జ్ఞానయోగం - నాలుగువాధ్యాయం
జ్ఞానయోగం - నాలుగువాధ్యాయం ఉ. కర్మలకర్తగావిలువ కార్యసహాయము కాలనీతిగన్ ధర్మముతెల్పసూర్యకళ దారియు చూపుట వృత్తినీతిగన్ మర్మము లన్నియే మనువు మానస బోధలె సవ్యసాచిగన్ శర్మగ దైవభాష్యమును శాంతిగ రాజుకు తెల్పరీతిగన్ (01) ఉ. ధర్మమెరింగిసాగు వసుధాప్రియ పుత్రున కెల్ల వేళలన్ ధర్మనిబధ్ధ జీవనము దక్కును ధర్మ విహీను కైనచో కర్మము కట్టుదప్పిచెడుకాలము తిప్పలు పెట్టు గాన నీ మర్మమెరుంగువారు ఋజుమార్గము సాగెద దైవ గీతగన్ (02) ఉ.. యోగము యుత్తమమ్మగు సయోగ్యత నున్నచొ సర్వ ధర్మమున్ మూగ యనేదివి ద్యయగు ముఖ్యరహస్య వచించగల్గగన్ త్యాగమనేది భక్తపర తత్త్వ మనస్సగు గ్రంథ పాఠ్యమున్ సాగసమోన్నతేకళలు సాధన దేహము ప్రశ్నగాయగున్ 03 ఉ. జన్మము యీయుగమ్ముయగు జాతక మేయిది పార్ధు వాక్కుగా జన్మము సూర్యు నే విధము జాడయె లేదును బోధయేలనో ...