ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
శ్రీ వేంకటేశ్వర ప్రభ -(4 )
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ధర్మ దేశం సమా శక్తి వైనం హరిం
కర్మబంధం మనస్సే సరాగం విభుమ్
స్నేహయుక్తం వినోదం సరై: :శోభితం
శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!"
కాల ధర్మం సమాచార యుక్తం హరిం
ధర్మప్రాయం వయస్సే విశేషం విభుమ్
ప్రేమలగ్నం వివాహం సరై: :జీవితం
శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!"
ప్రేమ పాశం మనోవిశ్వ భుక్తం హరిం
నిర్మలత్వం మనోమాయతాక్షం విభుమ్
బ్రహ్మలగ్నం సహాయం సరై: నిర్మితం
శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!"
వేంకటేశం మహీభర్తృదేవం హరిం ,
పద్మనాథం సరోజాయతాక్షం విభుమ్ !
సంకటఘ్నం మురారిం సురైఃపూజితం ,
శ్రీనివాసం సదా నౌమ్యహం కామ్యదమ్ !!!"
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
శ్రీవేంకటేశ్వర ప్రభ - 5
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
......
స్థూల దేహము కన్నా జ్ఞానేంద్రియములు అధికమని .
జ్ఞానేంద్రియముల కన్నా మనస్సు అధికమని .
మనస్సు కంటే బుద్ధి బలశాలి అని .
బుద్ధి కన్నా ఆత్మ అధిక మన్న శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
ఏ గతిన బ్రోచెదవో మమ్ము వేంకటేశ్వరా
నీదు పదసారస మేగతి వేంకటేశ్వరా
నమ్మి యుండి నిన్నే కొల్చెద వేంకటేశ్వరా
ఏ మన్న కొలిచెదము తండ్రి వేంకటేశ్వరా
ఏ తీరున చూచెదవో మమ్ము వేంకటేశ్వరా
నీదు సమపూజల మేగతి వేంకటేశ్వరా
నమ్మకము వమ్ము చేయకయ్యా వేంకటేశ్వరా
నీవు మా సమస్యలు తీర్చు వేంకటేశ్వరా
ఏ మాయ చేసెదవో మమ్ము వేంకటేశ్వరా
నీదు సమసేవల మేగతి వేంకటేశ్వరా
కమ్ము కున్న బాధల్ని తొలగించు వేంకటేశ్వరా
చెమ్మకళ్ళను తుడవవయ్యా తండ్రి వేంకటేశ్వరా
.
స్థూల దేహము పంచిన చక్కని వాడవయ్యా
జ్ఞానమందించి చిక్కులను తొలగించవయ్యా ......
ప్రార్ధిస్తూ మేము నిక్కముగా తెల్పుతున్నామయ్యా
నీలాలను అర్పిస్తున్నాము శ్రీవేంకటేశ్వరా
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
శ్రీ వేంకటేశ్వర ప్రభ -6 - అశ్వగతి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీ వేంకటేశ్వరుడు అమ్మవారివద్దకు
వస్తూవుంటే భక్తుడు పాడుతున్నడు
మంచిని వంచన చేసె మనస్సును ఎప్పటికీ
మచ్చిక చేయదు, మదిమహా భవ మప్పటికీ
తెచ్చిన దంతయు పెర్గి తపస్సు ఫల మప్పటికీ
వచ్చిన ఆకలి వల్ల వయస్సు సుసేవ కదా .........
నచ్చిన భౌతిక బుద్ధిని శక్తిగ పంచుటయే
విచ్చిన పువ్వును మెచ్చి వినమ్రము తెల్పుటయే
లచ్చిని ఎప్పుడు కొల్చుట ఆనతి పల్కుటయే
చచ్చిన పామును చంపక వేడుక చేయుటయే .......
బచ్చలి తీగగ పాకిబ కాసుర మేపుటయే
వెచ్చని కౌగిలి పంచియు సేవలు చేయుటయే
బచ్చెన పాలను నీళ్లను వేరుగ మార్చుటయే
నిచ్చలు చెప్పితి మక్కువ చూపియు బత్కుటయే .....
నిచ్చెన మంజుల ఆరతి అగ్నియు వెల్గులులే
అచ్చపు నీటిని కోరిన పల్లము జారుటయే
వచ్చెన టంచుచు మంగకు తెల్పుట మన్ననకే
నెచ్చెలి ఆశను తీర్చుట కొచ్చిన ధీరుడుయే ......
--(())--
*చక్కని మార్గం
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: :
న న న న స గ - III III III III IIUU
నేటి కవిత్వం - ప్రాంజలి ప్రభ- ఫలసాధన-9
రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దడ దడలు పెరిగి దరి పెదవులంతా
తడి పొడి తపనలతొ తరుముతు తపించే
వడి వలపు లతల వరుసల సుమ ఘంధం
పడి చిరునగవుల పెదవులు జపించే
పడవలు కలబడి పరువముల పంటే
కడియపు గళకళ కళల వరము పొందే
గడి బిడి ఉరవడి గమకముల సరాగం
తడి పొడి మడి దడి తకదిములు పొందే
తడ బడు బిగువు లత నలిగి సహాయం
కడవల జలము ఒకటి నొకటి ని ఇచ్చే
వడ రుచి ఉదర వలపు పరుగు లెత్తే
నడుము మెలికలను నయనములు తాకే
అడు గడుగును మది కలిపె కనికరమ్మే
చెడుగుడు లతొ తదిచె మధురిమము పొందే
విడు విడు మనినను విడువక శయనించే
మడువ మడి కలిగి మగసిరి వికసించే
-- (())--
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: :
న న న న స గ - III III III III IIUU
నేటి కవిత్వం - ప్రాంజలి ప్రభ- ఫలసాధన-9
రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దడ దడలు పెరిగి దరి పెదవులంతా
తడి పొడి తపనలతొ తరుముతు తపించే
వడి వలపు లతల వరుసల సుమ ఘంధం
పడి చిరునగవుల పెదవులు జపించే
పడవలు కలబడి పరువముల పంటే
కడియపు గళకళ కళల వరము పొందే
గడి బిడి ఉరవడి గమకముల సరాగం
తడి పొడి మడి దడి తకదిములు పొందే
తడ బడు బిగువు లత నలిగి సహాయం
కడవల జలము ఒకటి నొకటి ని ఇచ్చే
వడ రుచి ఉదర వలపు పరుగు లెత్తే
నడుము మెలికలను నయనములు తాకే
అడు గడుగును మది కలిపె కనికరమ్మే
చెడుగుడు లతొ తదిచె మధురిమము పొందే
విడు విడు మనినను విడువక శయనించే
మడువ మడి కలిగి మగసిరి వికసించే
-- (())--
పుట్టిన రోజు (chandassu)
UIUUIUUU - 8 (PADMAMAALA )
నీ మనస్సే మనోవేగం
నీ వయస్సే మనోకాలం
నీ ఉషస్సే మనోత్తేజం
నీ యసస్సే మనో భావం
పుట్టినా రోజు ఆనందం
అందరూ కల్సె సంతోషం
చిందులే వేసె సందర్భం
చిన్నాపెద్దా సమానాట్యం
పుట్టినా రోజు పండుగే
నవ్వులా పువ్వు విచ్చెనే
బంధువుల్ స్నేహితుల్ శుభా-
కాంక్షలూ తెల్పె వేలగా
మబ్బులూ కమ్మినా వేళా -
వర్షమూ కుర్సినా వేళా
కోర్కలూ వెల్లువై వేళా -
శోభలే చిందులై వేళా
రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్
జిమ్మ పీయూషముల్ సొంపై
సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-
మమ్ముతో నుండఁగా ధాత్రిన్
నీల మేఘమ్ము లీరాత్రిన్
నేల యాకాశమున్ జేరెన్
చాలు నీయాట మాయావీ
పుట్టినా రోజు రావేలా
దివ్య సందేశ కొల్వులే -
త్రాగి నాట్యమూ చేయుటే
సామ రస్యాను సేవలే -
శోభ కల్పించే వెల్గులే
--((*))--
.ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
*
*వచన కవిత (చందస్సు) కొత్తవృత్తము
III-UII-UII-UI -11
1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ
అతిధి సత్యము నిత్యము ప్రేమ
కవియు వ్రాసిన పద్యము ప్రేమ
కధల జీవిత భావము ప్రేమ
2 .చెవికి చెప్పుడు మాటల యింపు
కునుకు గుప్పెడు గుండెకు సొంపు
వణకు తప్పుడు మాటల కంపు
తెలిసి తప్పులు చేయుట ముప్పు
3 .గమన ఆకృతి ప్రకృతి ఇచ్చె
జనత జీవన సుకృతి విచ్చె
సమయ సత్యము జాగృతి పంచె
విషయ వేదము జీవిత మిద్య్దె
4.భయము భేదము కల్పన వల్లె
సుఖము శాంతియు నమ్మిక వల్లె
దిగులు భాధలు ఆత్మలు వల్లె
సమయ భావము అర్ధము వల్లె
5.నకలు చూపియు మోసము వద్దు
సెగలు చూపియు వేదన వద్దు
పొగలు బంధము సిద్దము వద్దు
పగలు ఎందుకు పెంచుట వద్దు
6. సతియు సేవలు చేయుట ముద్దు
పతియు ఆశలు తీర్చుట ముద్దు
మతియు ఇచ్చుట పంచుట ముద్దు
గతియు బట్టియు ఉండుట మూడు
7.తనువు తాపము శాపము కాదు
పరువు పోవుట పాపము కాదు
తగువు భోగము వల్లయు కాదు
మనువు కాలము బట్టియు కాదు
8.సుఖము పెంచును నాగరి తీరు
ముఖఃము మార్చును నాధుని తీరు
పరుల ప్రేమను పొందుట తీరు
తరుణ మాధురి సాధన తీరు
9.సహజ ధర్మము తో పని చేయు
పలుకు సత్యము గాపని చేయు
నరులు నిత్యము సాధన చేయు
వనిత కష్టము అంతము చేయు
_((*))_
Comments
Post a Comment