శ్రీ భగవద్గీత.. 1 nundi 3
- -*భగవద్గీత అంటే ఏమిటి?*
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’*
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. గీత చెప్పేదీ నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*
*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*
*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*
ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*
*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*
-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
-సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
-పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
=ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
-నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.
గీత చదువుకో..... నీ రాత మార్చుకో.....
🕉🌹🙏ఇదే ప్రాంజలి ప్రభ
-(())--
శ్రీ భగవద్గీత... మొదటి అధ్యాయము ... అర్జున విషాధయోగము ---
తేటగీతి పద్యాలు
అర్జునుడు తన మానసిక వ్యధను శ్రీకృష్ణ పరమాత్మ కెరింగించి నివారణోపాయము వర్ణించుట. (ఒకటో శ్లోకము నుండి పదో శ్లోకం వరకు)
దుతరాష్ట్రుని ప్రశ్న
ధర్మ భూమిన కురుక్షేత్ర తన్మయ మది
కర్మ లన్నియు నేమియు కనగలరగు
యోర్మి గల సంజయ తెలుపు ఉన్న కధలు
నాసుతులు పాండవులు ఏమి నటన యుద్ధ ..... ....1
భగవద్గీత...సంజయ వ్యాఖ్యనము
అప్పుడేరాజు దుర్యోధ నాశ పెరిగి
గొప్పగ దలంచి గురువుకు గొప్ప చెప్ప
చేరె పాండు తనయు సేన చేష్ట తెలుప
ప్యూహ రచన కాశ్చర్యముయే పుత్ర ప్రేమ...... .....2
హే గురుబ్రహ్మ చూడుడు హీన మతియు
ద్రుపద కొమరుండు పధకము దుపరి విధము
సైన్య మెల్ల మహా గుణ సిరిని తెలిపె
విజయ ఆంతర్య మంతయు వివరణ మది...........3
అచ్చట గలరు మీరలు అలపు లేక
మెచ్చ యోధుల గుణముల మేధ మదన
తెచ్చిన ధనస్సు లేత్తెడి తిధియు అగుట
వారు వీరు యుద్ధము చేయ వేగ పడగ...............4
పాండు పుత్రులు బాలకుమారు కళలు
కండబల ధైర్య సాహసం కనులవిందు
వైరి జనులై కలయికలు వైద్య యుద్ధ
నిండె సంగ్రామ సామంత వీర భజన...................5
సూరులు యుయుధానుడు కుంతి భోజ సౌర్య
వంతు డగు అభి మన్యుడు వంత పలుకు
మనుజ శ్రేష్ఠడు శైభ్యుడు మంత్ర క్రియలు
సమర ధీమంత యోధులు సంఖ్య పెరిగె..............6
భూసుర తెలిపెద వరణ్య భుక్తి కొరకు
తెలుసుకొనుము వేసారక విజ్ఞత ఇది
నాదు సేన మహావీర నవ్య విజయ
జ్ఞాపకమ్ముగా తెలిపేను జ్ఞాతి బలము................. 7
అవుననిది కాదనునది మనసు ఎరుక
ఎరిగినంతతాను ఎవరో ఎరుక పరచ
అక్కరకు రాని వీరుల అసలు తెలుప
ముక్కలగు నక్కరులచెక్క ముదిత యుద్ధ.............. 8
భీష్మ కర్ణ కృపాచార్య చిత్తశుద్ధి
భూరి శ్రవ, వికర్ణసంపూర్ణ శాస్త్ర
యుద్ధ కళ విశారద శక్తి యున్న సర్వ
విద్యతో ను సంపన్నల విజయ కాంక్ష...... .......... 9
శ్రీ భగవద్గీత.. అర్జున విషాద యోగము.2
అపరిమిత సేన కూడగ ఆద రించె
అపజయమే లేని భీష్ముడు ఆది నుండె
సపరిమిత సేన భీముడు సకల మాయె
అపజయము లేదు సులభము అభయ పలుకు.........10
ఆత్మ స్వరూప వర్ణన (11వ శ్లోకం నుండి 30 వ శ్లోకం వరకు)
విశ్వసించు నిరతముగా విద్య తోడు
మీరు నడుము బిగించియు మేలు చేయు
కావున విజయంబనుచు నే కదల గలుగు
భీష్ము ని సహన నిలువుడు భీతి వలదు.....................11
భీష్ము డంత టొనరించె సింహ నాద
శంఖమును పూర ఉత్సా హ సమయ వృద్ధి
అరయచునె రాజు నటపురి తెల్పు చుండె
సమయ ఉత్సా హ టోట్పాటు సమర భేరి.................12
ఆ సమయ మందు ఆనంద ఆత్రుత యగు
తప్పెట ధ్వని వినిపించ దట్ట మగుట
చప్పుడు నరయగ నె గొప్ప చేష్ట లాయె
భీతిని గలిగి భీబత్స భీకర మగు...................... . .13
ఉల్లమున ఉత్సవ కిరీటి ఉన్నత మగు
తెల్ల గుర్రాల రధమున వెలుగు చున్న
నల్ల నల్లని కృష్ణుడు నడుప చుండె
శంఖ కంఠరవము చూప సమయ మనియు..... .....14
పాంచ జన్య శంఖము యూదె పాండు శ్రేష్ఠ
కృష్ణ, అరుణ కిరీటితో తృప్తి మీర
అర్జునుడు దేవ దత్తము యూదె నపుడు
డెందములు దాకి పగిలెడి చందముగను..... ..... . . 15
భీమ పౌ౦డ్రమ నెడి శంఖము భీతి జూపె
పాండు రాజు కుమారులు పలుకు శంఖ
మాయె, తమదైన శక్తియే మనసు యుద్ధ
మీరుచు దెలుపనంతమై విజయ మగుట ..... ...... .16
నెరుగు శరవిద్య ధీరులు నేటి కళలు
బంధు హిత దృపదసుతుడు బలము గలిగి
వరపరాక్రమ గుణ మహా వీర వరులు
నకుల, సహదేవ, శాంఖాలు నయన విందు...........17
అపజయ మెరుగ నీ సాత్యకి ద్రు పదుడు
ద్రౌ పతీ పుత్ర సుధీరులు ధరణి యందు
వినిపింప స్వ శంఖాలు వేగ పరచు
యుద్ధ కాంక్ష గలిగి వచ్చె యుద్ధ భూమి.................18
శ్రీ భగవద్గీత.. అర్జున విషాద యోగము. 3
మన్ను, మిన్ను, ప్రతి ధ్వని మహిమ జూపె
దద్ద రిళ్ళ చేయు కౌరవ దమన నీతి
గుండెలే ముక్కలగు చుండ గుర్తు, శంఖ
రవము మొండిసుయోధన రవ్వ మెరుపు....... 19
అంతటా ఆయుధప్రయోగమ్ము మొదట
యుద్ధ సన్నద్దు లైయున్న ఉద్య మనెను
తోడు ప్రార్ధుడు నాదము తొలుత తెల్ప
ధనసు నారి బిగించి యె పలుకు పలికె..... ..... 20
తదుపరి తెలిపె సారధి తోను వినయ
అర్జునుడు పల్కు నడుపుము రథము కదన
భువి నడుమ నిలుపుము కృష్ణ భూరి నడుమ
వదనములు కనెదను నేను వందనములు........ 21
నేను నుగని పోరాట నియమ మేను
వారల నెరుగు వరకు హే సారధిగను
బెవరి పలుకులు వినగల విధిని తెలుప
సారధి రథమును సమర మందు యుంచు..... . 22
యోధులను నేను గమనించ యోగ మాయ
దుష్ట బుద్ధి దుర్యోధన దుష్ట క్రియలు
ప్రియము గూర్చ రాజులు వచ్చె పేరు కోరి
బుద్ధి శుద్దత్వమను జీవి భుక్తి నిచ్చె.......... ...... 23
*సంజయవ్యాఖ్యానము*
విజయని నివేదన వినియు విశ్వ చరిత
కనదగు గురువు భీష్మడు ఘనమగు కళ
సమయ అనుకూలింపఁగ వుంచె సమర రధము
సారధి వినయంబుగ నిల్పె సహజ విధము .... .... 24
సారధి పలికెను చూడుము సమర సేన
కదన రంగ సు యోధన కౌరవ కళ
పాండు మధ్యమ మదినిండ పరుల సేన
అహముతో భూపతులు యుద్ధ కాంక్ష ఇదియు ... ... 25
వార లెల్లను గాంచెను వరుస గుర్తు
కొచ్చె తాతలు జనకులు కొమ్ము కాసె
భాంధవ జనుల పోరాట మనసు తగ్గె
సర్వుల విలువ తెలిసిన వెను తిరగెను .... .... 26
గురుజనులు మేనమామలు గుర్తు కొచ్చె
వరుసకు సుతులు సోదర వాంఛ పెరిగె
మామలు మనుమలు మిత్రులు మనసు దోచె
సహృదయ పరివారంబును సమర మందు --- --- 27
పార్ధుని ప్రార్ధన
సమర మే చేయగా వచ్చి అర్జునుడుయె
బంధు జనులను గాంచియు భ్రమ దయ కృప
మమత జూపుచు నే శోక మాపు కొనక
ఇటుల బాగుగా పరికించి పలుకు పలికె ..... ...... .. .28
కదన రంగము సిద్ధమై కాళ్ళు వణికి
కళ్ళ తిరిగినట్లు తిరిగి కనుల ప్రేమ
దేహము శిధిలము అవయవాలు పట్టు
దప్పుచున్నది నోరెండి పోవుచుండె .... .... ..... .. 29
చేతి నున్న గాండీవము జార విడిచి
ఎరుగు చిత్తము మానెను ఏల చెప్ప
చర్మమే మండుచున్నది చెప్ప లేను
స్థిరముగా శక్తియే లేదు సెప్పు కృష్ణ .... ..... .... .. . ౩౦
*చాత్రధర్మమును అనుసరించి యుద్ధము చేయవలసిన ఆవశ్యకతను నిరూపించుట (31శ్లోకము నుండి 38 శ్లోకము వరకు)*
నశుభ సూచన కనుచుంటి నటన కాదు
స్వజనుల వధ తప్పు కనుక సమర మేల
కనుక శుభలాభ విజయము కోర నేను
చంపిన వెనుక సుఖముయె చేరు వవదు ..... ...... . 31
కోరనుమరింక రాజ్యము కోప మొద్దు
కోరను విజయ మొందిన భోగ మేళ
జీవిత గమనమ్ము ప్రయోజనముఏది
బ్రతుకు పోరాడి తిన్నది బాధ పెంచు .... .... ..... . 32
తెగువతో వచ్చె రాజులు చేవతోను
నఖిల సుఖములునెల్లరు వదలి వచ్చె
యుద్ధ తలపు గలిగి వచ్చె యోధులగుచు
విడుచు కోరికలెల్ల ను విధియనుచునె .... ..... .... ౩౩
కలరిట గురువులు తాత లగుట కలవ
రమగు తండ్రులు మనుమలు రణము నందు
గలరిట చెలిమి బావలు కదన రంగ
గలరిట మనసు మిత్రులు కదన మేళ .... ..... ... 34
కరుణ హృదయ ముల్లోకాల కాసు కోర
ఉళ్ళమే నశించిన కోర యుద్ధ కళను
ఇదియు కల్లోల మగు యుద్ధ ఇష్టమేల
కల్ల యగు రాజ్య కాంక్షయు కృష్ణ ఏల ... ..... .... 35
కౌరవ అధిపతి పుత్రులను, కాల సహజ
****
UUU IIU III IIU UUI IIU III
గణములు - మ,స,న,స,త,జ,న,లఘువు
యతి -12
II
వేదోద్ధారణ సేసినదెవరు? విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు? నాట్యానందము నొందెడిదెవరు?
ఆధారంబయి యుండెడిదెవరు? అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు? ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
అంతా తానయి నిండెడిదెవరు ? ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ? శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
కాంతిన్ గుండెల నింపెడిదెవరు? కంటిన్ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్ గూర్చొని పల్కెడిదెవరు? స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?
బోధన్ జేయుచుఁ దెల్పెడిదెవరు? ముక్తన్ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు? నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు? నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు? నీవే నేనని యన్నది యెవరు?
-------
కల్పిత వృత్తము హృల్లేఖ = ముక్తదా ముసమ్మన్ మత్వీ
త్రోవ యందు దుఃఖమ్ము లే దోపిడీల కంతెక్కడో,
జావకార దేహమ్ము లే దారి కానలేదెందుకో
జీవనమ్ము సౌందర్యమా చిన్మ యమ్ము లేదెందుకో
చేవయున్న కష్టమ్ము లే చేతకాని వాడెందుకో
బావ యన్న సందర్భమే బాధ్యతేది లేదెందుకో
మావ యన్న సంతృప్తియే మంత్ర మేది లేదెందుకో
నావమంగ సంద్రములో న్యాయమందు లేదెందుకో
దైవ మాలకించండుగా తాదృ శమ్ము లేదెందుకో
దనుజ లందు ధర్మమ్ము లే , దారగాను బాధక్కడో
వనము నందు సౌఖ్యమ్ము లే బిల్చి నంత బాదెందుకో
మనము గుాందుచున్ నె మాన సమ్ము యాసెందుకో
నినకులమ్ము నేత్రమ్ము లే నింగి నేల ప్రేమెoదుకో
మఱియుుఁ దాట ద్రుాంచేదిగా మధ్యమైన సేవెందుకో
బరమ మౌని మార్గంబుయే బంధ తత్వ మేలెందుకో
మదమెనట్టియోబాహువే మానసమ్ము సేవెందుకో
బ్రథిత గుర్వు నానెమ్ములే రాతి నాతి వీలెందుకో
జనక సేవ నిత్యమ్ముగా జాతరేను లేడిక్కడో
దనుజ బృంద సత్యమ్ము లే దాత స్వేచ్ఛ లేదెందుకో
వనము సేవ లోసామియే ఒక్కటొక్కటే యెందుకో
వనిత వాంఛ తీర్చేందుకే వాక్కు లన్ని మాయందుకో
కినుకుఁ బూన సర్వమ్ముగా కీర్తి పొంద లేదెందుకో
మునుల యాశ్రమమ్మేనులే ముఖ్య మార్పు లేదేందుకో
తృణమహత్య తత్త్వమ్ము గా తృప్తి నెంచ భోదెందుకో
ధనమహత్యసత్యమ్ము గా ధ్యాన మౌన మేలెందుకో
గుణమహత్య నిత్యమ్ము గా గుర్తుగాను యేలేందుకో
గణమహాత్మ విశ్వమ్ము గా గమ్య మౌను మేలెందుకో
*
ఈ లోకం లో ..
ఉషోదయ ఉషస్సు ఉపయోగించుకోరా,
యువతకు చేయూతగా అందరూ నిళ్వాలిరా,
మృగాలాంటి వారివద్ద దూరముగా ఉండాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
తల్లి తండ్రులకు సేవలు చేస్తూ జీవించాలిరా,
మనుష్యులను చైతన్య వంతులు చెయాలిరా,
బాసటగా నేనున్నానని ధైర్యము చెప్పలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
శీలం అనేది పవిత్రమైనది అని భావించాలిరా,
ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను వదులుకోకురా,
కుటుంబ కలహాలను నిగ్రహశక్తితో తొలగించాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దు కోవాలిరా.
గమ్యం చేరాలంటే న్యాయం, ధర్మం సత్యమై నుండాలిరా,
ఆందోళం కలిగించే ఆలోచనలు రానీయకురా,
విశ్రాంతి, సుఖనిద్ర అందరికి కలిగించాలి రా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
మానసిక వికలాంగులను ఆదుకోవాలిరా,
నిద్ర ఆహారము అధికముగా తీసుకోకురా,
అనాధలను ఆదుకోని ఆనందం అనుభవించాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
ఒంటరివాడవని ఏనాడూ అనుకోకురా,
అందరూ మెచ్చుకోనే జీవితం గడపాలిరా,
తప్పును నిర్బయముగా ఒప్పుకోవాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
వైద్యులు భగవమ్తునితొ సమానమని భావించలిరా,
అనారోగ్యులను ఆదుకో మరోజన్మ లేకస్వర్గమురా,
ఆశలతో వైద్యవృత్తిని అభాశుపాలు చేయకురా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
వికసిత పుష్పాలుగా,నిత్య నూతనంగా ఉండాలిరా,
జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ కొత్తవి భోధించాలిరా,
పెద్దలు చెప్పిన మాటల అర్ధాన్ని గ్రహ్మిచాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
ధనమే శాశ్వితమని పరుగులు తీయకురా,
ఆడది ఆట బొమ్మని ఎప్పుడూ తలచుకు రా,
కామానికిలొంగి స్త్రీకి బానిసగా మారకూరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
దిక్కులేనివారికి నీవే దిక్సుచిగా ఉండాలిరా,
దినదినగండంఅనేది మనసులోకి రానీయకురా,
దివ్యత్వం పొందే మార్గం అందరికి చుపాలిరా,
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా.
--((*))--నేటి కవిత 2013
మాట మౌనమై, హృదయ తాపమై,
ప్రణయ రాగమై, శ్వాసలుగా ఒకటై,
మేనులో తాపమై, అధరాల దాహమై,
ఆరాట పోరాటమై, మనసుగా ఏకాంతమే.
అందమైన అబద్ధానికి అందరూ బంధువులే
భావి పౌరులు నాందీ దీప కాంతులు లే
నిప్పులాంటి నిజానికి అందరూ శత్రువులే
తెలివిగా మంచి ప్రవర్తనకు అందరూ మిత్రులు లే
మనదన్నది ఏదీ లేదు అంతా మిధ్యా
ప్రేమ అనే స్నేహాల మధ్య నలిగి పోతాము మిధ్యా
ఆత్మగౌరవంతో ప్రతి ఒక్కరు బతకాలనేదే మిధ్యా
అభిమానం ఆత్మీయత ఆదర్శనీయం మిధ్యా
ఏది చూపు ఎంతవరకు యెదను తట్టే వర్షం మేది?
వాది వైపు కొంతవరకు పదును తట్టే అర్థం యేది?
మాది అన్న స్వార్థ తలపు చెరచు తట్టే ధర్మం యేది?
గాలి కింద రూపు మలుపు భవాని కట్టే సత్య మేది?
హృల్లేఖ - ర/య/య/జ/త/గ UIUI . UUIU . UIUI . UUIU
16 అష్టి 19019
*****
UIU IUI UIU IUI UIU IU
ప్రాజలి శివ ప్రభ - సుగంధి
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పళ్ళ తోను పూజ సల్పి నాను నన్ను బ్రోవు ఓం శివా
ఇళ్ళు వళ్ళు గుల్ల అయ్యె ఐన నిన్ను వీడ ఓం శివా
కాళ్ళు పట్టి తల్లి తండ్రి లందు పూజ సల్పె ఓం శివా
ఒళ్ళు పట్టి ఆశ తీర్చి ఓర్పు చూపు చుంటె ఓం శివా
కాల మాయ యున్న అడ్డు గోడ లున్న ఓర్పు ఓం శివా
గోల లెన్ని చేయు చున్న పూజ నీకు చేసె ఓం శివా
పాలు పెర్గు తేనె నీరు తోను పూజ నీకె ఓం శివా
బేల ఆశ చూపి యున్న పట్టు వీడ లేదు పార్వతీ పతీ
తల్లి తండ్రి గుర్వు ఆలి నమ్ము తున్న ఓం శివా
చల్ల నమ్మి బత్కు తున్న నాకు భక్తి పెంచు ఓం శివా
చల్ల నైన నీదు మాట మేను శక్తి నివ్వు ఓం శివా
చల్ల గాను వెచ్చ గాను చూసి యున్న నేమి ఓం శివా
కళ్ళ లాడ కుండ వేద భూమి యందు ఉండు ఓం శివా
జల్లు కుర్సి యున్న చెట్టు క్రింద నైన ఉండు ఓం శివా
ఇల్లు కట్టి సేవ లన్ని నేను చేయ నుంటి ఓం శివా
కళ్ళు తెర్చి దుష్ట మాయ తొల్చి మమ్ము బ్రోవు ఓం శివా
గాలి నిచ్చి బుద్ధి నిచ్చి సేవ చేయ మన్న ఓం శివా
జాలి లేని మూర్ఖ భావ మున్న జాతి లోన ఓం శివా
మాలి లాగా ఉన్న నేను నీకు ఏల పూజ ఓం శివా
ఆలి చేయ మన్న వన్ని చేసి యున్న పార్వతీ పతీ
మంచిమాటలన్ని మానసమ్ముగాను మాయ ఓం శివా
కంచి చేరి మాత కొల్వ దల్చినాను మాయ ఓం శివా
పంచ తంత్ర మెంతయున్న పంచ నేర్పు మాయ ఓం శివా
వంచి తే మనస్సు గాను మాటలన్నిమాయ ఓం శివా
ఓం నమశివాయ ... ఓం నమశివాయ .... ఓం నమశివాయ
--(())--
మోటకము - త/జ/జ/లగ UU IIU IIU IIU
11 త్రిష్టుప్పు 877లో మాయ
*
నాయందలి ప్రాణము నీకెగదా
ప్రాయమ్మను భారము నీకెగదా
మాయమ్మున మౌనము నాదికదా
ధ్యేయమ్మగు విద్దెల నాతి కదా
రేయంతయు కోరిక రేగునుగా
ప్రాయమ్ముయు వెల్గుగ సాగెనుగా
ఆయమ్ముల గాయము నీకెగదా
కాయమ్ముయు గాళము నీవుగదా
నాగమ్యము కానక నుండెఁగదా
యోగమ్ముయు ప్రాణము తోడుగదా
నాగొంతిడు గానము నీకెగదా
భాగోతము ధ్యానము నీకెగదా
రాగమ్ముల సారము రంజితమే
వాగీశ్వరి రావము నీకెగదా
భోగమ్ముల భావము సంతసమే
వేగమ్ముల లక్ష్యము నీకెగదా
నీనవ్వులు మేనికి హాయిగదా
ధ్యానమ్మను హ్లాదము నీకెగదా
నీమువ్వల శబ్దము ప్రేమగదా
సామూహపు సంభవ మీకెగదా
ఆనందపు మోమది మోహనమే
మౌనమ్మగు ప్రేమము నీకెగదా
ప్రాణంబున దాహము తీర్పుగనే
ధ్యానమ్మున మార్పులు నీకెగదా
*
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
****
*తోటకం లో నాన్న
బరువైనద బంధముగా మనసే
తరుణాన సుఖమ్ముగనే మరిచే
తరువైన మనస్సుగనే బ్రతికే
పరువేల యనంతము కష్టమనే
కసిరేను గళమ్ముగనే కునుకా
ముసిరే భవితవ్యముగా మునగా
పసి వానిగ మారుటయే యలకా
కసి చూపులు యేలనుమా మదిగా
జవసత్వములేయుడిగే విధిగా
నవ వాంఛలుజోలికి యేలనగా
భవబంధము మర్చియు విస్మరనే
అవహేళన చేయక యుండుములే
కదిలే కలమే కధలా కదిలే
మెదిలే మనసే మెరుపై మెరిసే
చెదిరే హృదయం చెలిమే మరిచే
పొదరిల్లునయున్న మనస్సుగతే
***
మీ విధేయుడు మల్లాప్రగడ
మదిలో మెదిలే స్వప్నమా, మధురం మమతే మొహమా
కలలో కదిలే మేఘమా, కథలా కదిలే కాలమా
కథలో మెదిలే మోనమా, కలలై విరిసే కావ్యమా
కళలే తెలిపే కాలమా, కరువే మరిచే గమ్యమా
గానానికి మరిచే హృదయమా, తత్వానికి దడిచే సమయమా
శబ్ధానికి చెదిరే నిశ్శబ్దమా, సన్యాసిగ పలుకే నిర్దేశమా
గాయానికి మెరిసే ఔషధమా, కావ్యానికి మనసే నైషధమా
ప్రాయానికి వలపే ప్రణయమా, ప్రవీణ్యము తెలిపే ప్రధమమా
తరుణానికి మనసే మందిరమా, తమకానికి సొగసే సుందరమా
వినయానికి వయసే కారణమా, విజయానికి యెగసే ప్రోద్భలమా
ప్రళయానికి ప్రెయసే లోలకమా, ప్రాణయానికి పరుసే మూలకమా
తరించటానికి తపమే మూలమా, ధరించడానికి భయమే మూలమా
లోభించటానికి ధనమే మూలమా, సోభించడానికి గుణమే మూలమా
శాశించటానికి ప్రేమయే మూలమా, నవ్వించడానికి నాట్యమే మూలమా
ఆరోగ్యానికి దైవమే మూలమా, ఆనందానికి భార్యయే మూలమా
ఆత్మీయతకు బందువే మూలమా, ఆదర్శమునకు స్నేహమే మూలమా
ఆకర్షనలకు ఆత్రమే మూలమా, ఆశ్రయమునకు దైవమే మూలమా
ఆకాంక్షలకు శోభయే మూలమా, ఆత్మగమనము నిత్యమై మూలమా
****
ద్విపద.. ఎన్నాళ్ళు.. ఎన్నేళ్లు.. భక్తి
ఎవరు ముందు కదల ఎల్లలు తెలప
ఎవరెనకయగుట యా శ్చర్య భక్తి
ఎవరి యాస్తులుచేరు ఎన్నేళ్లు బతక
ఎవరి సోకులు ఖర్చు ఎంతనా భక్తి
ఎందుకు పాశము యేమియా శయున
ఎందుకు మొహాలు యెల్లరూ భక్తి
ఏల తాపత్రయ యెoచెడి బుద్ధి
ఏల భ్రమలు చెందు యేతెంచ భక్తి
ఎవడికాయము తృప్తి ఏమని చెప్ప
ఎవడి కాపురమన యేలనో భక్తి
ఎందుకు చింతయు ఎందుకు భక్తి
ఎందుకు తపనయు ఎందుకు రక్తి
ఎన్నాళ్ళు ముచ్చట ఏలని యుక్తి
ఎన్నాళ్ళు కాపురం యేదని ముక్తి
ఏది స్థి రమగుట యేలను వ్యక్తి
ఏది ధర్మ మనుచు యెదలలో శక్తి
***
సీస పద్య మాలిక.. ఆశల భక్తి
సమయ మేది యనిన చక్కభరచలేక
వింతపోకడగాను వీర భక్తి
కాలునిని కొలుచు కాల యాపనజేయు
ముందరికాళ్ళకు మూఢ భక్తి
జగదంబ కొలువని జాతర పూజలున్
పశుబలిన్ మానరు పాప భక్తి
అజ్ఞానులై వెల్గు ఆశయమనుచునే
త్రుళ్లి పడెరు వారి తుచ్ఛభక్తి
నీతులు జెప్పుచు నియమములు మరచె
యక్రమార్జనపైన యాశ భక్తి
వాదములుయె మానావాళి శుభయశుభ
జాతక మహిమని జంటభక్తి
విజ్ఞాన శాస్త్రాన విబుధు లైననుగాని
చిలుక జోష్యమునకు చింత భక్తి
సిగమూగు చుందురు మగువలు పురుషులు
నగుబాటు కాదొకో జగతిభక్తి
చెప్పెడు యెవడుగా చేసెడె యెవడుగా
చేయూత నిచ్చెద చేరు భక్తి
గ్రహశాంతి పేరుతో గారడి పనులెల్ల
జేయు చుండుటదెల్ల శ్రేయ భక్తి
జీవగమన శక్తి జేత్ర యాత్రయగుటే
చెప్పి చెప్పకనుండు చెరచ భక్తి
పాపపుణ్య యహరహంబగు వేళగా
ప్రాణవాయువగుట ప్రభలు భక్తి
ప్రాప్తమున్న కలుగు పాండిత్య గరిమలు
పఠన శక్తి కదల ప్రభల భక్తి
పుటకతో టెనొకటి పటిమతో మరొకటి
చేరు మనసుగను చెలిమి భక్తి
కొవ్వొత్తి వెలిగించి కోల్పోవు చీకటి
జ్ఞాన దానము జేయ గమ్య భక్తి
తల్లి ప్రేమ మనసు ధరణిని కనమయ్య
తండ్రి కరుణ రూపి త్యాగ భక్తి
తల్లి లేని తలపు టసాధ్యము గనుమా
తండ్రి స్థాన మెపుడు త్యాగ భక్తి
గురువు బోధలగుత గుర్తుగా గమ్యము
తెరువు చూపెడుచుండు తేట భక్తి
గీ..
దాహము పయిన బూనును దారి భక్తి
వింత కాదొకో యిది యొక భ్రాంతి భక్తి
నమ్మ లేనిమనసు గాను వమ్మ భక్తి
సత్యమీమాటగ మనసు సాగ భక్తి
****
మహిళ (ఛందస్సు ) తేటగీత మాలిక
మగువ మనసు గళము కథ మధురత గను
మరులు గొలుపు చతురతయ మలుపులుగను
వలపు తెలుపు సముఖతయె వరముయె విను
అవును అనుచు సుమలతయె అసలు నిజము
మహిళ నడక జడ జత యె మమతలు గను
వగలు సెగలుల చిరుతయె వలపులు గను
ముఖము పెదవి విమలతయె ముడుపులు గను
కురుల కదలికల మమతయె కులుకులు గను
పడచు పరిమళ లలితయె పలుకులు గను
పరుల ఎదుట విముఖతయె పదనిస గను
నయనము వలన కలతయె నడకను గను
అభినయనముతొ మమతయె అరుపులు గను
చిరు నగవుతొ శుభలతయె చెలిమిని గను
మరులు గొలుపు మదురితయె మనసును గను
మనసు ముడిపడితె జతయె మరచుట గను
వయసు వలపుతొ మమతయె వనజను గను
అనువనువు యనుకువతయె అసలును గను
చలి చినుకుల కల లతయె చెపలము గను
కలసి మెలసి ముఖలతయె కళలను గను
మది తలపు తెలుపు లతయె మధురము గను
--((*))--
లలిత శ్రుంగార. సీస పద్య మాలిక
యారోగ్య నిలకడ యానంద వాహిణి
ఆరాధ్య పొందిక ఆశ్రి తమగు
శృంగారము రహస్వ శృతిమించక సుఖము
సర్వార్ధ మూలము సహన వోర్పు
కలియుగం నీతిగా కలయికే ధర్మము
స్త్రీపుర్ష సత్యము శీఘ్ర సమము
విశ్వావాకిట కళ జీవన మార్గము
సృష్టి మేధస్సుగా శృతి లయలగు
రెండు దేహాల గా రెప్పపాటు సుఖము
భారమ్ము యనకుయే బంధ తోడు
దూది లా తేలతూ చూపుల్లో ఆహ్లాదం
ఏది పట్టని ప్రేమ యెదను తట్టు
ఇరుకు చోటును కూడ ఇష్టముగాప్రేమ
కాలాన్ని బట్టియు కలలు తీరు
ఆక్రమించ గలుగుటే అధికారాన్నిచ్చి
లోకమే పరధ్యాన సోకు వేళ
నిగ్రహం తప్పిన విగ్రహాలతమము
గర్భగుడిగనులే గళము తెలుపు
ఆకలి యంతయు అధరాల నీడనే
దాహమంతాదేహ తాపమేను
మధువనం లోననే మాధుర్య మేప్రేమ
స్వేదామృతాలతో శీఘ్ర సుఖము
పరువపు తేనను పెనవేయు తుమ్మెద
సంభోగ సంగమం సహజ తృప్తి
దేహాలె పాన్పులై తేజస్సు పంచుటే
పవళించు రాత్రులు పడక తీరు
జ్ఞాపకాల్లాముద్దు జాగరణ జపము
ఆత్మీయ బహుమతి ఆదర్శ కళ
రచయితలనిశీధి రమ్యమౌను విషాధ
పారవశ్య పలుకు పాఠ మేను
శృంగార క్రీడలు శృతిమించకుండానే
ఇద్దరు పాపలై యిష్ట పడుట
ఏకాంత మే ముద్దు యెంత హద్దు
బిడియము పోవుటే బిడ్డ లగుట
తప్పదుతృప్తిజగతి తనయుల తీరుగా
వయసుపొంగు కదల వలపుబట్టి
గీ.బతికి బ్రతికించు పాఠముపెళ్ళి మొదలు
సర్వసౌఖ్యముతీరుగా సమయ తృప్తి
ప్రేమ పొంగుసుఖముగాను ప్రీతి చెందు
సహజ శృంగారమేప్రేమ సాగు జీవి
***
దాహమే ఇక తీరదా యని దారి పేరున జీవితం
అహమే ఇక అడ్డువచ్చిన ఆకలాకలి జీవితం
మోహమే ఇక వెంబడించిన మోక్షమాయయు జీవితం
ఊహయే ఇక నన్ను చేరగ ఉజ్వలమ్మగు జీవితం
డబ్బు జబ్బుయు వద్దువద్దును డాంబికమ్ముయు జీవితం
డబ్బు మాటలు గబ్బులేపును డంబమేగతి జీవితం
జబ్బు జబ్బని నోటయన్నను జాగు చేయకు జీవితం
నిబ్బరమ్ముగ గాను యుండిన నీడయేకల జీవితం
ఉత్తమోత్తము సృష్టిధర్మము యున్నంతమ్ముయు జీవితం
సత్యవాదము ధర్మమార్గము సామరస్యము జీవితం
మత్తకోకిల మంజునాదము మాన సంబుయు జీవితం
చిత్తశుద్ధికి కార్యసిద్ధికి చిన్మయమ్మగు జీవితం
సర్వలోకము సుందరత్వము సాహసంబుయు జీవితం
సర్వకాలము నిత్యయోగము సాగు విద్యయు జీవితం
సర్వ యోగము యజ్ఞదీపిక మంత్రభావము జీవితం
సర్వలక్ష్యము భక్తివేడుక యుక్తివాదన జీవితం
సవ్య తత్వము నవ్వుసొంపులు సాక్షి మాయల జీవితం
నవ్య మార్గము ప్రేమసూత్రము నాందివాక్కులు జీవితం
భవ్య తత్వము సంఘదీపము బంధమోక్షము జీవితం
కావ్యభావము నిత్యరాగము కర్మలేయగు జీవితం
***
సీస పద్య మాలిక
భావించి తెలుసుకో భాగ్యఫలము గాను
ఆవలీల ఫలము ఆశయమగు
దానము లొఫలము తపములలొ ఫలము
మౌనములొ ఫలము ముక్తి యగుట
జ్ఞానంలొ ఫలముయే జపములోన ఫలము
నానా ఫలములును నయన రేడు
వినుతులలొ ఫలము వేదములొ ఫలము
మనసులోని ఫలము మాధవుడుగు
దినములలొ ఫలము తీర్దయాత్ర ఫలము
ఘనపుణ్యముఫలము ఘనకరుణుడు
సతతయోగ ఫలము చదువులలొ ఫలము
అతిశయోన్నత ఫలం యచ్చుతుడగు
యతులలోనిఫలము జితికామిత ఫలము
క్షితిమోక్షఫలము శ్రీరమణుడు
తల్లిసెప్పు మాటఫలము తనయ తృప్తి
తండ్రి సంపదయె ఫలము తనివి తీర
అన్న పలుకుల ఫలముయే ఆశ తొలగు
చెల్లి ఆదరనె ఫలము చింత మారు
****
పద్య మాల
కోపముచూపకు కాలముచెప్పుకొ నీదియునాదియు మాటలులే
లోపము వెద్కుట చేష్టలు కాదులె తీరిక యున్నది సేవలు లే
పాపము చేయకు నిత్యము పల్కకు పాడుపదాలను యేలుటలే
దీపముపెట్టుము వేదముపల్కెద హాయిగఉండును శాంతములే
అప్పుటికప్పుడుతప్పులు చేసినతెచ్చును తిప్పలుయేకములే
ఇప్పుటికప్పుడు చేసిననేర్పుకి ఇచ్చును సంతస మొచ్చునులే
ఎప్పుడు చేయకు కోపముతో పనె చేసిన కష్టము కోరికలే
ఒప్పుకొతప్పులు మంచినిపంచుకొ ఓర్పుయెచూపియు బత్కుటలే
గోపతి గోప్యము ఎప్పుడు నీడగ వెంటనె ఉండును రక్షణలే
చూపరి చూపులు చిత్రము ఐనచొ ఆడది ఆగుతా కష్టమెలే
తాపము వచ్చిన చూపును ముద్రత ఏదియు కాదని చెప్పదులే
జాప్యము లేదులె ఆకలి ఉందిజ వేగము పెంచితి శీఘ్రములే
నిప్పుల జోలికి పోయిన కాటికి చేరిన కాయము లెక్కవలే
తప్పులు మీదను తప్పులు జాబిత బాధలు వచ్చుట లెక్కవలే
చెప్పక చెప్పిన సత్యము నమ్మిన వానికి వేదము లెక్కవలే
అప్పులు ఇచ్చుట తిప్పులు వచ్చుట జీవికి నష్టము లెక్కవలే
****
మానిని..భ(6)గు/12
***
సీస పద్య మల -- కుటుంబం
అమ్మయన్న పిలుపు ఆప్యాయతగనులే
నాన్న యన్న పిలుపు నమ్మకమ్ము
అమ్మమ్మ పిలుపులు అభిమానమ్ముగా .
తాతయన్న పిలుపు తన్మయత్వ
నానమ్మ పిలుపులో నవ్వు ముఖమ్ముగా
అత్తనే పిలుపులో ఆదరణయె
మామ పిలుపులోన మమకారపు మలుపే
చల్లని పిలుపులో చెలిమి మమత
చిన్నమ్మ పిలుపులో చనువుగాను సుఖము
బాబాయ్ యను పిలుపు బంధమేను
అక్కనే పిలుపులో అనురాగమున్నది
బావా యను పిలుపు బహుమతిగను
అన్ననే పిలుపులో అభయ మేమనసుగా .
వదినాయను పిలుపు ఓర్పుగుంది
తమ్ముడు పిలుపులో తీయదనముగాను
మరిది పిలుపులోన మానవత్వ
మరదలన్న పిలుపు మర్యాద నేర్పునే
గురువు పిలుపులో గుర్తు గౌరవముగా .
దేవుని పిలుపులో దీనతనమగుటేను
ప్రాంజలి ఘటనలే ప్రబల గీత
గీ.కష్టము కనిపెట్టు నిజమైన కాలమందు
బంధుమిత్రులెవరురారు బ్రతుకునందు
కాసులున్న చేటు మనసు కానిదగుట
చేర్చి నిల్పు దరిని చింత చేస్ట యగుట
***
సీస పద్య మాలిక.. యేముంది
రేయిలో యేముంది రెప్పపాటు బతుకు
సుఖములో యేముంది శుభము శాంతి
అలకలో ఏముంది ఆటపట్టు సుఖము
నిద్రలో యేముంది నిజము తెలియు
కష్టంలొ యేముంది కానరాని సుఖము
ఆశలోయేముంది దాగఫలిత
ఆలోచనేమంది ఆశ్రిత శృంగార
మెదడులో యేముంది మేత చదువు
ఊహలో యేముంది ఊయల ఊపులే
కళ్ళల్లో యేముంది కలల చూపు
ఆకర్షనేముంది ఆదిత్య కళలగు
పాపలో యేముంది పలుకు నవ్వు
మౌనంలొయేముంది మానసకోరిక
హృదయంలొ యేముంది యుదయ ప్రేమ
సముద్రంలొ యేముంది సంబర కెరటమ్ము
ముత్యములో యేముంది ముఖ్య మెరుపు
ప్రేమలో యేముంది ప్రీతిగా బ్రతుకగు
ప్రాణంలొ యేముంది పాప పుణ్య
ముక్తిలో యేముంది ముఖ్యమైన సుఖము
నింగిలో యేముంది నీలి రంగు
భుక్తిలో యేముంది బుద్ధిపటుత్వము
ప్రుధ్విలో యేముంది పూజ్య తనము
శక్తిలో యేముంది సమయ సంతృప్తియే
పగటిలో యేముంది పలుకు భక్తి
మాటలో యేముంది మాయ పలుకగాను
అగ్నిలో యేముంది ఆర్తి మంట
చరవాణి యేమoది చెలణాల పలుకు
ముఖపుస్తకానేమి ముద్దు మాయ
ఏమి యన్న దేమి యెల్లరి మనసుగా
చెప్ప లేని తనము చిప్ప కూడు
వట్టి మాటలన్న వలపుల నడుమునే
బక్క చిక్కి పోవు పాడి వలన
****
గీత మాలిక
** జీవితం.. స్వర్గం నరకం **
జీవితమననాటకీయ కడుపు మాడ్చ
కాసులు కొల్లలు కాలె కడుపు
జీవితమున సాగు మేను సుఖము చంప
ధనము విరివిగాను దారితిండి
జీవితమను నావ భీతిగా సాగుట
తనువుకు కరువైన తగువలువలు
విలువగు నగలున్న వినికిడి లేకయే
నేను నా వాళ్ళను నాంచ బెట్ట
జీవితము దయతో జీవయాత్ర మరచి
దాతృత్వము మరచి దాత కాక
స్వార్ధ తలంపుతో సాగు బతగవడమే
నమ్మలేని తనము నమ్మ లేక
జీవితమంటేను గీత వాక్కులగుటే
గుణము విడిచిమాయ బుద్ధిచేర
దూరంగ బతకడం దుష్టబుద్ధిగనులె
బంధబాంధవ్యాలు బాధ తెలిపి
కాలతీర్పును బట్టి కానిపనులు చేయ
నవసమాజానికి నాన్ది కాక
మళ్ళిమళ్ళీరాని మధుమాస సోయగం
జీవితమన ఒక్క కీడు మంచి
రస రమ్య శ్రావ్యము రమ్య కావ్యమ్ముగా
చదవలేనితనము చక్క చేయ
సుస్వర సుమధుర సుమలత సంగీత
గానము వినలేని గమ్య బతుకు
అద్భుత అమోఘ అబ్బుర లోకమై
చూడలేని తనము చూపు యున్న
అందాల ఆనంద ఆత్మీయ సంతోష
స్వర్గ విహారము సౌమ్య మేది
ఈ చిన్ని జీవితం యీశ్వర లీలలు
చింత లేక తనివితీర బతుకు
అనుభవిద్దాములె ఆశయమభిమాన
ఈ యమూల్య బతుకు యిచ్ఛ తీర్పు
ఈయపురూపము జీవిత ధన్యత
రాజీ పడకసాగు రమ్య మార్పు
ఆందోళనము లేక ఆస్వాదనలు చూప
సంతసము గడిపే సాగు జీవి
గీ..సాను కూల యాలోచన సామరస్య
వైద్యుడు యవసరముగాను వైపరీత్య
నియమితమ్ముగా యాహార నిత్య మలుపు
మూడు వుంటేనుచాలులే ముఖ్య మార్పు
****
సీస పద్య మాలిక.. ప్రాంజలి ప్రభ పత్రిక
పత్రికయంటేనిజ ప్రగతికి ప్రతిభగా
ప్రగతి శీల పత్రిక పలక రింపు
పత్రిక దర్పంగాను ధైర్యంతలపు తెల్పు
పత్రిక లక్ష్యము దేశ ప్రజల నీడ
లోకవివరణలు లొల్లికాకతెలుపు
ధర్మాన్ని పాటించ ధరణి పత్రిక
నేడుయదార్ధము నియమముగను
రాజనీతి తెలుపు రక్ష పత్రిక
సర్వార్ధము విపుల సహవాస చతురగా
స్నేహబింబ మకుటం స్వేచ్ఛ పత్రిక
వైరుల సైన్యము వైవిద్య కథలుగా
నారి మురారి గా నడుమ పత్రిక
ప్రకటిత భారతం భావితరాలకు
భూరియశస్సుగా భుక్తి పత్రిక
సకలకళా విధి సాధన భోధన
శారద లీలలు జ్ఞాన పత్రిక
శోభిత సాక్షిగా సొమ్ముల స్నేహము
ముకుళిత వందన మోక్ష పత్రిక
మధుర భాషణగాను మైత్రికి మార్గమ్ము
కలహము చెరిపియు కలిపి పత్రిక
పరుష భాషితముగా బాధించు శస్త్రమ్ము
చెలిమిని చెడగొట్టు చిన్న పత్రిక
ఆశుకవిత్వము ఆధరామృతకళా
పావన జీవిత పాశ పత్రిక
భాస్కరో జ్వలితము భవభావ బంధము
విజయ విహారపు వినయ పత్రిక
మూగ జీవులారమనసు ముఖ్య పరచ
మేధ సంపద కళలన్ని మీకు మాకు
దేశ భక్తి సంపద జాతి దీన చరిత
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
***
సీసపద్య మాలిక.. జీవ యాత్ర
నీ భార్య ఎవరుగా నీచెంత స్త్రీగాను
పెళ్ళికి ముందునా ఒకరి బిడ్డ
పుట్టిపెరగటంలొ పుడమి ప్రమేయమూ
ఇద్దరకూ ముడి యిచ్ఛ జరిగి
దాంపత్య సంబంధ దారి ఇలాంటిదే
అందుకే ప్రేమయె అవసరమగు
ఈ ప్రయాణంలోన .దిగిపోవు ఒకరుగా
రెండవ వారుగా రెప్ప చాటు
ఈ మధ్యలో మాత్ర మూ కొంతకాలమ్ము
విడిగాను..కలసియె మెలసి కలలు
నీవు ముందున్నావు నీవుయాఖరిరూపు
మట్టి ముద్దవి గాను మాను గాను
ప్రేమపంచి కదలు పెట్టు బడిగసాగు
విడిచిపెట్టనులేక విడవ కుండు
మట్టి ముద్దలకళ మనము గాను
ఉన్నది ఉన్నట్లు ఊయనుచునె
భూమిలోనుండియు భూక్తిగా ఫలములు
ప్రకృతి ప్రభావము ప్రభల గాను
కర్త తినెడితిండి కార్యo జయమగుటే
తృప్తి సంతృప్తిగా దృడము చేరు
బీజరూపముగాను నీ భార్య గర్భం లొ
పిండమై శిశువుగా ప్రీతి గొలుపు
నీ కుమారుడెవరు నీ కుమార్తె యె వరు
ప్రేమాస్పదులుగనే ప్రీతి గాను
సుఖదుఃఖములుగాను శుభము కలగచేయు
జీవన నాటక జీవ యాత్ర
పరమశాంతిగనుమా పరమోక్షముగనుమా
శాశ్వతానందము శ్యామ లీల
ఆ.పుట్టునపుడె బ్రతుకు పూలవనము కాదు
పనితనమ్ము చేత ప్రగతి కల్గు
మొక్కనాట తనము రెక్కలాడ బ్రతుకు
చిందు వైభవమ్ము చింత మాయ
*కా తే కాంతా కస్తే పుత్రః*
*సంసారోఽయమతీవ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిహ భ్రాతః||*
*--- ఆదిశంకరుల భజగోవిందం నుండి:-*
***
*ఆచార్య దేవోభవ.*
*సమూహ సభ్యులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*
సీస పద్య మాలిక
కొమ్మకో రెమ్మకో కొత్తగాను మెరుస్తు
విరిసిన పూలుగా వినయ మగుట
పరమావధిగభావ పదసన్నిధేయగు
ప్రకృతిమైమరచెలా పలుకు మురుయు
తన జన్మ ధన్యత తన్మయ భోధన
శాశ్వతమైనట్లు చదువు చెప్ప
మమతానురాగాల మనసుయు పాధ్యాయ
పరమార్ధమైనట్లు పాఠముగను
మాయల మోహము మనసు వెంట కనక
గురువుగా గమ్యమై గుర్తు విద్య
కరుణ చూపించుయు కాలకధలుచెప్పి
రాగ ద్వేషములను రాని విద్య
పరమార్ధము తెలిపే పాఠము తెలిపియు
జన్మసార్ధకముగా జ్ఞప్తి బోధ
ప్రాపంచికావిద్య ప్రధమముగాతెల్ప
జ్ఞానాన్ని పంచేటి జ్ఞాన గురువు
పరవశించివిద్యార్థుల భవిత చూసె
పులకరించియుద్యోగము పుడమి నందు
తెలుగు వెలుగుయానందము తీర్పు గాను
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
సీస మాలిక
సమయపాలకుడుగా సహనమ్ము కిరణాలు
కనుమూయులోక బాంధవుడు వాడు.
వేయి చేతుల ధరణిన పిలచి పిలచి
కౌగిలించు నెవండొ కాంచ చూడు,
ఉదయాద్రి బుజమెక్కి ఉజ్వల కాంతులై
భూదివమ్ములు వెల్గుపూలుపూయ,
ఉవిద తామరబుగ్గ నెవడొ ముద్దిడె చూడు
మనసులో వలపు చందనము రాయ,
చిమ్మ చీకటి కాల జిమ్మె నెవ్వడొ చూడు
గుండె లోపలి తమోగుణము మాయ,
కనురెప్ప దుప్పటీ కప్పులాగె నెవండొ
వెలుగు లోకాలు తల్పులను తీయ
విరివిగా వీచక విద్వేష పవనము
అరుదుగా గన్పించె ఆదరణగ
కంటకమ్ముతొలగు కారానిదియులేదు
మంటలగుటలీల మనకొరకగు
ఘోషించు వచనము ఘోరమగుచునుండు;
ప్రేమించ హృదయము ప్రీతి గాను
గీ.కరుణ పేరును జెప్పి కడకు కమ్మనికళ
కరకుదనమును జూపుట కాల రీతి
నీకు నాకు యూరటనిచ్చు నీడ మల్లె
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
ఉపాధ్యాయులందరికి ప్రాంజలి ప్రభ, విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్ గా, ఒకనాటి లెక్కల ఉపాధ్యాయునిగా (గుంటూరులో 9 సంవత్సరములు 1981-1990)
మీ మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
శుభాకాంక్షలు.
సీస పద్య మాలిక..
తుఫాన్ బీభత్యం..
కాలవర్షజలమే కల్లోల పరిచేను
బుడమేరు వరదగా బుసలు కొట్టె
యేరులై పారెను యెల్లరు భయమాయె
బెజవాడ గజగజా వణికె నట్టె
చెట్టుకొకడుగాను చిక్కె పుట్టకొకడు
గొడ్డు గోదము కొట్టుకొనియు నట్టె
కట్టబట్టయులేక, కాళ్ళ నిలువ నీడ
లేక యాకలి కడుపేనుయెదురుచూపు
పొలికేకలపెట్ట పొట్టకాలె
ప్రకృతి ప్రళయ గర్జన విలయ తాండవం
జన సమూహాలగా ఎదురు చూపు
బీభత్స వరదయె నిస్సహాయుల తీరు
బృందనావికులతొ సేవ ప్రకృతి
పుడమిన రణ భేరి పూరించి కదలగా
సహన సహాయము సకలమందు
గీ.ఆంధ్రులకుతోటి ప్రజలుగా ఆదు కొనుచు
ప్రతిమనిషిసహకారము ప్రజల సేవ
ముఖ్య మంత్రిసమయ సేవ ముఖ్య విధిగ
ప్రాంజలి ఘటించి జనఘోష ప్రభల గీత
మీ మల్లాప్రగడ రామకృష్ణ,
ప్రాంజలి ప్రభ
సీస పద్యమాలిక
సర్వజీవ జగతి సకలవిఘ్ణపతియె
పట్టు పీతాంబర పలుకు లేక
పసుపు వలవలతో పలకరింపుయె చాలు
కుడుములుండ్రాల్లను సుఖమగు భక్ష్యము
తృప్తినొందెడి గణాధిపతి గుణము
గంధపుష్పాలతో గణనాధునికి పూజ
గరికసమర్పణ వక్ర తుండ
అప్పుజోలుకి పోక అష్ట శిద్దిలగల
మెప్పుచూపులరేడు మోక్ష మిచ్చు
యేక దంతుడుగాను యెల్లరు మేలును
సునుసిత చతురుడూ చురుకు వాడు
సృష్టియన్నది చూచు శృతిలయ గణపతి
జీవిత ఘాధలే జనుల రక్ష
సూక్ష్మ జీవులగుణా సూత్రం ఫ లించగా
సంభవించెడికళ సంఘ రక్ష
విశ్వమంతట వింతయోవిధివ్రాత
జన్మనొందినకళ జాతి రక్ష
వర్ధిల్లుటెంతగా వ్యాప్తి జెందుచుకళ
గాధయగాధాలు గమ్య రక్ష
గీ.తరుణ మాయలు సహజము తపన జగతి
పరిధి యేదైన జయమున పాఠ్య వినతి
పురుషు లేల్లరు జేరిరి పొలతి కొరకు
కరువు మాట ధరణియందు కలలు చవితి
*సీసపద్య మాలిక...బహురూప భాష్య వాణి*
****
కళలకానుకలగు కమనీయ కథలగు
కరుణరసామృత కావ్యవాణి
గళమనోహరమగు కనుల తీరుపలుకు
గానమాధుర్యమగు గమ్య వాణి
చలన చైతన్యము చాతుర్య వివరణ
చలువచేయమనసు చర్య వాణి
తీరతీరమ్ములన్ తీర్పులన్ మారుచు
దివ్యత్వం అందించు దివ్యవాణి
తోడునీడగనుండు తోడ్పాటు సహకార
తరుణ సంతృప్తిగా తూచు వాణి
పరమాణువు కదల పరిమాణము కథల
పాలనా విధమగు భరత వాణి
బహురూపములతో భవిష్యత్తుణుతెల్పు
భాగ్య పరంపర భాష్య వాణి
బాల యవ్వన లీల భాగ్య బీదరికము
బ్రహ్మాండములనిండు భవ్య వాణి
మానస వీణగా మమతల మాయగా
మంగళకరమగు మంత్రవాణి
సర్వ రోగనివార సంతసమ్ముగనునే
సమరమ్ము తానుగా సమయ వాణి
రాగసుధామృత రమ్యచరితభావ
రసరాగ పల్లవి రమ్య వాణి
లయబద్ధ కళలు లాలిత్వ మొలకించు
లాహిరి లాహిరి లాస్య వాణి
సరససంభాషణ సంగీతసాహిత్య
సామరస్యముగాను సారవాణి
సంస్కృతి వెలుగుగా సంప్రదాయమనసు
జ్ఞప్తిగా జ్ఞానిగా జ్ఞానవాణి
వైవిద్య సొగసులు వైపరీత్య ఘటన
నంతరంతర్జాల నవ్య వాణి
ధర్మాన్ని తెలుపుచూ దాతలుగల దేశ
సంపద వృద్దిగా ధర్మ వాణి
చిరుహాస వినయమై చిద్విలాసకళలు
సమయసందర్భము సమర వాణి
వింతవిడ్డూరము వివరముల కలల
విశ్వమ్ము విద్యల విజయ వాణి
వాణీ పరాత్పర వాగ్దేవి వాణిగా!
బహురూప ములనుండు భాష్యవాణి
గీ.భావ రూపబంధమగుట భాగ్య వాణి
వరుస వర్ణించగా బూని వాక్కు వాణి
నిత్య యాహ్లాదమౌ భాష నీడ వాణి
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల వాణి
మల్లాప్రగడ రామకృష్ణ,
Rtd. Accounts officer,
Pranjali prabha, hyderabad. 97
సీస పద్య మాలిక. జీవ యాత్ర
కుటిలబుద్ధితెలిపి కూడులేదనుచునే
సంకట మైనను స్థితియునెంచ
కఠిన కర్మయనుచు కాలమేయిదియని
నమ్మబల్కులవాడు నేస్తమయ్య
విద్యయున్నవిధిగ వికసింపలేకయే
విన్నవించు మనసు విఫలమాయె
ఎంత వారైనను యెంతకష్టమనిన
యెంచ ధైర్యముగని ఫలము నెంచ
పువ్వులా నవ్వుతూ పుణ్యమ్ము పొందుము
జీవితంలోకూడు జీవయాత్ర
ముల్లులాగుచ్చినా ముద్దుబిడ్డలనుచు
జ్ఞాపకాలు తెలిపి జ్ఞప్తి యాత్ర
మంచీచెడులుమన మాయలగుటయేను
మనసు నొప్పించక మాన యాత్ర
మొడు వారిన గుండె మోస లెత్తగాజేసి
ప్రాణమై యలరారు పాఠ్య యాత్ర
గీ.రూప యవ్వన సంపన్న సూత్రమైన
ఉత్తమ కులంలో పుట్టిన యున్నతైన
విద్య లేకపోయిన సుఖము వినయ ఓర్పు
మోదుక లతగా నుండకే మోహ పరచు
***
సీస పద్యమాలిక
నదిలోని జలముయే నడక తియ్యదనము
దాహము తీర్చెడి దరిగ జలము
సముద్రపు బలముయే సమవుప్పుగ జలము
సముద్రములో కలయు శాంతి జలము
నిలకడ గానున్న నీరు దుర్గంధము
కదలిక జీవము కామ్య బలము
జీవసాయముగాను జీవిత మధురము
కెరటమై కదులుటా కినుకు బలము
నిల్వనీరుగయున్న నీడలేనితనము
జీవితమేకధా జీవ జలము
దానధర్మములేని ధనమంతయుజలము
పరమాత్ముని గనుట ఫలము జలము
జాలి చూపెడుకన్ను జాతర జలముగా
ఆదు కొనెడితీరు ఆశ జలము
ఊరడించెడు మాట ఉడుకుగాను బలము
కనికరించెడు గుండె కనుల జలము
మాట తప్పని బుద్ధి మనుషుల పయనము
కోప మెరుగ హృదయ కోర్కె జలము
కరుణ జలధిగాను ఖ్యాతిగాను జలము
మమత పంచెడువాడు మనసు జలము
'ఇది'గాను (జీవాత్మగా) ఉంటేను యిప్సితమ్ము జలము
'అది'గాను (పూర్ణాత్మగా) ఉంటేను ఆత్మ బలము
ప్రతి జయమ్ము వెనుక పడరాని జలముండు
బాధలుండు దుఃఖ గాధలుండు
సర్వ కష్టములకు సరియైన ఫలముండు
చివరకు జయముండు చింత జలము
Comments
Post a Comment