శ్రీమద్ భగవద్గీత... పదవ అధ్యాయం....విభూతి యోగం

శ్రీమద్ భగవద్గీత... పదవ అధ్యాయం....విభూతి యోగం


ఉ. బంధవిముక్తియేహితము బాధ్యత తోగుణ తత్వ భావమున్ 

విందుయె జన్మ సారమగు విద్యహితమ్మగు ధర్మ సౌఖ్యమున్ 

*బంధన* నిత్య హేతువగు పాఠ్య హితమ్మగు జీవ శ్రేష్ఠతన్ 

వందన జ్ఞాన ప్రాప్త గుణ వాక్కుల కోరిక కామ్య మ


శా. నా *జన్మాన ధరన్ విలీల మనగా నన్నోమహాత్మా, నినున్*, 

*యే*జన్మారహితుండునైనతపమున్ యేమంత్ర నన్నే*ల*గన్,

యే జీవీ హృదయమ్ముభక్తి గనుటన్ యేమార్గ మైనన్ శుభమ్

నా జన్మ*మ్మిది సాకు గా జరుగ* *నీ* నామమ్మునిత్యమ్ముగన్


శా. ముల్లోకాలుగనున్  సమర్థ చరితం ముఖ్యమ్ము సద్భాగ్యమున్    

కల్లోలా భయమున్ జయించి *తరుణన్ గల్పించు సంతృప్తు* లన్    

సల్లాపం సహజం విమర్శ విదితం సామర్థ్య విశ్వాసముల్   

కోలాటం ప్రణయమ్ విముక్తి వినయమ్ కొంతైన కోల్పోవగన్


ఉ. జ్ఞానవిరాగబుద్ధిగణ  జ్ఞప్తి యదార్ధము నిశ్చయాత్మగన్ 

మౌనము సత్యనామగుణ మోహ*మహత్మ్య మనోసహమ్ము*లన్    

కానెడు *సౌఖ్య* దుఃఖములు కాలభయంప్రళయమ్ము కీర్తిగన్ 

దానము సంతసమ్ము గుణ దాహము తృప్తియు త*త్త్వ *మేయగున్


చం. మరిక *నహింసభావముసమర్ధసమేత* సహాయ ప్రాణిగన్ 

నురగ తపస్సు సంతసము నున్న సుజన్మ మహేశ సత్యము*ల్*              

నరయువిచార *వాదన  మనస్సు వినోద* వివర్ణ నిత్యము*ల్* 

నరులలొ నాకృపాకళలు నాహృదయమ్ముభవమ్ము నేస్తము*ల్*


శా...*నాభావ్యా*  సనకాది సప్తఋషులున్ నాభక్త ధ్యానంబుగన్

*నాభావా ల జనించిరే జనులుగన్ నాశక్తి సద్భక్తి*యున్

*నాబాధ్యా* *విధముల్ ప్రకాశితములన్ నానా విధానమ్ము*లన్

*నాభాగ్యా* *ప్రవృతుల్ ప్ర బోధ విమలా నర్తమ్ము లీరీతి* గన్


ఉ. నాదగు యోగ గమ్యమగు నాదు*మనస్సున * నమ్మ తత్త్వమున్ 

*నాదు*  నివృత్తి మార్గమగు నాశల తీర్చెడి సత్య వాక్కుగన్ 

*నాదు* *ప్రవృత్తులన్ సమయ* నామ జపమ్మున నన్ను జేరుటల్ 

నాదగు భక్తి*సేవలకు నమ్మిన యోగము* నామనంబునన్


మ ll వి ll  శ్రుతివాగ్వేద్యుని నాద్యునిన్ బరమతేజోరాశిగన్నిన్నుగన్   

శతవిజ్ఞాన ప్రమోదపూర్ణ  మతి విశ్వశ్రే యసంధా నముల్                      

ద్వ్రతినిన్ యోగిసమస్తగమ్య నమరేంద్రప్రాప్త సంస్తుత్యముల్                                 

సతతమ్ముల్ ప్రియ సంభవమ్ముగుణమేసత్త్వమ్ము యారాధ్యతన్


శా. హేకృష్ణా యనుచుస్మరించవిధిగన్ హేరంబ దీవించ గన్p

శ్రీకృష్ణాయన వేడుచుంటి నినువాసిన్ హేకృపాసాగరా 

హేకృష్ణాగతిగానుదీవెనలకున్ యేమాయనైనన్ సుధీ 

 హేకృష్ణా సహనమ్మునాది సమయమ్మేరీతి వీక్షింతువో.


ఉ..నన్నుగ భక్తి చిత్తము గుణమ్మగు పాఠము మేలు కూర్చగన్ 

మిన్నగ నేభజించగల *మేలిమి*  కర్మలు సత్యమేయగున్ 

నన్నెరు*గన్ సహాయకరుణాద్యుతి* నీకును నేర్పగాయగున్ 

నన్నుగ జేరు యోగ్యతయు నమ్మకమేయగు యోగరీతిగన్


ఉ. వారికి *నెన్నియున్ మధుర* వాక్కుల తీరున తీర్చ బుద్ధిగన్ 

వారిమనంబు*నున్న*వస వాంఛగ వారికి *విజ్ఞతల్ విధిన్* 

*వారిది చిత్తమున్* గెలువ వారధి నేనుగ నుండ గల్గెదన్ 

*వారికి  జ్ఞాన జ్యోతులుగ* *భాసిల* జేతును నిత్యసత్యమున్


సీ. పరమాత్మయే పర బ్రహ్మగా ననుచు, నే 

 పరమపదంబగు ప్రకృతి గూడు  

 పురుషుడు పావన పురుషోత్తముండీవు  

పట్టాభి షిక్తుల ప్రకృతి పురుష 

పరమ పురుషుడైన పరమాత్మ నీవుగా  

శాశ్వత శ్రేష్ఠడు శాంతి శాస్త 

ఆదిదేవుడవు నీవంతరాత్మ విధాన  

జీవాత్మ సంబంధ చిన్మయములు  


తే.అంతరంగ మందజ్ఞాన మల్లు  కొనగ 

ఆత్మ వితమున దైవాత్మ యనుగు జేయు,

ఙ్ఞాన ముదయించ తేజ విజ్ఞాన మెలయ

ప్రస్ఫుటములు గన్పించును ప్రభల తోడ.  (12)


సీ .దేవ జన్మగనుటే దివ్య భోగ ఫలము 

పుణ్యఫలాక్షయ పుడమి పురుష 

పుట్టుక లేకయే  పూర్తిగా తెలిసిన 

పూరణే పరమాత్మ  పుణ్య పురుష 

సూక్ష్మాతి సూక్ష్మము సూత్ర విభుoడుగా   

పంచ భూతాత్మ గా పరమ పురుష 

ఋషులందరుల్ పూజ్య ఋణములు దీర్చగా  

లోకకల్యాణాల లోక పురుష


తేగీ.మేఘములు వీడ  భానుడు మెఱయు నట్లు.

మేలు జేయ సంకల్పము మెచ్చు నట్లు 

వినయ విశ్వాసమును జూప విద్య లోన  

ప్రార్ధనలునేను జేయుదు పరమ పురుష    (13)


శా. .*నీవేదిక్కని పల్కు బోధ సలుపన్ నీమీది సద్భక్తికిన్* 

*నీవే స్వామిగ నీవిధిన్ దెలుపుటే నిత్యాభిలోలమ్ము గన్* 

*ఈవిశ్వంబునదేవ దానవులునూ నీయాత్మ సత్యంబుగన్* 

*నీవిద్యా పఠనమ్ముగాను సకలం నీదివ్య తేజంబుగన్*     (14)


సీ.ఈ సృష్టి కర్తవు యీవే జగతి నాధ 

స్థితి భర్తగా రక్ష నీతి నీవె 

దేవదేవుడుగాను దేవతా రూపుడై 

మాయ సృష్టిని జేయు మర్మ మీవె 

పురుషోత్తముడవుగా పుణ్యాన్ని పంచేటి 

అక్షరుడైనట్టి యాత్మ నీవె 

సేవల తత్త్వమే సిద్ధించు దిక్కుగా 

భూతాధి దేవుడా భుక్తి నీవె 


తే.అజ్ఞత వలన కలుషిత మైన బ్రతుకు  

సతతము జ్ఞానసాధనా జపతపమ్ము 

లాచ రింపగ శుద్ధుడై యాత్మ జేరు,

నిన్ను నమ్మి ముక్తి గనుటే నిజము పథము      (15)


ఉ. .దివ్య విభూతులే మహిమ దీక్షలు మార్గము నీదు వాక్కుగన్ 

దివ్యము భక్తి భూమిగను దివ్యవిభూతులు పూర్తి నీవుగన్ 

దివ్య సమర్థ తా గుణము తీరున సత్యము నిత్య బోధగన్ 

సవ్యము *దెల్పుటేమనసు సాధన* వేలుపు తత్త్వమే యగున్ (16)


ఉ. .ఏవిధమైన ధర్మ మున  నెల్లరు స్వస్థత పాల నుండగన్ 

ఏవి యెరుంగలేని మతి యేమని చెప్పెద నాదు భక్తియున్ 

నీవు దలంచు భక్తుడను నిన్నును గోరెడి దివ్య చిత్తముల్  

దేవుడవైన నీవు గతి దెల్పగ మార్గమె నీకు ధర్మమున్   (17)


సీ. ఉనికి విశేషమై యున్నత వైభవం 

యోగశక్తివిభూతి యోగ్య మగుట 

అమృతమయ వచన మానంద మయముగా 

విద్య కాంతి బలము వినయ మగుట 

జ్ఞాన పరమభక్త జ్ఞానుల మయముగా 

మాతృరూపంలోన మనసు యగుట 

పితృరూప పరమాత్మ పిలుపుగా గురువుయే 

వాశ్చల్య మగు ప్రేమ వాక్కు యగుట


మొక్కినట్టి వారికి దివ్య మోక్ష మివ్వ 

పిలుచు వారికి పరమాత్మ పేరు నిలుప 

ఆర్తి కలిగిన వారికి నంతరాత్మ 

ముక్తిఁ గోరెడు వారికి ముఖ్య గమము (18)


ఉ. ఎంతయు *మేలునన్ బలుకు* *నేదియనన్* మదిఁ దెల్ప *లేగనే*  

*నంతము* లేని విద్యలను నాదు *గుణమ్మున* *సత్యమేలగన్* 

 *కొంతయు*  నీదు మాటలకు గొప్ప*లుఁ జెప్పక* జ్ఞాన *బోధలన్* 

వింతగు *వానినిన్ దెలుప* విశ్వపు లీలలు నీకు *నర్జునా* (19)


ఉ.సూర్యునిలోన కాంతిగను సూత్రమనస్సుయు నాదియేయగున్, 

ఆర్యుని లోనిదివ్యకళ లాత్మకు ధర్మము మార్గమేయగన్ 

కార్యము వేదవాయువగు కాలపు గమ్యము నాదు బుద్ధిగన్  

సౌర్యము యుక్తిభక్తిశశి సమ్యము సర్వము నేను నేనుగన్  (20)


ఉ.జీవుల జీవనాత్మగను చిత్తము తేజము ధైర్య సంపదల్  

భావము బ్రహ్మ విష్ణుశివ భాగ్య సమర్ధత లన్ని నేనుగన్ 

సేవల సూర్య కాంతిగను శీఘ్రము తారల చంద్ర తేజముల్  

దేవపరంపరా గమన దీక్షలు శాంతిగ మూలచేతనన్  (21)


శా. వేదాలందున సామవేదముగనున్ విశ్వమ్మహానాయకున్ 

ఆదేవా గుణ నిoద్రశక్తి గమనన్ యాహార్య మేనేయగున్ 

ఈదేహమ్ముగనేను నిన్ద్రియముగా నిచ్ఛాను చిత్తమ్ముగన్ 

నాదేజీవన చేతనమ్ముగననీనాయందు దీర్ఘమ్ముగన్      (22)


శా.ఓంకారం గనె శంకరుండుమనసున్ హోతాద్య రుద్రమ్ముగన్ 

ఘీంకారమ్మున యక్ష రక్కసులలో గీర్వాణ భేదమ్మునన్  

శంకమ్మే వసువైన యగ్నిగనినన్ సౌలభ్య  సంఘర్షమున్ 

సంకీర్ణమ్ములు మేరు పర్వతముగన్ సాహాయ ధర్మమ్ముగన్    (23)


శా.  పార్ధాముఖ్యు లలో బృహస్పతిగనన్ పాఠమ్ము పుణ్యమ్ముగన్ 

పార్ధాసేవలలో కుమారుడనగా పాశమ్ము వార్చేందుకున్ 

పార్ధా సాగరముల్  నదీ జలములన్ ప్రాప్తమ్ము లక్ష్యమ్ముగన్ 

పార్ధా సర్వముగానుశాంతి సుఖమున్ బాలించ రాజేంద్రుగన్ (24)


సీ. భృగుమహర్షిని నేను బృంద ఋషిని నేనె 

గురువుగా పరమాత్మ సురుల వేత్త  

యీ త్రిమూర్తి  పరీక్ష యిచ్ఛలు నేనుగా  

యీకాంక్ష నోంకార యిహము ప్రవర  

పంచ భూతలమందు ప్రభలెల్ల నేనుగా 

సాత్విక యజ్ఞాల సార మేనె 

యజ్ఞాలలో జప యజ్ఞముల్ నేనుగా  

స్థావర హిమవాస స్థలము నేను


దైవ యజ్ఞము, నరయజ్ఞ దీక్ష నేనె 

భూత యజ్ఞము, ఋషియజ్ఞ, బుద్ధి నేనె 

వాక్కులోమంత్ర పితృయజ్ఞ వాసి నేనె 

నిత్య పరమాత్మ చైతన్య నిజము నేను.    (25)


ఉ.వృక్షము రావిచెట్టుగను వృద్ధిగ చిత్రరధుండు గానునే

శిక్షణ సిద్ధి నారదుగ సీఘ్ర మహత్యము తెల్పనేనుగన్ 

తీక్షణ సిద్ధిగా కపిల తీర్ధ మహోన్నత విద్య వాసిగన్ 

రక్షణ సాంఖ్యయోగమగు రమ్యవిభూతిగ సర్వమేయగున్*(26)


ఉ..ఉచ్ఛతురంగమున్ విషయ మున్నత లక్ష్యము సార్ధకమ్ముగన్ 

స్వచ్ఛ మిరావతమ్మదిని సంపద నిచ్చెడి నావిభూతిగా  

నిచ్ఛగ నేనె భూపతియు నిష్ట జనాళిని  ప్రేమ దాతగన్ 

స్వచ్ఛత సర్వ ధర్మముల సాధ్యము గావుట నిత్య సత్యముల్   (28)


ఉ..నాగుల యాదిశేషుడుగ నమ్మక భావముఁ జూపఁ  గల్గగన్ 

వాగుల యాధిపత్యమున వారుణి  వాహిని  యార్యుడేయగున్ 

సాగెడి శాసనా పరము సామ్యము సాహస మౌను నిత్యమున్ 

భాగ్యము నంద నేను శని భ్రాత విభూతిని ధర్మ రాజుగన్   (29)


సీ. ప్రణవ ప్రకృతిలోని ప్రహ్లాదు నేనుగ 

అసురలలో భక్తి యాత్మ నేనె 

విసుగింత గొనకయే విధికాలముగనేను  

పశువులందున సింహ ప్రతిభ నేనె 

సృష్టి స్థితి లయాలు శృతి జగతిని నేనె 

ఆకశాన తిరుగు నాగరుడుడ 

లౌకిక దృష్టిగా లౌక్యమే నేనుగా   

ఆధ్యాత్మికా దృష్టి యాత్మ నేనె


తే. గీ. దైత్యులలొ నేనె ధనము ధైర్యముగను 

కాల రీతి గమ్యము జూపు కలిమి నేనె 

మృగముల మృగరాజుగనేనె ముఖ్య మగుట 

పక్షి రాజైన గరుడుని ప్రతిభ నేనె   (30)


ఉ. .పావనమైన వాయువుగ పాశము మాదిరి నేను నేనుగన్ 

దైవము నేను నా దశరధాత్మజు ధారిగ యంశ నేనుగన్ 

జీవ జలాలలో మకర జేష్టతగానులె నేను నేనుగన్ 

జీవన దాహమున్ జలము జీవిత గంగగ నేను నేనుగన్  (31)


కం. నా వలన చరాచరములు

నావలన కళా జగత్తు నావలన గదా 

యీవిశ్వము శశి తారలు 

నావాక్యము గీత నేను నా వలన గదా

 సృష్టి స్థితి లయము కారక 

సృష్టిగ విద్యలు వినయము శృతిలయలీగతి  

సృష్టి వివాదన తత్త్వము 

సృష్టిని యీబ్రహ్మ విధుల సృజనపు వరముల్     (32)


శ్రీమద్ భగవద్గీత... పదవ అధ్యాయం....విభూతి యోగం సమస్తాము.. మల్లా ప్రగడ రామకృష్ణ, ప్రాంజలిప్రభ 


****


శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (10))


10) భగవంతుడు సదా వెంట ఉండాలంటే, భగవద్గీత దశమాధ్యాయ పారాయణం చేయాలి . 

- లక్ష్మీరమణ 

మనం ఏ పని చేసినా పూర్ణమైన నమ్మికతో చేయాలని భగవద్గీత వివరిస్తుంది . 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేరు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవారే, ఏదైనా సాధించగలరు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. అని చెబుతుంది. అదే విధంగా  జీవించడానికి అవసరమైన కర్తవ్య బోధ చేస్తుంది. నన్ను నమ్మి నీ కృషి నువ్వు చెయ్యి. అలా నన్ను నమ్మి కృషి చేసిన వారివెంటే నేనుంటారని భగవానుడు చెబుతారు . ఆ విధంగా నవమాధ్యాయం వరకూ భగవంతుని పొందడానికి అవసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పారు. పద్మపురాణంలో పరమాత్ముని ఈ విభూది యోగ పారాయణమును చేసిన ఫలాన్ని వివరించారు . ఆ కథని  పరమేశ్వరుడు పార్వతీమాతకి ఇలా చెబుతున్నారు. 

“సుందరీ ! పరమ పావనమైనటువంటి దశమాధ్యాయ మహత్యాన్ని విన్నంత మాత్రము చేతనే స్వర్గము లభిస్తుంది. పూర్వము కాశీపురములో ధీరబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద శాస్త్రములన్నీ చదువుకుని, వాటిల్లో పూర్ణమైనటువంటి ప్రజ్ఞని సంపాదించినవాడు.  నందీశ్వరునిలాగా నాయందు (పరమేశ్వరుని యందు) భక్తి కలవాడై , ఇంద్రియములను వశపరచుకొని, మోక్ష మార్గములో ప్రవర్తిస్తూ ఉండేవాడు.  అతడు మనసుని అంతరాత్మలో నిలిపి ఎల్లవేళలా ఆత్మానందంలో రమిస్తూ ఉండేవాడు. అందువల్ల అతడు ఎప్పుడు ఎక్కడికి పోతున్నా నేను (ఈశ్వరుడు) కూడా అతని వెంటే వెళుతూ ఉండేవాడిని. అలానేను అతని వెంటే తిరగడం చూసి భృంగి నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు.  “స్వామి! మీరు ఈ విధంగా ఆ భక్తున్ని వెంబడించి పోవడానికి గల కారణమేమిటి? అతని పట్ల మీకు అంతటి అధికమైన వాత్సల్యం ఉన్నట్లయితే, స్వయంగా  మీరు అతనికి దర్శనమీయకూడదా? అతడు మీఅంతటి వారిని వెనకాలే తిప్పుకోవడానికి ఎటువంటి  దానములు, యజ్ఞాలను చేశాడు? తెలుసుకో కోరుతున్నాను కాబట్టి మీరు అనుగ్రహించి చెప్పవలసింది” అని ప్రార్థించాడు. 

అప్పుడు భృంగికి నేను ఆ ధీరబుద్ధి అనే భక్తుని కథని ఇలా చెప్పాను . ఒకనాడు కైలాసంలోని పున్నాగ వనంలో వెన్నెల రాత్రిలో కూర్చుని ఉన్నాను.  ఆ సమయంలో ప్రళయ కాలమువలే భీకరంగా వాయువు వీస్తోంది. భయంకర ధ్వనులతో వృక్షాలు నేలకొరుగుతున్నాయి. పర్వతాలు కూడా ఎగిరిపోతాయేమో అనే విధంగా ఝంఝా మారుతము నలుదశలలో వ్యాపించి ఉంది. అప్పుడు ఆకాశము నుండి కాలమేఘము రూపుదాల్చిందా అన్నట్టున్న  నల్లని వర్ణముతో ఉన్న ఒక పక్షి నా దగ్గరకు వచ్చి వాలింది . చక్కగా వికసించిన ఒక పద్మాన్ని నా ముందుంచి శిరస్సు వంచి ప్రణామం చేసి నన్ను పరిపరివిధాలా స్తుతించింది. 

ప్రసన్నమైన నేను కాకి వలె నల్లని దేహము, హంస వలె శరీరాకారంలో ధరించి ఉన్న నీ పూర్వ వృత్తాంతం ఏమిటి? ఏ ప్రయోజనమును ఉద్దేశించి నీవు ఇక్కడికి వచ్చావు? అని ఆ పక్షిని ప్రశ్నించాను . అప్పుడా పక్షి విధంగా చెప్పింది. “ ఓ ధూర్జటి నేను బ్రహ్మ దేవుని హంసలలో ఒకరిని. నా ఈ దేహమునకు నీలవర్ణము సంభవించిన కారణమును చెబుతాను విను.  సర్వజ్ఞులైనటువంటి మీకు తెలియని విషయం ఏమీ లేదు . అయినప్పటికీ కూడా మీరు నన్ను అడిగారుకానుక వివరంగా చెబుతాను” అంటూ ఇలా చెప్పింది . 

సౌరాష్ట్ర దేశంలో (సూరత్ లో ) పద్మముల చేత అలంకరించబడిన సుందరమైనటువంటి ఒక సరోవరం ఉంది.  బాలచంద్రుని లాగా ప్రకాశిస్తూన్న మృదువైన తామర తూళ్ళని ఆహారంగా తీసుకుని, నేనొకనాడు ఆకాశవీధిలో పోతూ, ప్రమాదవశాత్తున భూమి పైన పడ్డాను. అప్పుడు నాకు స్పృహ తప్పింది.  కొంతసేపటికి సేద తీరి, నేను అలా పడిపోవడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ కూర్చున్నాను . ఆ సమయంలో నా శరీరం నల్లగా మారిపోయింది. అది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది . 

ఇంతలో నాకు దగ్గరలోనే ఉన్న సరోవరములోని పద్మముల మధ్య నుండి ఒక వాణి వినిపించింది. “ఓయి విహంగమా! లే !! నీ పతన కారణాన్ని చెబుతాను” అని  వినిపించింది.  వెంటనే నేను ఆ సరోవర మధ్యనికి వెళ్లి అక్కడ ఐదు పద్మములు కల ఒక పద్మలతను చూసి, ఈ మాటలు ఆ పద్మలతే  మాట్లాడుతోందని గ్రహించి, ఆశ్చర్యంతో నమస్కరించాను.   

అప్పుడామె “ఓ కలహంసమా! ఆకాశవీధిని ఎగురుతూ, నువ్వు  నన్ను దాటి నీవు వెళ్లావు.  ఆ పరిణామం చేత నీవు భూమి మీద పడ్డావు.  నీ దేహానికి ఈ కాలిన నల్లని రంగు కలిగింది. నిన్ను చూసి నాకు దయ కలిగి ఎదుట ఉన్న పద్మముతో నీ గురించి సంభాషిస్తూ ఉండగా, నా ముఖ సౌరభము ఆగ్రాణించిన కారణంగా అరువదివేల తుమ్మెదలు స్వర్గాన్ని పొందాయి.  నాలో ఈ అలౌకిక శక్తి జన్మించడానికి కారణం చెబుతాను విను” అంటూ మొదట ఆ పద్మము ఆ స్వర్గాన్ని పొందిన తుమ్మెదల గురించి చెప్పింది . 

ఆ తుమ్మెదలన్నీ కూడా ఇప్పటికి ఏడు జన్మలకు పూర్వము ముని కుమారులుగా ఉన్నారు. వారందరూ ఈ సరోవరంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఒక సమయంలో అపర సరస్వతి అనదగినటువంటి ఒక స్త్రీ వీణ మీటుతూ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేది.  శ్రవణ మాధుర్యమైన  ఆ ధ్వనికి , ఆమె సౌందర్య శోభకు చకితులైన ముని కుమారులందరూ ఆమెను సమీపించి ఆమెను నేనే ముందు చూసానంటే నేనే ముందు చూసానని ఒకరితో ఒకరు కలహించుకుని, ముష్టి ఘాతములు చేత పరస్పరము తన్నుకొని మృతి చెందారు. అనంతర కాలంలో వారు తమ కర్మానుసారంగా యమయాతనలను అనుభవించారు. ఆ తర్వాత భూమి మీద పక్షులై ఉద్భవించారు.  కాలవసమున దావాగ్నిలో పడి దగ్ధమై తిరిగి గజములై జన్మించి మార్గమున పోవు బాటసారులను చంపుతూ  ప్రమాదవశాత్తున వనములో విషము కలిసిన నీటిని తాగటం వలన యమపురికి చేరుకున్నారు.  ఆ తర్వాత తిరిగి వారందరూ  తోడేలు పిల్లి మొదలైనటువంటి నీచ జన్మములు పొందారు .  చివరకు తుమ్మెదలై జన్మించి నా ముఖగంధాన్ని ఆఘ్రాణించడం విష్ణులోకాన్ని పొందారు. 

ఓ పక్ష్మీంద్రా!  నా ఈ ఐశ్వర్యానికి కారణమును చెబుతాను విను.  ఇంతకు పూర్వము మూడవ జన్మలో నేనొక బ్రాహ్మణ పుత్రికని. అప్పుడు నా పేరు సరోజవదన.  నేను చాలా భక్తితో పెద్దల సేవ చేస్తూ పాతివ్రత్యమునే  ప్రధానముగా పాటిస్తూ, కాలము గడిపే దానిని. ఒకరోజు నా పెంపుడు  మైనా పక్షి చేత పాఠము చదివిస్తూ, పతి  సేవని విస్మరించాను. అందువల్ల కోపితుడైన నా భర్త నన్ను మైనాపక్షివి కమ్మని శపించారు.  

వెంటనే నేను మైనారూపమును పొంది గత జన్మలో పతివ్రత ప్రభావము చేత ఒక మునిగృహంలో నివసిస్తూ ఉన్నాను. అక్కడ ఒక ముని కన్య నన్ను పెంచుకుంటూ ఉండేది.  ఆ గృహ యజమాని నిత్యము విభూది  యోగమైన గీతా దశమా అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. సర్వపాప పరిహారమైనటువంటి ఆ అధ్యాయమును నేను నిత్యము శ్రవణము చేస్తూ ఉండేదాన్ని. కాలవశమున మృత్యుముఖమును చేరి  స్వర్గములో ఒక అప్సరసనై  జన్మించాను.  అప్పుడు నా పేరు పద్మావతి.  

 ఆ తర్వాత నేను లక్ష్మీ దేవికి చెలికత్తెనయ్యాను.  ఒకరోజు విమానమును అధిష్టించి ఆకాశంలో విహరిస్తూ ఉండగా పద్మముల చేత సుందరంగా ఉన్న ఈ సరోవరాన్ని చూసి అందులో విహరిస్తూ ఉన్నాను. ఇంతలో మహాకోపధారి అయినటువంటి దూర్వాస మహర్షి వస్తుండడాన్ని చూసి  భయపడి,  వస్త్రవిహీనురాలనైన నేను ఒక పద్మలత రూపాన్ని ధరించాను.  ఇదిగో ఐదు పద్మములు గల నన్ను చూడు.  ఇందులో రెండు పద్మాలు నా పాదాలు.  రెండు పద్మాలు హస్తాలు.  ఒక పద్మము ముఖము.  ఈ విధంగా పద్మలత రూపమును దాల్చిన నన్ను చూసి దుర్వాసుడు కోపక్రాంతుడై, ‘ఓసి దుర్మార్గురాల నీవు ఈ రూపములోనే శతవత్సరంలు  ఉండుదువు  గాక అని శపించి, అంతర్హితుడయ్యాడు. 

 పూర్వజన్మములో విభూతి యోగాధ్యాయమును శ్రవణము చేయడం చేత ఈ జన్మలో ఈ విధమైన రూపంలో ఉండి మాట్లాడగలుగుతున్నాను. అటువంటి శక్తి గల నన్ను నువ్వు అంతరిక్షమున వెళుతూ అతిక్రమించుట చేత నేల కూలి పడ్డావు.  నా ఎదుట ఉండగానే నీకు శాప విముక్తి కాగలదు.  నాకుకూడా శాప విమోచనా సమయం  సమీపించింది.  నేనిప్పుడు ఆ దశమా అధ్యాయాన్ని పారాయణా చేస్తాను.  నీవు కూడా వింటూ ఉండు.” అని పలికి ఆ పద్మలత దశమా అధ్యాయాన్ని పారాయణ చేసి ముక్తిని పొందింది. ఆ సమయంలో ఆ పద్మలత చేత ఇయ్యబడిన పద్మాన్ని తీసుకొని ఈ విధంగా నీ వద్దకు వచ్చాను. కాబట్టి ఓ మహేశ్వరా ! నన్ను అనుగ్రహించు.” అని  ఈ విధంగా ఈశ్వరునితో పలికి  ఆ హంస కూడా ముక్తిని పొందింది. 

ఓ భృంగీ ఆ తర్వాత ఆ హంస ఒక బ్రాహ్మణుడై జన్మించాడు. ఆ బ్రాహ్మణుడే ఈ ధీరబుద్ధి. పూర్వజన్మ సంస్కారము వలన  అతడు బాల్యమునుండే దశమా అధ్యాయాన్ని పఠిస్తూ,  నిత్యము అభ్యసించాడు.  దాని ప్రభావం వలనే ఇతడు సర్వదా శ్రీమహావిష్ణువుని సందర్శిస్తూ ఉండేవాడు.  ఈతని దృష్టి ప్రసరణ మాత్రము చేత పంచ మహా పాతకులు కూడా ముక్తిని పొందుతారు . అతడు పురమందు ఉండుట చేత పౌరులు అందరకు ముక్తి కరతలామలకమవుతుంది.  అందువల్లనే  నేను సదా అతని వెంట తిరుగుతూ పోతున్నాను. ఓ బృంగిశా ! భగవద్గీత దశమా అధ్యాయ మహత్యము ఇంత గొప్పది” అని బృంగికి వివరించాను . అని పార్వతీదేవికి వివరించారు ప్పరమేశ్వరుడు . 

 ఇంకా ఇలా చెప్పారు . “ ఓ దేవీ !  బాలురు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే నిత్యము భక్తితో భగవద్గీతలోని దశమాధ్యాయమైన విభూతి యోగాన్ని నిత్యం శ్రవణం చేస్తారో , పటిస్తారో అటువంటి వారందరూ కూడా సర్వ ఆశ్రమ ధర్మాలను ఆచరించిన ఫలితాన్ని పొందుతారు.  ఇంకా  భయంకరమైన జన్మముల్లని కర్మానుసారంగా పొందినప్పటికీ కూడా  జ్ఞానవంతులై తుదకు మోక్షాన్ని పొందుతారు.” 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !! 

*ప్రాంజలిప్రభ*

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు