There was a problem while sharing this post. Please try again later. why ?
U-III U-III - U-III UIU నిశిపాల
నేటి కవిత్వం : నిశిపాల
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధర్మములు ఆచరణ కష్టములు రావులే
కర్మలను చేయుటయు నష్టములు రావులే
మర్మమును తెల్పుటయు చేష్టతలు కావులే
శర్మలను గొరవము చూపుటయు ధర్మమే
సత్వరము సత్యమునె చెప్పవలె దీక్షగా
కత్సతను చూపకయు తెల్పవలె లాలినీ
సత్యమును తెల్పుటయు భక్తి వలె భామినీ
నిత్యమును సేవితగ ఉండుటయె కామినీ
విస్మయము చూపకయె దక్షతను చూపవే
ఆస్మయని తక్షణము భాదలను పెట్టకే
ప్రస్తుతము పూజలకె పర్మితము తప్పదే
యశస్సును పెంచుటయు బుధితుని మార్గమే
లౌక్యముగ పల్కులలొ తెల్పుటయు కాంతిగా
సౌఖ్యముగ పంచుటలొ సేవితగ ధర్మమే
ముఖ్యముగ మొనమును వీడుటయు కాలమే
సఖ్యతగ బత్కులను చూచుటయె సత్యమే
--(())--
U-I-U U-I-U - U-I-U UIU స్రగ్విణి
నేటి కవిత్వం : స్రగ్విణి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆరునూరైన చెప్పీ చెపంగానె చే
స్తారు, ఈనాడు ఎం పల్కకా చేసి చె
ప్తారు, కష్టాన్ని నమ్మాలి యెల్లప్పుడూ
చారుశీలా మనోమాల భార్యామనీ
నీతి చెప్పీ సుసౌఖ్యముగా ప్రేమమున్
ముత్యమై వెల్గులే పిల్ల లందర్కి సే
వత్వమే నిత్య సత్యామృతమ్మే కదా
శ్వేతహంసా సత్యవాణి సాక్షిప్రియా
సమ్మతమ్మే సహాయమ్ముగా జీవితం
నమ్మకమ్మే వివాహమ్ము కారుణ్యమే
చిమ్మ చీకట్లు వెంటాడినా దేవతా
ప్రేమలీలా మనోవాంఛ విద్యా నిధీ
పత్యమే చేసెనే సంత సౌభాగ్యగా
తత్వమే ఆలయం ప్రేమయే సత్వరం
నిత్య నిర్మాతగా రాగ రమ్యాత్మగా
సత్య భావాత్మగా సాద్వి లీలాత్మయే
-(())--
III-U III-U - III-U UIU కుసుమమాలికా
నేటి కవిత్వం - కుసుమమాలిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మగువ మానసపు మాయ బలమే జీవితం
తెగువ చూవుటయు అందరిని ఓదార్చుటే
ఎగువ దిగ్గువను భేదమును చూపించదే
తగువిధానమును తెల్పియు మనోవాంఛిష్టిగా
తరుణి సేవలుగ సాహసము చేసేనులే
తరువువల్లె ఎగసీ మనసునె దోచేనులే
పరువుగా బతికి దానమును చేసేనులే
విరుపు లేకయు మనస్సు కళ పంచేనులే
మనసు పంచుటయు దేహమును అర్పించుటే
వినతి భావమును తెల్పుటయు శాంతమ్ములే
ప్రణతి తెల్పియును ఆశయము తీర్చునులే
రణముసల్పియును సౌఖ్యమును యిచ్చునులే
మగణి కోర్కెలను తీర్చుటయు సానిత్యమే
తగు విధానమును తెల్పుటయు కారుణ్యమే
చిగురు పోరులను సల్పుటయు లావణ్యమే
పొగరు చూపియు మనో ఫలము తీర్చేందుకే
--(())--
ప్రాంజలి ప్రభ : శివోహం
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వలువే గజచర్మం ధరించాడమ్మా
చలనం లేని కైలాస వాసుడమ్మా
వలపే లేని వృషభ వాహుండమ్మా
ఏల నాగభూషన్నీ ప్రేమించావమ్మా
మురిపించే మన్మధుణ్ణి కాల్చాడమ్మా
మరభూమి భూతగణ నాధుడమ్మా
కురులలో గంగనే భరించాడమ్మా
చిరు హాసా చంద్రుడినే మోశాడమ్మా
విషాన్నే మ్రింగి కంఠంలో ఉంచాడమ్మా
వేషాల్నే వేసి నిన్ను నమ్మించాడమ్మా
పాషండుడై మోటుగా ప్రేమించాడమ్మా
తుషార బిందువై వెంబడించాడమ్మా
పతియే దైవమని భావించావమ్మా
అతిగా ప్రేమించి కొలిచావమ్మా
మతిని నమ్మి ప్రార్ధించావు గదమ్మా
ప్రతి కళను తీర్చే దేవతవమ్మా
సోగకన్నుల శివుణ్ణి నమ్మావమ్మా
జగమంతా కాపాడుతూ ఉన్నావమ్మా
పార్వతీ పరమేశ్వరులైనా రమ్మా
జగమేలే వారికి వందన మమ్మా
==((***))--
మ భ న న భ భ గ - శుభిక -12
UUU UII III III UII UIIU
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
నేటి కవిత్వం - శుభిక
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమన్నా కాదనులె మన మనసె ఒక్కటిగా చరితా
ర్థం,మౌనాన్నే అనుకరణ సమర పోషణ, ఎందుకులే
సమ్మోహం ఉన్నదియు, వినయ యశమే మన బత్కులలో
ప్రేమించే శక్తియు మనకు, కలలు తీర్చుకొనే వయసే
చామంతీ నీ పలుకు కులుకు రుచి వద్దనినా ఇక పొ
మ్మూ మానంతో చెడుగుడు తమకము ఎందుకు వద్దునులే
మామ్మానందా సరిగమల తపము చూపియు సేవలుగా
చుమ్మా చుమ్మా అనియు మది తొలచి ఆకలి తీర్చుటయే
కామమ్మే ఈ వయసుకు బలము కదా ఇక ఏకముయే
ప్రేమమ్మే ఈ మనసుకు సుఖము పదారు కళే ఇదియే
తన్మాయే ఈ సొగసుకు నువులతి చేయకు శీఘ్రముగా
చుమ్మా చుమ్మా టలతొ ఇక తరచు ఆశలు తీర్చుటయే
--(())--
నేటి కవిత్వం - ఎవరు
వేదోద్ధారణ సేసినదెవరు?
విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు?
నాట్యానందము నొందెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా .........
ఆధారంబయి యుండెడిదెవరు?
అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు?
ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా ...................
అంతా తానయి నిండెడిదెవరు ?
ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ?
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా ..................
కాంతిన్ గుండెల నింపెడిదెవరు?
కంటిన్ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్ గూర్చొని పల్కెడిదెవరు?
స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా .....................
బోధన్ జేయుచుఁ దెల్పెడిదెవరు?
ముక్తన్ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు?
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా ...............
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు?
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు?
నీవే నేనని యన్నది యెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా ........... ...
--(())--
Comments
Post a Comment