ ఈ రంగులు వస్త్రాలకు చెందినవే గాని స్పటికానికి చెందినవి కావు. స్పటికం నీలం రంగులో కనిపించినప్పుడు కూడా, అది స్వచ్ఛమైనదే. ఎరుపు రంగులో కనిపించినప్పుడు కూడా అది రంగు లేనిదే. అలాగే పంచకోశాల తాదాత్మ్యం వల్లనే శుద్ధమైన ఆత్మ పంచాకోశ లక్షణాలతో ఉన్నట్లే కనిపిస్తుంది. పుట్టుకగాని, పెరుగుదలగాని, చావుగాని లేని ఆత్మ పుట్టుక, పెరుగుదల, చావు ఉన్న దేహంతో తాదాత్మ్యం వల్ల అలా అనిపిస్తున్నది. దు:ఖం లేని ఆత్మ దు:ఖ స్వరూపమైన మనస్సుతో కూడి దు:ఖమయంగా అనిపిస్తుంది. ఇలాగే పంచ కోశాల ధర్మాలన్నీ ఆత్మపై ఆరోపించబడుతున్నాయి. భ్రాంతిని కలిగించి శాంతిని దూరం చేస్తున్నాయి. మరేం చేయాలి? పంచ కోశాలను దూరం చేసి చూసినప్పుడు ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది. అట్టి స్వచ్ఛమైన ఆత్మనే నేను గాని ఈ పంచకోశాలు నేను గాను.
( i ) కొంత కాలం మాత్రం జీవించి, అనేక మార్పులు చెంది, చివరకు నశించి పోయే ఈ అన్నమయ కోశం (జడ శరీరం) నేనుకాదు. ఇది నా కన్నా వేరుగా ఉన్నది. నేను ఆత్మను
( ii ) ఆత్మనైన నా తేజంతో-చైతన్యంతో కదిలే ప్రాణమయ కోశం (ప్రాణాలు) నేనుకాదు. అవి నా కన్నా వేరైనవి. నేను శుద్ధ చైతన్యమైన ఆత్మను.
( iii ) అన్ని అవస్ధలలోను కనిపించక, దృశ్యంలా కనిపిస్తూ, మార్పులు చెందుతూ సుఖదు:ఖాలు అనుభవించే మనోమయ కోశం (మనస్సు) నేనుకాదు. నేను ఆత్మను.
( iv ) ఏవేవో కోరికలతో ఆలోచనలు చేస్తూ, ద్వంద్వాల మధ్య చెదిరిపోతూ, సర్వజ్ఞత్వం లోపించిన విజ్ఞానమయ కోశం (బుద్ధి) నేనుకాదు. నేను ఆ బుద్ధికి వెనుకనున్న ఆత్మను.
( v ) అజ్ఞానంలో ఉండి, ఏ విషయ జ్ఞానమూ లేని స్ధితిలో, దు:ఖరహిత స్ధితిలో ఉండే ఆనందమయ కోశం నేనుకాదు. నేను ఆ కోశానికి వెనుక నున్న ఆత్మను.

చిన్న కధ .
అనగనగా......
ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు.
దంపతెలివి తులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి.
అతను అక్కడ కూర్చొని నదిలోకి చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు.
అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది.
వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు.
ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది.
సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు.
ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు.
ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది. ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు.
గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే
నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.
ఇక చేసేదేమీలేక, తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ రత్నాల హారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు చాటింపించారు.
చాటింపును విన్న సోము ఆలోచించాడు:
ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి, రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది-
ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు!
సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది. హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు.
సంతోషించిన రాజు సోముకు తన కూతురుని ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.
--((**))--
🪔మరణంలో స్మరణ 🪔
పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.
ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు.
వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,
దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.
ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.
ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.
ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.
ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.
ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!
రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు. రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:
“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."
మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.
మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”
పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:
“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”
తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు,
“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”
అని చాటింపు వేశాడు.
ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు.
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.
మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.
తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.
ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”
బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే:
మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..
మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం !
🪔🪔🪔🪔🪔🪔

పండితుని తెలివి
చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు. ఆ పండితుడు రాజుకు ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.
అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.
రాజు గారు “ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం!” అన్నాడు. కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగాచెప్పుకోవచ్చు" అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేరుస్తాను. చెప్పు!" అన్నాడు రాజుగారు.
“మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు - .... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.
రాజు “సరే !” అని ఆ పని మంత్రికి పురమాయించాడు.
ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు. తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..
‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..”
“అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. “
“ఎందుచేత..?” అన్నాడు రాజుగారు.
“లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!”
“ఎందుకు..?” ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు.
“ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.”
“అలాగా.. ఏమిటా పద్యం..?”
“ఇదుగో.. వినండి మహారాజా !”
“శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుం జర తుహినాంశు సంఖ్యకు ని జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్”
పద్యం విన్న మహారాజు “దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..”
“అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..”
“సరే… సరే.. విప్పి చెప్పు..”
“ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..”
ఈ పద్యంలో…
శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .(మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.
గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)
శశి, చంద్ర, తుహినాంశు -1
(చంద్రుడొకడే భూమికి )
షట్కము - 6
రంధ్ర - 9
(నవరంధ్రాలు)
నగ, గిరి, భూధర - 7
అగ్ని - 3
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి - 4
వేద -4
(చతుర్వేదములు)
తర్క - 6
( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
పద్మజాస్య - 4
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
కుంజర - 8
(అష్ట దిగ్గజములు)
ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6 1 5
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
5 9 0 7 3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0 4 4 7
తర్క పయోనిధి పద్మజాస్య కుం
6 4 4
జర తుహినాంశు సంఖ్యకు ని
8 1
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
అంకెలు లెక్కించేటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..
అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
1,84,46,74,40,73,70,95,51,615
ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615.
ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.
పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి…!
వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…
నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు, ధారణ శక్తికి సంబంధించినదే !
ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘనాపాటి కాలేరు.
అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .
అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరూ కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.
ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితుణ్ణే అడుగుదాము. అని ఆ పండితుని పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు.
ఆ పండితుడు "రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా ఆవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
Comments
Post a Comment