*శ్రీమద్ భగవద్గీత... పురుషోత్తమ యోగము... 15వ అధ్యాయము*
*శ్రీమద్ భగవద్గీత...
పురుషోత్తమ యోగము... 15వ అధ్యాయము*
01.మూలముగాను బ్రహ్మ యగు ముఖ్యము నీశ్వర భావమందునన్
కాలవిలీన వృక్షతతి ఖాయము, శాశ్వత మర్మ మేయగున్
నాలుగు వర్ణ వేదములు నాశము లేనివి నీకుటుంబముల్
మూల ప్రభావమై పరమ ముక్తిని బొందెడి పూజ్యుడేయగున్
*******
02.మానవ జన్మ కొమ్మలగు మానస స్థావరమైన వృక్షముల్
మానవ కర్మలే త్రిగుణ మార్గ సమర్థము వ్యాప్తి చెందుటన్
ప్రాణుల వృద్ధిజేసెడి సమాంతర జీవుల మూలమూలలన్
వైనము క్రిందిపైకి గలవైనవి శాఖల బంధనమ్ము లన్
********
03.నీమాయా వటవృక్షమే యెరుగకన్ నీమార్గమే దిక్కుగన్
నీమాధుర్యములే విధాన కళలై నీభావ వైనమ్ముగన్,
ఏమార్పై నను త్యాగమే యగుటగా నేమార్చు వైరాగ్యముల్,
సామాన్యమ్మగు రీతి వర్ణణ కథేసంజాత వైనమ్ముగన్
******
04.ఏ పరమాత్మపాదములు నెంచ మనస్సగు భక్తి తత్త్వమున్
నేపురుషుండుసామ్య ముగ నేరుగ దైవముఁ జేర నుండగన్,
ఈ పుడమీ ప్రభావమున నీశ్వర నేత్రము తిర్గు జుండగన్,
ఆ పురుషుణ్ణి నేరుగ యుగాల నుపాసన జేయగా నగున్
*******
05.మమతాశక్తిని వీడ ధర్మ మను సన్మార్గమ్ము నిత్యమ్ము గా,
సమతా భావములందు సఖ్యతల భాష్యమ్ముల్ విచారించగన్
మమకారమ్మన పంతమీశ్వరు నిగా మార్గమ్ము సర్వమ్ముగన్
సుమనోశక్తిగ జ్ఞాన శాశ్వతమగున్ సూత్రమ్ము నేస్తమ్ముగన్
*******
06.అదియే నాదు ప్రకాశముల్ జగతి నానాపుణ్య మార్గమ్ముగన్
పదమోత్సాహ మదీయసూర్య శశి గా పారాడు విశ్వమ్మునన్
వెదజల్లే విధమగ్నియున్ ప్రకృతిలో విద్యోన్నతీసేవలున్
పద పుణ్యాత్ముల సామ్యవాదములుగాపర్వాల నేస్తమ్ముగన్
*****-
07.జీవాత్మే పరమాత్మ రూపముగనే చేకూర్చు ప్రేమమ్ముగన్
నావైపే కదలాడు శక్తి గమనా నవ్యమ్ము మోక్షమ్ము గన్
జీవమ్మే వివిధమ్ము లై వినతి సంజీవించ నీమాయలన్
నీవేతప్ప నివేదనా తలపులన్ నిష్ఠల్ వివాదమ్ము లే.
******
08.వాయువు గంధమై నటుల వాసన మార్చు విధానమేవిధిన్
మోయు మనస్సు నింద్రియము మోక్షముఁ గోరశరీరమేఁ గనున్
కాయము నెంచి యోగముగఁ గాలముఁ దీరునఁ గ్రొత్త జన్మగన్
మోయును తల్లియేవిధిగ ముక్తముఁ బొందెడి దేహమందునన్
*****
కనులును, నాసికమ్ములును, కాలమనే శ్రుతులెల్ల రక్షగన్
మనసున నాదరమ్మమరి చర్మమయమ్మున జిహ్వలే యనన్
ననుభవమేధ సాధ్యము వినమ్ర సమూహ మనోజ వాంఛలన్
తనువుల తప్తఁ దీర్చెడి విధాన ప్రయోగ తపో ధనమ్ములన్
*****
10.జీవుడు దేహమే శివము జీవ శరీరము నందు పాశమున్
జీవ రహస్యమెల్ల విధిఁ జేష్టల భోగము లన్ని వేడుకల్
జీవమె జ్ఞానమై కదిలె జీవన శైలియు జ్ఞాన నేత్రమున్
జీవుడు కేవలమ్మున వివేకము శాంతిగ సత్య ధర్మమున్
*******
11.సాధన చేయుటందు పరమార్థము తోడుగ గాలి, నీరముల్
సాధనలో ప్రయత్నములు సాగిన వశ్యము స్ఫూర్తిగాయగున్
సాధన లాత్మ సాక్షిగను మానస తృప్తియు యున్నతమ్ముగన్
సాధన నిత్య సత్యమగు సాధ్యము శుద్ధియు యోగ లక్ష్యమున్
******
12.తేజము సూర్యదేవకళ తీవ్రత నున్నను సర్వ క్షేమముల్
తేజము చంద్రదేవకళ తీక్షణ వెన్నెల నీడలేయగున్
తేజము యగ్ని దేవకళ నేలుచు నుండుట భక్తి శక్తిగన్
తేజము నాదియే యనుచు నెమ్మది శాంతికి నేస్తమేయగున్
******
13.పుష్టిగ నాదు శక్తియును పున్నమి వెన్నెల మాదిరేయగున్
స్పష్టతతోను భూతములుగా కళ పోషణ నేనుఁ గూర్చెదన్,
ఇష్ట రసస్వరూపమగు నిచ్ఛయు చంద్రుని ఔష ధమ్ముగన్,
ఇష్టము వృద్ధిజీవులకు నీశ్వర లీలలు నేను నేనుగన్
-*****
14.జఠరాగ్నీ తిను భక్ష్యమే కరిగియే జాడ్యమ్ము పోగొట్టుగన్
జఠరాగ్నీ తిను భోజ్యమే కరిగియే జాడ్యమ్ము తీర్చేందుగన్
జఠరాగ్నీతిను దోహ్యమే కరగియే జాతస్య లేహ్యమ్ముగన్
జఠరాగ్నీ యుపకార ప్రాణిగనుమా జ్ఞానమ్ము సర్వాంతరల్
*******
15.నేనేహృద్యముగా నివాసిని కళా నేస్తమ్ముగా నెప్పుడున్
నానుండే జననమ్ము జ్ఞానముగనన్ నామాయ లెల్లన్ వలే
నేనేవేదముకర్తనైన విధిగా నీరాజ నారాధ్య ముల్
నేనేవేద్యము నేనుగా సకలమున్ నిత్యమ్ము సాధించగన్
*******
16.క్షరముయు నక్షరమ్ముయు సకార మకార సుఖమ్ము రెండుగన్
పురుషులు ద్వంద్వ బుద్ధుల ప్రపూర్ణ జగాన పరాకు జేయగన్
క్షరమగుదేహమేవిధిగ క్షారమునంద యనంత మార్గముల్
క్షరమగుజీవమేఁ గనిన గమ్యము పార్ధ సమమ్ము నేనుగన్
******
17.సకలమ్మున్ గుణ హీనుడై నిలిచి దాస్యాసాధ్య ధర్మమ్ము నన్,
ఇక తానెవ్వరనంగఁ దెల్పు మన నేనిచ్ఛా పరంధాముడన్,
ఇక కైవల్యము నందు సర్వముగ నేనేగమ్య మార్గమ్ము నన్,
ఇక కాలమ్మున నవ్యయమ్ములను నేలించన్ సకాలమ్మునన్
*****
18.క్షరపురుషుండు నశ్వరము కాంతి కతీతము కంటె నుత్తమున్
క్షర రహితుండు సర్వమగు కాల యశంబుభరించు యోగ్యతన్
సరియగువేదమార్గమున శాంతి సహాయ సమర్ధతేయగున్
పరమ పవిత్ర మేయగుట పాఠ్యముగానువివేక్త నేనుగన్
******
19.ఏభావమ్ముగ నన్నుగాను నెరిగీయేమంత్ర మైనాజపమ్
ఆభాగ్యమ్ముగ నాతడేమనసుగా నాకర్పణా చేయుటన్
యీ భాష్యమ్మునగీతమాట మనసా నేస్తమ్ము నేనేయగున్
హేభాగ్యోదయ పార్థ, నిన్నుపరమాత్మీయమ్ముగా జూడగన్
*****
20.పావన శాస్త్రమెల్ల మది పాఠముగానెరిగించి మోక్షమున్
సేవల తత్త్వమే సహన సీఘ్రమనస్సున తధ్యమే యగున్
జీవులలోనశక్తిగను చేతన సాధన నేనె సర్వమున్,
ఈ పుడమిన్ తరించగల నెల్లవిముక్తిని నేనుఁ జేయగన్
*******
శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగము 15వ అధ్యాయము సమాప్తమ
******
Comments
Post a Comment