సూర్యోపనిషత్


: ఓం నమః శివాయ:
🌞సూర్యోపనిషత్🌞
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: !
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: !
స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: !
వ్యశేమ దేవహితం యదాయు: !
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: !
స్వస్తి న పూషా విశ్వవేదా: !
స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: !
స్వస్తి నో బృహస్పతిర్దధాతు !!

ఓం శాంతి: శాంతి: శాంతి: !!!


ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక !  మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు
నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు,
ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని
ఒసగెదరుగాక!

ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: !

ఓం! అథర్వణవేదం
లోని అంగిరసుల సూర్యోపనిషత్.


బ్రహ్మా ఋషి: !
గాయత్రీ ఛన్ద: !
ఆదిత్యో దేవతా !
హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ !
హృల్లేఖా శక్తి: !
వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ !
చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: !


బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీజం... హృల్లేఖ శక్తి... సృష్టి యావత్తూ కీలకం... చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ
సాధన!


షట్ స్వరారూఢేన బీజేన షడఙ్గం రక్తామ్బుజ సంస్థితం
సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాఁభయవరదహస్తం
కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణ య ఏవం వేద స వై బ్రాహ్మణ: !!


ఆరు స్వరాల బీజం కారణంగా ఆరు అంశాలు కలవాడు. ఎర్ర తామర మీద ఉండేవాడు, ఏడు గుఱ్ఱాల రథం గలవాడు, బంగారు వర్ణం కలవాడు, నాలుగు
భుజాలవాడు, రెండు పద్మాలతో అభయ వరద ముద్రలు కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు
అయిన శ్రీ సూర్యనారాయణుని తెలిసినవాడే బ్రాహ్మణుడు.


ఓ భూర్భువ సువ: !
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి !
ధి యో యో న: ప్రచోదయాత్ !


ప్రణవరూపమైన నిరాకారమైన "భూ, భువః, సువః" అనే మూడులోకాల రూపమైనడి, సృజన కర్తయొక్క దివ్యమైన ఆరాధనీయమైన ఏ కాంతి ఉన్నదో
దానిని ధ్యానించు తాము. అది మా బుధ్థులను ఉత్తేజపరచు గాక!


సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ !
సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయస్తే !
సూర్యాద్యజ్ఞ: పర్జన్యోఁన్నమాత్మా !


మారిపోయే ప్రపంచంయొక్క మార్పులేని తత్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుడు నుండే ప్రాణులు జనిస్తారు. సూర్యుడు నుండి యజ్ఞము, మేఘము,
అన్నము, పురుషుడు జనిస్తాయి.


నమస్తే ఆదిత్య !
త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి !
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !
త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి !
త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !
త్వమేవ ప్రత్యక్షం ఋగసి !
త్వమేవ ప్రత్యక్షం యజురసి !
త్వమేవ ప్రత్యక్షం సామాసి !
త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !
త్వమేవ సర్వం ఛన్దోఁసి !


ఓ ఆదిత్యుడా! నీకు నమస్కారం. నీవే ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు. నీవే ప్రత్యక్షంగా ఉన్న ఋక్సామ యజురధర్వణ వేదాలవు. అన్ని వేద సూక్తాలు నీవా!


ఆదిత్యాద్వాయుర్జాయతే !
ఆదిత్యాద్భూమిర్జాయతే !
ఆదిత్యాదాపోజాయస్తే !
ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే !
ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !
ఆదిత్యాద్దేవాః జాయస్తే !
ఆదిత్యాద్వేదాః జాయస్తే !


ఆదిత్యుడినుండి వాయువు, భూమి, నీరు, అన్నీ పుడతాయి. ఆదిత్యుడినుండి వ్యోమం దిక్కులు పుడతాయి. ఆదిత్యుని వల్లనే దేవతలు పుడతారు.
ఆదిత్యుని వల్లనే వేదాలు పుడతాయి.


ఆదిత్యో వా ఏష ఏతన్మణ్డలం తపతి !
అసావాదిత్యో బ్రహ్మా !


ప్రకాశించే, తపించే ఈ మండలం ఆదిత్యుడే. ఆదిత్యుడు బ్రహ్మము!


ఆదిత్యోంత:కరణ - మనోబుద్ధి - చిత్తాహంకారా: !

ఆదిత్యో వై వ్యానస్సమానోదానోఁపాన: ప్రాణ: !

ఆదిత్యో వై శ్రోత్ర - త్వక్ చశౄరసనధ్రాణా: !

ఆదిత్యో వై వాక్పాణిపాద పాయుపస్థా: !

ఆదిత్యోవై శబ్ద స్పర్శరూప రసగన్ధా: !

ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానన్దా: !

ఆనన్దమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య: !

ఆదిత్యుడే అంతః కారణాలైన మనోబుధ్థిచిత్తాహంకారాలు. 

ఆదిత్యుడే వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణాలు.
ఆదిత్యుడే శ్రోత్రత్వక్ రసనా ఘ్రాణాలు.

ఆదిత్యుడే వాక్కు, పాణి పాదాలు, పాయూవస్థలు.

 ఆదిత్యుడే శబ్ధ, స్పర్శ, రూప, రస, గంథాలు. 

ఆదిత్యుడే పలకడం, స్వీకరించడం, రావడం, విసర్జించడం,
ఆనందించడం.

 ఆనందమయుడై, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వారూపుడు ఆదిత్యుడే.


నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి !
భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ: !

మిత్రుడివన నీకు నమస్కారం! 
ప్రకాశ స్వరూపుడికి నమస్కారం! మృత్యువు నుండి నాన్ను రక్షించు. తేజోవంతునికి, విశ్వహేతువైన వానికి, నమస్కారం!


సూర్యాద్భవన్తి భూతాని సూర్యేణ పాలితాని తు !
సూర్యే లయం ప్రాప్నువన్తి య: సూర్య: సోఁహమేవ చ !


సూర్యుడినుండే ప్రాణులు పుడతాయి. సూర్యుడివల్ల పాలింపబడతాయి. సూర్యునిలో లయించుతాయి . ఎవరు సూర్యుడో అతడే నేను.



చక్షుర్నో దేవ: సవితా చక్షుర్న ఉత పర్వత: !
చక్షు-ర్ధాతా దధాతు న: !

దివ్యమైన సూర్యుడే మా నేత్రం.

నేత్రదృష్థి 
మాకు ప

రిపూర్ణతను
ఇస్తుంది. ఈశ్వరుడు మాకు దృష్టి ప్రసాదించుకాక.



ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి !
తన్న: సూర్య: ప్రచోదయాత్ !

సహస్రకిరణుడైన ఆదిత్యునికోసం జ్ఞానార్జన చేస్తాము. ధ్యానిస్తాము. అట్టి సూర్యుడు మాకు ఉత్తేజాన్ని ఇచ్చును గాక!



సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ !
సవితా న: సువతు సర్వతాతిఁ సవితా నో రాసతాం దీర్ఘమాయు: !

వెనుక, ఎదురుగా, పైన, క్రిందా అంతటా సవితృడే. ఆ సవితృడే మాకు అంతటా పూర్ణత్వాన్ని ప్రసవించును గాక! మాకు సవిత్రుడు దీర్ఘాయువును
ప్రసాదించును గాక!



ఓమిత్యేకాక్షరం బ్రహ్మా !
ఘృణిరితి ద్వే అక్షరే !
సూర్య ఇత్యక్షరద్వయమ్ !
ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి !
ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను: !


'ఓం' అనేది ఏకాక్షర బ్రహ్మము. 'ఘృణి' అనేది రెండు అక్షరాలు. 'ఆదిత్య' అనేది మూడు అక్షరాలు. "ఓం ఘృణిః సూర్యః ఆదిత్యః" అనేవి ఏకమైన సూర్యుని
అష్టాక్షరీ మంత్రం.



యస్సదాహ రహ ర్జపతి
స వై బ్రాహ్మణో భవతి
స వై బ్రాహ్మణో భవతి !

ఈ మంత్రాన్ని ఎవరు సదా దినదినమూ జపిస్తారో అతడే బ్రాహ్మణుడవుతాడు.



సూర్యాభిముఖో జప్త్వా, మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే !
అలక్ష్మీర్నశ్యతి !
అభక్ష్య భక్షణాత్ పూతో భవతి !
అగమ్యాగమనాత్ పూతో భవతి !
పతిత సంభాషణాత్ పూతో భవతి !
అసత్ సంభాషనాత్ పూతో భవతి !


సూర్యునికి అభిముఖంగా నిలచి జపించడం వల్ల మహా వ్యాధి భయాన్నుండి విడివడుతాడు. దారిద్ర్యం నశిస్తుంది. తినకూడనిది తిన్న పాపం నుండి,
పతితులతో కలసి సంభాషించిన పాపంఋ నుండి, అసత్య భాషణ పాపం నుండి విముక్తుడై పవిత్రుడౌతాడు.



మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !
సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !


మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్ ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా పాతకాలనుండి  వెంటనే విముక్తుడౌతాడు.



సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ !
అదే సావిత్రీ విద్య. కొంచం కూడా, దేనికోసమూ ఎవరినీ పొగడడం కాని, నిందించడం కాని చేయరాదు.



య ఏతాం మహాభాగ: ప్రాత: పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి !
వేదార్థం లభతే !


ఏ అదృష్టవంతుడు ఉదయమే దీనిని పఠిస్తాడో, అతడు భాగ్యవంతుడౌటాడు. పసు సంపద పొందుతాదు. వేదార్థాలను పొందుతాడు.



త్రికాలమేతజ్జప్త్వా, క్రతుశతఫల
మవాప్నోతి !
హస్తాదిత్యే జపతి,
స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!


దీనిని మూడు కాలాలలోనూ జపించడం వల్ల నూరు యాగాల ఫలాన్ని పొందుతాడు. ఆదిత్యుడు హస్తలో ఉండగా జపించినప్పుడు, అతడు
మహామృత్యువును దాటుతాడు ఇలా ఎవరు తెలుసు కొంటారో! ఇదే ఉపనిషత్తు.

ఓం శాంతి: శాంతి: శాంతిః

🕉🌞🌎🌙🌟🚩


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు