నేటి కవిత : తల్లి గోవుల్నీ, ధర్మాన్నితల్లడిల్లజేస్తే,
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
మనసును అదుపు చేయడం కంటే
ఒట్టి చేతులతో సింహంతో పోరాడటం తేలిక
ఎందుకంటే సింహం బయట ఉంటే
మనసు లోపల సింహం తో పోరాడటం కష్టం
వైవిధ్యంను ప్రేమించే మన విశిష్టత కంటే
సర్వ వ్యాపక సర్వజ్ఞత మన శక్తిని చూపుట తేలిక
పరాయి మత్తుకు చిత్తయ్యే వెర్రి వేషాల కంటే
భారతీయ తేజం తూర్పుగా ఉషోదయంతో తేలిక
వసుధైవ కుటుంబాన్ని మొత్తం మార్చటం కంటే
నిగ్రహంతో సంస్కార వంతులగా మార్చటం తేలిక
ధనం ముసుగులో ఉన్న నాయకున్ని మార్చటం కంటే
ప్రజలకు సేవచేసి మనస్సుకు రక్షణ కల్పించటం తేలిక
నడక మారాల్సిందే నడతకై జనం ఇకనైనా మార కుంటే
పదవీ పబ్బంగడిపే నాయకులను ఓట్లతో దింపటం తేలిక
సిగ్గపడాల్సిందే సేవాతత్పరుల త్యాగాన్ని తెల్సుకోకుంటే
నమ్మకాలతో ఓర్పుతో తలవంచి నిజాలను తెల్పుట తేలిక
శౌర్యంకలిగీ సహనంతో స్వార్ధాన్ని నిగ్గదీయుట కంటే
సంకల్ప బలంతో జనంలో చైతన్యం కల్పించటం తేలిక
జాతి భవితమార్గం లో తిప్పి న్యాయం-ధర్మం - నిల్పాలంటే
వ్యవస్థలో సత్యాన్ని బతికించు కోవటానికి అందరి కృషి తేలిక
తల్లి గోవుల్నీ, ధర్మాన్నితల్లడిల్లజేస్తే,/తరాల తపనతేజం బెబ్బులై ,
--(()౦--
Comments
Post a Comment