జ్ఞాన..విజ్ఞానయోగం - ఏడవ అధ్యాయం

శ్రీమద్ భగవద్గీత - జ్ఞాన..విజ్ఞానయోగం - ఏడవ అధ్యాయం 


శా..నాయందున్ విధిగాను భక్తి శ్రవణా నందమ్ము ధ్యానమ్ముగన్ 

నాయందే హృదయమ్ము గాను నిరతం నానామ యుచ్ఛారనన్ 

నీయోగ్యమ్మగు నేనునీకు తెలిపే నావాక్కు వేదమ్ముగన్ 

నీయావత్తుయు నాకుతెల్సు న యినన్నీధైర్య మే యుద్ధమున్   (01 )


ఉ. దేని నెరింగినన్ విధి విధానపు వర్తన నమ్మ పల్కుగన్ 

కాన మరొక్కటే ననుచు కర్మ విజ్ఞానము సర్వమేయగున్ 

దానిని పూర్తిగా తెలుపఁ ధ్యానము చేయుము నిత్య మర్జునా 

నేను వచించు సత్యము సనాతన మైనది చెప్పగల్గితిన్             (02 )


ఉ.వేల మనుష్య జాతికళ విద్యలు నెంచియు జీవనమ్ము నా 

లీలలు జూడసాధన విలీనము చెందెడి భక్తి తత్త్వమున్ 

వేలలొ నొక్కడే నియమ వేద్యము నుంచిన ప్రార్ధనేయగున్ 

కాలము బట్టి నిచ్చెదను కామ్య పరాత్పర మోక్షమేయగన్            (03 )


మ. ధరణీనీరము నగ్నివాయువు ప్రభోదమ్మున్ సహాయమ్ముగన్

మరదాకాశము బుద్ధితత్వమది సామర్ధ్యమ్ము దేహమ్ముగన్ 

తరుణానందము గర్వమై గుణ విధీ తత్వమ్ము దాహమ్ముగన్ 

గురుతత్త్వమ్మగు యీగుణంబు లగుటే గుర్తుల్ సహాయమ్ముగన్     (04 )


ఉ.నీతియె నేర్పుగా ప్రకృతి నేస్తము నెమ్మది జీవరూపమున్ 

జాతిగ మేలుకాంక్షి కళ జాగృతి నెంచియు నెమ్మదేయగున్ 

ఖ్యాతిగ మాయకమ్మినను కానుక జీవము ఖేళి నాడుగన్ 

రాతిగ నున్నశక్తికథ రంజిలు పండగు ధర్మ తత్త్వమున్                  (05 )


ఉll సర్వుల శోభశోకమటు సారజనించిన లీనమేయగున్ 

సర్వుల తత్త్వమేగుణము సాధన లక్ష్యము నాదు లీలగన్ 

సర్వుల నమ్మరూప క్రియ సృష్టిగ యంతము దర్శనమ్ముగన్ 

సర్వుల పంచ కోశముల శాస్త్ర జగత్తుగ నేను నేనుగన్                    (06 )


శాll నాకంటే మరి యేదిభిన్నమనసే నాయిష్ట వాక్కౌనులే 

యీ కర్మల్ భువినందు నేస్తముగా సర్వార్ధ యి ష్టానులే 

మాకంఠమ్మున నుండునిగ్గులు; గనే మాలల్ల యిష్టమ్ము గన్ 

నాకార్యమ్మది నిండు ధర్మముగనే నానుండి పొందేను లే.              (07 )


మll వి ll జలమందున్ రస తన్మతా భవము సౌజన్యమ్ము నేనేయగున్ 

కళ సూర్యాశశి నందునా వెలుగు గా కార్యమ్ము నేనే యగున్ 

పలుకే వేదము శబ్దమేమనసు గా ప్రావీణ్య మేనేయగున్ 

బలప్రాణుల్లన పౌరుషమ్ము గుణమే పన్నమ్ము నేనే యగున్          (08 ) 


చంll పుడమిని గంధ తన్మయము పూర్తిగ బాధ్యత గాను నేనగున్ 

పుడమిన యగ్ని తేజమున పూర్తిగ శక్తిగ నున్న నేనుగన్ 

పుడమిన ప్రాణ సేవమున పూర్తిగ యుక్తియు రక్తి నేనుగన్ 

పుడమిన యోగ్య తాపసుల పూర్తిగఁ గాచు విధమ్ము  నేనుగన్           (09 )


చం ll సకల చరాచరమ్ముల లొ సామ్యము బీజము గాను నేనుగన్ 

సకలము రాగ క్రోధములు సాధన శోధన రక్ష నేనుగన్ 

సకలము తేజ సంపదయు సాధ్యపు ప్రజ్ఞ తపస్సు నేనుగన్ 

సకలము ధర్మ మార్గమున సాగు ప్రవృత్తి మనస్సు నేనుగన్            (10 )


.శా. శ్రీమాతా మముజూడ మామదిగనే శ్రీశక్తి మాయమ్మగన్ 

శ్రీమాతాజయమివ్వ నీదుమహిమా శ్రీయుక్తి శీఘ్రమ్ముగన్ 

శ్రీమాతా కళ తీర్చ వేగముననే శ్రీ భక్తి మాయందుగన్ 

శ్రీమాతామనసాయె సేవలుగనే శ్రీ జీవ భావమ్ముగన్                      (11 )


ఉ.నన్నొక మారు దల్చినను నాకు నమస్కృతు లాచరించి న      

 ,న్న న్నొకమారుఁ జూచిన,వినమ్ర బలమ్మగుఁ బూజచేయ,నా; 

 సన్నుతగాథలన్ వినిన స్వర్గనియుక్తి లభించు, పాపులన్;                 

సన్నుతి చేసి కష్టపడినన్ ఫలితంబున ధర్మమే యగున్               (12 )


 ఉ. సాత్విక  నేనుగానను సుసాధ్య మనస్సుయు నాది కాదనన్; 

సత్వపు తామసమ్ముగను జాత్యయహమ్మగు ప్రేమనందునన్;

తాత్విక రాజసమ్ముయిది తన్మయవాక్కు గుణాలతీతుడున్

 ఋత్విజు ధర్మబుద్ధి గను రుద్రమ వేదము సర్వ మందునన్;      (13 )


మ. త్రిగుణంబుల్ గుణ చర్యలే మనిషి ఖ్యాతి స్వాద మేజీవమున్ 

జగతీజీవపు టెల్లలందు గుణముల్ జాలమ్ము నెల్లన్ గనే 

రగిలేహృద్యము గానుమోహమగు భారమ్మున్ విదీ ధైర్యమున్ 

త్రిగుణాతీతుని గాను నేను తెలిపే దివ్వేను నేనేయగున్                (14 ) 


.చం..అవమానమ్మన మందచిత్తముగ, నేమార్చున్ విధెందెందుకో

నవమానమ్ములు దైవికంబగుట జ్ఞానానంద భిన్నంబేయగున్ .. .. .. 

తవ భావమ్మగు మాయ దాటకయు యేతత్త్వమ్ము తన్మాయగన్ 

భవభాగ్యమ్మగు ధర్మమేమనసు ప్రాబల్యమ్ము ధైర్యమ్ముగన్ ..        (15 )


శా .మాయాలోకమునన్ జనాంచలపు మానమ్ముల్ వివాదమ్ముగన్;

సాయమ్మున్ గుణమేను రక్కసులుగా సాధ్యమ్ము దేహమ్ముగన్ 

న్యాయమ్మున్ మదిలో తదీయ బలమున్ నన్నేభజింపన్ గుణా; ---

ధ్యేయమ్మున్ గనుకన్  విరక్తులగుటన్ దీనత్వ దుష్కర్మగన్           (16 )


మ. కళ నన్ తీరుగ సత్వముల్ గను సుధాకామ్యమ్ము తీరేద్యుతుల్   

పలువిత్తమ్మును గోరువారు కళలే ప్రాపుల్ విశేషమ్ము గా  

పలుయాపత్తుల మార్పుగోర గలిగే పాఠమ్మునేర్పన్ ధర  

న్నిలలో స్వేచ్ఛగ నెల్లరున్నొకటిగా నీశున్ ప్రణామమ్ములన్           (17 ) 


. శా. ద్వైతమ్మున్ భగవంతుడున్ కళలుగన్ దూరమ్ముశిష్టమ్ముగన్

ద్వైతమ్మున్ పరమాత్మయున్ గుణములన్ దృగ్గోచరమ్ముల్గదా, 

 ద్వైతమ్మున్ జగదీశ్వరున్ తననుగాధ్యానించు జ్ఞానమ్ము గన్ 

శాంతమ్మున్ సహధర్మమేను వెలిగెన్ సామర్ధ్య నాత్మస్థితిన్.            (18 )


.మ. ప్రతి జన్మమ్మొక కర్మచేయగలుగున్ ప్రావీణ్య మున్నీవిధిన్ 

 ప్రతి గమ్యమ్మున శోదనల్ నియతినిన్ ప్రాధాన్యతల్ గా మదిన్  

 ప్రతి పాఠ్యమ్మున భవ్యమున్ నిరతినిన్ ప్రాముఖ్యముల్ సద్గతిన్  

ప్రతిజాతిన్ క్షమ త్యాగ బుద్ధి గలుగన్ పాశమ్ము భాగ్యమ్ముగన్           (19 )


.శా.  నానావిద్యలమేలునెంతవరకున్ నాణ్యమ్ము సౌమ్యమ్ములన్ 

 నానావ్యక్తుల మాట నెంచుటయు యీనాశక్తి గుర్తించకన్

 నానాదేవతలందు పూజలుగనే జ్ఞానమ్ము సత్కర్మలన్ 

 యీనాశక్తిగనుమ్ము మంచిమనసుల్ యీజన్మ బంధమ్ములన్        (20 )


ఉ. కొందరు నేర్చుకోవలెను కోపము లేకయు నోర్పులెన్నగన్

కొందరు మోస పోయికద కోరియు దేవుని బూజచేయగన్ 

కొందరి జీవిత మ్మలిసి కోలు కొనేందుకు కొంత భక్తిగన్ 

కొందరు భక్తి శ్రద్ధగను కోర్కెలు తీర్చగ నేను కర్తగన్                        (21 )


మ. ఎవరేదేవుని పూజఁ జేసినను ధ్యేయమ్ముల్ విధేయమ్ముగన్  

ఎవరే మాతను ప్రార్థనల్ సలుప నాలక్ష్యమ్ము నేనే యగున్ 

వివిధన్ శ్రద్ధగ భక్తియున్ కలిపగన్ సూత్రమ్ము నాహృద్యమున్

యవకాశమ్మగు తీరునన్ హృదయమున్ యారాధ్య సౌఖ్యమ్ముగన్.   (22 )


.మ. కో.అల్పబుద్దులు తేజమ్మున నిహమ్ముదీరుట సంభవమ్

 స్వల్ప లక్ష్యము బూజలందున శాస్త్ర సమ్మతి నేనుగన్

 కల్పనల్  మదిలో భక్తియగు కర్మ పుష్టిగ కర్తగన్

 నిల్పుకారణ ప్రాప్తమెల్ల వినీతి సత్యము హృద్యమున్                      (23 )


చం.కనులప్రవీక్షణన్ గన సకాల సరాగ దలంపులాంతరన్

 ఘనునిగ గుర్తుజేయు విధిగమ్య వశంబునజిక్కి యేగగన్

 కనకభజించనెంచెడి వికారపుబుద్ధి మదీయ చింతనన్

 ప్రకటిత భక్తి శ్రద్ధలకు పాఠ్యము నాదిసహేతు జీవమున్                 (24 )


ఉ.మాయనుఁ జేరి లోకము నమాయక భ్రాంతిని నన్నువీడగన్  

మాయయనంగ మర్మకళ మానవ జూపుల నన్నుగాంచకన్ 

మాయయెఱుంగగన్మనుగు మచ్చల చేత్యము భవ్యరూపమున్ 

మాయలయోగమాయయిది మంత్రము తంత్రము యన్నినేను గన్  (25 )


మ.  ధరణీ తత్త్వము దారిజూప కలిగేతన్మాయ నాదేయగున్                  

పరమోత్కృష్టతనమ్మునేనె,గతమున్ బంధమ్మునాదేయగున్ 

పరలోకంబులు కర్మభావనలు సంభావ్యంబు నాదేయగున్ 

చరముల్ జీవుల భావినే నెరుగ మించారన్ విధేయమ్మునన్ .           (26 )


ద్రువకో. జగతి నందున జీవనమ్ములు జంకి సాగుట నేలనో

 ప్రగతి కోరగ కష్ట భారపు పంచఁ జేరుట బంధమా  

యుగము మోహపు దేహ తాపము యూత కర్మలు చాలవా 

వగల జీవులు రాగద్వేషము వశ్య మాయకుఁ జిక్కుటే                        (27 )


.శా. ఏ పుణ్యాత్ములపాపముల్ తొలగ యే యేమార్గ మైనన్ కడున్ 

 ఏ పాపమ్మును జేసినన్ క్షమగనన్నే రూపమైనన్ననున్ 

 ఏ పాదమ్మున చిత్తమై నిలుపగన్ యేద్వీప తేజశ్యముల్ 

 ఏ పాశమ్ము విముక్తిగాతమరు యేదిక్కున్  నిరీక్షించ గన్                 (28 )


చం. జనన విముక్తి యత్నమున జాతకగమ్యముతోడు నీడగన్

 మననమునాదు భక్తిగనుమాయ జయించుటగాను బ్రహ్మమున్  గుణముననాదుతత్త్వమునగూర్చుజయమ్మునొసంగి  నమ్మినన్ 

తన,మన,బేధమేయనక తన్మయలక్ష్య వరమ్ము భక్తిగన్                     (29 )


శా.. యోగక్షేమపరమ్ము దాల్చుటకు, శ్రేయోధాతవై శక్తిగన్                     

 నైగమ్యాభ్యధిభూత రూపముగనే నేహ్యాంతర వేద్య గన్                     

 వైగుణ్యం యధి దైవకాత్మయను సర్వజ్ఞత్వ మున్ జూపుటల్

 రాగాతీత!భవద్గుణంబు లనితెల్లంబాయె,యజ్ఞంబుగన్                     (30 )

నాగమ్యమ్మది యంత్యమే, కొల్చెద నినున్ నా యంత రంగమ్ము నన్


శ్రీమద్ భగవద్గీత - జ్ఞాన విజ్ఞానయోగం - ఏడవ అధ్యాయం.. Pranjali Prabha


*శ్రీ శ్రీ శ్రీ కృష్ణవాణి.. (7*


గీతా  సప్తమాధ్యాయ పారాయణం దానము, యజ్ఞము, తపస్సు మొదలైన వాటన్నింటి కన్నా పుణ్యప్రదాయిని .

ప్రక్షాళన అనే మాట వినే  ఉంటారు.  ఇది మనలోని దుర్గుణాలకు కూడా వర్తిస్తుంది . ఇంటికి కళ చేకూరాలంటే, ఇంట్లోని చెత్తా చెదారాన్ని తొలగించి ప్రక్షాళన చేయాలి . మన దరహాకాశంలో పరమాత్మ ప్రకాశం మెరవాలంటే , హృదయంలోని చెడుబుద్ధులని ప్రక్షాళన చేయాలి . అద్దంలాంటి స్వచ్ఛమైన మనస్సులోమాత్రమే ఆ పరమాత్మ ప్రతిబింబిస్తాడు . అటువంటి ప్రక్షాళన చేయగలిగిన, అందుకు ప్రేరేపించగలిగిన గొప్ప సాధకం భగవద్గీతలోని ఈ సప్తమాధ్యాయం . తద్వారా మోక్షాన్ని అందించగలిగిన ఈ ఏడవధ్యాయ పారాయణా ఫలితాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నారు . 

శైల నందిని, ఇప్పుడు ఏడవ అధ్యాయ మహత్యాన్ని చెబుతున్నాను, సావధాన చిత్తవై విను. ఈ సప్తమాధ్యాయముని కేవలం వినడం మాత్రం చేతనే మానవులు అమృతమయమైన దేహాన్ని పొందగలరు . పూర్వము పాటలీ పుత్రమనే ఒక విశాలమైన నగరం ఉన్నది.  అందులో శంకుకర్ణుడనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడు.  ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు.  దైవపూజ చేస్తూ, వేదాధ్యయనము చేస్తూ, పదిమందికీ ధర్మాన్ని బోధించవలసిన ఆ బ్రాహ్మణుడు ధనాశాపరుడై వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు . ధనార్జనే పరమావధిగా ప్రవర్తిస్తూ, కనీసం పితృతర్పణం కానీ దేవ పూజ కానీ చేసేవాడు కాదు. 

ఇదిలా ఉండగా, నాలగవ వివాహం చేసుకోవాలనే కోరికతో బంధువులని వెంటబెట్టుకొని అరణ్య మార్గంగుండా ప్రయాణమై వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో  ఒక నాటి రాత్రి పాము కాటువేయడంతో అతను  మృతి చెందాడు. మనం ఏం చేస్తున్నామో ఆ ధర్మరాజుకి తెలిసినదే. ఆయన మన లెక్కలన్నీ సిద్ధంగానే ఉంచుకుంటారు . కనుక మరణానంతరం తన కౄరకర్మములకి నరకయాతనలను అన్నిటిని అనుభవించాడు . 

ఆ తర్వాత  పూర్వ జన్మ స్మృతి కలిగిన సర్పమై  జన్మించాడు.  ఆ సర్ప రూపములో శంకు కర్ణుడు ఒకసారి తనలో తాను నేను గత జన్మములో ఎంతో ధనాన్ని ఆర్జించి నా గృహములో పాతిపెట్టాను.  నా కుమారులను హెచ్చరించి  ఆ ధనమును నేనే కాపాడతాను.  అని నిశ్చయము చేసుకొని  ఆ నాటి రాత్రి స్వప్నంలో తన కుమారునికి  కలలో కనిపించి, విషయాన్ని తెలియజేశాడు.  మరుసటి రోజు ఆ కుమారుడు ఆ స్వప్న వృత్తాంతమును తన సోదరులకు తెలియజేసి, వారిని వెంట తీసుకొని, ఆ ధనము గల స్థానానికి పోయి అక్కడ భూమిని తవ్వడం ప్రారంభించారు. 

 అప్పుడు ఆ సర్ప రూపంలో ఉన్న శంకు కర్ణుడు బుసలు కొడుతూ లేచి తన కుమారులతో మనుష్య భాషలో ఇలా మాట్లాడాడు.  ‘ఓయీ ! మీరు ఎవరు ? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ గోతిని ఎందుకు తవ్వుతున్నారు? ఇక్కడ నుంచి ఏం తీసుకుపోదలుచుకున్నారు?’ అని ప్రశ్నించాడు.  అప్పుడొక కుమారుడిలా పలికాడు ‘తండ్రి! నేను నీ కుమారుడ్ని.  నా పేరు శివుడు.  రాత్రి నా కలలో నీవు చెప్పినట్టుగా, ఇక్కడ సువర్ణాన్ని దాచి పెట్టావని, దానిని తీసుకుపోవడానికి వచ్చాను’ అన్నాడు.  

పుత్రుడి మాటలు విన్నటువంటి శంకు కర్ణుడు నీవే నాకు కుమారుడవి అయితే, ముందర  నాకి సర్పదేహము పోయేటటువంటి ఉపాయాన్ని ఆలోచించు.  గత జన్మలలో నేను అమితమైన ధనాశ  చేత కుల ధర్మాన్నంతటినీ కూడా పరిత్యజించాను . లాభాపేక్షే ధ్యేయంగా వ్యాపారం చేశాను . అందువల్లే నాకు సర్పజన్మం  సంప్రాప్తించింది’ అని పలికాడు.  అది విన్న అతని  కుమారుడు ‘తండ్రి! నీకు విముక్తి ఏ విధంగా కలుగుతుంది? దీనికి ఉపాయం ఏమిటి? నీవు వివరంగా చెప్పినట్లయితే బంధువులందరినీ కూడా నీ దగ్గరకు తీసుకువచ్చి నేను ప్రయత్నం చేస్తాను’ అని సమాధానం ఇచ్చాడు . 

 

అప్పుడు శంకు కర్ణుడు ఇలా చెప్పాడు. “ కుమారా విను భగవద్గీతలోని సప్తమాధ్యాయాన్ని పారాయణం చేయటం వల్ల తీర్థయాత్రలు, దానము, యజ్ఞము, తపస్సు మొదలైన వాటన్నింటినీ చేయడం కంటే కూడా అత్యధికమైన ఫలితం కలుగుతుంది.  కేవలం ఒక్క గీతలోని ఏడవ అధ్యాయం పారాయణం చేయడం చేత ప్రాణులు జన్మ,జరా,మరణ రూపాత్మకమైనటువంటి సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతారు.  కాబట్టి నీవు నా శ్రార్థము నా నీవు నా శ్రాద్ధ దినము రోజున  బ్రాహ్మణుల చేత భగవద్గీతలోని సప్తమాధ్యాయ పారాయణ చేయించి, ఆ బ్రాహ్మణులందరికీ కూడా తృప్తికరంగా భోజనాన్ని పెట్టినట్లయితే నిస్సంశయంగా నాకు సర్పము యొక్క రూపము నుండి విముక్తి కలుగుతుంది.  కనుక నీవు నీ శక్తి కొలది నా శ్రార్ధ దినమున వేద విధితులైనటువంటి బ్రాహ్మణులకు అన్నదానము చేయి’ అని చెప్పాడు.  ఈ విధంగా తండ్రి ఆనతిని తీసుకొని, అతని శ్రార్ధ తిథి నాడు  గీతలోని సప్తమాధ్యాయమును పారాయణం చేయించి, వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు అన్నదానము చేశారు శంఖుకర్ణుని కుమారులు .  

ఆ విధంగా చేసిన వెంటనే శంకు కర్ణుడు దివ్య దేహ దారియై, ధనమంతా పుత్రుల కప్పగించి వైకుంఠనికి వెళ్లిపోయాడు.  అతని కుమారుడు కూడా బుద్ధిమంతులై ఆ ధనాన్ని వెచ్చించి, దేవాలయాలు కట్టించడం, అన్న సత్రములు స్థాపించడం, మార్గమధ్యంలో నీడకై వృక్షాలు నాటించడం, బావులు తవ్వించడం మొదలైన ధర్మకార్యములను ఆచరించారు.  ఆ తరువాత వారు గీతా సప్తమాధ్యాయాన్ని పారాయణ చేస్తూ చివరకు మోక్షాన్ని పొందారు. 


కాబట్టి ఓ పార్వతి, మానవుడు జాతి, మత బ్రష్టుడై, నీచ యోనియందు జన్మించినప్పటికీ కూడా సప్తమాధ్యాయ శ్రవణము చేసినంత మాత్రము చేత జన్మరాహిత్యం కలుగుతుంది.” అని పరమేశ్వరుడు ఆ పార్వతీ దేవికి భగవద్గీత సప్తమాధ్యాయ పారాయణ ఫలితాన్ని వివరించారు . 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! శుభం భవతు !!

*ప్రాంజలి ప్రభ*

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు