॥పల్లవి॥పరగీనదివో గద్దెపై సింహము వాఁడె
పరమైన యౌభళ నారసింహము

॥చ1॥తెల్లని మేని సింహము దేవ సింహము
మెల్లని చిరునవ్వుల మేటిసింహము
చల్లేటియూరుపులతో జయసింహము వాఁడె
బల్లిదుఁడై వెలసే యౌభళ నారసింహము

॥చ2॥నిలుచున్నసింహము నిత్యసింహము
అలరుఁ గొండలమీఁది యాదిసింహము
వెలుపలి కడపపై వీరసింహము
పలుకుఁ బంతము (ల) యౌభళనారసింహము

॥చ3॥పుట్టుజడలసింహము పూర్ణసింహము
ఱట్టడి యార్పుల యాఱడిసింహము
జట్టి గొన్న దాసులకు శాంత సింహము
పట్టపు శ్రీ వేంకటయౌభళ నారసింహము



 కవిత్వం - శుభము లే 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ  

మగువ మనసు వెన్న ముద్దగా మారున్   
తెగువ వలదు  కన్నె  మంచిగా కోరున్    
చిగురు పొగరు ఉన్న పంచు వయ్సస్సున్ 
వగరు చూపులు  ఎన్ని ఉన్న సర్దు చుండున్      

ఆభరణమే మాకు ఓర్పు అని చెప్పి బత్కున్  
నిబ్బరమే , నమ్మకమ్ము  అని తెల్పి బత్కున్   
శోభనమే  జీవితమ్ము  అని  తెల్పి బత్కున్       
శుభము లే  ప్రేమసొమ్ము అని  పల్కి బత్కున్  

మహిళ పై సహ సహకారమున్ను చూపి బత్కున్ 
మహిత పై  వినయపు హాసమున్ను  తెల్పి బత్కున్ 
సహన మే  కలిగియు  వేదమున్ను  తెల్పి బత్కున్ 
గృహము యే  పదిలపు భావమున్ను తెల్పి బత్కున్ 
  
మనసు పై సరియగు  వాదమున్ను  తెల్పి బత్కున్ 
మనువు పై శుభమగు  ఆశ చూపి  తెల్పి బత్కున్ 
తనువు   పై తనువును ఉంచి  మాయ తెల్పి బత్కున్ 
చినుకు  పై  అభినయ మంత చూపి తెల్పి బత్కున్ 

--(())--




భ   ర   భ  ర  న   లగ --- వంశప్రతిపతిత -10  
UII  UIU  UII  UIU III  IU 

తప్పును తప్పుగా ఒప్పక  తప్పులే మరొకని నీ 
తప్పు చెయి౦చే బుద్ధియు తప్పియే మనిషిలొ వెం
టే పలు మాటలే పల్కియు టెప్పుడూ మనసును మా 
ర్చే పిలుపే ఇదీ మూలము రిప్పుడే వలుపు ఇదే  

అప్పులు చేసియే గొప్పలు చెప్పగా తలపులకే 
తిప్పలే తెచ్చియు ఇప్పటికి ఒప్పకే మనసు మా 
ర్చే పద పూజ యంతా పలువిధమ్ములే  వలపు గా  
తప్పును యొప్పకా చెప్పక తూచియే నలుగుటయే 

తప్పెననే మరే ఈ కలువ చెప్పినా  మనసు గు 
ర్తింప క తప్పునే చేయుము చెప్పుటే మగడు చెసే 
తప్పుడు వేషమే త్రాగుడు వేటయే మరక లు న 
న్నిప్పుడు తప్పుచేసేయ్యము పల్కులే నరములుగా    
       
గుప్పిట ఉన్నదే తెల్వక చెప్పువారి పలుకులే 
గొప్పగ నమ్ముటే ఇప్పుడు ఉన్నవారి బతుకులే 
తప్పదు తప్పులే చేసియు బత్కుటే వరముగా 
ఒప్పియు చెప్పుచున్నా ఇది సత్యమే బతుకుగా 

--(())--
   

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు