నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ (1 ) ప్రాంజలి ప్రభ
అప్పుడే శర్మగారు శర్మగారు అని బయటనుండి పిలుపు
నెమ్మదిగా కళ్ళజోడు సద్దుకుంటూ చేతికర్రా చేతబూని అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీశారు
ఎవరు కావాలి
మేము వినాయక చందాకోసం వచ్చాము
పర్వాలేదు అల్లా కూర్చోండి
నేను చెక్ వ్రాసి యిస్తాను, ఎవరి పేరుతొ వ్రాయాలి, శ్రీ శ్రీ శ్రీ గం గం గం గణపతి ట్రస్ట్ అని వ్రాయండి చాలు అన్నారు వచ్చినవారు
ఓ అట్లాగా
మీకు కొన్ని సలహాలు చెప్పుదామని నా అభిప్రాయం
తప్పకుండా చెప్పండి
మీరు ఉత్త్సవాల లో ఊరేగింపులు, మేళ తాళాలు, అన్న సంతర్పణలు ఉంటాయి కదా తప్పకుండా
అయితే మెరుగమనించాలి, విదాయ్రులు చాలామంది ఉన్నారు, లొక్మ్మతిరు గమనించండి
విషమ పరిస్థితులు వెంబడించిన, మనోనిగ్రహ శక్తి మరచి ప్రవర్తించరాదు
ఎండలవల్ల పంటకు పురుగు పట్టిన, నిగ్రహం కోల్పోయి బాధ వ్యక్తపరచరాదు
అల్పవ్రృష్టి, అనావ్రృష్టి సంభవించిన, ఓర్పు వహించుటేతప్ప యెదిరించిరాదు
ఆహారధాన్యాలు విపరీతంగా పెరిగిన, సహనంతో సహకరించటం మరువరాదు
ఉత్తర దక్షణలు ఉద్యోగాల్లో పెరిగిన, విధివంచకులమని విద్యాధికులనరాదు
సహాయ సహకారాలు అందకపోయిన, స్వశక్తిమరచి నమ్మపలుకులకు చిక్కరాదు
ప్రజల్లో కల్లోల రాజకీయాలు వచ్చిన, నమ్మిన సిధ్ధాంతాన్ని మారి ప్రవర్తించరాదు
ఆహారధాణ్యాలు అధిక ధరలయిన, ధాన్యాన్ని ఆకలికి మించినది ఆశించరాదు
రోగాలు పెరిగి అనారోగ్యులుగా మారిన, వైద్యాన్ని నిర్లక్షం చేసి తక్కువ చేయ రాదు
యుధ్ధ వాతావరణము కమ్ము కోనిన, దేశ శ్రేయస్సు ప్రతి వక్కరు మరవ రాదు
ఇచ్చిన చెక్కు తీసుకోని మహానుభావులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు, మనమందరం గొడవలు రాకుండా జాగర్తగా ఆ గణపనినిపూజిద్దామ్
భోలో గణపతో మహారాజ్ కి జై జై
***
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ (2 ) ప్రాంజలి ప్రభ
శర్మగారు రోజు నడకగా బృదావనమ్ చేరుతారు, అక్కడ వనాల మధ్య తిరుగుతూ కొంత కాలక్షేపంగా అక్కడ ఏర్పాటు చేసిన బల్లలపై కూర్చోవటం అలవాటు
అదే ప్రకారంగా కొందరు స్నేహితులు ఏర్పడ్డారు, వారితో ముచ్చ టింపులుగా కొంత సమయము జరిగిపోతుంది వారికి
అప్పుడే స్నేహితుడు శ్రీ ధర్ చేరి ఈరోజు ఏదైనా మంచి విషయాలు (స్వర్గమా నరకమా) మన జీవితాలు చెప్పండి అన్నాడు, కాసేపు ఆలోచించి ..*
*"స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి" అన్నాను.. ఆశ్చర్యంగా అతను నా వంకచూసి "అదెలా? అన్నాడు, నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను,*
జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి,చదువు కొనడానికి, అనారోగ్యానికి *ఇలా ఇంకా, ఇంకా .. కానీ,*
ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు,
సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి (ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం కోసం) డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు .. భార్య అందించే సుఖానికి డబ్బు అవసరం లేదు, తల్లి తండ్రులకు గురువుకు పద సేవ చేయటానికి డబ్బు అవసరం లేదు
(వీటికి) దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి. ఇవి భూమిపైనే స్వర్గాన్ని సృష్టించడానికి రాజమార్గాలు. *ఇప్పుడు చెప్పండి .. డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ....*
*సత్సంగత్వే నిస్సంగత్వం !* *నిస్సంగత్వే నిర్మోహత్వం !!*
*నిర్మోహత్వే నిశ్చలతత్వం !* *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!*
*సత్పురుషులు ..* *మార్గదర్శనం* , *సత్సంగత్యం ..* *సహవాసం*
*సత్ప్రవర్తన ..* *జీవించడం మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు ..*
*సర్వే జనా సుఖినోభవంతు* *లోకా సమస్తా సుఖినోభవంతు*
అప్పుడే పెద్ద గాలి వచ్చింది అక్కడ వున్నా చెట్లపై వున్నా పూలు రాలి కిందపడ్డాయి
చూసావా శ్రీధర్ దేవుని లీలా
అవును మనం ఇక్కడ ఎన్నోసార్లు కూర్చున్నాము ఒక్క సారికూడా ఒక్క పువ్వు రాల లేదు
ఇప్పుడు చాలా సంతోషం గ ఉన్నది
వెళ్ళొస్తా
మరలా రేపు కలుద్దాం ...
***
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ (3 ) ప్రాంజలి ప్రభ
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా మాఇంటిలో అందగా శ్రీకృష్ణ పరమాత్ముని అలంకరించి పూజలు చేసాము, అప్పుడే పక్కింటి వారు దేవుణ్ణి చూడటానికి వచ్చారు, చిన్న పిల్ల వాడు ముద్దు ముద్దుగా నున్నాడు, ఏదన్న కవిత చెప్పండి అన్నది భార్య శ్రీదేవి శ్రీవారితో .
అప్పుడే ఎదో ఆలోచనతో శర్మగారు తెలిపారు , ఇప్పుడే వ్రాసిన కవిత్వం కాగితం అందించాడు, చక్కాగా శ్రీదేవి పాడింది
రారేమీ శ్రీవత్సా - కన్నా రా రా రా , పేరేమీ చెప్పాలే - బాబూరా రారా
కల్లోలం లేదూరా - తల్లీబాధా రా , ఫన్నీరూ పంచూతా - బిడ్డారా రారా
భయంతో పిల్లవాని పలుకులు
అమ్మానే తప్పేమీ - చెయ్యాలేదమ్మా , తిట్టానూ కొట్టానూ - మూర్ఖున్ని కాదమ్మా
కన్నీరూ మున్నీరూ -కార్చేస్తున్నానూ , అన్నానూ భాదేలే - ఓర్పే లేకెనమ్మా
కష్టాలే నష్టాలే - వస్తాయీ బాబూ , నీ ధ్యేయం నీ గమ్యం - నే నడ్డే కాదే
నీ సొంతం నీతేజం - నాభాదాతీర్పే , తప్పేమీ ఒప్పేమీ - కన్నాలే కృష్ణా
భయంతో పిల్లవాని పలుకులు
అమ్మానే ఓడేనే - అందేరే ముందే , ఆదర్శం ఆనందం -చూపే లేదూలే
ఆలస్యం ఆయాసం - నన్నే కమ్మేలే , వద్దామన్నారాలే - నన్నూ క్షమించూ
ధర్మాన్నీ న్యాయాన్నీ - కాపాడీ రారా , మర్మాన్నీ దైవాన్నీ - నమ్మాకే రారా
చర్మాన్ని స్నేహాన్నీ - జాగ్రత్తా రారా , అన్నాన్నీ వంశాన్నీ - బందం గా రారా
భయంతో పిల్లవాని పలుకులు
తల్లీనీ భాష్పాలే - నన్నూ మార్చేనూ , నేతప్పూ లేచైనూ - నిన్నూ ప్రేమాతో
పూజిస్తా పోషిస్తా - మన్నించాలమ్మా , నాతప్పూ తెల్సిందీ -వచ్చా క్షమించూ
అందరం కలసి ఆ అమ్మవారిని పూజించుదాం ఆ అంటూ కదిలింది శ్రీ దేవి
శ్రీవాణీ బ్రహ్మాణీ - చిద్రూపీ రాణీ , శ్రీవిద్యా గీర్దేవీ - శ్వేతాంగీ శ్రేష్ఠా
భావాబ్ధీ వాగ్భామా - భాషాబ్ధీ శాబ్దీ , దేవీ నిన్ బూజింతున్ - దీపమ్మై రావా
ఎంత చక్కగా పాడారండి అంటూ శ్రీదేవిగారిని మెచ్చుకున్నారు వచ్చినవారు తాంబూలాలు తీసుకొని మాఇంటికి రమ్మనమని చెప్పి వెళ్లారు
***
( త్రిష్టుప్పు 1 (చందస్సు ) భారతీ లేక మాలతీ - మ/మ/మ/గగ)
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd .అకౌంట్స్ ఆఫీసర్ , ఆంధ్రప్రదేశ్ (4) ప్రాంజలి ప్రభ
ఓ దేవి యీ రోజు మన పెళ్లి రోజు కదా
అయితే
ఓ సరదాగా కవిత వ్రాసే వినిపించినా
ఆ వినిపించు కాస్త యీ రోజు పిల్లగా మారుతాలే
అం థోద్దే మన వ్రాతలు చూసినవారు సరదా పడాలికదా
ఆ చెప్పండి మీరో మన్మధుడు, నేనో ప్రియురాలిని కదా
అబ్బా ఆలా యనకే ఇవి యన్నియు శ్రీ కృష్ణ లీలలే మనము అదేవుని వారసులమ్
బాణుని కిరణాలు భాసింప గగనాన భయముతో చీకట్లు పారిపోయె
ఉదయాన మేఘము ఉరుముతో జడివాన మనసులు రంజిల్లి ముర్సిపోయె
విధిరాత భావించి వడగాలి సమయాన తరువులు పులకించె తాప మాయె
వణికించి భయపెట్టి వరముగా వచ్చెనా పగలంత జలముతో పుడమి హాయె
కలువ కన్నెల కళలన్ని కరిగి పోయె, మనసు మక్కువ సెగలన్ని విసిగి పోయె
జలము పర్గులు పుడమికి చేరి పోయె, కడలి పొంగులు శబ్దము చేసి పోయె
ఒంపు సొంపుల మెరుపు చూపించవే - పగడాల నామోవి చిగురించే రారా
కళ్ళు పెద్దవి చెసియు మెప్పించవే - మెరుపేల నామాట తపియించే రారా
మంచి పల్కులు పలికి కుల్కి0చవే - చనుపాలు అందిస్త సుఖయించా రారా
చిందు లేసియు కలసి పోదాములే - అలుకెందు కేమామ మదిపంచె రారా
ఉషోదయ వెల్గు ల్లా రావాలి స్పందన - ప్రేమ సేవ చేసి పొందాలి మన్నన
పుష్పోదయ గంధ మ్లా చేరాలి స్పందన - కలా మాయ వేరు చేస్తేనె మన్నన
వృక్షోదయ నీడ ల్లా మారాలి స్పందన - ఫలం పువ్వు పంచి ఉంటేనె మన్నన
మెఘోదయ నీరు ల్లా కుర్వాలి స్పందన -గృహం కూడు గుడ్డ ఇస్తేనె మన్నన
ప్రతి ఒకరిలో ఉంటుంది హృదయ స్పందన, సూర్యకిరణాలులా ప్రజలకు సహకరించి పొందాలి మన్నన, కలో, మాయో లేకుండ స్వస్చంధముగా పరిమళాలు అందిస్తేనే మన్నన. ఫలం పుష్పం, పంచె వృక్షంలా నీడ నందించి పొందాలి మన్నన, ఎటువంటి పక్షపాతము లేకుండా కురసే వర్షంలా గృహం కూడు గుడ్డ ఇస్తేనె మన్నన ఇదే లోకం తీరు.
కొత్తగా పెళ్ళైన వారికి తొంద రెక్కువా, ఆకలెక్కువా, దాహమెక్కువా అన్నీ ఉండి సమస్ఫూర్తి ఉండి ఆ సంసారములో నిత్యమూ శృంగారమే ఇది ఒకరు వర్ణించేదికాదు, వర్ణించకూడనిది కాదు, అందుకనే గుప్తజ్ఞానం అన్నారు
***
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd . అకౌంట్స్ ఆఫీసర్ (5 ) ప్రాంజలి ప్రభ
ఏమండి ఏమిటి కధ వ్రాస్తున్నారా, లేదే ఎం రాయాలో అర్ధ కాకా ఆలోచిస్తున్నాను అయితే నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మీకథకు ఒక ధరమ్ దొరుకుతుంది
ఏమి టా ప్రశ్నలు
దేవునికి సంబంధించి మనకు సాధారణంగా చాలా ప్రశ్నలు ఉంటాయి,
దేవుడు ఎవరు ? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఆయనను ఎందుకు చూడకూడదు? దేవుడు అన్ని వేళలా ఏమి చేస్తాడు? మొదలైనవి.
ఒకప్పుడు, ప్రాచీన భారతదేశంలో, హిందూ తత్వశాస్త్రంపై అందరిచేత ఉత్తమమైన అధికారిగా భావించబడే ఒక బ్రాహ్మణుడు నివసించాడు. ఒకరోజు స్థానిక రాజు తన ముందు హాజరు కావాలని కోరాడు. బ్రాహ్మణుడు అలా చేసినప్పుడు, రాజు ఇలా అన్నాడు:
"నాకు మూడు ప్రశ్నలు ఉన్నాయి, అవి నన్ను గందరగోళానికి గురిచేస్తాయి, బదులుగా నా మనస్సును ఎప్పుడూ బాధపెడుతుంది: దేవుడు ఎక్కడ ఉన్నాడు? నేను అతనిని ఎందుకు చూడకూడదు? మరియు దేవుడు రోజంతా ఏమి చేస్తాడు? ఈ మూడు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతే నీ తల నరికేస్తాను.” అన్నాడు
ఏవ్ ప్రశ్నలునీవు యడిగావు అవునా
అవును
చెపుతా విను
బ్రాహ్మణుడు నివ్వెరపోయాడు మరియు భయపడ్డాడు, ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు సంక్లిష్టంగా ఉండవు, కానీ వాటిని రూపొందించడం అసాధ్యం. మరో మాటలో చెప్పాలంటే: అతనికి సమాధానాలు తెలియవు. కాబట్టి అతని మరణశిక్ష తేదీ నిర్ణయించబడింది.
ఆ రోజు ఉదయం బ్రాహ్మణుని యుక్తవయసులో ఉన్న కొడుకు రాజు ముందు కనిపించాడు మరియు అతను-కొడుకు తన ప్రశ్నలకు సమాధానం ఇస్తే తన తండ్రిని విడిచిపెడతావా అని అడిగాడు. రాజు అంగీకరించాడు మరియు కొడుకు తన వద్దకు పాలు తీసుకురావాలని కోరాడు. ఇది జరిగింది. అప్పుడు బాలుడు పాలను వెన్నగా మార్చమని అడిగాడు. అది కూడా జరిగింది.
"మీ మొదటి రెండు ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వచ్చాయి," అతను రాజుతో చెప్పాడు.
తనకు సమాధానాలు ఇవ్వలేదని రాజు అభ్యంతరం చెప్పాడు, కాబట్టి కొడుకు ఇలా అడిగాడు: “అది మగ్గే ముందు వెన్న ఎక్కడ ఉంది?”
"పాలలో," రాజు సమాధానం చెప్పాడు.
"పాలలో ఏ భాగంలో?" అడిగాడు అబ్బాయి.
"అన్నింటిలో."
"అలాగే, బాలుడు అంగీకరించాడు, "అదే విధంగా దేవుడు అన్ని విషయాలలో ఉన్నాడు మరియు అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు."
"అలా అయితే నేను ఆయనను ఎందుకు చూడకూడదు," రాజు అడిగాడు.
“ఎందుకంటే మీరు ధ్యానం ద్వారా మీ మనస్సును 'మథించరు' మరియు మీ అవగాహనలను మెరుగుపరచరు. అలా చేస్తే భగవంతుడు దర్శనమిస్తాడు. కానీ వేరేలా కాదు. ఇప్పుడు మా నాన్నని వెళ్ళనివ్వండి.
"అస్సలు కాదు," రాజు పట్టుబట్టాడు. "దేవుడు రోజంతా ఏమి చేస్తాడో నువ్వు నాకు చెప్పలేదు."
"దానికి సమాధానం ఇవ్వడానికి, మేము స్థలాలను మార్చవలసి ఉంటుంది," అని బాలుడు చెప్పాడు. నువ్వు వచ్చి నన్ను సింహాసనం మీద కూర్చోపెట్టు” అన్నాడు.
ఆ అభ్యర్థన చాలా సాహసోపేతంగా ఉంది, రాజు అంగీకరించాడు మరియు ఒక క్షణంలో అతను సింహాసనంపై ఉన్న బ్రాహ్మణ బాలుడి ముందు నిలబడి ఇలా చెప్పాడు: “ఇది సమాధానం. ఒక్క క్షణం నువ్వు రాజువి నేను సామాన్యుడిని. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి, నేనే రాజు & నువ్వు సామాన్యుడివి. దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ శాశ్వతంగా పైకి లేపుతాడు మరియు పడవేస్తాడు. ఒక జీవితంలో మనం ఉన్నతంగా ఉన్నాము మరియు మరొక జీవితంలో మనం తక్కువ చేయబడతాము. ఒకే జీవితంలో తరచుగా ఇది సంభవిస్తుంది మరియు ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా జరుగుతుంది. మన జీవితాలు పూర్తిగా దేవుని చేతిలో ఉన్నాయి, మరియు ఆయన మనతో ఆయన ఇష్టానుసారం చేస్తాడు.
బ్రాహ్మణుడు విడుదలయ్యాడు మరియు అతని కుమారుడికి రాజు అనేక సన్మానాలు మరియు బహుమతులు ఇచ్చాడు.
నీకు అర్ధమైందా
అర్థమైనది దేవుడు అంట వున్నాడు, మీ హృదయంలో నా హృదయంలో వున్నాడు, రాజు పేదగా మారుతాడు, పేద రాజుగా మారుతాడు ఇదే కదా
చాలా చక్కగా చెప్పావు
***
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd . అకౌంట్స్ ఆఫీసర్ (6 ) ప్రాంజలి ప్రభ
ఓ మహానుభావా ఈ లోకం స్థితి-అధోగతి కాస్త వివరిస్తారా అనిభార్య అడిగింది శర్మగారిని నాకు తెలిసినంతవరకూ తెలియపరుస్తా విను అంటూ తెలిపాడు శర్మ గారు ఏమిటి ఈ లోకం - అర్ధం చేసుకోలేని అయ్యోమయ్యం, కలికాలపు పోకడలు నేటి స్థితి, మానవుల అభిరుచులతో అధోగతి. ప్రాణాధారమైన నీరు కొనుక్కునే స్థితి, నీరో, బీరో తెలియని మానవుల అధోగతి, పంచాంగం బదులు సెల్ చేత ఉన్న స్థితి, సెల్ అతిగా వాడుట రోగమన్నా అధోగతి. కళ్ళు ఏది, చల్ల ఏది తెలియని స్థితి, వళ్ళు చిత్తవౌ తున్నా వదలని అధోగతి, ఆర్భాటమే, ఆకలియో తెలియని స్థితి, మనకి లేదే వాదనతో మనుగడకె అధోగతి, కాలము ఏమి తెలపని సిరులవేట స్థితి, సంతృప్తి పడని కాంచన వేటతో అధోగతి, నడిబజారులో మాంసము నాజూకు స్థితి, దుమ్ముధూలి చేరిన తిలియని అధోగతి తైల వంట తిను భండారాల నేటి స్థితి, గడ్డి, తౌడు నూనెల అనారోగ్యంతో అధోగతి, కట్టెపోయి లేక గ్యాసి పోయ్యి నేటి స్థితి, కుక్కర్ ఉడికి ఉడకని వంటను తిని అధోగతి, సంస్కృతి సంప్రదాయము తెలియని స్థితి, డబ్బే జీవిత మని మనస్సు చెడి అధోగతి, మంచి చెడు గాలిలా కనబడని నేటి స్థితి, చెడు తాండవిస్తున్న నోరెత్తలేని అధోగతి. యువత నేమగునో అనే భయం నేటి స్థితి, పెళ్లిగాక, ఉద్యోగమురాక విద్యార్థి అధోగతి, స్త్రీ ప్రగతితో పురుష అయ్యోమయ స్థితి, స్త్రీ శ్వేశ్చ స్వాతంత్రం తెస్తున్న అధోగతి ***
రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd . అకౌంట్స్ ఆఫీసర్ (7 ) ప్రాంజలి ప్రభ ఇదిగో దేవీ తలుపు వేసుకో, నేను కరంటు బిల్లు కట్టివస్తాను ఎందుకండీ అంతశ్రమ అబ్బాయి స్మార్ట్ ఫోన్ కొనిపెట్టాడు, దానితో సులభంగా కట్టవచ్చు కదా కదా ఆధునికమంటూ లోకం ఎటుపోతున్నదో 100 మంది చేసేపని ఒక్కడు చేస్తే 99 మందికికూడు పోయినట్టేగా అవునండోయ్ కదా ఎవరో ఒకరు కొత్తవిధానము కనుకుంటారు దాన్ని ధనవంతులు వ్యాపారంగా మలుస్తారు గుర్తుపెట్టుకో వందమంది కూడు ఒక్కడు తినలేడు కానీ 99 మంది ధనము దోచుకోగలరు ఎంతో ఖర్చుపెట్టి సాఫ్ట్ వేర్ కంపినీలు వచ్చాయి కదా అవునే వచ్చాయి వాటివల్ల ఉద్యోగస్తులు కోటీశ్వర్లవుతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగంలేక దోపిడీ దొంగలుగా మారుతున్నారు యిది అవసరమా! జనాభా తక్కువవున్నచోట ఆధునికం అవసరం, జనాభా ఎక్కువవున్నచోట అవసరమా? మనుష్యులను బద్ధకస్తులను చేస్తుంది. సొంత యాలోచన లేకుండా కరంటుకు తిరిగే యంత్రంలా బుద్ధిమారిపోతుంది. సరి సరే సరే వెళ్లి లైనులో నుంచోని మరీ కట్టిరండి మిమ్మల్ని కాసేపు పలకరించినా పురాణం చెప్పేస్తారు వెళ్ళండి ... వెళ్ళంఢీ ఏమిటో యీ ఆడవారి మాటలకు అర్ధాలే లేవులే. అంటూ కదిలారు శర్మగారు కరంటు ఆఫీస్ లో ఇంటర్ నెట్ పనిచేయక పోవటం వళ్ళ అందరిని కుర్చీలేసి కూర్చోబెట్టారు అక్కడ చేరినవారు లోకాభిరామాయణం చెప్పుకోవటం సరిపోయింది శర్మగారి ప్రక్క ఒకరు చేరి విటమిన్లు గూర్చి పళ్ళ గూర్చి చెప్పండి అన్నాడు విటమిన్లకోసం ఎగబడితే చాలదు, వైరస్ ల విరుగుళ్లూ తెలుసుకోవాలి టానిక్ లు పళ్లరసాలు సేవిస్తే చాలదు, ఇన్ఫెక్షన్లనూ నయం చేసుకోవాలి విత్తనాలు చల్లి నీరు పెడితే చాలదు, కలుపుతీత కూడా చేతకావాలి పంట కోసుకోవడానికి సిద్ధమైతే సరిపోదు, చీడపీడల్ని వదిలించుకోవడం తెలియాలి పొలాలు స్థలాలు కొనుక్కోగానే సరిపోదు, కబ్జాదారుల్ని,అడవిపందుల్ని చూసుకోవాలి ఇల్లు కట్టుకుంటే చాలదు, దొంగలు పడకుండా చూసుకోవాలి సంస్కృతి, సంపద గొప్పవైతే సరిపోదు, సైనికబలం, సమరశీలత ఉండాలి విజ్ఞానులు, వ్యాపారులు, ఉద్యోగులు సరిపోరు, పోలీసులు, ఆచార్యులు సరైనవారుగా ఉండాలి శర్మగారు అని పిలవగానే కరెంటు బిల్లు కట్టి, అక్కడవున్న వారిని ముచ్చడించి కదిలారు ***
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ ) రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd . అకౌంట్స్ ఆఫీసర్ (8) ప్రాంజలి ప్రభ
నవ్వుల నేలరాజుతో నాట్య మయూరి (రోజువారీ సీరియల్ )
రచన మల్లాప్రగడ రామకృష్ణ, Rtd . అకౌంట్స్ ఆఫీసర్ (9) ప్రాంజలి ప్రభ
చూడు దేవి బంధాలు పెంచి, అనుబంధాలు తుంచి, కడుపు నింపి, కడుపుకోత మిగిల్చి, మనిషిని ఆడించి, శాసించి, మానవత్వం మంట గలిపి, కష్టాలు సృష్టించి, కడతేర్చి, కక్షా కార్పణ్యాల ఆజ్యం పోసి, సుఖసంతోషాల అడ్డుగా వుండి, సమకూర్చి, దుఃఖాన్ని మిగిల్చి , జీవితాన్ని శాశించి, నాశనం చేసి, ఆశ పెట్టి జీవితాలు మంటకలిపి, రంగుల ప్రపంచాన్ని నడిపి విశ్వానికే విభేదాల సృష్టికర్తగా, పేదింటి పెన్నిధి ఐనింటి సన్నిధిగా, మానవ సృష్టి అందరికీ ఆరో ప్రాణం అభివృద్ధిని బట్టీ విలువలు అంచనాలు తలకిందులు చేస్తూ వేగ ప్రపంచంలో అతివేగంగా చేయూతనిస్తూ చేతులుమారే సంధానకర్తని ఫెళఫెళలాడే రంగురంగుల హంగుల రూపాయలు ! అబ్బ ఎంతచక్కగా చెప్పారు దానం గూర్చి మీరు మరి పుత్తడి గూర్చి నేనుచెపుతా వినండి మగువలను మత్తెక్కించి, మనసును మురిపింపచేసి, రంగు ఎప్పటకీ తగ్గనటువంటిది, ఆర్ధికమాంద్యం అనేది లేనిది, బంగారం బరువెక్కుతుంది, కనకం కవ్విస్తుంది, స్వర్ణం సరసాలాడుతుంది, పట్టిందల్లా బంగారమవుతుంది, వజ్రాలు వైధుర్యాలు మాణిక్యాలు రత్నాలు గోమేధికాలను దోస్తులు చేసుకుంటుంది. పుత్తడి బొమ్మ మా పాపగా, బంగారు కొండ మా బాబుగా, సువర్ణ ఛాయ నా శ్రీమతిగా నేను మాత్రం నల్ల బంగారంగా , మీరు మాత్రం ఎర్ర బంగారంగా కాంచన మెరుపులుగా ఏడుకొండస్వామివారి వైభవం , అనంతపద్మనాభుని వైభవం, కనకమహాలక్ష్మి వైభవం సువర్ణ దానం నిత్యవైభవం, అష్టలక్ష్మి నిలయంగా కాంచన మెరుపులు స్వర్ణం కోసమే రాజ్యాలు పతనం, పుత్తడి ధరలు ఆకాశం, వెలుగంతా స్వర్ణమయం బంగారమా, దొంగలు దోపిడీల మయం, బ్యాంకుల్లో అయ్యోమయ్యం, ఎంతో బాగా చెప్పవే ఏ బంగారం లేని నా శ్రీమ తి నయం నాకు ధనమే అందని బంగారమై, ఆదర్శజీవనమై అలరించు మావారు నాకు నిత్యా బంగారమే. అంటూ సాగాయి వారి ముచ్చట్లు --((***))--
ఏమండీ పక్కింటి అబ్బా వొచ్చాడు ఎందుకు దశావతారాల గురించి చిన్న కధ తెలపన్నారుట వాళ్ళ స్కూల్లో మీరు చెపుతారని వచ్చాడు సరే ఇటు రమ్మను నమస్కారమండి ఆ చెప్పు బాబు ఎం కావాలి నీకు నాకు నాకు దశావతారాలు క్లుప్త వివరణ కావాలి అంతేగా వ్రాసుకుంటావా, వ్రాసి ఇవ్వమంటావా వ్రాసి ఇవ్వండి మీరు అట్లాగా మన సంస్కృతిలో వివరించబడిన దశావతారాలు జీవపరిణామ, వికాసాలకు ప్రతీకలని కొంతమంది భావిస్తున్నారు. . దశావతారాలు మనకు తెలుసు. *మత్స్య: కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన: జామదగ్న్యశ్చ రామశ్చ కృష్ణో బుద్ధశ్చ కల్కి చ * 1. మత్స్యావతారం 2. కూర్మావతారం 3. వరాహావతారం 4. నరసింహావతారం 5. వామనావతారం 6. పరశురామావతారం 7. రామావతారం 8. కృష్ణావతారం 9. బుద్ధావతారం 10. కల్క్యవతారం అని పురాణాలు చెపుతున్నాయి. ఇక సృష్టిలో ముందు “ఆప ఏవ ససర్జాదౌ” అనే వైదికవాక్యాన్ని బట్టి మొట్టమొదట నీరు పుట్టిందని భావించడంలో తప్పులేదు. ముందుగా ఆ నీటి నుంచి చేప పుట్టింది. ఆ చేప క్రమక్రమంగా పరిణామంలో కూర్మం అయింది . చేప కేవలం నీటిలోనే ఉండగలదు. అది ఉభయచరంగా పరిణమించింది . అదే కూర్మావతారమై (తాబేలు) ఉంటుంది. అది ఉభాయచరం. నీళ్ళల్లోను బయట కూడ ఉంటుంది. కాలం గడిచేకొద్దీ అది వరాహంగా పరిణమించింది. అది నాలుగుకాళ్ళతో కూడిన సంపూర్ణ మైన జరాయుజం . జరాయుజం అంటే గర్భాశయం నుంచి పుట్టినది . ఆ తర్వాత నరసింహావతారం. ఇది జంతువుకి మనిషికీ ఉండేటటువంటి మధ్యస్థితి. నారసింహావతారం సగం జంతువు సగం మనిషి . ఆ తర్వాత వామనావతారం . ఇది ఒక పొట్టి మనిషికి ప్రతీక . దాని తర్వాత అవతారం పరశురామావతారం . పరశు అంటే గొడ్డలి . గొడ్డలితో జంతువులను వధించే ప్రాచీన ఆటవిక జాతి మానవులకు వర్తిస్తుందని కొందరు భావించారు. తర్వాత అవతారం రామావతారం . అది ముందరి అవతారం కంటే కొంచెం పరిణతి పొందింది. గొడ్డలితో జంతువులు వేటాడాలంటే మనిషి వాటి దగ్గరకు చేరాలి . అది ప్రమాదంతో కూడినది . కానీ బాణం కనిపెట్టడం చేత దూరం నుంచే జంతువులను వధించవచ్చు . అది పరశురామ అవతారం కన్నా కొంచెం మేలైన అవతారం. ఇక తర్వాత అవతారం కృష్ణావతారం. ఇది చక్రానికి ప్రతీక . మానవనాగరికతలో మానవప్రగతికి చక్రం అనేటటువంటిది కనిపెట్టడం ఒక పెద్ద మలుపు అని చెప్పకతప్పదు . చక్రం కనిపెట్టాకనే మానవవికాసం అంతులేనంత అధికంగా పెరిగింది. కృష్ణావతారం చక్రానికి ప్రతీక అని పెద్దలు భావించారు. ఆ తర్వాత అవతారం బుద్ధావతారం . ఇది బుద్ధివికాసానికి ఒక ప్రతీక . తర్వాత కల్కి ఆవతారం. ఇంతవరకు ఒక కొలికికి రాని అవతారం ఇది . సంతోషం ఇల్లి వస్తాను శ్రీ మాత్రేనమః *శుభంభూయాత్* ***
*1. శ్రీమాతా*
-----------------
లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
ఈ లోకంలో ఏ ప్రాణి అయినాసరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా !
అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం.
జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నింటిలోకి దుర్లభమైనది మానవజన్మ. ఎన్నో వేల
జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవజన్మ
వస్తుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలుంటాయి.
ఆహార నిద్రా మైధునాలు అన్నిటికీ సమానమే. కాని మానవులకు మనస్సు అనబడే
పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు.
అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. పాపపుణ్యాల యోచన ఉంటుంది.
ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నోవేలసార్లు జన్మ
ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను
చేరుతుంది. ఈ లోగా కొన్ని లక్షల సార్లు పుట్టటం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక
తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు. కాని తల్లిలేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతివారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని
పిలిచినట్లు ? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క
కష్టాలు తీర్చగలుగుతుందా ? తాపత్రయాలు పొగొట్టగలుగుతుందా ?
తాపత్రయాలు మూడురకాలు అవి.
1. ఆధి భౌతికము : తనకన్న ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన
వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట.
2. ఆధి దైవికము : ప్రకృతి సిద్ధమైన వాటివలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదము,
భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి.
3. ఆధ్యాత్మికము : తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే
దుఃఖించుట. అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి.
బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ
తల్లి అంటే ఎవరు ?
అమ్మల గన్నయమ్మ ముగు రమ్మల మూలపుటమ్మ తల్లులకే తల్లియైనటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది. ఆవిడే పరమేశ్వరి. జగన్మాత పరాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి. దయాసముద్రురాలు. అందుకే అమ్మా ! అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి ? శ్రీ అనేది గౌరవ వాచకము. విశేషణము. గొప్పదయిన అని అర్ధం. శ్రీయనలక్ష్మి, శ్రీయనగారి, శ్రీయనసరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్ధం కాబట్టి ఈ ముగ్గురికీ మూలస్వరూపురాలయినది. ఆమెయే సదాశివుని అర్థాంగి పరాశక్తి.
దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరతారు.
అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు
“తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మవా ? నీ తత్త్వాన్ని మాకు వివరించవలసింది”
అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది. “నీటిలోని చల్లదానాన్ని నేనే. అగ్నిలోని
వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును, చంద్రునిలోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీలేదు. అంతదాకా ఎందుకు ? మీ ముగ్గురూ కూడా నేను లేకుండా
ఏ పనీ చెయ్యలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు లోకాలను
రక్షిస్తాడు. రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీలేదు. చరాచర జగత్తంతా
నేనే నిండి ఉన్నాను” అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి.
ఆమె లేకుండా ఏ పనీ జరగదు. అందుకే శంకరభగవత్సాదులవారు సౌందర్యలహరిలోని
మొదటి శ్లోకంలో
శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
నచేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి
అత స్త్వా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి ?
ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడగు శివుడు జగన్పిర్మాణశక్తివైన నీతో కూడిననే
ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడౌతాడు. అలాకాకపోతే అతడు కదలటానికి కూడా
అశక్తుడు. కాబట్టి హరిహర ట్రహ్మాదులచే పూజించుటకుగాని నీకు నమస్కరించటానికిగాని
పూర్వపుణ్యము ఉండాలి కదా ?
అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారిచేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే
శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో
చెప్పబడింది.
మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీభాగవతంలో పరమేశ్వరి తన
తత్వాన్ని వివరిస్తూ “ఉపాధి భేదంవల్ల రెండు విధాలయినట్లుగా, అద్దంలో కనిపించే
ప్రకృతిలాగా క్రియాసమయంలో భిన్నంగా కనిపించినా పరమావస్థ యందు బ్రహ్మపదార్థం
ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టిసమయంలోగాని, లయసమయంలోగాని నాకు
స్త్రీపురుష నపుంసక బేధాలు లేవు.” అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం
ఉభయలింగాత్మకమని చెప్పారు.
శ్రీ అంటే విషము. మాతి అంటే కంఠము నందుంచుకొనినది. గరళమును
కంఠమునందుంచుకొన్నవాడు. గరళకంఠుడు అన్బప్పుడు పుంలింగము అవుతుంది. మాతా
- తల్లి అనే అర్ధంలో స్త్రీలింగమవుతుంది.
ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికిముందు శ్రీ అనే గౌరవవాచకము
ఉంచటం జరిగింది. మాత అనే శబ్దము త్రిపురసుందరినే తెలుపుతుంది. హ సక లర
డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ
మూడు మాత అని చెప్పబడతాయి. ఇక్కడ
హసకలరడైం,హసకలరడీం,హసకలరడౌఃలో చివర అచ్చులు
ఐ ఈ జౌ బాలామంత్రం ఐం క్లీం సౌః ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని
గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన వపంచస్తవాలలో ఒకటయిన
“లఘుస్తవం”లోని 18వ శ్లోక వివరణలో చెప్పారు.
ఆ శ్లోకం.
మాయా కుండలినీ క్రియా మధుమతీ కాళీ కలామాలినీ
మాతంగో విజయా జయా భగవతీ దేవీ శివా శాంభవీ
శక్తి శృంకరవల్లభా త్రినయనా వాగ్యాదినీ భైరవీ
ట్రీంకారీ త్రిపురా పరాపరమయీ మాతా కుమారీ త్యపి!॥
స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరివల్ల జన్మిస్తున్నాయో
ఆవిడ మాత
ఎవ్వనిచే జనించుజగము ? ఎవ్వనిలోపల నుండు లీనమై ?
ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూలకారణంబెవ్వ డనాది
మధ్యలయుడెవ్వడు సర్వము తానె అయినా వాడెవ్వడు ?
జగత్తులోని లోకాలన్నీ ఎవరియందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి
జరుగుతున్నదో, అంటే సృష్టిస్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర
హితుడెవరో, సర్వమూ తానే అయిన వాడెవరో అతడే మాత.
సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు,
భోగభాగ్యాలే కాదు. శ్రీ రూపమయిన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది.
యోబ్రహ్మాణి విధాతిపూర్వం సృష్టికాలంలో బ్రహ్మదేవుడికి త్రయీవిద్యనుపదేశించింది. త్రయీవిద్య అంటేవేదవిద్య. అవి బుగ్ యజుర్ సామవేదాలు. అంతేకాదు జీవికి ముూక్తిని ప్రసాదిస్తుంది.అందుకే శ్రీమాత అని పిలువబడుతోంది. ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృ జ్షేయము అనే మూడు ఉండాలి. అంటే 1. తెలుసుకొనేవాడు. £. తెలుసుకొను శక్తి 8. తెలుసుకొను విషయము. ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, థ్రిభుజానికి అధిదేవత,వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన బాలాత్రిపురసుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనేబిందు వుంటుంది. ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆదేవిబిందుమండలవాసిని అని పిలవబడుతోంది. ఆవిడే శ్రీమాత, పరమేశ్వరి నిరాకార, నిర్లుణస్వరూప. ఆమెకు రూపంలేదు. కాని జగత్తంతా ఆమెస్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామజాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగుపాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెబుతాను. “నాలుగుదిక్కులూ ఆ పరబ్రహ్మ స్వరూపమే” అంటుంది.రెండవపాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ” భూమి, ఆకాశము, సముద్రాలు, నదులు,
పర్వతాలు అన్ని బ్రహ్మపదార్థంలోని అంతర్భాగాలే” అంటాడు. మూడవపాదాన్ని ఒక హంస చెబుతూ “అన్నీ పరబ్రహ్మలోని భాగాలే” అంటుంది. నాల్లవపాదాన్ని ఒక నీటిపక్షి చెబుతూ “ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణంబ్రహ్మ, మనస్సు బ్రహ్మ” అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వరస్వరూపమే. అతడికిఆది మధ్య అంతము అనేవి లేవు.
'జగత్తులోని'అగ్న్ని సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు దేవీ భాగవతంలోని సప్తమస్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతాపరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి, శుక్రవారం వేదసమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయింది. ఆ రూపం ఎలా ఉందంటే
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ ॥
విద్యుత్కోటిసమానాభ మరుణం తత్సరం మహః
నైవ చోర్ధ్వం న తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్ ॥
ఆద్యంతరహితం తత్తు న హస్తా ద్యంగ సంయుతమ్
నచ స్రీ రూప మథవా నపుంరూప మధోభయమ్ ॥
కొన్నివేల కోట్ల సూర్యులయొక్క కాంతులతో, కోట్లకొలది చంద్రుల చల్లదనముతో,
కొన్నికోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తళుక్కున మెరిసింది. అది
కోటి పాగసాగగా అది అరుణారుణకాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవిఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు.అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు
అన్నిరూపులు నీ రూపమైనవాడ !
ఆది మధ్యాంతములు లేక అలరువాడ !
అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ. బిడ్డల కోరికలు తీర్చేది.
వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే
దుర్వాసుడు తన “శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లో
శ్రీమాత స్తిపురే ! పరాత్సరతరే దేవి ! త్రిలోకీ
అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ
పరమేశ్వరి సర్వులకు మాత లోకాలన్నింటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది.
ఈ నామంలో దేవి సృష్టి రూపిణి.
*** మనసా సంగీతమే - మమతా సాంగత్యమే
వయసా ఉల్లాసమే - సొగసా సౌందర్యమే
వలపే వయ్యారమే - కులుకా శృంగారమే
తనువా జవ్వారమే - మలుపే మాధుర్యమే
అలకా సాహిత్యమే - ఆధరం ఆనందమే
నడకే నాట్యాలమే - నడుమే సమ్మోహమే
సహనం సాహిత్యమే - తమకం తాత్పర్యమే
తరుణం తాత్కాలమే - చలణం చాతుర్యమే
కథనం కాందోళమే - చరితం యవ్వారమే
పలుకే ఆంతర్యమే - గళమే గాంధర్వమే
జలజే జవ్వనమే - బ్రమరం బ్రహ్మాండమే
మధురం మాంగల్యమే - శపధం ఔన్నత్యమే
Comments
Post a Comment