* 🌹. నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.  దానిని సవ్యంగా ఉపయోగించడం మన విధి. 🌹

భగవంతుడు మనకు చేసిన అతి పెద్ద సహాయము, అతి పెద్ద వరము  ఈ మానవ శరీరమును ఇవ్వటమే. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో అత్యుత్తమ ఉపాధి  ఈ  మానవ ఉపాధి . నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.

భగవంతుడు మనందరికి బుద్ధిని , విచారణ చేయగలిగే శక్తిని అనుగ్రహించారు. ఈ విచారణా శక్తిని చక్కగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానమును పొందే అర్హత మానవ శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి ఉన్నది.

శాస్త్రము మనకు గురువు అంటే ఎవరు? గురువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి? గురువును ఆశ్రయించి దేనిని గురించి తెలిసికొనవలెను? గురువును దేనిని గురించి ప్రశ్నించ వలెను అను ప్రాధమిక విషయముల గురించిన  అవగాహనను కలుగ చేస్తుంది.  

శాస్త్రము మనకు సిద్ధాంతమును తెలియ చేస్తుంది. ఆ శాస్త్రములోని వాక్యములను  అనుభవములోనికి తెచ్చుకోనవలెననిన ఆత్మజ్ఞానమును అనుసరించి జీవించి అనుభవమును పొందిన  గురువు సహాయము తప్పనిసరి.

🌻. గురువు నీకు చేసే సహాయము ఏమిటి? 🌻 

నీకు నిన్ను నీవు చూసుకోవటము, సరిచేసుకోవటము చేతకాదు కనుక , నిన్ను నీవు పరిశీలించుకొనేటప్పుడు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తావు కనుక  గురువును ఆశ్రయిస్తున్నాము. 

గురువు నీలోని లోపములను చూపించి, నీ సంస్కార బలమును అనుసరించి ఏవిధమైన సాధన చేస్తే వాటిని అధిగమిస్తావో,  ఆ  విధానమును తెలియచేస్తారు. నీకు నీ లక్ష్యమును తెలియజేసి ఆ లక్ష్యము దిశగా ప్రయాణించుట ఎలాగో తెలియచేస్తారు.

మనము ఈ శరీరము ధరించడానికి కారణమైన బలీయమైన సంస్కారములు మూడో , నాలుగో ఉంటాయి.  అవే నీ ప్రారబ్ధము. 

మిగిలిన సంస్కారములను కేవలము విచారణచే అదిగమించవచ్చు. కాని జన్మకు కారణమైన సంస్కారములను మాత్రము కేవలము ఆత్మజ్ఞానము చేతనే అధిగమించుటకు వీలగుతుంది.

సంస్కారములు, వాసనలు ప్రాణ,మనో,బుద్ధులు అనే సుక్ష్మాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ శరీరము ప్రాణ,మనో,బుద్ధులను ఆశ్రయించే పనిచేస్తుంది. కనుక మనము సరిచేయవలసినది అంతరంగమును, సూక్ష్మమును. 

అది కేవలము విచారణ ద్వారానే సాధ్యము.  బుద్ధిని బుద్ధి చేతనే అధిగమించాలి. మన జీవన  విధానము ఈ సంస్కార బలము మరింత బలపడే విధముగా ఉంటున్నది. 

విచారణ ద్వారా ఏవిధమైన జీవితమును జీవించిన ఈ సంస్కార బలము నుండి బయట పడతామో ఆ విధమైన జీవన  విధానమును ఆశ్రయించాలి.

ప్రా(ముందు) + ఆరబ్దము(వచ్చినది) - ప్రారబ్ధము అంటే  పూర్వము నుండి వచ్చినది అని అర్ధము.
🌹 🌹 🌹 🌹 🌹
* ✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ గారు
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు