జ   స  జ  స  య  లగ  -పృథ్వి --11  
IUI  IIU IUI  IIU IUU IU 

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక "అమ్మ దినోత్సవ" సందర్భముగా అందరికి శుభాకాంక్షలు 
Radha ' s love for Krishna

అమ్మ పాదాలకు నమస్కారిస్తూ 
నేటి కవిత్వం - పృథ్వి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మనస్సు మమతానురాగము సుధా మనోధైర్యమే 
ఉషస్సు సమయానుకూలమున నే కవిత్వముగా 
యశస్సు  అనుకూల తృప్తి కరుణే తరించే నిధీ 
వయస్సు  మనసే భ్రమించి తరుణం సమర్ధమ్ముగా  
     
సమత్వ సుఖ సంతసమ్మె చిరకాలమే బత్కుటే 
కళత్వ మది వేదసమ్మె  బతుకంతయే మారుటే 
చమత్క రము సమ్మోహమ్మె విషవాంఛలే పొందుటే 
ప్రమత్త రణ రంగసమ్మె పదభాష్యమే చిందుటే 

కలమ్ము  కవి  కావ్యసమ్మె  అభిమానమే పెంచుటే 
మనమ్ము  మది పుల్కరించి సమసంతసం పంచుటే 
జపమ్ము  మన శాంతి సౌఖ్య విషవాసనే  పెర్గుటే 
గళమ్ము  ప్రతి ఒక్కరొక్క సుఖలాస్యమే జీవితం 

--(())--



ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి ఉదయభానుని ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు కలగాలని  శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా 
ఈ వారం వ్రాసిన కొన్ని పద్యాలు  ప్రాంజలి ప్రభను చదవండి - చదవమనిచెప్పండి - స్నేహాన్ని పెంచుకోండి   

శివ సంకల్ప విహీనుడు 
శివ పూజనములను జేసి శ్రేయము గోనునే 
భువియే మెచ్చని శటునిన్ 
శివుడివిది మెచ్చుకొనును జెపుమా నాధా

జ్ఞాన సువిజ్ఞాన తృప్తుడు 
గానకును వికారమింత కర్మేంద్రియముల్ 
తానుజయించి, శిలమణి స 
మాన మనెడి యోగి జనుల మన్నన పొందున్

ఎవడు నిరాశ పరుండో, 
ఏవండు మమతా రహితుడొ, ఎవడు నిగర్విన్ 
ఎవడు సమత్వము గలుగో 
ఎవని మతి నిలుచొ యతండె యిలశాంతించున్

పలికినదాచరణమ్మున 
నిలబడకుండినను వాని నిష్టాభినయం 
బులు జనము నమ్మవచ్చును 
గలనైనను శివుడు నమ్మగలడా ప్రేమా 

కోరిక, వైరము, దుఃఖము, 
మీరిన మురిపెము, శరీర మెరుపును, ధృతియున్ 
చేరిన చైతన్యము, సవి 
కారము క్షేత్రమని నీవు కనుమా ప్రేమా

కళలో నెదిగినవానికి 
నిలలో జనులెల్లమెత్తురేవ్వరినేనిన్ 
కళలో బ్రవీణ్యమ్మును 
కలిగించిన వాని విడువ గాదుర నాధా

హే  విశ్వరూప దేవా 
నీ వదనంబులు, భుజములు , నేత్రోదరముల్ 
వేవేలు అనంతంబే 
నీ విశ్వాకార మహిమ నేనేర్వగలేన్

భగవంతుడు తనకిచ్చిన 
యగణితమగు నిధికి గురున కవమానమ్మున్ 
బగబట్టి చేయువానికి 
తగిన పాలితమిచ్చి తీరు దైవము బిడ్డా

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు