శ్రీమద్ భగవద్గీత.. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము.. 13వ అధ్యాయము.

శ్రీమద్ భగవద్గీత.. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము.. 13వ అధ్యాయము.


ఉ. బ్రహ్మయె సూక్ష్మమై స్థితియు బంధము శ్రద్ధగ బుద్ధి బోధలన్ 

 బ్రహ్మ శరీరమున్ గృహము పాశరధమ్మగు బంధ క్షేత్రమున్

బ్రహ్మమనంగ దేహమగు భాద్యత హృద్యము మంది రమ్ముగన్ 

బ్రహ్మ రధమ్ము దేహమను బండియ గమ్యము జ్ఞాన క్షేత్రమున్       (01 )


శా. .క్షేత్రంబన్న శరీరమే జడమునన్ క్షేమమ్ము జూడన్ గనన్ 

క్షేత్రజ్ఞున్ దెలిసేవివేక పరిధిన్ జేర్చంగ దైవమ్ముగన్ 

క్షేత్రాలన్ భగవాను రూపముగనన్ క్షేత్రేషు జీవేశ్వరున్ 

క్షేత్రజ్ఞానముగన్ మనో విధిగనే క్షేత్రాలు పుణ్యమ్ముగన్                   (02 )


శా.  ఏదా క్షేత్రమురూపమేది యనగన్ యెవ్వారు నేవిద్యగన్,  

ఏ దీగమ్యములన్ గుణంబు జనకున్ నేమాయ నెంచేదియున్,  

ఏ దానన్ తెలిపే రహస్యమును నేనీకున్ వచింతున్ సుధీ, 

ఏదెట్లుండును కారణమ్ములువిధిన్ యేభావ సంక్షిప్తమున్              (03 )


ఉ. .ఈవిషయమ్ములన్ ఋషులు నిచ్ఛగ నీతుల తెల్పి యుండగన్, 

ఈవిషయమ్ములన్ మనసు నిచ్ఛగ వేదము తెల్పియుండగన్, 

ఈ విషయమ్ములన్ పలుకు నిత్యము గీతము బ్రహ్మ సూత్రమున్, 

ఈవిషయమ్ము హేతువగు విద్యల నేస్తము నిశ్చ యమ్ముగన్            (04 )


విదకర్మేంద్రియ పంచ భూతములువైవిధ్యుక్తశక్యమ్ము గన్  

సదరాత్మీయత మాన్య దేహమున విశ్వమ్ముల్ విధేయమ్ము గన్  

ఇదమద్ధర్మమునన్ సమూహ పరముల్ స్వీయార్థ భావ్యమ్ముగన్ 

ఇదియవ్యక్తసహమ్ము బుద్ధి విధి నుద్విగ్నమ్ము విశ్వమ్ముగన్            (05 )


ఉ. కోరిక వైరమున్ గనుమ కోపము దుఃఖము పాపహేతువుల్   

మీరిన సంపదే మురిపముల్ ధృతియున్ భవదేహమేయగున్ -- 

చేర్చిన చేతనమ్ములను చింతల మార్పుకు క్షేత్రమేయగున్ 

వారును వీరు  క్షేత్రమని వాక్కులు సర్వవికారమేయగున్ ---            (06 )


మ. అభిమానమ్ముయు నిగ్రహమ్ముగను శ్రద్దాభక్తి సేవించుటన్ 

అభి వాక్కౌను యహింసభావమగుటే క్షంతవ్యమంతః కరన్ 

అభి లాషే సరళత్వమేయగుట యభ్యంతార్థ శుద్ధత్వమున్ 

సభయంతః కరణమ్ముగా విధియసాధ్యమ్ముల్ సుసాధ్యమ్ము గన్      (07 )


చo. ఇహపరలోక భోగములనిశ్చయమేదియు జన్మ బంధమున్,  

అహము నిజానిజాలను సమాంతరయర్ధముఁ దెల్పు సంఘటన్ 

మహమున దుఃఖదోషములమాన్య తవిద్యలనేలవమ్మ గున్ 

ఇహపరసౌఖ్య రోగములనిష్టముమృత్యుజరా సుదర్శనమ్              (08 )


మ. తనయాలీయన పిల్లలేయనుచుమాయా తత్త్వ మేలా యనన్  

తన యిల్లేయను భావమున్ వదలి స్వార్థమ్ముల్ విలోలమ్ము లన్  

తనమానమ్ము మనోవికారములకే తన్మాయకేలొంగకన్ 

తనువెల్లప్పుడు లోనుగాకయు నితాంతమ్మున్ విధేయమ్ముగన్        (09)


శా. నాయందున్ సుఖ మన్య యోగములుగన్ నాయందె దీర్ఘమ్ముగన్ 

నాయందున్ సమభక్తి నన్ను దలచన్ నాశక్తి చేకూరగన్ 

నాయాసక్తిపవిత్ర మౌను విధిగన్ నావాక్కు సర్వమ్ముగన్ 

నాయత్నమ్ము సమాంతరాద్య గుణమున్ నాధ్యేయ మున్ తృప్తిగన్   (10 )


మ. మనసాధ్యాత్మికభావమున్ మనసుకేమార్గమ్ము భాగ్యమ్ము ద 

ర్శన మౌనమ్ముయు తత్వ జ్ఞానమగుటేశాస్త్రార్ధముల్ సమ్మతిన్ 

గన యజ్ఞానము తర్మ  జ్ఞానముగనున్ కావ్యమ్ము నేనేయగున్ 

విన నిత్యస్థితి గాను జీవమగుటన్ విజ్ఞాన సాధ్యుండుగన్                   (11 )


శా. దేహంలో న పదార్ధమే జడ మగున్ దివ్యాత్మగన్ నేనుగన్ 

స్నేహంగా మనసన్నదే విధిగ నున్ సేద్యమ్ము సర్వమ్ముగన్

దాహంగా గల యింద్రియాల గనునే దాక్షాయినీ క్షేత్రమున్ 

మోహంబున్ యుగ బ్రహ్మమే యగుటయున్ మోక్షంబు నేనేయగున్  (12 )


మ. తనచేతుల్ సకలమ్మురక్షణగనే తాపత్రయమ్మేయగున్ 

తన పాదమ్ము లువే*నదీవిధముగన్ *ధర్మమ్ము  సాధించగన్* 

తన కన్నుల్ జగ మంత జూడగలుగున్ దాహమ్ము దీర్చేo దుకున్ 

తనలోకమ్మగు కర్ణముల్ వదనముల్ తత్త్వమ్ము బోధించగన్            (13 )


మ. యతడే యిoద్రియ లేమి చేతన సహాయమ్మున్ సహేతమ్ముగన్ 

యతడే యిoద్రియ జ్ఞానముల్ గలుగనే యానంద పూర్ణుండుగన్ 

యతడే భక్తుల పోషణన్ జగతిలోనాశ్చర్య రూపమ్ముగన్ 

అతడేసర్వము బాధ్యతాసృజన *మాయామేయ* బంధమ్ము గన్        (14 )


చం. కదల నదీయనంగ నిజకాలము నాటిది జీవనమ్ముగన్ 

కదల*నుచెప్పగన్ కదలు కావ్య చరిత్రము సూక్ష్మమేయగున్

కదలనశక్యమేతనువుకామ్యమ నంగసమీప బంధమున్ 

కదనల*దూరఁదగ్గుపడు గమ్య మనస్సుగనేను నిల్వగన్                 (15 )


ఉ. కేవలమొక్కరూపమున కీలకమే యనకుండు విద్యగన్ 

జీవుల రూపమందు*గల జీవిత సారము* నీవసత్యమున్, 

*ఈవిధమీవు*విష్ణువుగ నీశ్వర దక్షిత బ్రహ్మ యేయగున్ 

శ్రీవిన*యమ్మునన్* శివుడు శ్రీకర యుక్తియు శక్తియేయగున్            (16 )


ఉ. జ్యోతుల *కాంతులీన విధి* జ్యోతిగ మాయయు దర్పణమ్ముగన్

దాతవిధాత సర్వ మయ దారిని జూపెడి గీతభావముల్ 

భూత *హృదాఖ్య నేత్రుడగు* భుక్తిని పంచెడి భవ్య వేక్తగన్

*వీత భయాంతరాలవిధి వేద్యము నీవుగ బోధజేయగన్*                (17) 


ఉ. ఈవిధ వైభవమ్ముగను యిచ్ఛగ శాంతికి క్షేత్రమేయగున్  

ఈవిధ జ్ఞాన మివ్వగల ఈశ్వర శక్తిగ నేనె గుర్తుగన్ 

ఈవిధ నీవిధిన్ సకల నిర్మల భక్తిగ నుండ బంధమున్ 

కోవిద భక్తనిత్యమగు కూడును నన్నుగ నెల్ల వేళలో                      (18)


చం. ప్రకృతి సనాతనమ్మగుట ప్రాభవమౌను నిజమ్ము భావమున్ 

ప్రకృతి యనాది యైనను నుపాయము జన్య మనస్సు భావమున్ 

ప్రకృతి ప్రభావమేవిధిగ పాశ పదార్ధముగాను నిత్యమున్ 

*ప్రకృతిని* దుఃఖ *సౌఖ్యమును* పంచుట సత్య *ప్రబంధ* నేస్తమున్ (19 )


ఉ. చేతల జేయగా ప్రకృతి *జీవుల* కారణమే నిజంబుగన్ 

భూతల దుఃఖ శక్యములు ముక్తికి *మార్గముఁ జూప గల్గగన్*  

వ్రాతల బ్రహ్మయే మనకు వాసన లక్ష్యముఁ జేర గల్గగన్ 

హేతువు జీవమే యగును హేతు భవమ్మగు జీవితమ్మునన్        (20 )


మ. .గుణసాంగత్యము జీవలక్ష్యముగనే గుర్తింపు సత్యమ్ముగన్ 

ధన కాంక్షా గతి నుత్తమాధములుగా తర్కమ్ము నిత్యమ్ముగన్ 

ప్రణితాత్మే త్రిగుణాత్మకమ్ము గన నీ ప్రాధాన్యతే నేనుగన్ 

ఋణమేజన్మమగున్ మనస్సుజిత సర్వేశార్జితమ్ముల్ గనన్     (21 )


శా. ఈ దేహమ్ముననే మహేశ్వరుడు*గా నిందేను* శుద్ధాత్మడన్ 

ఈ దేహమ్ము పరాత్పరా*నిలయమీ మాయే*ననన్నీవు గన్  

ఈ దేహమ్ముయు సాక్షి కారణములే శీఘ్రమ్ము చేతన్యమున్ 

ఈ దేహమ్ము భరించి పోషణసహించన్ కర్త నీవేయ నన్          (22 )


శా. కర్తవ్యమ్మగుకర్మ జేసినను సఖ్యమ్ముల్ సదాజీవముల్ 

భర్తే యీశ్వర జ్యోతి *మాయల విధిన్ బంధుత్వ* దేహమ్ముగన్

కర్తేవిశ్వమయమ్ము, యోగ జపమున్ కాలాను నిత్యమ్ముగన్

వార్తా*భవ్య విశేష జన్మల సదా *వాగీశ్వరాశీస్సు లన్              (23)


శా.  సమ్మోహమ్మున శుద్ధమైన హృదయా సందర్బ ధ్యానమ్ముగన్

సమ్మోహమ్మున శుద్ధ యోగ మనసున్  సద్భావ యోగ్యంబుగన్ 

సమ్మోహమ్మున కర్మ సిద్ది గుణమున్ సఖ్యమ్ము సూక్ష్మమ్ముగన్ 

సమ్మోహమ్మయి నమ్మకమ్ము గలగన్ సాహిత్య మేనేయగున్   (24 )


మ. మనిషే సాధన మందబుద్ధులగుటే మాయౌను తంత్రమ్ముగన్ 

ధనమాసించియు నామమే పలుకుటే ధ్యానమ్ము భక్తే యగున్ 

తృణమైనా జప జ్ఞానమున్ గుణముగాతృప్తీయె దేహమ్ముగన్   

మనమేకమ్ముగ మృత్యురూపమున సంభావమ్ముమోక్షమ్ముగన్ (25 )


ఉ. ఈచెవి సార్ధకమ్మగుట *నిచ్ఛయు* తారక మంత్రవేదమున్, 

ఈచెవి మాట వేరొకమదీయము మారక చిత్త నాదమున్, 

ఈచెవి *ధ్యానమున్*  శ్రవణ విజ్ఞత భక్తియు శ్రద్ధ మార్గమున్ 

ఈచెవి *జ్ఞానమున్* వలన నిష్టము సాధ్యము కర్మ యోగమున్  (26)


చం. స్థిరము నొకింతఁ దెల్వని విశేషపు విద్యచరాచరమ్ముగన్ 

పరమ శివుండు నాశరహి బంధము భూతములందు ప్రాణమున్,  

ఎరుగ సమాన సాధనల నేస్త మనమ్ము నిజమ్ము లీవిధిన్ 

తరుణసుఖమ్ము సంభవముతాపము దీపపు కాంతి బంధమున్ (27 )


మ.  సమభావమ్మగు నీశ్వరానిలయమేసాధ్యమ్ము నేస్తమ్ముగన్  

సమలక్ష్యమ్మగు యాత్మహంతకుడుగా సాకార సామ్యమ్ముగన్

సమసత్యమ్మునుఁ బంచ శంకరుఁడు గా సాధ్యమ్ము వీలున్ గనన్ 

సమదేహమ్మునుఁ గాలమాయలుగ నీ సామ్యమ్ము నేనేయగున్  (28 )


మ. త్రిగుణాలే సకలమ్ము కర్మలగుటే తీర్మాన లక్ష్యమ్ముగన్ 

తగునేరీతిగ కర్తయే యగుదునేకార్యమ్ము నీమమ్ముగన్ 

తగు విద్యాగమనమ్ముగాకదలగా తత్త్వమ్ము ధర్మమ్ముగన్ 

పగలై వాస్తవమౌనుఁ జూచుటగునే పాశమ్ము  జ్ఞానమ్ము గన్        (29 )


చ. వివిధ రకాలు గా చలన విద్యన జీవ పరమ్ము నేనుగన్  

నెవరు దలంచు నీశ్వరుననేక విధమ్ము లనెంచ నేనుగన్ 

ఎవరనుకోను సర్వమును నెంచగ భక్తి సమమ్ము నేనుగన్ 

నవవిధ మార్గ ముక్తి గను నాడిని నెంచగ బ్రహ్మ మేయగన్        (30) 


ఉ. స్పర్శగ నిత్యకర్మలను పాలనసంగమ నేస్తమేయగున్ 

స్పర్శగ కాల నిర్ణయము సాగునుఁ జేయుట ధర్మమేయగున్ 

స్పర్శగ నేనుగా నునికి సాగుట నాత్మనశింపు లేకయున్ 

స్పర్శగ భావవేదములు బంధసమర్ధత నేనె నేనుగన్              (31)


ఉ. వ్యాప్తిగ యంబరమ్ముననె వాసన సూక్ష్మము దోష మేది యున్ 

దీప్తిగ దేహమందుననె దివ్వెగ యాత్మయు నిర్గుణమ్ముగన్ 

ప్రాప్తిగ సర్వమందు కళ పాఠ్యము వానికి యంట కుండుటన్ 

స్ఫూర్తిగ నిత్య సత్య కళ సూత్రము యాత్మయె దోష మంటదున్  (32 )


ఉ. సూర్యుని కాంతిగా జగతి శోభలమర్చ సహాయమే యగున్                                                                      ఆర్యకునాత్మ  ప్రాణమగు యాశయ లక్ష్యము దేహమేయగున్                                                                                కార్య పరమ్ము నేస్తమగు కాలము నెంచియు సర్వవేళలన్                                                                                       ధైర్యము చేత నీ సకల ధర్మము లింతగ నిన్ను జూపగన్         (33)


సీ.క్షేత్ర ప్రతిభ గూర్చి క్షేత్రజ్ఞతనుఁ దెల్ప

తగిన సాధనలనుఁ దలుపఁ గలిగి 

క్షేత్రమందుండెడి  క్షేత్రజ్ఞ చైతన్య 

స్థూల సూక్ష్మ శరీర సూత్ర ప్రకృతి, 

ఇంద్రియా లేకమై కేంద్రీయ మైనంత 

క్షేత్ర కారణ భక్త క్షేత్ర శీలి 

క్షేత్రములిటుపరిచ్ఛిన్నమై పోయిన  

చూడబడగనది జూచు వాడు 


మేలుఁ గాంచిన జాగృతి మేలు లందు 

కార్య సహితాల ప్రకృతుల  కాల మహిమ 

జ్ఞాన నేత్రముల మహాత్మజ్ఞాతఁ గాను 

క్షేత్ర - క్షేత్రజ్ఞు లంతర క్షేమమలరు                                                (34 )


శ్రీమద్భగవద్గీత.. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం  సమాప్తము, మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ


శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి .. (13 )

భగవద్గీత పదమూడవ అధ్యాయ పారాయణ మహత్యం 

13)భగవద్గీత పదమూడవ అధ్యాయ పారాయణ జన్మజన్మాంతర పాపముల నుండీ  విముక్తిని ప్రసాదిస్తుంది. 

భగవద్గీత లోని పదమూడవ అధ్యాయానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు . ఆత్మ నాశనము లేనిది. కానీ,  ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరములో బంధిస్తూ ఉన్నాయి. అందరిలోను ఉన్న ఈ మూడు గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు . ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి, క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. అంటూ జీవుడిపైన ఈ త్రిగుణాల ప్రభావాన్ని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో అర్జనుడికి ఉపదేశిస్తాడు. నారాయణుడు - శ్రీకృష్ణుడైతే, నరుడు - అర్జనుడు . అందువల్ల మానవ హితం కోసం ఆ పరమాత్మ చెప్పిన పరమ జ్ఞానమే భగవద్గీత . 

బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృష్టించబడుతుంది. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపచేసేటటువంటిది. ఇది జీవునికి సుఖంపట్ల, జ్ఞానం పట్ల, ఆసక్తిని పెంచి, జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. 

వీటిల్లో సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి. దేనినీ ద్వేషించకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మల మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు, గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు. అని భగవానుడు ఈ విభాగంలో చెబుతారు . గీతలోని ఈ పదమూడవ అధ్యాయాన్ని పఠించడం వలన కలిగే ఫలితాన్ని పద్మపురాణంలో పరమేశ్వరుడు పార్వతీమాతకి ఇలా వివరించారు . 

“ఓ దేవీ ! గీతలోని ఈ పదమూడవ అధ్యాయాన్ని కేవలం వినడం వలన అంతకరణము పవిత్రమవుతుంది.  దానిని తెలిపే ఉదంతాన్ని నీకిప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విను .” అంటూ ఇలా చెప్పసాగారు .  “దక్షిణ దిశలో తుంగభద్రా నాదీ తీరములో హరిహరపురము అనే నగరం ఉన్నది. హరిహరుడనే భగవంతుడు ఆ పురములో  అధిష్టాన దేవుడై ఉన్నాడు. ఆయనని సందర్శించిన మాత్రము చేత పరమ కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది.  ఆ నగరంలో హరి దీక్షితుడు అనే ఒక క్షత్రియ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు.  అతడు వేద వేదాంగ పరంగతుడు, తపస్సాలి, విద్వాంసుడు. కానీ, అతని భార్య దురాచారపరురాలు. ఎల్లపుడూ భర్తని తిడుతూ ఉండడమే ఆమె పని . పైగా పరపురుష వ్యామోహముతో , జారత్వము కూడా కలిగినది.  

ఒకసారి ఆ గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయి . ఆరోజు గ్రామమంతా కూడా జనాలతో నిండిపోయి ఉంది . హరిదీక్షితుడు దైవకార్యాలలో తీరికలేకుండా ఉన్నాడు .  అప్పడు అతని భార్య దగ్గరలోని అరణ్యము ప్రాంతాన్ని తనకు సంకేత స్థలముగా ఎన్నుకొని, విటులకోసం ఎదురుచూడడం మొదలుపెట్టింది.  ఆనాటి రాత్రి ఒక్క విటుడైనా  ఆ అరణ్యానికి పోలేదు. ఆమె కామోన్మత్తముతో అక్కడున్న పొదరిళ్లన్నీ కలయదిరిగింది. ఎక్కడా ఒక్క మనిషయినా కనిపించకపోవడంతో, విసిరి వేసారి ఒక పొదరింట పిచ్చి ప్రేలాపాలు చేస్తూ, కూర్చుంది .  ఆమె ప్రేలాపాలు విని అక్కడి గుహలో నుండీ ఒక పులి  గర్జిస్తూ యువతలకు వచ్చింది.  ఆ అరుపులు విన్న ఆమె అవి తనకోసం వచ్చే విటుడు  చేస్తున్న సంకేత శబ్దాలుగా అర్థం చేసుకుంది .  ఆ పొదరిల్లు నుండి బయటకు వచ్చింది.  

వెంటనే ఆ పులి ఆమె మీదకి లంఖించింది. కానీ ఆమె గంభీరంగా ఆ పులిని ఉద్దేశించి ఇలా అన్నది . “ ఓ వ్యాఘ్రమా! క్షణకాలం ఆగు . నీవు నాపై  ఎందుకు అనవసరంగా దాడి చేస్తున్నావు ? ముందుగా నన్ను ఇలా చంపడానికి గల కారణం చెప్పి, ఆ తరువాత నన్ను చంపు.” అన్నది . మిక్కిలి ఆకలిగా ఉన్న ఆ వ్యాగ్రము ఆమె మాటలు  విని క్షణకాలము ఆగి, మందహాసముతో ఈ విధంగా పలికింది. “ దక్షిణ దేశంలో మలాపహ నదీ తీరమున మునిపర్ణమనే గ్రామము ఉంది.  అందులో భగవంతుడు పంచలింగశ్వరుడు అనే పేరుతో విరాజిల్లుతున్నాడు.  పూర్వము ఆ గ్రామములో నేనొక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ధనాస చేత వేదవిద్యను విక్రయించి, ఇతర భిక్షకులకు, పండితులకు కూడా ఆధారమేమీ లేకుండా చేసి, అన్యాయ ఆర్జన చేస్తూ, ఇతరుల వద్ద ఋణములు చేస్తూ, చెడ్డ పనులను ఆచరిస్తూ జీవించాను. 

 ఈ విధంగా ఉండగా, కొన్నాళ్ళకి వయసు మీదపడింది.  తల నెరిసిపోయి, పళ్ళు  ఊడిపోయాయి ఇంద్రియ పటుత్వము అంతరించింది. శరీరము ముడతలు పడింది.  ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, నేను ఒక పర్వదినాన ఒక తీర్థానికి వెళ్ళాను .  అక్కడ  ఒక శునకము వచ్చి నన్ను కరిచింది.  వెంటనే నేను మూర్చపోయి, భూమి మీద పడి వెంటనే మృతి చెందాను. ఆ తరువాత యమదూతలు నన్ను యమలోకానికి తీసుకు వెళ్లారు .  అక్కడ అనేక యాతనలు అనుభవించి, తిరిగి ఈ విధంగా వ్యాగ్రమునై జన్మించాను.  ఆనాటి నుండి ఈ అరణ్యంలో నివసిస్తూ, పూర్వ స్మృతి కలిగిన వాడినవడం చేత సాధువులను, పతివ్రతలను చంపకుండా దుష్టులను, పాపాత్ములను చంపి భక్షిస్తూ ఆకలి తీర్చుకుంటున్నాను. ఇప్పుడు కులటవైన నీవు దొరికావు.   కాబట్టి  నాకు ఆహారమయ్యావు.” అని ఆ వ్యాగ్రము ఆమె దేహంను చీల్చి భక్షించివేసింది. 

ఆ క్షణములోనే యమదూతలు వచ్చి, ఆమెను యమసన్నిధికి తీసుకుపోయారు.  ఆ తర్వాత ఆమె పాప కృత్యాలను శాంతముగా విచారణ చేసి, కోటికల్పములు, నూరు మనవంతరములు గడిచేంతవరకు ఆమెను దహనం అనే నరకములో పడద్రోసి అనేక యాతనలను అనుభవించేటట్లు చేశారు.  ఆ తర్వాత మళ్లీ ఆమె భూమి పైన చండాల స్త్రీ అయి ఉద్భవించింది.  పూర్వకర్మ వాసన చేత ఆమె చండాల స్త్రీ అయి కూడా జారత్వమును ఆచరిస్తూనే ఉన్నది.  ఈ విధంగా కొంతకాలం గడిచింది.  ఆమెకు చెప్పలేని వ్యాధులు కలిగాయి. ఆ వ్యాధుల చేత పీడితురాలై ఆమె తన జన్మస్థానమునకు వెళ్ళిపోయింది.  

అక్కడ జంభకాదేవితో విరాజమానుడై పరమేశ్వరుడు నిత్యపూజలు అందుకొంటూ ఉండేవాడు . ఆ ఆలయములో వాసుదేవుడు అనే బ్రాహ్మణుడు నిత్యము ఆ పరమేశ్వర సన్నిధిలో గీతలోని త్రయోదసాధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉండేవాడు.  ఆమె అక్కడకు వెళ్లి, ఆ బ్రాహ్మణుని చేత పారాయణ చేయబడుతున్న త్రయోదశాధ్యాయాన్ని విన్నది .  వెంటనే చండాల దేహం విడిచి, దివ్య దేహమును ధరించి, విమానమును అధిష్టించి, దేవతల చేత సేవించబడుతూ, ఉత్తమ లోకాలను పొందింది.  కాబట్టి ఈ త్రయోదశాధ్యాయాన్ని భక్తితో పారాయణం చేసేటటువంటి వారు, విన్నవారు కూడా జన్మజన్మాంతర పాప విముక్తులై చండాలత్వము పోయి ఉత్తమ గతులను పొందుతారు.” అని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించారు . 

సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు !!*

*ప్రాంజలి ప్రభ*

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు