శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మసంయమయోగం
శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మసంయమయోగం
ఉ. కర్మఫలమ్మునే కనక కార్యము కర్తల ఆశ్రయమ్ముగన్
కర్మలు నాచరించగల వికాసము సన్యసి యోగిబంధమున్
కర్మల యగ్నికార్యమును కాదని మాత్రము నిశ్చి తాత్ముడున్
ధర్మము నిత్యమై క్రియలు ధ్యానము నెంచియు వింధ్య వైఖిరిన్ (01 )
ఉ. సర్వము జ్ఞానయోగము సాధ్య యహంకర మేను త్యాగమై
సర్వము ధ్యానయోగి యగు సాధ్య బహిర్ముఖ విద్య త్యాగమే
సర్వము భక్తి యోగి కళ సాధ్య యశక్తిని ప్రేమ త్యాగమే
సర్వము కర్మయోగి ఫల సక్తిని కోరిక యంత త్యాగమే (02 )
చం. మనమున నాశ వీడుచునె మానస సాధనచేయు విద్యయున్
వినయపు కర్మ యోగమగు విద్య విధేయత మూలమేయగున్
తనమన చూసెవారికిణి తన్మయమేను మనస్సు నేస్తమున్
మునికి విధానకర్మయగు ముఖ్యము శాంతిగ యోగ మోక్షమున్ (౦౩)
మ.కో. తల్లి తండ్రియున్ బహు విధంబుల గామితముల్ఘటింప గా
నుల్లము చల్లనై విషయ నొoదును సర్వము వీడి రాట్పరీ
హల్లక నాదు శక్తివిధిగై కడు కర్మలు వీడి నుండగన్
యెల్లరు సాధ్యయోగమది యెo చిన లోకదలంపు లేటికిన్ (04 )
చం. తనకును తానుగా మనసువృద్దిని నెంచ జయమ్ము సత్యమున్
తనకును తానుగా గొనచెతన్ తనమేను తలంపు శత్రువున్
తనకును తానుగామదిగతమ్ము రిపుండు కలౌను మిత్రమున్
తనకు తానుగా మననదారియు బంధువును జూడ శక్తియున్ (05 )
శా. ఏ జీవాత్మ జయించునో మదిగనే కమ్మేటి మాయందునన్
ఏజీవెంద్రియమేను నేచ్చెలిగనే కామ్మేటి మిత్రమ్ముగన్
ఏ జీవాత్మ జాయించడో మనసుగా కష్టమ్ము తోడవ్వగన్
ఏజీవేంద్రియమేను శత్రువుగనే కర్మౌను జీవమ్ముగన్ (౦6)
ఉ. కష్ట సుఖమ్ముగా కామ్యము కా నుక యుష్ణమేయగున్
ఇష్టమె సఖ్యతా కదులు యిచ్ఛయనేమది స్వచ్ఛతేయగున్
పుష్టిగ జ్ఞానమే కలిగి పూజ్యుల యాత్మయు సర్వమేయగున్
ఇష్టము వృత్తినిశ్చితము యీప్సిత కాలము మానమేయగున్ (07 )
ఉ. అమ్మకచెల్ల ధైర్య విభ వాదిశయంబున దండ్రి పెంపులే
శమ్ముయు జ్ఞానవిజ్ఞతయు జన్మమునన్ జనయిత్రి బోలి పై
గ్రమ్ముని యిoద్రియమ్ములను గ్రాగుచు జిక్కియు పూర్తి నమ్మ ని
క్కమ్ముగ రాతిపుత్తడగు కమ్మని ధన్యులుగా వసుంధరన్ (08 )
ఉ. నమ్మిక మిత్రనెత్తు వదనమ్మిక నెమ్మది కోర్కెనెమ్మితో
నమ్మిన శత్రుయెత్తుగడ నిమ్మని కమ్మని యెత్తుజోరుగన్
దమ్ములు పాపులౌను విరి దమ్ములు చేర్చి భజింతు బంధమున్
సమ్మతి ధర్మమై సమయ సన్నిధి పెన్నిధి శ్రేష్టుడేయగున్ (09)
శా. స్వాధీనమ్మె మనస్సుగాను సమయం సాధ్యమ్ము సంధింపగన్
యీదీనమ్ముయు మర్చిసేవలుగనే నిస్వార్ధ భోగ్యంబుగన్
యీదీప్తీ విధిగానుశాంతిగమనం సాధ్యమ్ము సర్వమ్ముగన్
వాదీస్వేచ్ఛపరమ్ముగాను తెలిపే వాక్యప్ర భావమ్ముగన్ (10 )
మ. శుచిదేశంబున ధర్భపర్చిమృగవిస్తుత్వమ్ము చర్మ మ్ముగన్
ఉచితంబౌమది నిర్ణయమ్ము గనుటే యూహా స్థిరమ్మాసనమ్
వచనమ్మున్ స్థితి గాసమానమగు సేవా దృక్పధమ్మౌను లే
ప్రచరించేవిధి చూడమేలగుట ధీరాస్థానమే మున్నతన్ (11 )
చం. స్థిరమగు యాసనమ్మున కళ సీఘ్రము సమ్మతిగాను కూర్చగన్
స్థిరవశమైనచిత్తమునశీల క్రియల్ విధివాక్కు లేగతిన్
స్థిరపర నాసికాగ్రమునచిత్త యోగము చేయ ధ్యానమున్
స్థిరపర మేలుజేయుటయు చిత్త మయమ్మున సాధ్య మేయగున్ (12 )
ఉ. జీవనమెల్లసత్కవిని సేవిత మాశయ మెల్ల నచ్చదా
పావన తాగభీరలనె పట్టుప్రచారము నిశ్చలమ్ము ధా
త్రీ వలయమ్ముగా ఫలము దిక్కగు చూపులుగా స్థిరమ్ము ము
క్తావళి దృష్టి ధర్మమగు కాలము నిశ్చయె కాగ్ర చిత్తమున్ (13 )
ఉ. మజ్జిగ మేలు మేల్పు తల మోసల నుండియు ధ్యానయోగమున్
సజ్జ మొనర్ప కాంతియు ప్ర శాంత మెరింగయు బ్రహ్మ చర్యమున్
సజ్జనగా మనో నిగ్రహ సత్య గుణమ్మగు మత్పరాయణున్
పజ్జన మార్పుతీర్పు సహపాఠ్యము లెల్లరి శక్తియుక్తిగన్ (14 )
శా. స్వాధీనమ్మగు యోగశీలుడు గనే సాధ్యాయణమ్మున్ సుధీ
స్వాధీనమ్మగు ధర్మమేసహనమై సర్వేశ లీలేయగున్
స్వాధీనమ్ముగనే సహాయపరమే సామ్యమ్ము దేహమ్ముగన్
ఏదీ మార్గసుఖమ్మునెంచ బ్రతుకే యేవిద్య విశ్వాసమున్ (15 )
.ధ్రు. కో. అతిభుజించిన యేది తిన్కయు ఆశ యున్నను యేలనో
మతియు మాత్రము నిద్రలేకయు మంచి నిద్రయు దేనికో
స్థితి వినమ్రవిధేయ భావము శీల సంపద లేకనో
గతియు లేకయు తిర్గుమన్షియు గమ్యయోగము లేదులే (16 )
చం. సరిగను యర్ధసంపదయు శాంతి మనంబగుమేలు భుక్తి గన్
సరియగు కర్మసన్నిధియు సాక్షి సహాయము పెన్నిథే యగున్
నరయచుగాఢనిద్రయన నెమ్మది సిద్ది నశించ బాధగన్
నరయచు దుఃఖనాశనము నమ్మకమైనది యోగ్య ధ్యానమున్ (17 )
ఉ. చిత్తమునందు పూర్తిగను చిత్రపు వాసన కర్మరంగమున్
చిత్తమనంత యాత్మయగు శీఘ్రము పర్గులు యాగిపోవగన్
చిత్తము భోగమున్ కళయు నిర్మల కామ్యము కొంతయేయగున్
చిత్తము ధర్మమై జగతి సిద్దిగ పొందెడి యోగయుక్తుడున్ (18 )
ఉ. వాయువు లేకనున్నను నవాభ్యుదయమ్మగు దీపకాంతియున్
ఆయువు నిల్వలేదు విధి ఆశ్రిత జీవము గాలిలేకయున్
ప్రాయవశమ్ముయోగి గను పాఠ్యమనస్సున నిర్వీకారమున్
కాయము నిశ్చలమ్ముగను గమ్యము చిత్తము ధ్యానమేయగున్ (19 )
ఉ. మించిన వేట్కతో మనసు మీన విలోచన యాత్మదేను వా
ఇంచిన భోగమే యగు లయిoపగ మాటున శుద్ధమేను న
య్యoచిత యోగసేవలగు యాగిన చోటున ధ్యానయోగమే
గాంచుట సాధనమ్మగుట గాంచి భజించుట యాత్మ తృప్తిగన (20 )
ఉ. అద్దిర జీవ మాత్ర చరితార్థక చిత్తము గాలివోయె న
స్మద్దయ బుద్ధిగ్రాహ్యమయె శాం భవ లోచన యాత్మమూల పె
నిద్దుర కాల నిర్ణయమగు నేరక యుండెడు శాశ్వతమ్ము నన్
సుద్దులు చెప్పినన్ మనసు చొచ్చునె? యాత్మ సుఖమ్ము నెట్టిదో (21 )
ఉ. దేనిని పొందిదానిని మ దీయబలమ్మని చె ప్పకుండగన్
దేనిని కోరకుండ మరి దీణుడుగాగతి యేల నుండగన్
దానిని పొందిలాభమన కా మరి దుఃఖము మున్న యోగ మందున్
దానిని యాత్మ ప్రాప్తికి సదా రుచి కోరక జ్ఞానియేయగున్ (22 )
ఉ. వచ్చిన దుఃఖ రూపమున వాంఛ విముక్తిని కోరగల్గ పో
నిచ్చుచు ధర్మమాచరణ నీడన చేరియు యోగమార్గమున్
మెచ్చెడి చిత్త నిశ్చయము మేలు గనంగెడి బ్రహ్మ తత్త్వమున్
స్వచ్ఛము ధైర్యమే మనసు సాధ్యము యోగ్యము యాత్మ గమ్యమున్ (23 )
శా. ఊహల్ బంధముగాను చేరగలిగే యున్మాద గామారకన్
మోహమ్ గా కదలా మనస్సు గనుమా మోక్షమ్ము కోర్కెలుగన్
దాహమ్ యిoద్రియమౌను నూహలుగనే ధాత్రుత్వ లక్ష్యమ్ముగన్
దేహమ్ పట్టుదలౌనుకోరికలనే తీవ్ర త్వజించేమదిన్ (24 )
మ. క్రమ వైనమ్మగు ధైర్యమే సమయ మౌకార్యమ్ము చేకూర్చగన్
సమ కూర్చేటి సుబుద్ధి సాయముగనే శాంతీ సు సౌఖ్యమ్ముగన్
స్వమనంబేవశమౌను యాత్మగను విశ్వాసమ్ము ధ్యానమ్ముగన్
తమ యాత్మా నిలిపే మనస్సుగను వేదా వాక్కు జీవమ్ముగన్ (25 )
ఉ. వాకిట కూతలన్ని కల వానల మాదిరి మోదమందగన్
లోకములోని శబ్దములలోను మనస్సును మార్చగల్గుచున్
ఏకముగాను శ్రావ్యమున యెల్లలు దాటుచు సత్య వాక్కుగన్
శోకము తోడనుండకయు శ్రోతలు గోరగ దైవ ప్రార్ధనల్ (26 )
మ. స్థిరమందేవిధి శాంతిచిత్తమగు స్వస్తిత్వమ్ము రక్షాకృతీ
స్వరమాయామహిమేను భావమగు విశ్వాసమ్ము సేవాకృతీ
దరిరానీయక నీశునేనిరతమే ధ్యానమ్ము ధర్మా కృతీ
దరిచేరే ఘన యోగి నిక్కమగుటేధాత్రుత్వ జ్ఞానా కృతీ (27 )
ఉ. పాపమొకింతయే మనసు పాకక దాకక నిశ్చలమ్ముగన్
ఆపర శ్రేష్టయోగి మది నా పరమాత్మను కొల్వగల్గగన్
దాపర భక్తియేవినయ తత్త్వము నేస్తముగాను లోకమున్
ఆపరమాత్మ శాంతిగని యానతి పొందియు భుక్తభావమున్ (28 )
శా. సర్వవ్యాప్తము యనంత మగుటే సర్వార్ధ ధన్యాత్ములౌ
సర్వమ్ము స్వపరాయణాo చి తమున్ సామాన్య దాన ధారకున్
గర్వమ్మున్ మరచే సహాయతగుణే గమ్యమ్ము యాజ్ఞ మాటికిన్
సర్వప్రాణులయందు కల్పితమగా సామర్ధ్య మిచ్చు మోక్షమున్ (29 )
ధృవ.కో . ఎవరు బిమ్మట నన్ను చూచుచు యేమి యేమన కుండగన్
ఎవరు లన్నిట నన్ను జూచుచు యేమి తృప్తియు పొందగన్
ఎవరు నన్నుగనే మనస్సుగుణించ గల్గియు నుండు న
న్నెవరు హృద్యమునందు నుంచిన యుద్ధరింతును నిత్యమున్ (౩౦)
మ.కో. అన్ని ప్రాణులలోను నుంటిని యా త్మనేకము చేయగా
సన్నిధానమనేటి విద్యతొ సత్య వాక్కుగ కొల్వగా
పెన్నిధైవిధి యాటలన్నియు పిల్పు లాగను మార్చుతూ
సున్నితమ్ముగ నామనస్సుయు శుభ్రమేయగు నిత్యమున్ (31 )
చం. ప్రకృతి యనంగ జీవులకు పాఠ్యముగాను వసించు నిత్యమున్
ప్రకృతినిగాంచ తన్మయపు పాలనగాను గ్రహించు విద్యగన్
ప్రకృతి సుఖాలకష్టములు పాశపు బంధ భవించు నేస్తమున్
ప్రకృతి ప్రభావ మేపరమ పావ నమౌను సృజంచు యోగిగన్ (32 )
పార్ధుని ప్రార్ధన
మ. సమభావమ్మున గూర్చునీమమత విశ్వాసమ్ము తోగొల్చెదన్
మమతాబోధలు సేయు బుద్ధిగను నీ మార్గమ్ము వాణీభవా
సమతాచిన్మయ రూప యోగమను విశ్రాంతిన్ యాచించన్నేడు న
ర్ధము గైకొంటిని హేమురారి సుఖ రాజ్యమ్ము నీధానమ్మునన్ (౩౩)
చం. వణికెడి జీవితమ్మగుట వాక్కుల సర్వముగాను నిత్యమున్
మనిషిగ నేర్పుయు మార్పులగు మంచిగాను సమర్ధ బుద్ధిగన్
మనమతి చంచలమ్మగుట మాయ చరిత్రను గూర్చ విద్యగన్
గుణమున శక్తి యుక్తియును గుర్తు బలమ్ముణుగూడ కల్గగన్ (34 )
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
శా. నీమాటల్ సహజమ్ముగాను సమయమ్మావిద్య సాధ్యమ్ము గన్
నీమార్గమ్ము విదీజయమ్ముకొరకే నీసేవ యభ్యాసమున్
యీమాయా జగతీమనస్సు మరుపే యిచ్ఛా ను యోగమ్ముగన్
నీమాధుర్యు వశో మనస్సు యడ రన్ నిర్మాణ యద్దమ్ముగన్ (35 )
శా. ఆమాటల్ వసుధామయమ్ము గనటయే కాయత్త చిత్తేశనం
జ్ఞావర్ణంబు లొకింతగాను గనుమా సంజాత చైతన్యమై
పూవుంబోడిది చిత్తమైకదులుటే పూర్ణభిషేకమ్ముగన్
యీవిద్యాక్రమయోగధారణముగా చిత్తమ్ము యేకాగ్రతన్ (36 )
ప్రార్ధుని ప్రార్ధన
మ.కో. యోగమందున శ్రద్ధనుంచుట యోగ్యతాయగు విద్యగన్
బాగునందును కీడునందును వాక్కునుంచుము దిక్కుగన్
యోగమన్నది సత్యమేయగు యోగ చంచల కీడుగన్
యీగతీవిధి యాడునాటక యిచ్ఛయేగను యర్జునా (37)
మ.కో. స్వైర విహార దీరులగు సారసలోచనలున్న చోటికిన్
బోరన లాతివారు చొరబూనినచో రసభంగ మంచు, నే
జేరక మోహమేగతియు చెంతన నాశ్రయమేను లేక క
న్నారగ జారివచ్చిన వివాదవు మేఘము గాలికేకదుల్ (38)
శా. నాసందేహములన్ని తీర్చ ఘనమౌ నాదిక్కు నీవేకదా
నాశనమ్మును యాపశక్తియు నువే నాకర్మ నేస్తమ్ముగా
ఈసాధీరుడివీ మనస్సుగనుమా యీమాయనే మార్చుమా
స్వాసానీదిగ నేనువిద్య గడపా సాధ్యమ్ము నీదాస్యమున్ (39)
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి
ఉ. దుఃఖము నెంచయేలయన భుక్తిగ యోగము సాధకుందుగన్
దుఃఖము మాయ లోకమున దూరము నుంచియు గాయమేలనున్
దుఃఖము జీవితమ్మనకు దుష్టల నేస్తము కొంతమూలమున్
దుఃఖము యోగమైకదల దూరము తగ్గియు నన్నునేకోరున్ (40)
మ.కో. మంచి చెడ్డలు చూచి మాన్యులు మార్చి వంచన చేయకన్
కొంచమైనను భీతి గృంగక కొల్పుచుండగ ప్రేమగన్
వంచితాత్ముల నెంచివంచన బాపి కావుము మాన్యులన్
మంచి పెంచు మాయదాటియు మానసమ్మగ జీవమున్ (41)
మ.కో. యోగ బ్రష్టుడు పుణ్యమున్నను పొందు లోకము స్వర్గమై
భోగ లాలస గాంచి పావన భోగ యింటను జన్మగన్
యోగులెల్లరు భక్తులింటను యోగ్యతేయగు వృద్దిగన్
యోగ జన్మయుజ్ఞాన ప్రాప్తియు యెంచ దుర్లభ మేయగున్ (42)
మ.కో. .యోగ బ్రష్టుడు పుణ్యమున్నను పొందు లోకము స్వర్గమున్
భోగ లాలస గాంచి పావన భోగ యింటను జన్మగన్
యోగులెల్లరు భక్తులింటను యోగ్యతేయగు వృద్దిగన్
యోగ జన్మయుజ్ఞాన ప్రాప్తియు యెంచ దుర్లభ మేయగున్ (43)
మ. గతజన్మే సుకృతమ్ముగాకదలు యోగాభ్యాస విద్యానగన్
కతలాగేవిధి యాడునాటకము సౌకర్యాలు నేర్పాటుగన్
మతిసాధ్యాయ గుణంబు గాయతులు సామాన్యమ్ము గమ్యమ్ముగన్
గతివేదాలగు యానతీమదియు సంగ్రామ్మమ్ము జీవమ్ముగన్ (44)
శా. జన్మాజన్మల బంధమేబ్రతుకుగా జాడ్యమ్ము వర్ధిల్లగన్
చిన్మాయే విధిగాను శాంతికలిగే శీ ఘ్రమ్ము విద్యార్థిగన్
సన్మానమ్ముగనన్ మదీ ప్రభవమే సాధ్యమ్ము మభ్యాసమున్
తన్మాయా వలెనే మహేశ కరునే తత్త్వమ్ము జీవమ్ముగన్ (45)
చం. మునివరకన్న యోగ్యతయు ముఖ్యముగామది సాగు టేగతిన్
మనసునవేద పాఠముల మార్గమె యున్న వినమ్రతే స్థితిన్
తనువునకర్మలే కళలు తాహతిబట్టి యురక్తి యేవిధిన్
గను మదియోగమున్ స్థిరము కాన సహాయ మనస్సు యోగమున్ (46)
. ఆది భూత నన్ను యంత్య కాల మందు బుద్ధిగన్
ఆది దైవ నిశ్చలమ్ము యాత్మ నెంచి సాగుమున్
ఆది యజ్ఞ మౌను నేస్తమా మనస్సు విద్యగన్
ఆది యంత మైన జన్మ యంత మే ను నిత్యమున్ (47)
బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం సమాప్తము
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
****
*శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (6)*
సర్వదానాల ఫలితాన్ని భగవద్గీతలోని ఆరవ అధ్యాయ పారాయణా ఫలంగా పొందవచ్చు
భగవద్గీత లోని ఒక్కొక్క అధ్యాయము ఒక్కో యోగముతో సరిసమానము. ఆ గీతలోని ఏఒక్క నామాన్నయినా నిత్యమూ పఠించినా కూడా పరమపదమైన ఆ వైకుంఠ వాసము సంప్రాప్తిస్తుంది. పరమాత్ముడు వరాహపురాణంలో ఇలా అంటారు “ ఎక్కడైతే గీత నిత్యమూ చదువుతూ , వింటూ, స్మరిస్తూ ఉంటారో అక్కడ నేను స్వయంగా నివశిస్తాను” అని . అటువంటి భగవానుని స్వరూపమే అయిన భగవద్గీతా పారాయణా మహత్యాన్ని పద్మపురాణం విశదపరుస్తోంది. ఆ భగవద్గీతా పరాయణా మహత్యాన్ని వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం . ఇక్కడ భగవద్గీత లోని ఆరవ అధ్యాయం యొక్క విశేషతను పరమేశ్వరుడు, పార్వతి దేవికి ఈ విధంగా తెలియజేస్తున్నారు. సర్వదానాల ఫలితాన్నివ్వగల ఆ భగవద్గీతలోని ఆరవ అధ్యాయ పారాయణా ఫలితమెలాంటిదో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
“సుముఖి! ఆరవ అధ్యాయ మహత్యమును చెబుతున్నాను. ఇది విన్నంత మాత్రం చేత ముక్తి కరతలామలకమవుతుంది. సందేహమే లేదు. గోదావరి తీరంలో ప్రతిష్టాన పురమనే ఒక విశాలమైన నగరం ఉంది. అక్కడ ఈశ్వరుడైన నేను విప్పలేశ్వరుడు అనే పేరుతో నివసిస్తూ ఉన్నాను. ఆ పట్టణాన్ని జానుశృతి అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన నిత్యము యజ్ఞములు చేస్తూ, అపరిమితమైన దానములు చేస్తూ, ఉండేవాడు. ఆ యజ్ఞ కుండములో ఉండేటటువంటి ధూమము స్వర్గములో గల కల్పవృక్ష పర్యంతము వ్యాపించింది. కల్పవృక్షము కూడా సిగ్గు చెందిందా అన్నట్లు ఆ ధూమము చేత నల్లబడిపోయింది. ఆ యజ్ఞములో ఉండేటటువంటి ఆ యజ్ఞము నుండి వచ్చేటటువంటి హవిర్భాగాలను స్వీకరించడానికి నిత్యమూ వచ్చే దేవీ దేవతలందరూ ఆ పట్టణంలోనే నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజు విడిచేటటువంటి దానోదకము , ప్రతాపము అనే తేజము, యజ్ఞ కుండములోని ధూమము ఈ మూడు కలిసి మేఘముగా ఏర్పడి ఆ రాజ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండేవి.
వీటివల్ల అతని రాజ్యములో ఈతి బాధలు లేకుండా, నీతి నియమాలు కలిగి ప్రజలు ప్రవర్తించేవారు. ఆ రాజు చేసే దానధర్మాలకు సంతోషించి వరాలు ఇవ్వడానికి దేవతలు హంస రూపాన్ని ధరించి ఒక్కొక్కసారి అంతరిక్షంలో సంచరిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు అలా వెళుతున్న దేవతా స్వరూపాలల్లో భద్రాశ్వములు అనే రెండు హంసలు వేగంగా ముందుగా ఎగురుతూ ఉండగా మిగిలిన హంసలన్నీ వాటిని అనుసరిస్తున్నాయి. ఆ హంసలు తమ ముందున్న భద్రాశ్వములతో ఇలా అన్నాయి “ఓ భద్రాశ్వములారా ! ఈ మార్గము చాలా దుస్తరంగా ఉంది. జాగ్రత్తగా ముందుకి వెళ్ళాలి . మీకు దారి సరిగ్గా కనిపిస్తోందా ? ఆ జానుశృతి మహారాజు తేజము తీవ్రంగా కనిపిస్తోంది. ఒక జ్వాలాగా అది మనల్ని దహింప చేయవచ్చునెమో ” అన్నాయి .
ఈ వాక్యాలు విన్న భద్రాస్వములు పరిహాసంగా నవ్వి ఇలా అన్నాయి. “ ఈ మహారాజు ఎన్నో యజ్ఞాలని చేసి, దానాలని చేసి ఇంతటి తేజస్సుని మాత్రమే పొందారు . కానీ స్వయంగా విష్ణుస్వరూపాన్ని పొందినవాడు, బ్రహ్మ తేజో సంపన్నుడైన ఆ రౌక్యుని తేజస్సుకు ఇది సాటిరాగలదా ?”
జానుశృతి మహారాజు తన మేడపైన మంత్రితో కలిసి విహరిస్తూ ఈ హంసల సంభాషణ విన్నాడు. వెంటనే తన మంత్రితో “ ఓ మంత్రి వర్యా ! నేను ఆ తేజోరాశి అయిన రౌక్య మహాశయుణ్ణి దర్శించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు వెంటనే వెళ్లి ఆ మహాముని ఎక్కడున్నా సరే వెతికి మన రాజ్యానికి తీసుకురండి” అని ఆదేశించారు. రాజాజ్ఞానుసారంగా, ఆ మహామునిని వెతకడానికి బయల్దేరారు మంత్రి , ఆయన రథ సారధి.
ఆ విధంగా వాళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ విచారిస్తూ , మధురలో ఉన్న శ్రీహరినిలయమైన జగన్నాధమును చేరారు. అక్కడ నుండి వాళ్ళు దానికి వాయువ్య భాగంలో ఉన్న కాశ్మీరమునకు వెళ్లారు. ఆపురము శ్రీ పరమేశ్వరుని నవ్వువలె తెల్లనిదై అనేక ప్రాసాదములతో అలరారుతూ ఉండేది. అందులో వేద వేదాంగ వేత్తలైన బ్రాహ్మణులు నివసిస్తూ ఉండేవారు. ఇక్కడి దైవబలము చేత మూగవారు సైతము వాక్చాతుర్యము కలిగిన వారవుతూ ఉండేవారు. అక్కడ జరిగే యజ్ఞముల ధూపము ఆకాశమంతా వ్యాపించి అంతరిక్షము కాలమేఘములాగా తేజరిల్లుతూ ఉండేది. మాణికేశ్వరుడు అనే పేరుతో అక్కడ పరమేశ్వరుడు పూలందుకొంటూ ఆ పురవాసులందరకు సుఖము కలగజేస్తూ ఉండేవాడు. ఆ స్వామీ కృపకలిగిన మానికేశ్వర మహారాజు సమస్త శత్రువులను జయించి, దిగ్విజయాన్ని పొంది ఆ మహారాజపురాన్ని పాలిస్తూ ఉండేవాడు .
ఆ మాణికేశ్వర ఆలయ ద్వారము దగ్గర ఒక ముని కూర్చుని ఉండడం చూసి మంత్రి సారథి అతనిని సమీపించి, ప్రణామము చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆయనే తాము వెదుకుతున్న రౌక్య మునీద్రుడని తెలుసుకొని ఎంతో సంతోషంతో, తమ రాజుగారి ఆహ్వానాన్ని వినిపించారు. ప్రతిష్ఠాన పురాన్ని పావనం చేయాల్సిందిగా ఆహ్వానించారు. కానీ ఆయన “పూర్ణానందుడైన నేను ఎక్కడికీ రాను. ఎవరైనా నా మనస్సు తెలుసుకొని, నాకు సేవ చేయాలి” అన్నారు. అది విని వాళ్ళిద్దరూ ముని అభిప్రాయాన్ని రాజు గారికి తెలియజేశారు.
వెంటనే ఆ రాజు రౌఖ్యుని దర్శనాన్ని చేయాలనుకుని , ఆయనకి ప్రీతికరమైన కానుకల్ని వెంటతీసుకొని బయల్దేరాడు . ఒక వెయ్యి గోవులని, మంచి వస్త్రాలను, ముత్యాల హారాలను కానుకగా తీసుకుని రౌఖ్యుని సన్నిధికి పోయి ఆ కానుకలన్నీ అతని ఎదుట ఉంచి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు ఆ ముని రాజు భక్తికి కోపగించుకొని, ఈ వస్తువులన్నీ పరిత్యాగినైన నాకు ప్రియాన్ని కలిగించవని తెలియదా ? నీ వస్తుజాతమంతా తీసుకుని తిరిగి తీసుకుని వెళ్ళిపో నాకేం అక్కర్లేదు. స్వయంగా శ్రీహరే నావాడైనప్పుదు నాకీ సంపదలతో పనేముంది రాజా !” అని పరుషంగా పలికాడు.
రాజు ఆశ్చర్యపోయి, “అయ్యా మీకీ వైరాగ్యము, శ్రీహరిని పొందగలిగిన ప్రతిభ ఎలా కలిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను . నా పై దయతో సెలవియ్యండి” అని అడిగాడు. “ఓ రాజా నేను నిత్యము భగవద్గీతలోని ఆరవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉన్నాను. అందువల్ల నాకు పూర్ణమైన వైరాగ్యము కలిగింది . దేహం కూడా భారమవుతున్నది. కానీ ఆ శ్రీహరి కృప మాత్రము నిండుగా కలిగినది” అని రౌక్యుడు వివరించారు.
ఆనాటి నుండి రాజు కూడా భక్తి కలిగి భగవద్గీతలోని ఆరవ అధ్యాయాన్ని పారాయణ చేయడం మొదలుపెట్టాడు. దానివలన రాజుకి అతి అల్ప కాలంలోనే మోక్షం లభించింది . రౌక్యుడు ఆ మాణికేశ్వరుని ఎదుట ఆరవ అధ్యాయాన్ని పారాయణ చేయడాన్ని వినడం వలన, అక్కడికి వచ్చినటువంటి దేవతలు కూడా అత్తమతమ స్థానములకు చేరుకున్నారు.
కావున ఈ ఆరవ అధ్యాయాన్ని ఎవరైతే నిశ్చల భక్తితో నిత్యము పఠిస్తారో వారు సర్వదానముల వలన కలిగే ఫలాన్ని పొంది, చివరకు విష్ణు రూపాన్ని పొందగలరు. ఇందులో సందేహమేమీ లేదు” అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు .
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !
*ప్రాంజలి ప్రభ*
Comments
Post a Comment