శ్రీమద్భగద్గీత.. *విశ్వరూప దర్శన యోగము* (పదకొండవ అధ్యాయము)
శ్రీమద్భగద్గీత..
*విశ్వరూప దర్శన యోగము*
(పదకొండవ అధ్యాయము)
01.నన్ను ను కావుమా కరుణ నానుడి నాకును పంచ గల్గునే
నెన్నగ జ్ఞానమున్ దొలచ నెన్నిన లక్ష్యము బోధపర్చుమా
మన్నన తోడు, వాక్కులివి మానస గోప్యమనంగ సాధ్యమా
మిన్నగ దైవపూజ్యమగు మిక్కిలి ప్రీతిగ బోధ తత్త్వముల్
******
02.నిత్యము నీ పదాంబుజము నేమరకుండగ సేవ జేయగన్
భృత్యుడ నన్ను గావుమయ పృథ్విని పుట్టుట గిట్టుటే యనన్
మృత్యువు కాలమై మహిమ మేను విమోచన మిత్తువీవు, సా
పత్యము లేదు నాకెచట భావమునందున నందనందనా
*******-
03.డెందంబున్ పులకించుటన్ సమయమున్ దివ్యప్ర భావమ్ముగన్
సందేహంబుయుతీరె శక్తి బలమున్ సంపన్న రూపమ్ము, యా
నందావేశముతేజమై మహితమౌ నామార్గ నీదేయగున్
విందయ్యెన్ వివరమ్ముగాను విజయం వేనోళ్ల నీభక్తిగన్
******
04.నాయోగేశ్వర దివ్యమైన మనసే నామాయ రూపమ్ముగన్
సాయోధ్యా సహనమ్ముగాను మహిమన్ సాధ్యమ్ము శాశ్వత్వమున్
ప్రాయమ్మున్ దయగన్ స్వ రూపముగుటన్ పాఠ్యమ్ము వేదమ్ముగన్
ధ్యేయంబున్ కరుణాకటాక్షముగనీ తేజమ్ము నేస్తమ్ముగన్
******
05.చూడుము పాండునందనుడ, చూపు సమమ్మగు నెల్లవేళలన్
వేడుక తోడనే విధిగ వీలుగ వర్ణన పెక్కు మార్గముల్
వీడని కాంతితో సహజ విద్యల నేర్పుచు దివ్య రూపమున్
వాడని దివ్య యాకృతులు వాక్కుల నేస్తము గాను నేనుగన్
*****
06.ఆదిత్యా వసువుల్ మరుద్గ ణములన్ ఆశ్చర్య రూపమ్ములున్
ప్రాదేశమ్ముయు రుద్రయశ్వినికళల్ ప్రాధాన్య రూపమ్ముగన్
నాదేహంబు సమస్తజీవములుగన్ నాయందు రూపమ్ముగన్
హా, దివ్యప్రభలున్ యపూర్వ విధమున్ యాదృష్టి నేనేలుగన్
07.ఒక్కటి కాదుదేహమున నొమ్మలు వేలువిధాన జీవముల్
నిక్కు చరాచరమ్మగుట నిండుగ నున్న జగంబు యంతయున్
చక్కగ చూడుమో నరుల జాగులు చేయక నీదు లీలలన్
దక్కని వే యనా విడకు ధర్మము నంతయు నాకు నీవుగన్
*****
O8.నా దివ్యా క్షువులన్ని నీవుగ వినా నాదృష్టి నీ కన్నులన్
నీదేహమ్ము నిజమ్మెరుంగ విధిగా నీధ్యాస కష్టమ్ముగన్
నేదివ్యాక్షువునన్ నొసంగగవిధుల్ నేనెన్న నీశక్తి గన్
నా దివ్యా కృతులన్ని జూడ గలిగే నాదేహ యోగమ్మునన్
******
09.ఓ రాజా భగవానుడేపరమ దివ్యారూప ప్రావీణ్య మున్
సారూపమ్మును సద్గుణీశ్వరములే సందర్భ సంపూర్ణముల్
ధీరాతత్త్వముయోగమైన పలుకే దివ్యస్వరూపమ్ముగన్
ప్రారంభమ్ముననే సమాంతరమునన్ ప్రావీణ్యయోగీశ్వరున్
****-*
*****
10.బహువిధ శస్త్ర యస్త్రములు భవ్య సదృశ్యము యద్భుతమ్ముగన్
బహువిధమైన పుత్తడుల భాగ్యపు యాభరణమ్ము గంధముల్
బహువిధ దృశ్య నేత్రములు బాహువులై ప్రతిభా సమాంతరల్
బహువిధబంధశోభిత శుభాల సుగంధ ప్రభంద నాయకన్
******
11..దివ్యపు మాలలే వెలుగు దీక్షల వస్త్రపు దివ్య దేహమున్
భవ్యపు చందనల్ పరమ పావన యానతి సర్వతో ముఖుల్
సవ్యపు సామరస్యమగు సర్వము దాహము తీర్చ దేహమున్
నవ్యయ సుందరమ్మగుట నామది యెప్పుడు నీదియేయగున్
******
12.ఆకాశంబున పూర్ణ బింబములుగన్ ఆశ్చర్య వైనమ్ముగన్
యాకారంబును పొంది యానతికళల్ హస్రాది దిత్యుల్విధిన్
యేకమ్మైనను రూప తేజములుగన్ యేలేటి వైనమ్ములన్
శ్రీకారమ్ముల కాంతి కెప్పుడువిధుల్ శ్రేష్ఠమ్ము తేజమ్ముగన్
****
13..ఆ సందర్భమునందు పార్ధుడుఁ గనెన్ ఆదేహ మందంత జీ
వాసారమ్ము లు సర్వసమ్మత ముగన్ వాగ్దేవి సంతోషముల్
యా సారథ్యములే యమోఘములు బ్రహ్మాoడమ్ము కేంద్రీకృతుల్
గా సంయుక్తము గాంచె పార్థ కనులున్ గ్రాహ్యమ్ము లా హాయిలే
*****
14.దేవా దేహమునన్ విరాట్ భవముగన్ దేవేంద్ర నానావిధన్
దేవాత్మల్ కమలాసనుండు గనుటన్ తేజోమయమ్మున్ గతిన్
దేవా శంభుని లీలగాంచగలగన్ దివ్యాధి దేహంబునన్
వేవేలా చరముల్ సువీక్షణముగన్ వేనోళ్ల దివ్యమ్ముగన్
*****
*అర్జున వాణి*
15.దేవా దేహమునన్ విరాట్ భవముగన్ దేవేంద్ర నానావిధన్
దేవాత్మల్ కమలాసనుండు గనుటన్ తేజోమయమ్మున్ గతిన్
దేవా శంబుని లీలగాంచగలగన్ దివ్యాధి దేహంబునన్
వేవేలా చరముల్ సువీక్షణముగన్ వేనోళ్ల దివ్యమ్ముగన్
******
16..విశ్వేశ్వరా యన విశ్వరూపా యన
బాహువులు కలిగి భవము వెలుగు,
ఉదరములు కలిగి యున్నత వెలుగులు
యత్యంత రూపపు అద్వి తీయ
మాదిమధ్యాంతము లానంద రహితుడు
సర్వతో ముఖమగు సహజ శాస్త
తెలిసికొనగ లేని దివ్య రూపమదియ
పూర్ణమైన మహత్య పూజ్య విదిత
విశ్వ రూప దేవ విశ్వేశ్వరాకార
బహువు లుదర ముఖము బహు సంఖ్య
లాది మధ్య మంత మేదియు లేకున్న
నేను నిన్ను జూడ నిజము కాదు
******
17...హేదేవా హముధారి విశ్వమయమున్ యేతెంచు మాహత్యమున్
నీదివ్యా నిజరూపవర్ణములుగన్ నీమాయ మోహమ్ములన్
యాదేవా సకలమ్ము కాంతి గమనాలాశ్చర్య లక్ష్యమ్ముగన్
యీదర్శించుకళాగ్ని నీశ్వరమయా యిచ్ఛాను జ్యోతిర్మయా
*******
18.నీవే యక్షరసత్స్వరూపుడుగ నే నిర్మాణ బ్రహ్మేంద్రుగన్
నీవేసత్యపరాత్పరా జగతిగన్ విజ్ఞాన విశ్వంభరా
నీవే వేత్తవు కర్తవున్ పురుషుడున్ నేత్రాల నీలీల గన్
నీవేధర్మమువిశ్వమున్ కళలుగన్ నిత్యమ్ము విశ్వాసమున్*
****
19.ఆదియు, మధ్యమున్ మరియు నంతము నేదియు లేక యుండగన్,
ఆది యనంత శక్తిగల యచ్చెరు వందెడి కారణమ్ములన్
వేదము లాద్య బోధనలు విద్యల జీవుల శక్తి యుక్తిగన్
సాదులు సూర్య చంద్రులు విశారదు లెంతటి ధన్యులేయగున్
******
దివిభువియంబ రానననె దివ్య వెలుంగున విశ్వ మంతటన్
వివిధ దశాస్వపూర్ణమయ విద్యల వేక్తగనుండ దైవమున్
నవవిధభీకరమ్ముగను నామము రూపముగల్గ నాయకన్
భువనము లెల్ల భీకరము బుద్ధి భయమ్ము గనౌను యెల్లరున్
*****
21.సురులలొకొందరంజలుల సూర్యు విధాన ఘటించి మ్రొక్కగన్
వెరయుచు కొందరున్ స్వపర విద్యలసిద్ధి మహర్షి కీర్తిగన్
పరమఋషీగుణమ్ముగను ప్రస్తుతి యుత్త నియోగ మేయగున్
నరయచుచేసిరీ స్తుతులు నామము కీర్తనభక్తి భావమున్
*****
22.మరియును రుద్రు డష్టవసు మార్గపువిశ్వ సురుల్ స్వ దర్శనమ్
మరుతులుసాధ్య యక్షముని మంత్రము తంత్రము యంత్ర దర్శనమ్
నరవరగంధ యశ్వజిత నాంది మరుద్గణ నేకరుద్రులన్
నరయచు నోళ్లనేదెరచి యబ్బుర సంబరమాయె నందరున్
******
23.అసంఖ్యాకములైనవక్త్రములుగన్ యారాధ్య నేత్రమ్ములున్
అసంఖ్యాకములైనపాదములుగన్ యాశ్చర్య యూరువ్వులున్
అసంఖ్యాకములైన చేతులుగనెన్ ఆద్యంత భీతిల్లగన్
అసంఖ్యా కములైన రూపములుగన్ యందున్న భయ్యమ్ముగన్
*****
23.నభవముతాకుచూ బహు నినాద ములెన్న సవర్ణ కాంతిగన్
ప్రభలతొవర్ణ రమ్యమగు ప్రాభ వమేను విశాల విశ్వమున్
శుభమయ నీదు రూపమును సూత్రమనస్సుగనౌను నిత్యమున్
నుభయము నొందధైర్యములునొప్పెడిశౌర్య ప్రకాశ మందునన్
*****
25.భీకర దంతముల్ భయము భీతిగ నంతయు నొప్పు చున్నదిన్
నేక విధమ్ముగాలులగు నీ వదనంబన జ్వాలలేయగున్
నేకన లేనిదిక్కులవి నెమ్మది శూన్యము భీతి గొల్పుచున్
(సూన్యము=చేతబడి; శూన్యము = ఖాళీ)
నాకు శుభమ్ము కూర్చు నవ నాడుల సమ్మతి యెల్ల వేళలన్
*****
26.శుభములకు ప్రతీక శోభాయమానమౌ
తేరుకు మధ్యన ద్రోణ, భీష్మ
జ్యోతి స్వరూపులై ఓంకార రూపమ్ము
వక్షము నందలి వరుస పుత్ర
గలగల భయమగు చెలిమికి చిగురుగా
కొందరి తలలన్ని కోరలందు
పరుగులు తీయుచూ ప్రావేశ మన్ననున్
వాణి మహాలక్ష్మి వాసి చెంద
కౌరవ భవ వారసులుగా కుంతి పుత్ర
చతురతగ శక్తి యుతులైన సాధు ద్రోణ
జతగ రాజపితా మహా జమిలి హృదయ
దంతములలోన చిక్కెను ధరణి సుతుడు
******
27..మనవారే సహయోధులే హృదయమే మానుష్య రూపమ్ములున్
ఘనబీభత్సము వక్త్రమందు మది ఘీంకారమ్ము శబ్దమ్ముగన్ (భీభత్యము(x )= బీభత్సము)
కనుచుండన్ జన కాలమేయగుటయే కామ్యమ్ము వేగమ్ముగన్
క్షణమైనన్ భయ కోరలాంతరమ నే క్షామమ్ము హృద్యమ్మునన్ (క్షామము =?)
****---
28.ఏ రీతీ జలమున్ ప్ర యాణమును సాపేక్షా సముద్రమ్ముగా
నేరీతీగతి యోధులందరికళల్ యేకమ్ము మౌఖ్యమ్ముగా
నేరీతీ యమృతమ్ము సాధ్యమగుటల్ యేనేస్త బంధమ్ముగా
నేరీతీ విధిభార్య భర్తలకళల్ యేవిద్య నీతీరుగన్ ( భార్య భర్తల (x) = ?)
******
29..మోహవశమ్ముగా మిడత మోక్షము దీపము యగ్ని వైపునన్
దాహమువల్లెవీరులవిధానము వక్త్రము నందు చేరుటన్
దేహము నందురోగముల తీరున చేరియు బాధ పెంచుటన్
వాహన మేదియైనను సవారిగ పొందక వీలు యేదియన్
****
30.సీ.మానవ మాతృండు మాత్రము కాదులే
మానవాతీతపు మంచి శక్తి
దివ్యత్వ సర్వజ్ఞ దీక్షలు యేమాయ
శక్తి సామర్ధ్యాలు సరయు యుక్తి
జ్వాలమౌఖ్యంబున జాడ్యమహోగ్ర ము
నీ నోళ్ళతో మ్రింగు నిజము జనులు
జగతిలో కిరణాలు జాగృతి లేకయే
తేజస్సుతో నింపి తీవ్ర తపము
మృత్యుముఖమున సకలము మ్రింగు చున్న
విశ్వ రూప దర్శనమున వింతఁ గనరు
దేవ యుగ్ర రూపమదేల దివ్య వెలుగు
ఈప్రవృత్తియేమియనగ నిట్లు తెలిపె
*****
31..దేవా, దివ్యమనస్సుకే తెలియకన్ దీనంబు ధ్యానమ్ముగన్
నే వేడేదనునిన్ను నాదుమనసే నేనిన్నెరుంగాననున్
నీ వృత్తీ వివరమ్ము తెల్వకవిదీ నిత్యమ్ము యుగ్రంబుగన్
నీవేశాంతినిచూపుమా జయముగన్ నీవిజ్ఞ వేద్యమ్ము గన్
*****
32.నేనీలోకమునన్ మహాభయముగన్ నీడల్లె కాలుండుగన్
హా, నాశమ్ముననే జయమ్ము గలుగున్ హాహా కరమ్మేనులే
పోనిమ్మా యనినా సమస్తముగనే రూపున్ గనేదెవ్వరున్
నేనేమృత్యువుగన్ వధింతు నియమమ్మెవ్వారు లేకుండగన్
******
33..నీసహనమ్ము వీడు, జయ మిచ్చును యుద్ధము చేయు చుండుమున్
శ్వాసను జూప శక్తిగని సమ్మతిగా సమరంబు చేయుమున్
చేసితి జీవముల్ వదల నీవు నిమిత్తము యుద్ధమేయగున్
ఈ సమరమ్మునన్ మరణ హేతువు నాదయ పాత్రయేయగున్
*******
34.గత కాలంబున నేనుగన్ మరణమున్ గాయమ్ము జేయంగ నే
హత మొందించుట హేతువే విధియగున్ హాహా కరమ్ముల్ గనన్
హితులన్ జూడక జేయు యుద్ధమనగా యీసర్గ లోలమ్ము గన్ (సర్గ = అధ్యాయము)
మతినుంచే సమరమ్ముగా గొనెద నే మార్గమ్ము మిత్రమ్ముగన్
*****
35.యోగిగ పల్కులేయగుట యున్నతి యైనను గద్గదస్వరమ్
బాగుగ పార్థ, మ్రొక్కి విధిభాగ్యముఁ దెల్పము నీదు చందమున్
సాగని వేళ సాధ్యము సుసాధ్యపు పర్వము దర్శనమ్ముగన్
స్వాగత మెన్న కృష్ణ కళ సాహస మేయగు ప్రార్ధనా నిధుల్
*****
36.సిద్ధగుణమ్ముగాప్రణము శీఘ్రము కీర్తన పాడగల్గగన్
బుద్దిగ గానమున్ స్వరము పూజ్యము రూపజగత్తు నందుగన్
శ్రద్దయు రాగమున్ సమయ సాక్షిగ నేస్తము సర్వ దిక్కులున్
విద్దెల దానవుల్ పరుగు వింతలు జూచియు పారిపోవగన్
*****
37. నీవే వేత్తవుగా జగంబుననె ప్రావీన్యమ్ము శక్తౌనులే
నీవే యాదిగపుర్ష దేవుడవుగన్ నీవేయనంతమ్ముగన్
నీవే సర్వమువేద్యుడున్ స్థిరముగన్ నీధ్యాస ధర్మమ్ముగన్
నీవేలే పరమాత్మ సర్వమయమున్ నీ స్వేచ్ఛ సర్వజ్ఞతన్
**-*-
38.నీవే సృష్టికి కర్తమూలమగుటన్ నిర్మాణ శ్రేష్ఠండుగన్
నీవేశాస్విత మ్రాక్కగన్ జగతినన్ నిస్వార్థ లక్ష్యమ్ముగన్
నీవే సర్వమురూప బ్రహ్మయగు టన్ నీభాగ్యమే కావునన్
నీవే సత్య పదమ్ము గానుపరమై నిర్వాహనే విద్యగన్
******
39.నీవే వాయువు నగ్ని చంద్రుడవుగన్ నిత్యాత్మ నిర్వాహముల్
నీవే బ్రహ్మకునన్ పరాత్పర వరుణ్ నీసేవ నాభాగ్య ముల్
నీవే స్వార్జిత బంధమై సకలమున్ నీ రక్ష గాచేయుటన్
నీవే మాకు తగున్ సమర్ధతయగున్ నిత్యమ్ము మ్రొక్కన్ నినున్
****
40..అందున వీర్యధీరపర మాశ్రిత సాక్షిగ నన్ని రూపముల్
వందన మేను శక్తిపర వాక్కులకాగల సర్వ నేస్తమున్
ఎందు కనంగవిద్యగల నెల్లర నేస్తము విశ్వమందునన్
బంధన వ్యాప్తిచే గలుగు బాహువు లీలల లోక మందునన్
****+
41..నీ మహిమన్ నెరుంగకయెనీసఖు నేనని భావమేయగున్
నీమమతాను రాగములు నీకృప యే మది యూహలేయగున్
నీమరులందు మాస్థితిగ నెచ్చెలి గానులె మిత్రమేయగున్ (ప్రాస -- మ' కు బదులు -- ప' కుదరదు )
నీమురిపాల లో మమత నీడలు మిత్రును గాను యుండగన్ (ప్రాస -- మ' కు బదులు -- ప' కుదరదు )
*****
42..అవకాశంబగు తీరు నాకు కళలే యాశ్చర్య భావమ్ముగన్
అవమానంబగు మాటలీ విధిని సాహా*తత్వ మేరూపమున్ (సాహా=కాలము; అ' -- డీ' లకు యతి కుదురదు.)
సవరించే విధి విద్యవాక్కులగుటన్ సామర్ధ్య మేమేలుగన్
నవ మార్గమ్మగు యప్రమేయమయ మే నామమ్ము గావేడుకన్
*****
43..నీవు చరాచరమ్ముగను నీడల నుండియు పూర్తి హక్కుగన్
నీవుగ తల్లి తండ్రివగు నీమది గుర్వగు ముక్తి మార్గమున్
హే పరమేశ్వరా కళలు హేతువు ధర్మము నీకు బంధమున్
నీవు గ చిక్కి దూరమగు నీకును నీవుగ సాటి లేరుగన్
*****
44.కావున నన్నుగాచుమను కార్యము నీవిధి భక్తి తోడుగన్ (క్షమతొ- ?)
నీవు ప్రసన్నుడై *సరళఁ దీర్చుము నిత్యము సేవఁ జేసెదన్* (ప్రసన్నడై - ?)
నీవు మనస్సు నందు *నతి* దీనుల రక్షణఁ జేయఁ గల్గినన్ (రాక్షయు-?)
నీవు యశస్సునిచ్చి *ప్రతి* నిత్యము జూడుము మమ్ముఁ గావగన్
*****
45..మునుపేనాడును జూడలేదు సుఖముల్ ముఖ్యమ్ము గాప్రేమలన్ (పెన్నాడు -- ?)
నను సంతోషపరమ్ముగాను జతగా నాయందు నీవేయగున్
మనసే నీవుగ ధర్మముల్ దెలుప నా మంత్రమ్ము నీదేయగున్
కననే వీలుగ శక్తిభక్తి యన నీ కామ్యమ్ము నీవే గతిన్
*****-
46.సీ.పరమాత్మ శిరమున ప్రకృతి కిరీటము
కరమున గదయును కృష్ణ లీల
కరమున చక్రము కాయము జూతుము
చూపుస్వ రూపము జూప లీల
నీ మునుపటి రూపుఁ నిత్యమ్ము గలుగుము
వసుదేవసుతుడవు వాక్కు మాకు
ఆర్తితో వినతుల నర్జునుని తలపు
విశ్వరూప మహిమ వీక్ష ణగుట
దేవప్రియ.. (UIUU UIUU -UIUU UIU )9/15
భక్త ఇష్టంమేను రూపమ్ భవ్య లక్ష్యమ్మే విదీ
వ్యక్తి భావమ్మేను రూపమ్ వాక్కు లక్ష్యమ్మే గతీ
శక్తి ప్రేమమ్మేను రూపమ్ సాధ్య సాధ్యమ్మే స్థితీ
యుక్తి దేహమ్మేను రూపమ్ యుత్త మోత్తమ్మే సుధీ
******
*సాధారణంగా, సీస పూర్వము తర్వాత 'ఆట వెలది' లేక తేట గీతి' తో ముగించాలి. మీరేంటి -- ఏదో దేవప్రియ, రతిప్రియ, రగడ పద్యాలతో ముగించడం - క్రొత్తగా వుంది. నాకా దేవ ప్రియ' పరిచయం లేదు. దాన్ని మీరే సరిచూసుకోండి -- The following is for future guidance of ' Siisa Padyamu" -- సీస పద్య లక్షణాలు
• పాదముల సంఖ్య = 4
• ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.
• ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
• ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
• ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
• ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
• రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
• మూడు నాలుగూ... ఐదూ ఆరు... ఏడు ఎనిమిది.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
• ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
***
47.నాకృప తోను రూపమును నన్నును గుర్తుగ యోగ శక్తియున్
వేకువ యాద్యమైనదియు విశ్వ ప్రదర్శన నీకు మాత్రమున్
నీకు యదృష్టమే యిదియు మెవ్వరి కీయన వీలు లేదనన్
నీకు శుభమ్ములెచ్చు ధరణీ తల శోభయు యెల్ల వేళలన్
******
48.వేదాధ్యయనముగా విద్యార్థుల పరము
యజ్ఞ యాగాదుల ప్రజ్ఞ లందు
క్రతువులాచరముగా కృపజూప మనసుగా
శాస్త్ర యధ్యాయము సాకు లెన్న
దానధర్మాలుగా దారి చూపుచుయున్న
ధర్మవాక్కుయనిన ధరిణి నందు
కర్మచరణమైన కాలమిదియెనన్న
నీకిదే దర్శించు నిజము పార్ధ
తే. గీ
వేద పఠనము వలనుగా విద్య లున్న
యజ్ఞ విహితకృతుల కార్య ప్రజ్ఞ లెంచి
తపము ధర్మము న్యాయము తాప మున్న
దర్శనమునీకు మాత్రమున్ ధరణి లోన
*****
49..ఈవిధ మైనరూపముయె యిచ్ఛ భయమ్ముయు నిన్ను చేరగన్
ఈవ్యధ లందు మోహముల నిష్టము వీడుము చిత్త మందునన్
సేవల సంభవమ్ము లను శ్రేయము గాఁ గను రూపమేయగున్
ఈ విల సిల్లు రూపమున నిప్పుడు గాంచుము చక్ర ధారిగన్
--******
50..సీ.నాల్గు భుజాలుగా నమ్మక రూపము
విష్ణుమూర్తిగనుటే విజయ మిటుల
కాలస్వరూపాన్ని కాంచ భయములెన్న
సకల లోకములతో సహజ ధారి
భీకర రూపాన బీతిల్లె పార్ధుడు
ఉపసంహరించగ నున్న రూపు
రెండు భుజాలుగా రిక్త కృష్ణుమరల
గాంచ గలిగె పార్థు కనుల ముందు
పాండవయభిమానిగ కృష్ణ ప్రభువు నిలువ
విజయ కాంక్షతో యర్జును డంజ లిడెను
శాంత శ్రీకర రూపము సాక్షి కృష్ణు
వేదనల దీర్చ విజయుని వెలుగు పథము
*****
నిర్మల మై మనస్సు గల నిశ్చల తత్త్వము పొంద కల్గితిన్
కర్మల నాత్మ తత్త్వమున కాలము దీర్చిన సత్త్వమెల్ల డన్
ధర్మము తప్పకన్ గొలవ దాసుని గానను నమ్ము దైవమా
మర్మము విశ్వరూపమన మార్గము రక్ష జనార్ధనీగతిన్
******
నీవేరూపముగంటివో మనసులో నీదైన ధైర్యమ్ముగన్
ఆ వైభోగమునాకు దుర్లభముగన్ యారూప మేనీకుగన్
యేవేదమ్ము న పాఠ్యమేయగుటనిన్నే జూచు యజ్ఞమ్ము నన్
యేవిద్యల్ గనినన్ విధీయములుగా యేలేను నీయాశ్రితుల్
*****
53.నీ రూపమ్ములనుంగు యజ్ఞములుగన్ నీ యర్ధ మేవేరుగన్
నీ రూపమ్ము లనుంగు దానములనన్ నీ యందు సర్వమ్ముగన్
నీ రూపమ్ము గనన్ తపస్సుయనుటన్ నీ మాయ లే సర్వమున్
నీ రూపమ్ము లనుంగు వేదములుగన్ నీవుండ గాదే నిలన్
*******
54.నీ కని సర్వ కర్మలు వినీతిని సాధన జేయగా నగున్
చేకొను చిత్తముల్ చెలిమి చేరువ నిల్వల మాదిరేయగున్
చేకొన వైరభావములు చెంగట భక్తిగ నిన్ను గొల్వగన్
నీకను యర్పణల్ మనసు నీదరి చేరుట మోక్షమేయగున్
******
విశ్వరూపదర్శనయోగం సమాప్తం
చక్కటి పద్యాలు ప్రతిఒక్కరూ చదివేందుకు పొందు పరిచే.. మల్లాప్రగడ
ReplyDelete