కర్మ సన్యాస యోగము.. ఐదవ అధ్యాయమ.. పార్ధుని ప్రార్థన
శ్రీ మద్భగవద్గీత కర్మ సన్యాస యోగము.. ఐదవ అధ్యాయమ..
పార్ధుని ప్రార్థన
శా. హే కృష్ణా మనసౌనుకర్మయుగమే ధ్యేయమ్ము బంధమ్ముగా
హేకృష్ణా విధిగాను కర్మ మదిలో హీనమ్ము గా మార్చె లే
హేకృష్ణా జయమేననే కళలే హేమాత యోగంబుగన్
హేకృష్ణా యిదిమానవాలికి సహేతమ్ము యేలయ్యెనున్ (01)
శా.హేవ త్సా వచయించితీసహనమే యోగంబు కర్మoబుగన్
హేవత్సాయిది చిత్తశుద్ధిగ కళే హీనమ్ము కానట్టిదిన్
హేవత్సాయిదియాత్మ నిష్ఠగనునే శ్రేయస్సు పొందెందుకున్
హేవత్సాయిదికర్మయోగముగనే జీవమ్ము ధ్యేయమ్ముగన్ (02)
ఉ .కోరిక లేని జీవితము కోర్కెల మోహము ద్రోహబుద్ధి నె
వ్వారిని దూషణమ్ము కథ వాసము లేకయు సన్యసింపగన్
వారలె కర్మసిద్ధులగు వాకిట కాంతుల బంధమేయగున్
దారిగ నిత్య హద్దులు విధాతయుహావం.కల్పన కర్మయోగమున్ (03)
ఉ ..వీడుము కర్మయోగమును వీనుల విందుగ సన్యసమ్ముగన్
వీడుము సన్యసమ్మను సవీలును బట్టి కర్మయోగమున్
పాడిన వేరు వచ్చుఫలి తాలను మూర్ఖుల ఆజ్ఞయేయగున్
రూఢగ నొక్కటేదలువ లోకయుపాసన మేను మేలుగన్ (04)
మ ..విధియే జ్ఞానము సిద్దిపొందిక యనే విద్యా యలంకారమున్
మదిగా కర్మల యోగసిద్ధియనగా మార్గమ్ము జ్ఞానమ్ముగన్
తిధిగా రెండును యాచరించగల ఖ్యాతీ సామ్య మాన్యమ్ముగన్
కథగా కాదును యేకనిష్టగుణ మేకామ్యమ్ము గానిత్యమున్ (05)
ఉ ..కర్మల ఎప్పుడూ తలపకాలము చేష్టలు వింతయేయగున్
కర్మలు మానటే మనిషి కానిది చేసియు కష్టమేమదిన్
కర్మలు చేయనిష్ఠగల జ్ఞానము పొందియు కర్మ యోగ్యతన్
ధర్మమనోమయమ్ముగను ధన్యత పొందియు శుద్ధి కర్మగన్ (06)
మ .హృదయమ్మే నదిగానుకాంతిగను సాహు స్వార్ధమేలేకయున్
పదశాంతీమనసౌను యిoద్రియ ము యీప్రాణమ్ము యోగమ్ముగన్
కధలేకర్మలుగాను సర్వమయమే కాలమ్ము నేత్రమ్ముగన్
చెదిరేబుద్ధి కళంకమైబతుకు చేజార్చేటి దేహమ్ముగన్ (07)
ఉ .. జ్ఞానవిసిష్టులే వినుచు జ్ఞప్తిగ గుర్తుగ గాధచిత్రమున్
వీనులకన్నులే గనుచు విశ్వ విజేతగ మాయ నేత్రమున్
పానము సేయుచూ తినుచు పాశము నిల్పుచు యజ్ఞడట్లుగన్
మానక శ్వాసజీవిత సమానము నెంచియు నీడసంసృతిన్ (08)
శా...కన్నుల్లేకలగామూసితెరిచీ కాపాడు కావ్య కారమున్
ఎన్నోతాకుచునేమనస్సువిడిచే నీదై న చేయగల్గగన్
నన్నేమన్ననజేసిదల్చిసహనం స్నేహమ్ము కర్మయోగమున్
ఎన్నోచేయగ యన్నియూ సమముగా ఏర్పాటు కాయమా నమున్ (09)
చం .ఎవరుగ కర్మలెల్లను నయాన భయాన సమర్పయామిగన్
నవవిధయర్పనేగతి సనాతనమార్గమునెంచి సేవగన్
వివిధ సకర్మలే సమయ విశ్వమునెంచి సహాయ మేయగున్
భవభవమేను తామరపు పత్రము వారిని వోలె మోక్షమున్ (10)
మ .తమశుద్దాత్మను గాంచగా మనసుయే తాకీదు తత్త్వజ్ణుడున్
తమకాయమ్మనబుద్ధియే విజయమై తాళీకుడై స్నేహమున్
మమతాసక్తియులేక శాంతిగనుటే మార్గమ్ము గామెత్తగన్
తమకర్మల్ విధి నాచరించగలగే తాహత్తు యే యోగమున్ (11)
ఉ .యోగుల కర్మలే ఫలము యోగ్యత కల్గియు దాహతృప్తిగన్
త్యాగము జేయుటేఫలము దర్శన భాగ్యము సత్యమేయగున్
భోగులు కామబుద్ధిగను బోనము చేయుట పాపకర్మగన్
సాగును కర్మలెళ్లమది శాంతియు లేకయు జీవనమ్ముగన్ (12)
చం .మనసు వశంబు జేకొని సమాన సమర్ధ సహాయ దేహమున్
మనసునువీడి యేమి యన మాయ ఫలంబును పొంద సక్తిగన్
తనమన కర్మలేవి యన దక్క గుణమ్ము నుబట్టి సాగగన్
ఋణమగుకాయమే మదిగ రక్ష సుఖంబుయు శాంతి మోక్షమున్. (13)
చం ..సరియగు వేళ కామ్యమగు సాధ్యమసాధ్య మనేది సంకటే
పరిపరి విద్యలేగతియు పాశ యుపాసముగాను బాధ్యతే
స్వరపరమేశ్వరా విధివిశాల విధాత మదీయ లక్ష్యమే
పురుషులనాడిసంధియు సపూజ్యగపృద్వి ప్రసన్న తావిధిన్ (14)
మ .సుకృతా ఘంబులనేవియో మనసుకే సూత్రమ్ము పుణ్యమ్ముగన్
నొకటేనన్నది లేదులేదనుటయే నుల్లమ్ము తోడన్ గనున్
వికసించే వయసౌను జ్ఞానమనుటే విశ్వమ్ము జిజ్ఞాసగన్
అవకాశంబుయు మోహమే మది కళేయాకర్ష జాడ్జ్యమ్ము గన్ (15)
మ .సుఖ దుఃఖాలను నావిగాయనుటయే సూత్రమ్ము కాదేలగన్
యికయజ్ఞానము కప్పియే మనిషీ యిచ్ఛా వివాదమ్ముగన్
వికసించేకిరణమ్ముగాంచగలిగే విశ్వాస దేహమ్ముగన్
సకలమ్మున్ స్థితి గాంచగల్గుటగనే శాంతీ కళా గమ్యమున్ (16)
మ .పరమాత్మే గతి బుద్ధిగానుకళ యేప్రావీణ్య మేలే విధిన్
పరమాత్మేను మనస్సుగా తలచుటే ప్రాధాన్యతాలక్ష్యమున్
పరమాత్మే సకలమ్ముగా పలుక గాప్రాబల్య మేసత్యమున్
పరమై జ్ఞానము సాధనే స్థితిగనే పాపమ్ము మోక్షమ్ముగన్ (17)
ఉ ..విద్య యన్నది పొందగల్గుట విశ్వమాయగ నేస్తమున్
విద్య బ్రహ్మగ బ్రాహ్మణామది విశ్వ వాహిని వేదమున్
విద్యగోవగు విద్య హస్తిని విద్య విశ్వస నీచుగన్
విద్య దేహము విద్య మోహము విద్య సర్వము యాత్మగాన్ (18)
మ ..సమభావస్థితిగామనస్సుగల యీసామ్రాజ్య సంపూర్ణతా
సమవిజ్ఞానము ధర్మమై ప్రకృతి ప్రాసావిద్య నిర్దోషమై
గమనమ్మున్ పరమాత్మతో జగతి సాగారమ్ము దేహాత్మగన్
మమతామానస మందిరమ్ముగనుసామర్ధ్యమ్ము బ్రహ్మమ్ముగన్ (19)
మ .దరిచేరంగ సుఖంబుయే గనక పొందాసౌఖ్యమేలేవింతన్
మెరుగాయేగుణ వేత్తనీశునుడు సామాన్యమ్ము దైవమ్ముగన్
తరుణానాసిరి బుద్దిగాకదల సంతాపమ్ము మూలమ్ముగన్
పరవమ్మున్ మదిశాంతమే గలిగి సాపాటేను దేహమ్ముగన్ (20)
శా..సుస్తీబాహ్యవరమ్ముమర్చికదిలే సూన్యమ్ము నిశ్చేష్టగన్
గస్తీమార్గముగానువిశ్వకళలే కాలమ్ము విశ్వాసమున్
అస్తిత్వం మనసౌను కర్మకళలే యానంద సత్వమ్ముగన్
మస్తిష్కమ్ము గనేప్రపంచవిధి మార్గమ్ము జీవమ్ముగన్ (21)
ఉ ..దేనిని పొందితే నదియు తేజము వల్లన మేలుయే యగున్
గానగ కారణమ్ముగతి కాలపు నీడలు వెంటనుండినన్
దానికి సౌఖ్య దుఃఖములు దారిగ నేర్పుగ దర్పమేయగున్
వానికి లొంగిపోకమది మది వాంఛలన్నొదల జ్ఞానమేయగున్ (22)
శా .ఏయత్నమ్ము కనేటి శీలి గెలిచే యేమాయ మర్మమ్ముగన్
కాయమ్మున్ నిలుపా నతండుగనే కామాధి ధర్మమ్ముగన్
గాయాలన్ సహనమ్ముగాను గలడో గంబీర్య దేహమ్ముగన్
ఆయాతీరుగసత్యయోగి యతడే యానంద సౌఖ్యమ్ముగన్ (23)
ఉ ..ఎవ్వడు లోన సౌఖ్యమును యే విధపొందియు నేర్పు గుండునో
ఎవ్వడులో రమించుకళ యేదియె యైనను శాంతికోరునో
ఎవ్వడు విద్యబోధగను యెల్లరి క్షేమము చూచు చుండునో
అవ్వడు సాంఖ్యయోగిగను యాదర్శ బ్రహ్మమ్ముగన్ (24)
ఉ ..నీరద దేహరూప దివి నిర్జర పాపము చేయగుండగన్
శారద నామ మాధురికి జ్ఞాన ప్రభావము ముగ్ధమేయగున్
దారిగ సంశయమ్ము లను దాతగ దీక్షయు సాధనేయగున్
సారసలోచనా మనసు సర్వం నేస్తము బ్రహ్మ వేత్తగన్ (25)
ఉ. సారధి పేరుపేరున సుసాధ్యము లెల్లరి యుద్ధ నాణ్యతన్
వారల నెల్ల పోరు పరివారము బట్టినెరుంగు మర్జునా
వారల తాత బందువుల వాంఛలు తీర్చగ వచ్చి యుండగన్
పోరును సేయులక్షణము భూపతి జాతికి నెంచగల్గగన్.. .. (26)
ఉ . నన్నెవరూ మనస్సును ననాదిన నాటిన తత్వ బుద్దిగా
అన్ని తపో మయమ్ముగ సహాయ వినమ్రత నెంచ యుక్తిగా
అన్నియు లక్షణాల పరకాయము నెంచియు యుండ శక్తిగా
అన్ని సజీవులై మనసె ఆశ్రిత పుత్తడి కాంతి ముక్తిగా (27)
మ . జయమేయిoద్రియమౌను సత్యమగు వాంఛావాక్కు విధ్యేలు లే
భయకోపాదులు వీడిశాంతిమయ ప్రాబళ్యమ్ము నిత్యమ్ముగన్
నియమమ్ముల్ వినిచేయుటే మనసు సాన్నిధ్యమ్ము సత్యమ్ముగన్
ప్రియమోనే వశమేనుమోక్షముయె సంప్రీతి స్వరమ్మేనులే (28)
మ . అతిధీరుo డతి దాన సూరుoడతి రమ్యాకారుడత్యంత సు
వ్రతు దంచుందను సన్నుతించు కవి వాగ్వాపార మెల్ల న్ యధా
ర్ధతమం బై విలసిల్ల మది సాధ్యాప్రేమ యజ్ఞముగన్
స్వత సిద్ధీ భగవత్ మహత్యమగు విశ్వాసమ్ము మహేశ్వరమ్ (29)
సన్యాసయోగో నామ పంచమో ధ్యాయః ( తెలుగు పద్యాల భావము సమాప్తము ) **
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
*శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి (5)*
గీత పంచమ అధ్యాయ మహత్యం
గీతా పంచమాధ్యాయముతో మనకి ఎలాంటి సంబంధం ఉన్నా, అది జన్మరాహిత్యాన్ని అనుగ్రహిస్తుంది .
భగవద్గీతని చిన్ననాటి నుండే పారాయణ చేయడం , చిన్న చిన్న శ్లోకాలని పలకడం పిల్లలకి అలవాటు చేయడం ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది ఆ చిన్నారులకి ఎంతో మేలు చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు. మనకన్నా కూడా , విదేశీయులు భగవద్గీతని ప్రామాణిక గ్రంధంగా పఠిస్తూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, తెలిసికానీ, తెలియకగానీ, భగవద్గీతని చదివినా , విన్నా , లేక ఆ గ్రంథంతో మరేదైనా అనుబంధం కలిగినా జన్మరాహిత్యాన్ని , పుణ్యలోకాలనీ ప్రసాదిస్తుందని పద్మపురాణం చెబుతున్న మాట. ఈ మాటని స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీ దేవికి వివరించారు. ఆ కథ ఇక్కడ తెలుసుకుందాం .
లక్ష్మీ దేవికి నారాయణుడు చెప్పిన కథని పరమేశ్వరుడు ఈవిధంగా పార్వతీదేవికి వివరిస్తున్నారు. “ దేవి! అందరి చేత ఆదరించబడేటటువంటి పంచమాధ్యాయ మహత్యాన్ని సంక్షిప్తంగా చెబుతాను. సావధాన చిత్తవై అవధరించు. మద్రదేశములో బురుకుత్సము అనే పట్టణం ఉండేది . అందులో పింగళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాధ్యయనము విడిచి దుష్ట సాంగత్యం చేస్తూ సంగీతమును, నాట్యమును అభ్యసించి ప్రసిద్ధుడై, ఒక రాజాస్థానములో స్థానం సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొందాడు . అక్కడ ఒక స్త్రీని ప్రేమించి, ఈ ప్రపంచంలో ఆమె కంటే అధికమైనదేదీ లేదన్న చందంగా ఆమెను అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. రహస్యముగా రాజుతోటి ఇతరుల పైన లేనిపోని నేరములు ఆరోపించి చెబుతూ ఉండేవాడు.
ఆమేకాక, పింగళునికి వేరే కులములో జన్మించిన అరుణ అనే భార్య కూడా ఉన్నది. ఆమె, పరస్త్రీ వ్యామోహములో రమించిపోతున్న పింగళుని ప్రవర్తనకి విసిగిపోయి, మరొకరిని ప్రేమించి అతనితో కాలం గడపడం మొదలుపెట్టింది. ఆమె వ్యామోహం బాగా ముదిరిపోయి, ఎక్కడ తన వ్యవహారానికి భర్త అడ్డు తగులుతాడో ననే ఉద్దేశ్యంతో, ఒకరోజు అర్ధరాత్రి పింగళుని తలపై పెద్ద బండవేసి హత్య చేసింది . ఎవరికీ అనుమానం రాకుండా భర్త కళేబరమును భూమిలో పాతిపెట్టేసింది.
అలా చనిపోయిన పింగళుడు , యమలోకానికి చేరాడు. చేసిన పాపాలకి నానా శిక్షలూ అనుభవించాడు. తిరిగి ఒక అరణ్యములో గ్రద్దగా జన్మించాడు. అరుణకూడా కొంతకాలానికి భగంధర రోగముతో నానాయాతనా అనుభవించి మృతి చెందింది. నరకయాతనలను అనుభవించి, గ్రద్ద నివసించే అరణ్యములోనే చిలుకగా జన్మించింది.
గ్రద్ద ఒక రోజున ఆహారము కోసం తిరుగుతూ ఉండగా ఈ ఆడ చిలుక దానికి కనిపించింది. పూర్వజన్మ వైరము చేత అవి రెండూ కొట్టుకున్నాయి. అక్కడ నీళ్లతో నిండిన ఒక ఋషీశ్వరుని పుర్రె పడి ఉంది. ఇవి రెండూ కొట్టుకొని, కొట్టుకొని ఆ పుర్రెలో పడి చనిపోయాయి. మళ్ళీ యమదూతలు వచ్చారు. వారిద్దరిని యముని దగ్గరకు తీసుకుని పోయారు . కానీ ఈ సారి వారికీ యముడు నరకయాతనాలని శిక్షగా విధించలేదు. “దూతలారా వీళ్ళిద్దరూ కూడా ఆ మునీశ్వరుని పుర్రెలో పడి మృతి చెందారు. అందువల్ల సర్వపాపములూ నశించి పరమ పవిత్రులయ్యారు. కాబట్టి వారికి ఇష్ట లోకములను ప్రసాదిస్తున్నాను” అన్నారు.
ఒక్కసారిగా వారిద్దరూ కూడా ఆశ్చర్యపోయి, ధర్మరాజుకు నమస్కరించి “మహాత్మా! పూర్వ జన్మలో మేము అనేక పాప కృత్యాలను చేశాము. ఎలాంటి పుణ్యాన్ని చేసి ఎరుగము. అలాంటిది, మాకు ఇంతటి సుకృతము కలగడానికి కారణాన్ని వివరించండి” అని అభ్యర్థించారు. అప్పుడా యమా ధర్మరాజు ఎంతో కరుణతో ఇలా చెప్పారు. “ ఓ పుణ్య దంపతులారా! గంగా తీరంలో ద్వేషరహితుడు, ఉత్తమజ్ఞాని అయిన వటుడు అనే మహాత్ముడు ఉన్నాడు. ఆయన నిత్యము నియమముతో గీతా పంచమాధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. గీతా పంచమాధ్యాయ శ్రవణ మాత్రము చేత మహా పాప రాశి కూడా దహించుకు పోతుంది. జీవులు పునీతులవుతారు. అటువంటి ప్రభావం చేతనే వటుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొంది దేహమును విడిచాడు. గీతా పంచమాధ్యాయ పారాయణం వలన అతని దేహము పరమ పవిత్రమైంది. అటువంటి మహానుభావుని కపాలములో పడి మీరు ఇద్దరు ప్రాణాలు విడిచారు. కాబట్టి మీరు కూడా పునీతులయ్యారు. అందువల్లనే మీకు ఇస్తలోక ప్రాప్తి కలిగింది” అని వివరించారు.
వారిద్దరూ కూడా అప్పుడు పుష్పక విమానాన్ని అధిరోహించి వైకుంఠనికి వెళ్లారు. కాబట్టి క్రూర కర్మములను ఆచరించి, పక్షులై జన్మించినప్పటికీ, ఏ కారణం చేతనైనా కూడా గీతా పంచమాధ్యాయ సంబంధము కలిగినట్లయితే తప్పక జన్మ రాహిత్యమై వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది.” అని మహేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పారు.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!
*ప్రాంజలి ప్రభ*
Comments
Post a Comment