chandassu

23-05-2020 
* మత్తేభవిక్రీడితము
* మధురవాణి 
* మేఘవిస్ఫూర్జిత 
విహారిణీ 
*.అమ్మలుగన్నఅమ్మ 



           స     భ    ర     న    మ   య    ల గ మత్తేభవిక్రీడితము - 13  .
           iiU  UII   UIU   III  UUU  IUU  IU 

          నేటి కవిత్వం :  మత్తేభవిక్రీడితము
          మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 



Juily Gite | Paintings by Juily Gite | Juily Gite Painting - SuchitrraArts.com

* మధురవాణి 

భర్తతో పలికిన పలుకు 

శృంగార రాయుడవై ఏలుకో - శ్రీ  నాధా    
అందాలు సొంతములై చేసుకో -   శ్రీ  నాధా   
స్నేహలు శాంతములై చూసుకో - శ్రీ  నాధా  
మందార మాధురినై  ఉన్నానే - శ్రీ  నాధా 

వైద్యునితో పలికిన పలుకు
పట్టి చూడరా నాడి  - గుండె  వేగమెంతో 
కట్టి చూడరా కట్టు   - దెబ్బ  రక్తమెంతో  
మందు వాడరా యోగి  -  డబ్బు  రోగ  మెంతో       
జబ్బు పోవురా  రోగి -  చింత మార్పు ఎంతో 

ప్రియుడితో పలికిన పలుకు 

అతడెంతో గడసరి   -   మనసంతా ఊపిరి 
మనసెంతో మగసిరి  -  మనువంతా  ఊపిరి 
వలపంతా పెడసరి  -  వయసంతా ఊపిరి
తనువంతా తడిపొడి -  తెలుపంతా ఊపిరి  

అనురాగ దీపాలు వెలిగించి నానే 
అపురూప శిల్పాలు తొలగించి నానే 
కనుపాప  కాంతుల కనువిందు నేనే 
అపురూప నేర్పుల  అణువంత నేనే     
     
చెప్పింది ఊకొట్టు  - చెప్పకపోతే ఒట్టు 
నమ్మింది ఊకొట్టు  - నమ్మకపోతే ఒట్టు 
నవ్వింది  ఊకొట్టు  - నవ్వకపోతే    ఒట్టు 
ఏడ్చింది  ఊకొట్టు  - ఏడవకపోతే   ఒట్టు     

సోకిన తరుణం - మానసోల్లాసం 
చూసిన సమయం - ఆనందోల్లాసం  
పూచిన  తరుణం - పుష్పోల్లాసం   
వాచిన  సమయం - బ్రమరోల్లాసం 

గిలిగింత పెట్టింది - నవ్వు వచ్చింది 
అలకంత చెప్పింది - మబ్బు మెచ్చింది
మనసంత విప్పింది - డబ్బు గుంజింది 
వయసెంత తెల్పింది - కళ్ళు కమ్మింది  

తియ్యటి మాటలతోటి  - తీరునటయ్యా  ఆకలి   
కమ్మని  పాటల  తోటి   - మారునటయ్యా  ఆకలి 
ఇప్పటి  ఆటల తోటి    -  బ్రాంతి నటయ్యా ఆకలి 
నమ్మెటి గీతము తోటి  -  శాంతి నటయ్యా  ఆకలి 

--(())--



Radha Krishna in a Secret Rendezvous on a Rainy Night - Reprints of Miniature Paintings (Reprint on Paper - Unframed)

య  మ న  స   ర   ర  గ - మేఘవిస్ఫూర్జిత -12  
IUU  UUU  III  IIU  UIU  UIU U 

నేటి కవిత్వం - మేఘవిస్ఫూర్జిత
రచయత:మాలాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--
        


నేటి కవిత్వం - విహారిణీ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

విరజాజి వెన్నెలంత మనుష్యులకు నేను అన్నదే సేవచేసే 
చిరుహాస మంత సందర్భ భావాలను తెల్పుచుండె యవ్వారమంతా  
కరుణా మయంగ సంతోషపర్చే సమయోచనంగ  సంతృప్తి కల్గిం
చు ఋణానుభందమే హాయిగొల్పే వికసించి మాయతోల్చేందు కేలే 

కిరణాల శక్తి మొహాన్ని చేధించు సకాల ధర్మ తత్వాన్ని పంచే 
చిరునామ బత్కి బత్కించు మార్గం సహనాన్ని పొంది ఉండేందు కిల్లే 
తరుణాన్ని సద్విని య్యోగ పర్చేందుకు కాల సత్య ధర్మాన్ని తెల్పే    
పరువాన్ని యుక్తి మార్గమ్ము వైపుంచి విశాల విస్వభావాన్ని పంచే 

అనురాగ వాణి - యానంద రాగ - స్వనమందు మ్రోఁగె - జల్లంగ రేయిన్ 
నిను నో విహారి-ణీ నేను జూతున్ - మనదౌను హాయి - మాయామయమ్మై 
కనుమాయ చేసి - ఆనంద పర్చు - విధి యాట  అంత - సౌఖ్యంబు రేయిన్
అణువంత పంచి - ఆహ్లాద పర్చి - నిది వేట కొర్కు - సంతోష రేయిన్   

విధిపత్ని నన్ను - ప్రేమమ్ముతోడన్ - జదివించు తల్లి - చైతన్యరూపీ 
హృదయమ్ములోన - నృత్యమ్ము లాడన్ సదయాంతరంగ - సత్యార్థి రావా 
మది వేదనంత - భారమ్ము కాగా - మదిచూడు తండ్రి - వేదమ్ము చెప్పే 
నిధిచుట్టు పెర్గు ఆశే జపమ్మూ - విధియాడు నాట్య భావాన్ని తెల్పే   

ఇలపైన నాకు - లెన్నెన్నొ రంగుల్ - లలితమ్ముగాను - లాస్యమ్ము లాడెన్ 
చలిగాలిలోన - సంధ్యల్ వెలింగెన్  - మలమీద మంచు - మాణిక్య మయ్యెన్ 

విహారిణీ - స/జ/త/గగ IIUI UI - UUI UU గు/బు - గు/బు 
11 త్రిష్టుప్పు 300 

వాగ్వల్లభలో పేర్కొనబడిన ఈ "విహారిణీ" వృత్తపు లయ ఇంచుమించు ఇంద్రవజ్రలాటిది. ఇంద్రవజ్రపు లయ - 5,4 - 5,4 మాత్రలయితే విహారిణిలో 5,3 - 5.4 మాత్రలు ఉన్నాయి. క్రొత్త గణముల ప్రకారము ఇది గురు/బుధ - గురు/బుధ గణముల అమరిక గలిగినది. విహారిణీ వృత్తమునకు నా ఉదాహరణములు - 

--(())--


Bijay Parida - Krishna & Yashodha 5 (Geru) - The Krishna Lila tells the story of Krishna, the eighth avatar of Lord Vishnu. Filled endearing, inspiring and terrifying scenes, it narrates the antics of Krishna as a baby, his role as the protector of the inhabitants of Vrindavan, and his adventures as a youth. Parida captures the beauty of the Ras Lila amid celebratory scenes of Krishna dancing with the <i>gopis</i>.

నేటి కవిత్వం - అమ్మలుగన్నఅమ్మ 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
UII  UIU  IUI   IUI IUI 

అమ్మలుగన్న ముగ్గురమ్మల మూలపు అమ్మ
కమ్మని మాటలే అహర్నిశమే  కళ లమ్మ 
నమ్మకమే నిరంతరం నిలిపే మమతమ్మ 
కమ్ముకొనే విషాద సంఘట మాపిన అమ్మ   

ధర్మము తెల్పి నిత్యశోభకు మూలము అమ్మ
అర్ధమువచ్చు సత్యమార్గము చూపునుఅమ్మ
కర్మ ను బట్టి ఓర్పు నేర్పును చూపిన అమ్మ
మర్మము యేలఉన్న పాపము చేయని అమ్మ 

ఆకలి తీర్చి సంతసమ్మును పంచును అమ్మ
సౌఖ్యము చూపి విద్య నేర్పిన దేవత అమ్మ
అక్కసు చూపకే నిరీక్షణతో మమతమ్మ  
మక్కువచూపియే అనేకము చెప్పిన అమ్మ  

కష్టము తెల్పకే. వివేకము చూపును అమ్మ
ఇష్టము గా పనే సకాల ము చేయును అమ్మ
నష్టము అన్నదే ఎకాలము చెప్పదు అమ్మ 
సృష్టికి కారణం  ప్రెమమ్మును చూపెది అమ్మ 

బిడ్డకు  సేవ యుక్తి ముక్తికి మూలము అమ్మ
నవ్వుల మాటలే సకాల ము తెల్పును అమ్మ
సవ్వడి చేయకే సుఖాలను పంచును అమ్మ
తల్లి కి తండ్రికీ సహాయము చేయును అమ్మ

--(())--


Lakshmi is considered another aspect of the same supreme goddess principle in the Shaktism tradition of Hinduism #Ashta Lakshmi hindu art #Ashta Lakshmi wealth #Ashta Lakshmi goddesses #Ashta Lakshmi haram #Ashta Lakshmi tanjore painting  #Ashta Lakshmi vaddanam #Ashta Lakshmi bangle #Ashta Lakshmi decoration #Ashta Lakshmi necklace

న   న  న  న  న  స .... అతివినయ ...10    
III  III  III  III  III  IIU  
నేటి కవిత్వం - అతివినయం 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

వినగ వినగ పలుకు వినయపు మది మలుపే 
తినగ తినగ  బలుపు అహముతొ  మది కులుకే 
అనగ అనగ బడలి కొదలి  బరువు తెలికే 
మునగ మునగ  బతుకు వలపు కలల మెరుపే 

కనులు కలయిక కధలు కధలుగ కులుకుటే 
చనువు పెరిగియు బతుకు సుఖములు నలుగుటే 
తనువు తనువు  తపనలు తడిపొడి చిగురులే 
అణువు అణువు కలయిక జననము పెరుగుటే  
  
చినుకు చినుకుల  ఉడుకు పరుగులు సహజమే 
కునుకు అనక గిలక  గబ గబ కదులుటయే 
వణుకు వదలిన సెగలు వెనుక చిలుకుటయే 
మిణుకు మిణుకు వెలుతురుయు  వలపులకే   

మనసు మనసు మరుగుటయు జపము తపములకే   
మనము మనము అనుటయు బతుకుల చిగురుకే 
వినను వినను అనుట బతుకులు చితుకుటకే 
అనను కనను వినను అనుట మరణమునకే 

--(())_-


UII UUI  III IUU  UUI  UII



నేటి కవిత్వము - కరోనా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కమ్మెను  పొంగింది మదిలొ కరోనా ప్రాణాలు గుప్పెట
తుమ్ముల జళ్లూ అణుకువ భయంగా  ప్రాణాలు  తీసెను
ఏమని చెప్పేదని మనిషి  భయంతో  ఇంటింట ఉండగ   
లేమని ఉన్నంత వరకు భయంగా  ప్రాణాలు రక్షణ

వేచితి ఇంట్లో తడవ ముడవంగా  చేసేది లేకయు 
దోచితి మా నవ్వు బలము భయంగా ప్రేమంత నిద్రగ
కాచితి మాయా జలముగ పరంగా మాకంత భాధయె   
యాచితి  కన్నీరు  వరస పరంగా  మాకేను వచ్చేను

కళ్లల రోగాల తడియు భయంగా  ఏమేమి చెప్పక
ఇళ్లలొ  ఉన్నా కలలను  భయంగా  వచ్చేను చెప్పక
మూల్గెను ఆశా వలలను భయంగా  జీవించు టందుకె
వేళల గాలాల మడియు భయంగా వెన్నంటి ఉండెను

సంతత పోఈ ఇకను భయమేనా అన్కు౦టె తప్పుయె 
యాతన చేరీ  ఇకను  భయమేనా  అన్కు౦టె ఒప్పయె
చింతల తోటే ఇకను  భయ మేనా అన్కు౦టె ముప్పుయె
విత్తము కొర్కే ఒకటిగ  భయంగా  అన్కు౦టె తప్పయె   

ఒక్కరు దేవా మనసు మరిచావా  మమ్మేల చూడవు 
ఒక్కరు ప్రేమా అనియు విడిచావా  ప్రేమంత మర్చెను
ఒక్కరు దేహన్ని ఇక విడువాలా  అంద ర్తొ  చెప్పఁగ 
ఒక్కరు మృత్యు0జయముగ పోరాడి  ప్త్రాణాల్తొ వచ్చెను 

--(())--



krishna art #krishna - krishna painting | krishna | krishna radha painting | krishna images | krishna quotes | krishna wallpapers | krishna drawing | krishna art
24-05-2020 
నేటి పద్య సౌరభము - లేఖలు 

ఉ ::  లేఖలు మాయ చేయునులె కారణ మేదియు లేదులే మన  
        స్సు ఖగుడేలె కాల వశ బట్టి సహాయము చేయులే మన 
        స్సు ఖచరం సమస్య లసు తక్షణమే చిరు నవ్వులా  మన
        స్సు  ఖనిగా సుధా సరసమై సుఖమిచ్చియు సంబరాలులే 

 ఉ :: కాకము కాదులే మనకు వేదన సంతస భావమే  ఇక 
        స్వీకరమే వయస్సు  ముసుగే జత కోరిక సంబరమ్ములే 
        ఏకము అవ్వుటే కలియు వాంఛను తీర్చుట సాహసమ్ముగా 
        మక్కువ చూపుటే మనము చేయునదే ఇది తత్వమే ఇదీ 

ఉ :: తేకువ చూపుటే యువత లక్షణమే మది వేటలో  మనో 
        వాక్కులుగా సమన్వయ ముగా సహచర్యము గా విశేష 
        మ్మే కళ  చూపగా సమ మమేకము సఖ్యతగా వివేకమే 
        ఎక్కువ చూపుటే వినయ ధర్మము వేదము సాక్షియేకదా 
     
                                      __(())__



 
గేయము
మాత్రా బద్ధము (15-17)
*
సంస్కృతం సంస్కృతం సంస్కృతం
సంస్కరింపఁబడినదౌ  సంస్కృతం
*
దేవవాణి యైన భాష సంస్కృతం
దివ్యమైన బాస  యౌను సంస్కృతం
*
తరతరాలు పల్కినట్టి సంస్కృతం
యుగయుగాలు నిల్చినట్టి సంస్కృతం
*
వేదమందు నున్న భాష సంస్కృతం
నాదయుక్తమైన భాష సంస్కృతం
*
అభవుఁడిచ్చినట్టి భాష సంస్కృతం
సుభగమౌను చెవికి వినఁగ సంస్కృతం
*
ఆదికావ్యమందు నలరు సంస్కృతం
వేదవ్యాసమునియు వాడె సంస్కృతం
*
కాలిదాస కృతుల నొప్పె సంస్కృతం
మేలు గూర్చు నెన్నొ విధుల సంస్కృతం
*
గీత లోన నున్న భాష సంస్కృతం
వ్రాత గూడ మార్చఁగలుగు సంస్కృతం
*
పాణినీయమున్న భాష సంస్కృతం
వాణి గూడ మెచ్చు భాష సంస్కృతం
*
మార్పు లేక వెలుఁగుచుండు సంస్కృతం
ఓర్పు మీర నేర్వ శుభము సంస్కృతం
*
శాస్త్రపాటవమ్ము నిచ్చు సంస్కృతం
అస్త్రజ్ఞానమదియుఁ గూర్చు సంస్కృతం
*
మంత్రతంత్ర నుతుల నొప్పు సంస్కృతం
యంత్ర విధులఁ గూడఁ దెలుపు సంస్కృతం
*
ఋషులు మునులు పల్కినట్టి సంస్కృతం
కృషిని జనులు నేర్వఁదగును సంస్కృతం
*
భాషలందు మేటి భాష సంస్కృతం
శ్వాసయైన బాగు గాదె సంస్కృతం
*
విశ్వవ్యాప్తమైన భాష సంస్కృతం
విశ్వహితము కోరు భాష సంస్కృతం
*
అక్షరాల రమ్యమైన సంస్కృతం
అక్షరముగ నిలుచుఁగాత సంస్కృతం
*


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు