పద్యాలు
తే ll గీ ll బ్రతుకులో సవాళ్ళ పటిమా పాటవములు
బరగఁ జేయు నిరతిఁ* బరంపరల ధాటి,
వాటి నదిలించి నిలఁ బడు పాటి యందు,
మనిషి కెంత ప్రత్యయ* సిద్ధి మరలి వచ్చు .. .. .. రా. శే. సా.
(నిరతి=మిక్కిలి యాసక్తి; ప్రత్యయము=విశ్వాసము, Confidence )
తేll గీll మెట్ట వేదాంతము మనకు మేలుఁ గాదు,
జీవితమున నిరాశలఁ జేర నీకు!
తుది యవశ్యమనగఁ బెంపుఁ దుంచ వలదు;
విరుగునని మాను పెరుగుట వీడదిలను. .. .. .. రా. శే. సా.
28-05-2020జోహార్ యన్టీఆర్ .... జోహార్ యన్టీఆర్
నందమూరి తారకరామారావు పుట్టినరోజు సంధర్బముగా
సీ :: అరుదైన నటనతో అభిమాన రేచుక్క
అద్భుత అనునయం మర్వ లేని
అభినవ కృష్ణుడు ఆనంద పగటిచుక్క
సాటి రాగలవారు చాల అరుదు
వేదం వేదాంగాల వివిధ పురాణాల
ఔపోసనను బట్టి అలరు నట్టి
నటన ధ్యేయంగ అసమాన ప్రజ్ఞతో
తెలుగు దేశమున నందమూరి
తే :: ధర్మ సూక్ష్మములను చక్కగా వివరించి
సంశ యాలను పార ద్రోలు నట్టి
ముఖ్య మంత్రిగా ధర్మము రక్ష చేసి
ప్రజ హృద్యమున ఉన్నట్టి సత్య పాల
--(())--
ఇతి వృత్తం - నేటి పరిస్థితి
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
:
సీస పద్యము లుగా మొదటి సారిగా వ్రాస్తున్నాను
తప్పులుంటే తెల్పగలరు
--(())--
::(())::
Comments
Post a Comment